15, ఫిబ్రవరి 2021, సోమవారం

Surprising Research...

 Surprising Research...


1. *Acidity* not only caused by diet Errors, but more dominated because of *Stress*.


2. *Hypertension* not only caused by too much consumption of salty foods, but mainly because of Errors in *Managing Emotions*.


3. *Cholesterol* is not only caused by fatty foods, but the *Excessive Laziness* or sedentary lifestyle is more Responsible.


4. *Asthma* not only because of the disruption of oxygen supply to lungs, but often *Sad feelings* make lungs unstable.


5. *Diabetes* not only because of too much consumption of glucose, but selfish & *Stubborn Attitude* disrupts the function of the Pancreas.


6. *Kidney stones* : .Not only Calcium Oxalate deposits, but pent up *Emotions and Hatred*


7. *Spondylitis* : not only L4L5 or cervical disorder; but over Burdened or *Too Much Worries* about Future


If we want to be healthy then first 

1) *Fix your Mind*

2) Do Regular *Exercises*, 

2) *Move* Around, 

3) Do *Meditation*

4) *Laugh* and Make Others Laugh too.

5) *Make Friends*


These Activities will help you to strengthen Your Soul, Mind & Body...


*Be Healthy And Enjoy Your Life.*

*VIBRATE HIGHER*


The Spiritually Inclined will understand:


The covid virus has a vibration of 5.5hz and dies above 25.5hz.


For humans with a higher vibration, infection is a minor irritant that is soon eliminated!


The reasons for having low vibration could be:

Fear, Phobia, Suspicion

Anxiety, Stress, Tension.

Jealousy, Anger, Rage

Hate, Greed

Attachment or Pain


*And so......we have to understand to vibrate higher, so that the lower frequency does not weaken our immune system.*


The frequency of the earth today is 27.4hz. but there are places that vibrate very low like:

Hospitals

Assistance Centers.

Jails

Underground etc.

It is where the vibration drops to 20hz, or less.

For humans with low vibration, the virus becomes dangerous.

Pain 0.1 to 2hz.

Fear 0.2 to 2.2hz.

Irritation 0.9 to 6.8hz.

Noise 0.6 to 2.2hz.

Pride 0.8 hz.

Superiority 1.9 hz.

A higher vibration on the other hand is the outcome of the following behaviour :-


Generosity 95hz

Gratitude 150 hz

Compassion 150 hz or more.


The frequency of Love and compassion for all living beings is 150 Hz and more.


Unconditional and universal love from 205hz..


So...Come on ...

*Vibrate Higher!!!*


What helps us vibrate high?


Loving, Smiling, Blessing, Thanking, Playing, Painting, Singing, Dancing, Yoga, Tai Chi, Meditating,  Walking in the Sun, Exercising, Enjoying nature, etc.

 Foods that the Earth gives us: seeds-grains-cereals-legumes-fruits and vegetables-

Drinking water: help us vibrate higher ..... !!!


*The vibration of prayer alone goes from 120 to 350hz*


So sing, laugh, love, meditate, play, give thanks and Live !!!

*Let's vibrate high ...!!!*

మొగలిచెర్ల

 *మాటలకందని అనుభూతి..*


"మాలకొండ కు వచ్చేదాకా..ఇక్కడొక అవధూత మందిరం ఉన్న సంగతే మాకు తెలీదండీ..కొండ దిగి వచ్చేటప్పుడు అక్కడున్న బోర్డ్ చూసి..దగ్గరేకదా..ఒకసారి చూసి వెళదామని వచ్చాము..మాకు ఈ స్వామివారి గురించి కానీ..ఈ క్షేత్రం గురించి కానీ..ఏమీ అవగాహన లేదు..మీరు తెలియచేస్తారా..?" అని ఆ దంపతులు నన్ను అడిగారు..ఇద్దరూ వయసులో పెద్దవారు..ఇద్దరినీ కూర్చోమని చెప్పాను.. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను క్లుప్తంగా చెప్పి..నమ్మి కొలిచిన వారి కోరికలు తీరుతాయని ఒక విశ్వాసం ఇక్కడి ప్రజలలో పాతుకుపోయి వున్నదని చెప్పాను..ఎలాగూ శనివారం నాడే వచ్చారు కనుక సాయంత్రం జరిగే పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళండి అనికూడా చెప్పాను..ఒక్కక్షణం ఆలోచించారు..ఆయన తన భార్య వైపు చూసాడు..ఆవిడ.."మరి కారు డ్రైవర్ ఏమంటాడో..రాత్రికి మనల్ని నెల్లూరులో వదలి పెట్టమని కదా మనం మాట్లాడుకున్నది..తీరా ఇప్పుడు ఇలా మారిస్తే..ఒప్పుకుంటాడో..ఒప్పుకోడో..?" అన్నది ఆవిడ.."మీ వాళ్ళ ద్వారా మా డ్రైవర్ని కొద్దిగా పిలిపిస్తారా?.." అని ఆయన నన్ను అడిగాడు..అతన్ని పిలిపించాను..ఈ దంపతులు తాము రాత్రికి మొగిలిచెర్ల లో వుండదల్చుకున్నామనీ..ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళతామని చెప్పారు..ఆ డ్రైవరు కూడా ఒప్పుకున్నాడు..కాకుంటే తనకు కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వమని అడిగాడు..సరే అన్నారా దంపతులు..వాళ్ళిద్దరికీ ఒక రూమ్ కేటాయించి..స్నానం చేసి..సాయంత్రం ఏడు గంటల కల్లా మందిరం లోకి వచ్చేయమని చెప్పాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ దంపతులు కూడా పాల్గొన్నారు..వయసులో పెద్దవారు కనుక..పల్లకీ మోయలేదు కానీ..ఇద్దరూ పల్లకీ తో సహా మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశారు..పల్లకీసేవ అంతా అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."చాలా బాగా జరిగింది ప్రసాద్ గారూ..అర్చక స్వాములందరూ చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ మారుమూల పల్లెటూరులో ఈ మాత్రం వేడుక జరుగుతుందని ఊహించలేదు..ఇంతమంది జనం వస్తారని కూడా అనుకోలేదు..ఈ కార్యక్రమం చూసిన తరువాత మనసుకు ఎంతో తృప్తిగా ఉన్నది.." అన్నారు.."ఇప్పటికే ఆలస్యం అయింది..ముందు మీరిద్దరూ అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి రండి..ఉదయాన్నే ఐదున్నర గంటల కల్లా మందిరం లోకి వచ్చేయండి..స్వామివారి సమాధికి అభిషేకము, ఆపై హారతులూ ఉంటాయి..అవి కూడా కళ్లారా చూద్దురు.." అని చెప్పాను..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే..ఐదు గంటలకే ఆ దంపతులు స్వామివారి మందిరం లోకి వచ్చి, మంటపం లో కూర్చున్నారు..అత్యంత శ్రద్ధగా స్వామివారి సమాధి కి అర్చకస్వాములు చేసిన అభిషేకాన్ని..ఆపై హారతులని చూసారు..స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లారు..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద నిలబడి తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..తిరిగి ఇవతలికి వస్తూ..గర్భాలయపు మంటపం లో ఒక ప్రక్కగా కూర్చున్నారు..సుమారు అరగంట సేపు అక్కడే కూర్చుని ధ్యానం చేసుకున్నారు..స్వామివారు తపస్సు కొఱకు వాడిన పులి చర్మాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."బాబూ..జీవితం లో ఒక గొప్ప అనుభూతిని ఇక్కడ పొందాము..ఈ క్షేత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది..మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు..మేమిద్దరమూ ఎంతో ఆనందపడుతున్నాము..ఇక్కడ ఏదైనా. కార్యక్రమాలు జరిపితే మాకు తప్పక తెలియజేయండి..మేమిద్దరమూ వచ్చి..మాకు చేతనైన సేవ చేసి వెళతాము..ముందుగా మా వంతుగా ఒక శని ఆదివారాల లో అన్నదానానికి మీరు పెట్టె ఖర్చును భరించే అవకాశం ఇవ్వండి.." అన్నారు..అలాగే అన్నాను..


ఈ సంఘటన జరిగి ఐదేళ్లు అయింది..ఈరోజుకూ ఆ దంపతులు తమకు వీలున్నప్పుడు మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు స్వామివారి సమాధి దర్శించుకొని వెళుతుంటారు..అంత వయసులోనూ..ఆ దంపతులు అన్నదాన సత్రం వద్ద వడ్డన లో పాల్గొంటారు..ఆ సేవ తమకు అత్యంత ఇష్టం అని చెప్పుకుంటారు..అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా కృతజ్ఞతలు చెపుతారు...రాబోయే కార్తీక మాసం లో వచ్చే కోటి సోమవారం నాడు మేము జరుపబోయే రుద్రహోమానికి అయ్యే అన్నదాన వ్యయం లో కొంత భరిస్తామని తెలియచేశారు..


మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందడానికి స్వామివారు ఆ దంపతులకు చక్కటి అవకాశాన్ని మాత్రం కల్పించారని మేము గట్టిగా విశ్వసిస్తాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

తక్కువ వాడివి కాదు


*నువ్వు తక్కువ వాడివి కాదు సామీ!* 


పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం మొ. సృష్టించావు.   ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ,

పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ, ఆత్రపడి  తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ,

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు.  శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే  గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన ఆసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు.  ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

నేను, నాది అనే అహం కలిగిస్తావు.  అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు.  కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

ఇంద్రియాలను ఇచ్చావు.  వాటికి రుచులు పుట్టించావు.  అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళొత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.  


కానీ సామీ!  నేనూ తక్కువవాణ్ని కాదు

నాకు బాగా తెలుసు 


నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని.


ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ 


ఆ వరం మాత్రం నాకివ్వు సామీ!

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం..💐

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం..👹


అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం, 💐

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం. 👹


నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం, 💐

“నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం. 👹


నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం, 💐 

చిల్లరబుద్ధులతో, సంపాదనలో  అవే“చిల్లర” కూడా తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచుకుంటున్నాం.


చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం,

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం.  👹


బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం, 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక “కుటుంబాన్ని చిన్నదిగా” మల్చుకుంటున్నాం. 👹


చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం, 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం. 👹


మనిషికే పుట్టి, మనిషిలా పుట్టి, కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం, కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని, మరమనిషిలా మారిపోతున్నాం.  మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం!

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం!

నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం!


ఎందుకంటే,

మనం ఎదుగుతున్నాం!💪

మనం మనకే అందనంతగా

మనం ఎదుగుతున్నాం!💪

మనం, మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం

నిజంగా...🤫🤫🤫

*మనం ఎదుగుతున్నామా*?🤦‍♂️

తీర్థ క్షేత్ర

 *రామజన్మభూమి తీర్థ క్షేత్ర*

🚩🚩🚩🚩🚩🚩🚩

*ఆత్మీయ హిందుబంధువులందరికీ*🙏

*రామకార్యం చివరి దశకు చేరుకున్న తరుణంలో ఇప్పటివరకు రామమందిర నిధిసమర్పణలో మనం భాగంగా లేకపోతే., ఈరోజు అనగా (సోమవారం )

*ఉ"10 గం"ల నుంచి రాత్రి 8 గం"లవరకు...* ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే హిందూబంధువులు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరు.....* * 492 సంవత్సరాల కల సాకారం అవ్వడం కోసం , 4,50,000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ,ఆ త్యాగఫలమే ఈనాటి రామ మందిర నిర్మాణం కాబట్టి అందరు భాగస్వామ్యం అవుదాం  , ఆ తర్వాత మందిర నిర్మాణానికి  ఎన్ని డబ్బులు ఇచ్చినా నిర్మాణానికి యిచ్చినట్టు కాదు .. * మళ్లీ మళ్లీ * ఈ అవకాశం రాదు. మన తరం కాదు. మన తరతరాలు చెప్పుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి .. * మీకు తోచింది , మీ శక్తి కొలది తగినంత నిధి సమర్పణ ఇచ్చినవారు ధన్యులు ... ఇంకా సమర్పరించనివారు ..  ఈరోజు రాత్రి  లోగా చెయ్యండి .. **             

జై ! శ్రీ రామ్ !! జై జై శ్రీరామ్ !!

966 66 55 967

9848255074

పరమాత్మ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పరమాత్మ చివరి సందేశం !* 

            🌷🌷🌷

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు,

శ్రీకృష్ణుడు బలరాముడితో  “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని  చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.


ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.


ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి  “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను.  నిన్ను విడిచి నేను ఉండలేను.  కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.


అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.


ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.


దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు.  ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.


“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది.  ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు.  తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.


కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి.  ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.


ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.


కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు.  కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.


కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.


అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు, ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.


ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు.  వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు.  అంతశ్శుద్ధి ఉండదు.  చిత్తశుద్ధి ఏర్పడదు. 


మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.


ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠  రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.


ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. 


కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.


ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు.  అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.  కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో  కాలు పెట్టాలి.  అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.


కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు.  ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.


కాబట్టి నీకు ఒకమాట చెపుతాను.  ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల.  అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో.  దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో’


కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు.


ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు.


అందరూ వీటిని ప్రారంభించాలి.  వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను.


ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థా శ్రమము అయి వున్నాను.  గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.


కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి.  అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు.  సుఖము సుఖము కాదని తెలుసు కోవడానికి ఆశ్రయ నీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు.


కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో.


సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు.


నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు.  అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలు పెడుతుంది.  క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు.


మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.

అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు.


పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు.  జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది.  వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు.

కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు.  కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో” అన్నాడు.  ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.


ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి విడి విడిగా అడవులకు వెళ్లిపోయారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు.


కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నాడు.


దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు.  ఒక పొదలో జింక చెవి కదులు తున్నట్లుగా కనపడింది.  ఆ జింక చెవి మీదికి బాణం వేస్తే తల లోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు.


యాదవ వంశ నాశనము కొరకు పుట్టిన ముసలమును గొల్ల వారు అరగ తీయగా మిగిలిన ముక్క ఈ బోయవాడికి దొరికి బాణంలా మారి, ఏ పాదములయితే ఈ గోపాల బాలురను అలరించాయో, లోకము నంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో, ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో,  ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ పాదములు దర్శనం యిచ్చాయో, అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ  “హా”  అని అరిచాడు.


ఆ శబ్దం విని బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు.  కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది.


అదిచూసిన బోయవాడు  “అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు” అని నేలమీద పడి ఏడ్చాడు.


అపుడు కృష్ణ పరమాత్మ “నాయనా నీవు నిమిత్త మాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరం లోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే.  నేను కూడా పెద్దల వాక్కును పాటించాను, అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను” అన్నాడు.


దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. “ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా!” అని విలపించాడు. 


అపుడు కృష్ణుడు  “నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది.  ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు” అని చెప్పాడు.


 పరిత్రాణాయ సాధూనాం

 వినాశాయ చ దుష్కృతామ్ ।   

 ధర్మసంస్థాపనార్థాయ 

 సంభవామి యుగే యుగే॥

           🌷🌷🌷🌷

అసంతృప్తి

 అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి కూనూరు (ఊటీ) వెళ్లాడు... అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాం మానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని..! 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్... తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లాడు... మానిక్ షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆరోగ్యస్థితిని కనుక్కున్నాడు.., వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించాడు... 


తిరిగి వెళ్లిపోయే సమయంలో... ‘‘ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా..? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా..? అడుగు మిత్రమా..?’’ అన్నాడు కలాం... 


‘‘ఓ అసంతృప్తి ఉంది సార్...’’  అన్నాడు మానిక్ షా... 


‘‘ఏమిటది..?’’ కలాం మొహంలో ఆశ్చర్యం...


‘‘నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు శెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్...’’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ... 


కలాం కళ్లల్లో కూడా తడి... షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కాడు... 


‘‘సార్, చిన్న రిక్వెస్టు... ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదు...’’ చెప్పాడు షా... 


కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటిపని... షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం..! తగిన ఆదేశాలు జారీచేయడం...! వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు... 


దటీజ్ కలాం... ఇక్కడే చిన్న ట్విస్టు... ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశాడు... దటీజ్ షా... వావ్... ఎవరు ఎవరికి శెల్యూట్ చేయాలి..? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు... జాతి శెల్యూట్ చేయదగిన కేరక్టర్లు... 

.

(ఎప్పటిలాగే వాట్సప్ పోస్టుకు తెలుగు అనువాదం)

రియల్_స్టోరీ

 👆#రియల్_స్టోరీ.    


మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో.. ఒక చిన్న కుగ్రామం. 65 ఏళ్ల లతమ్మ (లతా భగవాన్ ఖరే) తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది.


ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. ఆ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలాయి. కాయ కష్టం చేసి ఋణ విముక్తులు కావటానికి వారిరువు శ్రమిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో భర్త అనారోగ్యం పాలయ్యాడు.


స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టిషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. పెద్దాసుపత్రి అంటే డబ్బులు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి. లతమ్మకి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకువెళ్లింది. రెండు రోజులు అక్కడే ఉంచింది. భర్త నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ అసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతి లోని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన టెస్ట్లు చేయించడం అత్యవసరం అని చెప్పారు.


లతమ్మకి దుఖం ఒక్కటే మిగిలింది. తన దౌర్భాగ్యానికి బాధ పడింది. భర్త పరిస్థితి పూట., పూటకి దిగజారి పోతూవుంది. తన భర్త తన చేతుల్లో చనిపోవటం.. అనే ఆలోచన ఆమెని కుదిపేసింది. నిస్సాహాయంగా రోదించింది.. మౌనంగా ఉండటానికి కానీ, మొహమాట పడటానికి కానీ.. ఇది సమయం కాదని ఆమె గ్రహించింది. వెంటనే చుట్టు పక్కల వారిని, బంధు మిత్రులని కొంగు చాచి సాయం అడిగింది. మనసున్న మారాజులు అందించిన కొద్దిపాటి సాయంతో భర్తని బారామతి హాస్పిటల్ కి తీసుకెళ్లింది.


అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ అప్ కి రిఫర్ చేశారు. 

వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్పవద్దని.. కనబడని దేవుళ్లందరికి మొక్కుతూ ఉంది. కానీ తలచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది? ఆ టెస్ట్ లు చాల్లేదు. MRI చేయించాలి. మరి కొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కానీ.. జబ్బు నిర్ధారణ చెయ్యలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన మాంగల్యం తన కళ్ల ముందే దూరం అవుతుందని ఏడ్చింది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదైన పరీక్షలు అంటూ.. రోధిస్తుంది. ఆమె కన్నీళ్లు..  ఆమె మాట వినడం లేదు. బోరున ఏడువ సాగింది.

ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుండిపోయారు.


 భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటకి వచ్చి..  రెండు సమోసాలు తీసుకొచ్చి.. భర్తకి ఇచ్చింది. నేను తిన్నాను.. నువ్వు తినేయ్ అంది. సమోసా చుట్టిన కాగితం పారవేస్తూ.. మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. . “బారామతి మారథాన్ గెలవండి. 3000 వేలు నగదు పొందండి. అనే ప్రకటన చదివింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు.. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమతమయ్యింది. ఒక నిర్ణయానికి వచ్చింది.


19-12-2013న బారామతి మారథాన్  మొదలవబోతూ ఉంది. పోటీదారులందరూ స్పొర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్దంగా ఉన్నారు. 

9 గజాల నేత చీర కట్టుకుని.. కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా.. తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పోల్గొనటానికి అనుమతి అడిగింది. అందరూ ఆమెని పిచ్చి దానిలా చూశారు . ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ.. ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది. ప్రాదేయపడింది. బ్రతిమాలింది. 


చివరికి బరిలో దిగింది. పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటకి లాగింది.. ఉడుములా పరిగెత్త సాగింది. ఆమెకి తన వయసుగాని.. కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ.. ఎర్రటి ఎండ కానీ.. తెలియలేదు. తనకు తెలిసిందల్లా.. గెలవాలి మూడు వేలు తీసుకోవాలి భర్తకి టెస్టులు చేయించాలి.. సరైన వైద్యం చేయించాలి. తన భర్త బతకాలి.. తనకి జీవితాంతం తోడు ఉండాలి.. అదే లక్షం.. అదే వేగం.. అదే పరుగు.. అదే విజయం. బారామతి మారథాన్ ఒక చరిత్ర .. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం. 

ప్రజలు చప్పట్లు మధ్య ఆమె మారథాన్ నెగ్గింది.


నిర్వాహకులు ఆమె కన్నీటి గాధ విని చలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీ ని రూ.5 వేలుగా చేసి అందించారు. ఆ డబ్బుతో ఆమె ఆసుపత్రికి పరిగెట్టింది.


ఆమె ప్రేమ ఊరికేపోలేదు. ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్న బోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్నీ పత్రికలు, ఛానల్స్  లతమ్మ గురించి గొప్పగా వ్రాసాయి.. చూపించాయి. దేశం నలుమూల నుండి ప్రశంశలు వెల్లువెత్తాయి. నెల తిరిగే సరికి ఆమె జీవితం మారిపోయింది. ఇదే కదా నిజమైన ప్రేమ.


ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బాంకు ఖాతాకి 1,75,000 పైగా పొగయ్యాయి. ఆ కుటుంబం అన్నీ విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాద్యం చేసిన 'లతా భగవాన్ ఖరే' ఎందరికో ఆదర్శమయ్యింది.......💐💐


🙏🙏❤️🙏🙏

సహాయం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*

*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*

*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*

*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*

*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*

*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*

*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*

*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*

*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*

*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.? ప్రజలు ఎప్పుడు మారుతారో.?*

**చిన్న విన్నపము🙏🙏* *విధిగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సందేశం పంపండి.* *ఎందుకంటే కనీసం కొంతమందినైన మార్చాలని ఆశిస్తూ.🙏🙏*

చివరకు మిగిలేది

 *చివరకు మిగిలేది ఏది*

-------------------------------------

 ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


*మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు* అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. *బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు*.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.🚩🙏🏻