15, ఫిబ్రవరి 2021, సోమవారం

తక్కువ వాడివి కాదు


*నువ్వు తక్కువ వాడివి కాదు సామీ!* 


పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం మొ. సృష్టించావు.   ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ,

పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ, ఆత్రపడి  తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ,

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు.  శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే  గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన ఆసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు.  ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

నేను, నాది అనే అహం కలిగిస్తావు.  అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు.  కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

ఇంద్రియాలను ఇచ్చావు.  వాటికి రుచులు పుట్టించావు.  అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళొత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ,

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.  


కానీ సామీ!  నేనూ తక్కువవాణ్ని కాదు

నాకు బాగా తెలుసు 


నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని.


ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ 


ఆ వరం మాత్రం నాకివ్వు సామీ!

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం..💐

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం..👹


అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం, 💐

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం. 👹


నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం, 💐

“నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం. 👹


నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం, 💐 

చిల్లరబుద్ధులతో, సంపాదనలో  అవే“చిల్లర” కూడా తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచుకుంటున్నాం.


చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం,

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం.  👹


బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం, 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక “కుటుంబాన్ని చిన్నదిగా” మల్చుకుంటున్నాం. 👹


చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం, 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం. 👹


మనిషికే పుట్టి, మనిషిలా పుట్టి, కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం, కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని, మరమనిషిలా మారిపోతున్నాం.  మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం!

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం!

నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం!


ఎందుకంటే,

మనం ఎదుగుతున్నాం!💪

మనం మనకే అందనంతగా

మనం ఎదుగుతున్నాం!💪

మనం, మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం

నిజంగా...🤫🤫🤫

*మనం ఎదుగుతున్నామా*?🤦‍♂️

కామెంట్‌లు లేవు: