11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*ధర్మో వై భగవాన్ సతామధిపతిర్ధర్మం భజేత్సర్వదా*

*ధర్మేణైవ నివార్యతేఽఘనివహో ధర్మాయ తస్మై నమః|*

*ధర్మాన్నాస్తి పరం పదం త్రిభువనే ధర్మస్య శాంతిః ప్రియా*

*ధర్మో తిష్ఠతి సత్యమేవ శుభదం మా ధర్మ మాం వర్జయ 

     *భావం:*

*ధర్మమే నిజంగా భగవంతుడు, మరియు సద్గుణుల అధిపతి.*

*అందుచేత ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి.*

*పాపాల ప్రవాహాన్ని నివారించగలది ధర్మం ద్వారానే, అటువంటి ధర్మానికి నేను నిత్యం నమస్కరిస్తున్నాను.*

*ఈ మూడు లోకాల్లో ధర్మానికి మించిన గొప్ప స్థానం లేదు*.

*ధర్మానికి శాంతి ప్రియమైనది, మరియు శుభప్రదమైనది సత్యమే.*

*ధర్మం సత్యములోనే నిలిచి ఉంటుంది. ఓ ధర్మా! నన్ను ఎప్పుడూ వదలవద్దు —నేను నిన్ను విడువను!*


 ✍️🌹💐🪷🙏

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు

 *మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1


సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2


సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3


వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4


మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5


భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6


బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7


ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8


పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9


మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10


భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11


ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12


భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13


ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14


మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15


ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16


మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17


వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18


వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19


వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20


మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21


మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22


మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23


మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24


మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25


మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26


కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27


ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28


శకుని www.freegurukul.org/g/Bharatham-29


భీముడు www.freegurukul.org/g/Bharatham-30


దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31


మహారధి www.freegurukul.org/g/Bharatham-32


బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33


మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34


ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35


మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36


తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37


ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38


ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39


తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40


మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41

భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42


ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43


ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44


మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45


భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46


వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47


ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48


మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49


విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50  

సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51


ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52


ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53


మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

వామనుడు త్రివిక్రముడైన విధానం

 🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏

వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము

.

శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!

ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన. చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.

ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే 

కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు 

ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు 

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సాహిత్య విశేషాలు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు. 🌹 తిరుపతి వెంకట కవులు అవధాన విద్యను ఔపోసన పట్టిన మహా పండిత కవులు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులలో అగ్రగణ్యులు. వారు అవధానాలలో చూపిన విద్వత్ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు సోదాహరణంగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. చక్కని గాన మాధుర్యంతో వేణు గారు వివరించిన సాహిత్య విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అర్హతలేంటో

 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


ఎవరు దాత?


కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి- దాతృత్వం! స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. అలనాటి శిబిచక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకొన్నామా? కలియుగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు- శీల స్వభావాలు!


పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ- శ్రియాదేయం, ప్రియా దేయం, భియాదేయం... అనే మూడు లక్షణాలను చెప్పింది. దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్లుగా సంతో షంగా దానం చేయడాన్ని శ్రియాదేయం అంటారు. 'అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం' అన్నాడు శృంగారనైషధంలో శ్రీనాథుడు. దానం చేయడంపట్ల ఆసక్తి, అవగా హన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదంది మహాభారతం. ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుప డుతూ దానం చేయడం ప్రియాదేయమనే మాటకు తాత్పర్యం. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం ప్రియా దేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- భియాదేయం. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కామ్యకవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్తాడు. ఆ సందర్భంలో 'అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం ఏ మాత్రం దక్కదు' అని ధర్మరాజుతో చెబుతాడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు.

శ్రియాదేయం ప్రియాదేయం భియాదేయం... మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చేయడా నికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్య తను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతే కాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దాన ఫలం దక్కదు సుమా... అంటూ భారతం ఆనుశాసనిక పర్వం హెచ్చరించింది. దాతలమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలేంటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మనసుకు దూరంగా!

 శీర్షిక..మనసుకు దూరంగా!


ఏమై పోతున్నాడు మనిషి? 

ఎటు పోతున్నాడు? మతి గతి తప్పుతూ

స్వార్ధం నిండిన రొచ్చులో కూరుకుపోతూ 

అత్యాశల కోర్కెలతో కష్టాల పాలవుతూ 

నీకు నీవె మంటల్లో చితి పేర్చుకుంటున్నావ్..


ఓ మనిషీ!

నవ యుగానికి నాందిగా నిలిచావు 

వైజ్ఞానిక యుగమంటూ

మేథా శోధనకు పదును పెట్టావు 

మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని 

పంచభూతాలూ నా వశమంటూ 

ఆకాశం హద్దుగా పైపైకి ఎగిరావు 

నిన్ను నీవే మరమనిషిగా మార్చేసుకున్నావు..


అణువణువునీ శోధించావు 

అణుబాంబులను సృష్టించావు 

రాముని క్షేత్రాన్ని రణక్షేత్రంగా మార్చేసావు 

రక్తపు ధారలను ప్రవహింపజేస్తున్నావు 

విరుద్ధ వైషమ్య భావాలతో నిన్ను నీవే చంపేసుకుంటున్నావ్..


నింగికి నేలకు వంతెన లేసి 

లోకాన్ని జయించానని అనుకుంటున్నావు

భూగోళాన్ని చుట్టేస్తున్నావు 

ఆగని పయనం, ప్రగతికి దారులు వేస్తున్నా 

ఈర్ష్యా ద్వేషాలతో మనస్సులను చంపేస్తూ

యంత్రాల పనిముట్టులా మారిపోతున్నావు 

*ఆలోచించు! పయనం ప్రపంచమంతా*

*హృదయం మాత్రం అతి కాలుష్యంతో*


మరిచి పోతున్నావు..శాంతీ సౌహార్ద్రభావాలను

నీతీ-రీతి..నిజాయితీని నవ్వుల పాల్జేస్తూ

అగాథంలో పడి నీ ఉనికిని కోల్పోతున్నావు..


ఇకనైనా గుర్తించు, బేధాలెంచని సహకారమె

నీ సొత్తని..కలిసుంటే నే కలదు సుఖమని 

సమతా మమతా నిండినళ మానవతా తత్వమె

నీ మనుగడకు సిద్ధాంతమని..

.......................................................

ఇది నా స్వీయ కవిత

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷శుక్రవారం 11 ఏప్రిల్ 2025🪷*


            *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది.


       *వాల్మీకి రామాయణం*

              *5 వ  భాగం*

                    

*తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ।*

*నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు॥*

*గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ ।*

*ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ॥*

```

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి,చైత్రమాసంలో, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. 

అదే సమయంలో కైకేయకి పుష్యమి నక్షత్రంలో, మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ గారు దేవతలతో ఒక సభ తీర్చారు....     “శ్రీమహా విష్ణువు భూలోకంలో      రాముడిగా అవతరించారు, రావణసంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో  కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి” అని చెప్పారు. 


దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.


అప్పుడు బ్రహ్మ “ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి” అని అన్నారు. 


ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతో నీలుడు జన్మించాడు, వాయువు అంశతో  హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని     కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.```


*అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్।*

*జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం॥*

*సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా।*

*వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా॥*``` 


రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటే అగ్ని బీజం, మ అంటే అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మం) కనుక  ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని,    శత్రువులను(అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.


తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే    వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో   రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.


అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు… “నా పిల్లలకి 12సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. 

వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. “మీరు    మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను” అని దశరథుడు అన్నాడు.


అప్పుడు విశ్వామిత్రుడు “దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా?” అని పలు కుశల ప్రశ్నలు వేసి, “నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి” అన్నాడు.```


*స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం।*

*కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి॥*```


“నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా,మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను,” అని విశ్వామిత్రుడు అన్నాడు. 


ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.```


*ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః।*

*న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః॥*```


మెల్లగా తేరుకొన్న దశరథుడు, “ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు, కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే, రాముడితో నేను కూడా వస్తాను.” అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.


“రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు!” అని విశ్వామిత్రుడు అడిగాడు.


అప్పుడు దశరథుడు “లేక లేక పుట్టిన   నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు” అన్నాడు. 


ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, “చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు!” అని వెళ్ళిపోతున్నాడు. 


వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు…  “ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా..?```


*ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ।*

*ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం॥*```


“ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు,     ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు,శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ,      ఎందుకు అడ్డుపడతావు?” అని అన్నాడు.


దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి “రాముడిని తీసుకురా” అని కౌసల్యతో చెప్పాడు. 


రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. 


స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. 


సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. 


దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో…  “నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను,  మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి.” అని విశ్వామిత్రుడితో చెప్పాడు. 


“విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి” అని రాముడితో చెప్పి సాగనంపాడు. 


అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు.```


*రేపు... 6వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

.

శుక్రవారం🌹* *🪷11, ఏప్రిల్, 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹*

*🪷11, ఏప్రిల్, 2025🪷*

   *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి : చతుర్దశి* రా 03.21 వరకు ఉపరి *పూర్ణిమ*

*వారం    : శుక్రవారం*

(భృగువాసరే)

*నక్షత్రం : ఉత్తర* మ 03.10 వరకు ఉపరి *హస్త*


*యోగం  : ధ్రువ* రా 07.46 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం : గరజి* మ 02.09 *వణజి* రా 03.21 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం : *ఉ 07.08 - 08.55*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.33*


*వర్జ్యం : రా 12.36 - 02.24*

*దుర్ముహూర్తం : ఉ 08.24 - 09.14 మ 12.33 - 01.23*

*రాహు కాలం : ఉ 10.35 - 12.08*

గుళికకాళం : *ఉ 07.28 - 09.02*

యమగండం : *మ 03.15 - 04.49*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.55 - 08.25*

సంగవ కాలం         :      *08.25 - 10.54*

మధ్యాహ్న కాలం  :      *10.54 - 01.23*

అపరాహ్న కాలం   : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.22*

ప్రదోష కాలం         :  *సా 06.22 - 08.40*

రాత్రి కాలం : *రా 08.40 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం🪷*


 *నమఃక్షీరాబ్ధితనయే* *నమస్త్రైలోక్యధారిణి*

*శశివక్త్రేనమస్తుభ్యం* *రక్షమాంశరణాగతం*     

   

*🪷ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

Panchang



 

11.04.2025, శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

*🙏జై శ్రీమన్నారాయణ🙏*

11.04.2025, శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - వసంత ఋతువు

చైత్ర మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి రా2.32 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:ఉత్తర మ2.53 వరకు

యోగం:ధృవం రా7.32 వరకు

కరణం:గరజి మ1.46 వరకు

తదుపరి వణిజ రా2.32 వరకు 

వర్జ్యం:రా12.05 - 1.50

దుర్ముహూర్తము:ఉ8.18 - 9.07 మరల మ12.24 - 1.14

అమృతకాలం:ఉ7.06 - 8.50

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.10



ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గింది. అయినా, ప్రసూతి సంబంధిత సమస్యలతో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఎ) నివేదిక గతంలో వెల్లడించింది. ప్రసూతి మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ సైతం ఒకటి. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం 42 రోజుల్లో స్త్రీ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా డబ్ల్యూహెచ్ఎ పరిగణిస్తోంది. ఒక ఏడాదిలో ప్రతి లక్ష సజీవ శిశు జననాల్లో జరిగే మాతృ మరణాలను వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్)గా చెబుతారు.


*ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని, ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!*

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - వసంత ఋతువు

చైత్ర మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి రా2.32 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:ఉత్తర మ2.53 వరకు

యోగం:ధృవం రా7.32 వరకు

కరణం:గరజి మ1.46 వరకు

తదుపరి వణిజ రా2.32 వరకు 

వర్జ్యం:రా12.05 - 1.50

దుర్ముహూర్తము:ఉ8.18 - 9.07 మరల మ12.24 - 1.14

అమృతకాలం:ఉ7.06 - 8.50

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.10



ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గింది. అయినా, ప్రసూతి సంబంధిత సమస్యలతో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఎ) నివేదిక గతంలో వెల్లడించింది. ప్రసూతి మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ సైతం ఒకటి. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం 42 రోజుల్లో స్త్రీ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా డబ్ల్యూహెచ్ఎ పరిగణిస్తోంది. ఒక ఏడాదిలో ప్రతి లక్ష సజీవ శిశు జననాల్లో జరిగే మాతృ మరణాలను వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్)గా చెబుతారు.


*ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని, ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!*

వృద్ధాప్యం

 *_🫵 వృద్ధాప్యం.. నిప్పు లేకుండా హృదయాన్ని కాల్చే రక్త బంధాలు !!_*

______________________________________


రాధాకృష్ణారావు గారికి కీసర దగ్గర లంకంత కొంప ఉంది...


అదృష్టవశాత్తూ తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడం...

దానికి తోడు ఇంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకు పుట్టిన పిల్లలనిద్దరిని ఉన్నత చదువులు చదివించారు...

ఇప్పుడు రాధాకృష్ణారావుకు డెబ్భై ఏళ్ళు...

పెళ్లయి యాభై సంవత్సరాలు...


"ముత్తైదువగా పోవాలి"

 అని భార్య జానకి ఎప్పుడు అనుకునేది...

షుగర్ బీపీ ఉన్న రాధాకృష్ణారావు రాయిలా ఉన్నాడు కానీ ఆరోగ్యంగా 

ఉన్న జానకి హఠాత్తుగా కన్ను మూసింది...


ఉన్నాన్నాళ్ళు చీటికి మాటికి భార్యతో తగువు పెట్టుకున్న రావు గారు...

ఆమె పోయాకా ఆమె లేని లోటు అణువణువు కనబడుతుంది...

ఆఫీస్ ఉన్నప్పుడు హాయిగా సాగిన సంసారం... 

ఆయన రిటైర్ అయ్యాకా తన బీపీ అంతా భార్య మీద చూపించే సరికి ఎన్నో సార్లు  

అలగి గదిలో తలుపు బిగించుకునేవాడు...

జానకి మళ్ళీ బ్రతిమాలాడుతూ

 

ఆ జ్ఞాపకాలు... 

ఆమె బుజ్జగించిన ఆ రోజులు అన్ని రావు గారికి గుర్తుకు వస్తున్నాయి... 


ఎటూ చూసిన ఇల్లంతా జానకి ప్రతిరూపం కనబడుతుంది...

ఉన్నాన్నాళ్ళు కూర బాగాలేదని పచ్చడి బాగా లేదని ఆమెను వేధించుకు తిన్న రోజులు గుర్తుకు వచ్చి రావు కన్నీళ్లు ధారగా విలపిస్తున్నారు..

యాభై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరిదీ ఒకే మాట...

రిటైర్ అయ్యాకా మాత్రం కాస్త నోటి దురుసు రావు గారికి ఎక్కువైంది...


బయటకు వెళితే "బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారా?" అని అడిగేది... 

టిఫిన్ చేసి ముందు "టాబ్లెట్స్ వేసు కొండని" ఫోన్ లో చెప్పేది...

ఇంట్లో ఉంటే ఎప్పుడో తెల్లవారి ఝామున లేచి పూజ పునస్కారాలు చేసి తొమ్మిదికల్లా టిఫిన్ రెడీ చేసి భర్తకు పెట్టీ ఆమె తినేది...


 *ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పట్నుంచి ఆమెకు రావు గారికి వైరం* మొదలైంది...

వాళ్ళ ఉద్యోగాలు హైటెక్ సిటి వైపు వాళ్లకు వచ్చే జీతం ఏమి సరిపోతుంది అని ఉన్న రెండెకరాల అమ్మి అమ్మాయికి అబ్బాయికి రెండు ఇళ్ళు కోనిచ్చే వరకు జానకి పోరు ఆగలేదు! పిల్లలకు సిటీలో ఇళ్ళు కొన్నకా ఇద్దరూ వాళ్ళ దగ్గర ఇమడ లేక సిటికి దూరంగా ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నారు...

పైగా "నేను ముందు పోతే మీకు చేసే వారు ఉండరు" అని ఏడిపించేది...


ఎంత గిల్లి కజ్జాలు పెట్టుకున్నా కూడా భార్య భర్తలు ఒక గంట సేపటి తరువాత మాట పట్టింపులు పక్కన పెట్టి దగ్గరయ్యేవారు...

రావు గారిదే ఎప్పుడు తప్పు అయ్యేది. జానకి ఓపిక వల్ల సంసారం ఇంత వరకు సాగింది...

పిల్లల పెంపకం... 

వాళ్లకు ఉద్యోగాలు ...

వాళ్లకు ఇళ్లు పెళ్ళిళ్ళు అయ్యే సరికి ఉన్న ఆస్తి మొత్తం అయి పోయింది...

ఇప్పుడు తన పూర్వీకుల కట్టించిన ఇల్లు...

పెన్షన్ తప్పా రాధాకృష్ణారావుకు ఏమి మిగలలేదు!!


ఈ తరం పిల్లల అభిరుచులు వేరు, దంపతులు ఇద్దరు ఉద్యోగాలు... తీరిక లేని పనుల వల్ల తల్లి దండ్రులను చూసే ఓపిక వారికి లేదు...

పైగా తన కన్న వాళ్ళని స్కూలుకు పంపడం...

తీసుకురావడం...

ఇదే ఒత్తిడితో ప్రతి కుటుంబంలో వృద్ధ తల్లి దండ్రులు పిల్లల దగ్గర ఇమడలేక పోతున్నారు...


వాళ్ళు తినే తిండి...

ఆచార వ్యవహారాలు....

వాళ్ళ వస్త్ర ధారణ ఇప్పడి పేరంట్స్ కు నచ్చడం లేదు...

పైగా మనవలు మనవరాళ్లుతో అన్యోన్యంగా ఉందామన్నా కూడా 

"పిల్లల చదువు పాడై పోతుంది" 

"మీరు గారాబం చేయకండి" అనే మాట కొడుకు - కూతురు నుండి రావడం..


తన పిల్లలకు కొన్న ఇల్లులో కూడా తనకు *స్థానం*, లేదని తెలిసి వచ్చే సరికి ఆప్యాయత అనురాగం అంతా కనుమరుగై పోతుంది... 


కన్న కొడుకు ఇంట్లోనే 

తల్లి తండ్రులు కాందిశీకుల్లా బ్రతుకుతున్నారు...

ఇప్పుడు కన్న తల్లి దండ్రులు పిల్లలకు *బరువు*!! 

అందుకే పండుటాకులుగా మిగిలి పోయి "దేవుడు ఎప్పుడు తీసుకెళతాడా?" 

అని చూస్తున్నారు 

రాధా కృష్ణారావు గారు. ఇవ్వాళ ఎంతో బాధకు గురయ్యారు..." ఛ... ఇలాంటి పిల్లలను కన్నందుకా నేను ఇంత శ్రమ పడింది.. దానికి కారణం తనను కొడుకు అన్న మాటలు బాధించాయి... 


"మనసు బాగాలేక దైవ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్లి వస్తా" అని పిల్లల ఇద్దరికీ చెప్పాడు...

తానే రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాడు...

ఈ నాలుగు రోజుల్లో *ఎలా ఉన్నారు నాన్న* అని పిల్లల నుండి ఫోన్ లేదు...

తిన్నారా? పడుకున్నారా? అని బాగోగులు కూడా అడిగిన పాపాన పోలేదు...

రావు గారికి పిల్లల పట్ల ద్వేష భావం ఏర్పడడానికి బోలెడు సంఘటనలు జరిగాయి...

ఒక రోజు కొడుకు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి రాజమండ్రి నుండి దిగిన అత్తా మామను తీసుకురావడానికి కొడుకు కారులో వెళ్లి తీసుకువచ్చాడు...

తాను రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అంటే క్యాబ్ లో వెళ్ళమని ఆఫీస్ కు వెళ్లి పోయాడు...

వారింట్లో ఉంటే పిల్లలకు వాళ్ళు టిఫిన్ లు క్యారేజ్ లు కట్టి అటు ఆఫీస్ కు ఇటు స్కూల్ కి పిల్లలను పంపాకా "నాన్నా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది... తినండి" అని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు... ఇంట్లో ఉన్న రెండు రోజుల్లో కోడలు "ఎలా ఉన్నారు మావయ్య" అని కూడా అడగలేదు... పైగా మనవరాలు మనవడితో గదిలో పడుకుందామని అనుకుంటే హాల్లో మంచం వేసి పరుపు వేసి పడుకోండి... అని కొడుకు అన్నప్పుడే అదే అర్ధరాత్రి తన ఇంటిలో వెళ్లి పోదామని కోపం వచ్చింది రావు గారికి.. 

అయిన తమాయించుకొని ఉన్నాడు...

తెల్లవారే తన బట్టలు సర్దుకొని *వెళ్లి వస్తా బాబు* అంటే *సరే నాన్నా* అన్నాడు తప్ప ఉండమని అనలేదు! తాను క్యాబ్ మాట్లాడుకొని కూతురు ఇంటికి వెళితే వెళ్ళిన రోజు బాగానే చూసింది... మరో రోజు ఉందామని అనుకొని తాను టీవీ చూస్తుంటే "నాన్నా అల్లుడు గారి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ బంధువులు వస్తున్నారు... వాళ్ళు మూడు నాలుగు రోజులు ఉంటారట... మీరు అన్నయ్య ఇంట్లో ఈ మూడు రోజులు ఉండండి తిరిగి నా దగ్గరికి రండి" అన్న మాట కూతురు నోట వినగానే స్నానం చేయకుండానే ప్యాంట్ షర్ట్ వేసుకొని బ్యాగ్ సర్దుకొని *సరే అమ్మా ఆరోగ్యం జాగ్రత్త* అని లిఫ్ట్ దిగాడు...


వెంటనే ఆటో మాట్లాడుకొని పబ్లిక్ గార్డెన్ వెళ్లి ఒక చెట్టు చాటుకి వెళ్లి బోరున విలపించాడు...

తాను - జానకి ఏ యాత్రలకు వెళ్ళిన కూడా పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకొని చలి పెడుతుందేమో అని రగ్గులు కప్పి పొదివి పట్టుకొని పెంచిన వీళ్ళు *మా ఇంట్లో పడుకోవడానికి స్థానం లేదు* అని నిర్మోహమాటంగా అనడం రాధాకృష్ణా రావు గారు జీర్ణించుకోలేక పోతున్నా రు...!! 

జ్వరాలు రోగాలు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు స్వస్థత చేకూరే వరకు ఆసుపత్రి వరండాలో పడుకొని పిల్లలను పెంచితే ఇదా వాళ్ళు చేసే నిర్వాకం! తన లాగే పబ్లిక్ పార్కుల్లో మూగ రోదన చేస్తున్న తన వయసు వాళ్ళు కనబడ్డారు రావు గారికి... 

భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంత చిన్న భిన్నం కావడానికి కారణం 

ఈ సాఫ్టు వేర్ జాబులా?  

లేక 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు పాటించక పోవడానికి 

మా తరమే కారణామా?! అన్న ప్రశ్న రావు గారిలో మొదలైంది..

అసలు జీవితం అనే రైలు ప్రయాణంలో ఫ్లాట్ ఫాం ఫ్రెండ్ గా పిల్లల్తో ఉండాలి...

స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణికుడిలా మనం మారాలి...

అన్న దృఢ నిశ్చయం రావులో మొదలు అయింది...


వెంటనే తన ఫోన్ లో నుండి కొడుకు కూతురు కాంటాక్ట్ నెంబర్లు తీసేశాడు...

తన ఇంటికి చేరి ఇల్లంతా పని వాళ్ళతో శుభ్రం చేయించి కేవలం జానకి ఫోటో మాత్రమే ఇంట్లో తనకు కనబడేలా...

బెడ్ రూంలో పెట్టాడు...

పక్కనే హోటల్ వానీ దగ్గరికి వెళ్లి ఉదయం టిఫెన్, మధ్యాన్నం భోజనం రాత్రి రెండు చపాతీలు పంపేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.

పక్కనే ఉన్న టీ కొట్టు వాడితో ఉదయం సాయంత్రం కాఫీ తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు...

తన సెల్ లో టైమ్ ప్రకారం ట్యాబ్ లెట్స్ వేసుకునేలా అలారమ్ పెట్టుకున్నాడు...

నెలకు పది రోజులు ఇండియా టూర్ ట్రావెల్స్ వాడికి టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు...

ఇపుడు పిల్లలు ఫోన్ చేసిన ఎత్తడం లేదు... 

భవ బంధాలు అన్ని తెంపుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు!


ఒంటరి తనం అనేది మనసు మాట! *తన మాటే మనసు వినేలా,* మనో నిబ్బరం తెచ్చుకున్నాడు! ఇప్పుడు ఆయన రోగాలు తగ్గు ముఖం పట్టాయి! 


తొంబై ఏళ్ళ వయసులో కూడా చలాకీగా ఉన్న తన దగ్గరికి రిటైర్ అయి ఫారిన్ లో సెటిల్ అయిన తన కొడుకుల దగ్గర ఇమడలేక తండ్రి పంచన చేరిన తన కొడుకు హాల్లో టీవీ చూస్తుంటే గదిలో నుండి వచ్చిన రావు గారికి తన కోడలు కొడుకుతో మట్లాడుతున్న సంభాషణ వినపడింది... "ఏమండీ నేను అమెరికాలో ఇమడలేక పోతున్నాను *ఇక్కడ మన పిల్లలు పని మనుషులకన్నా హీనంగా చూస్తున్నారు నేను మీ దగ్గరికి వస్తాను* అన్న భార్య మాటలకు చూసావా వృద్దాప్యం ప్రాయ చిత్తం ఏమిటంటే...

భార్యా వియోగం, (స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి) లోక నింద, రుణభారం (అప్పులు), నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి, దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైనవారు వచ్చి పలకరించడం - ఇవన్నీ తట్టుకోలేని బాధలు. 

ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండా హృదయాన్ని కాల్చేస్తాయి. అవమానభారంతో దహించుకుపోతారు !!


మీ ఆస్తులు మీ దగ్గరే ఉంచుకోండి, మీ తర్వాతనే పిల్లలకు ఇచ్చే ఏర్పాటు చేసుకోండి. 


_*కాబట్టి వృద్ధ తల్లితండ్రులు... ప్రతిదానికి కుచించుకుపోయి, "బేలగా" బ్రతక్కండి... నిబ్బరంగా ఉంటూ కనీసం ఇప్పుడైనా మీకోసం.. ఒకరి కోసం ఒకరు సుఖంగా సంతోషంగా బ్రతకండి..!!!*

______________________________________



నచ్చిందా సారు 


🙏🌹 శుభరాత్రి

సమభావన

 *🕉సమభావన*

                 


*మనిషి స్వభావం చాలా చిత్రమైనది. బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు. చెట్ల ఆకుల్లో ఔషధగుణాలు చూస్తాడు. కాని, తోటి మనిషిని మనిషిగా చూడడు. మానవత్వం మరచిపోయి, తనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతో హీనంగా చూస్తాడు.*


*మనిషి సంఘజీవి! ఒంటరిగా జీవితం సాగించలేడు. ఎంత గొప్పవారైనా తనకన్నా తక్కువ స్థాయి వారిపై ఆధారపడవలసిందే. ఉన్నత పదవుల్లో ఉన్నవారు చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారిని చిన్నచూపు చూడకూడదు! నిజానికి ఈ సమాజంలో ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. అందరిపట్లా సమభావం కనబరచాలి గాని హీనభావం ఉండకూడదు.*



*మనిషి నిత్యం ఆరాధించే ధైవానికి ఎలాంటి పక్షపాతవైఖరీ లేదు.* *రామాయణంలో శ్రీరాముడు ప్రతి ఒక్కరినీ తన బిడ్డలుగా భావించి పరిపాలన సాగించాడు. అరణ్యంలో చెట్లను, పక్షులను చివరికి రాక్షసులను కూడా తన ప్రేమతత్వంలో ముంచి ఉత్తముడిగా నిలిచాడు. ఆ భగవంతుడికి సర్వమానవాళిపై అపారమైన దయ ఉంది.*


*ఆయనకు ఏ జీవుడిపైనా రాగద్వేషాలు కాని, ఇష్టం గానీ, అయిష్టం గానీ లేవు. కుండపోతగా వాన కురుస్తూంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆబాల గోపాలాన్ని రక్షించాడు. పాండవ రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు. కౌరవులకు విదురుడు తక్కువ కులంవాడు అనే భావం ఉంది. తన భక్తిలో కులమతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేందుకు విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఆ పరమాత్మ.*


*సమదృష్టి కలిగినవారు ప్రశాంత మనుస్కులై ఉంటారు. అందరిపట్లా ప్రేమభావం కలిగి ఉంటారు. భేదభావం కలవారు నిత్యం పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. దుర్యోధనుడు ఆ కోవకు చెందినవాడే. అతడు రారాజు అయినా అంతిమక్షణం వరకు పాండవులపట్ల ద్వేషం పెంచుకుని అశాంతితో బతికాడు. భేదభావం కలవారికి ధర్మంపట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు, వారికి శాంతి రుచించదు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు వినరు. నిత్యం తమ ధోరణి లోనే జీవించి దుష్ఫలితాలు పొందుతారు. అంతిమంగా వినాశనం పొందడం తప్ప మరోమార్గం వారికి లేదు.*


*’నన్ను సర్వ భూతాల్లోను, సర్వ భూతాల్ని నాలోను చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరుకాడు, నేను అతడినుంచి వేరుకాదు-‘ అని గీతలో పరమాత్మ బోధించాడు.* 


*అందుకే అందరినీ సమదృష్టితో చూడాలి. అందరూ మనల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం, గౌరవానికి మనం అర్హత పొందాలంటే మనం కూడా ఎదుటివారిని అభిమానించాలి. గౌరవం ఇస్తేనే గౌరవం తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితాలు అనుభవించక తప్పదు.*


*రామకృష్ణ పరమహంస పేద, ధనిక తారతమ్యాలను పాటించలేదు. స్త్రీలను, పురుషులను సమానంగా భావించేవారు.*

*ఆయన శిష్యుడైన వివేకానందస్వామి దరిద్రంలో బాధపడే సాటిమనిషిని నారాయణుడిగా భావించాలని బోధించేవారు.* 

*ప్రభువైనా చండాలుడైనా ఒక్కటే అన్నాడు అన్నమయ్య. ఏ కొండకోనల్లోనో పుట్టి ప్రవహిస్తుంది జలధార. మార్గమధ్యంలో అన్నింటినీ చేరి జీవకళ నింపుతుంది. అలాగే ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అందరికీ ఫలాలు అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి ధర్మాన్ని ప్రతి మనిషీ అలవరచుకోవాలి.*


*సమభావన అంటే ప్రేమభావన. ఆ భావనతో మనం తోటివారిని కరుణ, దయ, ఉపకారం వంటి దైవీ గుణాలతో ఆనందపరచాలి. అప్పుడే జన్మ సాఫల్యమవుతుంది.*


🕉🙏

స్థిత ప్రజ్ఞుడు

 స్థిత ప్రజ్ఞుడు అంటే అర్థం?


☁️ స్థిత ప్రజ్ఞుడు అనే పదం సంస్కృత భాష నుండి వచ్చిందే. ఇది భగవద్గీతలో ప్రస్తావించబడిన ఒక ప్రధాన అంశం. స్థిత ప్రజ్ఞుడు అనగా, ఏ పరిస్థితుల్లోనైనా మనస్తత్వంలో స్థిరత్వం కలిగి ఉండే వ్యక్తి.


☁️☁️ భగవద్గీతలో వివరణ: భగవద్గీత 2వ అధ్యాయం (సాంఖ్య యోగం) లో స్థిత ప్రజ్ఞుడి గుణాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ముఖ్యంగా, స్థిత ప్రజ్ఞుడు ఎటువంటి పరిస్థితులనైనా సమానంగా స్వీకరిస్తాడు, అతని మనసు అలజడికి గురికాదు.


"దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విఘతస్పృహః"


(దుఃఖంలో చిక్కుకోక, సుఖంలో తగిన ఆసక్తి లేకుండా ఉంటాడు.)


"వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే"


(రాగం, భయం, క్రోధం లేని వ్యక్తి స్థిత ప్రజ్ఞుడని పిలువబడతాడు.)


ఎక్కడా దేనికి తలొగ్గకుండా,శుభా అశుభాలని పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచి ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు అని పిలవబడతాడు


☁️☁️ స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు:


🍳సంయమనం: సుఖం లేదా దుఃఖం వంటి విపరీత పరిస్థితులలో సమచిత్తంతో ఉండటం.


🍳రాగద్వేషరహితత్వం: ఆకర్షణలు (రాగం) మరియు ద్వేషాలు (విరక్తి) లేకుండా ఉండటం.


🍳ఇంద్రియ నిగ్రహం: ఇంద్రియాలను (చక్షు, శ్రవణ, వగైరా) నియంత్రించుకుని జ్ఞానం వైపు మనస్సును మరలించడం.


🍳స్వతంత్ర ఆత్మగౌరవం: బాహ్య పరిస్థితుల వల్ల ప్రభావితంకాకుండా తనను తాను నడిపించుకోవడం.


🍳ఆత్మసమాధానం: తన ఆత్మలోనే తృప్తి కలిగి ఉండడం, అనర్థపు ఇంద్రియానందాలపై ఆధారపడకపోవడం.


☁️✴️ ముగింపు : స్థిత ప్రజ్ఞుడు కావడం ఒక ప్రయాణం. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. కానీ నిరంతర ప్రయత్నంతో ఎవరైనా స్థిత ప్రజ్ఞుడు కావచ్చు. స్థిత ప్రజ్ఞుడు కావడం వల్ల మనం జీవితాన్ని మరింత సంతోషంగా మరియు ప్రశాంతంగా గడపవచ్చు.

శ్రీ ఆంత్రి మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 1077


⚜ మధ్యప్రదేశ్  : మానస నగర్


⚜  శ్రీ ఆంత్రి మాత ఆలయం 



💠 మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మానస తహసీల్ పరిధిలోని అంత్రి గ్రామం చివర ఉన్న ప్రసిద్ధ ఆలయంలో మా అంతిమ మాత యొక్క అద్భుత విగ్రహం ఉంది. 


💠 ఏడాది పొడవునా సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 

మకర సంక్రాంతి నాడు ఇక్కడ గొప్ప జాతర నిర్వహిస్తారు. 


💠 ఆలయం చుట్టూ నది నీరు సహజంగా వ్యాపిస్తుంది. 

ప్రకృతి స్వయంగా ఆలయాన్ని అలంకరిస్తున్నట్లు అనిపిస్తుంది. 

చుట్టూ ప్రవహించే స్వచ్ఛమైన నీరు భక్తులను ఆకర్షిస్తోంది. 

ఇది ఈ ప్రాంత వాసులకు ఆహ్లాదకరమైన ప్రదేశం. 


🔆 స్థల పురాణం 


💠 మా ఆంత్రి మాత ఆలయం గురించి చాలా పురాణాలు ఉన్నాయి. ఇది కాకుండా, ఆంత్రి మాత యొక్క అద్భుతాలు ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందాయి.


💠 మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి మధ్య ఉన్న ఆంత్రి మాత ఆలయం మాతృ దేవత అంత్రి చంద్రావత్‌కు అంకితం చేయబడింది, ఇది గాంధీ సాగర్ యొక్క నీటితో నిండిన విస్తీర్ణంలో గంభీరంగా ఉంది, ప్రశాంతత మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రకాశాన్ని వెదజల్లుతుంది.  


💠 ఆంత్రి మాత ఆలయం గాంధీ సాగర్‌లోని నీటితో నిండిన ప్రాంతంలో నిర్మించబడింది . 

మాతృ దేవత అంత్రి చంద్రావత్ రాజ్‌పుత్‌ల (సిసోడియా శాఖలు) కులదేవత.


💠 ఈ ఆలయంలో వ్రతం పూర్తయిన తర్వాత, భక్తులు అమ్మవారికి నాలుకలను సమర్పించుకుంటారు. నాలుకను సమర్పించిన తర్వాత,  భక్తుల నాలుక స్వయంచాలకంగా వస్తుందని గుర్తింపు మరియు భక్తులు పేర్కొన్నారు. 

ఇప్పుడు, వ్రతం పూర్తయిన తర్వాత, చాలా మంది భక్తులు వెండి నాలుకలను సమర్పించడం ప్రారంభించారు.


🔆 చరిత్ర


💠 ఆలయ పూజారి భరత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం దాదాపు 700 సంవత్సరాల నాటిదని చెప్పారు. 

అంత్రి మాత గ్రామంలోని గాంధీ సాగర్‌లోని నీటి ఎద్దడి ప్రాంతంలో అమ్మవారి ఆలయం ఉంది . ఆలయానికి ఒకవైపు గ్రామం, మరో మూడు వైపు చంబల్ నది నీరు ఉన్నాయి. 

చైత్ర, శారదీయ నవరాత్రులలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం, పూజలు చేస్తారు. 


💠 మధ్యప్రదేశ్ , రాజస్థాన్ ప్రజలకు మాతృ దేవత పట్ల అపారమైన విశ్వాసం ఉంది. 


💠 లోకమాత అయిన జగదాంబ దక్షిణ దిశ నుండి వచ్చి నదిలోని హనుమాన్ ఘాట్ నుండి ఆలయంలో కూర్చుంది.

నేటికీ హనుమాన్ ఘాట్ రాతిపై అమ్మవారి వాహనం పాదముద్ర ఉంది. ఇక్కడ పూజలు జరుగుతాయి మరియు రెండవ పాదముద్ర ఆలయంపై గుర్తించబడుతుంది. 


💠 దేవత స్వయంగా పూజించబడుతుంది మరియు భైన్సవరి మాత అని కూడా పిలుస్తారు. గర్భగుడి కుడి వైపున సింహంపై స్వారీ చేస్తున్న దుర్గాదేవి విగ్రహం ఉంది. భక్తులు దర్శనం కోసం ఆలయానికి వచ్చి కోరికలు తీర్చుకుంటారు.

భక్తులు కోరికలు తీర్చుకునేటప్పుడు నాలుక కోసుకుని సమర్పించుకుంటారు. 

దాదాపు 700 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.


💠 ప్రతి సంవత్సరం రెండు నవరాత్రుల సమయంలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. 

ప్రతిరోజూ 4 నుంచి 5 మంది భక్తులు తమ నాలుకలను సమర్పించుకుంటారు. 

సాధారణంగా నవరాత్రులలో దాదాపు 50-55 మంది తమ నాలుకలను అమ్మవారికి సమర్పిస్తారు. 

ఏడాది పొడవునా ఈ సంఖ్య 100 నుండి 125కి చేరుకుంటుంది. 


💠 ఆలయ నిర్వహణ ప్రకారం, సుమారు 101 సంవత్సరాలలో, సుమారు 12625 మంది భక్తులు (1616 మంది మహిళలతో సహా) తమ ప్రార్థనలు చేశారు. 

నాలుక సమర్పించిన తర్వాత భక్తులు తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఉండి అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఆలయ పూజారి భరత్ సింగ్ చెప్పారు. 

తెగిపోయిన నాలుక తొమ్మిది రోజుల్లో తిరిగి పెరుగుతుంది మరియు భక్తులు తిరిగి వస్తారు.

ప్రతి సంవత్సరం ఈ క్రమం కొనసాగుతూనే ఉంది. 


💠 ఆంత్రి మాత ఆలయం మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలోని మానస నగర్ నుండి 35 కి.మీ దూరంలో ఉన్న అంత్రి మాత గ్రామంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

16-07-గీతా మకరందము

 16-07-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక అసురస్వభావము గలవారినిగూర్చి పండ్రెండు శ్లోకములద్వారా వివరముగ బోధించుచున్నారు-


ప్రవృత్తిం చ నివృత్తిం చ 

జనా న విదురాసురాః | 

న శౌచం నాపి చాచారో 

న సత్యం తేషు విద్యతే || 


తాత్పర్యము:- అసురస్వభావముగల జనులు ధర్మప్రవృత్తినిగాని, అధర్మనివృత్తినిగాని యెఱుగరు. వారియందు శుచిత్వముగాని, ఆచారము (సత్కర్మానుష్ఠానము) గాని, సత్యముగాని యుండదు.


వ్యాఖ్య:- అసురస్వభావయుతులు ధర్మకార్యములను చేయుటనుగాని, అధర్మకార్యములనుండి మఱలుటనుగాని యెఱుగరు. ఒకరు చెప్పినను వినరు. వీరు అధములు. తమ తప్పిదమునుగూర్చి మఱియొకరు చెప్పినపుడు దానిని మార్చుకొనువారు మధ్యములు. అసలు తప్పిదమే చేయనివారు ఉత్తములు. ఈ శ్లోకమున అధములను గూర్చియే చెప్పబడినది. మఱియు ప్రవృత్తి, నివృత్తియని ఇచట రెండు తెలుపబడినవి. ఇచట ‘ప్రవృత్తి' యనగా చేయదగినదియనియు, నివృత్తియనగా విడిచిపెట్టదగినది యనియు అర్థము. రెండిటిని విజ్ఞుడు తెలిసికొనియుండవలెను. అనగా దైవసంబంధకార్యములు, దైవగుణములు మున్నగు గ్రాహ్యవస్తువులనుగూర్చియు, విషయసేవనము, అధర్మకార్యములు, అసురగుణములు మున్నగు త్యాజ్యవస్తువులనుగూర్చియు ఎఱిగియుండవలెను. అసురస్వభావయుతులు వాని నెఱుగరని ఇట చెప్పబడినది.


ప్రశ్న:- అసురస్వభావుల కొన్ని లక్షణములను పేర్కొనుము?

ఉత్తరము:- (1) వారు ధర్మప్రవృత్తిగాని, పాపనివృత్తిగాని యెఱుగరు (2) శుచిత్వము, ఆచారము, సత్యము వారియందుండదు.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*344 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని ఎదుర్కొనుట*


అది గమనించిన కేకయ, పాంచాల సేనలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అశ్వత్థామ వారి మీద శరవర్షం కురిపించి వారిని పారతోలాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని " అశ్వత్థామా! నేను నీ తండ్రి ద్రోణుని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. నీ తండ్రినే కాదు నిన్ను కూడా వధిస్తాను రా! " అన్నాడు. అశ్వత్థామ " ధృష్టద్యుమ్నా! నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా! నా బాణములకు నిన్ను బలిచేస్తాను రా! " అంటూ ధృష్టద్యునుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు " నీ తండ్రి పని తరువాత చూడవచ్చు ముందు నీ పని పడతాను " అంటూ అశ్వత్థామ మీద శరములు గుప్పించాడు. అశ్వత్థామ కోపించి ధృష్టద్యుమ్నుని కేతనము ఖండించి, సారథిని, హయములను చంపి అతడి చక్రరక్షకులను నూరు మందిని చంపి సింహనాదం చేసాడు. పాంచాల సేనలు అశ్వత్థామ ధాటికి నిలువ లేక చెరిరి పోయాయు. అది చూసి ధర్మరాజు, భీముడు తమ సైన్యాలతో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చారు. సుయోధనుడు ద్రోణుని తీసుకుని అశ్వత్థామకు సాయం వచ్చాడు. అది చూసిన అర్జునుడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఇరు పక్షాల నడుమ పోరు ఘోరమైంది. అర్జునుడు తన వాడి అయిన బాణములతో మగధ, మద్ర, వంగదేశముల నాశనం చేస్తున్నాడు. భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యములను తుద ముట్టించాడు. అది చూసి ఆగ్రహించిన ద్రోణుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి పాండవసేనలను చెల్లాచెదురు చేసాడు. అర్జునుడు, భీముడు ద్రోణునికి రెండు వైపుల నిలిచి శరములు గుప్పించాడు. ద్రోణుడు బెదరక పాండవ సేనలను తనుమాడుతున్నాడు. సుయోధనుడు పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు సోమదత్తుడు పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. సాత్యకి సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. సోమదత్తుడు ఒకే బాణంతో సాత్యకి విల్లు విరిచి సాత్యకిని ముప్పై అయిదు బాణాలతో కొట్టాడు. సాత్యకి మరొక విల్లందుకుని సోమదత్తుని విల్లు విరిచాడు . సోమదత్తుడు మరొక విల్లు తీసుకున్నాడు. అది చూసి భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు సోమదత్తుడి మీద పరిఘను విసిరాడు. సోమదత్తుడు దానిని రెండు ముక్కలు చేసాడు. సాత్యకి ఒక వాడి అయిన బాణములతో సోమదత్తుడి సారథిని, హయములను చంపి మరొక నారసముతో సోమదత్తుడి తల నరికాడు. సోమదత్తుడి మరణం చూసి కౌరవ సేనలు సాత్యకిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. అది చూసిన ధర్మరాజు సాత్యకిని అక్కడి నుండి తప్పించి తాను ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనము పడగొట్టి ధర్మజుని శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ధర్మరాజు ఉగ్రరూపందాల్చి మరొక విల్లందుకుని ద్రోణుని శరీరంలో గుచ్చుకునేలా బాణములు సంధించాడు. ద్రోణుడు తన రథము మీద మూర్చిల్లాడు. కొంచెం సేపటికి తేరుకున్న ద్రోణుడు తేరుకుని పాండవ సైన్యం మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసి ద్రోణుని మీద శరములు గుప్పించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని వద్దకు వెళ్ళి " ధర్మజా ! నిన్ను పట్టుకుని సుయోధనుడికి అప్పగిస్తానన్న ద్రోణుని ప్రతిజ్ఞ మరిచావా ! ద్రోణునితో యుద్ధము మంచిది కాదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి భీముడికి సాయపడు " అన్నాడు. కృష్ణుడి మాట మన్నించి ధర్మజుడు భీముని వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు ధర్మజుడిని వదిలి పాంచాల సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణుడు వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఘోరరూపందాల్చింది. సేనల పదఘట్టనలకు రేగిన ధూళి ఆకాశాన్ని తాకి సూర్యుడిని మరుగున పరిచి చీకట్లు కమ్ముకున్నాయి. సైనికులకు కళ్ళు కనిపించడం కష్టమైంది. ద్రోణాచార్యుడు ఒక వైపు సుయోధనుడిని ఒక వైపు కురు సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసి అప్పటికప్పుడు ఒక వ్యూహమును ఏర్పరిచాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

బంగారం నాణ్యత

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏        🔥బంగారం నాణ్యత అగ్నిలో కాల్చిన తరువాత తెలుస్తుంది.. మనిషి మంచి తనం కష్టం లో  తెలుస్తుంది... కొన్నిటి విలువ మన దగ్గర ఉన్నపుడు తెలుస్తుంది.. కొట్టిటి విలువ మనం పోగొట్టుకున్న తరువాత తెలుస్తుంది🔥ఈ ప్రపంచంలో కోట్లాది మొక్కలు మొలవడానికి కారణం ఉడతలు.. అవి దాని తిండి గింజలను నేలలో దాచుకొని మరచి పోవడం వల్ల అవి మొక్కలుగా ఎదుగు తాయి.. అదే విధంగా మనము మంచి పనులు చేసి మర్చి పోయినా దాని ఫలితం తప్పకుండా ఏదో ఒక రోజు మనకు దక్కి తీరుతుంది🔥అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరిగిపోతుంది.. అందుకే కొన్నింటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం..మనిషి జీవితంలో కష్టపడితే సంపద వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం  వస్తుంది.. కానీ దాన్ని నిలుపుకోవాలి అంటే గొప్ప సంస్కారం మంచి వ్యక్తిత్వం ఉండాలి🔥అర్ధం అయ్యేలోపు దూరమాయ్యేది కల.. అర్ధం అయినా ఒప్పు కోలేనిది వాస్తవం.. అర్ధం తెలిసినా కొత్త అర్ధం తెలిపేది మంచితనం.. అర్ధం అయినట్లు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్ధం కానిది జీవితం.. అందుకే బంధమైనా స్నేహమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్ధం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి🔥🔥మీ *అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ 

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః (11)


కాంక్షన్తః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః 

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా (12)


అర్జునా.. ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్నివిధాల అనుసరిస్తారు. ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                    𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ధర్మో వై భగవాన్ సతామధిపతిర్ధర్మం భజేత్సర్వదా*


*ధర్మేణైవ నివార్యతేఽఘనివహో ధర్మాయ తస్మై నమః|*


*ధర్మాన్నాస్తి పరం పదం త్రిభువనే ధర్మస్య శాంతిః ప్రియా*


*ధర్మో తిష్ఠతి సత్యమేవ శుభదం మా ధర్మ మాం వర్జయ ||*


     *భావం:*


*ధర్మమే నిజంగా భగవంతుడు, మరియు సద్గుణుల అధిపతి.*

*అందుచేత ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి.*


*పాపాల ప్రవాహాన్ని నివారించగలది ధర్మం ద్వారానే, అటువంటి ధర్మానికి నేను నిత్యం నమస్కరిస్తున్నాను.*


*ఈ మూడు లోకాల్లో ధర్మానికి మించిన గొప్ప స్థానం లేదు*.

*ధర్మానికి శాంతి ప్రియమైనది, మరియు శుభప్రదమైనది సత్యమే.*


*ధర్మం సత్యములోనే నిలిచి ఉంటుంది. ఓ ధర్మా! నన్ను ఎప్పుడూ వదలవద్దు —నేను నిన్ను విడువను!*


 ✍️🌹💐🪷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - చతుర్దశి - ఉత్తరాఫల్గుణి -‌‌ భృగు వాసరే* (11.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అధికారము లభియించగ లభియించగ


*కం*

అధికారము లభియించగ

సుధిజనపోషణముజేయ సుషముడవయ్యున్.

మధురంబగు భవితలెపుడు

సుధిగణములు తెలుపగలరు సుష్టుగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అధికారం లభించిన పుడు విద్వాంసులను పోషిస్తే బాగుగా వెలుగొందగలవు. మధురమైన భవిష్యత్తులు పండితులు బాగా తెలుపగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ**

*

*కం*

ఇలలో సిరులార్జించగ

నిల సౌఖ్యములందగలుగు నెవ్వరికైనన్.

కలిగిన సౌఖ్యము క్షణికము

సలిపిన ధర్మమ్ము నిలుచు సతతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఈ లోకంలో సిరిసంపదలు సంపాదించిన చో ఈ లోకంలో ని సౌఖ్యములు ఎవ్వరికైననూ లభించగలవు. కానీ అనుభవించిన సౌఖ్యములు క్షణికములు కానీ చేసి న ధార్మిక కర్మలు మాత్రం ఎల్లకాలమూ నిలుచును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*