18, జులై 2022, సోమవారం

ఉమా సహస్రము

 *728 & 729 - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (8వశతకం)*

🕉🌞🌎🌙🌟🚩


728) శ్లోకము :-


విశుద్ధ దర్పణేన వా 

విధారితే హృదాంబ! మే 

అయి! ప్రయచ్ఛ సన్నిధిం

నిజే వపు ష్యగాత్మజే! 728 


పదవిభజన :-


విశుద్ధ దర్పణేన వా 

విధారితే హృదా అంబ! మే 

అయి! ప్రయచ్ఛ సన్నిధిం

నిజే వపుషి అగాత్మజే! 728 


భావము:-


తల్లీ ! పర్వతరాజ పుత్రి, ఓ ఉమాదేవి! 


నీ దివ్య మంగళ విగ్రహమును 


పరిశుద్ధమైన అద్దము అందునందు వలె 


నా ప్రసన్న మనస్సున ప్రతిఫలించి

 

ఆవాహితవు కమ్ము.


🕉🌞🌎🌙🌟🚩


729) శ్లోకము :-


పురస్య మధ్య మాశ్రితం

సితం య దస్తి పంకజమ్!

అజాండ మూల్య మస్తు తే

సురార్చితే! తవాసనమ్!! 729


పదవిభజన :-


పురస్య మధ్యం ఆశ్రితం

సితం యత్ అస్తి పంకజమ్!

అజాండ మూల్యం అస్తు తే

సురార్చితే! తవ ఆసనమ్!! 729


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! 

నా శరీరమున    

ముఖ్య భాగమై 

హృదయము అను 

తెల్లని పుండరీకము ఉన్నది.


అది బ్రహ్మాండము వలె 

విలువైనది.

అట్టి హృదయము 

నీకు పద్మాసనము

అగు కాక.


🕉🌞🌎🌙🌟🚩

ఋణానుబంధ రూపేణా.....

 *ఋణానుబంధ రూపేణా......*

🕉️🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🕉️


🌈 ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది.  


💫 ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


🌈 *ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...* 🌈


🌹 మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


🌹 *ద్వేషం కూడా బంధమే....* 


💫 పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


🌹 మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


🌹 మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు.


🌈 *ఉదాహరణకు ఒక జరిగినకథ:-* 🌈


💫 కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.  


💫 ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...


💫 పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు.


💫 అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


💫 ఒకసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.


💫 ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు.... ”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే, వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!” అన్నారు.


✅ ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. 


💫 మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి.


💫 కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  

అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


💫 *ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.*


💫 కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా.......🕉️

*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం 

🕉️🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🕉️

లక్ష్యం

 లక్ష్యం 

మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుండి ఊపిరి ఆగేదాకా ప్రతి క్షణం ఏదో ఒక లక్ష్యం కోసమే కర్మలు చేస్తుంటాడు. పుట్ట్టగానే శిశువుకు వున్న ఒకే ఒక లక్ష్యం తల్లి దగ్గర పాలు త్రాగటమే.  దానికోసం తనకు వున్న ఆయుధం ఏడుపు పిల్లడు ఏడవంగానే ఆ తల్లికి వెంటనే తెలుస్తుంది తన బిడ్డ ఆకలితో వున్నాడని అంతే వెంటనే కడుపునిండా పాలు త్రాగించి పాడుకోపెడుతుంది. ఇక శిశువు పెరుగుతున్నా కొద్దీ వాడి లక్ష్యాలు కూడా మారుతూవుంటాయి. ముందు బోర్లాపడటం, తరువాత పారాడటం, అటుపై నిలుచోటం ఆపై కిందపడకుండా నడవటం ఇలా సమయానుసారంగా లక్ష్యం మారుతూ ఉంటుంది.  సాదా లక్ష్యం వైపు పరుగులు తీయటం జరుగుతుంది. ఇంకా పెరిగితే తన తోటి స్నేహితులతో ఆటలలో గెలవటం. అంటే బొంగరం త్రిప్పటం, గోళీలు గురిచూసి కొట్టటం అటుపై సైకిలు త్రొక్కటం ఇలా ఇలా లక్ష్యాలు మారుతూ ఉంటాయి. 

చిన్నప్పుడుగా వున్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకు భగవంతుని గూర్చి చెప్పటం గుడులకు గోపురాలకు పుణ్యక్షేత్రాలకు తల్లిదండ్రులతో వెళ్ళటం వలన భగవంతుడు ఒకడు వున్నాడని మనం ఆయనను ప్రార్ధిస్తే మనకు ఆయన అనుగ్రహం కలుగుతుందని ఇలా పసి వయసులోనే సంస్కారవంతులైన తల్లిదండ్రుల ప్రేరేపణతో భగవంతుని గూర్చి పిల్లలు ఆలోచిస్తారు. (ఇప్పుడు దైవచింతనగూర్చి పెద్దలు పిల్లలకు సరిగా చెప్పటం లేదు అందుకే సమాజంలో పాపాలు పెరిగి అశాంతి వృద్ధి అవుతున్నది) చదువుకునే పిల్లకు వుండే లక్ష్యం ఎక్కువ మార్కులు సంపాదించి పరీక్షలలో ఉత్తిరున కావటమే.  కాబట్టి తనకు మంచి మార్కులు రావాలని భగవంతుని వేడుకొంటారు.  తరువాత మంచి ఉద్యోగం, పెళ్లి, మొదలైన లక్ష్యాలు నెరవేరటానికి భగవంతుని ప్రార్ధించడం సర్వ సాధారణం. 

భగవంతుని ప్రార్ధించడం, పూజించటం ఆరాధించటం ఇవ్వన్నీ భక్తి మార్గాలు భక్తితో భగవంతుని అనుగ్రహం పొందాలనుకోవడం కూడా మంచిదే కానీ మన కోరికలు అన్నీకూడా కేవలం ఐహికపరమైనవే కోరికలు ఉండటం మంచిది కాదని భార్గవ శర్మ అనటంలేదు కానీ కొంత వయస్సు వచ్చిన తరువాత మనిషి ఐహికమైన వాంఛలకు బానిస కాకుండా ఐహికం కానిది ఏమిటి అనే ఆలోచన చేయాలి. 

మనిషి తానూ ఈ మానవ జన్మ పొందటం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక చక్కటి అవకాశంగా భావించాలి. ఎందుకంటె ఈ భూమి మీద మనిషి కన్నా పెద్దవి క్రూరమైనవి అయిన జంతువులను కూడా మనిషి తన బుద్ది బలంతో లొంగదీసుకోగలుగు  తున్నాడు. అంటే శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని వేరే చెప్పనవసరం లేదు. 

అంతిమ లక్ష్యం: 

మనిషి తన జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ లక్ష్యం మాత్రము మోక్షసాధన మాత్రమే కావాలి.  ఎందుకంటె భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ఇచ్చిన కారణం మనం ఈ జన్మలోనే జన్మరాహిత్యానికి కృషి చేయాలి. కాబట్టి మిత్రమా లే మేలుకో నీ లక్ష్యాన్ని తెలుసుకో ఇప్పుడే దానికి తగిన సాధన మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ