10, జులై 2022, ఆదివారం

గుండెనొప్పి నివారణకు సరైన యోగం -

 గుండెనొప్పి నివారణకు సరైన యోగం - 


     తానికాయ పైన చెక్కు ని పొడి చేసి 5 గ్రాములు , నాటు ఆవునెయ్యి 10 గ్రాములు , పాతబెల్లం 20 గ్రాములు వీటిని పావులీటరు నాటు ఆవుపాలలో కలిపి పూటకు ఒక మోతాదు గా రెండు పూటలా తాగుతుంటే గుండెల్లో నొప్పి , జీర్ణ జ్వరం , రక్తపిత్తం ( రక్తం కక్కే వ్యాధి ) హరించి పొతుంది. 


        

గురుపౌర్ణమి

 వందేమాతరం


*గురుపౌర్ణమి - నిజాలు - జాగ్రత్తలు*


_గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః'_


సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది.


_గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే_


అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం బోధిస్తోంది.


నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భాగవతం...., మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణిమ. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. 


ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో యతులు, పీఠాధిపతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకేచోట ఉండి జ్ఞానబోధన చేస్తుంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ రోజు తమకు సమీపంగా నివసిస్తున్న తప:స్సంపన్నులను దర్శించుకొని, పూజించి, జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది.  


దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.


"గురు పరంపరాసిద్ధ్యర్థం వ్యాసపూజాం కరిష్యే".


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరాః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువేనమః

లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్


అని భగవంతునితో ప్రారంభమైన గురుపరంపర వ్యాసభగవానునితో కొనసాగి, మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది. కనుక వ్యాసభగవానుని ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి. వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువులు మనకు ఉపదేశిస్తారు.


మనకు గురువులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వారిని దర్శించుకోండి.


ఈ చరాచర సృష్టికి మూలమైన ఆదిగురువు ఆదియోగి పరమేశ్వరుని దర్శించుకోండి.


ఈ జగత్తుకు గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ ను దర్శించుకోండి.


సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోండి.


శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళి ధ్యానం చేయండి.


ఆది శంకరాచార్య వద్దకు వెళ్ళండి.


కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?

కొంచమైన ఆలోచిస్తున్నారా?


గురువారం అనగానే ఈ బాబావారంగా మార్చి పడేసారు.


ఇది ఎంతవరకు అర్థవంతం? 

ఆలోచించాలి. నిత్యం తన మత విధానాలలో ప్రార్థన చేస్తూ ఏనాడు మన హిందూ ధర్మ విషయాలను ఆచరించని, కనీస ఎవరికి ధర్మ బోధన చేయని వ్యక్తి మనకు గురువు ఎలా అవుతాడు.


ఒక్క సారి మనమేంటి?

మన వారసత్వం ఏంటి? 

మన పూర్వీకులు ఎవరు?

మన ఆదర్శనీయులు ఎవరు? 

ఆలోచించాలి.


ఈ ఫకీర్ ఎవ్వరికి గురువు కాదు, ఆఖరికి ఇస్లామీయులకు కూడా కాదు. పైగా ఈయన పుట్టింది గురుపౌర్ణమి రోజు కూడా కాదు.

 

కనీసం ఒక్క సారి ఆలోచించండి.

ఇంకా గురువుల దర్శనం చేసుకోవాలంటే...

ఈరోజు సమాజం లో చాలా మంది హిందూ స్వామీజీలు ఉన్నారు.

వారి వద్ద కు వెళ్ళండి..వారిని పూజించండి, వారి ఆశీస్సులు తీసుకోండి.

వారితో పాటు మనకు చదువు చెప్పిన గురువులను దర్శించుకోండి.

మన తల్లి తండ్రులకును మించిన గురువు లెవరు?‌ వారి ఆశీస్సులు తీసుకోండి.


అంతేగాని, గురు స్థానంలో ఉండవలసిన హైందవ ధర్మ అభ్యున్నతికే కృషి చేసిన ఎందరో మహానుభావులను, కారణజన్ములను విస్మరించి, మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని విచ్చిన్నం చేయడానికి వచ్చిన హిందూయేతర మతస్తులను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి.


ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి.


రేపటి తరానికి విలువలతో కూడిన మన సనాతనధర్మ విశిష్టతను స్వచ్ఛంగా అందజేయండి.


తస్మాత్ జాగ్రత్త


మీ

మృశి

భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:*

 *గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:*


స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము.

ఒక రోజుకు ఖలిలమౌతాడు.

ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.

పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.

ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.

రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.

మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.

నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.

ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.

ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు. అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.

గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు.

ఓ శ్రీహరీ నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను. ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.

మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము.

గరుడ పురాణ ప్రధమాధ్యాయ ఇహిక, ఆనుష్మిక, దుఃఖ నిరూపణము నుండి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వైద్యో నారాయణ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

వైద్యో నారాయణ: 


సుధా నర్సింగ్ హోమ్ లో అడుగు పెట్టారు గుర్నాధం గారు.

రెండు రోజుల నుండి కొంచెం బాధ గా  ఉంది..డాక్టర్ ని కలిస్తే మంచిదని వచ్చాడాయన.. డాక్టర్ పరాంకుశం పేరున్న డాక్టర్..కానీ జనాల్ని పీడించుకు తింటాడని మహా చెడ్డ పేరు...


వైద్యం మటుకు  చాలా బాగా చేస్తాడు..మంచి పేరుంది ఆ విషయం లో...


డాక్టర్ గారి రూం లోనికి అడుగుపెట్టారు గుర్నాధం గారు.


"నమస్తే ..రండి.. ఇక్కడ కూర్చోండి.. ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ సమస్య..? "


"నాకేం కాలేదు .బాగానే ఉన్నాను.. కానీ ఎందుకో బాధ గా ఉంది.."


"ఎక్కడ నొప్పి ??"


"చెప్పలేను సరిగ్గా ..."


"అలా అయితే ఐదారు టెస్టులు చేయిద్దాం.. అప్పుడు తెలుస్తుంది..."


"నా సమస్య  నాకు వచ్చింది కాదు.."


"మరి ?? "


"సమాజం లో ఇలా అవినీతి పేరుకు పోవడం చూసి బాధ గా ఉంది.. సమాజానికి ఏమైనా టెస్టులు  చేయించండి .. "


"మీకేమైనా మతి పోయిందా ? మీరు రావలసిన చోటు ఇది కాదు..  ప్రజా సమస్యలను పరిష్కరించ డానికి ముఖ్య మంత్రిని , లేదా ఇతర మంత్రులను కలవండి.. మీరు వెళ్ళండి.. నాకు చాలా పేషంట్స్ ఉన్నారు.. వాళ్ళను చూడాలి.."


"అలాగే.. వెళ్ళే ముందు ఒక్క మాట.. నేను , నువ్వు కూడా ఈ సమాజం లో భాగమే.. నేను ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశాను.. నువ్వు..అదే మీరు..."


"భలే వారే.. మీరు నా కంటే చాలా పెద్ద వారు.. నువ్వని పిలవండి పరవాలేదు.."


"మంచిది నాయనా..  ఇప్పుడు నేను వెళ్లి పోతాను.. అందరూ నీలాంటి అదృష్టవంతులు కారు..చాలా మంది శాపగ్రస్తులు..వాళ్ళను దేవుడిలా కాపాడే బాధ్యత నీదే..

... ఇప్పుడు నువ్వు చూడబోయే పేషంట్స్ లో ఉన్న పేద వాళ్ళను రోజుకు ఇద్దర్ని ఏం ఫీజు లేకుండా, నువ్వే అన్నీ ఖర్చులు భరించి టెస్టులు చేయించి ట్రీట్మెంట్ చేయించు.. ఇలా వారం రోజులు చెయ్యి.. నేను వారం తరువాత మళ్లీ వస్తాను.. అప్పుడు మాట్లాడుదాం..నీకు నచ్చితేనే.. మంచిది అనిపిస్తేనే చెయ్యి.. బలవంతం ఏం లేదు... నువ్వు ఫీజు తీసుకో నంత మాత్రాన పేద వాళ్ళ జీవితాలు మారవు.

కానీ వాళ్లకు అంధకారంలో ఆశాకిరణం కాగలవని మాత్రం చెప్ప గలను.."ప్రతి రోజూ చావుని దగ్గర గా చూసే  డాక్టర్లు ..మీరే ఆస్తులు పోగేసుకుంటుంటే నాకు విచిత్రం గా ఉంది.. మీ డాక్టర్లకే  వైద్యం చేయించాలి బాబూ.. ఏమనుకోకు .. "


వెళ్లి పోయారు గుర్నాధం గారు.


డాక్టర్ పరాంకుశం ఆలోచనలో పడ్డాడు అయిదు నిముషాల పాటు.. 


ఎవరీ ముసలాయన ?? పిచ్చి వాడు కాదు గదా..

 సమాజం, అవినీతి, ఆశాకిరణం , ఆస్తులు .. పోగేసు కోవటం ..అంటూ  పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు... 

ఆయనను చూస్తే కోపం రావటం లేదు .

గౌరవం కలుగు తోంది.. తను బోలెడు సంపాదించాడు.. నర్సింగ్ హోమ్ కట్టుకున్నాడు... రెండు మేడలున్నాయి.. హైదరాబాద్ శివార్లో నాలుగెకరాల భూమి ఉంది.. బ్యాంక్ బ్యాలన్స్ 4-5 కోట్లు పైనే ఉంటుంది..

ఇప్పుడు తన వయసు 50 యేళ్లు.. ఉన్న ఒక్క అబ్బాయి కూడా ఎండీ చేశాడు.. అమెరికా లో ఉన్నాడు .. తను, భార్య పంకజం ...మాత్రమే ఇక్కడ... 


కొడుకు , కోడలు అమెరికా లోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ.. తాము బ్రతికి ఉండగా ఇండియా వస్తాడో రాడో తెలియదు... నిజంగానే  తనకు జబ్బు చేసిందా ?? 

వైద్యం చేయించుకోవాలా  ?? 


ఏమిటీ ఆలోచనలు.. ?


బెల్ నొక్కాడు.. తరువాతి పేషంట్ కోసం..


ఒకావిడ చిన్న పాపని తీసుకు వచ్చింది.. నిన్నటి నుండి జ్వరం డాక్టర్ గారు... కంగారుగా ఉంది..


"ఏం పరవాలేదు ..తగ్గి పోతుంది.. ఊళ్ళో వైరల్ జ్వరాలు ఉన్నాయి.."


"ఇవిగో ఈ మందులు ఇదే క్లినిక్ లో ఉన్న మందుల షాపు లో తీసుకోమ్మా.. మళ్లీ మూడు రోజుల తరువాత వచ్చి చూపించు.. తగ్గిన తరువాత బలమైన ఆహారం పెట్టు..తొందరగా కోలుకుంటుంది అమ్మాయి...."


"కూలీ నాలీ చేసుకునే వాళ్ళం బాబు.. తిండి దొరకడమే గగనం.. మంచి తిండి తినే భాగ్యం మాకు లేదు.."బాధ తో చెప్పింది..


డాక్టర్ బెల్ కొట్టాడు.. బోయ్ రాగానే చెప్పాడు.. "ఈవిడ దగ్గర తీసుకున్న 300 రూపాయల ఫీజు తిరిగి ఇచ్చేయండి.. అలాగే మన మందుల షాపులో మందులు కూడా డబ్బులు తీసుకోకుండా ఇవ్వమని గంగాధర్ కి చెప్పు..నాతో ఫోన్లో మాట్లాడ మని చెప్పు..నేను చెప్తాను.."


"అలాగే సర్.. " నమస్కారం చేసి.. "మీరు రండమ్మా నాతోబాటు. ..".వచ్చినావిడ వంగి వంగి దండం పెడుతూ  బయటకు వెళ్ళింది..


డాక్టర్ పరాంకుశం ఆశ్చర్య పోయాడు.. తనలో వచ్చిన మార్పుకు.. ఏదో తెలియని ఆనందం... రూం బయట ఉండే బాయ్ నమస్కారం చేయడం చిత్రంగా అనిపించింది...  వాడెప్పుడూ ఉదయం వచ్చినప్పుడు మాత్రమే అలా పెడతాడు.. 


బెల్ నొక్కాడు..మరో పేషంట్..


ఖరీదయిన పేషంట్ లా ఉన్నాడు.. వేళ్లకు రవ్వల ఉంగరాలు ఉన్నాయి... చెప్పండి..


"డాక్టర్ గారూ.. నాకు కొంచెం అజీర్తి గా ఉంది..రెండు రోజుల నుండి..తిన్నది అరిగినట్లు లేదు.. కాస్త మంచి మందు ఇవ్వండి.అలాగే తగ్గిన తరువాత మళ్లీ బాగా ఆకలి వేయటానికి .. ""


"అలాగే.. ఇక్కడ ఈ బెడ్ మీద పడుకోండి.. కాస్త చూస్తాను.."


"ఈ మాత్రలు మూడు రోజులు వేసుకోండి ..రెండు పూటలా..తగ్గిపోతుంది ..మళ్ళీ రానక్కర లేదు..."


అలాగే డాక్టర్ గారు.. వెళ్ళిపోయాడు అజీర్తి పేషంట్ ..


ఆకలి మంటలు ఒక వైపు..

అన్నపు రాశులు ఒక వైపు..  


ఒక మంచి కవి రాసిన మంచి పలుకులు గుర్తొచ్చాయి డాక్టర్ కి..


ఆ పూట ఇంకో పది మంది పేషంట్స్ ని చూసాడు డాక్టర్..అందరూ  కాస్తో కూస్తో డబ్బున్న వాళ్లే.. ఫీజు ఇస్తున్నాం కదా ఎవరి కోసం చేస్తాడీ డాక్టర్ అనే భావన తో ఉన్నట్లు అనిపించింది... మొదటి సారి బాధనిపించింది...


సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నర్సింగ్ హోమ్ కి వచ్చాడు డాక్టర్..

పది మంది  పేషంట్స్ ఉన్నారు.. అందర్నీ చూసాడు.. దాదాపు అందరూ పేద వాళ్లే... ఏ రోజుకారోజు కూలి డబ్బులు సంపాదించే వాళ్లే.. ముసలాయన మాటలు గుర్తుకు వచ్చాయి... వాళ్ళెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు.. మామూలు మందులు కూడా ఫ్రీ... మరీ ఖరీదు అయినవి అయితే  మూడొంతులు తగ్గించి ఇవ్వగలిగిన వాళ్ల దగ్గర తీసుకున్నాడు.. 


అందరూ వెళ్లిన తరువాత మెడికల్ స్టోర్ గంగాధర్ వచ్చి చెప్పాడు..ఈ రోజు 12 వేల రూపాయల మందులు ఫ్రీ గా ఇవ్వాల్సి వచ్చింది...


"పరవాలేదులే .. లెక్కలు అన్నీ సరిగ్గా రాసి ఉంచు..తరువాత చూస్తాను.. "చెప్పాడు డాక్టర్...


బయట రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వచ్చింది.. "ఉదయం నుండి ఇప్పటికి 18 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాం.. 12 మంది దగ్గర అసలు తీసుకోలేదు.. డాక్టర్  ""


"పరవాలేదు... రోజూ నేను చెప్పినట్లే చేయండి..."


"అలాగే డాక్టర్ గారూ .."వెళిపోయింది..


ఆ రోజు చాలా సంతోషంగా ఉంది..  రాత్రి 8 గంటలకు తను, పంకజం కారులో బయటకు వెళ్లారు..  ముందు హిమాయత్ నగర్ లోనున్న వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.. మొదటి సారి స్వామి వారు తనకు కొత్తగా కనబడ్డారు..ఎందుకో..


గుడి బయట ఉన్న ముష్టి వాళ్లకు డబ్బులిచ్చి  మరీ చెప్పాడు.. ఒరేయ్.. మీకు వైద్యం కావాలంటే మా నర్సింగ్ హోమ్ కి రండి..ఊరికే చూస్తాను.. 


అలాగే బాబూ.. ధర్మ ప్రభువులు..


భార్య పంకజానికి మాత్రం భర్త లో వచ్చిన మార్పు బాగుంది..  


గుడి నుండి దగ్గరలో మినర్వా హోటల్ కి వెళ్ళారు..

రెండు కాఫీ మాత్రమే తాగారు.. సర్వర్ కి టిప్ మాత్రం 50 రూపాయలు ఇచ్చాడు.. ఎప్పుడూ భర్త టిప్ ఇవ్వడం చూడలేదు పంకజం..


ఆ రాత్రి డాక్టర్ కి బాగా నిద్ర పట్టింది ... కలలో దేవుడు ఏదో అంటున్నాడు.. సరిగ్గా అర్థం కాలేదు..

మరుసటి రోజు ఉదయం నర్సింగ్ హోమ్ కి వెళ్ళాడు.. తిరునాళ్ల లా ఉంది నర్సింగ్ హోమ్.

 చాలా మంది పేద వాళ్ళు వచ్చారు.. ఆ రోజు రాబడి ఇంచు మించు సున్న..

ఆలోచించాడు.. ఇలా కాదు.. ఏదో చెయ్యాలి..


రోజుకు యాభై మందికి టోకెన్లు ఇవ్వడం మొదలు పెట్టాడు.. ఫ్రీ గా వైద్యానికి..మందులకు.. 


సుధా నర్సింగ్ హోమ్ పేరు మారు మోగి పోయింది.. డాక్టర్ ని ఆకాశానికి ఎత్తేశారు పత్రికల వాళ్ళు.. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూలు.. మార్పుకు కారణం అడిగారు...ఏం చెప్పాలో తెలియలేదు..మా అబ్బాయి వలన నేను ఇలా మారాను.. చెప్పాడు చటుక్కున..


అమెరికా లో ఉన్న కొడుకు చూసాడు ఆ టీవీ ఇంటర్వ్యూ.. తల్లే కొడుక్కి చెప్పింది చూడమని..


ఆ రాత్రి ఫోన్ చేశాడు తండ్రికి.. 

డాక్టర్ చెప్పాడు.. "నువ్వెలాగూ  ఇక్కడకు రావు..మేము అక్కడకు రాలేము.. మా బ్రతుకులు ఇక్కడే .. ఈ ఆస్తులు ఎవరి కోసం.. సంపాదించింది చాలు.. ఇంకా వద్దనుకుంటున్నాను.. మాకు ఉన్నది చాలు... నీకు కావాలంటే చెప్పు,.. మళ్లీ సంపాదిస్తాను .."


"వద్దు నాన్నా... నువ్విలా పేరు తెచ్చుకుంటే నాకు గర్వంగా ఉంది.. నీ పక్కనే ఉండాలని ఉంది.. "


"సరే లే.. జాగ్రత్త.. కోడల్ని అడిగినట్లు చెప్పు.. పిల్లల్ని చూడాలని ఉంది..దసరా పండక్కి రావటానికి ప్రయత్నం చెయ్యి..." చెప్పాడు కొడుక్కి..

కొడుకు సమాధానం చెప్పలేదు..


ఆ రాత్రి తల్లీ కొడుకులు చాలా సేపు మాట్లాడు కున్నారు.. నాన్న యజ్ఞం చేస్తున్నారు రా... ఒక్కరే... 


వారం రోజులు గడిచాయి.. 


అంతకు ముందు వచ్చిన ముసలాయన మళ్లీ వచ్చాడు నర్సింగ్ హోమ్ కి..  అక్కడ ఉన్న స్టాఫ్ కి తెలుసు ఆయన వచ్చిన తరువాత డాక్టర్ గారు మారారని.. అలాగే తమందరకీ మంచి పేరు వచ్చిందని.. ఆయన రాగానే అందరూ లేచి నుంచుని గౌరవం వ్యక్తం చేశారు.. డాక్టర్ రూం లోనికి ముందు పంపారు...


ఆయన రాగానే గుర్తు పట్టాడు డాక్టర్ పరాంకుశం ..వెంటనే లేచి నమస్కారం చేశాడు .. మీ వలన నేను మారాను .. మీరెవరో నాకు తెలియదు.. నన్ను మళ్ళీ మనిషిని చేసినందుకు ధన్యవాదాలు... వంగి దండం పెట్టాడు..


ముసలాయన .. నూరేళ్ళు వర్ధిల్లు నాయనా.. నాకు ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది.. వెళ్ళొస్తాను.. డాక్టర్ మాట్లాడే లోపల వెళ్లి పోయాడు.. 


ఆయన వెళ్తూ వెళ్తూ రిసెప్షన్ లో ఏదో కాగితం ఇచ్చాడు.. డాక్టర్ కి ఇవ్వమని చెప్పి.. 

అప్పుడే డాక్టర్ దగ్గర నుండి వచ్చినాయన ఈ కాగితం అక్కడే ఇవ్వచ్చు కదా... అర్థం కాలేదు వాళ్లకు..


డాక్టర్ ఆ కాగితం చదివాడు..


 "ఒరేయ్ గుర్నాధం.. ఎలా ఉన్నావు ?"నేను బాగానే ఉన్నాను పైపైన.. లోపల ఏం బాగో లేదు.. ఉన్న ఒక్క కొడుకుని డాక్టర్ చేశాను..నీకు తెలుసు... మా ఆనందానికి అంతు లేదు వాడు డాక్టర్ అయినప్పుడు.


ఇప్పుడు నర్సింగ్ హోమ్ కూడా కట్టాడు.. వాళ్ళ అమ్మ పేరు పెట్టాడు.. సుధా నర్సింగ్ హోం... కానీ తల్లి మంచి తనం రాలేదు.

డబ్బు సంపాదన లో పడ్డాడు.. పేద వాళ్ళను కూడా వదలటం లేదు.. వాడు చేస్తున్న పని దేవుడికి కూడా నచ్చ లేదు..సుధని తీసుకు వెళ్లి పోయాడు..వాడికి  ఉన్న ఒక్క కొడుకు.. అదే నా మనవడు అమెరికా వెళ్లి పోయాడు.. వాడితో నేను కూడా ఉండలేక మా ఊరు.. ఉండ్రాజ వరం వచ్చేశా..సొంత ఇంట్లో నే ఉంటున్నా ఒక్కడినే..నేను.. నీ చెల్లెలు  సుధ మూడేళ్ల క్రితం వెళ్లి పోయింది.. నేను ఒంటరిని.. నా కొడుకు ఒంటరి.. మనవడు ఒంటరి... కొడుక్కి చెప్పినా వింటాడని నాకు నమ్మకం లేదు.

 ఉన్న తేలికయిన బంధం కూడా తెగి పోతుందేమో నన్న భయం నన్ను మాట్లాడ నివ్వ లేదు.. చిన్న నాటి స్నేహితుడవు నీకయినా నా బాధ చెప్పుకోలేక పోతే ఎలా.. అందుకే ఇలా ఉత్తరం రాస్తున్నాను.. ఫోన్ చేసి నీతో మాట్లడ లేను.. పొలాలు చూసుకోవాలనే నెపం తో కొడుకు దగ్గర నుండి వచ్చేసాను.. నీ చెల్లెలి పిలుపు వచ్చే లోపల మా వాడు మారితే బాగుండును..

మీరంతా క్షేమమని తలుస్తాను..


ఉంటాను..

నీ బాల్య మిత్రుడు


సుబ్బరామయ్య.


 

డాక్టర్ పరాంకుశం చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు..కళ్ళు తుడుచు కోవటం కూడా మరచి పోయాడు.. చూస్తున్న  స్టాఫ్ ఏం మాట్లాడలేక పోయారు..


రాత్రి భార్య పంకాజానికి అంతా చెప్పాడు వివరంగా ...ఉదయమే నాన్న దగ్గరకు వెళ్ళాలని..

ఉదయమే లేచి బయలు దేరారు.. కారెక్కబోతుంటే ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి కొడుకు , కోడలు, మనవరాళ్లు దిగారు.. సంతోషం పట్టలేక పోయారు.. మిమ్మల్ని చూడాలని అనిపించింది నాన్నా.. దసరా వరకూ ఆగ లేక పోయాను.. 


అప్పుడే ఇంకో పాత కారు వచ్చి ఆగింది... దాంట్లో నుండి తండ్రి, ఆ ముసలాయన దిగారు..


పరాంకుశం , అతని భార్య పంకజం ఆ ఇద్దరి కాళ్ళకు దండం పెట్టారు..


లేరా.. లే.. నువ్వు మారుతావను కోలేదు.. వీడు నా స్నేహితుడు.. గుర్నాధం... స్కూలు మాస్టరు గా చేసి రిటైర్ అయ్యాడు.. పిల్లలను బాగు చేయటమే వీడి పని.. అంటూ ఆ ముసలాయన జబ్బ మీద ఒకటిచ్చాడు చిన్నగా..


పిల్లల్ని కాదు.. ఈ తాతయ్య మమ్మలని కూడా మార్చాడు..  ఫోన్ లో ఆయన మాట్లాడిన విషయాలన్నీ చెప్పాడు  పరాంకుశం కొడుకు.. మేము తిరిగి వచ్చేశాం నాన్నా.. అమ్మమ్మ తోటే ఉంటాం.. అదే సుధా నర్సింగ్ హోమ్ లో డాక్టర్లు గా..

 అమ్మ కూడా చెప్పింది నువ్వు యజ్ఞం చేస్తున్నావని..వీలుంటే అన్నీ సర్దుకుని వచ్చేయండి.. లేకపోతే మేం పోయిన తరువాతనే రండని చెప్పింది అమ్మ..

 అమ్మ ఎప్పుడూ ఏమి అడగలేదు.

 అందుకే  అమ్మ మాట మీద గౌరవం ఉండి వచ్చేశాం.. ఇండియాకి.. పూర్తిగా...


ఆ రోజు నుండి సుధా నర్సింగ్ హోం తెలియని వాళ్ళు లేరు....


ప్రతి డాక్టర్ తలచుకుంటే ఒక సుధా నర్సింగ్ హోమ్ ప్రతి వీధి లో ఉండి తీరుతుంది.. 


ముసలాయన మాత్రం తనకు వస్తున్న పెన్షన్ డబ్బులను ప్రతి నెలా డాక్టర్ పరాంకుశానికి ఇస్తూనే ఉన్నాడు.... దేవుడి తలంబ్రాలలో కలిపే ముత్యాల్లా.. ఆ డబ్బులను తన డబ్బులతో కలిపి ప్రజా సేవ చేస్తూనే ఉన్నాడు కొడుకుతో కలిసి డాక్టరు పరాంకుశం ... 

మునుపెన్నడూ అంత ఆనందం కలగ లేదు .

వెతుక్కుంటే ఆనందం కూడా మన పక్కనే ఉంటుందని తెలిసింది పరాంకుశానికి మొదటి సారిగా..

 


- కోసూరి లక్ష్మణ రావు

సేకరణ:  శర్మద గారి వాట్సాప్ పోస్ట్ 


💐💐🌺🌺🌸🌸

తొలి(శయన) ఏకాదశి

 ॐ        తొలి(శయన) ఏకాదశి శుభాకాంక్షలు 


ఆషాఢ మాసం - ప్రత్యేకత - I 


మానవ  - దేవతల కాల పరిమాణం 


      మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.

      సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణంతో దేవతల పగలు ప్రారంభం.

      సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయనంతో దేవతల రాత్రి ప్రారంభం.

       మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము.    


యోగనిద్ర - ఏకాదశులు     


      24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తున్నట్లు, 

      12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో, 


శయన ఏకాదశీ (తొలి ఏకాదశీ)    


       దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక,  

       వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశినాడు    

       శ్రీమహావిష్ణువు "యోగనిద్ర"లోకి ప్రవేశిస్తాడు. దానిని శయన ఏకాదశీ అంటారు. అదే ఈరోజు.    

    శయన - పరివర్తన - ఉత్థాన - వైకుంఠ (ముక్కోటి) ఏకాదశులలో మొదటిది కాబట్టి ఈ శయన ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు.  


పరివర్తన ఏకాదశీ     


       మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు అటువాడు ఇటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటాడు. దాన్ని పరివర్తన ఏకాదశీ అంటారు.    


ఉత్థాన ఏకాదశీ      


        మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని ఉత్థాన ఏకాదశీ అంటారు. 


వైకుంఠ (ముక్కోటి) ఏకాదశీ   


      దేవతల రాత్రి అయిన దక్షిణాయణం ప్రారంభం కాగానే శయనించి, 

      వారి పగలు అయిన ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు, 

      వారి తెల్లవారు ఝాము ధనుర్మాసంలోని శుక్ల ఏకాదశి అయిన  ముక్కోటి(వైకుంఠ) ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో  ముక్కోటి దేవతలకు దర్శనమనుగ్రహిస్తారు. 


యోగనిద్ర        


     యోగము అంటే కలయిక.    

    "యోగనిద్ర"లో ఈ నాలుగు మాసాలూ స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం"  ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు. 


సందేశం          


      మనకి తనతో యోగం కల్పించే సంకల్పంతో స్వామి "యోగ నిద్ర"లోకి వెళ్ళే ఈ శుభ సమయంలో, 

       మనం దైవాన్ని మరింత ఏకాగ్రతతో ప్రార్థించి లబ్ధి పొందుతాం. 

      తద్వారా, జీవాత్మ - పరమాత్మల యోగంగా (కలయికగా), 

      మనలోని దైవాన్ని తెలుసుకొంటాం.

     

                                కొనసాగింపు  


                             =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

ఏకాదశి

 👉 సంవత్సరం  మొత్తం మీద

వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సస్సుఖినదశి.🙏🙏🙏

రేపు జూలై 10 ఆదివారం తొలి_ఏకాదశి*

తొలి_ఏకాదశి విశిష్టత*


🌺 ఆనందంతో పాటు ఆరోగ్యం... 🌺


హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం..


ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి ’ గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు.


ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామి వారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.


🌺 పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం 🌺


ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.


కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట.


నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించిw విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.


🌺ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి?🌺

W

ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.


తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతే కాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.


వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

సర్వే జనా స్సుఖినోభవంతు

పద్యము

 . ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          …… పొడుపు పద్యము …...

ఆ. అలరు పదము జూడ నైదక్షరమ్ములు 

అరయ మొదటి రెండు ''నధిక'' మగును 

చదువ చివరి మూడు ''సత్తువ'' యగుచుండు 

పదము తెలుప వలయు పసిడి బాల..! 90  

జవాబు ..? తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన

నాతి మొదటివర్ణముబోవ నాడియగును

కొమ్మ మొదటిదితుదిగూడ కురజమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగులేమ

పి.మోహన్ రెడ్డి.

నిన్నటి జవాబు ... (అత్తము)

సూపం వినా

 శ్లోకం:☝️

 *సూపం వినా భోజన మప్రశస్తం*

*యూపం వినా యాజన మప్రశస్తం l*

 *ధూపం వినా పూజన మప్రశస్తం*

*దీపం వినా మైథున మప్రశస్తం ll*


భావం: పప్పు లేని భోజనము, యూపము (యజ్ఞమునందు పశుబంధనార్థం నాటిన స్తంభము) లేని యజ్ఞము, ధూపము లేని పూజ, దీపములేని కూటమి; - ఇవి ప్రశస్తములు కావు.

నాల్గవ దానిలో (ముఖ్యంగా తొలిరాత్రికి) దీపాన్ని ఆర్పివేయడాన్నే చూపిస్తుంటారు సినిమాలలో!