ॐ తొలి(శయన) ఏకాదశి శుభాకాంక్షలు
ఆషాఢ మాసం - ప్రత్యేకత - I
మానవ - దేవతల కాల పరిమాణం
మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణంతో దేవతల పగలు ప్రారంభం.
సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయనంతో దేవతల రాత్రి ప్రారంభం.
మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము.
యోగనిద్ర - ఏకాదశులు
24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తున్నట్లు,
12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో,
శయన ఏకాదశీ (తొలి ఏకాదశీ)
దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక,
వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశినాడు
శ్రీమహావిష్ణువు "యోగనిద్ర"లోకి ప్రవేశిస్తాడు. దానిని శయన ఏకాదశీ అంటారు. అదే ఈరోజు.
శయన - పరివర్తన - ఉత్థాన - వైకుంఠ (ముక్కోటి) ఏకాదశులలో మొదటిది కాబట్టి ఈ శయన ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు.
పరివర్తన ఏకాదశీ
మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు అటువాడు ఇటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటాడు. దాన్ని పరివర్తన ఏకాదశీ అంటారు.
ఉత్థాన ఏకాదశీ
మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని ఉత్థాన ఏకాదశీ అంటారు.
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశీ
దేవతల రాత్రి అయిన దక్షిణాయణం ప్రారంభం కాగానే శయనించి,
వారి పగలు అయిన ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు,
వారి తెల్లవారు ఝాము ధనుర్మాసంలోని శుక్ల ఏకాదశి అయిన ముక్కోటి(వైకుంఠ) ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలకు దర్శనమనుగ్రహిస్తారు.
యోగనిద్ర
యోగము అంటే కలయిక.
"యోగనిద్ర"లో ఈ నాలుగు మాసాలూ స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు.
సందేశం
మనకి తనతో యోగం కల్పించే సంకల్పంతో స్వామి "యోగ నిద్ర"లోకి వెళ్ళే ఈ శుభ సమయంలో,
మనం దైవాన్ని మరింత ఏకాగ్రతతో ప్రార్థించి లబ్ధి పొందుతాం.
తద్వారా, జీవాత్మ - పరమాత్మల యోగంగా (కలయికగా),
మనలోని దైవాన్ని తెలుసుకొంటాం.
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి