29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సూర్య నారాయణ దండకం*

 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

 *సూర్య నారాయణ దండకం*

        (ఆడియో సహితం)

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా మహాభూతభేదంబులున్ నీవయై బ్రోవు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!*


*సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య యోయయ్య దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!*


*శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!*


*సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక శూరోత్తమా యొప్పులం తప్పులున్  నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!*


*సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవచూడామణీ।*


*శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!*

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*ఓం శ్రీ సూర్యనారాయణ నమః।*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

ధర్మసూక్ష్మం

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐   

 *ధర్మసూక్ష్మం అంటే ఏమిటి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*‘ధర్మో రక్షతి రక్షితః’ అను సూక్తి అందరికీ తెలిసినదే. మనం ధర్మాన్ని రక్షిస్తే... ఆ ధర్మం మనలను రక్షిస్తుంది... అని దాని అర్థం.*


*రక్షించడం అంటే.. కత్తి, కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడం కాదు. ఆచరించదగినది ధర్మం. అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి.*


*‘సత్యమునే పలుకుము... అసత్యము పలుకరాదు’ అనే సూక్తి మనకు తెలిసిందే. ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణపురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు.*


*అయితే...‘ప్రాణ, విత్త, మానభంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యునిచేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు. అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాలలోనే అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు. మరి ఈ సంగతి తెలియకనేనా పోతనంతటివాడు, వ్యాసభగవానుని బాటలో నడిచి అలా పలికాడు?*


*‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితో పాటు ‘నిదానమే ప్రధానం’ అనే మరొక సూక్తి కూడా ఉంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి. అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను.*


*దండకారణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకుని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఋషి ధర్మనిష్ఠాగరిష్ఠుడు...సత్యవాది. అతని ఆశ్రమానికి రెండు ప్రక్కల అరుగులు ఉన్నాయి. ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఆవు ప్రాణ భయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందునుంచి పరుగెత్తుకుని వెళ్లింది. అది చూసాడు ఆ ఋషి. ఓ వేటగాడు ఆ ఆవును తరుముతున్నాడని గ్రహించాడు. వేటగాడు వచ్చి ‘ఇలా ఆవు వెళ్ళిందా’ అని అడిగితే ‘అబద్ధం ఆడరాదు’ అనే దర్మానికి కట్టుబడి ‘వెళ్ళింది’ అని చెప్పాలి. అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు. ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీదనుంచి లేచి, ఎడమవైపు అరుగుమీద కూర్చుని, శిష్యులను మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోదన చేస్తున్నాడు. కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి ‘అయ్యా...ఇలా ఏదైనా ఆవు పరుగెత్తుకుని వెళ్లిందా?’ అని ఆ ఋషిని అడిగాడు. గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు. ఆ ఋషి వేటగాని వంకచూసి ‘నాయనా.. ఈ అరుగు మీద కూర్చుని నా శిష్యులకు పాఠం చెప్తున్నప్పటినుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు’ అని బదులిచ్చాడు. వేటగాడు సంతృప్తిచెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుననప్పుడు ఆవు వెళ్లింది సత్యం. అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవు అటు వెళ్లలేదు. అదీ సత్యమే. అదే చెప్పాడు ఆఋషి. ఋషి అసత్యము ఆడలేదు. ఆవు రక్షించబడింది. ఇదీ కథ.*


*మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూక్తితని పాటించాలి. చెడు పని చేసే విషయంలో ‘నిదానమే ప్రదానం’ అనే సూక్తిని పాటించాలి. అదే దర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగినవాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.*


*సర్వే జనా సుఖినోభవంతు।*


*ఓం నమఃశివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

దసరా పండుగ విశేషాలు*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  *దసరా పండుగ విశేషాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.*


*నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.*


*సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.*


*పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.*


*శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.*


*ఓం శ్రీ మాత్రే నమః।*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

సప్త వ్యసనాలు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సప్త వ్యసనాలు-వాటి దుష్ఫలితాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు.*


*వెలది, జూదం, మద్యం, వేట, కటువుగా మాట్లాడటం, కఠినంగా దండించడం, డబ్బు దుబారా చేయడం.. ఈ ఏడింటిని సప్తవ్యసనాలు అంటారు.*


*(1) వెలది :~*


*అనగా పరస్త్రీ వ్యామోహం. ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వకాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.*

 

*(2) జూదం : ~*


*ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)*

 

*(3) మద్యపానం : ~*


*పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనేబ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో తన ప్రియ శిష్యుడైన కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు.* *నేటి సమాజంలో మద్యపానం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో  అందరికీ తెలిసినదే.*

 

*(4) వేట : ~*


*పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడివృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీరామచంద్రుడికి దూరమైరాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు !*

*(ఇదివరకంటే కృరమృగాల బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది, స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).*

 

*(5) కటువుగా (కఠినంగా, పరుషంగా)మాట్లాడటం : ~*


*దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే*. *(పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు.. ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని..!)*

 

*(6) కఠినంగా దండించటం :~*


*దీనికి కూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.*


*ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు.*

 

*(7) ఆఖరిది డబ్బు దుబారా:~*


*కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి!*

*ఈ సప్త వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.*


(*ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ దుర్వినియోగం కూడ ఒక పెద్ద వ్యసనమయింది.*)


*శ్రీ గురుభ్యో నమః।*

*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

    *శతం విహాయ భోక్తవ్యం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*శతం విహాయ భోక్తవ్యం*


*సహస్రం స్నాన మాచ రేత్।*


*లక్షం విహాయ దాతవ్యం*


*కోటిం త్యక్త్వా హరిం భజేత్॥*


*తాత్పర్యము:~*


*వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.*


*వ్యాఖ్య:~*


*ఈ సుభాషితం మనం నిర్వర్తించాల్సిన పనులకు ప్రాధాన్యత ఎలా కల్పించాలో చెప్తుంది. వందపనులున్నా భొజనం ముందు చేయాలి ఎందుకంటే ఆ వంద పనులు చేయటానికి కావలసిన శక్తి ఆహారం ద్వారానే వస్తుంది. వేయి పనులున్నా స్నానం చేయాలి ఎందుకంటే అశుభ్రత ఎదుటివారికి కూడా హానికారకం. లక్ష పనులున్నా దానం ముందు చేయాలి, ఏ క్షణమైనా మారిపోయే మనస్సు చిన్న కష్టానికో అవసరానికో చేద్దామనుకున్న దానం వాయిదా వేసేటట్లు చేస్తుంది. చివరగా కోటి పనులున్నా భగవత్ ధ్యానం మరిచిపోకుండా చేయాలి.*


*ఒక్క మాటలో చెప్పాలంటే మొదట భగవంతుడు. రెండు సమాజ శ్రేయస్సు. చివర స్వ విషయం లేదా స్వార్ధం.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

రుద్రం, మహారుద్రం

 రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి.... యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు.... దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు..... రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది..... ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.... ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.రుద్రాభిషేకాలు 8 విధములు అవి..*👇


రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…!!



1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.



2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.



3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు


4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు


5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు


6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు


7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు


8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు


9.ఇదండి సంగతి. ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.!మహాన్యాసము*_


అసలు *న్యాసం అంటే ప్రాధమిక అర్థం శుద్ధి చేయటం లేదా పవిత్రమొనర్చడం*. న్యాసము వైదిక, తాంత్రిక సాధనలలో ముఖ్యమైన భాగము. న్యాసములు అనేకములుగా ఉన్నప్పటికీ నాలుగు రకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అవి *రుషి న్యాసము, కరన్యాసము, మాత్రిక న్యాసము మరియు షడంగన్యాసము*.


 మహాన్యాసము అను పద్ధతిని మహా శివభక్తి తత్పరుడైన రావణుడు సూత్రీకరించాడు.


న్యాసములో చేతి వేళ్ళను మరియు వివిధ శరీర భాగములను తాకుతూ తత్ మంత్రమును లేదా బీజాక్షరాలను పలుకుతూ పవిత్రం చేసుకుంటారు. శివపూజకు ముందు మహా న్యాసం చేయడం తప్పనిసరి. వివిధ శరీరభాగాలలో వివిధ దేవతలను ప్రతిష్టించుకుని దైవత్వాన్ని నింపుకున్న అనుభూతిలో అత్యంత పవిత్రంగా, పరమ నిష్ఠగా పూజాదికాలు నిర్వహించడం భారతీయ దేవతార్చనలో ప్రధానం. ఈ విధంగా చేసిన పూజవల్ల సకలము సిద్ధిస్తుంది. హిందూ దేవతా  సాంప్రదాయాలలో కొన్ని వందల పూజాశాస్త్రములు, కొన్ని వేల పూజా విధులు లెక్కకు మించి రహస్యములైన సాధనాలు, వాటికి సంబంధిచిన న్యాసములు ఉన్నాయి. అవి మహా మహులకు తప్ప సామాన్యులకు అందవు. అవి మహాశక్తి వంతములై, నియమ నిష్ఠలతో కూడుకొన్నవై, సులభ సిద్ధిదాయకములై ఉన్నవి. కాబట్టి నిష్ఠాగరిష్టులు, తాత్విక చింతన కలిగినవారు, లోక క్షేమమును కాంక్షించు వారు మరియు లోకకల్యాణానికై సాధన చేయువారికి మాత్రమే అది కూడా గురువులనుంచీ మాత్రమే లభిస్తాయి. ఆ స్థాయికి చేరుకోవడం జన్మజన్మల పుణ్యం మరియు ఏకాగ్ర సాధన వలననే సాధ్యమవుతుంది. సంసారబంధములలో ఉన్నాకూడా సాధన చేయవచ్చని చాలామంది నిరూపించారు. ఇప్పటికీ పట్టు విడువకుండా సాధన చేసేవారు ఉన్నారు. సాధన చేయాలన్న బలమైన సంకల్పం మనల్ని సరైన గురువు దగ్గరకు చేరుస్తుంది. కావున మనందరమూ ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకైనా అనుసరించడం జీవితంలో చాలారకాలుగా మంచిని చేకూరుస్తుంది.


రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.


ఈ *11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి'అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసేఅభిషేకం 'లఘురుద్రాభిషేకం'*.


11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈఅభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.

పంచాంగం 29.09.2024 Sunday,

 ఈ రోజు పంచాంగం 29.09.2024 Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష ద్వాదశి తిధి భాను వాసర: మఘ నక్షత్రం సాధ్య యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి సాయంత్రం 04:49 వరకు.

మఘ ఈ రోజు పూర్తిగా ఉంది.


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:03


వర్జ్యం : సాయంత్రం 04:58 నుండి సాయంత్రం 06:44 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:28 నుండి 05:15 వరకు.


అమృతఘడియలు : రాత్రి 03:38 నుండి 05:25 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

హైందవం వర్ధిల్లాలి 15*

 *హైందవం వర్ధిల్లాలి 15*



సభ్యులకు నమస్కారములు.


*ధర్మ మరియు దేశ ద్రోహులను పసిగట్టాలి, నిరోధించాలి*:-  

ధర్మ మరియు *దేశ ద్రోహుల ఆగడాలకు విచ్చలవిడితనానికి అంతముండుట లేదు*. ప్రశాంతమైన ఊరేగింపులపై రాళ్ళ వాన, ప్రజా వాహనాల, ప్రజా ఆస్తుల విధ్వంసం, *మత విద్వేషాలు రెచ్చగొట్టే శిక్షణలు, వ్యాఖ్యలు, ఉపన్యాసాలు, ఏ జనాల ఓట్లతో గెలుస్తారో ఆ జనాల ఉనికికే ప్రమాదం తెచ్చే రాజాకీయ నాయకులు, జిహాదీ ఉగ్ర సంస్థలకు, లవ్ జిహాదీలకు "అప్రచ్చన వత్తాసు". విదేశాలలో మంత్రాంగాలు. జిహాదీలకూ బంగారు భూమి గా మారింది భారత దేశం.* నిజాయితీగా , నిష్పక్షపాతంగా వార్తలు అందించవలసిన శ్రవణ (Radio), శ్రవణ దృశ్యమాన మాధ్యమాలు (Tv) మరియు దిన, వార, మాస పత్రికలు వాస్తవాలను ప్రసారం చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్ లు కట్టి అందులో *అధికంగా దేశ ప్రతిష్ట దిగజార్చే వార్తలకు* పనికట్టుకుని పెద్ద పీట వేస్తున్నాయి.


ఇదిలా ఉండగా కొన్ని పార్టీల రాజకీయ నాయకులు మరియు కొన్ని మతాల దుష్ట నాయకుల *అపవిత్ర కలయిక* తో కుతంత్రాల రచన జరిగి అల్లర్లకు పునాదులు పడి రైళ్లు, ఇతర వాహనాల మరియు ప్రభుత్వ మరియు దేశ వాసుల వ్యక్తిగత ఆస్తులకు కూడా నిప్పు బెట్టడం జరుగుతున్నది. ఇటువంటి అపవిత్ర కలయిక దేశపు ఉనికికే ప్రమాదం.

 *ఇది కల్పితం కాదు*. 

దేశ వాసులందరికి ఇది పాత సమాచారమే. తగులబెట్టినవన్నీ దేశ సంపద , ప్రజల శ్రమ ఫలితము, ప్రజలు కట్టిన పన్నులే (taxes ) అను స్పృహ జనాలకు ఎప్పుడు కలగాలి. *కొందరి దుష్టుల వలన యావత్ దేశం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది*. 


ప్రజాస్వామ్యమంటే ఇదేనా. ఇంత విచ్చలవిడితనం ఇతర దేశాలలో కనిపిస్తుందా. *దేశ మరియు ప్రజా రక్షణ వ్యవస్థను గూడా రాజాకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు*. . ఇవన్నీ చూస్తూ ఉంటే *సెక్యులరిజం ఒక మిధ్య* లాగానో ఇంకా చెప్పాలంటే హిందూ మతం పై శ్రద్ధ కంటే ఇతర మతాలే అధికమా అను భావన కల్గుతున్నది. సనాతనమైన మన భారతీయ సంస్కృతి, చరిత్ర సమసిపోవలసిందేనా. *వీటన్నిటికీ మన బాధ్యత వుందా లేదా లేదా*. ఇవన్నీ గమనిస్తుంటే భారత దేశంలో హిందూ ధర్మ, సంస్కృతి, సంప్రదాయాల పునరుద్ధరణ ఐక్యత అవశ్యమని అనిపించుట తథ్యము. *కావున హిందు ధర్మ, సంస్కృతికి ఊపిరులాూదడానికి ప్రతి మనసా వాచా కర్మణా ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - ద్వాదశి - మఘా -‌‌ భాను వాసరే* (29.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హరి విలాసము

 హరి విలాసము 


హరిలీలల లెక్కించగ 

హర బ్రహ్మలకైన కాదు, నటులుండు తరి

న్నరయగ నరులగు మనకిక 

తరమే తెలియంగ మిగుల తర్కించంగన్

      

ఖగవాహనుతనయుని కడ 

నిగమంబులు దొంగలించి నీరధి జేరన్ 

దెగటార్చియు నసురాధము

జగముల తా బ్రోచె మిగుల సంతసమొందన్ 


సుర లసురులు సుధకొఱకును 

తరియించుచు నుదధి నున్న తరుణము నందున్ 

గిరి క్రుంగగ పరమేశుడు 

కరుణను జూపించి మోయ కఛ్చప మయ్యన్ 


కడు క్రూరుడు కనకాక్షుడు 

పుడమిని వడితోడ బట్టి పోడిమితోడన్ 

గడలిలొ ముంచగ విష్ణువు 

వడితో వధియించె నతని వరలియు కిటిగన్ 


హరి ఎక్కడ ? చూపించుమ !

హరియించుదు ననుచు బలుకు హాటకకశిపున్ 

హరియించగ హరి యంతట 

నరహరి రూపంబు దాల్చి నఖముల జంపెన్ 


బలిదనుజుని మదమణచగ

పలు నమరులమొరలు వినియు పటు వటువుగ తా 

నిలమూడడుగుల నడిగియు 

పలు లోకము లెల్ల గొలిచె పాదము తోడన్ 


అరయగ రజ తమ గుణముల 

ధరనేలుచు బ్రతుకు చున్న దర్పపు నృపులన్ 

నిరువది మారులు దిరిగియు 

పరశువుతో నరికె విష్ణు భార్గవు డయ్యున్ 


వరబలుడగు దశకంఠుని 

ఖర ధూషను కుంభకర్ణు కడతేర్చుటకున్ 

నరునిగ బుట్టియు విష్ణువు 

ధరణిజపతి రాము డయ్యె ధరపులకింపన్ 


గోపాలునిగను బుట్టియు 

పాపాత్ముని కంసు జంపి పార్థుని సఖుడై 

"గో" పాలుడు శ్రీవిష్ణువు 

కాపాడెను ధర్మ నిరతి ఘనకృష్ణుండై 


కరి మకరిచె కఱువబడియు 

పరువంబును కోలుపోయి ప్రార్థించంగన్ 

హరి సరగున నరుదెంచియు 

మకరిని చక్రాన జంపి మఱి కాచె కరిన్ 


ఉత్తానపాద పుత్రుం

డుత్తముడా ధ్రువు డరయగ నుత్క్రుష్టు హరి

న్నుత్తమ పదవిని గోరగ 

నుత్తమ నక్షత్ర పదవి నునికిగ నిచ్చెన్ 


✍️గోపాలుని మధుసూదనరావు🙏