రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి.... యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు.... దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు..... రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది..... ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.... ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.రుద్రాభిషేకాలు 8 విధములు అవి..*👇
రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…!!
1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.
2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు
4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు
9.ఇదండి సంగతి. ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.!మహాన్యాసము*_
అసలు *న్యాసం అంటే ప్రాధమిక అర్థం శుద్ధి చేయటం లేదా పవిత్రమొనర్చడం*. న్యాసము వైదిక, తాంత్రిక సాధనలలో ముఖ్యమైన భాగము. న్యాసములు అనేకములుగా ఉన్నప్పటికీ నాలుగు రకాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అవి *రుషి న్యాసము, కరన్యాసము, మాత్రిక న్యాసము మరియు షడంగన్యాసము*.
మహాన్యాసము అను పద్ధతిని మహా శివభక్తి తత్పరుడైన రావణుడు సూత్రీకరించాడు.
న్యాసములో చేతి వేళ్ళను మరియు వివిధ శరీర భాగములను తాకుతూ తత్ మంత్రమును లేదా బీజాక్షరాలను పలుకుతూ పవిత్రం చేసుకుంటారు. శివపూజకు ముందు మహా న్యాసం చేయడం తప్పనిసరి. వివిధ శరీరభాగాలలో వివిధ దేవతలను ప్రతిష్టించుకుని దైవత్వాన్ని నింపుకున్న అనుభూతిలో అత్యంత పవిత్రంగా, పరమ నిష్ఠగా పూజాదికాలు నిర్వహించడం భారతీయ దేవతార్చనలో ప్రధానం. ఈ విధంగా చేసిన పూజవల్ల సకలము సిద్ధిస్తుంది. హిందూ దేవతా సాంప్రదాయాలలో కొన్ని వందల పూజాశాస్త్రములు, కొన్ని వేల పూజా విధులు లెక్కకు మించి రహస్యములైన సాధనాలు, వాటికి సంబంధిచిన న్యాసములు ఉన్నాయి. అవి మహా మహులకు తప్ప సామాన్యులకు అందవు. అవి మహాశక్తి వంతములై, నియమ నిష్ఠలతో కూడుకొన్నవై, సులభ సిద్ధిదాయకములై ఉన్నవి. కాబట్టి నిష్ఠాగరిష్టులు, తాత్విక చింతన కలిగినవారు, లోక క్షేమమును కాంక్షించు వారు మరియు లోకకల్యాణానికై సాధన చేయువారికి మాత్రమే అది కూడా గురువులనుంచీ మాత్రమే లభిస్తాయి. ఆ స్థాయికి చేరుకోవడం జన్మజన్మల పుణ్యం మరియు ఏకాగ్ర సాధన వలననే సాధ్యమవుతుంది. సంసారబంధములలో ఉన్నాకూడా సాధన చేయవచ్చని చాలామంది నిరూపించారు. ఇప్పటికీ పట్టు విడువకుండా సాధన చేసేవారు ఉన్నారు. సాధన చేయాలన్న బలమైన సంకల్పం మనల్ని సరైన గురువు దగ్గరకు చేరుస్తుంది. కావున మనందరమూ ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకైనా అనుసరించడం జీవితంలో చాలారకాలుగా మంచిని చేకూరుస్తుంది.
రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.
ఈ *11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి'అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసేఅభిషేకం 'లఘురుద్రాభిషేకం'*.
11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈఅభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి