*తిరుమల శ్రీనివాసుడి అప్పు ఎంత ? 🕉*
👉తిరుమల శ్రీనివాసుని వడ్డికాసులవాడు అని, చేసిన పాపాలను వడ్డీతో సహా స్వీకరిస్తాడని , శ్రీవారు హుండీ ధనాన్ని మొత్తం ఇంకా వడ్డీ రూపంలోనే జమచేస్తున్నాడనీ , ఇంకనూ వడ్డీకూడా తీర్చలేకపోతున్నాడని , కలియుగాంతానికి అసలు వడ్డీతో కలిపి కుబేరునికి ఋణాన్ని తీరుస్తాడనీ మనందరికీ తెలిసిన విషయమే!
👉అసలు శ్రీనివాసుడు కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఎంత? ఎప్పుడు ? ఎందుకు తీసుకున్నాడు?ఎలా తీరుస్తానన్నాడు?
ఇందుకు సాక్ష్యం ఏమైనా ఉందా ?
👉దీని గురించి భవిష్యోత్తరపురాణం 11 వ అధ్యాయం లో వివరించబడింది.
👉ఋణ గ్రాహీ శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వర: ; ఆత్మకార్య నిమిత్తం తు కళ్యాణార్ధం కలౌయుగే ౹ వైశాఖే శుక్లసప్తమ్యాం విలంబే చైవ వత్సరే ౹౹
నిష్కాణాం రామముద్రాణం లక్షాణి చ చతుర్దశ ౹ ద్రవ్యం దత్తం ధనేశేన వృద్ధి గ్రహణ కారణాత్ ౹౹ సవృధ్ధి దిత్సతామూలం స్వీకృతం చక్రపాణి నా ౹ వివాహ వర్షమారభ్య సహస్రాంతే పునః౹౹ దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శార్ఞిణా ౹ ఏకసాక్షీ చతుర్వక్త్రో ద్వితీయస్తు త్రిలోచన:౹౹ తృతీయో౽శ్వత్థరాజాస్తు వేత్తి సర్వమిదం ధృఢం౹ ఇత్యేతదృణపత్రస్తు శ్రీనివాసో౽ లిఖిత్స్వయం౹౹
భవిష్యోత్తర పురాణం 11 వ అధ్యాయం.
ప్రతిపదార్ధం:-
👉ఋణగ్రాహీ = అప్పుతీసుకొనువాడు
శ్రీనివాసో = శ్రీనివాసుడు
ధనదాయీ= అప్పు ఇచ్చువాడు
ధనేశ్వరః = కుబేరుడు
ఆత్మకార్యం = సొంతపని అయిన
కళ్యాణార్ధంనిమిత్తంతు = వివాహం కొరకు
కలౌయుగే = కలియుగం నందలి
విలంబే చైవ వత్సరే = విలంబి నామ సంవత్సరం
వైశాఖే శుక్ల సప్తమ్యాం = వైశాఖమాస శుక్లపక్ష సప్తమి రోజున
చతురదశ లక్షాణి = 14 లక్షల
రామమూద్రాణాం నిష్కాణాం = రామముద్ర కలిగిన నిష్కములను
వృధ్ధిగ్రహణకారణాత్ = యుగధర్మానుసారం వడ్డీ తో కలిపి
ద్రవ్యం దత్తం = తీసుకున్న ఋణాన్ని ఇవ్వగలవాడను.
సవృధ్ధి దిత్సతామూలంస్వీకృతం = ఆ చక్రవడ్డీ సహిత తీసుకున్న మొత్తం ఋణాన్ని
వివాహవర్షమారభ్య = వివాహం జరిగిన సంవత్సరం మొదలుకొని
సహస్రాంతే = 1000సంవత్సరాల లోపు
చక్రపాణినా = చక్రపాణి అను నేను
ధనం పునః = పూర్తి ద్రవ్యం ను ఇవ్వగలవాడను.
దాతవ్యం యక్షరాజాయ = ఇచ్చినవాడు యక్షరాజైన కుబేరుడు.
శ్రీనివాసేన శార్ఞిణా = తీసుకున్నవాడు శ్రీనివాసుడు.
ఏకః సాక్షీ చతుర్వక్త్రో = మొదటి సాక్షి చతుర్ముఖ బ్రహ్మ
ద్వితీయస్తు త్రిలోచనః = రెండవ సాక్షి శివుడు
తృతీయో౽శ్వత్థరాజాస్తు = మూడవ సాక్ష్యం రావిచెట్టు
వేత్తి సర్వమిదం ధృఢం = ఈ సమాచారం అంతా ధృఢమైనది యదార్థమైనది.
ఇత్యేతదృణపత్రస్తు =ఈ ఋణపత్రం
శ్రీనివాసో౽లిఖిత్స్వయం = శ్రీనివాసుడనే నాచేత రాయబడినది.
👉భావమ:-
శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సర ,
వైశాఖ శుద్ధ సప్తమీ సోమవారము నాడు ,
ధనాధిపతి, ఉత్తర దిశా పాలకుడు అయిన కుబేరుని వద్ద, శ్రీ వేంకటాచ రమణుడైన శ్రీనివాసుడను పేరు గల నేను, నా కళ్యాణము నిమిత్తము, పదునాలుగు (14)లక్షల సంఖ్య గల శ్రీరామ ముద్ర నిష్కములను , .వృద్ధికి(వడ్డీకి) తీసుకొనుచున్నాను.
వివాహ వర్షము మొదలు వెయ్యి సంవత్సరముల లోపున ఋణము తీర్చే నిర్ణయము.
ఇందులకు సాక్షులు--- చతుర్ముఖ బ్రహ్మ--- ( అని పత్రాన్ని శివుని చేతికిస్తాడు )
శివుడు --- రెండవ సాక్షి , కైలాస పతి శివుడు ( అని పత్రంపై సంతకం చేసి, ఆ పత్రాన్ని, శ్రీనివాసునికి ఇస్తాడు ) శ్రీనివాస --- ఓ అశ్వత్థ వృక్షమా ! మూడవ సాక్షి నీవు
( అని దగ్గరున్న రావి చెట్టుతో అంటాడు)
( ఆ తరువాత దానిపై తన సంతకం చేసి, శ్రీనివాసుడు , కుబేరునికి ఇస్తాడు )
👉విశేషార్థములు:-
👉ధనేశ్వరః :-
లక్షీదేవిని ఐశ్వర్య దేవత గా కొలిచినప్పటికినీ ఇక్కడ ఐశ్వర్యం అంటే ధనం తోపాటు సుఃఖ సంతోషాలు, పాడిపంటలు, పనులయందు విజయం కలిగించునది గా చెప్తారు. అందుకే ధాన్యలక్షీ ,ధైర్యలక్షీ,విజయలక్ష్మీ అని పిలుస్తారు. ఇక బంగారాది నవ నిధులకు అధిపతి గా కుబేరుడిని చెప్తారు.
👉వృధ్ధిగ్రహణకారణాత్ :
అంటే యుగధర్మం ను అనుసరించి అధికమాసాలు , శూన్యమాసాలు కూడా పరిగణ లోకి తీసుకొని సంవత్సరానికి అయిన వడ్డీ ని తరువాతి సంవత్సరం లో అసలుకు కలుపుట దీనినే చక్రవడ్డీ అంటారు. ఈవిధంగా మాసానికి రోజులలో కలుగు హెచ్చు తగ్గులను కూడా పరిగణ లోనికి తీసుకొనుట.
👉రామముద్ర నిష్కాణాం :-
ఆ రోజులలో బంగారు నాణెముల కొలమానం. అంటే మనకు డబ్బుకు రూపాయలు ఎలాగో వారికి నిష్కములు అన్నమాట. అయితే ఒక నిష్క అంటే మన కొలమానం లో ఎంతో వివరంగా తెలియదు.
👉సహస్త్రాంతే :-
అనగా 1000 సంవత్సరాలుగా చెప్పిననూ అవి 1000 దైవ సంవత్సరాలు గా పరిగణించాలి. మానవులకు 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం గా పరిగణిస్తారు. అనగా 3,60,000 మానవ సంవత్సరాలు. ఇది కలియుగం వయసు 4,32,000 అనే యదార్థం కు బలాన్నిస్తుంది.
👉చక్రపాణి :-
పాణి(చేయి) నందు చక్రం (సుదర్శన చక్రం) ధరించినవాడు. అనగా శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుని అవతారం లో వెలిశాడు.
👉అశ్వత్థరాజం:-
వృక్షాలలో రాజు వంటిది. (రావిచెట్టు) దీనిని త్రిమూర్తుల అవతారం గా చెప్తారు.
💠 యుగధర్మం:-
ఒక్కొక్క యుగం లో మానవుల విద్యుక్తధర్మాలు, నియమాలు వివరించబడినవి.
ఉదాహరణకు
త్రేతాయుగం లో 13 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే రాజ్యాధికారం కోల్పోతారు.ఆవిషయం తెలిసే కైకేయి రాముడికి 14 సం అరణ్యవాసం వరం అడిగింది.
ద్వాపరయుగం లో ఆ నియమం 12 సం కుదించబడింది. అందుకే పాండవులకు 12 సం అరణ్యవాసం విధించారు. ధర్మం కొంత గతి తప్పడం వలన మళ్ళీ రాజ్యం అడుగుతారేమో అని 1సం అజ్ఞాతవాసం (వడ్డీ అనుకోవాలేమో?) అందులో పట్టుపడితే మళ్లీ 12 సం అరణ్యవాసం నిబంధన ను కౌరవులు కల్పించారు..
కలియుగం లో ఈ నిబంధన 7 సం అంటారు. అందుకే ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష అని 14 సం యావజ్జీవ ఖైదు అని అంటారు. అంటే ఆకాలానికి జీవితానికి సరిపడే శిక్ష ను పొందుతారట.
ఇలా ఒక్కొక్క యుగం లో మానవులకు కొన్ని నియమాలు చెప్పారు
ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద
ఓం నమో నారాయణాయ నమః
✍🏻 🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి