29, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఆత్మేతరములు

 

 ఆత్మేతరములు 

ఆత్మేతరములు  అనే పదంలోనే ఆత్మకాదు ఆత్మకన్నా వేరుగా వున్నవి అనే అర్ధం స్ఫురిస్తుంది. అంటే మనకు ఒక విషయం గోచరిస్తుంది అదేమిటంటే ఆత్మ ఒక్కటీ ఒక్కటీ ఆత్మకానివి మిగిలినవి. అంటే మిగిలినవి అన్నీకూడా ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నాయని అర్ధమే కదాదానిని బట్టి మనం అర్ధం చేసుకునేది ఏమిటంటే ఆత్మ అన్నిటిలో లేదు, కలవదు  అది తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం

ఎరుక: ఎరుక అనేపదాన్ని మనం తెలుసుకోవటం అనే దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాం ఇది మనందరికీ తెలిసినదేనీకు రామారావు తెలుసా అంటే నాకు యెరుకలేదు అని అన్నాడు అంటే అతనికి రామారావు తెలియదు అని అర్ధం.  

ఎరుక కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే దేనిని గూర్చి ఎరుక కలిగి ఉండటం అంటే బ్రహ్మను గూర్చి లేదా ఆత్మను గూర్చి అనే సమాధానం వస్తుంది

ప్రతివారు ఏమనుకుంటారటే  ఇన్ని రకాలుగా చెప్పటం ఎందుకు నాకు ఆత్మను గూర్చి తెలియదు తెలపండి అంటే గురువు  ఆయినా తెలిపారంటే అది ఏమయినా కావచ్చు కానీ ఆత్మకు సంబందించినది కాదుఅంటే మరి దేనికి సంబందించినది. తెలిపిన గురువుకు నిజంగా ఆత్మా జ్ఞ్యానం ఉంటే  అతడు తెలుపలేడు అదేవిధంగా ఆత్మజ్ఞ్యానం లేకపోయినా కూడా తనకు తెలియదు కాబట్టి తెలుపలేడు

ఇది అసంబద్ధంగా వున్నది తెలియని గురువు తనకు తెలియదు కాబట్టి చెప్పలేక పోయాడు అనటంలో అర్ధం వుంది మరి తెలిసినవాడు ఎందుకు చెప్పలేడు అని ప్రతివారు సందేహించవచ్చు

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బ్రహ్మ జ్ఞ్యానం అనేది తెలిసినది కాదు అంటే తెలుసుకోలేదు, ఆలాగే తెలియపడేది కాదు ఒకరికి తెలియనప్పుడు ఇంకొకరికి తెలియపరచటం అస్సలు సాధ్యపడదు  కాబట్టి తెలియపడటం అనేది ఉండదు. అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం పొందటం యెట్లా అనే మీమాంస వస్తుంది

నిజానికి  బ్రహ్మజ్ఞానం పొందటం అనేదే ఉండదు. ఎందుకంటె నీవు ఏదైనా పొందుతున్నావంటే అంతకు ముందు నీదగ్గర అది లేకపోతేనే దానిని పొందగలవు. నీ దగ్గర ధనం లేదనుకో నీవు సంపాదించి ధనాన్ని పొందగలవు, నీ దగ్గర ఏదైనా వస్తువు గురించి, కానీ విషయం గురించి గాని జ్ఞ్యానం లేదనుకో దానిని తెలుసుకున్న పండితుడిని గురువు గా భావించి అయన వద్దనుండి తెలుసుకొని పొందవచ్చు. దీనిని బట్టి మనకు ఏమి అర్ధమౌతుంది అంటే నీవు పొందాలసినది అది వస్తువైనా కానీ లేక విషయమైనా గాని అది నీకన్నా వేరుగా  వుంది. అలాగే దానిని నీకు వసంగె వ్యక్తి కానీ మరొకటి గాని నీకన్నా వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి తెలుసుకోవలసిన వాడు అంటే నీవు రెండోవాది తెలుసుకోవలసిన విషయం అది ఏమైనా కావచ్చు అది కూడా నీ కన్నా వేరుగా వుంది. అదేమాదిరిగా తెలియచేసే గురువు కూడా వేరుగా వున్నాడు

ఒక మనిషి నేర్చుకునేది, తెలుసుకునేది పూర్తిగా పరోక్ష జ్ఞ్యానం మాత్రమే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసుకునే వానికి తెలుసుకోబడే విషయం పూర్తిగా వేరుగా వుంటున్నదికాబట్టి సదరు విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు నీకు కారు డ్రైవింగ్ రాదునీకు తెలుసు డ్రైవింగ్ అనేది ఒక విద్య విద్య వచ్చిన నిపుణుడు కారును అదుపులో ఉంచి సరైన వేగంగా నడుపగలడుఒక సమర్ధుడైన కారు డ్రైవరు ఇరుకు రోడ్లలో వీధులలో ఎంతోమంది నడుస్తున్నా కూడా ఎవ్వరికీ మాత్రం తాకకుండా నిపుణతతో నడుప గలడుఅదే తర్ఫీదు సరిగా లేని వాని చేతికి స్టీరింగ్ ఇస్తే కారుతో పలువురుకు హాని కలిగించి కారుకు కూడా డామేజ్ చేయవచ్చుకాబట్టి విద్య నేర్చిన వానికి విద్య నేర్వనివానికి తేడా వుంటున్నది. విద్యను నేర్వటానికి విద్యలో ఆరితేరిన నిపుణుని శిక్షణ అవసరము. రకంగా మనం నిత్యం అనేక విద్యలను నేర్చుకుంటున్నాము. కానీ బ్రహ్మ విద్య అలా తెలుసుకోవటానికి సాధ్యపడదు. ఎందుకంటె ఇక్కడ తెలుసుకునే నీవు తెలుసుకోపడేది కేవలం నీలో దాగి వున్న నీ గురునిచే. అదేమిటో చూద్దాం

ప్రతివారు వారికి ఉన్న ఇంద్రియముల సహాయముతో జగతితో సంబంధం కలిగి వున్నారు. కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు ఇలా ఒక్కొక్క ఇంద్రియముతో ఒక్కొక్క రకమైన పని చేస్తున్నారు. ఇది సర్వసాధారణ విషయంకానీ నీలో దాగి వున్నది ఎవరు అదేమిటి నాలో దాగి ఎవరు లేరు నేనే వున్నాను అని నీవనవచ్చు నిజానికి నీవు నీ శరీరం కాదు నీ శరీరంలో నీ కన్నా భిన్నంగా దాగి వున్న నీవు అదే సుద్దచెతన్యమైన ఆత్మ స్వరూపం. విషయంలో కేనోపనిషత్తు ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నది.

 

కేనేషితం పతతి ప్రేషితం మనః
కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః |
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయుదక్తి || 1

మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది? ఈ మంత్రం మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనస్సు విషయాలమీదకు వెళుతున్నది.  ఇవ్వన్నీ మనకు తెలిసినవిషయాలే మరి అవి వాటి వాటి నిర్దుష్ట కర్మలు చేయటానికి కారణం ఎవరు? ఎవరి ఆదేశాలమీద అవన్నీ పనిచేస్తున్నాయి అనేది ఒక సందేహాం. 

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః |
చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి || 2

ఆత్మ శక్తి వలననే చెవి వింటుంది. కన్ను చూస్థుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పని చేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.మనకు బౌతికంగా కనపడని ఆత్మా శక్తి మన ఇంద్రియాలను, మనస్సును, బుద్దిని నియంత్రిస్తుంది.

నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్ గచ్చతి నోమనః |
న విద్యో న విజానీయో యథైవ దనుశిష్యాత్ || 3

మరి ఆ ఆత్మను మనం చూడగలమా అంటే ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతికూడా మాకు తెలియదు. మహర్షులు వారి దివ్యజ్ఞానంతో మనకు ఆ ఆత్మా శక్తి దాని ఉనికిని తెలుపుతున్నారు. కన్ను దాని ముందర వున్న వాటిని మాత్రమే చూడగలదు మాటలు తన అనుభవంలో ఉన్నవాటిని మాత్రమే తెలుపగలవు. మనస్సు తన ఊహకు అందినవాటిని మాత్రమే తెలుసుకోగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రియాలు శరీరానికి బాహ్యంగా ఉన్నవాటిని మాత్రమే గుర్తించగలవు. 

అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |
ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే || 4

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. తరువాత అది తెలియనిదానికంటే అతీతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం.ప్రపంచంలో వున్న జ్ఞానం కొంతవరకు మనకు తెలియవచ్చు అంటే దానిని మనము తెలిసిన జ్ఞానంగా పేర్కొనవచ్చు. మరి మనకు తెలియని జ్ఞానం కూడా అంటే మనం తెలుసుకోనిది తెలుసుకోవలసినది కూడా వున్నది.  కానీ ఆత్మా అనేది మనం తెలుసుకున్న జ్ఞానంలోనూ, మనం తెలుసుకోవలసిన జ్ఞానంలోను లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాహ్యంగా తెలుసుకునే జ్ఞానం పరిధిలోనికి ఆత్మా జ్ఞానం రాదు. అంటే ఆత్మా జ్ఞానం బాహ్యంగా లేదు.

యత్ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5

మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.

యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే|| 6

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 7

కన్నులు చూడజాలనిదికాని దృష్టిని చూసేది - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 8

మానవుడు చెవిద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుచున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 9

మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.అన్ని మంత్రాలు ఒక్కటే చెపుతున్నాయి. మనం ఆత్మా గురించి తెలుసుకోవటం ఇంద్రియాలవలన, మనస్సు బుద్ధిల వలన సాధ్యం కాదు. మరి అటువంటప్పుడు ఆత్మా జ్ఞానాన్ని పొందటం ఎట్లా?

శరీరం పూర్తిగా ఆత్మస్వాధీనంలో ఉండి శారీరక వ్యాపారాలను చేస్తున్నది.  కానీ ఆత్మా శరీరంలోని అంగం కాదు అది కేవలం శరీరంతో కలువకుండా తామరాకుమీద నీటిబిందువు వాలే వుంటూ శరీరాన్ని నియంత్రిస్తుంది. ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే శరీరానికి దేహవ్యాపారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళుతుందో అప్పుడు పంచ ప్రాణాలు, మనస్సు బుద్ది  పంచేంద్రియాలు లయమైతాయి. శరీరం నిస్చేష్ఠలతో మిగులుతుంది. 

శరీరపు అంగము కాకుండా శరీరంలో పరోక్షంగా వుంటూ శరీరానికి కలసివుండకుండా ఉండి శరీరాన్ని నియంత్రిస్తున్న దివ్య తేజస్సే ఆత్మగా మన మహర్షులు  తెలిపారు. దాని ఉనికిని తెలుసుకొని నిత్యం ఆత్మాసంయమంగా వుంది నిరంతరం ఆత్మలో లయమై ఉండటాన్ని ఆత్మానుభవంగా మహర్షులు తెలిపారు.  అట్లా పొందిన జ్ఞానాన్ని ఆత్మా  జ్ఞానంగా పేర్కొన్నారు. 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


 

 

 

కామెంట్‌లు లేవు: