1, డిసెంబర్ 2023, శుక్రవారం

 https://youtube.com/shorts/n7PaTm2FAHk?si=FE0SbJfHS4FOwmdg

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 17*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*17. తిరునాళైపోవార్ నాయనారు*

 *(నందనార్ చరిత్ర)*

కొళ్లిడం నదీతీరంలో ఉన్న ఒక అందమైన గ్రామం ఆదనూరు. ఈ గ్రామానికి బాహ్యప్రదేశంలోని ఒక దళిత వాడలో నందనారు జన్మించాడు.

పుట్టినప్పటి నుండి పరమేశ్వరుని తిరుచరణాలను సదా ధ్యానిస్తూ వచ్చాడు

నందనారు. ఇతడు శివాలయంలోని భేరీ, మృదంగం మొదలైన

వాయిద్యాలకు కావలసిన చర్మాన్ని, వీణ మొదలైన వాయిద్యాలకు

తంత్రులుగా నరాలను అందిస్తూ ఉండేవాడు. 

ఈ విధంగా స్వామి

కైంకర్యాన్ని చేస్తూ వచ్చిన నందనారు గుడి వాకిలి దాటక అక్కడి నుండే

స్వామిని దర్శిస్తూ, నోరారా స్వామిని గానంచేస్తూ ఆనందించేవాడు.

ఆదనూరుకు సమీపంలో తిరుప్పునూరు అనే గ్రామంలో వెలసిన

పరమేశ్వరుని దర్శించాలనే ఆకాంక్షతో నందనారు అక్కడికి వెళ్లి గుడి

వాకిలి ముందు నిలబడి చూశాడు. కాని నందీశ్వరుడు అడ్డంగా ఉండడం

వలన నందనారుకు స్వామి దర్శనం కలగలేదు. 

స్వామిని దర్శించ

లేకపోయాననే తీవ్రమైన సంతాపంలో నందనారు మునిగిపోయాడు. భక్తుని

ఆవేదనను గుర్తించిన కరుణామూర్తి అయిన శివుడు అడ్డంగా ఉన్న

నందీశ్వరుని పక్కకు తొలగమని ఆజ్ఞాపించాడు. నందనారుకు స్వామిని

నేరుగా దర్శించడానికి వీలయింది.

 ఒక పర్యాయం నాయనారు చిదంబరంలోని నటరాజ స్వామిని దర్శించాలను కున్నాడు. కాని “పవిత్రమైన చిదంబరంలోని శివాలయానికి

నాలాంటి అపవిత్రుడు, నిమ్నకుల సంజాతుడు వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది?” అని తన ప్రయత్నాన్ని విరమించు కున్నాడు.

నందనారు ఒకరోజు చిదంబరం వెళ్లాలని గట్టిగా నిశ్చయం చేసుకొని ఆలస్యం చేయక వెంటనే బయలుదేరాడు. 

చిదంబరం పొలిమేరలు

చేరుకున్నాడు. కాని తన కులాన్ని తలచుకొని చిదంబరం నగరంలోనికి

అడుగుపెట్టకుండా అక్కడే నిలిచాడు. “నేను జన్మించిన ఈ కులం నాకు

అడ్డంకిగా ఉంది” అంటూ చిదంబరానికి వెలుపల ప్రదక్షిణంగా వచ్చాడు.

ఈ విధంగా ఎన్నో రోజులు చిదంబరాన్ని ప్రదక్షిణం చేస్తూ వచ్చిన నందనారుకు పరమేశ్వరుడు ఒకరోజు కలలో కనిపించి "భక్తుడా! నీకు

సంక్రమించిన ఈ నీచకులం తొలగిపోవాలంటే నీవు నిప్పుల్లో నడిచి

తిల్లైలోని బ్రాహ్మణులతో కలసి నాముందుకు రా!" అని చెప్పాడు.

బ్రాహ్మణులు అగ్నిని ప్రజ్వలింపజేశారు. నందనారు సంతోషంతో

పరమేశ్వరునికి చేతులు మోడ్చి నమస్కరించి పవిత్ర పంచాక్షరీ మంత్రాన్ని

పఠిస్తూ అగ్నిగుండంలో ప్రవేశించాడు. కెందామరల నుండి నడిచి వచ్చినట్లు

నందనారు అగ్నిగుండం నుండి బయటకు వచ్చాడు. 

అతని రూపం పూర్తిగా

మారిపోయింది. 'పవిత్రమైన యజ్ఞోపవీతం వేలాడుతుండగా, ముని

వేషధారియై బ్రహ్మదేవుని తలపించేలా, నందనారు కనిపించాడు. తిల్లెలోని

బ్రాహ్మణులందరూ చేతులు మోడ్చి నందనారుకు నమస్కారం చేశారు.

నందనారు మెల్లగా శివాలయంలోనికి ప్రవేశించాడు. నటరాజస్వామి

సన్నిధిలోనికి వెళ్లగానే నందనారు అంతర్ధానమయ్యాడు. కైలాసంలో

ఎల్లప్పుడూ తన సన్నిధిలో ఉండే వరాన్ని నందనారుకు అనుగ్రహించాడు

పరమేశ్వరుడు.

*పదిహేడవ చరిత్ర సంపూర్ణం*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 17*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో*

*ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |*

*కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం*

*నిలింపానాం శ్రేణి ర్నిజకనకమాణిక్యమకుటైః ||*

తాత్పర్యం: ప్రభూ, స్వామీ! నేను చేసిన పుణ్య ఫలములవల్ల కానీ, నీకు నాయందు కల దయవల్ల కానీ, నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా , నీ పవిత్ర పాదపద్మ యుగళమును నేను ఎలా చూడగలను?  నీకు నమస్కరింౘడానికై తొందర పడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ  కిరీటములను  మీ పాదములయందు మోపి, నాకు అడ్డుపడుతున్నారు. (దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, ఎప్పుడూ నీ పాదములపై తమ స్వర్ణ, రత్న కిరీటములు మోపి, సాష్టాంగ నమస్కారాలు చేయడానికి తొందరపడుతూ ఉంటారు. ఆ కిరీటములు నా దృష్టులను అడ్డగించడంవల్ల, నేను నీ పాద  పద్మాలను చూడలేక పోతున్నాను.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🌿    పరమాత్ముని    🌿

          పలుకు - ఉలుకు

      ______________

     కార్తికమాసములో విష్ణువును

      కమలములతో పూజించిన

      వాని యింట కోటి జన్మల

      వరకును సిరి యుండును .  

       ప్రామాణము -

            పృధ్వీచంద్రోదయము  

                  మరియు 

             పద్మపురాణం

       🍁 కమలమునకు

              ఓటు వేస్తే

       భారతావని ప్రతి ఇంట

          సిరి ఉండును

      ప్రామాణము -

             దేశభక్త హృదయం  

      🚩   🔱   🇮🇳   🔱   🚩

.

 #ఆర్షధర్మానికి_శ్రీరామరక్ష

ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం క్రొత్తదేమీకాదు. సనాతనమైన ఉపనిషత్తు హృదయమే. 'చతుర్ధం మన్యంతే అద్వైతం' 'ద్వితీయాద్ వై భయం భవతి' - మొదలైన శ్రుతివాక్యాలు చాటిన సత్యమిది. ఈ వేద హృదయాన్ని సుప్రతిష్ఠితం చేసి, దాని ఆధారంగా వైదికమార్గప్రవర్తకులై, సమగ్రఅర్షధర్మ పరిరక్షణ చేశారు జగద్గురు శంకర భగవత్పాదులు. వేలయేళ్ళు గడచినా, కలిదోషాలు ప్రకోపిస్తున్నా, వేదధర్మదీప్తి విశ్వంలో వ్యాపించడానికి వారి అవతారం ప్రధానకారణం.

శంకరుల అవతారకార్యంలో ముఖ్యంగా మూడు అంశాలుగా విభజించవచ్చు.

#మొదటి_అంశం :- వాఙ్మయావిష్కారం. వ్యాసుని అనంతరం అంత విస్తృతసాహిత్యాన్ని అందించినది శంకరులే. ప్రస్థానత్రయ భాష్యం, ప్రకరణగ్రంథాలు, స్తోత్రసాహిత్యం అని మూడు భాగాలుగా శంకర వాఙ్మయం అధ్యయనం చేయవచ్చు. జ్ఞానానికై వేదవిహితకర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని, శ్రుతిసమ్మతమైన దక్షిణాచారబద్ధమైన ఉపాసనద్వారా చిత్తైకాగ్రతనీ, ఈశ్వరానుగ్రహాన్నీ సాధించి శ్రోతియుడూ, బ్రహ్మనిష్ఠుడూ, అయిన సద్గురువుద్వారా వేదాంతవిద్యని గ్రహించి, శ్రవణమనననిధిధ్యాసలను సాధనచేయాలనేది శంకరులబోధ.

#రెండవ_అంశం :- అసేతుశీతాచలం యోగశక్తితో పర్యటించి, ఆనాటి మేధావులతో సశాస్త్రీయ, తార్కిక, తాత్విక వాదంతో చర్చించి, వేదసత్యాన్ని ప్రతిపాదించడం. ఈదిశగా సాక్షాత్తు శివావతారుల పాదస్పర్శతో భారతావని పులకించి తనదివ్యత్వాన్ని ప్రస్ఫుటంగా భాసింపజేసుకుంది. అనేకపుణ్యక్షేత్ర, తీర్థాలను సేవించి, సందర్శించి, తన స్తోత్ర వాఙ్మయంతో ఆదేవతలను ఆనందింపజేశారు.

#మూడవ_అంశం :- ధర్మజ్ఞానాలను మానవజాతికందించిన వేదపథం నిష్కంటకంగా, నిరాటంకంగా నిలిచేలా దేశపు నాలుగుదిక్కులలో పీఠాలను ప్రతిష్ఠించారు. వీటినే చతురామ్నాయ పీఠాలు అని వ్యవహరిస్తాం. ఈ పీఠాల ద్వారా నిరంతరం శంకర వాఙ్మయం, ధర్మ పరిరక్షణ జరుగుతాయి.

ఈమూడు మహాకృత్యాలద్వారా శంకరులు తన అవతారతత్త్వాన్ని ప్రకటించారు. ఘోరకలిలో కూడా అఖండ సనాతనధర్మజ్యోతిని పరిరక్షించారు. శంకరులతపశ్శక్తి, అవతారమహిమ వలన ఆపీఠాలద్వారా నేటికీ దేశక్షేమానికి, ధర్మానికి రక్షణ సమకూరుతున్నది. ఈశంకరవిజయానికి హేతువు వారి నియమపూర్వకవ్యవస్థానిర్మాణమే. కఠిన నియమములను పాటిస్తూ, పీఠమర్యాదలను నిలబెట్టే పీఠాధిపతుల ఉనికియే ఆవిజయాన్ని శాశ్వతం చేసింది.

शुचिर्जितेन्द्रियो वेदवेदांगादिविशारदः |

योगज्ञ स्सर्वशास्त्राणा मस्मदास्थान माप्नुयात् |

उक्तलक्षणसंपन्न स्स्या च्चे न्मत्पीठभाग् भवेत् ||

పవిత్రజీవనం కలవాడు, జితేంద్రియుడు, వేదవేదాంగశాస్త్రపండితుడు, సర్వశాస్త్రయోగాలను తెలిసినవాడు- 'శంకర'నామంతో ఆయా పీఠాలను అధిష్టించాలని శంకరశాసనం.

अस्मत्पीठे समारूढः परिव्राडुक्तलक्षणः |

अह मे वेति विज्ञेयो यस्य देव इति श्रुतेः ||

పైలక్షణాలు కలిగి, నాపీఠాన్ని అలంకరించినపరివ్రాట్టు "నేనే'' అని భావించాలి. యస్య దేవే అనే శ్రుతివాక్యం ప్రమాణంగా....అని శంకరవచనం. ''यस्य देवे परा भक्तिः - यथा देवे तथा गुरौ". ఈశ్వరునియందువలె గురువునందు భక్తి ఉండాలి. (కరోపనిషత్తు) ధర్మప్రతిష్ఠాపనార్ధమై పీఠమర్యాదలను, పరంపరను పరిరక్షిస్తూ అఖండజ్ఞానవైరాగ్యాలతో, నిర్వహణాసామర్థ్యంతో, అపారతపశ్శక్తి ప్రభావంతో ఆచార్యులు నేటిదాక సాగిస్తూ వచ్చిన గురుత్వం ఒక మహాద్భుతం. ప్రధానంగా ప్రథమపీఠమైన దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం, ఆదిశంకరులతపస్థలి. తత్పూర్వమే అది విభాండకఋష్యశృంగులతపోభూమి. తాను ప్రత్యక్షం చేసుకున్న శారదాంబను సంపూర్ణకళలతో అచట ప్రతిష్ఠించారు శంకరులు. అటునుండి నేటిదాకా శృంగేరీపీఠంలో ఆదిశంకరదీప్తి గంగానదిలా అఖండంగా ప్రసరిస్తూనే ఉంది. 12వ పీఠాధీశ్వరులైన జగద్గురు శ్రీవిద్యారణ్యస్వామివారు సనాతనధర్మానికీ, భరతవర్షానికీ చేసిన మహోపకారం ఒకఘనచరిత. దారూ మూర్తి అయిన శారదాంబను సువర్ణమూర్తిగా వీరిచేతిచలువతో సాక్షాత్కరించినది. 'కర్ణాటకసింహాసనప్రతిష్ఠాపనాచార్య' బిరుదాంకితంగా నాటినుండి, నేటివరకూ ధర్మసామ్రాజ్యపాలన అవిచ్ఛిన్నంగా సాగుతూ, ఆచంద్రతారార్కంగా భాసిల్లుతుందనేసత్యాన్ని చాటుతోంది. అపరోక్షానుభూతిలో ఆదిశంకరులు విశదపరచిన 'అష్టాంగయోగానుష్ఠాననిష్ఠ, తపశ్చక్రవర్తులలో' ప్రకాశిస్తూ, ధర్మరక్షణ చేస్తున్నది.

శంకరుల తరువాతి పీఠాధిపతులలో 36వ పీఠాధిపతిగా వర్దిల్లుతున్నవారు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు. వేదఋషి పరంపరకు, సాంఖ్యయోగవేదాంతవిద్యకు, కఠోరయతి నియమాలకు, అపారకారుణ్యానికీ సాకారమూర్తులు. వారిచరితలోని జ్ఞాన, ధర్మ, యోగ మహిమలు కొన్నిదశాబ్దాలుగా అనేకులకి స్వానుభవాలు. ఆసేతుశీతాచలం పరివ్రాడ్ధర్మంతో వీరు పర్యటించినప్పుడు ఆయాక్షేత్రాలు దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. పీఠనిర్వహణ, వేదాంతవిద్యాప్రతిష్ఠాపన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శారదాపీఠాల సక్రమవ్యవహారం, అసంఖ్యాకభక్తులకు ఆశీస్సులతోపాటు ధర్మసాధనకు, జ్ఞానలబ్ధికి ఇస్తున్నస్ఫూర్తి... ఇవన్నీ 'ఆదిశంకరులపునరాగమనం' అనేభావాన్ని భక్తజనులకు కలిగిస్తున్నది. తాను జీవన్ముక్తులై, లోకసంగ్రహణార్థం యతిధర్మాలను క్రమం తప్పకుండా పాటిస్తూ, లోకక్షేమం కోసం నిత్యం చంద్రమౌళీశ్వరార్చన, శ్రీచక్రార్చన, అసంఖ్యాక చండీయాగాదిక్రతునిర్వహణ మొదలైనవంటివి పీఠాధీశ్వర మర్యాదలపాలనకు ప్రత్యక్షోదాహరణలు. ఆర్షవిద్యలపరిరక్షణార్థం నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, సర్వజనోపయోగంగా వైద్యసంస్థలను, ప్రజాహితకర కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు. వీరివరకు కొనసాగిన పీఠాధీశులతపోవైభవం వీరియందు రాశీభూతమై నేటికాలాన్ని ధర్మదీప్తులతో ప్రకాశింపజేస్తున్నది.

శ్రీశ్రీశ్రీ భారతీతీర్థుల తపఃపూతగురుదృష్టికి ఉత్తరాధికారిగా గోచరించిన, శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామివారు అవిచ్ఛిన్న ఆచార్యపరంపరలో 37వ పీఠాధిపతిగా సనాతనధర్మానికి మరింత బలిమినిచ్చేదివ్యతేజంగా ప్రభాసిస్తున్న శ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామి వారికి అనేకానేక సాష్టాంగ నమస్కారాలు.

----------------------------------------------

గమనిక :- పోస్టును కాపీ చేసి, వేరే ఏదైనా సమూహాలకు షేర్ చేసేవారు గమనించండి, దయచేసి హాష్ ట్యాగులు, పేజీ లింకులు & పోస్ట్ లింక్‌లను తొలగించవద్దు, తొలగించకుండా షేర్ చేయండి.

For More Please Like, Share & Follow :- https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/

Please Subscribe :- https://youtube.com/channel/UCE0XDs30snh3rgeYwk-ztdg

 *శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబం స్తోత్రము*

*తెలుగు అనువాద పద్యము -8*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

*తే.గీ.సర్వలోకాల నిండిన సార్వ భౌమ*

*నేను సంసార వలలోన నీల్లుచుంటి*

*ఇంద్రియంబుల గాలాన యిడుములంది*

*దవడలను విచ్చి చూచుచు దారి లేక*

 *మెడను పైకెత్తి చూచెడు  మీనము వలె*

*బయటపడలేక సంసార బందనమున*

*ఉద్ధరింపుము బంధాల వూబి నుండి*

*లక్ష్మితో వచ్చి రక్షించు లక్షణముగ*

*నారసింహుడా సంసార నావ నుండి*

*శ్రీధరుణ్ణి చేయూతతో  చేరదీయు*

 *శ్రీ లక్ష్మీనరసింహస్వామి కరావలంబమ్ స్తోత్రమునకు తెలుగు పద్య అనువాదం* 

*రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 

*7 .తే.గీ. గరుడ వాహన క్షీరాబ్ది కడలియందు*

*శేషశాయివై  లక్ష్మితో సేవలంది*

*విషపు సర్పాల కాటుచే వెతలనంది*

*క్రూర మైనట్టి సంసార కోరలందు*

*తనువు నిండిన బాధతో  తాళ లేను*

*లక్ష్మితో వచ్చి రక్షించు లక్షణముగ*

 *నారసింహుడా వెంటనే భారమనక*

*శ్రీధరుణ్ణి చేయూతతో చేరదీయు*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

*శ్లోకం*

*సంసారజాలపతితస్య జగన్నివాస*

*సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ*

*ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||

_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 08_* _

*తా: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని.ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను.నన్నీ సంసార బాధనుండి తొలగించి యుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

🧘‍♂️🙏🪷 ✍️🙏

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*

*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*

శుక్రవారం డిశెంబరు 1 ,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:చవితి మ3.07 వరకు

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:పునర్వసు సా5.07 వరకు  

యోగం:శుక్లం రా9.12 వరకు

కరణం:బాలువ మ3.07 వరకు

తదుపరి కౌలువ తె3.50 వరకు

వర్జ్యం:రా1.46 - 3.30

దుర్ముహూర్తము:ఉ8.29 - 9.13

మ12.10 - 12.54

అమృతకాలం:మ2.33 - 4.16

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

. సూర్యరాశి : వృశ్చికం

చంద్రరాశి: మిథునం 

సూర్యోదయం:6.17

సూర్యాస్తమయం: 5.20

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

 🕉 మన గుడి : నెం 255

⚜ గుజరాత్ : కతర్గాం - సూరత్

⚜ శ్రీ కాంతేశ్వర్ మహాదేవ్ ఆలయం

💠 సూరత్ లోని రామావతార కాలం నాటి అత్యంత పురాతనమైన 'కాంతేశ్వర్ మహాదేవ్' ఆలయం శివ భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది.

అనేక చారిత్రక మరియు ఆసక్తికరమైన పురాతన కథలు "కాంతేశ్వర్ మహాదేవ్" ఆలయంతో అనుసంధానించబడి ఉన్నాయి.

💠 చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని నిజానికి కుంతి తల్లి మరియు పాండవులు స్థాపించారు అని , అందుకే ఈ ఆలయం పేరు కాంతేశ్వర్ మహాదేవ్ అని ఒక గట్టి వాదన ఉంది.

చాలా పురాతనమైన మరియు చారిత్రాత్మకమైన శివుని ఆలయం . 

💠 ఈ శివలింగం భారతదేశంలో కనిపించే అతి కొద్దిపాటి స్వయంభూ శివలాంగాలలో ఒకటి.

💠 కపిలముని కాంతర్ తోపులో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశంలో ఉండి కపిలముని కఠోర తపస్సు ద్వారా సూర్య భగవానుని ఆరాధించాడు.

కపిలముని తపస్సుకు సంతోషించిన సూర్య భగవానుడు  కోరుకున్న వరం కోరమని అడిగాడు.

ముని సూర్యనారాయణుడిని ఈ ఆశ్రమంలోనే ఉండమని అభ్యర్థించాడు.

ఒకే ప్రదేశంలో సూర్య భగవానుడు నిలిచి ఉండిపోతే తనకు సూర్య భగవానుడు ప్రసాదించిన సృష్టి కార్యక్రమంకి విఘాతం కలిగి

శంకరుడు తన అపారమైన అగ్నితో సూర్యుడు ఆశ్రమంతో సహా ఈ భూమిని దహనం చేస్తాడని శంకర భగవానుని ప్రార్థించాడు మరియు ఋషి యొక్క వరం గురించి వివరించాడు.

💠 ఈ ఆలయ స్థలంలో కపిలముని ఒత్తిడితో సూర్యుడిని తన ఆశ్రమంలో ఉన్న శివుడిని 'సూర్య రూప మహేశ్' అని కూడా పిలుస్తారని పురాణాలలో పేర్కొనబడింది. ముని సూర్యదేవునికి కపిల గోవును దానం చేశాడు.

💠 మరొక నమ్మకం ప్రకారం, రామాయణ కాలంలో రాముడు వనవాస సమయంలో కాంతర్ పొదలలో కపిలముని ఆశ్రమాన్ని సందర్శించాడని కూడా చెబుతారు. 

ఆ సమయంలో ఋషులు శీతల నీటిలో స్నానం చేసి శివునికి అభిషేకం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు, వేడి నీరు లేకపోవడంతో, శ్రీరాముడు భూమిలో బాణాల ప్రవాహాన్ని సందిచాడు. 

అక్కడ ఒక వేడి నీటి కొలను ఏర్పడింది.

దీనిని 'సూర్య కుండ్' అని పిలుస్తారు. 

నేటికీ ఈ సూర్య కుండ్ ఉంది.

💠 సూర్య భగవానుడు  కాంతేశ్వరాలయం గొప్పతనాన్ని వివరించాడు. 

సూరత్‌లోని ఈ పురాతన మహాదేవ్ ఆలయం సత్యయుగం, త్రేతా  ద్వాపర యుగంలో స్థాపించబడిందని నమ్ముతారు. 

కాంతేశ్వర్ మహాదేవ్ మహాదేవ్ పై స్థానికులకు అచంచలమైన విశ్వాసం ఉంది.

 శ్రావణ మాసం మరియు మహాశివరాత్రి సమయంలో ప్రజలు ఇక్కడకు వేల సంఖ్యలో వస్తారు. 

💠 1968లో కైవల్య మహంత్ స్వామి నృసింహగిరి ద్వారా కాంతేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని పునర్నిర్మించి అందమైన మరియు అద్భుతమైన దేవాలయంగా నిర్మించారు. జానపద కథల ప్రకారం, కాంతేశ్వర్ మహాదేవ్ ఆలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి కతర్గాం అని పేరు పెట్టారు.

💠 సూరత్‌లోని కటార్గాం నడిబొడ్డున ఉన్న కాంతేశ్వర్ మహాదేవ్ మందిరం ఆధ్యాత్మిక భక్తి మరియు నిర్మాణ నైపుణ్యానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలుస్తుంది.

💠 కాంతేశ్వర్ మహాదేవ్ మందిర్ యొక్క వాస్తుశిల్పం సాంప్రదాయ భారతీయ ఆలయ రూపకల్పన మరియు క్లిష్టమైన హస్తకళల సామరస్య సమ్మేళనం. 

 ఈ మందిరం హిందూ పురాణాలు మరియు శివుని కథల దృశ్యాలను వర్ణిస్తూ, చక్కగా చెక్కబడిన రాతి శిల్పాలతో అలంకరించబడిన ఒక గొప్ప ప్రవేశద్వారం కలిగి ఉంది.  

విస్మయం కలిగించే శిఖరం గంభీరంగా  అందమైన కలశంతో  చేయబడింది, ఇది ఆలయ దైవిక సంబంధాన్ని సూచిస్తుంది. 

💠 పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా సూరత్‌లోని పురాతన మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన 'కాంతేశ్వర్ మహాదేవ్' ఆలయానికి శివ భక్తులు పోటెతుత్తారు. దేవాలయం యొక్క పురాతన వాస్తుశిల్పం, శివలింగం, జల్కుండ్ మరియు నంది సంవత్సరాలుగా ప్రాచీనమైన స్థితిలో ఇక్కడ ప్రతిష్టించబడ్డాయి. 

💠 ఈ ఆలయం సంవత్సరాలుగా మతపరమైన పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ది చెందింది.

శ్రావణ మాసం మొదటి రోజు నుంచి కాంతేశ్వరాలయంలో శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేవాధిదేవ్ మహాదేవుని శివలింగానికి బిల్వపత్రాలు, పువ్వులు, పాలు మరియు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడానికి భక్తులు పెద్ద క్యూలలో బారులు తీరుతున్నారు.

 (((((ఆలోచనాలోచనాలు ))))) అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక.                    1* అజ్ఞానం ఇచ్చిన ధైర్యాన్ని విజ్ఞానం ఇవ్వదు.    2* అభిమానం లోనికి ప్రవేశిస్తే, అభివృద్ధి వెలుపలికి నడుస్తుంది.          3* సత్యం చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం భూప్రదక్షిణం చేసివస్తుంది.                         4* మనిషిని చులకన చేసేది "తన గొప్ప తాను చెప్పుకోవడమే!"                   5* ఉన్నతులు"ఆశయాల" కొరకు జీవిస్తారు. అల్పులా? వారు"ఆశల" కొరకు జీవిస్తూవుంటారు.        6* ఉపకారం చేయలేని దుర్బలుడు కూడా చేయగల గొప్ప ఉపకారం , ఇతరులకు "అపకారం" తలపెట్టకపోవడమే!              7* సంపదలు మనిషిలోని అవగుణాలను బహిర్గతం చేస్తాయి. కష్టాలా? అవి వ్యక్తి లోని సుగుణాలను వెలువరిస్తాయి.                      8* కోర్కెలను మనం తినుట లేదు. నిజానికి కోర్కెలే మనలను తినివేస్తున్నాయి.                  9* గుంపుకు అనేక శిరస్సులు ఉంటాయి. కానీ వాటిలో "మెదళ్ళు"మాత్రం ఉండవు.                              10* గణం కాదు ప్రధానం; గుణం. రాశి కాదు ప్రధానం, వాసి.                                   11* అది ఏడంతుల భవనమే కావచ్చు; పసిబిడ్డలు నడయాడకపోతే అది గృహమని పిలువబడదు. అదొక దయ్యాలకొంప.              12* మనలో చాలామంది తట్టుకోలేనంత శక్తిగల ఆయుధం,"" నిశ్శబ్దం.""          ""ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః"" ఋగ్వేదం 1వ మండలం, 89వ సూక్తం.         " మనకు అన్ని వైపులనుండి ఉదాత్త భావనలు లభించుగాక!"       (Let noble thoughts come from every side.).                 తేది 1--12--2023, శుక్రవారం, శుభోదయం.

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *93వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శుక్రగ్రహ చరిత్ర - 5*

వృషపర్వుడు సభలో ఉన్న రాక్షస వీరులతో తమ గురువు శుక్రులవారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం చర్చిస్తున్నాడు. చారుడు వచ్చి నమస్కరించాడు.

*"దేవతలు మన మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. వాళ్ళ గురువు బృహస్పతి. ముహూర్తం నిర్ణయించే ఆలోచనలో ఉన్నాడు !"* చారుడు వినయంగా అన్నాడు.

*"ఎంత దుర్మార్గం ! గురుదేవులు లేని సమయం చూసుకుని ఆ ఇంద్రుడు రెచ్చిపోతున్నాడు !"* ఒక రాక్షస వీరుడు హుంకరించాడు.

*"గురుదేవులు మనలను యుద్ధానికి వెళ్ళ వద్దన్నారు కదా !"* మరొక రాక్షస ప్రముఖుడు సందేహం వ్యక్తం చేశాడు.

*"మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఏలికా ! ఆ దేవతలే మన మీదికి దూకుతారు !"* దారుడు వృషపర్వుడిని హెచ్చరించాడు.

అందరూ వృషపర్వుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వృషపర్వుడు అందరినీ కలియజూసి ఇలా అన్నాడు. *"మన గురుదేవులు మనలను దేవతల పైకి దండయాత్ర చేయవద్దన్నారు. దేవతలే ముట్టడిస్తే యుద్ధం చేయవద్దు అనలేదు ! దేవ సైన్యానికి గుణపాఠం నేర్పుదాం ! సిద్ధకండి !".*

*********************************

తమ వైపు దూసుకు వస్తున్న దేవ సైన్యాన్ని రాక్షస సేన నిలువరించింది. యుద్ధం ప్రారంభమైంది. అచిరకాలంలోనే యుద్ధం భీకరంగా మారింది.

బృహస్పతి ఊహించినట్టుగానే , యుద్ధ తంత్రాన్ని బోధించే గురువు లేని కారణంగా రాక్షస వీరులు కుప్పలుతెప్పలుగా శవాలుగా మారుతున్నారు. యుద్ధం కొనసాగించినా రాక్షసకులానికి నష్టమే ! వెన్ను చూపినా నష్టమే ! దేవతలు వెంటాడకుండా వదులుతారన్న నమ్మకం లేదు. ఆ విషమ పరిస్థితిలో ఏం చేయాలో పాలు పోలేదు వృషపర్వుడికి , ముందు మృత్యువు , వెనక వినాశం !

వృషపర్వుడు దిక్కుతోచని పరిస్థితిలో - శుక్రుడి తల్లిదండ్రులను కలుసుకుని రాక్షసకులానికి దాపురించిన మహాకష్టం గురించి వివరించాడు. యుద్ధ రంగంలో దేవతల ధాటికి రాక్షసులు లెక్కకు మిక్కిలిగా చనిపోతున్నారనీ , ఏదో ఉపాయం ఆలోచించి రక్షించాలని వాళ్ళను ప్రార్ధించాడు.

పులోమ భర్త అనుమతి తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళింది. తన పాతివ్రత్య మహిమతో - దేవసైన్యం చలనంలేని స్థాణువుల్లా ఉండిపోయేలా చేసి వేసింది ! ఎక్కడ ఉన్న దేవతలు అక్కడే విగ్రహాల్లా ఉండిపోయేసరికి , రాక్షస సైన్యం విజృంభించి స్వైర విహారం చేయసాగారు.

శుక్రుడి తల్లి మూలంగా దేవతలకు ఎదురైన కష్టం ఇంద్రుడిని ఉక్కిరిబిక్కిరి. చేసింది. బృహస్పతి సూచనను అనుసరించి ఇంద్రుడు శ్రీమహావిష్ణువును శరణుకోరాడు. విష్ణువు హుటాహుటిన యుద్ధరంగం చేరుకున్నాడు.

భృగుపత్ని పులోమ సజీవంగా ఉన్నంతకాలం దేవతలు చలనరహితంగానే ఉండిపోతారని గ్రహించిన విష్ణువు , విధిలేని పరిస్థితిలో తన చక్రాయుధంతో పులోమ శిరస్సు ఖండించాడు. పులోమ మరణంతో దేవతలకు చలనం లభించింది. వృషపర్వుడు ఆక్రోశిస్తూ భృగుమహర్షి వద్దకు వెళ్ళి , పులోమ దుర్మరణం గురించి చెప్పాడు.

మహర్షి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ యుద్ధ భూమి చేరుకున్నాడు. శరీరం నుండి వేరైపోయి దూరంగా పడి ఉన్న పులోమ శిరస్సును మొండేనికి అనుసంధానించాడు. అమోఘమైన తన తపశ్శక్తితో ఆమెను బ్రతికించాడు.

పులోమ భర్త పాదాలకు ప్రణామం చేసింది. తమ వైపు ఆశ్చర్యంతో చూస్తున్న విష్ణువును నిప్పులు కక్కుతూ చూశాడు భృగుమహర్షి

*"స్త్రీ అని కూడా గౌరవించకుండా , నా భార్యను హతమార్చావు ! స్త్రీ హత్య మహాపాతకం ! అది నిన్ను వదిలిపెట్టదు. భవిష్యత్తులో మానవుడుగా జన్మిస్తూ , భూలోకంలో కష్టదుఃఖాలూ , వియోగాలూ అనుభవించు !"* అంటూ శపించాడు.

ఆయన శాపంతో దేవతలు నిర్ఘాంతపోయారు. యుద్ధం ఇంక కార్యసాధకం కాదని గ్రహించి , వెనుతిరిగి వెళ్ళిపోయారు.

వృషపర్వుడు పులోమాభృగు దంపతులకు ధన్యవాదాలు తెలియజేశాడు.

*"సమీప భవిష్యత్తులో ఇంద్రుడు మీ మీద యుద్ధానికి వచ్చే సాహసం చేయడు ! మా పుత్రుడు మృతసంజీవనితో తిరిగి వచ్చే దాకా , సైన్యాన్ని పటిష్టపరుచుకో !"* అంది వృషపర్వుడితో పులోమ.

***********************************

జయంతికి ఎవరో మేల్కొలిపినట్టు మెలకువ వచ్చింది. అలవాటు ప్రకారం శుక్రుడి వైపు చూసింది. ఆకలి దప్పులను పూర్తిగా విస్మరించిన శుక్రుడి కఠోర తపస్సు నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఇంకా ఎంత కాలం సాగుతూ ఉండి పోతుందో తనకు తెలీదు. ఆయన తపస్సు సాగినంత కాలం తన సపర్య సాగుతూనే ఉంటుంది !

ఉషోదయం అవుతోంది. జయంతి లేచి నిలుచుంది. దివ్యమైన తపోదీక్షలో సూర్యుడిలా వెలిగిపోతున్న శుక్రుణ్ణి క్షణకాలం భక్తితో , అనురక్తితో చూసి సెలయేటి ' వైపు అడుగులు వేసింది.

ఆయన సన్నిధిలో చక్కగా అలకాలి. పుప్పొడులతో ముగ్గులు పెట్టాలి. అరటి ఆకులతో నీడ ఏర్పాటుచేసి , కదళీపత్ర వీవనతో విసరాలి. తన దినచర్యను తృప్తిగా గుర్తు చేసుకుంటోంది , నడుస్తూ జయంతి.

ఉన్నట్టుండి ఢమరుక నాదం మృదంగ ధ్వనిలా వినిపించసాగింది. ఢమరుక ధ్వనితో శుక్రుడి శరీరం సున్నితంగా చలిస్తోంది. ఇన్నాళ్ళూ నిశ్చలంగా ఉండిపోయిన ఆయన కనుబొమలు కొద్దిగా స్పందిస్తున్నాయి. ఢమరుక ధ్వని ఆగింది.

*"శుక్రా !"* మేఘ ధ్వనిలా గంభీరంగా విన వచ్చింది పిలుపు.

శుక్రుడి సర్వస్వమూ తదేక ధ్యానానికి స్వస్తి చెప్పింది. ఆయన కళ్ళు విచ్చుకున్నాయి.

*"వత్సా , శుక్రా !"* గంభీర కంఠంతో వాత్సల్యం ధ్వనించింది.

శుక్రుడి విశాల నేత్రాలు ఇంకా విచ్చు కున్నాయి. ఆయన కళ్ళెదుట పరమశివుడు.

చిరునవ్వు దివ్వెతో దీవిస్తూ తన ముందు సాక్షాత్కరించిన పరమేశ్వరుడి ముందు శుక్రుడు సాగిలపడిపోయాడు.

*"శుక్రా ! నీ తపస్సు నన్ను ఇక్కడకు రప్పించింది ! ఏం కావాలో కోరుకో !"*

శుక్రుడు పైకి లేచి , చేతులు జోడించాడు. ఆనంద భాష్పాలు నిండుతున్న కళ్ళతో ఇష్టదైవాన్ని చూశాడు. *"పరమేశ్వరా ! మృతసంజీవనీ విద్య ప్రసాదించు !".*

*"అలాగే ! దగ్గరగా రా ! మృతసంజీవనీ మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను !"* శివుడు నవ్వుతూ అన్నాడు.

శుక్రుడు పరమశివుడిని సమీపించి , వినయంగా చెవి వొగ్గి , నిలుచున్నాడు. పరమేశ్వరుడు మంత్రోపదేశం చేస్తున్న అనుభూతి కలుగుతోంది శుక్రుడికి.

*“వత్సా , మృతసంజీవని నీకు సిద్ధించింది ! వెళ్ళు ! శుభం భూయాత్ !"* అన్నాడు. శివుడు, శుక్రుడు కళ్ళు తెరిచి చూశాడు. చెయ్యెత్తి దీవిస్తూ పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు.

అంతర్థానమైన శివుడికి తన అంతరంగంలో ధన్యవాదాలు అర్పించుకుంటూనే ఉన్నాడు శుక్రుడు.

తన పాదాల వద్ద నేల మీద కనిపిస్తున్న ముగ్గుల్నీ , ఆ ముగ్గుల మీద అలంకరించబడిన పువ్వుల్నీ ఆశ్చర్యంగా చూశాడు శుక్రుడు. ఆయన కనుబొమలు మధ్యలో కలుసుకున్నాయి. ఎవరు ? ఎవరు చేశారీ అలంకరణ. గట్టిపడిన నేలను చూస్తుంటే ముగ్గుల అలంకరణ చాలా రోజులుగా సాగుతున్నట్టు బోధపడుతోంది. తపస్సులో ఉన్న తనకు ఎవరో సేవలు చేశారా ? ఎవరు ? ఎందుకు ?...

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 103*

*"నాలోనూ కులతత్వమా?''*

కాశీ నుండి అయోధ్య లక్నోలో మీదగా  ఆగ్రా ,

ఆగ్రా నుండి స్వామీజీ బృందావనం బయలుదేరారు. చివరి 30 మైళ్ల దూరం ఆయన కాలినడకనే వెళ్లాల్సివచ్చింది. బృందావనం ఇక రెండు మైళ్లు మాత్రమే ఉందనగా స్వామీజీని ఆకలి, అలసట ఆవహించాయి. దారిలో ఒక వ్యక్తి కూర్చుని తాపీగా హుక్కాతో పొగ త్రాగుతూ ఉండడం స్వామీజీ కంటపడింది. కాస్త పొగ పీలుస్తే ఉత్సాహం వస్తుందని స్వామీజీ అతణ్ణి సమీపించి తమ ఆకాంక్షను తెలియజేశారు. 

అందుకు ఆ వ్యక్తి, "అదెలా స్వామీ? నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాణ్ణి. నా హుక్కా ఉపయోగించి మీరు పొగ త్రాగడమా?" అని అడిగాడు. 'నిజమే కదా! ఇతగాడి హుక్కా ఉపయోగించి నేను పొగ త్రాగడమా?' అనుకొని స్వామీజీ అక్కణ్ణుండి కదలి వెళ్లిపోసాగారు. అలా కాస్త దూరం వెళ్లగానే హఠాత్తుగా ఆయన మనస్సులో ఠక్కున ఈ ఆలోచన మెదలింది: 

'ఏమిటి! నేనొక సన్న్యాసిని,కులతత్వం, కులప్రతిష్ఠ లాంటి వాటన్నింటినీ త్యజించానని ప్రతిజ్ఞ చేశాను కదా! ఒక్క క్షణంలో ఇలా నన్ను నేను మరిచిపోయానే!' ఈ ఆలోచన మెదలీమెదలగానే స్వామీజీ సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. వెంటనే వెనుకకు తిరిగి అతడి వద్దకొచ్చి, "సోదరా! పొగ సిద్ధంచేయి" అన్నారు. ఆ వ్యక్తి మళ్లీ, "స్వామీ, మీరొక సన్న్యాసి, నేనో అస్పృశ్యుణ్ణి" అన్నాడు. 

ఇప్పుడు స్వామీజీలో ఎలాంటి సంశయమూ లేదు, అసందిగ్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా ఆతడి హుక్కా ఉపయోగించి పొగ త్రాగిన తరువాతే అక్కణ్ణుండి బయలుదేరారు. 

తప్పు చేయడమో, పొరబడడమో నేరం కాదు; తప్పు అని తెలుసుకొని దానిని సరిదిద్దుకోవడమే పురోగమన మార్గం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ మనం సమర్థంగా ఎదుర్కోవడం అసాధ్యం; కాని వాటన్నింటి నుండి గుణపాఠం నేర్చుకోవడం సాధ్యమే; గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో పురోగమించి లక్ష్యం సాధించగలుగుతాం.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *🌹సౌందర్యలహరి🌹*

. *శ్లోకం - 93*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

  *అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే*

 *జగత్త్రాతుం శంభో ర్జయతి కరుణా కాచిదరుణా ‖*

క్రిందటి శ్లోకములో అమ్మవారి యెర్రని వర్ణము, ఆమె సదాశివుని వామాంకము పై కూర్చొనగా, స్ఫటికము వలె తెల్లగా వున్న ఆయన కూడా అరుణ వర్ణమును పొందాడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ అరుణ వర్ణము కరుణకు సంకేతముగా శంకరులు వర్ణిస్తున్నారు.

 శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము యొక్క రెండవ ధ్యాన శ్లోకములో *అరుణాం కరుణా తరంగితాక్షీమ్* అని చెప్పారు. కరుణ, ఉదయించే సూర్యుని అరుణ వర్ణములో తరంగములుగా అమ్మవారి దయార్ద్రమైన కనుల నుండి ప్రసరిస్తున్నదట. అమ్మా నీవు సాక్షాత్తు కరుణవు అంటున్నారు ఈ సౌందర్యలహరి శ్లోకంలో. కరుణయే అరుణగా సాక్షాత్కరిస్తున్నది. ఎవరి కరుణ? 

శంభోః = శంభుని కరుణ. శివుడూ పార్వతి వేరు కాదు ఒకటేనని చాలా సందర్భాలలో చెప్పుకున్నాము. మన కుటుంబములలో కూడా చూడండి. తండ్రికి కూడా బిడ్డలపై ప్రేమ, కరుణ ఉంటాయి. కానీ అవి తల్లి ద్వారానే ప్రకటితమవుతాయి. అలాగే ఇక్కడ అయ్యవారి కరుణ, అమ్మవారి ద్వారా ప్రసరిస్తున్నది.

జగత్త్రాతుం = జగత్తును రక్షించటానికి 

కాచిదరుణా = అనిర్వచనీయమైన కరుణ.

అరాళా కేశేషు =అమ్మవారి కేశపాశము వంకీలు తిరిగి అందముగా ఉన్నదట.

ప్రకృతి సరళా = ప్రకృతి సహజమైన 

మందహసితే = చిరునవ్వు చిందిస్తున్నారట.

 సరళా అంటే వంకర లేని అని కూడా అర్ధం కదా! అంటే కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వు. చిరునవ్వు కారుణ్య స్వభావానికి ప్రతీక.

శిరీషాభా చిత్తే = ఆమె మనసు శిరీష పుష్పము (దిరిసెన పూవు) వలె కోమలముగా సున్నితముగా ఉన్నదట.

దృషదుపలశోభా కుచతటే = వక్ష స్థలము రాయి వలె కఠినముగా ఉన్నదట.

భృశం తన్వీ మధ్యే = ఆమె నడుము సన్నగా వున్నది.

పృథురురసిజారోహ విషయే = జగత్తును పోషిస్తున్న ఆమె వక్షము విశాలముగా వున్నది.

ఈ విధముగా ఈ శ్లోకములో ద్వంద్వములు చెప్తున్నారు శంకరులు. ఇవన్నీ జగత్తుకు మేలు చేసేవే.

          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 17*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*17. తిరునాళైపోవార్ నాయనారు*

 *(నందనార్ చరిత్ర)*

కొళ్లిడం నదీతీరంలో ఉన్న ఒక అందమైన గ్రామం ఆదనూరు. ఈ గ్రామానికి బాహ్యప్రదేశంలోని ఒక దళిత వాడలో నందనారు జన్మించాడు.

పుట్టినప్పటి నుండి పరమేశ్వరుని తిరుచరణాలను సదా ధ్యానిస్తూ వచ్చాడు

నందనారు. ఇతడు శివాలయంలోని భేరీ, మృదంగం మొదలైన

వాయిద్యాలకు కావలసిన చర్మాన్ని, వీణ మొదలైన వాయిద్యాలకు

తంత్రులుగా నరాలను అందిస్తూ ఉండేవాడు. 

ఈ విధంగా స్వామి

కైంకర్యాన్ని చేస్తూ వచ్చిన నందనారు గుడి వాకిలి దాటక అక్కడి నుండే

స్వామిని దర్శిస్తూ, నోరారా స్వామిని గానంచేస్తూ ఆనందించేవాడు.

ఆదనూరుకు సమీపంలో తిరుప్పునూరు అనే గ్రామంలో వెలసిన

పరమేశ్వరుని దర్శించాలనే ఆకాంక్షతో నందనారు అక్కడికి వెళ్లి గుడి

వాకిలి ముందు నిలబడి చూశాడు. కాని నందీశ్వరుడు అడ్డంగా ఉండడం

వలన నందనారుకు స్వామి దర్శనం కలగలేదు. 

స్వామిని దర్శించ

లేకపోయాననే తీవ్రమైన సంతాపంలో నందనారు మునిగిపోయాడు. భక్తుని

ఆవేదనను గుర్తించిన కరుణామూర్తి అయిన శివుడు అడ్డంగా ఉన్న

నందీశ్వరుని పక్కకు తొలగమని ఆజ్ఞాపించాడు. నందనారుకు స్వామిని

నేరుగా దర్శించడానికి వీలయింది.

 ఒక పర్యాయం నాయనారు చిదంబరంలోని నటరాజ స్వామిని దర్శించాలను కున్నాడు. కాని “పవిత్రమైన చిదంబరంలోని శివాలయానికి

నాలాంటి అపవిత్రుడు, నిమ్నకుల సంజాతుడు వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది?” అని తన ప్రయత్నాన్ని విరమించు కున్నాడు.

నందనారు ఒకరోజు చిదంబరం వెళ్లాలని గట్టిగా నిశ్చయం చేసుకొని ఆలస్యం చేయక వెంటనే బయలుదేరాడు. 

చిదంబరం పొలిమేరలు

చేరుకున్నాడు. కాని తన కులాన్ని తలచుకొని చిదంబరం నగరంలోనికి

అడుగుపెట్టకుండా అక్కడే నిలిచాడు. “నేను జన్మించిన ఈ కులం నాకు

అడ్డంకిగా ఉంది” అంటూ చిదంబరానికి వెలుపల ప్రదక్షిణంగా వచ్చాడు.

ఈ విధంగా ఎన్నో రోజులు చిదంబరాన్ని ప్రదక్షిణం చేస్తూ వచ్చిన నందనారుకు పరమేశ్వరుడు ఒకరోజు కలలో కనిపించి "భక్తుడా! నీకు

సంక్రమించిన ఈ నీచకులం తొలగిపోవాలంటే నీవు నిప్పుల్లో నడిచి

తిల్లైలోని బ్రాహ్మణులతో కలసి నాముందుకు రా!" అని చెప్పాడు.

బ్రాహ్మణులు అగ్నిని ప్రజ్వలింపజేశారు. నందనారు సంతోషంతో

పరమేశ్వరునికి చేతులు మోడ్చి నమస్కరించి పవిత్ర పంచాక్షరీ మంత్రాన్ని

పఠిస్తూ అగ్నిగుండంలో ప్రవేశించాడు. కెందామరల నుండి నడిచి వచ్చినట్లు

నందనారు అగ్నిగుండం నుండి బయటకు వచ్చాడు. 

అతని రూపం పూర్తిగా

మారిపోయింది. 'పవిత్రమైన యజ్ఞోపవీతం వేలాడుతుండగా, ముని

వేషధారియై బ్రహ్మదేవుని తలపించేలా, నందనారు కనిపించాడు. తిల్లెలోని

బ్రాహ్మణులందరూ చేతులు మోడ్చి నందనారుకు నమస్కారం చేశారు.

నందనారు మెల్లగా శివాలయంలోనికి ప్రవేశించాడు. నటరాజస్వామి

సన్నిధిలోనికి వెళ్లగానే నందనారు అంతర్ధానమయ్యాడు. కైలాసంలో

ఎల్లప్పుడూ తన సన్నిధిలో ఉండే వరాన్ని నందనారుకు అనుగ్రహించాడు

పరమేశ్వరుడు.

*పదిహేడవ చరిత్ర సంపూర్ణం*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 17*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో*

*ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |*

*కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం*

*నిలింపానాం శ్రేణి ర్నిజకనకమాణిక్యమకుటైః ||*

తాత్పర్యం: ప్రభూ, స్వామీ! నేను చేసిన పుణ్య ఫలములవల్ల కానీ, నీకు నాయందు కల దయవల్ల కానీ, నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా , నీ పవిత్ర పాదపద్మ యుగళమును నేను ఎలా చూడగలను?  నీకు నమస్కరింౘడానికై తొందర పడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ  కిరీటములను  మీ పాదములయందు మోపి, నాకు అడ్డుపడుతున్నారు. (దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, ఎప్పుడూ నీ పాదములపై తమ స్వర్ణ, రత్న కిరీటములు మోపి, సాష్టాంగ నమస్కారాలు చేయడానికి తొందరపడుతూ ఉంటారు. ఆ కిరీటములు నా దృష్టులను అడ్డగించడంవల్ల, నేను నీ పాద  పద్మాలను చూడలేక పోతున్నాను.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||

శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||

శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచ తప్పకుండా పాటిస్తానని

మాటఇచ్చి పాదాభివందనం చేశాడు. మహారాజు వేదపండితులనూ ఋత్విక్కులను ఆహ్వానించి

పట్టాభిషేకానికి త్వరత్వరగా ఏర్పాట్లు అన్నీ చేయించాడు. సర్వతీర్థాలనుంచీ పవిత్రోదకాలను రప్పించాడు.

ప్రజలను ఆహ్వానించాడు. సామంతులను పిలిపించాడు. మంచిరోజున శుభముహూర్తాన అభిషేకించి

త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు. తాను భార్యాసహితుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగాతీరంలో చాలాకాలం తీవ్ర తపప్పుచేపి దంపతులిద్దరూ దివంగతులయ్యారు. దేవపూజితులయ్యారు. అరుణుడు

స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు.

ఆదిపరాశక్తి అనుగ్రహంవల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడై సత్యవ్రతుడు అయోధ్య కు

పట్టాభిషిక్తుడైన ఈ శుభవార్త తెలిసి వసిష్ఠుడూ సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించిందికదా అని ప్రసన్నుడు అయ్యాడు.

సత్యవ్రతుడు సనాతనధర్మమార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీమహాయజ్ఞాలను అనేకం

నిర్వహించాడు. ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు. శుభలక్షణ

సమన్వితుడు. అతడిని యువరాజును చేసిన త్రిశంకుడు మానుషశరీరంతో స్వర్గానికి వెళ్ళాలని భావించాడు.

వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.

 *కార్తిక పురాణము - 19*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔

కార్తిక పురాణము - పంతొమ్మిదవ అధ్యాయము

జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను, దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రందున్న శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచరప్రాణులచే స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవిభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్నరూపుడవు నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈజగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ కృష్ణా! నీకు నమస్కారము. ఓయీశ్వరా! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శనఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ నమస్కారము. ఓదేవేశా! నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా, పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు. గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు నమస్కారము.

ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు నమస్కారము. వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు. అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి నీరూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా! నీస్తోత్రమునకు సంతోషించితిని. నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను. కోరుకొనుము. అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను. గోవిందా నాయందు దయయున్నయెడల నీస్థానమును యిమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను. ఓజ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును. కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు. బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును జెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము.

నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచాతుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్యఫలమును బొందును. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా యీనిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననసరించి నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు. నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠింు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోను ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు గాని, ఎవరైనను హరిపరాయణులై ఈనాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను. ఈచాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుంిన యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసికొని చాతుర్మాస్యమునందు హరిని బూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందెడి గతిని బొందును. సందేహము లేదు. పరమాత్మతుష్టిై చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వానిఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసికొని ఏవిధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణులోకమును జేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయిరి.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః

 (01-12-2023) రాశి ఫలితాలు

మేషం

 01-12-2023

స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. 

---------------------------------------

వృషభం

 01-12-2023

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

---------------------------------------

మిధునం

 01-12-2023

సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

కర్కాటకం

 01-12-2023

భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.

---------------------------------------

సింహం

 01-12-2023

నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

---------------------------------------

కన్య

 01-12-2023

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

తుల

 01-12-2023

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

 01-12-2023

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు

 01-12-2023

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందితుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మకరం

 01-12-2023

 చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు.

---------------------------------------

కుంభం

 01-12-2023

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

---------------------------------------

మీనం

 01-12-2023

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

---------------------------------------

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔

*శ్లోకం*

*సంసారజాలపతితస్య జగన్నివాస*

*సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ*

*ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||

_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 08_* _

తా॥

సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధనుండి తొలగించి యుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్థి - పునర్వసు -‌  భృగు వాసరే* (01.12.2023)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

https://youtu.be/Tt7QACcVKsk?si=q54WfVfyxDqFMLRE

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

*పాండిత్యమూ..పరామర్శా..*

*(నలభై నాలుగవ రోజు)*

"ఏమయ్యా!..చాలాదూరం నుంచి వచ్చినట్లువున్నారే!..బాగున్నారా?.." అని శ్రీ స్వామివారు ఆ పండితులవారిని అడిగారు..

మొగలిచెర్ల గ్రామం చేరింది మొదలు..తన పాండిత్యం గురించి..దొంగ సాధువుల గురించి..కుహనా యోగుల గురించి..అన్నింటికీ మించి శ్రీధరరావు దంపతుల తెలివి తక్కువ గురించి..అనర్గళంగా మాట్లాడుతూ..శ్రీ స్వామివారిని కలిసి ఆయన లోని విషయపరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఆ పండితుల వారు..శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణం నుంచీ..నిర్ఘాంతపోయి వున్నారు..శ్రీ స్వామివారి చల్లని చూపులో ఏదో తెలియని మహత్తు దాగి వుందని ఆయనకు తోచింది..ఆయన శరీరం ఒకానొక జలదరింపుకు గురవడం స్పష్టంగా తెలుస్తోంది.. తనకెదురుగా త్రిమూర్త్యావతారుడు అయిన ఆ దత్తాత్రేయుడు దిగంబరంగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది..అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసారు..

శ్రీ స్వామివారు  ఈ ప్రశ్న అడిగి మళ్లీ పాక లోపలికి వెళ్లి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..ముందుగా మీరాశెట్టి దంపతులు..ఆ తరువాత పండితుల వారు, చివరగా శ్రీధరరావు ప్రభావతి గార్లు పాక లోకి వెళ్లి, శ్రీ స్వామివారి కెదురుగా బల్లల మీద కూర్చున్నారు..

"రేపటి నుంచి ఇంకొక ఇద్దరు ముగ్గురు పని వాళ్ళను ఎక్కువ పెట్టండి మీరాశెట్టీ..పని త్వరగా చేయిద్దాము..ఆశ్రమం తొందరలో పూర్తి కావాలి.." అన్నారు శ్రీ స్వామివారు.."అలాగే స్వామీ.." అన్నారు మీరాశెట్టి..

"చాలా ప్రయాసపడి వచ్చారు..పుట్టెడు సందేహాలతో వచ్చారు..ఇప్పుడు చెప్పండి..ఇంతదూరం నన్ను వెతుక్కుంటూ రావడం దేనికోసం?..పాండిత్యాన్ని నామీద ప్రయోగం చేయడానికేనా?..సరే కానివ్వండి..ఒక్క ప్రశ్న అడుగుతాను..నన్ను తెలుసుకుందామని వచ్చావా?..లేక నిన్ను నువ్వు తెలుసుకుందామని వచ్చావా?".. ఏక వచనం తో సంబోధిస్తూ అడిగారు పండితుని వైపు తిరిగి..

ఆ పండితుడే కాదు, శ్రీధరరావు ప్రభావతి గార్లు కూడా ఆశ్చర్యపోయారు..ఎందుకంటే.. ఈయన మొగలిచెర్ల వచ్చేదాకా ఆ దంపతులకు ఆయన వస్తున్న విషయం తెలీదు..అంతేకాక..తాము స్వామివారి దగ్గరకు ఇప్పుడు వచ్చే సంగతీ తెలియపరచలేదు..ఆయనెవరో శ్రీ స్వామివారికి తెలిసే అవకాశం లేదు..కానీ..శ్రీ స్వామివారు ఒక్క ముక్కలో..ఆ పండితుల వారి మనసులోని మాటను బైటపెట్టేసారు..

శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చుని చిరునవ్వుతో ఆయన వైపు చూడసాగారు..అప్పటిదాకా శ్రీ స్వామివారి ఎదురుగ్గా కూర్చుని ఉన్న ఆ పండితుల వారు..చప్పున లేచి నిలబడి..రెండు చేతులూ జోడించి..నమస్కారం చేస్తూ.."స్వామీ నన్ను మన్నించండి..అహంకరించాను.." అంటూ..శ్రీ స్వామివారి పాదాలకు తన చేతులు తగలకుండా..కొద్దిగా ఎడంగా ఆనించి..శిరస్సు వంచి నిలబడ్డారు..

శ్రీ స్వామివారు తన కుడి చేత్తో వారి తలపై తాకి..ఆశీర్వదించి.."తెలుసుకోవలసింది చాలా ఉంది..ఇప్పటికైనా సమయం మించిపోలేదు..అహం తొలగించుకుంటే శరణాగతి సాధ్యం అవుతుంది.." అన్నారు..శ్రీధరరావు దంపతుల వైపు తిరిగి.."ఇక్కడకు వచ్చి మంచిపని చేసారు.. పొద్దుపోక ముందే మళ్లీ బైలుదేరండి..శుభం జరుగుతుంది.." అన్నారు.

మీరాశెట్టి దంపతులు తాము కొద్దిసేపు అక్కడవుండి.. పని పురోగతి చూసుకొని రాత్రికి మొగలిచెర్ల వస్తామని చెప్పి..ప్రక్కకు వెళ్లిపోయారు..శ్రీధరరావు ప్రభావతి గార్లు ఆ పండితుల వారు తిరిగి బండిలో కూర్చుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు..

"అమ్మాయీ..నేను తొందరపడ్డానమ్మా..శ్రీధరా..మీరిద్దరూ అదృష్టవంతులు..ఆయన సిద్ధపురుషుడు..సామాన్యుడు కాదు..ఎంత సులభంగా నాకు బోధ చేశారు?..అన్ని అనర్ధాలకూ మూలమైన అహం నిర్మూలించుకోమన్నారు..ఇది నాకు గర్వభంగం కాదమ్మా..నాకు ఉపదేశం..మీరు శరణాగతి చెందారు..అందుకే ఆ మహానుభావుడి సేవ చేసుకునే భాగ్యం కలిగింది..ఆశ్రమం నిర్మిస్తున్న మీరాశెట్టి దంపతులకు ఎంత పుణ్యమో కదా?.." అన్నారు..ఆయన కళ్లనుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి..

దారిపొడుగునా శ్రీ స్వామివారి గురించే తలుచుకుంటూ పొంగిపోయారు.. ఆరాత్రి శ్రీధరరావు గారింట్లోనే గడిపి..తెల్లవారి తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..అంత పెద్ద పండితుడు తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లడం శ్రీధరరావు ప్రభావతి గార్లకూ సంతోషాన్ని కలుగచేసింది..

సమాధి గది నిర్మాణం....రేపటి భాగం..

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*

https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx

సర్వం..

శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

 శు భో ద యం🙏

అ ష్టా క్ష రి!!

"తపముల బోని పాపములు,దానగుణంబునబోని పాపముల్

జపముల నారిపోలి కలుషంబులు దుప్పరఁ దూలిపోవు,న

 చ్చపుఁ దలపొప్ప నొక్కపరి సర్వమునైన రమేశు పేరి,తీ

యపుబలు కొప్పుమీర మనమందిడినిల్పఁగనేర్పు గల్గినన్;

ఎఱ్ఱాప్రెగ్గడ-నృసింహపురాణము.

       మోక్షోపాధిని పొందటానికి సులభోపాయము.శ్రీహరి నామస్మరణమే!

        తపములు చేయనక్కరలేదు.జపములు అంతకన్నాచేయనవసరంలేదు.దానధర్మాలు చేయవలసిన పనీలేదు.

             చేయవలసినదంతా ఒక్కటే! పరిశుధ్ధమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని మంత్రాన్ని జపించటమే!

          నీకున్నబంధాలన్నీ తొలగిపోతాయి.నీవొనర్చినపాపాలన్నీ తప్పురాలినట్టు రాలిపోతాయి.

         సర్వేశ్వరుడైన ఆనారాయణుని దివ్యనామస్మరణమే జీవన్ముక్తికి సులువైన మార్గము.

                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷