1, డిసెంబర్ 2023, శుక్రవారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 103*


*"నాలోనూ కులతత్వమా?''*


కాశీ నుండి అయోధ్య లక్నోలో మీదగా  ఆగ్రా ,

ఆగ్రా నుండి స్వామీజీ బృందావనం బయలుదేరారు. చివరి 30 మైళ్ల దూరం ఆయన కాలినడకనే వెళ్లాల్సివచ్చింది. బృందావనం ఇక రెండు మైళ్లు మాత్రమే ఉందనగా స్వామీజీని ఆకలి, అలసట ఆవహించాయి. దారిలో ఒక వ్యక్తి కూర్చుని తాపీగా హుక్కాతో పొగ త్రాగుతూ ఉండడం స్వామీజీ కంటపడింది. కాస్త పొగ పీలుస్తే ఉత్సాహం వస్తుందని స్వామీజీ అతణ్ణి సమీపించి తమ ఆకాంక్షను తెలియజేశారు. 


అందుకు ఆ వ్యక్తి, "అదెలా స్వామీ? నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాణ్ణి. నా హుక్కా ఉపయోగించి మీరు పొగ త్రాగడమా?" అని అడిగాడు. 'నిజమే కదా! ఇతగాడి హుక్కా ఉపయోగించి నేను పొగ త్రాగడమా?' అనుకొని స్వామీజీ అక్కణ్ణుండి కదలి వెళ్లిపోసాగారు. అలా కాస్త దూరం వెళ్లగానే హఠాత్తుగా ఆయన మనస్సులో ఠక్కున ఈ ఆలోచన మెదలింది: 


'ఏమిటి! నేనొక సన్న్యాసిని,కులతత్వం, కులప్రతిష్ఠ లాంటి వాటన్నింటినీ త్యజించానని ప్రతిజ్ఞ చేశాను కదా! ఒక్క క్షణంలో ఇలా నన్ను నేను మరిచిపోయానే!' ఈ ఆలోచన మెదలీమెదలగానే స్వామీజీ సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. వెంటనే వెనుకకు తిరిగి అతడి వద్దకొచ్చి, "సోదరా! పొగ సిద్ధంచేయి" అన్నారు. ఆ వ్యక్తి మళ్లీ, "స్వామీ, మీరొక సన్న్యాసి, నేనో అస్పృశ్యుణ్ణి" అన్నాడు. 


ఇప్పుడు స్వామీజీలో ఎలాంటి సంశయమూ లేదు, అసందిగ్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా ఆతడి హుక్కా ఉపయోగించి పొగ త్రాగిన తరువాతే అక్కణ్ణుండి బయలుదేరారు. 


తప్పు చేయడమో, పొరబడడమో నేరం కాదు; తప్పు అని తెలుసుకొని దానిని సరిదిద్దుకోవడమే పురోగమన మార్గం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ మనం సమర్థంగా ఎదుర్కోవడం అసాధ్యం; కాని వాటన్నింటి నుండి గుణపాఠం నేర్చుకోవడం సాధ్యమే; గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో పురోగమించి లక్ష్యం సాధించగలుగుతాం.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: