24, జూన్ 2021, గురువారం

ధర్మం’ అంటే

 ‘ధర్మం’ అంటే ఏమిటి?  దానికి కల ఈ పది లక్షణాలు కలిగియున్న వ్యక్తి జీవితంలో అన్నిటినీ జయించినట్టే ! 

“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;


1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.


2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.


3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.


4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.


5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.


6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.


7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.


8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.


9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.


10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.


అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.


కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’. వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.


విశేష ధర్మాలు –

సామాన్య ధర్మాల వస్తే చెప్పవలసిన ధర్మాలు ఎన్నో వున్నాయి. సామాన్య ధర్మాలు అంటే శాస్త్రాలు చెప్పనివి చెప్పనక్కరలేని

చెప్పినవి కూడా సామాన్య ధర్మాల క్రిందకే వస్తాయి.


• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!

• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!

• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!

• భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం!

• సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!

• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!

• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!

• తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!

• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!

• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!

• అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!

• చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!

• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!

• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!

• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!

• సోమరితనం లేకుండటం పురుష ధర్మం! 🙏

పాటలీకుసుమప్రియా

 773. 🔱🙏 పాటలీకుసుమప్రియా 🙏🔱


ఎనిమిది అక్షరాల నామం. ఈనామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *పాటలీకుసుమప్రియాయై నమః* అని చెప్పాలి.

పాటలీ కుసుమ = పాటలీ పుష్పమునందు, 

ప్రియా = ప్రీతికలది.

అమ్మవారు సృష్టి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభించే పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టమే ! ' తీపి పదార్థాలంటే ఇష్టమైనా - మళ్ళీ ఆ తీపి పదార్థాల్లో ప్రత్యేకించి కొన్ని తీపి పదార్థాలంటే - మరీ ఇష్టం ఉంటూ ఉండటం సహజం. అలాగే పువ్వులన్నీ ఇష్టమే అయినా, సంపెంగ, మందార, దాడి మీ పుష్పాలలాగానే, 'పాటలీకుసుమం' అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇందుకు కారణం ఉంది.

ఈ తెలుపు ఎఱుపుల సమ్మిశ్ర వర్ణాన్ని 'పాటలవర్ణం' అంటారు. వాత్సల్యానికి, ప్రేమకు, ఆర్ద్రతకు, ఆప్యాయతకు చిహ్నమైన, సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది. అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంత ఇష్టం. హృదయంలోని ప్రేమను సూచించడానికి సంకేతించబడిన గులాబీ పువ్వు కూడా ఈ రంగులోనే ఉంటుంది. (Rose is for Love).

*పాటలీ కుసుమము* అనకుండా 'కుసుమ' అన్నా కూడా పాటలీ కుసుమమనే అర్థం చెప్పడం కూడా ఉంది. ఈ అర్థంలోనే హృదయాన్ని 'కుసుమపురం' అంటారు. అందరిలోని పాటలీ కుసుమ' వర్ణంలో ఉండే హృదయమే అమ్మవారికి ఇష్టమైన నివాసం కాబట్టి - అమ్మవారిని పాటలీ కుసుమప్రియా' అని అన్నారు.

అయ్యవారికి బిల్వవృక్షం ఇష్టమైతే - అమ్మవారికి పాటల వృక్షం ఇష్టమన్నమాట! పాటలీ కుసుమమునందు ప్రీతి కలది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం పాటలీకుసుమప్రియాయై నమః 🙏

🌷శ్రీ మాత్రే నమః 🌷

కైలాసమే కాశీ క్షేత్రం

 ఓం శ్రీ గురుభ్యో నమః లోకాః సమస్తా సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు

నమస్కారం, మీకూ, మీ కుటుంబ సభ్యులకూ మోక్షపురి కాశీకి సాదర స్వాగతం. ఉత్తర భారత దేశంలో భువిపై వెలసిన కైలాసమే కాశీ క్షేత్రం. అంతటి మహిమాన్వితమైన కాశీ యాత్రకు విచ్చేసే భక్తజనుల సౌకర్యం కోసం మన తెలుగు వ్యక్తి, శ్రీ గాయత్రీ మాత ఉపాసకులు అయిన  శ్రీ శ్రీ శ్రీ మహాదేవి మాతాజీ గారు కొన్ని అరుదైన సేవలను అందిస్తున్నారు.

     అందులో మొదటిది శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమము. 

శ్రీ కాశీ విశ్వేశ్వరుని మందిరానికి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే మా ఆశ్రమము ఉన్నది. భక్తులకు అందుబాటు ధరలలో వసతి ఏర్పాటు. పరిసుభ్రతతో కూడిన గదులు మరియు భోజన సదుపాయం కలదు. 

  2. కాశీ, కాశీ లోకల్, అలహాబాద్, గయ, బుద్ధ గయ, అయోధ్య, నైమిశారణ్యం... మొదలైన పుణ్య క్షేత్రాలకు మీ కోరిక పైన వాహన సదుపాయం ఏర్పాటు చేస్తాము.

3. కాశీ విశ్వేశ్వరుని అభిషేకము / మాతా అన్నపూర్ణ కుంకుమార్చన / అన్ని రకముల పితృ పూజలు జరిపించబడును.

4.  ప్రతీరోజూ నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ఎవరైనా పుట్టిన రోజు / వివాహ రోజు / పితృదేవతల రోజున వారి గోత్రనామాలచే అన్నదానం జరిపించాలని అనుకునేవారు మమ్మల్ని సంప్రదించగలరు.  బ్రాహ్మణులు అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు.

5. All India telugu purohithulu website ని మీకు అందుబాటులోకీ తెచ్చము. దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికి పురోహితులు అందుబాటులో ఉండేలా

    మేము మా దగ్గర పూర్తి వివరాలతో కూడిన పురోహితుల జాబితా ని తయారు చేస్తున్నాము. దీనిలో ప్రతి పురోహితుడు వారి అనుభవం,  గురువు గారి దగ్గర అభ్యసించిన విద్య వివరాలు, ఆధార్ కార్డు , మొబైల్ నెంబర్  వివరాలతో మా ఆశ్రమ వెబ్సైటు లో నమోదు చేసుకుంటారు. ఇది పూర్తిగా ఉచితం. 

6. SKG Subha mangal free matrimony  

              మా ముఖ్య ఉద్దేశం హిందూ సమాజాన్ని బలపరచడం , వధూ వరులని కలుపుటకు స�

Sri Kasi Gayatri Ashrama seva society H:NoD 47/118-157Ramapura Luxa road varanasi 221001

Contact No 9918774933,

7355096983

,8919123647


sethu2kasi@gmail.com


www. Kasiyatramokshayatra. Com

App in Google; Skg 

Ashram

ఓ తండ్రి కథ*

 

ఓ తండ్రి కథ* 

                🌷🌷🌷

సమయం ఉదయం పదకొండు గంటలు.  వీధి తలుపు తీసి బయటికి వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఓ వ్యక్తి కూర్చుని ఉండటం కనిపించింది.   దాదాపు అరవై ఏళ్ళుంటాయి అతనికి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడతను.  నల్లప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు.

         పూర్ణిమ ఎవరు కావాలన్నట్టు చూసింది అతని వైపు.

          "మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని       వెతుక్కుంటూ వెళ్ళాడు.  నన్నిక్కడ కూర్చోమని చెప్పాడు."

           అలాగే నన్నట్టు తలూపి, లోపలికి వెళ్ళింది పూర్ణిమ.

          ఓ గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే... ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉండటం కనిపించింది.  బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు.  ముఖం వాడిపోయి ఉంది. 

        " అరె... ఎంతసేపలా ఎండలో కూర్చుంటారు?  లోపలికి వచ్చి కూర్చోండి" అంటూ సిటౌట్లో కుర్చీ తెచ్చి వేసింది.  ఆయన కూర్చున్నాక త్రాగడానికి నీళ్లు ఇచ్చింది.  తర్వాత రస్నా కలిపి ఇచ్చింది.

         "ఎందుకమ్మా నీకు ఈ శ్రమ?" అంటూ మొహమాటపడుతూనే తీసుకున్నాడు.

         "ఇందులో శ్రమేం లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదా?"

          "లేదమ్మా. ఈకాలం పిల్లలు సుకుమారులు కదా.. ఈ ఎండకు కళ్ళు  తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది.                          "మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా?"

        "ఇందులో ఉందమ్మా. నేను చూస్తే కనబడలేదు, నువ్వు చూడు. రాజు అని ఉంటుంది" జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు.

       ఆమె చూసి "కాంటాక్ట్స్ లో ఏ నంబరూ లేదండీ... అన్నీ ఎరేజ్ అయిపోయినట్లున్నాయి” అంది.

         "అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తుంటాను.  ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాను"  అన్నాడు సిగ్గుపడుతూ.                  

         మీరు ఎక్కడ్నుంచి వచ్చారు" అని అడిగింది పూర్ణిమ.                           

         "ముంబై నుంచి.  నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడకు తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట. అతని  సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు.  అందుకే ఇల్లిల్లూ వెతుక్కుంటూ వెళ్ళాడు."

  "ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా"?

      "తెలుసు. ' వెంకటరమణ' అని చెప్పాడు "

       "అవునా? ఆ పేరు గలవాళ్లు చాలా మంది ఉన్నారు ఈ వీధిలో " అంది పూర్ణిమ నవ్వుతూ.

        అతను 'అలాగా ' అన్నట్టు చూసాడు ఆమెవైపు.

      "మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుని ఇల్లు తేలికగానే కనుక్కోగలడు లెండి"  అంది పూర్ణిమ.

        మధ్యాహ్నం రెండు గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికి వచ్చాడు.

         భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే "మీరూ... రాఘవయ్య మేస్టారు కదూ?" అని అడిగాడు బాలరాజు.

         "అవును. మీరు?" లేచి నిలబడి అడిగాడు అతను.

    "రాజమండ్రి లోని విజ్ఞానదీప్తి హైస్కూల్ లో మీరు నాకు లెక్కల మేస్టారు.  రాజమండ్రి లోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మాథ్స్ లో మీ టీచింగ్ కి మంచి పేరుండేది. నేను బ్యాంక్ లో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే. లోపలికి రండి మేస్టారూ " అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు.

      తర్వాత భార్యతో "ఆయనకు భోజనం పెట్టావా?" అని అడిగాడు.

      "లేదు. ఆయన మీ మేస్టారని నాకు తెలియదు కదండీ!  అయితే ఎండకు బాగా వడలిపోతే రస్నా కలిపి ఇచ్చాను "

         "వెరీగుడ్! పద... మా ఇద్దరికీ వడ్డించు."

      భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు.

      "మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేక పోవడం వల్ల అతని ఆఫీస్ కు ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు.  అవునూ, మీరు ముంబై ఎప్పుడు వెళ్లారు మేస్టారూ" అన్నాడు బాలరాజు రాఘవయ్యతో.

      "మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబయిలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం.  కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు.  అంతలో నా భార్య మరణించింది.  అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చెయ్యమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి, గత ఆరు నెలలుగా వాళ్ళతోనే ఉంటున్నాను.           

    "అదే మంచిది.  ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు?  అమ్మగారు లేరన్న విషయం  మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను."

      "నీ పేరేమన్నావు నాయనా?"

    "బాలరాజు

      "ఆ.. గుర్తొచ్చావు! టెన్త్ మాథ్స్ లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి.  మీ అమ్మ ఎలా ఉంది?  తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది.  పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో వంటలు చేస్తూ.. ఆ వచ్చిన డబ్బులతోనే నిన్ను చదివించిది. నువ్వు ప్రయోజకుడివయ్యాక చాలా సంతోషించి ఉంటుంది.    

       బాలరాజు ఆశ్చర్యంగా

చూస్తూ" మీకు ఎంత గుర్తు మేస్టారూ.  నాకు ఉద్యోగం వచ్చినరోజు అమ్మ ఎంత సంతోషించిందో?!  పూర్ణిమతో నా పెళ్లి తనే దగ్గరుండి జరిపించింది. ఇక తను చేయాల్సిందేమీ లేనట్టు వెళ్ళిపోయింది."

       "అయ్యో పాపం" అన్నాడు బాధగా రాఘవయ్య.    

       "అమ్మ పెళ్లిళ్లకు ప్రక్క ఊర్లకు వెళ్లిన రోజుల్లో నాకు భోజనం పెట్టిందెవరో తెలుసా పూర్ణా? మేస్టారి భార్య పార్వతమ్మ.  నాకు ఇంకో అమ్మ ఆవిడ!  నా పరిస్థితిని గమనించిన మేస్టారు ఓ చీటీలో 'వీడికి అన్నం పెట్టు' అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు.  ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది.  నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్ పై పెట్టేది.  నేను ఎంత చేస్తే వీరి ఋణం తీర్చుకోగలను?" కన్నీళ్ళతో అన్నాడు బాలరాజు.

        "సహాయం పొందినవాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి గుర్తుచేసుకోవడం, ప్రస్థావించడం నామోషీగా భావించే రోజులివి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగవుతున్న కాలం యిది. చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్థావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం " అన్నాడు రాఘవయ్య.

          ఆరోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికి వచ్చిన బాలరాజు  రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు.                 

          రాఘవయ్య చాలా డీలాపడి ఉండటం చూసి "మీరు అధైర్యపడకండి మేస్టారూ.  నా బావమరిది ముంబై లోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్లి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తీసుకొమంటాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా?" అని అడిగాడు.

         తెలుసన్నట్టు తలూపాడు రాఘవయ్య.

        "మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకిష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు" అన్నాడు బాలరాజు.

      ఏదో ఆలోచిస్తూనే తల ఊపాడు రాఘవయ్య.

        ఆరోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు-

       "మా బావమరిది ఇందాకే ఫోన్ చేసాడు.  మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్లిపోయారట.  వాళ్లిద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగానే కనిపించారట.  క్రొత్త ఇంటి అడ్రెస్ ఇరుగు పొరుగు వాళ్లెవరికీ ఇవ్వలేదట."

    ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య.

జరిగింది అర్ధంచేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి.

తర్వాత భోరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్ధంకాక బొమ్మల్లా కూర్చుండి పోయారు పూర్ణిమ, బాలరాజు.

         "రాజూ. ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది?  మీ ప్రేమంతా నటనేనా?  నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పివుంటే సంతోషంగా ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేవాణ్ణి కదరా!  తండ్రిని వదల్చుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా " అంటూ మళ్ళీ ఏడవసాగాడు రాఘవయ్య.

          బాలరాజు ఆయన భుజంపై చేయివేసి" మేష్టారూ!ఏడవకండి, ప్లీజ్!"అన్నాడు అనునయంగా. 

         "వాడు డబ్బులు తీసుకున్నందుకూ, నన్ను వదుల్చుకున్నందుకూ నేను ఏడవడం లేదు బాలరాజూ, వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే...అన్న బాధతో ఏడుస్తున్నాను" అన్నాడు రాఘవయ్య.  తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి "పోనీలే, వాడు క్షేమంగా ఉన్నాడు.  అది చాలు నాకు" అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు.

      "ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని.  కళ్ళముందే అటువంటి సంఘటన జరుగుతూంటే మనసును కదిలించినట్లు ఉందండీ" అంది పూర్ణిమ భర్తతో. 

         "ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు.  తల్లితండ్రుల్ని ఇంట్లోంచి తరిమేసే కొడుకులు, కూతురిని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు....వీళ్ళంతా మనమధ్యే తిరుగుతున్నారు పూర్ణా!  ఇప్పుడే ఇలాఉంటే ...మరో ఇరవైఏళ్ళ తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది" అన్నాడు, బాలరాజు - మంచంపై పడుకుని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్ళను చూస్తూ. 

           "సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడువనంత వరకూ, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంతవరకూ ఆయన మనల్ని వదలడు.  మంచివాళ్ళకు ఆయన యెప్పుడూ మంచే చేస్తాడు"

       "మా మేష్టారు చాలా మంచివారు.  ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా?"

       "కొంతవరకూ మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్ర లోనే ఏదో ఓ ఊర్లో వదిలేయకుండా, ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో, ఆ గోవిందుని పాదాల చెంత, ఆయన శిష్యుని ఇంటిముందే వదలివెళ్ళడం భగవంతుడు చేసిన మంచి కాదా?" 

      నిజమేనన్నట్టు తలూపాడు బాలరాజు.  భార్య మాటలు విన్నాక, ఆ మాటల్లోని అంతరార్థం అర్థమయిన తర్వాత అతని మనసులోని అలజడి తగ్గింది.  

        "మీ మేష్టారూ, ఆయన భార్యా మంచివారన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యాడు?  మీకు బాల్యం నుంచీ నేర్పించిన మంచితనం అతనికీ నేర్పి ఉంటారు కదా?" అని అడిగింది పూర్ణిమ.

       "సత్ సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  రాజేష్ పై భార్య ప్రభావం ఉండి ఉండొచ్చు"   "భార్య మాటలకు విలువిచ్చే పురుషుడంటే నాకు గౌరవం. అయితే...తన విచక్షణాజ్ఞానం ఉపయోగించ కుండా భార్య చెప్పిన ప్రతి మాటకూ తలూపే పురుషుడంటే నాకు అసహ్యం."

     "జరిగిందేదో మనకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా మనం ఎవరినీ విమర్శించకూడదు"

"ఏది ఏమైనా ..సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు.  ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మేష్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు" అంది పూర్ణిమ.


       *      *      *       *       *


  దాదాపు ఏడాది తర్వాత-

ఓ సాయంత్రం ఇంటి బయటి అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి "ఎవరు కావాలందీ?" అని అడిగింది పూర్ణిమ.

     అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా, అందంగా ఉన్నాడతను. గడ్డం పెంచుకుని దీనంగా కనిపిస్తున్నాడు.  

           "మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను.  మీరు ఆయన్ని చూశారా?" అని అడిగాడు ఆమెని

          "మీ పేరు రాజేషా?" అని అడిగింది పూర్ణిమ.

    వెంటనే అతని కళ్ళు మెరిశాయి.

   "అవును. మీరు ఆయన్ని చూశారా?  ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?" అని ఆత్రంగా అడిగాడు.

                                        "లోపలికి రండి" అంటూ ఇంట్లోకి దారితీసింది పూర్ణిమ.

        అతను సోఫాలో కూర్చున్నాక "ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి, యింత తొందరగా వచ్చేశారే?" అంది వెటకారంగా. '                                                 

"వినాశకాలే విపరీత బుద్ది 'అని ఊరికే అన్నారా?"                                        

       "ఏమిటండీ, ఆ విపరీత బుద్దులు?"

       "ఒకటా, రెండా.. ఎన్నని చెప్పమంటారు అమ్మానాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్ళి చేసుకోవడం, విషయం తెలిసి అమ్మ తిట్టితే వాళ్ళతో సంబంధం తెంచేసుకోవడం, అమ్మను వ్యధకు గురి చేసి ఆమె చావుకు కారణం కావడం,  అంతటితో ఆగివుంటే బాగుండేది.  అమ్మ చావుకబురు  విని రాజమండ్రి వచ్చిన నాకు -నాన్న ఇంటిపై కన్ను పడింది.  నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే... ఎలాగోలా ఆ డబ్బు ఆయన్నుంచి తీసుకొని నా, స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యవచ్చనుకున్నాను.

        అక్కడి నా స్నేహితుల్ని విచారిస్తే, ఇల్లు ముప్పైలక్షలు చేస్తుందని చెప్పారు.  నాన్నను ఇల్లు అమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను.  ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండటానికి రిషితను ఒప్పించేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది.  ఆరు నెలల్లో ఆయన్ను త్రిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది.  ఆ ఆరునెలలూ ఆయన్ను చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించాము.

     తర్వాత ఇల్లు కొనడానికి ముప్పై లక్షలు తక్కువ పడిందని చెబితే...ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ ముప్ఫై లక్షలు ఇచ్చారు.  ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను.  ఇక ఆయన్ను వదుల్చుకోవడమే మిగిలింది.  అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది.

          తిరుమల కొండకు తీసుకెళతానని ఆయన్ను తిరుపతికి తీసుకొచ్చి, మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి- నా స్నేహితుణ్ణి వెదకడానికి వెళ్తున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను.  అంతకు ముందురోజు రాత్రి ట్రెయిన్లో  ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకుని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్, మెసేజెస్ అనీ డిలీట్ చేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను.

         అయితే-మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో ఋజువైంది.  ముప్ఫై లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు.  నా భార్య నన్ను వదలి, నన్ను మోసం చేసినవాడితో వెళ్ళిపోయింది.  డబ్బునూ, భార్యనూ కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చెయ్యలేకపోయాను.  ఫలితంగా నా ఉద్యోగం పోయింది.  నేను ఒంటరివాడినయ్యాను.  బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకర్థమైంది.  అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది.

        అప్పుడు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రెన్ పట్టుకుని ఇక్కడికి చేరాను.  నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచిపనుల వల్ల ఆయన ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను.  ఆయనెక్కడ ఉన్నారు?  ఆయన కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకుంటేగాని నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పండి, ప్లీజ్."

        "మీరు ఆయనకిచ్చిన షాక్ ను ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ను ఇక్కడ వదలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు" అంది పూర్ణిమ."

         రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు చూశాడు....

         తర్వాత తనలో తానే ఏదో గొణుక్కున్నాడు.  తర్వాత లేచి నిలబడి "అమ్మ నగలు ఏ బ్యాంక్ లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా?" అని అడిగాడు.

      "లాకర్లో లేదు. మీరొస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు" అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది. 

      బ్యాగు చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

      గబగబా బ్యాగు తెరచి అందులోని నగలను చూసుకున్నాడు.  తర్వాత తన జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకిచ్చి-

    "మీకు ఇంకా ఎదైనా గుర్తొస్తే ఈ నంబరుకు ఫోన్ చెయ్యంది" అని చెప్పి బయటికి నడిచాడు.

  రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. తర్వాతమేడపైకి వెళ్ళింది.

        బాల్కనీలో  దాదాపు ముఫైమంది విధ్యార్థుల మధ్య కుర్చీలో కూర్చుని ట్యూషన్స్  చెబుతున్నాడు రాఘవయ్య.

దూరంగా నిలబడి అతన్నే చూస్టూండిపోయింది.

         "అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణా?"

          భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ.  ఆమె ప్రక్కనే బాలరాజు నిలబడి ఉన్నాడు.

         "మీరు విన్నారా?" అని అడిగింది అతన్ని

       "ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో నీవన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురుపడటం ఇష్టంలేక మేడ పైకి వచ్చేశాను" అన్నాడు బాలరాజు.

         రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ.

       "బాబాయిగారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా..త్వరగానే కోలుకున్నారు.  ఉదయం సాయంత్రం యాభైమంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ, విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా, ఏ ఊర్లోనైనా బ్రతకవచ్చని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ. నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకుని హుందాగా, గౌరవంగా బ్రతుకుతున్నారు.

          ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే...రాజేష్ ప్రస్తుత పరిస్తిని చూసి ఆయన కృంగిపోతారు.  రాజేష్ ఆయన కాళ్ళమీద పడితే...కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు.  రాజేష్ లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయికి గతంలో జిరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది.  క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదలి వెళ్ళాడు.  ఈసారి ఏ అడవిలోనో, ఎడారిలోనో వదిలేస్తే బాబాయి గతేం కాను?

        అందుకే..అతనిలోని మార్పు నిజమో, కాదో పరీక్షించాలనుకున్నాను.  వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను.  నా అనుమానం నిజమైంది.  తండ్రి చనిపోయాడని తెలిశాక...అతను ఏడవలేదు, సరికదా..కళ్ళనుంచి ఓ నీటిచుక్క కూడా రాల్చలేదు.  అసలు...తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతడిలో కనిపించలేదు నాకు.

       పైగా 'తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా?' అని నన్నడిగాడు. అప్పుడర్థమైంది ...అతను ఎందుకు వచ్చాడో?  వెంటనే బీరువాలోని వాళ్ళమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను."                                                     "ఇచ్చేశావా?"  అశ్చర్యంగా అడిగాడు బాలరాజు.

         "నీకివ్వాలని మేష్టారు ఎంతో శ్రమ తీసుకుని రాజమండ్రి నుంచి తెచ్చారు.  రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు?"  అని అడిగాడు మళ్ళీ.

         "నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు.  ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు. కాని, చట్టపరంగా అవి చెందవలసినది రాజేష్ కే.  అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే ...అతను నిలదొక్కుకునేంతవరకూ ఆ నగలు ఉపయోగపడతాయి."

         భార్యవైపు విస్మయంతో చూస్తూండిపోయాడు బాలరాజు.

         ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకీ, ఆమెలోని వ్యక్తిత్వానికీ ముగ్దుడయ్యడు అతను.

  "నాకు ఏ నగలూ  అక్కరలేదండీ, బాబాయిగారు మన ఇంట్లో ఉంటే చాలు.  గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మానాన్న, మీకు మీ అమ్మానాన్నా లేరు కాబట్టి పెద్దవాళ్ళ విలువ మనకు తెలుసు. వాళ్ళు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళనుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో, బాబాయితో గడిపిన ఈ కొద్దినెలల్లో తెలిసింది.  ఆయన ఇంటినుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయినదాన్నవుతాను.  అయితే తండ్రీకొడుకుల్ని ముఖాముఖీ కలవనీయకుండా తప్పు చేశానన్న భావన నాలో ఉంది.  నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే...రాజేష్ కు కాల్ చేసి పిలిపించండి" అంది పూర్ణిమ -రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ని బాలరాజుకిచ్చి. 

      "కడుపున పుట్టినవాళ్ళు కాదు బిడ్డలు..కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్ళే బిడ్డలూ అనేది మా అమ్మ.  ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉన్నారు.  వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు" అంటూ ఆ విజిటింగ్ కార్డ్ ని ముక్కలు ముక్కలుగా చించేసాడు బాలరాజు.

🌷🌷🌷  🌹🌹🌹 🌷🌷🌷

తెలుగు భాష గొప్పదనం

 *"ఈ పద్యం చూడండి...."*


  *"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"*

*"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"*


 


భావం


*"మనమే = మనం అందరమూ....,"*


 *"మనమని = శాశ్వతం కాదని"*

,

 *"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"*


*"మనుమని మనుమని మనుమని"* = 

*"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"*


*"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"*


*"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"*


*"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"*


*"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"*


*"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"*


*"మౌనమే = మౌనంగా"*


 *"మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"*


*"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"*


*"ఎంతో లోతైన  జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా  మోక్ష పదమైన మకారంతో  మలిచారు."*


 *" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం  మినహా..."*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*మోక్ష మార్గాలు...(రెండవ భాగం)*

 *మోక్ష మార్గాలు...(రెండవ భాగం)*


 *భక్తి మార్గము...*

 

నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి. వాటిలోంచి నామ రూపాలను తీసేస్తే మాయ తొలగి, మిగిలిన అస్తి భాతి ప్రియం లేదా సత్ చిత్ ఆనందము అనే మూడు గుణాలు కలిగిన వస్తువు  కేవల బ్రహ్మము. అది మిగిలిపోతుంది.


సగుణోపాసన చేయడానికి నామరూపాలు కలిగిన భగవంతుడిని ఆధారంగా స్వీకరిస్తాము. భక్తిమార్గంలో ప్రయాణించడానికి నామ రూపాత్మ కమైన ఆలంబన కావాలి. భక్తి మార్గం లో కూడా ప్రపంచానికి సంబంధించిన నామ రూపాలను మాయ అని గ్రహించాలి. భగవంతునికి సంబంధించిన నామరూపాలు ను భక్తికి ఆధారంగా స్వీకరించి ఆ మార్గంలో ముందుకు సాగాలి.


జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం కొద్దిగా సులువు. ఉపాసించుకోవడానికి ఒక ఆకారం అంటూ ఉంటుంది. కొల్లలు కొల్లాలుగా పురాణ కథలుంటాయి. భక్తి మార్గం లో ఇదే సులువైన విషయము. ఈ కారణం వల్లనే ఆదిశంకరులు భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తూ  అసంఖ్యాకంగా స్తోత్రాలు రచించాడు. జ్ఞాన మార్గం అందరికీ వీలు కాదని ఆయనే చాలాచోట్ల చెప్పాడు.


జ్ఞాన మార్గం తో పోలిక చెప్పినప్పుడు మాత్రమే భక్తి మార్గం సులభము అని చెప్పాలి. భక్తి మార్గం లో ఉన్న కష్టాలు  అందులోనూ ఉన్నాయి. భక్తి మార్గము అంటే మన రక్షణ మన అవసరాలు అన్నింటిని  భగవంతుడి మీద వదిలిపెట్టి ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టి జీవితం గడుపు కోవాలి.    ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి అందరూ కూడా ప్రాణాలు పోతున్నా దేవుడి మీదే భారం వేసి భక్తి మార్గం వదలకుండా మొండిగా కూర్చున్నారు.


ఇక్కడ ఒక సరదా కథ చెప్పు కోవాలి. వైకుంఠం లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఒకరోజు హడావిడి గా లేచి భూలోకం వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడట. లక్ష్మీదేవి, ఆయన ఆయుధాలు, గరుత్మంతుడు మొదలైన వాళ్లంతా తొందరపడి వెంట పరిగెత్తారు. కాస్త దూరం వెళ్లి విష్ణుమూర్తి ఆగిపోయి తాపీగా వెనకకు తిరిగి రావడం మొదలు పెట్టాడట. ఏమిటి స్వామీ అని అడిగితే నా భక్తుడిని దుర్మార్గుడైన పొరుగు వాడు ఒకటే కొడుతున్నాడు. నా భక్తుడు నారాయణ గోవిందా వాసుదేవా రక్షించు అని అరుస్తుంటే నేను కూడా తొందరపడ్డాను. నేను భూలోకం చేరే లోపల నా భక్తుడికి నమ్మకం పోయి వాడే సొంతంగా ఆ పక్కింటి వాడిని తిరగేసి కొట్టడం మొదలుపెట్టాడు. ఇంక మనం పోవడం దేనికని నేను వెనక్కు వస్తున్నాను అన్నాడట.


చాలా భాగం సంసార పక్షం భక్తులు ఇట్లా నే ఉంటారు. ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి వాళ్ళ లాగా పూర్తి నమ్మకం భగవంతుని మీద ఎవరూ పెట్టుకోరు. పురుష ప్రయత్నం మీద ఒక కాలు, భక్తి మీద ఒక కాలు పెట్టుకొని ఉంటాము. తీరా పూర్తి నమ్మకం భగవంతుడి మీద పెట్టి పురుష ప్రయత్నం పూర్తిగా విడిచిపెట్టిన తరవాత ఆయన రక్షిస్తాడో రక్షించడో అప్పుడాయన రక్షించకపోతే కొంప మునుగు తుంది కదా అని సందేహం పీకుతుంటుంది. ఆ సందేహం ఉన్నంత కాలం ఆయన రాడు. ఇదే భక్తి మార్గం లో ఉన్న పెద్ద తలనొప్పి. 


*పవని నాగ ప్రదీప్*

పదాల అర్థం

 క్రింది మూడు పదాలు చూడండి 

1.boy friend 

2.girl friend 

3.family

పై మూడు పదాల అర్థం గమనించండి.

Boy friend మరియు girl friend ఈ రెండు పదాల చివరి మూడు అక్షరాలు 'end'

అంటే ఇవి రెండు ఎదో ఒక రోజు ముగిసిపోతాయి.

కానీ మూడవ పదం 'family' లో మొదటి మూడు అక్షరాలు 'fam' అంటే father and mother, చివరి మూడు అక్షరాలు ' ily ' అనగా I love you

ఎక్కడ తల్లితండ్రులను పూజానీయ భావంతో గౌరవిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అదే మంచి కుటుంబం. (family )🙏🙏🙏

ఏరువాక పౌర్ణమి

 *శుభోదయం! నమస్కారం!!*


🙏🙏


*ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలతో..*


*పర్వ విశిష్టత సమాచారం*



🌕🌧️🌏🐾🎊🌏🌧️🚩💐

                  


నేడు ఏరువాక పౌర్ణమి. భుక్తినిచ్చే రైతన్నలకు తొలి పండుగ. రైతు అందరివాడు. అంటే ఈపండుగ మనందరిదీ. వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా రైతులు జరుపుకునే పండుగే ఏరువాక పౌర్ణమి. ఈనాటి తిథి వివరణకు సంబంధించి వృషభ పూజ, హల ప్రవాహ వంటి పదాలు ఉన్నాయి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

         

పంచ భూతాత్మక మైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం! భూమిని భూమాతగా కొలుస్తాం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ' ఏరువాక ' అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని అర్థం.

             

వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

           

నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను 'సీతాయజ్ఞం' అని సంస్కృతంలో 'ఉద్వృషభ యజ్ఞం' అని, కన్నడంలో 'కారణి పబ్సం' అని జరుపుకుంటారు.

               

వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా పిలుస్తున్నారు. అధర్వణవేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుడిని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.

         

విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం’, ‘బీజవాపన మంగళ దివసం’,‘వాహణ పుణ్ణాహ మంగళమ్‌’.,‘కర్షణ పుణ్యాహ మంగళమ్‌.’ అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు.

              

శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఐతిహ్యం. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుస్తుంది.


ఏరువాక పున్నమి శుభాకాంక్షలతో..


🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️

చరిత్రలో అంటువ్యాధులు:-

 😞😭☹️😭🙁😭☹️😭☹️😭                         -:మానవజాతి చరిత్రలో అంటువ్యాధులు:-


👉కోవిడ్-19 /కరోనా అనే అంటువ్యాధి మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇది సృష్టించిన మారణహోమం అంతాఇంతా కాదు.  ఇదే సందర్భంలో కరోనా కన్నా ముందు వచ్చిన అనేక మహమ్మారుల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

👉సిర్కా ఎపిడమిక్ :-  దాదాపు క్రీ.పూ.3000 సంవత్సరంలో వచ్చింది. చైనాఈశాన్య ప్రాంతంలో ఈ వ్యాధి వచ్చింది. దీని వలన ఆ ప్రాంతంలో ఉన్న జనాభా అంతా తుడిచి పెట్టుకొని పోయింది.

👉ఏథెన్స్ ప్లేగ్ ( క్రీ.పూ. 430): - దాదాపు ఒక లక్ష మంది మరణించారు. ఈ కారణం వలన ఏథెన్స్ స్పార్టా చేతిలో ఓడింది.

 👉ఆంటోనియన్ ప్లేగ్ ( క్రీ.శ.165 - 180 ) :-రోమ్ లో వచ్చింది. పర్షియాలో పుట్టి రోమ్ లో వ్యాపించింది.ఐదు మిలియన్ జనాభా మరణించారు.

👉జస్టీనియన్ ప్లేగ్  (క్రీ.శ.527-565):-  ఈ ప్లేగు వలన ప్రపంచ జనాభా లో పది శాతం అంతరించింది.బైజాంటైన్ చక్రవర్తి జస్టీనియన్ కాలంలో ఈ అంటువ్యాధి వచ్చింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీని వల్ల బైజాంటైన్ సామ్రాజ్యం బలహీనపడి అంతరించింది.

👉ది బ్లాక్ డెత్  (క్రీ.శ.1346-1353):- ఈ వ్యాధి ఆసియా మరియు యూరప్ లను వణికించింది.యూరప్ జనాభా సగం అంతరించింది. ఒక్కొక్కరిగా దహనం చేయలేక సమూహాలుగా జనాలను  కాల్చివేశారు.ఇది కూడా ఒక రకమైన  ప్లేగు వ్యాధియే.

👉కోకోలిడ్జి అంటువ్యాధి (క్రీ.శ.1545-1548):- కోకోలిడ్జి అంటే అజ్ టెక్ భాషలో అంటు వ్యాధి అని అర్థం. మెక్సికో, మధ్య అమెరికా లో వచ్చింది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వచ్చింది.పదిహేను లక్షల మంది మరణించారు.

👉అమెరికన్ స్మాల్ ఫాక్స్ (క్రీ.శ. 16వ శతాబ్దం ):-అమెరికా లో వచ్చిన ఈ మశూచి వలన అమెరికా స్థానిక జాతులు 90శాతం అంతరించాయి. యూరప్ దేశీయులు స్థానిక ప్రజలను సులభంగా ఓడించి అమెరికా వ్యాప్తంగా విస్తరించారు.

👉గ్రేట్ లండన్ ప్లేగ్ (క్రీ.శ.1665-1666):- కింగ్ చార్లెస్-2 కాలంలో ఈ అంటువ్యాధి వచ్చింది. దాదాపు ఒక లక్ష మంది మరణించారు. లండన్ నగరంలో పది శాతం మంది మరణించారు.

👉గ్రేట్ మార్సిలీ ప్లేగ్ (క్రీ.శ.1720-1723):- ఫ్రాన్స్ లోని మార్సిలీ నగరంలో, ఆ చుట్టు పక్కల దాదాపు ఒక లక్ష మంది మరణించారు. గ్రాండ్ సెయింట్ ఆంటొన్నే అనే నౌక ద్వారా మధ్య దరా ప్రాంతం నుండి ఈ వ్యాధి వ్యాపించింది.

👉రష్యన్ ప్లేగ్( క్రీ.శ.1770-1772):- మాస్కో నగరం , ఆ చుట్టు పక్కల దాదాపు ఒక లక్ష మంది మరణించారు.

👉ఫ్లూ మహమ్మారి  ( క్రీ.శ. 1889-1890) :-ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియన్ మంది మరణించారు.

👉ఆసియా ఫ్లూ ( 1957-58 ):- ఒక మిలియన్ మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు.

👉ఎయిడ్స్ (క్రీ.శ. 1981- ఇంకా కొనసాగుతూనే ఉంది):- దాదాపు మూడు కోట్ల యాభై లక్షల మంది ఇప్పటి వరకు మరణించారు. ఒక్క ఆఫ్రికా లోనే ఈ వ్యాధితో 4 కోట్ల మంది జీవిస్తున్నారు.

👉స్వైన్ ఫ్లూ (క్రీ.శ. 2009-2010):-  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు మిలియన్ల  మంది మరణించారు.

  ఇంకా ఎబోలా, జికా వైరస్ తదితరాలు ఎన్నో తరచుగా వస్తూ ఉండడం మనం గమనించవచ్చు.

  ఏదిఏమైనా మానవజాతి తరతరాలుగా ఎన్నో అంటువ్యాధులను మహమ్మారులను ఎదుర్కొంది. కొత్త రకం అంటువ్యాధులు పుట్టటం,వాటికి మందులు, టీకాలు తదితరాలు కనుక్కోవడం, ఆలోగా ఎంతో జన నష్టం జరగటం మనకు నిత్య అనుభవమే. ఏదిఏమైనా ఈ అంటువ్యాధుల నుండి తగిన గుణపాఠం నేర్చుకుంటూ మానవాళి పురోగమిస్తున్నది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పిల్లలు చెడిపోవడానికి

 *పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*

సహృదయులు మంచి మనసుతో  అర్థం చేసుకుంటారని నలుగురికి తెలియజేస్తారని 👍🙏🌹....

పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..* 

పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..

వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..


ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)

🔥  తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥  లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥  కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు..

ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..


🔥  ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..


మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*


ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...


కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*

ఒక్కసారి ఆలోచన చేయండి...


*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..


పిల్లలకు..👇


👉  *బాధ్యత* 

👉  *మర్యాద*

👉  *గౌరవం* 

👉  *కష్టం* 

👉  *నష్టం* 

👉  *ఓర్పు*

👉  *సహనం*

👉  *దాతృత్వం*

👉  *ప్రేమ*

👉  *అనురాగం*

👉  *సహాయం*

👉  *సహకారం*

👉  *నాయకత్వం*

👉  *మానసిక ద్రృఢత్వం* 

👉  *కుటుంబ బంధాలు*

👉  *అనుబంధాలు*    

👉  *దైవ భక్తి*

👉  *దేశ భక్తి*


*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*

కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*


పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...

మనం కూడా మమేకమవుదాం...

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం..

లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ 🌷🌹💐

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ స్వామివారితో  నా సంభాషణ..*


1973 జనవరి నెల మొదటివారం లో సంక్రాంతి సెలవుల్లో కనిగిరి నుంచి మొగలిచెర్ల రావడం జరిగింది..ఆసరికే శ్రీ స్వామివారు, మాలకొండ నుంచి మొగలిచెర్ల లోని మా ఇంటికి రావడమూ.. కొద్దికాలం పాటు ఇంటి వద్ద గడపడమూ..అమ్మా నాన్న గార్లతో పాటు మా నాయనమ్మ సత్యనారాయణమ్మ గారికి కూడా ఆధ్యాత్మిక బోధ చేయటమూ..ఆ తదుపరి హఠాత్తుగా ఒక తెల్లవారుఝామునాడు ఇంటి వద్దనుంచి బయలుదేరి, ఫకీరుమాన్యం లో తాను ఆశ్రమం నిర్మించుకోదలచిన ప్రదేశానికి వెళ్లిపోవడమూ జరిగిపోయింది..నాన్న అమ్మగార్లు ఆ విషయమై కొద్ధి మనస్తాపం చెందినా.. శ్రీ స్వామివారు తీసుకున్న నిర్ణయాన్ని ఆపలేకపోయారు..శ్రీ స్వామివారు బస చేయడానికి తాత్కాలికంగా ఒక పాకను రెండురోజుల్లో వేయించారు నాన్నగారు..ఆ పాకలో బస చేస్తూ..ఆశ్రమం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వున్నారు..


శ్రీ స్వామివారికి రోజూ ఆహారం మా ఇంటివద్దనుంచే తీసుకెళ్లి ఇచ్చేవారు..ఆహారం అంటే  రకరకాల పదార్ధాలతో కూడినది కాదు..బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి వుడికించి చేసేది..నేను మొగలిచెర్ల వచ్చిన మరుసటి రోజు శ్రీ స్వామివారికోసం వండిన ఆ ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చేసి రమ్మని అమ్మ నాతో చెప్పింది..సరే అని ఆ చిన్న స్టీలు డబ్బా తీసుకొని ఫకీరు మాన్యం లో ఉన్న శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..


నేను వెళ్ళేసరికి శ్రీ స్వామివారు, పాక బైట పచార్లు చేస్తూ వున్నారు..నన్ను చూసి నవ్వుతూ.."అమ్మ నిన్ను పంపించిందా?.." అన్నారు.."అవును" అని తలాడించాను..నేనిచ్చిన డబ్బా తీసుకొని పాకలో ఒక మూల పెట్టి మళ్లీ బైటకు వచ్చారు..


"ఇప్పుడు ఏం చదువుతున్నావు?.." అన్నారు.


"ఎనిమిదవ తరగతి.." అన్నాను..


"ఏ ఊళ్ళో?.." అన్నారు..


"కనిగిరి లో " అన్నాను..


శ్రీ స్వామివారు పాకలోకి వెళ్లి.."దా!..ఇక్కడ కూర్చో.." అని పాకలో ఉన్న బల్ల చూపారు..వెళ్లి అక్కడ కూర్చున్నాను..కూర్చున్నానే కానీ..ఏమి మాట్లాడాలో తెలియని ఒకానొక అయోమయ స్థితిలో వున్నాను..శ్రీ స్వామివారిని చూసాను..నిర్మలంగా..చిరునవ్వుతో నన్నే చూస్తున్నారు..


"మీ ముగ్గురికీ మీ అమ్మగారు  స్తోత్రాలు ఏవైనా నేర్పించిందా?.." అన్నారు..


"నాకు హనుమాన్ చాలీసా..లక్ష్మీనరసింహ స్వామి అష్టోత్తరం చేసుకోమని చెప్పి, అవి నేర్పించింది.." అన్నాను..


"మరి రోజూ చేస్తున్నావా?.." అన్నారు..తలూపాను..నిజానికి అప్పుడప్పుడూ ఆ రెండు స్తోత్రాలూ చేసుకోకుండా ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి..కానీ శ్రీ స్వామివారితో ఆమాట చెప్పలేదు..


"అంత ఖచ్చితంగా చేసేటట్లు గా లేవే!.." అన్నారు నవ్వుతూ..పసిగట్టేశారు..సిగ్గుతో తలొంచుకున్నాను..


"హనుమాన్ చాలీసా రోజూ చెయ్యి..అలాగే లక్ష్మీ నృసింహ స్వామి ది కూడా..ఏమరుపాటు లో ఉండొద్దు..అమ్మ చెప్పినవి ఎంతో మహత్తు కలవి.. నీకు ఇప్పుడు అర్ధం కాదులే..పిల్ల తరహాగా ఉండొద్దు.." అని చెప్పారు..


మరో రెండు నిమిషాల పాటు శ్రీ స్వామివారు ఏమీ మాట్లాడలేదు..నేను ఇక అక్కడ కూర్చోలేక, "వెళ్ళొస్తాను స్వామీ.." అన్నాను..సరే నన్నట్లు నవ్వుతూ తలూపారు..పాకలోంచి బైటకు వచ్చి ఇంటిదారి పట్టాను..


ఆరోజు నుంచీ సంక్రాంతి పండుగ అయిపోయి, నేను తిరిగి కనిగిరి వెళ్ళేదాకా..ప్రతిరోజూ శ్రీ స్వామివారికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే బాధ్యత అమ్మ నాకే అప్పచెప్పింది..నేనూ అలవాటు పడిపోయాను..మూడోరోజు నా కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది..


భూతమూ.. వైద్యమూ..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).