10, అక్టోబర్ 2024, గురువారం

*ఈ రోజు దుర్గాష్టమి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

       *ఈ రోజు దుర్గాష్టమి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దుర్గ అన్న నామమే పరమపవిత్రం.*


*దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.*


*దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి, 'గ' కారం జ్ఞానానికి సంకేతాలు.*


*దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.*


*అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగాదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.*


*పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.*


*ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్త బ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుసుకునే పని ఉండదో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.*


*ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.*


*ఓం దుర్గాయై నమః।*


*చదువరులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఆనందం యొక్క అర్థం!*

 1110d4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀రతన్ టాటా గారి ఆనందం…


*అసలైన…*

        *ఆనందం యొక్క అర్థం!*

                  ➖➖➖✍️```

“నేను మీ ముఖాన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను, తద్వారా నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించగలను మరియు మరోసారి ధన్యవాదాలు చెప్పగలను.”



టెలిఫోన్ ఇంటర్వ్యూలో భారతీయ బిలియనీర్ రతన్‌జీ టాటాను రేడియో ప్రెజెంటర్ అడిగినప్పుడు:


“సర్, జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాన్ని పొందినప్పుడు మీకు ఏమి గుర్తుకొస్తుంది?”


*రతన్‌జీ టాటా చెప్పారు:

“నేను జీవితంలో నాలుగు సంతోష దశలను దాటాను.

మరియు నేను చివరకు నిజమైన ఆనందం యొక్క అర్థం చేసుకున్నాను”


‘మొదటి దశ’ సంపద మరియు వనరులను కూడబెట్టుకోవడం.


కానీ ఈ దశలో నేను కోరుకున్నంత ఆనందం లభించలేదు.


ఆపై విలువైన వస్తువులు మరియు వస్తువులను సేకరించే ‘రెండవ దశ’ వచ్చింది.


కానీ ఈ విషయం యొక్క ప్రభావం కూడా తాత్కాలికమైనదని మరియు విలువైన వస్తువుల మెరుపు ఎక్కువ కాలం ఉండదని నేను గ్రహించాను.


అప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ పొందడానికి ‘మూడవ దశ’ వచ్చింది.


*అప్పుడే నాకు ఇండియా మరియు ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ఉండేది.


*నేను భారతదేశం మరియు ఆసియాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని కూడా.


*కానీ ఇక్కడ కూడా నేను ఊహించినంత ఆనందం లభించలేదు.


*’నాల్గవ అడుగు’ కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్‌చైర్లు కొనమని నా స్నేహితుడు నన్ను అడిగాడు.


*దాదాపు 200 మంది పిల్లలు.


*స్నేహితుడి కోరికతో, నేను వెంటనే వీల్ చైర్లు కొన్నాను.


*కానీ మిత్రుడు,నేను అతనితో వెళ్లి పిల్లలకు వీల్ చైర్లు ఇవ్వమని పట్టుబట్టాడు.


*నేను రెడీ అయ్యి అతనితో వెళ్ళాను.


*అక్కడ నేను నా స్వంత చేతులతో ఈ వీల్ చైర్లను ఈ పిల్లలకు ఇచ్చాను.


*ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది.


*వాళ్లంతా వీల్‌ఛైర్‌లో కూర్చొని నడవడం, సరదాగా గడపడం చూశాను.


*వారు ఒక పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు, అక్కడ వారు విజేత బహుమతిని_ పంచుకున్నారు.


*నా లోపల నిజమైన ఆనందాన్ని అనుభవించాను.


*నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు, పిల్లలలో ఒకడు నా కాలు పట్టుకున్నాడు.


*నేను నెమ్మదిగా నా కాళ్ళను విడిపించడానికి ప్రయత్నించాను, కాని పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ_ నా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు.


*నేను వంగి పిల్లవాడిని అడిగాను: "మీకు ఇంకేమైనా కావాలా"?


*ఆ పిల్లాడు నాకు ఇచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా తద్వారా పూర్తిగా నా అసలైన ఆనందం యొక్క అర్థం మార్చేసింది.


 *ఆ పిల్లవాడు ఇలా అన్నాడు:

 

 *"నేను మీ ముఖాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను, తద్వారా నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించగలను మరియు మరోసారి ధన్యవాదాలు చెప్పగలను"


*ప్రేమ మరియు దయ మాత్రమే నిధి, ఇది మీ హృదయాన్ని ఆనందం మరియు శాంతితో నింపుతుంది, మిగిలినవి కేవలం భ్రమలు మాత్రమే.”✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

గొప్పతనం, హుందా, అణకువ*

 1110d6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నాదేశం గర్వించదగిన వ్యక్తి…


     *గొప్పతనం, హుందా, అణకువ*

                  ➖➖➖✍️```

    (మేలిముత్యం,రత్నం,వజ్రం)



ఒకసారి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తాను రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చి క్యాన్సిల్ అవ్వడంతో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సి వచ్చింది.


లగ్జరీ ఫ్లైట్ మిస్ అయింది. ఎకానమీ ఫ్లైట్ లో వెళ్లడం దిలీప్ కుమార్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు. 

అధికారులతో గొడవపడి వాళ్ళని తిట్టుకుంటూ... షూటింగ్ ఉండడం వల్ల తప్పనిసరై ఎకానమీ ఫ్లైట్ ఎక్కాడు.


ఆ ఫ్లైట్ లోని ప్రయాణికులు దిలీప్ కుమార్ ని చూడగానే సంబరపడిపోయి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. ఎంతైనా ఒక పెద్ద సినిమా హీరో తమతో పాటు ప్రయాణిస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. 


మొత్తానికి దిలీప్ కుమార్ చిరాకు తగ్గి తన సీట్లో కూర్చున్నాడు. పక్క సీట్లో ఒక సాధారణమైన_మధ్యతరగతి ప్రయాణికుడు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు.


అతడు దిలీప్ కుమార్ ని కన్నెత్తి కూడా చూడలేదు. పేపర్ లో లీనమైపోయాడు. దిలీప్ కుమార్ కొంచెం ఆశ్చర్యపోయి తానే పలకరించాడు.


అతడు చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు. దిలీప్ కుమార్ కి కొంచెం కోపం వచ్చింది. ఒక బాలీవుడ్ స్టార్ పక్కన ఉన్నాడన్న ఏ ఫీలింగూ లేదేంటి.. అనుకుంటూ మళ్ళీ అడిగాడు.. “మీరు సినిమాలు చూడరా...?” అని అడిగాడు. 


“పెద్దగా చూడనండి..” అని చెప్పాడతడు. 


మిడిల్ క్లాస్ వాళ్లకి సినిమాలొక్కటే కదా వినోదం.. చూడకపోవడం ఏంటి అనుకుంటూ.. “ఓహో.. అందుకే మీకు నేనెవరో తెలియలేదు. నేను బాలీవుడ్ హీరోని. నా పేరు దిలీప్ కుమార్” అని చివరకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. 


“ఓ. ఐసీ. గుడ్ జాబ్!" అని చెప్పి అతను కూల్ గా పేపర్ మూసేసి ఏదో బిజినెస్ జర్నల్ తీసి చదువుకోసాగాడు.


దిలీప్ కుమార్ కి చాలా అసహనంగా 

ఉంది. నేనెవరో చెప్పినా కూడా ఆటోగ్రాఫ్ అడగడేంటి.. ఒక మాములు సిటిజన్ కి ఇంత పొగరా.? ఒక బాలీవుడ్ స్టార్ ని నేనే మాట్లాడుతుంటే కనీసం ఆటోగ్రాఫ్ అడగడా..అనుకొని, “మీరేం చేస్తుంటారు?" అని అడిగాడు.


“నేను బిజినెస్ మ్యాన్ ని. నా పేరు #రతన్_టాటా.” అని చెప్పేసరికి దిలీప్ కుమార్ బుర్ర తిరిగిపోయింది.


ఇతను గ్రేట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్ టాటా నా..? అందుకా ఇంత హుందాగా కూర్చున్నారు అనుకుంటూ 

”అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంత సాధారణమైన వస్త్రధారణలో, ఎకానమీ క్లాస్ లో ఎందుకు..??”


“నేనెప్పుడూ ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తాను దిలీప్ గారూ. అందులో తప్పేముంది. నాకు మొదటినుండీ సామాన్యంగా జీవించడం అలవాటు“

అని చెప్పగా దిలీప్ కుమార్ అతని గొప్పతనానికి ఆశ్చర్యపోయి తానే అతని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు.```


*నీతి:*

ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేది ముఖ్యం కాదు. ఎంత గొప్పవారైనా అణుకువ లేనప్పుడు సంపాదించింది వ్యర్ధమే! నేను గొప్ప అనే మాట ఉంటే నీకన్నా హీనుడు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఆకాశానికి ఎదిగిన తాటి చెట్టు ఆకులు నేలకే చూస్తూ నిలబడతాయి. ఆ చెట్టులోని పళ్లను పీకితే నేల మీదకే పడతాయి. ఆకాశానికి చేరవు. 


నీ ప్రవర్తన నీ మంచితనం నీ బుద్దులతో అటు ఆకాశానికి ఎదగగలవు ఇటు పాతాళానికి పడిపోగలవు. అర్థం అయితే మనం ఇంకా మనుషులమే అనుకోవచ్చు. కాకుంటే మర మనుషులమే అని అనుకోవడమే!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

Panchang

 


బొట్టు" హిందువు

 🔴🔴🔴🔴🔴

 "బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.


🛑 చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!


🔴 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో!  అది   ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!


🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!


🔴 కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!


🔴 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. 


🔴 కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!  బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టుపెట్టుకున్న నీ ముఖంచూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు.

🔴🔴🔴🔴🔴

దుర్గా! దుర్గతినాశనీ

 దుర్గా! దుర్గతినాశనీ! రిపుచమూవిధ్వంసనోత్సాహినీ!

భర్గస్యార్థశరీరిణీ! భగవతీ! భక్తాళి సంరక్షిణీ! 

ఆర్తత్రాణపరాయణీ! సకలభద్రవ్రాతసంధాయినీ! 

ఈశానీ! అభయం దదాతు సతతం సంతోషసంవర్ధినీ!   8

*~శ్రీశర్మద*

41. " మహాదర్శనము

 41. " మహాదర్శనము " --నలభై ఒకటవ భాగము--ఇంద్ర దంపతులు


41. నలభై ఒకటవ భాగము-- ఇంద్ర దంపతులు



          ఆచార్యులు అన్నారు : " యాజ్ఞవల్క్యా , ఆదిత్య తేజస్సైన ఉషాదేవి , నిన్ను జాగృత్తు నుండీ స్వప్నమునకు జారకుండా పట్టి నిలిపినది చూచినావు కదా ? అది ఎలా చూచినావు ? కర్మేంద్రియముచేతనా ? జ్ఞానేంద్రియము చేతనా ? "


          యాజ్ఞవల్క్యుడు కనులు మూసుకొని , అప్పటి అవస్థను స్మరించి , దానిని మరలా అనుసంధానము చేసి చూస్తూ అన్నాడు : " ఇది కర్మేంద్రియముల వ్యాపారము కాదు . జీవుడు భ్రుకుటి స్థానములో నున్నపుడు కర్మేంద్రియ వ్యాపారమే గానీ , ఆ స్థానమును వదలి వెళ్ళినపుడు కర్మేంద్రియ వ్యాపారమెక్కడిది ? అలాగే , స్వప్నమునకు జీవుడింకా జారిపోలేదు కాబట్టి జ్ఞానేంద్రియ వ్యాపార ప్రసక్తి కూడా లేదు . అయిననూ దర్శనము జరుగుతున్నది . దీని నేమనవలెనో తెలియదు . " 


          ఆచార్యులన్నారు , " ఇదే దివ్య దర్శనము . ఈ దివ్య దర్శనము కావలెనంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రెండూ వ్యాపార ముఖమై వాటి స్థానములో దేవతా భావము రావలెను . ఈ భావము ఇంద్రియ గోళముల వరకూ వ్యాపిస్తే అప్పుడక్కడ ప్రతి గోళములోనూ దివ్యభావము వచ్చును . అప్పుడు విశ్వరూప దర్శనము . జాగ్రత్త ! నువ్వు విశ్వ రూప దర్శనమునకు ఉబలాట పడవద్దు . వేచియుండు , అది తానుగా వస్తుంది . ఇప్పుడు కన్నులు మూసి చూస్తున్న ఈ దివ్య దర్శనము ,  దేవతానుగ్రహము వలన ఇంద్రియ గోళములవరకూ తానుగా వచ్చువరకూ నిదానించు . " 


యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ యని కళ్ళుతెరిచినాడు . 


          ఆచార్యులు మరలా చెప్పినారు : " ఇప్పుడు మరలా అనుసంధానము చేసి ఆదిత్య దేవుడిని చూసి పంచాత్మ సంక్రమణ విద్యకు కాలము వచ్చినదేమో అడుగు . నువ్వు నేను చెప్పినానని , నన్ను ఆచార్యుడిగా చేసుకోవద్దు . చెప్పువాడు ఆదిత్యుడే అనుకో . అప్పుడు చెప్పువాడినీ , వినువాడినీ ఇద్దరినీ ఆదిత్యుడు సంరక్షించును . " 


         యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞయని ఆదిత్యుడిని అనుసంధానము చేసుకున్నాడు . కుడి కంటిలో చలనమైనది . ఆదిత్యుడు దర్శనమిచ్చి , పూజాదులను స్వీకరించి , అన్నాడు , " విద్యా గ్రహణమునకు సకాలమైనది . అయితే , దానికన్నా ముందు కలుగు ఇంకొక పరిణామమును గమనించు . ఇప్పుడు చూడు , నీకు ఎవరు దర్శనమిస్తున్నారో ? "


          ఎదురుగా ఇద్దరు వచ్చినారు . భోగముల వలన క్రొవ్వుపట్టిన శూరుడి శరీరాకృతి , తలపైన రత్నకిరీటమూ , కప్పుకున్న ఉత్తరీయమూ , ’ ఈతడు సామాన్యుడు కాదు ’ యనుదానిని ప్రకటముగా చెప్పుతున్నవి . ఆతడు ధరించిన గంధమాల్యములు కూడా అటువంటివే . అనన్య సాధారణమైనవి అని తెలిసిపోతున్నాయి . ప్రసన్నమైన ఆ ముఖపు వెడల్పువరకూ ఉన్న కన్నులు వాతాహతి వలన కొంచము కూడా క్షుబ్ధము కానట్టి సరోవరముల వలె శాంతములూ , రమణీయములూనై , తేజోపుంజములై వెలుగుచున్నవి . ఆతని ముఖములో ఏదో విలక్షణమైన తేజస్సు . దానిని చూచిన వారంతా చేతులెత్తి జోడించి ఏమి ఆజ్ఞ యని అడుగవలెను . అలాగు బలాత్కారము చేయుచున్నట్లు తోచుచున్న ఆ తేజస్సు, కావలసినది ఇచ్చెదనని ప్రసన్నముగా వచ్చినట్లుంది . 


          అతని పక్కనే ఒక స్త్రీ . స్ఫురద్రూపమునకు ఆమె అంటే చాలా అభిమానమై యుండవలెను . లేకున్న, అంతటి సౌందర్యము ఆమెకెలా లభించును ? ఆమె , ఆతడి ఎడమ భాగములో కూర్చున్నది . ఆతని ప్రసన్నత అంతా ఆమె వలన ప్రచోదితమైనట్లు కనబడుతున్నది . వీర పుంగవుని శౌర్యము నంతటినీ పిడికిట పట్టి ఆడించు నటువంటి ఆమె కరుణ , ఔదార్యములు అనన్య సాధారణములుగా కనిపించుచున్నవి . 


          చూడగా , ఇద్దరూ దంపతుల వలె కనిపించు చున్నారు . సౌభాగ్యమంతయూ ఆ దంపతుల వశములో నున్నట్లు యాజ్ఞవల్క్యునికి బోధ యగుచున్నది . భర్త , పాల మీగడవంటి మనోహరమైన బుట్టా వస్త్రోత్తరీయములను ధరించితే , భార్య , నానావర్ణ విరాజితమైన తేటయైన చీరను కట్టి ఎర్రటి రవికను ధరించి మనోహరముగా ఉంది . నుదుటి కుంకము జ్యోతిఃపుంజము వలె ప్రకాశమానముగా ఉంటే , చెక్కిళ్ళమీదా , మెడమీదా ధరించిన కస్తూరి పసుపు ముఖానికి వెన్నెల చౌకట్టును కట్టినట్టుంది . చెదరినట్లున్న కురులకు కట్టిన చిన్న చిన్న ఆణిముత్యములైతే శ్రమచేసినపుడు కనిపించు చిన్న చిన్న స్వేద బిందువులవలె ముద్దుగా ఉన్నాయి . ఆ తలపాపట దువ్వుకున్న విధము సౌభాగ్య రేఖను దిద్దినట్లుంది .  ఆ నాసాదండము సుందరమైన భ్రూయుగ్మము యథాస్థానములో ఉండుటకు కట్టిన ఆధార స్థంభము వలెనున్నది 


           ఆమె యొక్క ఆభరణములు కూడా అంతే నయన మనోహరములుగా ఉన్నవి . పచ్చలు , కెంపులు , వజ్రములతో చేసిన సరము కంఠములో శోభిస్తున్నది . నవరత్న ఖచితములైన వంకీలూ , సింహ లలాటపు కడియములూ చేతులనూ ముంజేతులనూ అలంకరించుచున్నవి . సుందరమైన వడ్డాణము నడుమున మెరుస్తున్నది . అన్నిటికన్నా హెచ్చుగా ఆణిముత్యపు హారము మధ్య మధ్య ఉన్న కుందనపు , నవరత్న గుళ్ళతో ఉజ్జ్వల కాంతియుక్తమై మెరుస్తూ , ఎదపై పాముపిల్ల వలె వెలుగుతూ పడుకుని ఉంది . దివ్య గంధమాల్యము లైతే భర్త కన్నా భార్యకే ఎక్కువగానున్నవి . 


         యాజ్ఞవల్క్యుడు ఆ దంపతుల దర్శన భాగ్యము వలన ఒక ఘడియ తృప్తుడై మూగబోయినాడు . ఎవరి ప్రచోదనము చేతనో లేచి నిలబడి వారికి మానసపూజను అర్పించినాడు . విశేషమేమనిన, 


          ’ లం పృథివ్యాత్మనే గంధాన్ ధారయామి ’ అన్నపుడు , మనోహరముగా , వేసర కలిగింపక, సూక్ష్మమైన గంధపు సరిసోన వ్యాపించి , చుట్టుపక్కల వాతావరణము నంతటినీ ప్రసన్నము చేయుచున్నది . ఆ గంధపు ఆఘ్రాణము వలన ఊపిరి ప్రసన్నమై , శాంతమై దీర్ఘమవుతున్నది . 


          ’ హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి ’ అన్నపుడు వారిద్దరికీ , అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి వికసిస్తున్న అనేక జాతుల మల్లెల పూదండలు వారి మెడను అలంకరిస్తున్నవి . వారు ధరించిన పుష్పమాలల సువాసన తో ఇప్పుడు వచ్చిన మాలల సువాసన చేరి ఒక కొత్త పండుగ చేసినట్టై , ప్రధానముగా నయనములకు గౌణమై మిగిలిన ఇంద్రియములకు సంతర్పణమగుచున్నది .


          ’ యం వాయ్వాత్మనే ధూపం దర్శయామి ’ అన్నపుడు ఒక కొత్తధూపపు ఘుమ ఘుమ , అజ్ఞాతమైననూ దివ్యమైనది యని బోధయగుచున్న అలౌకికమైన పరిమళము అంతటా నిండి దేహాద్యంతమూ ఆయాసమన్న దానిని లేకుండా పోగొట్టి ఏదో తెలియని హాయినిస్తున్నది . 


           ’ రం జ్ఞానాత్మనే దీపం దర్శయామి ’ అన్నపుడు  మనోహరముగా రత్నకాంతి రంజితమైన మంగళారతి యొకటి తానే వెలిగి , కుమారుని దేహము నంతా చిన్న చిన్న ముత్యములవంటి దీపములతో సుందరము గావించుచున్నది . 


          ’ వం అమృతాత్మనే అమృత ఖండ నివేదనమ్ సమర్పయామి ’ అన్నపుడు నాసికకు బహు తృప్తిని గొలుపు సువాసనతో ఆప్యాయన కరమైన బాదామి పాలు రెండు గిన్నెలలో వచ్చి నిలుస్తున్నది . దాని సువాసనవల్లనే ఉన్న ఆకలియంతా తీరినట్టై సర్వేంద్రియములకూ ఉత్తేజనము దొరకుతున్నది . 


         యాజ్ఞవల్క్యునికి ఈ దినము జరిగినది ఆశ్చర్యమును గొలుపునదే . అంతవరకూ అతడు దేవతలను కొన్నిసార్లు సాక్షాత్కరించుకొని యున్నాడు . అప్పుడు మానసపూజలను చేసినదీ ఉన్నది . అయితే ఏ దినము కూడా ఇలాగ , అతని నోటి వెంట వచ్చిన మాటలు ఘనీభూతమై వస్తు గుణములుగా పరిణమించలేదు . 


          ఆ ఆశ్చర్యములో , వచ్చినవారు ఎవరు అన్నది తెలుసుకొనుటకు అవకాశము దొరకలేదు . వెనుకనుండీ ఎవరో ప్రేరేపించినట్లు , వారికి నమస్కారము చేసి వారు ఎవరో తెలుసుకో అని చెప్పినట్లాయెను . యాజ్ఞవల్క్యుడు పర ప్రేషితుడి వలె యాంత్రికముగా ఆ ప్రశ్నను అడగబోతుండగా ఆ వచ్చినవారే మాట్లాడినారు . 


          " మేము ఇంద్ర దంపతులము . నీ కుడి కంటిలో నేనెల్లపుడూ ఉంటాను . ఈమె ఎడమ కంటిలో ఉంటుంది . ఇప్పుడు నీకు వరమునిచ్చుటకు వచ్చినాము . నువ్వు ఏ ఆదిత్యుని పగలురాత్రి యనక ఉపాసన చేయుచున్నావో , ఆ ఆదిత్యుని నేనే ! నువ్వు బ్రహ్మ విద్యా సంపన్నుడగు వరకూ ఆదిత్యుని వరము బీజరూపముగానే ఉండును . ఆ బ్రహ్మ విద్యను పొందుటకు ముందే నీ ఇంద్రియములూ , అంగాంగములూ దానిని ధారణ చేయగల సామర్థ్యమును పొందియుండవలెను . నీకు లభించు బ్రహ్మవిద్య నీలో నిలిచి ఫలకారి యవనీ యని ఆశీర్వదించి , ఆ సామర్థ్యమును నీకు కరుణించ వలెననియే మేమిద్దరమూ వచ్చినది . "


" పరమానుగ్రహమయినది " 


          " ఇంకొక రహస్యమును తెలుసుకో . బ్రహ్మవిద్యకు విఘ్నమును తెచ్చి అడ్డుకునేవారమూ మేమే ! వేలెడంత దొరికితే మనసు దానిని పర్వతమంత చేసి, ’ ఇంకెవరికి తెలుసు ఈ విద్య ’ యని విర్ర వీగునట్లు అహంకారమును హెచ్చించు వారమూ మేమే ! ఎందుకో తెలుసా ? అనామకులు , సామాన్యులు వెళ్ళు దారికాదు అది . యాజ్ఞవల్క్యా , నీవంటి , లోకోద్ధారమునకు పుట్టినవాడు తన కార్యమును నిర్వహించుటకు కావలసిన ఆత్మోద్ధారమునకై బ్రహ్మవిద్యను అనుగ్రహించే వారమూ మేమే ! "


యాజ్ఞవల్క్యుడు అడిగినాడు , " తమరికి లోకోద్ధారము పైన అంతటి మమతనా ? "


         ఇంద్రుడు నవ్వినాడు , " ఈ ప్రశ్న ఎక్కడినుండీ వచ్చినదో నాకు తెలుసు . అది ప్రాణ దేవుడిది . ఆతను తానై చెప్పవలసినదానిని  నా ద్వారా చెప్పించవలెనని ఈ ప్రశ్నను నీతో అడిగించినాడు . " 


          " కానిమ్ము , దీనిని లోకము తెలుసుకోనీ ! విను , నేను త్రిలోకాధిపతి యైన దేవరాజును . ఈ త్రిలోకములూ సుఖముగా ఉండవలె ననియే నేను పాలించుచున్నది . ఆ సుఖము మనసుది . మనసు , కాల దేశ వర్తమానములకు తగినట్టు తాను యే దేహములో ఉండునో , ఆ దేహపు గుణ కర్మలకు అనుగుణముగా తన తన సుఖమును కల్పించుకొనును. ఇంకా ఒక్కడుగు ముందుకు పోయి చూస్తే , ఆ మనసు , దేహములోనున్న నాడీ వ్యాపారముల చేత  ఇటు వైపుకు ,  దేహములోనున్న ప్రాణ సంక్రమణాదుల చేత అటు వైపుకూ , వెనుకటి కర్మ వలన ప్రచోదితమై ఉన్న బుద్ధివలన  ఇంకోవైపుకూ , తూగుడు బల్లకు చిక్కినట్టు ,  ఆటాడుటకు దొరికిన చెండు వలె ,  పైకీ కిందికీ , అటునిటూ నలిగిపోవుచుండును . కాబట్టి సుఖమునకు ఒక నియమితమైన స్వరూపము లేదు . దీనినే మేము మనస్సు యొక్క ఇఛ్చా ద్వేషములకు అనుగుణముగా సుఖమనీ దుఃఖమనీ అంటాము తెలిసిందా ? " 


" తెలిసినది , ముందరి విషయము అనుజ్ఞనివ్వవలెను . " 


          " దేహములో నున్న నాడులు శుద్ధమై కల్మష రహితములై ఉంటే అది ఒక శుద్ధి . దురాహారములు లేక ప్రాణాదులు శుద్ధముగా ఉంటే దానివలన లభించునది ఇంకొక శుద్ధి . వెనుకటి కర్మలు పుణ్యములై ఉంటే దానివలన లభించునది మరియొక శుద్ధి . ఇలాగ శుద్ధి త్రయము వలన శుద్ధమైయున్న మనస్సు బ్రహ్మవిద్య వైపే మొగ్గుతుంది . అటుల చేసిన ప్రయత్నము విఫలము కాకుండా మా అనుగ్రహము లభించితే , అప్పుడు ఆ ప్రయత్నము పూర్ణమై , ఆ వ్యక్తి బ్రహ్మవిద్యా సంపన్నుడగును . నీ తరువాతి ప్రశ్న నాకు తెలుసు , వ్యక్తి అలాగయితే లోకమునకేమి ప్రయోజనము ? అని కదా ?, విను . "


యాజ్ఞవల్క్యుడు చేతులతో మొక్కి అడిగినాడు  ,  " తమరి అనుజ్ఞ , సావధానముగా వింటున్నాను " 


          ఇంద్రుడు మరలా నవ్వి అన్నాడు , " చూచితివా ? నీ మనసును ప్రచోదించు ప్రాణాగ్నులు ప్రసన్నమగుటను నువ్వు ’ సావధానముగా ఉన్నాను ’ అన్నట్లే , లోకము కూడా , ఈ కొన నుండీ ఆ కొనవరకూ పర ప్రేషితము . దైనందిన వ్యవహారముల చేతను , లోకమును నియమమున పెట్టు కాల దేశముల చేతను , క్షణ క్షణమూ ప్రతి దేహము నందునూ కల్మషము నింపబడు చుండును . ఆ నిండిన కల్మషమును మనసు ప్రతిబింబించు చుండును . అలాగ నిండుచున్న కల్మషమును కడుగునది బ్రహ్మవిద్య. పాత్రలు ఎవరి ప్రయత్నమూ లేకనే మసిబారును. అయితే , ఎవరైనా వాటిని బలముగా పులుసు వేసి రుద్దితే మొదటివలె మెరయును . అదే విధముగా ఎవరైనా ఒకడు బ్రహ్మవిద్యా సంపన్నుడు పుట్టితే అతడి దర్శన , స్పర్శన, సల్లాపములచేత లోకము తన కల్మషమును కడుక్కొని మరలా పూర్వము వలెయగును . ఇది లోకపు కాంతిమయ స్థితి . ఇది ధర్మము . ఇది సహజమైన  స్థితి . అప్పుడు దేహములన్నీ శుచిగా ఉండుట వలన అందరూ ఎక్కడ చూచినా సత్య ధర్మ పరాయణులగుదురు . ఇలాగ లోకము చక్కబడుటే లోకోద్ధారము . ఇలాగ లోకోద్ధారమగునది , ఆత్మోద్ధారము చేసుకొన్న బ్రహ్మజ్ఞుడి వలన. ఇప్పుడర్థమైనదా ? "


" దేవా , మీ అందరి కృప వలన అర్థమయినది " 


         " సరే , యాజ్ఞవల్క్యా , మంచిది . ’ నీ ’  అనుటకు బదులు ’ మీ ’  అన్నావు కదా , అది బాగుంది . ఔను , నువ్వు పుట్టినది మా అందరి ప్రయత్నము వలన. మా అందరి వల్ల మాత్రమే కాదు , ఈ త్రిలోకపు ఉపకారము కోసము కూడా .  అందువలననే నువ్వు నా ఉపాసనను ప్రత్యక్షముగా చేయకున్ననూ , నేను నీకు దర్శనమిచ్చినది . నేను ఇచ్చిన సౌభాగ్యమును క్షేమముగా ఉండునట్లు చూచునది ఈమె . అందుచేత ఈమెను పిలుచుకొని వచ్చితిని . ఇక పై నీకోసము నువ్వు ఏమీ కోరవద్దు . నేను లోకోద్ధారమునకై , ఆత్మోద్ధారమును చేసుకొనవలెను అన్న అహంకారమును పెంచుకోవద్దు . దానికి మేమున్నాము . ఎవరెవరి వలన ఏయే పనులు ఎప్పుడెప్పుడు కావలెను అనునవి మేము చూచుకొనెదము . ఇక మీదట నీకున్నది ఒకే ఒక పని . భక్తి , జ్ఞానము , వైరాగ్యములను పెంచుకొనుట , అంతే నీ పని . అలాగన్ననేమి యని అడగబోవుచున్నావు . అది నీకు అర్థమగునట్లు అనుగ్రహమగును . దిగులు పడవద్దు , నీ పని ఇంతకు  మించి లేదు . ఇది బాగా గుర్తు పెట్టుకో . నీకు అహంకారమను తుప్పు పట్టకుండునట్లు , నీ ఆచార , విచారములలో మెలకువగా ఉండు . బాహ్యాంతః శుద్ధిని కాపాడుకో . "


          ఇంద్రుడు విరమించినాడు . యాజ్ఞవల్క్యుడు , ముక్కుకు కట్టిన ముగుతాడును లాగగనే హెచ్చరిక గొన్న ఎద్దువలె , ఎవరివల్లనో ప్రేరేపింప బడిన వాడివలె అడిగినాడు , " దేవా , మీరు దేవతలు , సాక్షాత్తుగా సూక్ష్మముగా మాలో ఉండి మాకు తెలియకుండానే మాతో వ్యాపారము చేయించెదరు . కాబట్టి అడుగుతున్నాను . ఆచార , విచార , వ్యవహారములచేత నాకు కల్మషము తాకకుండా , నా బాహ్యాభ్యంతర శుద్ధి చెడిపోకుండా మీరు కాపాడకపోతే , నేను దానినెలా సాధించగలను ? "


          " అందు కోసమే మేము నీకు సామర్థ్యమును కరుణించుటకు వచ్చినది . అంగాంగమూ ప్రసన్నమగునట్లు మేమిచ్చిన వరమును తీసుకో . బ్రహ్మధారణము నీకు సులభమగునట్లు మేము చేయుచున్న ఈ అనుగ్రహమును స్వీకరించు . ఎంతవరకూ నువ్వు ప్రత్యక్ష దేవతలైన ఆదిత్య , వాయు , అగ్నులను జడము లనకుండా , చేతనములని గౌరవించెదవో , అంతవరకూ నీకు యే కల్మషమూ తగలదు . నువ్వు వేదము తెలిసినవాడివి . మేము నీ దేహములో ఎప్పుడు , ఎలాగ , ఎందుకు వ్యాపారము చేసెదమో అది గమనిస్తూ ఉండు . నీకు బాహ్యాభ్యంతర శుద్ధి ఉంటుంది . అది సరే , నీకు ఉద్ధాలకుల ద్వారా , అవస్థా త్రయ నిరూపణకు ముందే సాక్షీయానుభవమును చెప్పితిమి కదా ? ఎందుకో అర్థమైనదా ? "


" చెప్పితే తెలుసుకుంటాను , దేవా ! " 


          " ఈ విషయమును చివరి వరకూ వదలకుండా ఉండవలెను . విను . మనుష్యుడు జాగృత్తిలో ఇంద్రియములు మేలుకొనియున్నపుడు తెలిసినదే సత్యము అనుకొనుచున్నాడు . అలాగ కాదు : కర్మ జ్ఞానేంద్రియములు రెండింటినీ తిరస్కరించి తెలుసుకొనుటకు ఇంకొక దారి ఉంది . అది జాగృత్ జ్ఞానమున కన్నా విపరీతము కాదు , దానికన్నా నిశ్చయమైనది యనునది నీకు తెలియవలెను . అది ఇంద్రియములకు గోచరమగునట్లు ప్రత్యక్షము కాకున్ననూ , అది అసత్యము కాదు . ’ సత్యస్య సత్యం ’ అనుదానిని నమ్ము . ఆ అనుభవము నీకు శీఘ్రముగా లభించి నీకు నువ్వుగా నామాటను ఒప్పుకొను కాలమూ వస్తుంది . ఇక మేము వెళ్ళి  వస్తాము " 


యాజ్ఞవల్క్యునికి కనిపిస్తున్న దంపతులు తిరోహితులైనారు . అయిననూ యాజ్ఞవల్క్యుడు ఆ శూన్యాకాశామునకు పూజాదులను సలిపి కనులు తెరచాడు . 

Janardhana Sharma

లక్ష్మి, సరస్వతి, గంగ ఎత్తిన అవతారాల గురించి

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 అమ్మవారి లీలలు వింటున్నకొద్దీ వినాలనిపిస్తాయి.చూసిన కొద్దీ చూడాలనిపిస్తాయి. దేవీభాగవతం లోని పరాశక్తి అంశావతారాలను ఈ నవరాత్రులలో వరుసగా వివరిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు ఈ ఎపిసోడ్ లో లక్ష్మి, సరస్వతి, గంగ ఎత్తిన అవతారాల గురించి ఎంతో హృద్యంగా వివరించారు. గంగ, సరస్వతి నదీ రూపాలు ధరించి భూలోకానికి ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకోవాల్సిందే. ఈ తొమ్మిది రోజులు వివిధ అవతారాల గురించి తెలుసుకోవడం ఒక అదృష్టమనే చెప్పాలి. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పాండవులు పూజించిన దుర్గాదేవి....!!

 పాండవులు పూజించిన

దుర్గాదేవి....!!


సాధారణంగా దుర్గాదేవి

ఆలయాలలో ఉత్తర ముఖంగా కాని, పడమటి  ముఖంగా కాని దర్శనాను గ్రహాన్ని ప్రసాదిస్తుంది.  


విల్లుపురం జిల్లా శంకరిపురం సమీపాన  వున్న కల్వరాయన్మలై చరియలలో పన్నెండు వేల దేవ బ్రాహ్మణులు పూజించిన దేవపాణ్డలమ్ గ్రామంలోని ఏటి ఒడ్డున 900 సంవత్సరాల నాటి  దుర్గాదేవి ఆలయం .


పై కప్పు ఏమీ లేకుండా మైదానంలో వున్నది. ఈ అమ్మవారిని పంచ పాండవులు తమ వనవాస సమయంలో పూజించి నందు వలన యీ దుర్గాదేవి కి వనదుర్గ అనే పేరు వచ్చింది. 


ఇక్కడ దుర్గాదేవి ఏక శిలపై 9 అడుగుల ఎత్తున తూర్పు ముఖంగా అనుగ్రహిస్తున్నది.


ఈ అమ్మవారిని మనసార వేడుకొని, శుక్రవారం నాడు, ఆదివారం నాడు, రాహుకాల సమయాన, పూలమాల సమర్పించి  నిమ్మపండు దొప్పలలో దీపం వెలిగించి పూజించిన సంతాన భాగ్యం,  వివాహభాగ్యం లభిస్తాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు. 


తమ కోరికలు నెరవేరిన తక్షణమే అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి,  అర్చనాభిషేకాలు చేసి మ్రొక్కులు తీర్చుకుంటారు.


కల్వరాయన్ కొండ ప్రాంతంలో

96 గ్రామాలకు చెందిన  కొండ జాతివారు ఈ దుర్గాదేవి ని కులదైవంగా పూజిస్తారు. ఇక్కడ దుర్గాదేవి ని ముస్లింలు కూడా ఆరాధించడం 

ఆశ్చర్య పరుస్తుంది. రాహువుకు

అధిదేవత దుర్గాదేవి.


కుటుంబ ఉన్నతికై చందనఅభిషేకం, శతృ బాధా నివృత్తికై  కుంకుమ పూతపెట్టి, ఎఱ్ఱ గన్నేరు పుష్పాలతో

పూజించి మ్రొక్కులు తీర్చుకుంటారు. 

జీవితంలో సర్వ సుఖాలకి దుర్గాదేవి ని పూజిస్తున్నారు భక్తులు. ఈ ప్రాంతమే పంచ పాండవులు వనవాసం ఆరంభించిన ప్రధమ వనంగా చెప్తారు. 


ఆదికాలంలో ఈ ప్రదేశం దట్టమైన అడవిగా వుండేదని

దేవతలు వచ్చి తపమాచరించి వరాలు పొందేవారని, పంచపాండవులు ప్రధమంగా నివసించిన సూర్య వనం యిదే అని చెప్తారు.


పంచ పాండవులు, ద్రౌపది నివసించిన ధౌమ్య వనమని ద్రౌపది కి సూర్యభగవానుడు అక్షయ పాత్ర యిచ్చిన స్ధలమని, దుర్వాస మహామునికి భోజనం పెట్టినదని సుదర్శనగిరి (వృధ్ధగిరి) పురాణంలో చూస్తాము. 


పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో వచ్చిన 12000 మంది వేద బ్రాహ్మణులు, ఒక సంవత్సర కాలం ఇక్కడ నివసించారు. అందువలన యీ ఊరు పాణ్డలమ్ అనే పేరుతో ప్రసిధ్ధి చెందినది.


వేయి సంవత్సరాల విశేష మామిడి వృక్షం. కాంచీపురం ఏకాంబరేశ్వరుని ఆలయంలో వున్నట్లుగా పాండవ వనేశ్వరర్.. దుర్గాదేవి

ఆలయానికి  మధ్య స్ధలవృక్షంగా యీ మామిడి చెట్టు వున్నది. నాలుగు ఏళ్ళకు ఒక సారి కాస్తుంది. 


🌸చెట్టు చుట్టుకొలత  22 అడుగులు.  ఎత్తు 77 అడుగులు, వయసు అయినందున పెద్ద గాలికి  చెట్టు కొమ్మలు విరిగిపోతూ వుంటాయి. 

ఈ చెట్టుకి చాలా చిన్న చిన్న పళ్ళు కాస్తాయి. 


వాటి బరువు సుమారుగా 100గ్రా. వరకూ ఉంటుంది, అయితే పెద్ద పండు బరువు 140గ్రా. నుంచి 160 గ్రా.ల వరకు వుంటుంది. ఇది భగవంతుని

అతిశయ సృష్టిగా భావిస్తారు. ఈ చెట్టు కాయలను కొన్ని వందల చిలకలు, ఉడతలు, పలు రకాల పక్షులు తిని ఆనందిస్తాయి.


తిరువణ్ణామలై, శంకరాపురం

మార్గంలో , దేవపాణ్డలమ్ అనబడే గ్రామంలో వున్నది..                         స్వస్తి..

జీవనోపాధి గురించే మాట్లాడుతారు.

 బ్రాహ్మణులు వాళ్ళ జీవనోపాధి గురించే మాట్లాడుతారు.


బ్రాహ్మణులు ఏ కష్టం చెయ్యరు.


తేరగా తిని కూర్చోవడానికి బ్రాహ్మణులు సృష్టించినదే పూజారి వ్యవస్థ మరియు దేవుళ్ళు.


బౌద్ధంలో దేవుడు లేడు పూజరులు లేరు ఇంకా బౌద్ధంలో అంతా సమానమే... బౌద్ధం అహింసని బోధిస్తుంది.జీవ హింస చెయ్యరాదు.......,.

.....

....

...


ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడే నాస్తిక హేటువాద నకిలీ అంబేద్కరిస్ట్ దళితిస్ట్ బుద్ధిస్టు మరక మత్తయ్య కమ్యూనిస్టు సోంబేరులు ,నీచ్ కమీనే కుత్తే బేవార్స్, బోషిడికే, గాడిదకొడుకులు & బిడ్డలు, పందుల్ , గొర్రెల్ , బట్టకాయల్స్, బొప్పాయిస్,రసం లేని నిమ్మకాయల్స్,గింజలు లేని జామకాయల్స్ ఇప్పుడు సమాధానం చెప్పండి...


ఏ కష్టం చేసి ఈ బౌద్ధ గురువులు ఇన్ని ఆహార పదార్థాలు సంపాదించారు?


ఎవ్వడిని బాగు పెట్టడానికి ఇన్ని ఆహార పదార్ధాలు కావాలి?


ఇన్ని మింగి తిని వీళ్ళు ఏం కష్టం చేస్తారు? ఏ యుద్దానికి పోవాలి?


బిక్ష పేరుతో దేశం మీద పడి అడుక్కు మింగే వాళ్లకు ఇంత తిండి ఎందుకు?


చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ బీఫ్ పోర్క్ అన్ని తిత్తి పలగ 

మింగి తినడమేనా అహింస అంటే? ఇదేనా జీవ హింస నిషేధం అంటే? 🤔🤔🤔


బౌద్ధం పేరుతో ఇలా టెంగి తినడానికే నా మా దళితులని బౌద్ధంలో కి మారమనేది?


ఆల్రెడీ అక్కడ పాస్టర్డ్స్ దశమ భాగాల పేరుతో మింగి తింటున్నారు మా మతం మారిన దళితుల (క్రైస్తవులు ) సొమ్ము.


ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు..


ఇంకా నాస్తికత్వం హేతువాదం అంబేద్కరిజం కమ్యూనిజం మొదలైన పేర్లతో మింగి తినే బ్యాచ్చులు చాలానే ఉన్నాయి.


ఇక రాజ్యాధికారం అంటూ మింగి తినే ముఠాలు కూడా కోకొల్లలు.


ఎవ్వరి ట్రాప్ లో పడకుండా మన దళిత గిరిజన బహుజన OC BC SC ST హిందూ సిక్కు జైన్ యూదు పార్షి సోదరులు జాగ్రత్తగా ఉండాలి.


చివరిగా మతం మారితే కష్టాలు పోతాయి వివక్ష పోతుంది అనుకుంటే మనిషి రోజుకొక మతం మారాల్సి వస్తుంది. హక్కులు పోరాడి సాధించుకోవాలి అంతే కాని పారిపోయి కాదు.


కేవలం పిరికి పందలే పారిపోతారు.


ఇక హిందూ దేవుళ్ళు అంతా బ్రాహ్మణులే... పూజరులు కేవలం బ్రాహ్మణులే ఉంటారు అనుకునే అజ్ఞానుల కోసం.....


పార్వతీ పరమేశ్వర వినాయక కుమారస్వామి మొదలైన ఆరాధ్య దైవాలు బ్రాహ్మణులు కారు.


సీతారామలక్ష్మణ ఆంజనేయ జాంబవాది దేవుళ్లు బ్రాహ్మణులు కాదు.


బలరామ శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ జాంబవతి పాండవ కౌరవాదులు బ్రాహ్మణులు కాదు.


నిత్యం పూజలందుకునే మత్స్య కూర్మ వరాహ నరసింహాది దశావతారాలు బ్రాహ్మణులు కాదు అసలు నరులేకారు.


రామాయణం వ్రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు.


మహాభారతం వ్రాసిన వేదవ్యాసుడు బ్రాహ్మణుడు కాదు.


వేదాల విభజన చేసిన వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు.


ఇక గ్రామ దేవతలు ఆ దేవాలయాల పూజారులు ఎవ్వరూ బ్రాహ్మణులు కాదు.


* మార్కండేయ గుడి పూజారులు బృగుబ్రాహ్మణులైన పద్మశాలిలు.

*వీరబ్రహ్మేంద్రస్వామి గుడి పూజారులైన విశ్వకర్మలు.

*కాటమయ్య గుడి పూజారులు గౌడులు.

*వనం ఎల్లమ్మతల్లి గుడి పూజారులు గౌడ్ లు.

*వనం మైసమ్మ తల్లి పూజారులు గౌడ్ లు.

*భీరప్ప గుడి పూజారులు కురువలు.

*మల్లన్న గుడి పూజారులు గొల్లలు.

*లింగమయ్య గుడి పూజారులు గొల్లలు.

*మంత్రాలమ్మ గుడి పూజారులు గొల్లలు.

*మారెమ్మ గుడి పూజారులు మాదిగలు.

*ఈర నాగమ్మ గుడి పూజారులు మాదిగలు.

*చెన్నకేశవులు గుడి పూజారులు మాలలు.

*నాంచారమ్మ గుడి పూజారులు ఎరుకలు.

*బాలమ్మ గుడి పూజారులు ఎరుకలు.

*జమ్ములమ్మ గుడి పూజారులు ఎరుకలు.

*ఏకలవ్య గుడి పూజారులు ఎరుకలు.

*కోటమైసమ్మ గుడి పూజారులు కుమ్మరొల్లు.

*పోశవ్వ గుడి పూజారులు కుమ్మరొల్లు.

*బొడ్రాయి గుడి పూజారులు బైండ్లొలు.

*ఈర నాగమ్మ గుడి పూజారులు బైండ్లొలు.

*బాపనింటి ఎల్లమ్మ గుడి పూజారులు బైండ్లొలు.

*మడేల్ గుడి పూజారులు సాకలొలు.

*ఈర నాగమ్మ గుడి పూజారులు సాకలొలు.

*రేణుక ఎల్లమ్మ గుడి పూజారులు గొల్ల ముష్టొలు.

*పోలేరమ్మ గుడి పూజారులు దేవరొల్లు.

 *జాంబవంతుడు గుడి పూజారులు చిందొలు.

*గండిమైసమ్మ గుడి పూజారులు తెలుగొలు.

*గంగమ్మ గుడి పూజారులు గంగపుత్రులు.

*లింగమయ్య గుడి పూజారులు చెంచులు.

*సమ్మక్క సారక్క గుడి పూజారులు కోయలు.

*రావణాశూరుడి గుడి పూజారులు గోండులు.

*తొల్జాభవాని  గుడి పూజారులు లంబాడాలు.

*సేవాలాల్ గుడి పూజారులు లంబాడాలు.

*లుంగిడియా గుడి పూజారులు లంబాడాలు.

*సీట్లా భవాని గుడి పూజారులు లంబాడాలు.

*మేరామా భవాని గుడి పూజారులు లంబాడాలు.

*ఈదమ్మ గుడి పూజారులు వడ్డెరొల్లు.

*బాలనాగమ్మ గుడి పూజారులు వడ్డెరొల్లు.

*ముత్యాలమ్మ గుడి పూజారులు గౌడ్ ళ్ళు.

*ముత్యాలమ్మ గుడి పూజారులు బార్కెవాళ్ళు.

*మ్యాతరమ్మ గుడి పూజారులు మేదరొళ్ళు.

*భూలచ్చువమ్మ గుడి పూజారులు బోయలు.

*ఎల్లమ్మ గుడి పూజారులు బోయలు

*ఇడుపు దేవర గుడి పూజారులు బోయలు.


జై జాంబవ !! జై హిందు 

సమాజం లో మార్పు రావడానికి నిస్వార్థ విన్నపాలు మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి జ్యోతిష్య వాస్తు శాస్త్ర సలహాలు సూచనలు కై సంప్రదించండి సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును వీడియో కాలింగ్ ద్వారా కూడా చేయిస్తాం మంత్రార్ధాలు ఫలితాలు వివరిస్తూ మీరు ఏ కోరికలు అయిన కోరుకోండి హోమం ద్వారా ఖచ్చితంగా తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం కానీ షరతులు వర్తిస్తాయి విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం ఫోన్ చేయండి ప్రవచనాలు ఉచితం డబ్బు తీసుకోం 7981622895

అమృత వాక్యాలు...!*

 *భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు...!*



 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..

ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...

ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

 భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం

బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.

కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ

అర్థం చేసుకునే భర్త

ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...

మళ్లీ తన భార్య కళ్లలో

కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.

కొంతమంది మధ్యలో వస్తారు.

మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.

భర్తకు భార్య శాశ్వతం.

 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...

గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!

 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.

భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

 మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం

ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే

ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.

మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.

భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.

నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

 ప్రేమ అనేది చాలా విలువైనది.

దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...

ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.

ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

 వివాహ వార్షికోత్సవం అంటే

ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

 నేలకు జారిన తారకలై

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

 సప్తపది ఏడు అడుగులు

మొదటి అడుగు - అన్న వృద్ధికి

రెండవ అడుగు - బలవృద్ధికి

మూడవ అడుగు - ధన వృద్ధికి

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐదవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...

నేడు పట్టుకున్న ఆమె చేయి...

విడవకు ఎన్నటికీ.

 వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.

పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

 కలిమి లేములతో...

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.

పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.

ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ...

మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

 మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)

ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదు

ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

 భర్తకి భార్య బలం కావాలి

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదు

భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.

 మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే

ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.

ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.

కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

సంతానం

 పూర్వం... తాతలు ముత్తాతలు సంతానం సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది...

ఒక్కొక్కరికి 5 గురు సంతానం నుండి 11,12 మంది ఉండేవారు ! వారికి మనకు తెలిసిన పొదుపు తెలియదా?? చేతకాదా?? ఇంతమంది సంతానంలో ఎవరో ఒక్కరు మాత్రమే స్వార్ధంగా ఉండేవారు!! వారిని మిగిలిన వారు పట్టించుకునే వారే కాదు!! ఒక్క మాటలో స్వార్ధ పరుడిని వెలి వేసేవారు!! పూర్వీకులు వారి సామర్ధ్య నిరూపణ కోసం కాదు సంతానాన్ని కనలేదు!! కేవలం కష్టం సుఖం వస్తే అందరూ కలిసి ఏక కట్టున ఉండేవారు.. పలానా ఇంటి పేరు వారు చాలా గొప్ప బలగం అని కొనియాడేవారు... వారికి కష్టం విలువ ఆప్యాయత విలువలు తెలిసి ఒకరికి ఒకరు అండగా ఉండేవారు!! మేనత్త మేనమామ పెదనాన్న బాబయ్య తాతయ్య ఇలా వరుస ప్రేమలు ఉండేవి.. పిల్లలకు విలువలు తెలిసేవి.. భోజనం బ్యాచ్ కూర్చుంటే కనీసం 25 మంది కూర్చునే వారు గ్యాస్ పొయ్యిలు లేవు! మిక్సీలు లేవు! గ్రైండర్లు లేవు! మోటార్ కుళాయి లేవు!! తిరగలి రోళ్లు రోకల్లు కట్టె పొయ్యలు.. పొట్టు పొయ్యాలు.. గ్రీజర్లు లేవు! డొలకలు, డొక్కల పొయ్యిలు!!!

రాను రాను సౌకర్యాలు గొప్పలు ఆడంబరాలు పెరిగాయి...

చిన్న కుటుంబాలు ఒకరు లేక ఇద్దరు చదువులు హాస్టల్స్ ఉద్యోగాలు విదేశాలు కులాంతరాలు సాఫీగా జరిగిపోతున్నసేపు నేనే హీరో!! ఓ అన్నయ్య చెల్లి తమ్ముడు అక్క... ఈ వరసుల అందం లేదు!! నేను మీ ఇంటికి రాను మీరు మా ఇంటికి రావద్దు!! ఈ వైరస్ చాప కింద నీరులా కరోనా వైరస్ సోకింది!!

ఒకసారి బండి ఆగిందా నీ అకౌంట్ లో లక్షలు మూలుగుతున్నా వాడంత దరిద్రుడు లేడు!!

ప్రతీదీ పరాదీనం.. దాచిన సొమ్ము దొంగల పాలు పరాయి పాలు....

కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పలుకరించే నాథుడే ఉండడు...

బిడ్డలు ఇద్దరే అయినా మాట పొసగదు!! నిత్యం ఎదో వారి మధ్య తేడాలే!! 

మనకన్నా ముస్లిమ్స్ బీదరికంలో ఉన్నా కలిసి కట్టుగా ఉన్నారు రాబోయే రోజుల్లో హిందూ దేశం ముస్లిం దేశం అయినా ఆశ్చర్యం లేదు...

ఓవైసి పిలుపు ఇస్తే లక్ష కార్లు ర్యాలీ చేసారు...

మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి జ్యోతిష్య వాస్తు శాస్త్ర సలహాలు సూచనలు కై సంప్రదించండి సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును వీడియో కాలింగ్ ద్వారా కూడా చేయిస్తాం మంత్రార్ధాలు ఫలితాలు వివరిస్తూ మీరు ఏ కోరికలు అయిన కోరుకోండి హోమం ద్వారా ఖచ్చితంగా తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం కానీ షరతులు వర్తిస్తాయి విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం ఫోన్ చేయండి 7981622895

⚜ *శ్రీ కానిపుర శ్రీ గోపాలకృష్ణ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 465*







⚜ *కేరళ  : కాసరగోడ్*


⚜ *శ్రీ కానిపుర శ్రీ గోపాలకృష్ణ ఆలయం*



💠 శ్రీ కృష్ణుని దేవతా స్వరూపాలను తలచుకున్నప్పుడల్లా మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి కిశోరుడు లేదా యుక్తవయస్సులో ఉన్న బాలుడి రూపంలో ఉన్న వేణుగోపాలస్వామి విగ్రహం మరియు శ్రీ రాధా-కృష్ణుల జంట రూపాలు.   

శ్రీకృష్ణుని బాల రూపం అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది మరియు ఉడిపిలో మనం అలాంటి రూపాన్ని చూడవచ్చు.   


💠 మథన కర్ర, తాళ్లు పట్టుకుని నిలబడిన యువకుడైన కృష్ణుడి ఈ రూపం చాలా విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది.  అయితే మంగుళూరు సమీపంలో ఇలాంటి దేవత ఉన్న ఆలయం ఉంది.  

అది కణిపురాలోని గోపాలకృష్ణ దేవాలయం. 


💠 కాణిపురా గోపాలకృష్ణ దేవాలయం కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉంది.  

ఇది కాసర్‌గోడ్ నగరానికి ఉత్తరాన 8 మైళ్ల దూరంలో ఉన్న కుంబాల అనే పట్టణంలో ఉంది 

 కుంబళాన్ని సాధారణంగా కణిపురా లేదా కనియార అంటారు.  


💠 కణిపురా అనే పేరు కన్వపురా అనే పదం నుండి వచ్చింది.  కణ్వ మహర్షి ఇక్కడి ఆలయంలో శ్రీ గోపాల కృష్ణ భగవానుని ప్రతిష్ఠించాడని చెబుతారు.   

అందువలన, అతని పేరు నుండి ఈ ప్రదేశానికి కణ్వపుర అని పేరు వచ్చింది.   

ఈ ప్రదేశానికి చుట్టుపక్కల ఋషి కన్వ పేరు నుండి వచ్చిన పేర్లను కలిగి ఉన్న ప్రదేశాలు ఉన్నాయని కూడా కనుగొనబడింది, ఉదాహరణకు, కన్మూరు (కణ్వ పార్థ), మంజేశ్వర్ సమీపంలోని పెజావర్ మఠం యొక్క కన్వ-తీర్థం మొదలైనవి.


💠 యశోదచే పూజింపబడుతున్న బాలగోపాలకృష్ణుని నలుపు గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత, ఋషి తన కమండలంలో గతంలో భద్రపరచిన మంత్రోదకాన్ని ఉపయోగించి దేవతకు ఆదిషేకం చేసారని స్థల-పురాణ పురాణం పేర్కొంది. మంత్రోదకము ప్రవాహముగా ప్రవహించి, నదిగా మారి, ఆఖరికి ఆలయానికి కొద్ది దూరంలో పడమటి సముద్రంలో చేరింది. 

నది "కుంభ హోల్" (హోల్ అంటే నది) కాబట్టి దీనిని కుంభిని అని కూడా అంటారు. 

దీంతో ఈ పట్టణానికి కుంబ్లా అనే పేరు వచ్చింది.


💠 ఈ ఆలయం కుంబ్లే/కుంబాల పట్టణం మధ్యలో కొండ దిగువన ఉంది. 

ఆలయంలో బాల గోపాలకృష్ణుని కృష్ణశిల ​​విగ్రహం పిల్లల లక్షణాలను కలిగి ఉంది.

బాల కృష్ణ విగ్రహం  వెన్న బంతిని పట్టుకుని, నిలబడి ఉన్న భంగిమలో చాలా అందంగా ఉంటుంది మరియు నల్ల గ్రానైట్ రాయితో ఉంటుంది.   


💠 భగవంతుడు వెన్న బంతిని పట్టుకున్నందున దేవతను నవనీత మూర్తి అని కూడా పిలుస్తారు, నవనీత అంటే వెన్న.  

 ఆలయ సముదాయానికి ఎడమ వైపున కుంభహోలే నది ప్రవహిస్తుంది.


💠 ఈ ఆలయానికి గురువాయూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయం మరియు కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం వంటి పవిత్రత ఉంది. 

అనేక లక్షల మంది భక్తులు ఈ ఆలయంలో క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తారు మరియు అనేక మంది భక్తుల జీవితాల్లో అద్భుతాల గురించి కథలు పుష్కలంగా ఉన్నాయి. 

నిజానికి ఈ దేవాలయం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.


💠 వేల సంవత్సరాల క్రితం (ద్వాపరయుగం) శ్రీకృష్ణుని సూచనల మేరకు మహర్షి కణ్వ విగ్రహాన్ని ప్రతిష్టించినందున ఈ ఆలయానికి "ఋషి ప్రతిష్టే" అనే లక్షణం వచ్చింది. అందువల్ల ఆలయ ప్రాంగణం నుండి విగ్రహాన్ని మార్చడం అసాధ్యం మరియు అసాధ్యమైనది.


💠 శ్రీ గోపాలకృష్ణ దేవాలయం త్రేతా, ద్వాపర మరియు కలియుగం యొక్క మూడు యుగాలకు పైగా పవిత్రతను పొందిందని పేర్కొన్నారు.


💠 వైష్ణవ సంప్రదాయంలో ఉన్న అభిమాన క్షేత్రాలలో ఈ మందిరం ప్రశంసించబడింది .


💠 ఈ ఆలయ పూజారులు కోట బ్రాహ్మణ వర్గానికి చెందినవారు.


🔆 పండుగలు


💠 కుంబ్లా ఆలయంలో 5 రోజుల పాటు  ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ధ్వజ ఆరోహణంతో ప్రారంభమవుతుంది. 

ఆలయ ప్రాంగణం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో విగ్రహం ముంచిన తరువాత విగ్రహం తిరిగి రావడం మరియు పవిత్ర జెండా (కోడి) క్రిందికి రావడంతో పండుగ ముగుస్తుంది. 

విగ్రహం ముందు మందుగుండు ప్రదర్శన చేయడం వల్ల "కుంబ్లే బేడీ"గా ప్రసిద్ధి చెందింది.


💠 కేరళ మరియు తుళునాడులోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ పండుగకు తరలివస్తారు. 

"బలి" అనేది పువ్వులు మరియు ఆభరణాలతో అలంకరించబడిన విగ్రహంతో ఆలయం చుట్టూ తిరిగే పూజారి యొక్క విగ్రహాన్ని తలపైకి తీసుకెళ్లే విలక్షణమైన మార్గం, ఇది ఎప్పుడూ చాలా తేలికగా ఉండదు. 

పూజారి చెండమేళం మరియు వాద్యాల తాళాల ప్రకారం కదులుతుంది. 

మొదట అతను తన తలపై ఉన్న విగ్రహానికి మద్దతుగా ఒక చేతితో కదులుతాడు మరియు మరొక చేతిని ఊపుతూ ఉంటాడు.


💠 ఇది కాసరగోడ్ పట్టణానికి ఉత్తరాన 8 మైళ్ల దూరంలో ఉంది. 

ఇది మంగళూరు నుండి దాదాపు 35 కి.మీ.ల దూరంలో ఉంది.

🙏 *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*కలధౌతాద్రియునస్థిమాలికయు, గోగంధర్వమున్బున్కయుం*

*బులి తోలుం భసితంబుఁ బాపతోడవుల్పోకుండఁ దోఁబుట్లకై*

*తొలి నేవారాలతోడఁ బుట్టఁగఁగళాదుల ల్గల్గె మేలయ్యె నా* 

*సిలువ ల్దూరముచేసికొం టెఱిఁగియే శ్రీకాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 57*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తోడబుట్టువులు లేనివాడివి, నీకున్న ఆస్తి అంతా మంచుకొండ, ఎముకల మాలిక, ముసలి ఎద్దు,చేతిలోని లేడి, పులిచర్మము, భస్మము, సర్పాభరణము, చంద్రకళ. ఇన్నింటిని పోషించుచున్న నీకు నేను భారమా? నన్ను కూడా పోషించలేవా ప్రభో?*


✍️🌷🌺🌹🙏

మొదటి పెద్ద నవల

నేను చదివిన మొదటి పెద్ద నవల. దాదాపు 540 పేజీలు ఉన్న ఈ నవల ని నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు సంక్రాంతి సెలవులలో చదవడం నాకు గుర్తు. ఒక నవల చదువుతూ పడి పడి నవ్వడం అదే మొదటి సారి. 


మొత్తం మూడు భాగాలుగా ఉన్న ఈ నవలలో కథానాయకుడైన పార్వతీశం గోదావరి జిల్లా లోని మొగల్తూరు నుండి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటాడు. మొదటి భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. రెండవ భాగంలో హాస్యం మరింత తగ్గగా, మూడవ భాగంలో తన పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, పార్వతీశం ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం ఉంటాయి. ఈ భాగంలో హాస్యం మరింత తగ్గుతుంది. 


ఈ పుస్తకం చదవడం వల్ల స్వాతంత్రానికి పూర్వ పరిస్థితులపైనా మనకు అవగాహన వస్తుంది. ఒక విధంగా ఇది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి పాక్షిక జీవిత చరిత్ర అనుకోవచ్చు. ఇదే పేరుతొ ఈ నవలని సినిమా గా కూడా తీశారు. 1940లో విడుదలయిన బారిస్టర్ పార్వతీశం సినిమా తెలుగులో మొట్టమొదటి హస్యకథా చిత్రం. ఈ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించారు.

శ్రీ ఆది శంకరాచార్య చరితము 38

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 38 వ భాగము*

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


*వరాహ మతస్థుడు:*

లక్ష్మణుడను పేరుగల వరాహ మతస్థుడు లేచి శ్రీ ఆచార్య స్వామిని సమీపించి,'శ్రీ శంకర దేశికేంద్రా! నమస్కారములు!

మా మతమెట్టిదో దెలిపెద నాలకించుడు. ప్రళయ కాలమందీ భూమండ లము యావత్తు నీట మునిగి పోవుచున్నది. అప్పుడు పరాత్పరుడు దయామయుడై వరాహ రూపమెత్తి తన కోర కొనతో భూమిని పైకెత్తి యున్నాడు. అట్టి వరాహ స్వామివారి కోరలు చిహ్నములుగా ధరించి ఆ స్వామిని తదేక ధ్యానముతో ఉపాసించుడు. మేము కూడా అటుల జేయు చున్నారము. మాకు ఆయన అనేక విధము ల సాయపడుచు ముక్తి నిస్తున్నాడు. తప్పక మావలె ఉపాసించుడు' అని వివరించాడు.


శ్రీశంకరులు 'లక్ష్మణా! నాయనా! నీవన్నది ఎన్నటికినీ సత్యం కానేరదు. బ్రాహ్మణుడైన వాడెవ్వడు అట్లు చేయ కూడదు.ద్విజుడెప్పుడు కర్మనాచరించవలెను, తపస్సు చేయవలెను. సగుణారాధన చేయ దలచితివా ఉత్తమోత్త మమైన దేవుని ఆరాధించుము.  సగుణరూపంలో శివునిగాని, విష్ణువును గాని కడుభక్తితో పూజింపుము.  విప్రుడు విధిగా చేయదగుకర్మలు సంధ్యావందనా దులున్నవి. అవి చేయకున్న శిక్షలకు పాత్రుడవు కాగలవు! అట్లు సత్కర్మల నాచరించిన చిత్తం పరిశుద్ధమై మోక్షమునకు హేతువ గును' అని బోధించుటతో శంకరుల ఆజ్ఞను అనుసరించి లక్ష్మణుడు శ్రీశంకరపాదులకు ముఖ్య శిష్యుడై జ్ఞానార్జన చేయుచు తపస్సు చేసికొనుచు కడకు జ్ఞానియయ్యెను.


*లోకసేవక మతస్థుడు:*


కామకర్ముడను పేరుగల లోకసేవక మతస్థుడు ఒకడు శ్రీశంకరాచార్య స్వామిని జేరి నమస్కారము లర్పించి 'స్వామీ!మానవసేవయే మాధవసేవ యను ధర్మము చాల ప్రసిద్ధి కెక్కియున్నది. పరాత్ప రునకు రెండు రూపము లున్నవి. అందొకటి వృష్టిరూపం, రెండవది సమిష్టిరూపం. సమిష్టి రూపమైనది భూతకోటి. అట్టి సమిష్టిరూపము నకు సేవ చేసినచో పరాత్పరునకు సేవ చేసినట్లే యగుచున్నది. ఆ ధర్మమును మేమందరం నమ్మి లోకమునకు సేవ చేయు చున్నాము. అట్లు చేయుటవలన మాకు సత్యలోక ప్రాప్తి కలుగు చున్నది. అదియే మాకు ముక్తి. ముక్తి కలుగవలెనన్న ఇది యొక్కటే మార్గము' అని వివరించాడు.


శ్రీశంకరాచార్యులు ఆ మార్గమును విని, 'నాయనా! ఇటు వినుము! ఈ కనబడే లోకమంత అసత్యము, అనిత్యము. అట్టిదానిని సేవించిన, నిత్యమైన ముక్తి బడయలేము. నిత్యమైనవాడు, సత్య స్వరూపుడు పరాత్పరు డొక్కడే ఉన్నాడు. ఆయనసర్వాంతర్యామి శాశ్వతానంద స్వరూ పుడు. అట్టివానిని తెలిసికొని ఆయన్నే సేవించాలి. పరోపకార మనునది మానవుడు ఆచరించదగియున్న పెక్కు ధర్మములలో నొకటిగా నున్నది. అట్టి ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ప్రాకులాడడంతో మోక్షం రానేరదు. తత్త్వ విచారణ చేయ వలెను. తద్వారా జ్ఞానము నార్జించుకొన వలెను. జ్ఞాని కావడమే మోక్షము' అని వివరించారు.


కామకర్ముడు శ్రీ జగద్గు రువులు చేసిన బోధ విని, తన బుద్ధిని మార్చుకొని, శ్రీశంకరా చార్యులకు శిష్యుడై జ్ఞానార్జన చేయుచు సుఖముగ నుండెను.


*గుణోపాసకులు:*


గుణోపాసకులలోనుండి ఒకడు శ్రీశంకరాచార్యు ల కడకు జని, 'యతివర్యా! వందనములు! అనేక మతములను తమ మతములో లీనం చేసికొని తమ మతమునే ప్రతిష్ఠించు కొనుచున్నారు. మా మతమట్టిది గాదు వినుడు, వివరించె దను! సత్వరజస్తమో గుణములు మూడును లోకమందు ప్రధాన కారణమై వెలయు చున్నవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గూడ ఈ మూడు గుణములు గలవారలై యున్నారు. వారి గుణముల నాధారముగ లోకము లను సృష్టించుచు, పరిపాలన చేయుచు, లయం చేస్తూ ప్రకాశించుచున్నారు. అందువల్ల ఈ త్రిగుణ ములు ప్రధాన కారణ మనుటకు ఆస్కారం కలిగినది. అందువలన మేమందరం ఈ త్రిగుణ ములనే ఆశ్రయించి గౌరవంతో ఉపాసించు చున్నాము.తాముగూడ మా వలెనే గుణోపాసన చేయుడు. అట్లొనరిం చిన అప్రయత్నముగ సర్వం సిద్ధించును' అని తెలియ జేసెను.


గుణోపాసకులు వివరించిన విధాన మంతయు శ్రీశంకర పాదులు విని, 'గుణములు ప్రకృతి నుండి కలుగుచున్నవి. ప్రకృతి సంబంధమైన ఉపాసన వలన ముక్తి కలుగదు. మీరాచరించు చున్నది తగినది కాదు. గుణోపాసన విసర్జించి తత్త్వ విచారణ చేయుడు. సర్వము మీరందు తెలిసి కొన గలరు’ అని చెప్పుటతో తమ మతమునకు స్వస్తి చెప్పి అద్వైత తత్త్వ విచారణ చేయుటకు ప్రారంభించి శ్రీశంకర పాదులకు శిష్యులై వేదవిహిత మైన కర్మలు చేస్తూ సుఖముగ నుండిరి.


*సాంఖ్య మతస్థులు:*


గుణోపాసకులు శ్రీ శంకరపాదులకు శిష్యు లయిన తరువాత, సాంఖ్య మతస్థులలో ఒక పెద్ద లేచి జగద్గురువుల కడ కేగి నమస్కారములర్పించి, 'స్వామీ! జగత్తునకు ఉపాదాన కారణం ప్రధానం. మనుస్మృతు లు మొదలైనవి ఉన్నట్లుగనే మా మతమునకు గూడ స్మృతి ప్రమాణము ఉన్నది. త్రిగుణ సామ్యస్థితినే ప్రధాన మందురు. అది మహత్తత్త్వములకు కారణం. ప్రధానము లోకమందు అఖండమై, అన్నిటికంటే గొప్పదై అవ్యక్తరూపంలోను, వ్యక్తరూపంలోను గలదు. సూక్ష్మమును, ప్రధానమును అవ్యక్త మందురు. స్థూలము, ప్రపంచమును వ్యక్త మందురు. మాచే ఆచరింపబడు ప్రధాన ఉపాసన వలన ముక్తి మాకు చాల అందు బాటులో గలదు. ఇది స్మృతి ప్రమాణము. కావున మా మతము అందరకు ఆచరణ యోగ్యముగ నున్నది. కావున తాము తప్పక మా మతమును స్వీకరించుడు' అని వివరించాడు.


శ్రీశంకరులు సాంఖ్య మతాశయమును విన్నారు. అంతట సాంఖ్యునితో, 'ఓయీ! నీవన్నదంతయు వేద విరుద్ధముగ నున్నది. స్మృతులు వేదములకు విరుద్ధముగ నుండ కూడదు. 'ప్రధానము' అనుచుంటివి! అది శబ్దం లేనిది. అందువల్ల అది జగత్కారణము కాదు. వేదమందు సర్వం చూచే శక్తి పరమాత్మకు గలదని చెప్పబడినది. నీవన్న ప్రధానం జడమై యుండి చూచే శక్తి లేనట్టిది. చైతన్య వంతమై పరబ్రహ్మ మొక్కటే జగత్కారణ మగుచున్నది. కావున వివేకంతో శ్రుతి వాక్యమును తెలిసి కొనుము' అని తెలియ జెప్పిరి. అంతట సాంఖ్యమతస్థుడు, 'నా శబ్దం ప్రధానం' అన్నందువల్ల శబ్దం లేక పోలేదు. అచింత్యము, అవ్యక్తము,అరూపము, అరసము, అగంధము, అనాది, అనంతము, మహత్తుకంటే పరమైనది ధృవమైనది, నిత్యమైనది, ఇట్టి గుణములు గలదానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి బయటపడు చున్నాడు. ఇది శ్రుతి ప్రమాణము గదా! కనుక ప్రధానము లోకములన్నిటికి కారణమగుటకు సందియమే లేదు' అని అడ్డు పలికెను.


అంతట శ్రీ జగద్గురు వులు, ‘బుద్ధిమంతుడా! ప్రధానం ఉపాసించుట వలన జ్ఞానం కలుగదు. జ్ఞానం లేనిదే ముక్తి రాదు. జ్ఞానం కావలె ననెదవా ప్రధానోపాసన కట్టిపెట్టి అద్వైత తత్త్వమును తెలిసికొని శాశ్వతానందమును పొందుము' అనిబోధించెను.


అంతట సాంఖ్యుడు తనకున్న అజ్ఞానమును విడనాడి శ్రీ శంకర పాదులకు శిష్యుడ తత్త్వ జ్ఞానమును ఆర్జించుకొన్నాడు.


*కాపిల మతస్థుడు:*


కాపిలమతము లోని వాడొకడు లేచి శంకరుల కడ కరుదెంచి, 'యతీశ్వరా! నమస్కారములు! యోగమువల్ల ముక్తి లభించునని మా మత ధర్మము. ఇందులకు ప్రమాణము లనేకము లున్నవి. అదెట్లు లభ్యమగునో వచించెద నాలకించుడు. 'జనులు సంచరించని ప్రశాంత స్థలమందు సుఖాసీను డై, శుచియై, నడుము వంచక, మెడ నిబ్బరంగ  నుంచుకొని ఇంద్రియ వ్యాపారము నరికట్టి, అత్యంత భక్తితో గురువులకు నమస్క రించి, తన హృదయ మును నిర్మలముగ నుంచు కొని, అట్టి పరిశుద్ధ హృదయ మందు, ద్వంద్వా తీతుడు, కంటికి కన్పించనివాడు, మనస్సున కందరాని వాడు, అంతులేని రూపం గలవాడు, మంగళాకారుడు, ప్రశాంత మైనవాడు, అమృతస్వరూపుడు, బ్రహ్మ పుట్టువునకు కారణ మైనవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, చిదానం దుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అద్భుత మైన రూపం గలవాడు, ఉమాసహితుడు, దేవాదిదేవుడు, ముక్కంటి, నీలకంఠుడు అయిన పరాత్పరుని నిలుపుకొని ధ్యానం చేయు తపశ్శాలి సకల భూతములకు మూలా ధారుడు,సాక్షీభూతుడుఅయిన పరాత్పరుని పొందుచున్నాడని యున్నది' కావున మా మతం అన్ని మతము లకన్న మిక్కిలి ఆదరణీయమై ప్రకాశించు చున్నది. జప విధానమంతయు వేరుగ శాస్త్రమందు చెప్పబడియున్నది. కావున ముక్తిని కోరు వారందరు విధిగా మా యోగమతమును స్వీకరించవలయును' అని వివరించెను.


శ్రీ శంకరాచార్యస్వామి యోగమత విధానము కపిలుడు చెప్పగా విని, 'ఓయీ! దహరోపాసన వేదమందు చెప్పబడి యెను. దానిచే ముక్తి కలుగునని యున్నది. కాని యోగో పాసన ముక్తికి హేతువని వేదములో తెలుపబడి యుండ లేదు. కావున యోగము ముక్తికి కారణం కానేరదు. జ్ఞానమే ముక్తికి హేతువు. జీవబ్రహ్మైక్య జ్ఞానం లభిస్తే ముక్తి వచ్చినట్లే. యోగమందు జీవబ్రహ్మఐక్య జ్ఞానం లేదు. 'సోహం,' 'శివోహం' మొదలైన అజపా మంత్రములను జపించుట వలన జీవాత్మకు పరమాత్మకు భేదం తొలగిపోవును. ‘ఆ పరమాత్మయే నేను’ అనునది జీవబ్రహ్మ భేదము. జపములు మోక్షము నియ్య జాలవు. అజపామంత్రం అట్టిది కాదు. ఆత్మను దర్శించవలెనన్న సర్వాత్మభావముండ వలెను. తనలో సర్వ భూతములున్నట్లు, సర్వభూతములలో తానున్నట్లు చూడవల యును. అట్టి అఖండ జ్ఞాన మెవనికి యుండునో వాడు పరమాత్మను పొంది నవాడగు చున్నాడు. షట్చక్ర భేదనాది యోగముల వలన ముక్తిరాదని వేదము స్పష్టముగ పలుకుచుండ అద్దానిని విడనాడి సాధన చతుష్టయ సంపత్తి గలిగి శ్రవణం మననం మొదలైన సాధనలను చేసి పరాత్పరుని తనలో చూడవలెను. అనగా తననుతాను పరమాత్మగా తెలిసికోవలెను. అదే అత్యంత పరమ జ్ఞానం. సన్న్యాసులు జ్ఞానం గలిగి సర్వసంగ పరిత్యాగం చేసి శుద్ధ సత్వబుద్ధితో ఉంటూ, ఆత్మతత్త్వ జ్ఞానామృతపానం చేస్తూ పరబ్రహ్మలగుచున్నారు. పరాంతకాలమందు పరామృత తత్త్వము నొంది సమస్త బంధము లనుండి విడివడి మోక్షమును పొందు చున్నారు. శ్రుతులు అట్టి విధముగ వినుపించుచున్నవి' అని బోధించారు. అంతట కాపిల మతస్థుడు,‘యతివర్యా పరిజ్ఞానమున్నవారు ఎవరూ మీవలె పలుకరు. ఖేచరీముద్ర అననేమో తెలియని వాడు 'నేను బ్రహ్మ జ్ఞానిని' అని పలికిన, వాని నాలుక తెగ గోయవలెను. గంగాయమునా సరస్వతీ నదుల సంయోగస్థానమైన (ఇడ, పింగళ, సుషుమ్న) త్రికూటము (భ్రూమధ్యస్థానము) తెలిసికొనక 'నేను బ్రహ్మనైతిని' అను వాని నాలుకను తుత్తునియ లు జేయవలెను. మేరుశృంగమును - సహస్రారమును తెలిసి కోకుండ 'నేనే బ్రహ్మను' అను వాని జిహ్వను చీల్చివేయవలెను. పూర్ణమండల మార్గము ద్వారా మనోన్మనీ స్వరూపాన్నితెలిసికొనకుండ 'నేను బ్రహ్మనైతిని' అని పలుకువాని నాలుకను ముక్కముక్కలుగా చేయవలెను. హృదయ మందు అంగుష్ఠ ప్రమాణములో ప్రకాశించుచున్న పరమాత్మ నెరుగక 'నేను బ్రహ్మనైతిని' అని చెప్పువాని నాలుకను ఖండ ఖండములుగ జేయవలెను. మహావిజ్ఞానఖని బాలునివలె, పిచ్చివానివలె, పిశాచము పగిది తిరుగాడును. అట్టి స్థితిని తెలిసికొనక 'బ్రహ్మమే నేనని' వచించువాని తల క్రింద పడునట్లు చేయవల సినదే. లయ యోగమును సాధించినవాడు పరమాత్మను పొందుచున్నాడు. ఇంకొక మార్గమేదియు కానరాదు. హఠయోగి కూడ సనాతనుడైన పరబ్రహ్మ స్థానమునే పొందు చున్నాడు. కావున యోగులు సదా ముక్తిని పొందుచున్నారు. ఇంకను ముక్తి హేతువు లైన యోగములు మెండుగా నున్నవి. కావున మీరందరు ముక్తిని బడయనెంచి యోగమును స్వీకరిం చుడు!' అని వివరించి నాడు.


శ్రీశంకరాచార్యస్వామి కాపిలుడు వివరించినది అంతయు విని 'ఓయీ! జ్ఞానమనిన ఎట్టిదో యెఱుంగక ఆ విధముగ నుడివితివి. యోగాభ్యాసము    వలన చిత్తశుద్ధి, ఏకాగ్రత అలవడును. చిత్తం బహు చంచల మైనది. దానికున్న గమనవేగం అగణ్య మైనది. వేలకు మించిన రెక్కలుగలది. విచిత్ర మైన పరుగులు వారును. అది సామాన్యముగ లోబడునది కాదు. చిత్తమును నిరోధించుటకు అష్టాంగ యోగములు ఉపయోగ పడునని యున్నదే కాని (ముక్తి మాత్రం రానేరదు) విజ్ఞానం కొరకు జెప్పబడి యుండలేదు. ఖేచరీ మొదలయిన ముద్రల వలన ముక్తి కలుగునని నీవన్నది విరుద్ధముగ నున్నది. ఆ ముద్రలు కూడ ఏకాగ్రత ను సాధించుట కొరకే ఏర్పాటు కాబడినవి. ఒక్క తత్త్వజ్ఞానం వలననే ముక్తి లభిస్తుందని వేదం వక్కాణిస్తూంది. మరియొక దానివలన రాదని వచించినది. వైదిక కర్మానుష్ఠానం ద్వారా కలిగిన చిత్తశుద్ది వివేకము, వైరాగ్యముశమదమాది సంపత్తిని కలుగజేయు చున్నది. ఆ విధంగా చిత్తశుద్ధిని పొందిన వాడు మోక్షం కోరినచో గురుముఖమున తత్త్వమస్యాది మహావాక్య శ్రవణం జేసి అందుండి స్రవించు జీవబ్రహ్మైక్య వేదాంత రహస్యామృతమును పానం చేయవలెను. అదియే మోక్షము' అని బోధించుటతో తెలివి నొంది శ్రీశంకరదేశికేంద్ర పదములకు కడుభక్తితో నమస్కరించి శిష్యుడై అద్వైతము నాశ్రయించెను. తరువాత పరమాణువాద మతమువారు శంకరులతో వాదించ నుద్యుక్తులయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 38 వ,భాగముసమాప్తము*

పంచాంగం 09.10.2024 Wednesday,

 ఈ రోజు పంచాంగం 09.10.2024 Wednesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష షష్ఠి తిధి సౌమ్య వాసర: మూల నక్షత్రం సౌభాగ్య తదుపరి శోభన యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 షష్ఠి మధ్యాహ్నం 12:10 వరకు.

మూల రా. తె 05:14 వరకు .


సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:55


వర్జ్యం : రాత్రి 03:33 నుండి 05:14 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:26 వరకు.


అమృతఘడియలు : రాత్రి 10:32 నుండీ 12:12 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

గురుకులములు

 ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.


01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య


ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*


26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).


ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 


వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.


1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది


మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.

ప్రతి ఫలం Prati Phalam


 

Padava Vaadu పదవ వాడు


 

Palupu taadu పలుపు త్రాడు


 పలుపు తాడు

ప్రస్తుత సమాజంకు పలుపు తాడు అంటే ఏమిటో తెలియదు కానీ గ్రామీణ జీవనం చేసే వారికి పలుపు తాడు చిరపరిచయం వున్న మాటపలుపు తాడు అంటే పశువులను కట్టేసే త్రాడుఇది ఒకవైపు పశువు మెడ చుట్టూ కట్టే విధంగా ఉండి మరొకవైపు ఒక గుంజకు (స్తంబానికి )కట్టటానికి వీలుగా ఉంటుందిపలువు మేడలో  తాడు కట్టి గుంజకు కట్టి వున్నట్లయితే  పశువు కొట్టాన్ని (షెడ్డువదలి వెళ్ళదు . ఉదయం గోపాలుడు వచ్చి  పలుపు తాడును తీసి పశువులను మేపటానికి అడవికి తీసుకొని వెళ్లి మరల సాయంత్రం వచ్చి కొట్టంలో గుంజకు కట్టివేయటం రైతుల దినచర్యపలుపు తాడు పరిధిలోనే పశువులు సంచరించగలవు అంటే  త్రాడు నిడివికన్నా దూరంగా అవి వేళ్ళ లేవువాటి ముందు మేత (గడ్డికుడితి ఏర్పాటు చేసి రైతు వెళతాడు.  అవి వాటికి ఆకలి వేసినప్పుడు గడ్డి తిని కుడితి తాగుతాయి.

ఒక రోజు ఒక రైతు తన వద్ద వున్న ఒక పశువుకు పలుపు తాడు కట్టడానికి ప్రయత్నిస్తే  తాడు రోజు పసువు మల మూత్రాదులతో తడిసి ఉన్నందున చీకి తెగిపోయి వున్నదిమిగిలిన తాడును కలిపి ముడి వేయ ప్రయత్నిస్తే అది చాలా పోట్టిగా వుందిఇక  పశువుకు వేరే తాడు కట్టటం  మినహా ఇంకొక మార్గం లేకపోయిందిసమయానికి అతని వద్ద ఇంకొక త్రాడు లభ్యం కానందువల్ల ఏమి చేయాలా అని అలోచించి అక్కడ వున్న కొన్ని గడ్డి పోచలను పశువు మెడచుట్టు త్రాడు కట్టినట్లుగా త్రిప్పినాడటమరుసటి రోజు గోపాలుడు వచ్చి  పశువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోలుకొని పోవటానికి ప్రయత్నిస్తే అది అక్కడి నుండి కదలటం లేదుఇదేమి ఆశ్చర్యం మేడలో పలుపు లేనే లేదు కానీ పశువు మాత్రం కదలటం లేదు అని  రైతుకు చెపితే అప్పుడు రైతుకు గత దినం తానూ చేసిన పని గుర్తుకు వచ్చి మరల కొన్ని గడ్డి పోచలను తీసుకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తున్నట్లు త్రిప్పాడట అప్పుడు  పశువు అక్కడినుండి కదిలి గోపాలునితో అడవికి వెళ్ళిందినిజానికి అప్పటిదాకా  పశువు తన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంది .  అందుకే అక్కడినుండి కదల లేదు.

సాధక మిత్రమా నిజానికి ప్రతి సాధకుడు కూడా కేవలం  పశువు లాగానే ఆలోచిస్తున్నాడుతన మెడకు పలుపు తాడు లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిలో ఉండీ వుంటున్నారు.ప్రతి మనిషి  చెరా చెర ప్రపంచంలోకి అంటే  జగత్తులోకి ఒంటరిగానే వస్తువున్నాడుఅంతే  కాదు  జగత్తుని నిష్క్రమించే వేళ ఒంటరిగా వెళుతున్నాడుఇంకొక విషయం ఏమిటంటే తానూ ఉన్నన్ని రోజులు ఇది నాది అది నాది వీరు నా వాళ్ళు నా భార్య నా భర్త నా పిల్లలు నా సోదరులు నా సోదరీమణులు అని భావిస్తూ ఒక గిరి గీసుకొని బ్రతుకుతున్నారు రకంగా అయితే పశువు తన మెడకు పలుపు తాడు ఉండి దాని పరిధిలో ఉంటున్నట్లునిజానికి పశువు తన మెడకు పలుపు లేకపోయినా రైతు తెలివిగా దానికి పలుపు తాడు ఉన్నట్లు బ్రాంతిని కలుగచేస్తే అదే నిజమని అనుకొని  పలుపుకు కట్టుబడి ఉన్నట్లుమనము కూడా  భగవంతుడు కల్పించిన శారీరిక బంధాలను శాశ్వితమైన బంధాలు అని అనుకోని వాటి పరిధిలోనే ఉండటమే కాకుండా వాటివరకు పరిమితం అయి అవే శాశ్వితం అని అనుకోని వాటి వెంటే జీవితాన్ని గడిపి అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తూ విలువైన మానవ జీవితాన్ని శాశ్వితము నిత్యమూ అయినా బ్రహ్మపదం వైపు నడపకుండా మరల  జీవన మరణ చక్రంలో పరిబ్రమిస్తూవున్నామునిజానికి సాధకునికి సంసారం ఒక బంధనం కానే కాదుప్రతి సాధకుడు సాధారణ సంసారిక జీవనం చేస్తూ మోక్ష పదాన్ని చేరుకోవచ్చు.

 

కాకపొతే సాధకుడు గమనించవలసిన విషయం ఏమిటంటే తన సాధనకు ఏవి ఏవి అవరోధాలుగా ఉంటున్నాయి అని తెలుసుకొని  తెలివిగా అధిగమించాల్సి ఉంటుంది.

త్రివిధ అవరోధాలుప్రతి సాధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలసి ఉంటుందని మన మహర్షులు వక్కాణించారు

1) ఆద్యాత్మికంఅంటే సాధనకు సాధకుని శరీరం సహకరించక పోవటంఉదాహరణకు సాధకుడు అనారోగ్యంతో ఉంటే శరీరము సాధనకు సహకరించదుఅంతే కాక బద్దకం అంటే తామస ప్రవ్రుత్తి కలిగి వున్నా సాధనకు ఉపక్రమించలేడు.

2) అది భౌతికము అంటే తన చుట్టు ప్రక్కల పరిసరాలు ప్రజలు తన సాధనకు అవరోధం కలిగించటంఅంటే సాధకుడు సాధనకు ఉపక్రమించినప్పుడు ఎక్కడో యేవో ధ్వనులులేక పరిసరాలలో కాలుష్యలో ఇతరులు లేక ఇతర జంతువులు కలిగించటం మొదలైనవిఇటీవల  సాధకుడు ఇంకొక విషయాన్ని  కోవకు చెందినదిగా తెలుసుకున్నాడుఎవరో మిత్రుడు భక్తి మార్గంలో వెళుతుంటాడుమంచిదే కానీ తానూ అంతటితో ఆగడు సాధకుని మిత్రుడు అవటం చేత సాధకుని నిరుత్సాహపరుస్తాడు ఎలాగంటె కలి యుగంలో జ్ఞ్యాన మార్గంతో పనిలేదు  కేవలం స్మరణాత్ ముక్తిహి అని అన్నారు కాబట్టి నీవు కూడా నామ స్మరణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమోయజ్ఞమో చేయి అని తాను చేసిన చేస్తున్న దైవ కార్యాన్ని వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తూ వుంటారువారి మాట వినక పొతే నీకు ఏమాత్రం భక్తి లేదు అందుకే నేను చెప్పింది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివే నీకు ఏమి తెలియకపోయిన అన్ని తెలుసు అని తలుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇతరులను త్రప్పుడు తోవలో సూచనలిస్తున్నావు అని హెచ్చరించాను కూడా వచ్చునుఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుత సమాజంలో మన గురుదేవులు ఆది శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆచరించే శక్తి లేకపోవటమే వీటన్నిటికీ కారణాలు.  ఎవరు ఏమి అన్న వాటిని వీటిని లెక్కలో పెట్టుకోకుండా సాధకుడు నిత్యం తన సాధనతో బ్రహ్మ పదాన్ని చేరవలసి ఉంటుందిఅనితర సాధన చేస్తే కానీ మోక్షాన్ని పొందలేరు.

ఇక మూడవ అవరోధాన్ని అది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రక్రుతి వలన ఏర్పడే బీబత్సవాలు ఉదాహరణకు తీవ్ర వానలుతుఫానులూ భూకంపాలు ఇతర ప్రళయాలువాటిని మనం అదుపులో వుంచుకోలేవుకానీ జాగ్రత్త వహిస్తే మొతటి రెండు అవరోధాలను సాధకులు అదుపులోకి తీసుకొని రావచ్చు.

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు మీ

భార్గవ శర్మ