1110d6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నాదేశం గర్వించదగిన వ్యక్తి…
*గొప్పతనం, హుందా, అణకువ*
➖➖➖✍️```
(మేలిముత్యం,రత్నం,వజ్రం)
ఒకసారి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తాను రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చి క్యాన్సిల్ అవ్వడంతో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సి వచ్చింది.
లగ్జరీ ఫ్లైట్ మిస్ అయింది. ఎకానమీ ఫ్లైట్ లో వెళ్లడం దిలీప్ కుమార్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు.
అధికారులతో గొడవపడి వాళ్ళని తిట్టుకుంటూ... షూటింగ్ ఉండడం వల్ల తప్పనిసరై ఎకానమీ ఫ్లైట్ ఎక్కాడు.
ఆ ఫ్లైట్ లోని ప్రయాణికులు దిలీప్ కుమార్ ని చూడగానే సంబరపడిపోయి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. ఎంతైనా ఒక పెద్ద సినిమా హీరో తమతో పాటు ప్రయాణిస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది.
మొత్తానికి దిలీప్ కుమార్ చిరాకు తగ్గి తన సీట్లో కూర్చున్నాడు. పక్క సీట్లో ఒక సాధారణమైన_మధ్యతరగతి ప్రయాణికుడు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు.
అతడు దిలీప్ కుమార్ ని కన్నెత్తి కూడా చూడలేదు. పేపర్ లో లీనమైపోయాడు. దిలీప్ కుమార్ కొంచెం ఆశ్చర్యపోయి తానే పలకరించాడు.
అతడు చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు. దిలీప్ కుమార్ కి కొంచెం కోపం వచ్చింది. ఒక బాలీవుడ్ స్టార్ పక్కన ఉన్నాడన్న ఏ ఫీలింగూ లేదేంటి.. అనుకుంటూ మళ్ళీ అడిగాడు.. “మీరు సినిమాలు చూడరా...?” అని అడిగాడు.
“పెద్దగా చూడనండి..” అని చెప్పాడతడు.
మిడిల్ క్లాస్ వాళ్లకి సినిమాలొక్కటే కదా వినోదం.. చూడకపోవడం ఏంటి అనుకుంటూ.. “ఓహో.. అందుకే మీకు నేనెవరో తెలియలేదు. నేను బాలీవుడ్ హీరోని. నా పేరు దిలీప్ కుమార్” అని చివరకు తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“ఓ. ఐసీ. గుడ్ జాబ్!" అని చెప్పి అతను కూల్ గా పేపర్ మూసేసి ఏదో బిజినెస్ జర్నల్ తీసి చదువుకోసాగాడు.
దిలీప్ కుమార్ కి చాలా అసహనంగా
ఉంది. నేనెవరో చెప్పినా కూడా ఆటోగ్రాఫ్ అడగడేంటి.. ఒక మాములు సిటిజన్ కి ఇంత పొగరా.? ఒక బాలీవుడ్ స్టార్ ని నేనే మాట్లాడుతుంటే కనీసం ఆటోగ్రాఫ్ అడగడా..అనుకొని, “మీరేం చేస్తుంటారు?" అని అడిగాడు.
“నేను బిజినెస్ మ్యాన్ ని. నా పేరు #రతన్_టాటా.” అని చెప్పేసరికి దిలీప్ కుమార్ బుర్ర తిరిగిపోయింది.
ఇతను గ్రేట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్ టాటా నా..? అందుకా ఇంత హుందాగా కూర్చున్నారు అనుకుంటూ
”అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంత సాధారణమైన వస్త్రధారణలో, ఎకానమీ క్లాస్ లో ఎందుకు..??”
“నేనెప్పుడూ ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తాను దిలీప్ గారూ. అందులో తప్పేముంది. నాకు మొదటినుండీ సామాన్యంగా జీవించడం అలవాటు“
అని చెప్పగా దిలీప్ కుమార్ అతని గొప్పతనానికి ఆశ్చర్యపోయి తానే అతని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు.```
*నీతి:*
ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేది ముఖ్యం కాదు. ఎంత గొప్పవారైనా అణుకువ లేనప్పుడు సంపాదించింది వ్యర్ధమే! నేను గొప్ప అనే మాట ఉంటే నీకన్నా హీనుడు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఆకాశానికి ఎదిగిన తాటి చెట్టు ఆకులు నేలకే చూస్తూ నిలబడతాయి. ఆ చెట్టులోని పళ్లను పీకితే నేల మీదకే పడతాయి. ఆకాశానికి చేరవు.
నీ ప్రవర్తన నీ మంచితనం నీ బుద్దులతో అటు ఆకాశానికి ఎదగగలవు ఇటు పాతాళానికి పడిపోగలవు. అర్థం అయితే మనం ఇంకా మనుషులమే అనుకోవచ్చు. కాకుంటే మర మనుషులమే అని అనుకోవడమే!✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి