30, మే 2026, శనివారం

ఆదివారం*🌞 *🌹31, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

  *🌹31, మే, 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : పౌర్ణమి* మ 02.14 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : అనూరాధ* సా 04.12 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : సిద్ధ* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*కరణం  : బవ* మ 02.14 *బాలువ* రా 03.25 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.30*     

అమృత కాలం  : *శేషం ఉ 06.21 వరకు*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : రా 10.29 - 12.17*

*దుర్ముహూర్తం  :సా 04.52- 05.44*

*రాహు కాలం  :సా 04.59- 06.36*

గుళికకాళం     : *మ 03.21 - 04.59*

యమగండం   : *మ 12.05 - 01.43*

సూర్యరాశి : *వృషభం*           

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.41* 

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.34- 08.10*

సంగవ కాలం        :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం      :*సా 06.36- 08.48*

రాత్రి కాలం         :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం        :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *సవిత్రే నమః వామచక్షుషి* 

            *మాం రక్షతు*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

_*శ్రీ రామ

 _*శ్రీ రామ జయరామ జయజయ రామరామ...!!*_

రామనామం మహా పవిత్రమైంది. రామనామ మహిమకు అటు ఆధ్యాత్మిక, ఇటు వైజ్ఞానిక కారణాలు ఎన్నో ఉన్నాయి. రామనామాన్ని అధికంగా ఉచ్చరించడం ద్వారా వ్యక్తిలో తేజస్సు పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉత్పన్నమవుతుంది. తమకు అధికార సిద్ధి పరిపూర్ణంగా కలుగుతుంది. అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.


భారతీయ మంత్రశాస్త్రం ప్రకారం అక్షరాలలో ‘రం’ అనేది అగ్ని బీజాక్షరం. దీనిని ఉచ్చరిస్తూ ఉంటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే, రామ తారక మంత్రంలోనూ అన్నీ రేఫలే (ర) ఉంటాయి. చాలామంది దేవతల పేర్లలోనూ ‘ర’ అనేది లేకుండా ఉండదు. ఉదాహరణకు శంకర, రమా, అపర్ణ, సరస్వతి, పార్వతి, సుబ్రహ్మణ్య, గాయత్రీ, ఈశ్వర మొదలైనవి చాలా ఉంటాయి. భాషాశాస్త్రం ప్రకారం ‘రం’ అక్షరాన్ని ‘ట్రిల్స్‌' అంటారు. ఈ అక్షరాన్ని ఉచ్చరిస్తుంటే మన నాలుక కొన్ని వేలసార్లు కంపనాలు పొందుతుంది. ఆ కంపనాలు నరాల వ్యవస్థ ద్వారా శరీరంలో అంటుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. దానివల్ల శరీరంలోని వేర్వేరు ‘బ్లాక్స్‌' క్రమంగా కనుమరుగవుతాయి. 


శరీరంలోని అన్ని వ్యవస్థలలోని ‘బ్లాక్స్‌' తొలగిపోవడమే ‘పాపం’ దూరం కావడం. అందులోను దైవనామం బాహ్యోచ్చారణ చేసినా, అంతరోచ్చారణ చేసినా పాపనాశనమే అవుతుంది. బాహ్యోచ్చారణ ద్వారా ప్రత్యక్షంగా, అంతరోచ్చారణ ద్వారా పరోక్షంగా శరీర, మానసిక శుద్ధి కలుగుతుంది. నామాలకు ‘జయ జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా అది ‘జయాంతమాల’ అవుతుంది. ఇటువంటివి మంత్రశాస్త్రంలో వేర్వేరుగా ఉంటాయి. శ్రీరామ శబ్దానికి ‘జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా సర్వకార్య విజయానికి, అధికార సిద్ధికి, ఆనంద ప్రదమైన, ఆరోగ్య ప్రదమైన జీవనానికి హేతువు అవుతుంది. అందుకే, ప్రతిరోజూ ‘శ్రీరామ జయరామ జయజయ రామరామ’ అనే జపాన్ని కనీసం 3 గంటల సేపు చేద్దాం. అన్ని సమస్యలను పరిష్కరించుకునే శక్తిని పెంచుకుని, విజయాన్ని సాధించి ఆనందంగా జీవిద్దాం.

వృద్ధాప్యంలో

  వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం"....కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం​...


"వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం, విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది" అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2,500 ఏళ్ల నాటిదైనా, నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది.​


ఇది లీ వీ అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు...


“మహాశయా, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా... వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము?" అని అడిగాడు.​


లీ వీ చెడ్డ తండ్రి కాదు. నిజానికి, ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికీ లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడినప్పుడు, ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీ వీ భావించాడు. తన ఇంటిని అమ్మివేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం,మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు.​ కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు కుటుంబంలోని అందరితో నిండిఉన్నా సరే , ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీ వీ మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ... వారు మరింత దూరమవుతూ వచ్చారు.​సమాధానం అన్వేషణ​ కోసం


లీ వీ కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు...


“గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ అవసరంలేని వ్యక్తిలా మారిపోయాను... ఎందుకు?”​కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా మూడు చిన్న పాఠాలు నేర్పాడు.​


అందులో మొదటి పాఠం...


ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. “ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి పొంగిపొర్లుతాయి,” అని లీ వీ జవాబిచ్చాడు.“సరిగ్గా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలని చూస్తే, అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది.అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు".


ఇక ​రెండవ పాఠం...


ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న రెండు చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.


“చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి,” అని లీ వీ అన్నాడు.“అవి బలంగా పెరుగుతాయా?...లేదు...అవి బలహీనంగా, ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం. కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం".


మూడవ పాఠంగా...


కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలిని గట్టిగా బిగించారు.“నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది?”


“అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది,” అని లీ వీ చెప్పాడు.“మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే,” అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. “ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే... అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది."


"నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు, వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా?” అని కన్ఫ్యూషియస్ అడిగారు.“లేదు గురువుగారు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు.”


“మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు.ఈ ప్రపంచం కోసం పెంచావు.”​


మొదటిసారి లీ వీకి అసలు విషయం అర్థమైంది.​


తరువాత కన్ఫ్యూషియస్


లీ వీ కు కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు.“నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు. ఇంకా నేర్పించవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు...అది కొత్త ఆరంభాల సమయం.


పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురుచూడకు. నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు.”​ అని బోధించాడు.


లీ వీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు...కానీ కొడుకు ఇంటికి కాదు. ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను ‘మాస్టర్ లీ’ అని పిలవడం మొదలుపెట్టారు.​ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ, ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ, అందరూ ఆయనను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు.​


ప్రేమ తిరిగి వచ్చిన వేళ​ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. “నాన్నా, నువ్వు వెళ్లి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాము. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా.


మాతో ఉండటానికి కాదు, మాతో గడపడానికి రా.


”​లీ వీ వెళ్ళినప్పుడు, ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా, ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు.​


అప్పుడే ఆయనకు అర్థమైంది...ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో... అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చిందని .​


ఈ కథ ఇచ్చే సందేశం​“వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు” అని కాదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది...బాధ్యత లేదా బలవంతం నుండి కాదు.​


మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే, వారిని ఊపిరి ఆడకుండా చేస్తాము. మనల్ని మనం వారిపై రుద్దితే, మనం వారికి అదృశ్యమైపోతాము.


ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.​


కన్ఫ్యూషియస్ చెప్పినట్లు...


ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము. వాటిని కేవలం పోషించగలం.


నిజం కదా మేము పెంచాము పెద్దవాళ్ళను చేసాము. మేము పెద్దవాళ్ళము అయ్యాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి. ఇది ఇచ్చి పుచ్చుకోవాటమ్ లాంటి ది.

ఆలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యి, తరువాత ఆశించకు వాళ్ళనుంచి.

ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్దాయన చెప్పినట్లు ఎదో ఒక పని చెయ్యి. ఎదో ఒక సహాయం చేస్తున్నావ్ ఉండు. బిడ్డలు వారంతట వారే మారతారు.


లాస్ట్ గా పిల్లలకు చెయ్యటం నే బాధ్యత.

గీతలో చెప్పినట్లు ఖర్మ ను చెయ్యి. ఫలితం ఎదురు చూడకు వాళ్ళు తిరిగి నీలాగా చెయ్యాలని ఆశించకు.


    🌿సుల్తానా. తిరుపతి 🌿

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *శనివారం 30 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                               

          *104 వ భాగం*

     

       *శ్రీకృష్ణావతారము-7*


      *కాళీయ మర్దనము*```


కృష్ణుడు, గోపబాలురు గోవులను కాచే ప్రదేశం సమీపంలో ఒక నీటి మడుగుఉంది. వర్షాకాలంలో యమునా నది పొంగి ప్రవహించే సమయంలో నీరు ఆ మడుగు లోకి వచ్చి చేరేది. అంతుతెలియని లోతు కలిగిన ఆ నీటి మడుగు దగ్గరకు అక్కడివారు ఎవ్వరు వెళ్లేవారు కాదు. ఆ నీరు సలసల కాగుతున్నట్టు ఉండి వేడి విషపు పొగలు చిమ్ముతూ ఉంటుంది.


పొరబాటున ఆ నీరు త్రాగే జంతువులు, ఆ మడుగు పై ఎగిరి విషపు గాలి పీల్చేపక్షులు నల్లబడి కింద నీటిలో చనిపోయేవి. నీరు త్రాగడానికి వచ్చే జంతువులను, ఆ మడుగులో ఉండే కాళీయుడు అనే ఐదు తలల మహాసర్పము తన తోకతో పట్టి లాగి తినేసేది.  తెలిసిన గోపాలురు తమ గోవులను మడుగు సమీపానికి వెళ్ల కుండా చూసేవారు.


కృష్ణుడి మధుర మురళీగానంలో మునిగిపోయి గోపాలురుండగా ఒక గోవత్సము(దూడ)  చెంగు చెంగున ఎగురుతూ కాళీయమడుగు తీరానికి వెళ్లింది. గోపబాలుడు ఒకడు చూసి దానిని మళ్ళించుకురావడానికి పరుగెత్తి వెళ్లాడు.  గోపబాలుడు పట్టుకునేలోపు మడుగు నుంచి ఐదు తలల కాళీయ సర్పము లేచి తన తోక చాచి తీరాన ఉన్న ఆవుదూడను చుట్టుకుని పట్టుకుని మడుగు లోకి లాగివేసింది. ఆవుదూడ భయంతో అంబా అంబా అని అరుస్తుంటే గోపబాలుడు భయ పడి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వద్దకు వచ్చాడు.


“కన్నయ్యా! మన దూడను మడుగులో ఉండే సర్పం పట్టుకుని నీళ్ళ లోపలికి లాగేసింది” అని ఏడుస్తూ కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు వెంటనే చెట్టు మీద నుంచి దిగి మడుగు దగ్గరికి పరిగెత్తుకు  వెళ్లాడు. బలరాముడు, గోపబాలురు వెంట పరిగెత్తారు.  మడుగు దగ్గరకు వెళ్లిన కృష్ణుడు అక్కడ ఉండే పెద్ద చెట్టు పైకెక్కి మడుగు మధ్యకు వ్యాపించిన చెట్టు కొమ్మను చేరి ఆవుదూడను సర్పము నీట ముంచుతున్న ప్రదేశంలోకి దూకాడు.


బలరాముడు నిబ్బరంగా ఉన్నా, చూస్తున్న గోపబాలురు భయ పడ్డారు. హాహాకారాలు చేశారు. కొందరు నంద యశోదలకు చెప్పడానికి గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. నీటిలో దూకిన కృష్ణుడు సర్పము తోకకు చుట్టుకుని అరుస్తున్న ఆవుదూడను విడదీసి ఒడ్డుకు నీటినుండే విసిరేశాడు. బలరాముడు పట్టుకుని ఆ దూడకు సపర్యలు చేశాడు.


కాళీయ సర్పానికి తన బంధనం నుంచి దూడను విడిపించిన కృష్ణుడిపై ఆగ్రహం వచ్చింది. కృష్ణుని తోకతోచుట్టి నాగపాశంతో బంధించి తన పడగల నుంచి విషపు గాలులు కృష్ణుని పైకి వదిలాడు. బాలకృష్ణుడు సృహ తప్పాడు.


తరువాత కథ చెప్పే ముందు కాళీయుడు ఎవరో చెబుతాను..   


రసాతలంలో కాళీయుడు అనే సర్పరాజు భార్యలు, పిల్లలు, సేవకులతో నివసించేవాడు. 

తన విషపు అగ్ని జ్వాలలతో రసాతల వాసులను భయ భ్రాంతులను చేసేవాడు. దొరికిన వారిని చంపి ఆహారంగా తీసుకునేవాడు. రసాతల వాసులు గరుత్మంతుడితో మొర పెట్టుకుని కాళీయుని నుంచి రక్షించమని కోరారు. గరుత్మంతుడు కాళీయుని చంపడానికి బయలుదేరి వెళ్లాడు.


గరుత్మంతుడు వస్తున్నాడని తెలుసుకున్న కాళీయుడు ప్రాణాలు రక్షించుకోవడానికి తనవారిని తీసుకుని సముద్రం ద్వారా యమునకు, యమున నుంచి నీటి మడుగుకు వచ్చి దాక్కున్నాడు. మడుగు సమీపానికి వచ్చే జంతువులను, మనుషులను చంపి ఆకలి తీర్చుకోసాగాడు. కాళీయుని విషానికి మడుగు నీరు విషపూరితమై త్రాగడానికి పనికిరాకుండా పోయింది.


ఇక కథలోకి వస్తే, సమాచారం తెలిసిన నందుడు యశోద గోపికలు గోపబాలురతో కలసి కాళింది మడుగు దగ్గరకు వచ్చారు. కృష్ణుడు కనపడలేదు. కాళింది మడుగు మధ్య నుండి ఉబుకుతున్న వేడి నీరు, పొగలుగా చిమ్ముతున్న విషపు జ్వాలలు చూసి యశోద “కన్నయ్యా” అంటూ దుఖంతో సృహతప్పింది. నందుడు, గోపికలు,గోపాలురు దుఖిస్తున్నారు. మడుగులోకి వెళ్లే సాహసం ఎవ్వరికీ లేదు.


బలరాముడికి తన అవతారాంశ జ్ఞప్తికి వచ్చి మడుగులోపల సృహ తప్పి కాళీయుడి బంధనంలో చిక్కిన కృష్ణుని కన్నులు మూసుకుని దివ్యదృష్టితో చూశాడు. మనస్సులోనే నమస్కరిస్తూ “శ్రీహరీ! మీ అవతారాన్ని లోకానికి చూపించే సమయం వచ్చింది. సృహకి వచ్చి కాళీయుడికి బుద్ది చెప్పి శిక్షించండి. లేదంటే నా ఆదిశేష రూపము ప్రకటించవలసి వస్తుంది” అని ప్రార్ధించాడు.


మడుగులో నాగపాశానికి బందీ అయ్యి సృహతప్పిన కృష్ణుని బలరాముని ప్రార్ధన మేలుకొలిపింది.  క్షణంలో  శరీరము సవరించుకొని ఒక్క ఉదుట్న నాగపాశం నుండి విడిపించుకున్నాడు. చేతిలో కాళీయుడి తోక చివరి భాగం పట్టుకుని చటుక్కున కాళీయుడి పడగల పైకి ఎగిరాడు. కాళీయుని పడగలను పాదాలతో మర్ధిస్తూ నాట్యం చేయసాగాడు.


కృష్ణుడి పాద ధాటికి కాళీయుడి ఐదు పడగల నుంచి విషం,రక్తం బయటకు వచ్చాయి. మడుగు మధ్య నుండి రక్తము ఉబికి రావడంతో నందుడు గోపాలురు హాహాకారాలు చేశారు. బలరాముడు వారికి “కృష్ణుడికి ఏమి కాలేదు” అని ధైర్యం చెబుతూ త్వరలో మడుగు నుంచి సురక్షితంగా కృష్ణుడు వస్తాడని హామి ఇచ్చాడు.


కాళీయుడి రక్తం అంతా పోయింది. ప్రాణాలు మరికొన్ని క్షణాలలో పోతాయి అనుకునే సమయంలో కాళీయుని పత్నులు కృష్ణుడి ముందుకు వచ్చి చేతులు జోడించి  పతికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్ధించారు. కాళీయుడు కూడా ‘పాహి మాం కృష్ణా’ అని శరణు వేడాడు. 


కృష్ణుడు శాంతించి “మీరు తక్షణమే ఈ మడుగు వదలి రసాతలం వెళ్లి పోవాలి. నా అడుగుల ముద్రలు పడగల పైన ఉండటంతో గరుత్మంతుడు కాళీయుని ఏమీ చేయడు. ఇక జీవ జంతువులను విషంతో చంపకుండా రసాతలంలో లభించేవి తిని ఆకలి తీర్చు కోవాలి. ఇలా ప్రమాణం చేస్తే వదిలేస్తాను. ఈ మడుగు ఇకనుంచి కాళింది మడుగు అనే పేరుతో ప్రసిద్దమవుతుంది” అన్నాడు.


కాళీయుడు అంగీకరించాడు. పడగలపై వేణుగానం పలికిస్తూ నాట్య భంగిమలో ఉన్న తనను నీటి పైకి తీసుకెళ్లమని కాళీయుని కృష్ణుడు ఆదేశించాడు. కాళీయుడు కృష్ణుని మడుగు నీటి నుండి పైకి తీసుకొచ్చాడు.  కాళీయుడి పడగల పై వేణుగానం చేస్తూ నృత్యభంగిమలో ఉన్న కృష్ణుని నందుడు, గోపాలురు, గోపికలు, గోపబాలురతో పాటు అప్పుడే సృహలోకి వచ్చిన యశోద చూసి ఆనందించింది. గోపాలురు హర్షధ్వానాలు చేసారు.


కాళీయుడు శ్రీకృష్ణుని తీరాన దించి తన భార్యలు, పిల్లలు, పరివారంతో మడుగు వదలి రసాతలానికి వెళ్లి పోయాడు. యశోద నందులకు తమ కుమా రుడు దివ్యబాలుడు, నారాయణుడి అవతారమని అర్ధమయ్యింది. కృష్ణుడికి అర్ధం అయ్యి యశోదను కుదుపుతూ “అమ్మా! చాలా ఆకలిగా ఉంది. వెన్న పెట్టవా అమ్మా!” అని మారాం చేస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు. 


యశోద పై విష్ణుమాయ ప్రభావం పడి భగవంతుడు అనే మాట మరచిపోయింది. మాతృప్రేమ బయటకు వచ్చి “పదరా కన్నా! ముందు దిష్టి తీసి తరువాత కడుపు నిండేంత వెన్న తింటానికి  ఇస్తాను" అంటూ చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. బలరాముడు నందుడు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.


*తరువాత కథ  రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గొప్ప వారు ఎవరు

 *గొప్ప వారు ఎవరు - మంచి వారు ఎవరు???*


ఈరోజుల్లో చాలా మంది మా పిల్లవాడు చాలా గొప్ప వాడు కావాలి, చాలా చదువు చదవాలి, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తేవాలి అని ఆత్రుత పడుతుంటారు...!!

 మరి కొంత మంది తలితండ్రులు నా కుమారుడు చాలా మంచి వాడు కావాలని అని కోరుకుంటారు!!... 

ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది,

గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి, సరియైనటువంటి కోరిక కాదు.  

నీవు గొప్పవాడు కావాలనుకుంటే, గొప్ప లావా ? లేక ఎత్తా? లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా ? లేక శ్రీమంతుడా? లేక బలవంతుడా? లేక గుణవంతుడా? మంచి పేరు అనేటువంటిది గుణముతో వస్తుంది.


కనుకనే... *గొప్పవాడు రావణుడు, మంచి వాడు రాముడు*.  

చదివినటువంటి చదువులు అన్నియు కూడను ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు, ఆచరించి చూపాడు రాముడు,...


కానీ ఎన్నియో చదువులు చదివాడు రావణుడు, కానీ ఆచరించలేదు, అజ్ఞానం ఆవరించిపోయింది.  

కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ, మంచి పేరు రాలేదు.  


"రాముడు ఆచరించి, ఆనందించి పది మందికి పంచి పెట్టినటువంటి వాడు కనుకనే, అతనికి మంచి పేరే వచ్చింది కానీ, గొప్ప పేరు రాలేదు."

ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మన పిల్లవాడు రాముడు కావాలా, రావణుడు కావాలా అని!!...


          *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం నుండి....✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

న్యాయం సాధించడానికి

 న్యాయం సాధించడానికి అసాధారణ పద్ధతులను ఉపయోగించడం గురించిన మన అవగాహనపై మహాభారతం వంటి కథలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?



ధర్మరాజు యక్షుడితో సంవాదం


యదిహాస్తి తదన్యత్ర

యన్నేహాస్తి నతత్ క్వచిత్ "

- ఆది పర్వం, మహాభారతం


ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే నాలుగు సద్గుణాల గురించి మహర్షి వ్యాసుడు ఇలా అన్నారు: మహాభారతంలో లభించే సమాచారమే బయట కూడా లభిస్తుంది. మహాభారతంలో లభించని ఏ సమాచారమైనా మరెక్కడా ఎప్పటికీ బయట లభించదు " అని.


మహర్షి విశ్వాసం అలాంటిది.


విదురనీతి ఓ అద్భుత సంకలనం. యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఉత్తమం. మేధావులు నేటికీ ఆ గ్రంథాల ద్వారానే మార్గనిర్దేశం పొందుతున్నారు.


శాంతి పర్వంలో భరద్వాజ, భృగు మహర్షుల మధ్య చెట్ల గురించి జరిగిన చర్చ అత్యుత్తమమైనది. దానిలో చెట్లకు ప్రాణం, స్పర్శ జ్ఞానం, ప్రతిస్పందించే సామర్థ్యం, ​​చూసే శక్తి, వినే సామర్థ్యం ఉన్నాయని ప్రస్తావించబడింది—ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానం.


వేల సంవత్సరాల తర్వాత, ఇంత కాలం గడిచాక, కేవలం ఇప్పుడే—విదేశీ శాస్త్రవేత్తలు క్రమంగా ఈ వాస్తవాలను కనుగొనడం ప్రారంభించారు.


అయినప్పటికీ, మన భారతీయ వృక్షశాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్ర బోస్ ఈ భావనలను వివరించిన తర్వాతే, విదేశీ పరిశీలకులు మరియు శాస్త్రవేత్తలు చివరకు సత్యాన్ని గ్రహించారు.


చాలా మంది బోస్‌పై తన " రేడియో " ఆవిష్కరణకు పేటెంట్ పొందమని ఒత్తిడి చేశారు, కానీ ఆయన, “నాకు పరిశోధనపై మాత్రమే ఆసక్తి ఉంది, డబ్బు సంపాదించడంపై కాదు” అని అన్నారు. మార్కోనీ బోస్ ఈ ఆవిష్కరణను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో బోస్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు, మరియు ఆయన చేసిన సేవలు విస్మరించబడ్డాయి . మార్కోనీ 1909లో రేడియో రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.


ఈ విషయం " మన విజ్ఞానం ఎటువంటిదో, దేనికోసమో " కుహనా మేధావులకు తెలియచేయడం కోసమే.


అలాంటి పరిస్థితుల్లో, ఇతిహాసాలలోని సమాచారం అసాంప్రదాయ పద్ధతులకు ఎలా మద్దతునిస్తాయి.

ఇతిహాసాలు కేవలం ధర్మబద్ధమైన మరియు సాంప్రదాయ పద్ధతులను మాత్రమే అందిస్తాయి.


శుభమస్తు

*దైవం తో సంబంధం ఎలా??...*

 *దైవం తో సంబంధం ఎలా??...*

భగవంతునితో సఖ్యత పెంచుకోవాలి, జపం, పూజ, ధ్యానం, వ్రతాలు మాత్రమే భక్తి కాదు!!... 

అవికూడా చేయవలసినవే! ఇవి రోజూ చేయడంవలన మనకు దైవంతో అనుబంధం, ప్రేమ పెరగుతుంది, ఆయనను ప్రేమించడం మనవిధి.


రూపనామములతో మనిషిగా దైవాన్ని గుర్తించి, ప్రేమించి పూజించడం, అంటే అది పూర్వ జన్మ సంస్కారమే. 

అందరికీ భగవంతుని తో బంధం కలగదు, ఆయన అనుగ్రహం ఉన్నవారికే అది సాధ్యం అవుతుంది...


సఖ్యత భగవంతుని తో కుదరాలంటే, ఎప్పుడూ ఆయన మన దృష్టిలో, భావనలో ఉండాలి, ప్రేమ పూర్వకంగా అతనితో ముచ్చట సలపాలి.

దేవుని చూడగానే చెంపలను కొట్టుకోవడం, నమస్కారం చేయడం మాత్రమే కాదు, నమస్కారము అంటే -

ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు...

ఈ పది ఇంద్రియాలతోనే మనం ప్రవర్తిస్తున్నాము. 

"ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, " ఇవి నీవే స్వామీ, వీటిని సక్రమంగా వినియోగించు కోగలగాలి," అని ప్రార్థించాలి.

దేహములు మాత్రమే దూరముకానీ, బింబ ప్రతి బిఁబములవలె, అవినాభావ సంబంధం దైవంతో ఏర్పడుతుంది.  

   

           *_శుభమస్తు_*

🙏శ్రీ సద్గురు పీఠం నుండి...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సామాజిక స్పృహ

 *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 8*


సభ్యులకు నమస్కారములు 


*ఓం సంగచ్చత్వం, సంవదత్వం సంవో మనాంసి జానతామ్, దేవభాగం యధా పూర్వే, సంజనానా ఉపాసతే* (ఋగ్వేద మంత్రం) అర్థం:- మనమందరం కలిసి ఉమ్మడి లక్ష్యం వైపు అడుగులేద్దాం. మన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటూ సామరస్యంగా మాట్లాడుకుందాము. మన మనసులు, ఆలోచనలు ఏకతాటిపై ఉండాలి. పూర్వ కాలంలో దేవతలందరు తమ బాధ్యతలను కల్సి పంచుకుని సామరస్యంగా ఏలా జీవించారో మనం కూడా ఆలా జీవిద్దాం. 


పై మంత్రం మరియు ఆచరణ సంఘ బలానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తున్నది. ఐకమత్యమే సంఘ శక్తికి నిదర్శనం. ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, మానసిక ధైర్యానికి, అన్యాయాల నిలువరింతకు, దుర్మార్గాల కట్టడికి మరియు సామూహిక శ్రేయస్సుకు సామాజిక శక్తి ప్రధానం.


*ముందు అనాగరిక చర్యలు ఎలాంటివో చూద్దాము* వల్లించడానికి ఎన్నెన్నో ఆదర్శాలు, ఆచరణ ఏది. సాధారణ జన జీవితంలో మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉండే ఘటనలు కొన్ని పరిశీలిద్దాము. *కాలని పేరు ఆదర్శ కాలని, లోపభూయిష్టాలకు లోటులేదు*. ఈ కాలని భారత దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న కాలని కాదు. భాగ్యనగరం నడి బొడ్డున కాలని.

1) గృహాలకు Cellar భాగము ఉండదు. వాహన నిలుపుదల సౌకర్యం అమర్చుకోరు. రహదారి *వీధులను Car Garages* గా మార్చేస్తారు. *రాకపోకలు సాగించే వారికి ఇబ్బంది*.

 2) గృహముల ముందు మెట్లు, Ramps ప్రక్కకు అరుగులు, వృక్ష సంపద పేరుపై ఇంటి ప్రక్కనే కంచెలు. ప్రభుత్వ రహదారులను కబళిస్తారు. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*. 3) నీరు వృధాచేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంటి ముందున్న ప్రభుత్వ Cement రహదారి స్థలాన్ని శుభ్రత పేరుతో కుళాయి పైపు తో అందునా పెద్ద ధారతో నీటిని వృధా చేస్తారు. *Mop తో శుభ్రం చేయవచ్చును గాని చేయరు గాక చేయరు*. వాహనాలు వెళ్లినప్పుడు పాదచారులపై మరియు పరిసరాలపై ఆ మురికి నీళ్లు చిమ్ముతాయి. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*.

4) ధరలు తక్కువగా ఉన్నప్పుడు కాలనీలలో Plots కొంటారు. ఏండ్లు గడిచినా వాటిని శుభ్రంగా ఉంచుదామన్న స్పృహ ఉండదు. వాటికి సరిహద్దు (Boundary walls) గోడలు కట్టరు. ఇందుకు అదనంగా కాలనీవాసులు అందులో చెత్తా చెదారం, విరిగిన వస్తువులు, సోఫాలు వేసి ఆ స్థలాన్ని చెత్త దిబ్బలుగా మారుస్తారు. ఆ స్థలాన్ని అపరిశుభ్రతా నిలయంగా రూపుదిద్దుతారు. ఇన్ని అవకతవకలను కాలని ASSOCIATION పట్టించుకోదు. *అక్కడ ఉండే తోటివారికి ఇబ్బంది*. 


ఈలాంటి వాతావరణం మీ ప్రాంతంలో లేదా. అవుతే *ఈ విభాగంలో* మీరు నాగరికులే. ధన్యవాదములు


*చిన్నవిగానే కనబడినా పై కార్యకలాపాలన్నీ నాగరికము కానే కావు*


ధన్య*సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 7*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా* అనేది వేద వచనం. *అర్థం*:- ధర్మమే సమస్త విశ్వానికి మరియు జగత్తుకు మూలాధారం. 

అన్నిటికంటే.... సుఖ సంతోషాలను, శాంతి భద్రతలను అందించగల్గేది *ధర్మమే* అనునది భీష్మ పితామహుడి వచనం. ఇతర ప్రాణులకు నిర్దేశింపబడనిది, మానవులకు మాత్రమే నిర్దేశించబడినది *ధర్మం*. ఆచరించగల్గిన సమర్థత కల్గిన *ప్రాణి కూడా మనుష్యుడొక్కడే.* ధర్మాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి. ఇది మానవులు ఉపేక్షించరాని సత్యము మరియు బాధ్యత. *అభివృద్ధి అయినా, నాగరికత ఐనా ప్రతి ఒక్కరు తమ తమ ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి*. ధర్మాన్ని ఆచరిస్తూ మనుష్యులుగా జీవిద్దామా లేక ధర్మాన్ని తప్పి *చతుష్పాదులుగా దిగజారాలా*...ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సి విషయం. 


మానవ ధర్మం అనగా మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు నైతిక విలువలు, విధులు పాటిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవి సకల మానవాళికి కల్గి ఉండే సార్వత్రిక ధర్మాలు. 


మనిషి మనిషిలా బ్రతకాలంటే ధర్మాన్ని అనుసరించడం, అనుష్టించడంతో బాటు ధర్మ ప్రచారం గూడా అవసరమే. *ఎవరి ధర్మం వారు పాటించాలి*. ధర్మము, ధర్మాత్ములు రక్షింపబడాలి ఇది ప్రభువుల ప్రధాన ధర్మం. ఈ కాలంలో ప్రభువులు అంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు. 


ప్రభుత్వము, ప్రభుత్వాలు, చట్టము మరియు నిబంధనలు అటుంచి మానవ ధర్మాలను అవలోకిద్దాము. 1) జననీ జనకులు తమ సంతానాన్ని తీర్చిదిద్దాలి 2) పురజనుడిగా ఎదిగిన పిమ్మట వ్యక్తిగత బాధ్యతలతో బాటు సామాజిక బాధ్యతలు పంచుకోవాలి. 3) పీఠాధిపతులు, ధర్మప్రభోధకులు, ప్రవచనకారులు దేశ కాల పరిస్థితులను గమనిస్తూ ప్రజలను జాగృత పర్చాలి. 

4) ధర్మానికి, సంస్కృతికి రక్షణగా ఉండాలి అంటే... *ధర్మ హింసా తదైవచ* అని కూడా ప్రజల దృష్టికి తేవాలి చట్టాల అనుసరణ యుక్తంగా చట్టాల రక్షణకు పాటుపడాలి. 5) చట్ట వ్యతిరేక చర్యలకు ఉద్వాసన పలకాలి. 6) చట్ట ఉల్లంఘనదారులను ఉపేక్షించ రాదు. అవినీతి పరులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని, హింసావాదులను, దౌర్జన్యకారులను బాధ్యతగా చట్టానికి అప్పగించాలి. 7) సమాజ ద్రోహ విషయాలలో *నాకెందుకు* అను ఉదాసీనత వీడాలి. 8) నేను మరియు నా కుటుంబం బావుంటే చాలు. సమాజం ఏమైతే నాకెందుకు అను *హీన దృక్పథం* వీడాలి.


ధన్యవాదములు

*(సశేషం)*వాదములు

గురువులు

 *గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?* 


*శ్రీ గురుభ్యో నమః.*🙏


*1) సూచక గురువు : బాల్యం నుండి మనకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు బ్రతుకుతెరువు కోసం బోధన చేసే గురువులు ఎందరో . మన జీవితంలో మనం ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువులంటారు . వీరి ద్వారా భుక్తిమార్గం తెలుసుకుంటాం.*


*2 ). వాచక గురువు : వీరు ధర్మాధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రమాలు, వాటి ధర్మాల గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థాశ్రమం , వానప్రస్దం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహన వస్తుంది .*


*3 ). బోధక గురువు* : *వీరు మహా మంత్రాలను ఉపదేశిస్తారు . లౌకికంగా కోర్కెలు తీర్చేవాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని ఉపదేశిస్తారు. వీరిని బోధక గురువులంటారు . మనం లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేయగలుగుతాము.*


*4 ) నిషిద్ద గురువులు* : *మారణ ప్రయోగాలు , వశీకరణాలు , వినాశనాలు - ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువులంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళకపోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )*


*5 ) విహిత గురువు* : *మన హితము కోరి సూచనలు సలహాలిస్తారు , నశించిపోయే విషయభోగాలపై ఆసక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేయడం నేర్పుతారు. ( ఏది సత్యం, ఏదసత్యం అనే విచక్షణ తో జివించగలుగుతాము )*


*6) *కారణ గురువు* : *వీరు మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు . ఎన్ని సుఖాలు అనుభవించినా, అంతిమ లక్ష్యం ముక్తి, ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోవడం నేర్చుకుంటాము)*


*7.) పరమ గురువు :* *వీరు సాక్షాత్ భగవత్ స్వరూపం. పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .*

*శిష్యునికి సన్మార్గం బోధించి ‘’ ఈ చరాచరజగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మాస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని మనకు ఆవాహన చేసి మనం అనుభూతి చెందగలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . మన నిజజీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్ భగవంతుడు మనతో జత నడిచినట్లే . వీరు లభిస్తే మన జన్మ ధన్యమైనట్లే.*


సేకరణ....🙏🙏🙏

పరమాచార్యుల వైరాగ్యం

  💐💐💐💐💐💐

*పరమాచార్యుల వైరాగ్యం — ప్రశంస కూడా బంధనంగా మారకూడదు*

💐💐💐💐💐💐


కాంచీ పరమాచార్యుల జీవితంలో భక్తుల మధ్య చెప్పబడే ఒక చిన్న సంఘటనలో చాలా గొప్ప ఉపదేశం దాగి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన ముద్రిత గ్రంథ-స్థానం నాకు ఇప్పుడు లభించలేదు. కాబట్టి దీనిని “పరమాచార్యుల గురించి ప్రచారంలో ఉన్న స్మృతి/సంఘటన”గా మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ సంఘటనలోని తాత్పర్యం — రుచిపై ఆసక్తి లేకపోవడం, సన్యాసి తన చిన్న అభిరుచితో కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని జాగ్రత్తపడడం, శ్రేష్ఠుల ప్రవర్తనను జనులు అనుసరిస్తారు అనే విషయం — శాస్త్రోక్తంగా బలంగా నిలుస్తుంది. కాంచీ మఠం వెబ్‌సైటులోని *Acharya’s Call* లో కూడా సన్యాసి భిక్షపై ఆధారపడి జీవించాలి, ఆహారం చిత్తశుద్ధికి సహాయపడాలి అనే బోధన కనిపిస్తుంది.


ఒకసారి మఠంలో పరమాచార్యులకు భిక్షలో ఒక కూర వడ్డించారు. ఆ రోజు ఆ కూర చాలా సాదాసీదాగా, శుచిగా, రుచిగా వండబడింది. పరమాచార్యులు దానిని చూసి, *“ఇది బాగా ఉంది”* అని ఒక మాట అన్నారు. అది భోగాభిలాషతో చెప్పిన మాట కాదు; వంట చేసినవారికి ఒక చిన్న ప్రోత్సాహం, ఆహారం శుచిగా తయారైనందుకు ఒక సంతృప్తి మాత్రమే.


కాని మహానుభావుల మాటను భక్తులు ఎంత గౌరవంగా తీసుకుంటారో తెలిసిందే. *“పరమాచార్యులకు ఈ కూర ఇష్టం”* అని వార్త వ్యాపించింది. ఆ మాట విన్న భక్తులు ఎవరెవరో తమ తమ శక్తి కొద్దీ ఆ కూరకు కావలసిన కూరగాయలను మఠానికి తెచ్చి సమర్పించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు కొంచెం తెచ్చినా, భక్తుల సంఖ్య ఎక్కువ. కొద్ది రోజుల్లోనే ఆ కూరగాయలు మఠంలో గుట్టలుగా పేరుకుపోయాయి.


ఆ తరువాత మఠ వంటశాలలో రోజూ అదే కూర వండబడసాగింది. పరమాచార్యులు గమనించారు. ఒక రోజు మృదువుగా వంటవారిని అడిగారు — *“ఎందుకు ప్రతిరోజూ ఇదే కూర చేస్తున్నారు? మఠంలో ఇతరులకు కూడా ఇది ఇబ్బంది కాదా?”* అప్పుడు వంటవారు వినయంగా చెప్పారు — *“స్వామీ! ఒక రోజు మీరు ఆ కూర బాగుందని అన్నారట. అప్పటి నుండి భక్తులు అదే కూరగాయను చాలా ఎక్కువగా తెచ్చి సమర్పిస్తున్నారు. అవి వృథా కాకూడదని మేము రోజూ ఇదే వండుతున్నాము.”*


ఆ మాట విన్న పరమాచార్యులు వెంటనే విషయం గ్రహించారు. *“నా ఒక చిన్న మాట భక్తులకు సంకేతమైపోయింది. నా రుచి కోసం వారు ఇంత సమర్పణ చేయడం మొదలుపెట్టారు. ఇది సన్యాసికి తగినది కాదు; నా అభిరుచి వల్ల మఠనిర్వహణకు భారమూ, భక్తులకు అనవసర వ్యయమూ కలగకూడదు”* అని భావించారు. ఆ రోజు నుండి ఆ కూరను తాను తీసుకోవడం మానేశారని చెబుతారు.


ఇది కేవలం ఒక ఆహార నియమం కాదు; ఇది సన్యాసధర్మంలోని *అసంగత్వం*. మహానుభావులు తమ ఇష్టాలను కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఎందుకంటే వారి చిన్న మాట కూడా అనేకమందికి ఆజ్ఞలా మారుతుంది. అందుకే భగవద్గీతలో భగవాన్ ఇలా చెప్పారు — శ్రేష్ఠుడు ఏమి చేస్తాడో, ప్రజలు దానినే అనుసరిస్తారు.


*यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।*

*स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥*


*యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।*

*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥*

— భగవద్గీత 3.21


అందువల్ల పరమాచార్యుల జాగ్రత్త ఏమిటంటే — *“నా అభిరుచి ఒక నియమంగా మారకూడదు; నా ప్రశంస భక్తులపై భారంగా మారకూడదు.”* ఇదే నిజమైన గురు-హృదయం. గురువు తన కోసం భక్తుల నుండి పొందడంలో ఆనందించడు; భక్తులకు భారము తగ్గించడంలో ఆనందిస్తాడు.


ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రం ఇదే ధర్మాన్ని మరింత లోతుగా చెబుతుంది. జగత్తంతా ఈశ్వరసంబంధమైనది; కావున త్యాగబుద్ధితో అనుభవించాలి, ఇతరుల ధనంపై ఆశ పెట్టకూడదు.


*ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।*

*तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥*


*ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ ।*

*తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్యస్విద్ధనమ్ ॥*

— ఈశావాస్యోపనిషత్ 1


*“తేన త్యక్తేన భుఞ్జీథాః”* — త్యాగంతోనే అనుభవించాలి. పరమాచార్యుల ఆచరణలో ఇదే కనిపిస్తుంది. భోజనం కూడా అనుభవించేవస్తువు కాదు; శరీరధారణకు కావలసినంత మాత్రమే. భాగవతం కూడా ఇదే సూత్రాన్ని స్పష్టంగా చెబుతుంది — కామం ఇంద్రియసుఖం కోసం కాదు; జీవనధారణకు మాత్రమే.


*कामस्य नेन्द्रियप्रीतिर्लाभो जीवेत यावता ।*

*जीवस्य तत्त्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः ॥*


*కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా ।*

*జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః ॥*

— శ్రీమద్భాగవతం 1.2.10


ఆహార విషయములో తైత్తిరీయోపనిషత్తు ఒక వైపు *“అన్నాన్ని నిందించకూడదు”* అని చెబుతుంది; ఇంకొక వైపు అన్నాన్ని ధర్మబుద్ధితో చూడమని నేర్పుతుంది. అంటే ఆహారం పవిత్రమైనది; కానీ రుచి-ఆసక్తి బంధనంగా మారకూడదు.


*अन्नं न निन्द्यात् । तद्व्रतम् ।*

*प्राणो वा अन्नम् । शरीरमन्नादम् ।*

*प्राणे शरीरं प्रतिष्ठितम् । शरीरे प्राणः प्रतिष्ठितः ।*


*అన్నం న నింద్యాత్ । తద్వ్రతమ్ ।*

*ప్రాణో వా అన్నమ్ । శరీరమన్నాదమ్ ।*

*ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్ । శరీరే ప్రాణః ప్రతిష్ఠితః ।*

— తైత్తిరీయోపనిషత్, భృగువల్లి 3.7


అదే ఉపనిషత్తు మరోచోట అన్నదాన ప్రాముఖ్యాన్ని చెబుతుంది.


*अन्नं बहु कुर्वीत । तद्व्रतम् ।


*అన్నం బహు కుర్వీత । తద్వ్రతమ్ ।*

— తైత్తిరీయోపనిషత్, భృగువల్లి 3.9


ఇక్కడ ఒక ముఖ్యమైన సమన్వయం ఉంది. అన్నాన్ని ఎక్కువగా సమకూర్చి, ఇతరులకు పంచడం ధర్మం. కానీ ఒక మహాత్ముని రుచి పేరుతో ఒకే వస్తువును గుట్టలుగా తెచ్చి, మఠవ్యవస్థకు భారంగా చేయడం ధర్మసూక్ష్మానికి విరుద్ధం. దానం కూడా వివేకంతో ఉండాలి; గురుభక్తి కూడా గురువుకి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి.


భగవద్గీతలో సాత్త్విక ఆహారం గురించి భగవాన్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ స్మరణీయం. ఆయుష్షును, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని పెంచేది, హృదయానికి అనుకూలమైనది సాత్త్విక ఆహారం.


*आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।*

*रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥*


*ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।*

*రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ॥*

— భగవద్గీత 17.8


కాని అదే ఆహారం *“నాకు ఇది కావాలి, ఇదే కావాలి”* అనే రాగానికి కారణమైతే, అది సాధకునికి అడ్డంకి అవుతుంది. అందుకే గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాన్ని ఇలా చెప్పారు.


*विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः ।*

*निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥*


*విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।*

*నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ॥*


— భగవద్గీత 2.71


పరమాచార్యుల ఆచరణలో *“నిర్మమత్వం”* స్పష్టంగా కనిపిస్తుంది. “నాకు ఇష్టమైన కూర” అనే భావమే రాకుండా, వచ్చినా అది భక్తులపై ప్రభావం చూపుతుందని తెలిసిన వెంటనే దానిని విడిచిపెట్టడం — ఇదే నిజమైన వైరాగ్యం.


ఈ కథ నుండి మనకు మూడు పాఠాలు తెలుస్తాయి. మొదటిది — మహానుభావుల మాటను భక్తి పేరుతో అతిశయింపకూడదు. రెండవది — దానం అవసరాన్ని బట్టి ఉండాలి, భావోద్వేగాన్ని బట్టి మాత్రమే కాదు. మూడవది — సన్యాసి తన రుచినీ, తన సౌకర్యాన్నీ, తన ఇష్టాన్నీ కూడా లోకహితార్థం విడిచిపెట్టగలవాడు.


కాంచీ మహాస్వామి గురించి కాంచీ మఠం వెబ్‌సైటులోని *Souvenir* విభాగం భక్తుల అనుభవాల సమాహారంగా పేర్కొనబడింది; ఆయన బోధనలు వేల పేజీలుగా ప్రచురించబడ్డాయని కూడా కాంచీ మఠం పేర్కొంటుంది. ఈ సంఘటనలో కనిపించే ఆత్మ మాత్రం ఆయన జీవితం మొత్తం తెలిపిన అదే సందేశం — *సాధుత్వం అంటే త్యాగం; గురుత్వం అంటే ఇతరులపై భారము కాకుండా ఉండే జాగ్రత్త; భోజనం కూడా భోగం కాదు, భగవదర్పణమైన శరీరధారణ మాత్రమే.*

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

కేరళం చిన్న ముక్కే

 *సేకరణ: శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారి వాల్ నుండి*

---------------------------


కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...


పీఠం సరిగ్గా ఉండాలి...లేకుంటే దేశ భద్రతకే ప్రమాదం...


అయ్యో...గాంధీ గారు మాకు ముస్లిములు వచ్చి హిందువులను చంపినా..ఎదురు తిరక్కుండా చచ్చిపొమ్మనే చెప్పారు...


ఆ మాటే పాటిస్తున్నాం...మనసిలాయో అంటున్నారు కొత్త సతీషన్...


నెహ్రూ కూడా ఖాన్ గ్రేస్ ఎప్పటికీ ముస్లిములను ఇరిటేట్ చేసే ఏ పని చెయ్యదు అని ...వందేమాతరం లో దుర్గా అనడం వాళ్ళని బాధ పెడుతుందని...దాన్ని తట్టుకోవడం ఆ సమాజానికి సాధ్యం కాక ఏదైనా చేస్తే..గాంధీ గారు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందని...కొత్త సతీషన్ వాకృచ్చారు... 


ఇంక పాత విజయన్ అయితే...అసలు వందేమాతరం ఆరెస్సెస్ అజెండా...మేమెందుకు పాడుతాం...అంటున్నాడు...


అలా కొత్త పాత తేడాలేకుండా ఖాన్ గ్రేస్ కమ్యూనిస్లుంలు ఒకే మాట మీదకి వచ్చి...అసెంబ్లీలో పూర్తి వందేమాతరాన్ని పాడలేదు...గవర్నర్ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు...


అయ్యా..ఇది వందేమాతరం 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఆ గీతాన్ని పూర్తిగా పాడాలి...దేశ సమైక్యతా గీతం ఇది అని కేంద్ర హోం శాఖ 1971 లో చేసిన జాతీయ చిహ్నాల గౌరవ చట్టం ఆధారంగా సర్క్యులర్ పంపింది...


దాన్ని బేఖాతరు చేశాయి అధికార ప్రతిపక్షాలు...


అదే కేరళంలో గతంలో ఒక పాఠశాల జనగణమన పాడము అంటూ ఏకంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంది...


వందేమాతరం పాడరు...జనగణమన పాడరు...


ఇంక కేంద్ర సంస్థల ఆదేశాలు అసలు లెక్కే చెయ్యరు...


కేంద్ర ప్రభుత్వ విచారణ అధికారుల మీద మాజీ సిఎం విజయన్ అనుచరుల దాడి...


అంటే కోర్టులు చట్టాలు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అన్న సవాల్...


ఈ ఉదంతాలు ఏం తెలియజేస్తున్నాయి...


హిందువులు మైనారిటీ అయిన చోట అంటే అరవై శాతం ఉన్నాగానీ..అక్కడ రాజ్యాంగం అమలు కాదు...


అస్సలు ఆ భూభాగాలు భారత్ లోనే ఉన్నాయా అనేంతగా మారిపోతాయి...


ఆ మధ్యన కమ్యూనిస్టు జమానాలో ఆరెస్సెస్ వాళ్ళ అంతు చూద్దాం అని పీఎఫ్ఐ..ఎస్ డీ పీ ఐ బహిరంగంగా కత్తులు పట్టుకుని ఊరేగింపులు చేసారు...


అంటే నిజానికి పశ్చిమ బెంగాల్ కంటే కేరళం మరింత ప్రమాదకర పరిస్థితిలో ఉందని అర్థం...


కేరళం సముద్ర రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం...


మత్స్యకారుల సంఘాలు ...షిప్పింగ్ సంస్థలు...పూర్తిగా క్రైసన్స్...రెడ్ ఇండియన్స్...ఖాన్ గ్రేస్ చేతుల్లో ఉన్నాయి...


రేపు రేపు యుద్ధ సందర్భాల్లో నావెల్ బేస్ లకు తరలించే అత్యవసర వస్తువులను సహాయాలను ఈ గ్యాంగులు అడ్డుకోవని నమ్మకం ఏంటి...


కేవలం బంగారమే ఈ కమ్యూనిస్టులు స్మగ్లింగ్ చేస్తున్నారా...ఆయుధాలు కూడా చేస్తున్నారా అన్నది ఎలా తెలుస్తుంది...


కేంద్ర సంస్థలను అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటి...


వందేమాతరం పాడకపోవడానికి...వీటికి కచ్చితంగా లింక్ ఉంది...


అసెంబ్లీ వేదికగా దేశ వ్యతిరేకత..కేంద్రాన్ని ధిక్కరిస్తాం అనే సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు ..రోడ్లమీదకు అల్లరి మూకలను రప్పించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు...


ఏదో ఆషామాషీగా ఈ ధిక్కారాన్ని తీసుకోవడం సరికాదు...


బెంగాల్ ను కలిపిన వందేమాతరం...కేరళం ను కాపాడడానికి కూడా ఉపయోగించాలి...


అనుమానం ఉన్నచోట ప్రతి సారీ దేశభక్తిని పరీక్షించాల్సిందే...


కేరళం లో మిగిలిఉన్న పది శాతం మంది దేశభక్తులను కాపాడుకోలేకపోతే పీఠం కదిలిపోతుంది...


కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...

అది దేశ అస్థిత్వానికే ముప్పు తీసుకుని వస్తుంది...


జైహింద్!

సరదాలు

 (సరదాగా నవ్వుకోగలిగిన వారుమాత్రమే చదవండి మరి)


పెళ్ళిళ్ళ........సరదాలు.......సంబరాలు


అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి ఒక తల్లి 

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. 

అంతే! 

వాడి అల్లరి అటకెక్కిపోతుంది. 

చేతులు కట్టుకుని మరీ నిలబడతాడు. 

అదీ "పెళ్లి "

అనే మాటకున్న "శక్తి!"


 పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. 

‘కాదు... కాదు 

నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు 

ఆడవాళ్లు. 

అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం. 


‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. 

నిజమే దంపతులు ఒకరికొకరు 

మానసికంగా 

తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు.

‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.


‘అప్పగింతలవేళ అమ్మాయికది 

ఆఖరి ఏడుపు. 

అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. 

తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. 

ఏడ్చినా నవ్వినా 

కన్నీళ్లే అయినప్పుడు 

దాని గురించి ఆలోచన ఎందుకు? 

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. 

అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. 

అసలు సమస్య అదే! 


‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ 

అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. 

సాక్షాత్తూ బ్రహ్మకే నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది. ‘


మా ఆయనకు హృదయం లేదు’ 

అని మరొకావిడపతిదేవుణ్ని

తూలనాడుతుంటుంది. అది అన్యాయం! 

విష్ణుమూర్తికే 

సొంతానికి హృదయం లేదు. దానిని లక్ష్మీదేవి 

ఎప్పుడో ఆక్రమించేసింది. 


‘మా ఆయన 

ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ 

అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది. ఏం చేస్తాం? 

శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే! 

ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ. 

ఇన్ని నిజాలు తెలిసీ 

భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు. 

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే. 

‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు. 

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి. 

చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు. 


హెల్మెట్టూ భార్యా ఒకే రకం. 

నెత్తిన పెట్టుకుంటే తలకాయకు 

బోలెడంత భద్రత అని ఒకాయన

స్వానుభవంతో ఉపదేశించాడు.


పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? 

అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 


అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, 

వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును 

శిష్యుడొకరు 

‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు 

ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు. 

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా. 

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు? 

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు. 

అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. దాంతో సోక్రటీసు

 ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు. 

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు. 

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.


దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. 

మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు? 

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు. 

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? 

ఎన్నెన్ని ఘోరాలు? ఎన్నెన్ని నేరాలు?

 శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే. 

ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.

సంతోషం దాంపత్యానికి సగం బలం- 

కాదు కాదు సంపూర్ణ బలం. 

ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే. 


పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ 


ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ 

జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.


భార్యా భర్తల మధ్య ఎకసెక్కాలుండాలి మరి

‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని, కడిగినప్పుడు 

నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు 

తన భార్యను అడిగాడు. ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. 

దాంతో మొగుడు కంగుతిన్నాడు


మూడు ముళ్లయినా, 

ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. 

పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే! దానికి సాటీ లేదు! పోటీ లేదు! ఏమంటారు మరి...!!😄😄

కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు*

  *కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు* మరియు *కొప్పరపు వేంకట రామణయ్య గారు* - ఇద్దరూ తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా *అవధాన విద్యలో దిగ్గజాలు.


*1. కొప్పరపు సోదర కవులు అంటే ఎవరు?*


ఈ ఇద్దరూ *అన్నదమ్ములు*. *"కొప్పరపు కవులు"* అని, *"కొప్పరపు సోదర కవులు"* అని పిలుస్తారు. 20వ శతాబ్దంలో అవధాన విద్యని బతికించిన వాళ్లలో వీళ్ళు ముఖ్యులు.

పేరు వివరాలు

**కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు** 1885–1941 అన్నయ్య. **శతావధాని**. సంస్కృతాంధ్ర పండితుడు. 1911లో బెజవాడలో మొదటి శతావధానం చేశారు.

**కొప్పరపు వేంకట రామణయ్య గారు** 1887–1942 తమ్ముడు. **అష్టావధాని**. అన్నయ్యకు తోడుగా అవధానాలు చేసేవారు. ఇద్దరూ కలిసి చేస్తే దాన్ని "సహావధానం" అనేవారు.

*2. వీళ్ళ గొప్పతనం ఏంటి?*


1. *తిరుపతి వేంకట కవుల తర్వాత* అవధాన పరంపరను నిలబెట్టింది వీళ్ళే.

2. *సుబ్బయ్య గారు* దాదాపు *40కి పైగా శతావధానాలు* చేశారు. ఆ రోజుల్లో అది రికార్డు.

3. *ఆశువుగా పద్యం చెప్పడం*లో వీళ్ళకి వీళ్ళే సాటి. పృచ్ఛకులు ఏ సమస్య ఇచ్చినా, నిషిద్ధాక్షరి పెట్టినా, వెంటనే చంపకమాల, ఉత్పలమాల పద్యాలు చెప్పేసేవారు.

4. *గరికపాటి నరసింహారావు గారు, మేడసాని మోహన్ గారు* లాంటి ఇప్పటి అవధానులకు వీళ్ళే స్ఫూర్తి.


*3. ఫేమస్ సంఘటన*


ఒకసారి బెజవాడలో శతావధానం చేస్తుంటే, ఒక పృచ్ఛకుడు *"కాకి పిల్ల కాకికి ముద్దు"* అనే సమస్య ఇచ్చాడు. దాన్ని సుబ్బయ్య గారు ఇలా పూరించారు:


> శ్రీకరమైన కావ్య రసశేవధి గ్రోలుచు నున్న కూర్మి నా

> లోకము నందు గల్గు కవి లోకము మెచ్చగ నేర్తునే గదా

> *కాకి పిల్ల కాకికి ముద్దు* గాదె జగంబున నెప్పుడున్ మహా

> లోకము మెచ్చుకొన్న కవి లోకుల కెల్లను గాదె ముద్దగున్**


అంటే - కాకికి తన పిల్ల ముద్దు అయినట్టే, లోకం మెచ్చిన కవి అందరికీ ముద్దే అని అర్థం. ఒక్క నిమిషంలో చెప్పారు.


*4. స్వస్థలం*


వీళ్ళది *గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర కొప్పరపు* అనే గ్రామం. అందుకే "కొప్పరపు కవులు" అయ్యారు.


*

సామాజిక స్పృహ

  *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 9*




*భద్రం మనః కృణుష్వ* అని అంటుంది సామవేదం. అంటే మా మనస్సులను కళ్యాణమయం చేయుము అని.


వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, కాలనీలు బాగు చేసుకోవడం మాత్రమే నాగరికత కాదు.


మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వపరిపాలన వచ్చి 77 సంవత్సరాలు అయినది. విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక మరియు రక్షణ రంగాలలో అభివృద్ధి పరంగా ఎంతో ఎదిగాము. *కాని, నైతికంగా ఎదగవలసినంతగా మనము ఎదగలేదు, అంటే నాగరికత పెరగలేదు*. ప్రలోభాల ప్రభావాలను అధిగమించే తత్వాన్ని అలవరచుకొలేక పోతున్నాము....ఇంకా చెప్పుకుంటాము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని. అవుతే *స్వార్థ పరంగా, దోషులను సమర్థించడంలో మరియు నేరస్తులను ఉపేక్షించడంలో నియమిత ఎల్లలు, హద్దులు దాటి ఎదిగాము*. ఇది కూడా నాగరికత కాదు. *ఇంకా చెప్పాలంటే శృతి మించిన అనాగరిత*. 


రాజకీయ నాయకులు, ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులు, పార్టీలు గాని అవకతవకలకు పాల్పడినప్పుడు వారి ప్రథమ మరియు ప్రథాన ఆయుధము *మతము, కులము, లింగ బేధం, ఉత్తరాది, దక్షిణాది వాదనలు*. ఈ వాదనలు, కుంటి సాకులు *ఇంకెన్నేళ్లు*. గత త్రింశతి (30) సంవత్సరాలుగా దేశ చరిత్రను పరిశీలించిన వారికి, దోష భూయిష్టులైన ఏ ఏ నాయకులు, ఇతర రంగాలలోని ప్రముఖులు దేశ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకున్నారో మనందరికీ అన్ని కరతలామలకములే....

అభిజ్జానములే


సావకాశంగా సంఘటనలు పరిశీలిస్తే ఒక నాయకుడంటాడు నేను మైనారిటీ మతం వాడిని నన్ను బలి పశువును చేస్తున్నారు అని. ఇంకొక ప్రముఖుడంటాడు నేను వెనుకబడిన తరగతుల వాడిని కాబట్టి నాపై కక్ష్య కట్టారు అని. ఇంకొక ప్రముఖురాలంటుంది నేను మహిళను కాబట్టి నేరం ఆపాదిస్తున్నారు అని. రాజకీయ నాయకుల దుర్మార్గాలు, దుష్చేష్టలు, దురలవాట్లు బైటపడ్డప్పుడు, ఆ పార్టీ వాళ్ళు వందలకొద్దీ ధర్నాలు, సమ్మెలు. రక్షకభట శాఖ *నిందితులను* న్యాయస్థానాల వైపు తరలిస్తున్నప్పుడు, ఏ మాత్రం *న్యూనత, లజ్జ* లేకుండా త్వరలో జనంలోకి వస్తామని చేతులూపుతూ *సన్మాన గ్రహీతలు లాగా* చిరు నవ్వులతో నిర్బంధశాలలకు వెళ్తుంటారు. ప్రతి రాజకీయ పార్టీకి అండ దండగా వారి సమాచార (పత్రిక, Tv) మాధ్యమాలు ఉంటాయి. అందులో పని గట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు ప్రత్యర్థులను నిందించడం మామూలైపోయింది. పార్టీల బేధం ఉన్నప్పుడు దక్షిణాది వారు ఉత్తరాది వారిని, ఉత్తరాది వారు దక్షిణాది వారిని విమర్శించడం సర్వ సాధారణమైనది. తమ తప్పులను సమర్థించుకోవడానికి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని లింగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ రాజకీయ వ్యక్తిగత లాభాలను పొందడానికి నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. *ఇదీ నాగరికత కాదు.*


 *మనమందరము భారతీయులము అను జాతీయ భావం నాస్తి*. జాతీయత లోపించింది. ఈ పరిస్థితులలో పూర్ణ నాగరికతా చైతన్యము సిద్ధించాలంటే ఎంత శ్రమ అవసరమో భగవంతుడికే తెలియాలి అని చతికిల పడరాదు. *కృషితో నాస్తి దుర్భిక్షం* అని చదువుకున్నాము. 

*ఆత్మ విమర్శ* చేసుకోవాలి ఇకనైనా. ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి *నీతివంతమైన జీవితం గడపడానికి*,

భగవదనుగ్రహం పొందడానికి, 

 *మన మనస్సులు కళ్యాణ మయం కావడానికి.*


ధన్యవాదములు.

సంగచ్చధ్వం సంవదధ్వం

 ఈ వ్యాసంలో ఋగ్వేదంలోని  *సంగచ్చధ్వం సంవదధ్వం...* 


మంత్రాన్ని ఆధారంగా తీసుకొని, సమాజంలో 

ఐకమత్యం, 

పరస్పర 

బాధ్యత, 

సామూహిక  సామాజిక శ్రేయస్సు వంటి విలువలను చక్కగా ప్రతిపాదించారు. 


వేదమంత్రం చెప్పే సంఘబలం కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాక, 

నిత్యజీవితంలో ఆచరణకు దారితీసే మార్గదర్శకమని వివరించారు.


వ్యాసంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే సాధారణ ప్రజలు రోజువారీ జీవితంలో చేసే చిన్నచిన్న నిర్లక్ష్యాలనే నాగరికతకు పరీక్షగా చూపించడం. 

రహదారుల ఆక్రమణ, 

వాహనాల అస్తవ్యస్త పార్కింగ్, నీటి వృథా,

 ఖాళీ స్థలాల అపరిశుభ్రత వంటి అంశాలు వ్యక్తిగత చర్యలుగా కనిపించినా, అవి సామాజిక బాధ్యతా రాహిత్యానికి సూచికలని  స్పష్టంగా తెలియజేశారు...


వేదం చెప్పిన 

సమాన సంకల్పం – 

సమాన బాధ్యత” అనే సూత్రాన్ని ఆధునిక కాలనీల జీవన విధానంతో అనుసంధానించడం ఈ రచనకు ప్రత్యేకతను తెచ్చింది. నాగరికత అనేది భవనాల ఎత్తులో, సంపదలో లేదా సాంకేతిక అభివృద్ధిలో లేదని; ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవించడంలోనే ఉందనే సందేశం స్పష్టంగా తెలుస్తుందజా


ప్రత్యేకంగా, 

నాకు ఇబ్బంది లేకపోతే సరిపోతుంది” 


అనే స్వార్థ దృష్టికోణాన్ని విడిచి, నా చర్య వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతోందా?” అనే ప్రశ్నను ప్రతి వ్యక్తి తనను తాను వేసుకోవాలని ఈ వ్యాసం ప్రేరేపిస్తుంది.


సామాజిక స్పృహ, 

పౌర బాధ్యత, వేదస్ఫూర్తి మరియు ఆధునిక నాగరికత మధ్య ఉన్న సంబంధాన్ని సరళంగా, స్పష్టంగా వివరించిన చైతన్యవంతమైన వ్యాసం. చిన్న తప్పిదాలే పెద్ద సామాజిక సమస్యలకు కారణమవుతాయని గుర్తుచేస్తూ, నిజమైన నాగరికత అనేది పరస్పర గౌరవం మరియు బాధ్యతతో కూడిన జీవన విధానమని తెలియజేస్తుంది.


సంఘే శక్తిః కలౌ యుగే”అనే సూక్తికి ఆచరణాత్మక రూపమే ఈ వ్యాసం అని చెప్పవచ్చు....


శ్రీధ ర్శర్మ తోటపల్లి

శ్రీ సద్గురు పీఠం.....✍️

వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం"....కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం​...


"వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం, విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది" అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2,500 ఏళ్ల నాటిదైనా, నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది.​


ఇది లీ వీ అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు...


“మహాశయా, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా... వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము?" అని అడిగాడు.​


లీ వీ చెడ్డ తండ్రి కాదు. నిజానికి, ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికీ లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడినప్పుడు, ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీ వీ భావించాడు. తన ఇంటిని అమ్మివేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం,మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు.​ కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు కుటుంబంలోని అందరితో నిండిఉన్నా సరే , ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీ వీ మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ... వారు మరింత దూరమవుతూ వచ్చారు.​సమాధానం అన్వేషణ​ కోసం


లీ వీ కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు...


“గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ అవసరంలేని వ్యక్తిలా మారిపోయాను... ఎందుకు?”​కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా మూడు చిన్న పాఠాలు నేర్పాడు.​


అందులో మొదటి పాఠం...


ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. “ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి పొంగిపొర్లుతాయి,” అని లీ వీ జవాబిచ్చాడు.“సరిగ్గా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలని చూస్తే, అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది.అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు".


ఇక ​రెండవ పాఠం...


ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న రెండు చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.


“చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి,” అని లీ వీ అన్నాడు.“అవి బలంగా పెరుగుతాయా?...లేదు...అవి బలహీనంగా, ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం. కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం".


మూడవ పాఠంగా...


కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలిని గట్టిగా బిగించారు.“నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది?”


“అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది,” అని లీ వీ చెప్పాడు.“మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే,” అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. “ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే... అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది."


"నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు, వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా?” అని కన్ఫ్యూషియస్ అడిగారు.“లేదు గురువుగారు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు.”


“మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు.ఈ ప్రపంచం కోసం పెంచావు.”​


మొదటిసారి లీ వీకి అసలు విషయం అర్థమైంది.​


తరువాత కన్ఫ్యూషియస్


లీ వీ కు కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు.“నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు. ఇంకా నేర్పించవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు...అది కొత్త ఆరంభాల సమయం.


పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురుచూడకు. నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు.”​ అని బోధించాడు.


లీ వీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు...కానీ కొడుకు ఇంటికి కాదు. ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను ‘మాస్టర్ లీ’ అని పిలవడం మొదలుపెట్టారు.​ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ, ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ, అందరూ ఆయనను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు.​


ప్రేమ తిరిగి వచ్చిన వేళ​ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. “నాన్నా, నువ్వు వెళ్లి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాము. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా.


మాతో ఉండటానికి కాదు, మాతో గడపడానికి రా.


”​లీ వీ వెళ్ళినప్పుడు, ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా, ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు.​


అప్పుడే ఆయనకు అర్థమైంది...ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో... అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చిందని .​


ఈ కథ ఇచ్చే సందేశం​“వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు” అని కాదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది...బాధ్యత లేదా బలవంతం నుండి కాదు.​


మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే, వారిని ఊపిరి ఆడకుండా చేస్తాము. మనల్ని మనం వారిపై రుద్దితే, మనం వారికి అదృశ్యమైపోతాము.


ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.​


కన్ఫ్యూషియస్ చెప్పినట్లు...


ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము. వాటిని కేవలం పోషించగలం.


నిజం కదా మేము పెంచాము పెద్దవాళ్ళను చేసాము. మేము పెద్దవాళ్ళము అయ్యాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి. ఇది ఇచ్చి పుచ్చుకోవాటమ్ లాంటి ది.

ఆలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యి, తరువాత ఆశించకు వాళ్ళనుంచి.

ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్దాయన చెప్పినట్లు ఎదో ఒక పని చెయ్యి. ఎదో ఒక సహాయం చేస్తున్నావ్ ఉండు. బిడ్డలు వారంతట వారే మారతారు.


లాస్ట్ గా పిల్లలకు చెయ్యటం నే బాధ్యత.

గీతలో చెప్పినట్లు ఖర్మ ను చెయ్యి. ఫలితం ఎదురు చూడకు వాళ్ళు తిరిగి నీలాగా చెయ్యాలని ఆశించకు.


    🌿సుల్తానా. తిరుపతి 🌿

లిపిడ్ ప్రొఫైల్

  ⸻


లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?


ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఎంతో అందంగా వివరించారు. దాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక చక్కని కథను పంచుకున్నారు.


మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.


ఈ పట్టణంలో అతి పెద్ద అల్లరి చేసే వ్యక్తి — కొలెస్ట్రాల్.


అతనికి కొన్ని సహచరులు కూడా ఉన్నారు. అతని ప్రధాన సహచరుడు — ట్రైగ్లిసరైడ్.


వీళ్ల పని ఏమిటంటే… వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించడం, రోడ్లను బ్లాక్ చేయడం.


ఈ పట్టణానికి కేంద్ర భాగం — గుండె (Heart).

అన్ని రోడ్లు గుండె వైపే వెళ్తాయి.


ఈ అల్లరి మూకలు పెరిగితే ఏమవుతుందో ఊహించవచ్చు.

వీరు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.


కానీ మన శరీర పట్టణంలో ఒక పోలీస్ బలగం ఉంది — HDL (మంచి కొలెస్ట్రాల్).


ఈ మంచి పోలీస్ అల్లరి చేసే వారిని పట్టుకుని జైలులో ( కాలేయం – Liver ) వేస్తాడు.


ఆ తర్వాత కాలేయం వారిని శరీరం నుంచి బయటకు పంపుతుంది — మన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా.


కానీ ఒక చెడు పోలీస్ కూడా ఉన్నాడు — LDL (చెడుకొలెస్ట్రాల్).


ఈ LDL ఏమి చేస్తాడంటే…

జైలులో ఉన్న నేరస్తులను బయటకు తీసి మళ్లీ వీధుల్లో వదిలేస్తాడు.


మంచి పోలీస్ అయిన HDL తగ్గిపోతే,

మొత్తం పట్టణం గందరగోళంగా మారుతుంది.


అలాంటి పట్టణంలో ఎవరు జీవించాలని కోరుకుంటారు?


👉 ఈ నేరస్తుల సంఖ్య తగ్గించి, మంచి పోలీసుల సంఖ్య పెంచాలనుకుంటున్నారా?


👉 నడక ప్రారంభించండి (Walking)!


మీరు వేసే ప్రతి అడుగుతో —

 • HDL పెరుగుతుంది

 • కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు, LDL తగ్గుతాయి


మీ శరీరం (పట్టణం) మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది.


మీ గుండె — పట్టణ కేంద్రం —

ఈ నేరస్తుల వల్ల వచ్చే హార్ట్ బ్లాక్ నుంచి రక్షణ పొందుతుంది.


గుండె ఆరోగ్యంగా ఉంటే,

మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.


కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా — నడక మొదలుపెట్టండి!


🌿 ఆరోగ్యంగా ఉండండి…

🌿 మంచి ఆరోగ్యం మీకు కలగాలని ఆకాంక్షిస్తున్నాం



ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచి, LDL (చెడుకొలెస్ట్రాల్) తగ్గించే ఉత్తమ మార్గం — నడక అని చెబుతుంది.


👉 ప్రతి అడుగు HDL‌ను పెంచుతుంది.

👉 కాబట్టి ముందుకు సాగండి… కదులుతూనే ఉండండి.


హ్యాపీ సీనియర్ సిటిజన్స్ వీక్ 🎉



🔻 ఇవి తగ్గించండి:

 1. ఉప్పు

 2. చక్కెర

 3. మైదా (వైట్ రిఫైన్డ్ ఫ్లోర్)

 4. పాలు మరియు పాల ఉత్పత్తులు

 5. ప్రాసెస్డ్ ఆహారాలు



🔺 ఇవి ప్రతిరోజూ తినండి:

 1. కూరగాయలు

 2. పప్పులు

 3. బీన్స్

 4. గింజలు (నట్స్)

 5. చల్లగా పిండిన నూనెలు (Cold Pressed Oils)

 6. పండ్లు



🧠 మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:

 1. మీ వయస్సు

 2. మీ గతం

 3. మీ లోపాలు



❤️ స్వీకరించాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:

 1. కుటుంబం

 2. స్నేహితులు

 3. సానుకూల ఆలోచనలు

 4. శుభ్రంగా, ఆహ్వానించేలా ఉండే ఇల్లు



🙂 అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:

 1. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి

 2. మీ సామర్థ్యానికి తగినంత శారీరక వ్యాయామం చేయండి

 3. బరువును పరిశీలించి నియంత్రించండి



🌱 స్వీకరించాల్సిన ఆరు ముఖ్యమైన జీవన అలవాట్లు:

 1. దాహం వేసే వరకు నీరు తాగకుండా ఉండకండి

 2. అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోకుండా ఉండకండి

 3. అనారోగ్యం వచ్చే వరకు వైద్య పరీక్షలను వాయిదా వేయకండి

 4. అద్భుతాల కోసం ఎదురు చూడకండి — దేవునిపై నమ్మకం ఉంచండి

 5. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు

 6. సానుకూలంగా ఉండండి — మంచి రేపటి మీద ఆశ ఉంచండి



👆 మీకు 45–80 సంవత్సరాల వయస్సులో ఉన్న స్నేహితులు ఉంటే, తప్పకుండా ఈ సందేశాన్ని వారికి పంపండి.

ఇది వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది 🙏

వందేమాతరం

 *వందేమాతరం*


*సుఖం కాదు ధర్మమే జీవితాన్ని నిలబెడుతుంది — సీతారాములు నేటి యువతకు ఎందుకు ఆదర్శం?*


సీతారాముల జీవితాన్ని పైపైన చూస్తే నిజంగా ఒక ప్రశ్న మనసులో కలుగుతుంది. ఇంతటి ధర్మమూర్తులు, దేవతావతారాలు అయిన వారికే సుఖం లేకపోతే వారు మనకు ఆదర్శం ఎలా అవుతారు? 


ఈ ప్రశ్న చాలా సహజం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఆదర్శ జీవితం అంటే ఏమిటి అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నేటి ప్రపంచం దృష్టిలో ఆదర్శ జీవితం అంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, సమస్యలు లేకపోవడం, సంపద, పేరు, విజయాలు ఉండటం అనే భావిస్తోంది.


దానికి మన సనాతన ధర్మం చెబుతున్న నిర్వచనం ఏమిటంటే, సుఖంలో పొంగి పోకూడదు, దుఃఖంలో కృంగి పోకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా ధర్మాన్ని విడవకుండా ఉండటమే ఆదర్శ జీవితం. అందుకే రామాయణం ఒక సుఖాంత కావ్యం కాదు, అది ధర్మాంత కావ్యం. 


రాముడి అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రాక్షస సంహారం మాత్రమే కాదు. అది ఒక భాగం మాత్రమే. అసలు లక్ష్యం మానవజీవితానికి ఒక సంపూర్ణ నిర్వచనం ఇవ్వడం. మానవ జీవితంలోని ప్రతి సంబంధంలో, ప్రతి బాధ్యతలో, ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చూపించిన పరిపూర్ణ మనిషి అవతారమే శ్రీరాముడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. 


శ్రీరాముడు తన దైవశక్తిని ఉపయోగించి ఒక్క క్షణంలో సమస్యలు తొలగించగలడు. అయినా ఎందుకు అలా చేయలేదు? ఎందుకంటే ఆయన దేవుడిగా గెలవడానికి రాలేదు. మనిషిగా ఎలా జీవించాలో నేర్పించడానికి వచ్చాడు. అందుకే అమ్మవారితో కలిసి వచ్చాడు. 


నేటి కాలంలో, ముఖ్యంగా యువతలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి శరీరిక వ్యాధి కాదు, బలహీనమైన మనస్సు.


చాలామంది యువత బయటికి సాధారణంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు. “నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?”, “దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు?”, “నేను మంచివాడినే కదా మరి నాకు ఎందుకు బాధలు?”, “అసలు దేవుడికే సుఖం లేదు వారి నుంచి మేమేం ఆశించగలం?”,‌ ఇలాంటి ఆలోచనలు వారి మనసును క్రమంగా బలహీనపరుస్తున్నాయి. 


ఇది కేవలం భావోద్వేగ సమస్య కాదు.ఇది జీవితాన్ని చూసే దృష్టిలో తేడా. ఎందుకంటే నేటి ప్రపంచం నుంచి యువత ఒక తప్పుడు సందేశాన్ని తీసుకొంటోంది. “జీవితం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.” “బాధపడితే విఫలమైనట్టే.” “ జీవితంలో సమస్యలు ఉన్నవాడు దురదృష్టవంతుడు”, అంటూ ప్రతీ చిన్న అపజయానికి చాలామంది కూలిపోతున్నారు.


కానీ సనాతన భారతీయ ఋషులు జీవితం గురించి చెప్పిన సత్యాన్ని ఇక్కడ విస్మరిస్తున్నాం. వారు చెప్పింది, “జీవితం అనేది సుఖదుఃఖాల సమ్మేళనం.”


అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. “మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।”


చలి, వేడి ఎలా వస్తూ పోతాయో, అలాగే సుఖదుఃఖాలు కూడా వస్తూ పోతుంటాయి. ఇది అర్థం చేసుకోకపోవడం వల్లే మనిషి బాధలో మునిగిపోతాడు.


నిజానికి మనిషిని బాధపెట్టేది సమస్య కాదు, “ఇలా జరగకూడదు” అనే మన అంతర్గత ఘర్షణ. ఇక్కడే రామాయణం మనకు గొప్ప కౌన్సిలర్‌లా మారుతుంది.


శ్రీరాముడు ఎవరు?, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమే కదా?, అయితే మరి ఆయన జీవితంలో ఏమి జరిగింది? పట్టాభిషేకం జరగబోయే రోజే రాజ్యం పోయింది. అరణ్యవాసం వచ్చింది. తండ్రి మరణించాడు. భార్య దూరమైంది. స్నేహితులను కోల్పోయాడు. ప్రజల మాటల కోసం తన వియోగాన్ని భరించి సీతాదేవిని దూరం చేసుకోవలసి వచ్చింది.


ఇక్కడ ఒక అపరిపక్వ మనసు ఎలా ఆలోచిస్తుఃదంటే, దేవుడికే సుఖం లేదు, ఆయన జీవితం అన్యాయాల నిలయం. ఆయన దానిని ఎదుర్కోలేకపోయాడు అని.


కానీ పరిపక్వమైన దృష్టి ఉన్న మనసు ఎలా ఆలోచిస్తుందో తెలుసా?, దేవుడే కష్టాలను ఎదుర్కొని చూపించాడు అంటే, కష్టం జీవితం యొక్క వైఫల్యం కాదు అని చెప్పడానికి.


ఇక్కడే చాలా గొప్ప తేడా. రాముడు కష్టాలను తొలగించడానికి మాత్రమే రాలేదు. కష్టాల మధ్యలో ఎలా నిలబడాలో చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. ఆయన మనకు నేర్పింది, బాధ రాకపోవడం గొప్ప కాదు, బాధ వచ్చినా ధర్మం కోల్పోకపోవడం అనే గొప్పతనం.


ఇనాటి యువతలో ఉన్న ఒక ప్రధాన మానసిక బలహీనత ఏమిటంటే, చాలామంది నేను మంచివాడిని కాబట్టి నాకు చెడు జరగకూడదు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ మన మంచితనానికి తక్షణమే ప్రతిఫలం ఇవ్వదు. రాముడు మంచివాడు. హరిశ్చంద్రుడు సత్యవంతుడు, పాండవులు ధర్మవంతులు, ప్రహ్లాదుడు పరమ భక్తుడు. అయినా వారు కష్టాలు అనుభవించారు.


అంటే ధర్మం పాటిస్తే కష్టాలు రావని కాదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనిషి మానసికంగా కృంగి పోకుండా ఉండే అంతర్గత శక్తి వస్తుంది. ఇదే దైవానుగ్రహం.‌


మన సమస్య ఏమిటంటే, దేవుడిని మన కోరికలు నెరవేర్చే యంత్రంలా చూస్తున్నాం. కోరిక నెరవేరితే దేవుడు ఉన్నాడు అంటున్నాం. జరగకపోతే దేవుడు ఉన్నాడా, ఉంటే నాకేం చేశాడు? అంటున్నాం. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. భక్తి అంటే ఒప్పందం కాదు. భక్తి అంటే అంతర్గత బలం.


ఒక్కసారి ఆలోచించండి, రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని వదల్లేదు. సీతాదేవి అశోకవాటికలో ఉన్నప్పుడు కూడా ఆశ కోల్పోలేదు. ఇదే భక్తి యొక్క అసలైన అర్థం.


దేవుడిని నమ్ముకుంటే మన జీవితంలో అన్ని సమస్యలు తొలగిస్తాడు అని కాదు. కొన్ని సార్లు సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. నేటి యువత చాలా ప్రమాదకరమైన పోలికలలో పడిపోయింది. బయటకు కనిపించే ఇతరుల జీవితాలను చూసి, వారందరికీ సుఖమే ఉంది. నా జీవితమే అంతా బాధల మయం అని ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకోవడం, తనను తాను తక్కువగా ఆలోచించుకోవడం. కానీ ఇది ఒక మాయ. ప్రతి మనిషి లోపల ఒక మానసిక యుద్ధం జరుగుతూ ఉంటుంది. బయట కనిపించేది మాత్రమే సత్యం కాదు అన్న సత్యాన్ని గ్రహించాలి.


రామాయణం నుంచి మన నేర్చుకోవాల్సింది, జీవితం అనేది పోటీ కాదు, ఒక అంతర్గత సాధన. రాముడు నుంచి నేర్చుకోవాల్సింది ఆతని గొప్ప మానసిక సాధన.‌ రాముడు ఎప్పుడూ నాకు ఎందుకు మాత్రమే ఇన్ని కష్టాలు? అనుకోలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని శిక్షగా చూడలేదు, ధర్మయాత్రగా చూశాడు.


ఎవరైనా, ఎందుకు నాకే?” అని బాధపడితే కృంగిపోతారు. అదే ఈ స్థితి నాకు ఏమి నేర్పిస్తోంది అని చూస్తే ఎదుగుతారు. ఇదే బాధను బలంగా మార్చే రహస్యం. ఇదే మనం రాముడిని నుంచి నేర్చుకోవాల్సింది. 


సీతాదేవి జీవితాన్ని కూడా చూడండి. ఆమెకు జీవితంలో జరిగినది చాలా అన్యాయం అని మనకి కూడా అనిపిస్తుంది. కానీ ఆ తల్లిలో ఏనాడు ద్వేషం కనిపించలేదు. ఆమే ఎవరి జీవితాన్ని శపించలేదు, తీవ్రమైన మానసిక పరిస్థితులలో కూడా తన నిగ్రహాన్ని కోల్పోలేదు. ఇదే గొప్ప మానసిక పరిపక్వత.‌


నేడు ప్రపంచంలో చిన్న అవమానానికే యువత ఇతరులపై ద్వేషం పెంచుకుంటున్నారు. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కానీ సీతాదేవి మనకు నేర్పినది ఏమిటి?. బాధ మన హృదయాన్ని కఠినంగా మార్చకూడదు.


రామాయణం నుంచి నేటి యువత మరొక గొప్ప సత్యం తెలుసుకోవాలి. జీవితం ఎప్పుడూ న్యాయంగా ఉండకపోవచ్చు. అది వాస్తవం. కొన్ని సార్లు చెడ్డవాళ్లు సుఖపడుతున్నట్టు కనిపిస్తారు. మంచివాళ్లు బాధపడుతున్నట్టు కనిపిస్తారు. కానీ భారతీయ తత్వం అర్థం చేసుకుంటే, ఆ క్షణం మనకు కనిపించేదే‌ సత్యం కాదు, అదే సంపూర్ణం కాదు. 


రామాయణాన్ని ఒక మామూలు కథలా చూస్తే బాధగా ఉంటుంది. కానీ యుగాల దృష్టితో చూస్తే, 

రావణుడు శక్తివంతుడు అయినా నశించాడు. రాముడు బాధపడ్డా యుగయుగాలకు ఆదర్శమయ్యాడు. అంటే తాత్కాలిక సుఖం విజయానికి ప్రమాణం కాదు. అంతర్గత విలువలే నిజమైన విజయం.


ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి యువతలో చాలామంది మానసికంగా ఎందుకు బలహీనపడుతున్నారు?. ఎందుకంటే, నేటి యాంత్రిక జీవనంలో వారికి బాధను ఎలా ఎదుర్కోవాలి అని ఎవరూ నేర్పించలేదు. నేటి విద్య డబ్బు సంపాదించడం నేర్పింది. కానీ అపజయాన్ని తట్టుకొని నిలబడడం నేర్పించలేదు. నేటి ప్రపంచం విజయాన్ని చూపించింది. కానీ విఫలమైనప్పుడు ఎలా నిలబడాలో నేర్పలేదు.


ఇక్కడే రామాయణాన్ని మనం ఒక మహా గురువుగా చూడాలి. ఏడవచ్చు, బాధపడవచ్చు, నిరాశ రావచ్చు, కానీ మన గమ్యం అక్కడే ఆగిపోకూడదు. 


సీతను కోల్పోయినప్పుడు రాముడు కుమిలిపోయాడు, కానీ అక్కడే ఆగిపోలేదు. వెంటనే తేరుకుని లక్ష్యసాధనతో ముందుకు నడిచాడు. హనుమంతుడిని పంపించాడు. సేనను సమీకరించాడు. సేతువు నిర్మించాడు. లంకను చేరాడు. రావణ సంహారం చేశాడు.


ఇదే నేటి యువతకు అత్యంత అవసరమైన సందేశం. విజయుడు అంటే ఎప్పుడూ ఓడిపోని వాడు అని కాదు. పడిపోయినా మళ్ళీ నిలదొక్కుకుని ముందడుగు వేసేవాడు అని తెలుసుకోవాలి.


మరొక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, జీవితంలో నేడు చీకటి ఉందంటే, దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడని కాదు. కొన్ని సార్లు విత్తనం చీకటి నేలలోనే మొలకెత్తుతుంది. బంగారం అగ్నిలోనే మెరుస్తుంది. వజ్రం ఒత్తిడిలోనే తయారవుతుంది.


చివరిగా, రామాయణం మనకు నేర్పే మహాసత్యం, జీవితంలో సమస్యలు రావడం శాపం కాదు.

సమస్యల వలన మన ఆత్మవిశ్వాసం కోల్పోవడమే అసలైన శాపం.


అందుకే నేటి యువత తెలుసుకోవలసింది, మనం బాధలో ఉన్నాము అంటే మనం బలహీనులమని కాదు. అలాగే, మనం కష్టాలను ఎదుర్కొంటున్నామంటే దేవుడు మనల్ని వదిలేశాడని కాదు.


సీతారాములు కూడా బాధను అనుభవించారు, కానీ వారు ఏనాడు కృంగిపోలేదు. అందుకే వారు దేవతలయ్యారు. కాబట్టి జీవితాన్ని శాపంగా చూడకూడదు. ఇది ఒక సాధన. ఒక అంతర్గత యాత్ర. ఒక ఆత్మ వికాసం. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కుమిలి పోకుండా, ఇది నన్ను మరింత అర్ధాంతమైన, బలమైన, పరిపక్వమైన వ్యక్తిగా తయారుచేసే ప్రక్రియ అది భావించి ముందుకు సాగాలి.


జీవిత సంఘర్షణాయాత్రలో ధైర్యంగా ముందుకు సాగే ఆత్మజ్ఞానాన్ని మనకి అందించారు సీతారాములు. అందుకే వారు రేపటి భవిష్యత్తును నిర్ణయించే నేటి యువతకు. ఆదర్శం.


మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

9849795167

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ ।

నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ।। 31 ।।


ప్రతిపదార్థ:



యజ్ఞ-శిష్టా అమృత-భుజః — వారు యజ్ఞఅవశేష అమృత తుల్య ఆహారమును భుజింతురు; యాంతి — వెళ్తారు; బ్రహ్మ — పరమ సత్యము; సనాతనమ్ — సనాతనమైన; న — కాదు; అయం — ఇది; లోకః — లోకము; అస్తి — ఉండును; అయజ్ఞస్య — యజ్ఞము చేయని వానికి; కుతః — ఎట్లా; అన్యః — వేరే (లోకము); కురు-సత్-తమ — కురు వంశజులలో ఉత్తమమైన వాడా.



 తాత్పర్యము : 



యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు, ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు.



వివరణ:


ఇంతకు క్రితం పేర్కొన్నట్టు, భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగిఉండటమే, యజ్ఞము యొక్క రహస్యం; పిదప యజ్ఞ శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఉదాహరణకి, భగవత్ భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే దాన్ని స్వీకరిస్తారు. ఆహారాన్ని వండిన తరువాత దానిని ఆయన ముందు ఉంచి భగవంతుడిని దానిని స్వీకరించమని ప్రార్థిస్తారు. వారి మనస్సులో భగవంతుడు స్వయంగా వచ్చి ఆ ఆహారాన్ని భుజించినట్టుగా భావిస్తారు. ఈ నివేదన అనంతరం పళ్ళెంలో ఉన్న శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇటువంటి అమృతతుల్యమైన ప్రసాదము మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత, మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి.


ఇదే భావనలో భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటారు. వారు ఆయన విగ్రహాన్ని తమ ఇంటిలో పెట్టుకుని, ఆ ఇల్లు దేవాలయం అన్న భావనలో ఆ ఇంట్లో నివసిస్తారు. ఎప్పుడైతే వస్తువులు లేదా పనులు భగవంతునికి యజ్ఞంగా సమర్పించినప్పుడు, ఆ శేషం, అంటే ప్రసాదం, ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహము వంటిది. మహా భక్తుడైన ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి ఇలా చెప్పాడు:


త్వయోపభుక్త-స్రగ్-గంధ-వాసోఽలంకార-చర్చితాః

ఉచ్చిష్ఠ-భోజినో దాసాస్ తవ మాయం జయేమ హి


(భాగవతం 11.6.46)


 


‘మీకు మొదట నివేదించబడిన వస్తువులనే నేను భుజిస్తాను, ఆఘ్రాణిస్తాను, ధరిస్తాను, వాటి యందే నివసిస్తాను, వాటి గురించే మాట్లాడుతాను. ఈ విధంగా, నివేదింపబడిన శేషాన్ని మీ ప్రసాదంగా స్వేకరించటం వలన నేను మాయని సునాయాసంగా జయిస్తాను.’ యజ్ఞాన్ని ఆచరించని వారు కర్మ-ఫల బంధాలలో చిక్కుకొనే ఉండి మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు.

రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

30-05-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  

--------------------------------------- 


వృషభం


ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. 

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


సింహం


కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కన్య


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు.

---------------------------------------


తుల


వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంటాబయట కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.  

---------------------------------------


వృశ్చికం


ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన ఋణయత్నాలు చేస్తారు. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


మకరం


స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


మీనం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.

---------------------------------------

🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🙏🍁🍁🍁🍁

     *శుక్రవారం 29 మే 2026*


   *🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం - 25వ రోజు🍁*


మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **23వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో హనుమంతుని శరణు వేడితే కలిగే అభయం మరియు సర్వ సుఖాల గురించి తెలుసుకున్నాం. 


ఈరోజు, హనుమంతుని తేజస్సు ఎంతటిదో, ఆయన ఒక్కసారి గర్జిస్తే ముల్లోకాలు ఎలా కంపించిపోతాయో వివరించే అద్భుతమైన చౌపాయి గురించి తెలుసుకోబోతున్నాం.


           **23వ చౌపాయి**


**ఆపన తేజ సంహారో ఆపై |**

**తీనోం లోక హాంక తే కాంపై ||**


               **ప్రతిపదార్థం**


* **ఆపన తేజ** 

* నీ యొక్క శక్తిని/తేజస్సును

* **సంహారో ఆపై** 

నీవు మాత్రమే నియంత్రించగలవు (నీవే ఆపగలవు).

* **తీనోం లోక** 

* మూడు లోకాలు (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు)

* **హాంక తే** 

    * నీ యొక్క గర్జన విని

* **కాంపై** 

* వణికిపోతాయి.


**విస్తృత ఆధ్యాత్మిక వివరణ*


**1. అనితర సాధ్యమైన తేజస్సు (ఆపన తేజ)**


సంయమన శక్తిని ఇక్కడ చెప్పారు తులసి దాసు గారు. సాధారణంగా మనకు కోపం వస్తే ఇంకొకరు శాంత పరచాలి, కానీ హనుమ కు కోపం వస్తే తనను తానే శాంత పరచుకోగలడు.


హనుమంతుని శక్తి అనంతమైనది. ఆయన సూర్యుడిని మించిన తేజస్సు కలవాడు. ఆ వేడిని, ఆ శక్తిని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు. చివరకు ఆ శక్తిని నియంత్రించడం లేదా ఉపసంహరించుకోవడం కూడా కేవలం హనుమంతుడికే సాధ్యం. అంటే, తన శక్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎంత వాడాలో తెలిసిన సంపూర్ణ 'జితేంద్రియుడు' హనుమంతుడు.


లంకిణిని కొట్టిన హనుమ మరుక్షణం లో మళ్ళీ సాత్విక మూర్తి లా లంకను వెతికాడు. సీతమ్మను ఓదార్చి తరువాత ఈ రూపం తో నన్ను తీసుకెళ్తావా అంటే అంత చిన్న వాడు క్షణంలో విశ్వరూపం చూపించాడు.మళ్లీ అంతలోనే పిల్లి పిల్లంత అయ్యాడు. 


అశోక వనం ధ్వంసం చేసినపుడు మహోగ్ర గర్జనలు చేశాడు,ఆ గర్జనకు రాక్షస స్త్రీల గర్భాలు కదిలి పోయాయి అంటారు అంత భీకర ఘర్జన చేశారు.అంటే దుష్టత్వం, రాక్షసత్వం పుట్టనీయడు స్వామి హనుమ. 


మళ్ళీ అంతటి వాడు ఇంద్రజిత్ అస్త్రానికి కట్టుబడి నట్టు, సైనికులకు లొంగ పోయాడు.మళ్ళీ లంకా దహనం లో మహోగ్ర రూపం, అంతలోనే మళ్ళీ సీతమ్మ దగ్గరికి అతి వినయంగా ఇలా ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు, పూర్తిగా ఇంద్రియాలు నిగ్రహించిన మహా విక్రముడు స్వామి.


ఇదే తత్వం శ్రీ కృష్ణ పరమాత్మ ది యుద్ధం లో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అని భీష్ముని మీదకు ఉరికాడు, నమస్కారం చేయగానే వదిలేశాడు. యోగులు లోకం కోసం తమ ప్రతాపం చూపిన నిగ్రహంగా ఉంటారు.ఆ నిగ్రహం చాలా ముఖ్యం.


**2. సింహగర్జన - ధర్మ రక్షణ (హాంక తే కాంపై)**


హనుమంతుడు లంకలో చేసిన గర్జన లేదా యుద్ధ సమయంలో చేసే రణనినాదం ముల్లోకాలను వణికించేస్తుంది. ఇక్కడ 'వణకడం' అంటే కేవలం భయం కాదు, అది అధర్మానికి కలిగే వణుకు. హనుమంతుని గర్జన వింటే దుష్ట శక్తులు, రాక్షస ప్రవృత్తులు భయంతో పారిపోతాయి. సాధకుడికి తనలోని చెడు ఆలోచనలను పారద్రోలడానికి ఈ హనుమత్ గర్జన ఒక దివ్యౌషధం.


నాదేనైవ సమస్త దానవ గణాన్ సంత్రాసయంతం ప్రభుం అని చెప్తుంది మంత్రశాస్త్రం స్వామి సింహనాదం చేస్తే మొత్తం ముల్లోకాలు అల్లల్లాడిపోతాయి. అలాంటి గర్జన! అంతే కాదు, ఆయన తన భుజం చరచగానే సముద్రం అల్లకల్లోలమైంది. అదీ స్వామి యొక్క ధ్వని.


హనుమానంగజ రణగాజే హాంక్ సునత్ రజనీచర భాజే - ఆంజనేయస్వామి యుద్ధభూమిలో తిరిగి గర్జన చెయ్యగానే రావణునికి కూడా వణుకు పుట్టింది. రాక్షసులు కొంతమంది పారిపోయారు. మళ్ళీ సంభాళించుకుని తేవడానికి రావణుడు చాలా కష్టపడ్డాడు. ఆ గర్జన భక్తులకు అభయధ్వని. అసురులకు అది భయధ్వని.


 **తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా హనుమంతుని **"సర్వశక్తిమత్వాన్ని"** చాటి చెప్పారు. మనం బలహీనంగా ఉన్నప్పుడు లేదా శత్రు భయం వేధించినప్పుడు, హనుమంతుని ఈ ఉగ్రరూపాన్ని, ఆయన శక్తిని స్మరిస్తే మనలో కొత్త ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి. తన శక్తిని అదుపులో ఉంచుకునే వాడు (Self-control) మాత్రమే ప్రపంచాన్ని జయించగలడని హనుమంతుని ద్వారా తులసీదాసు గారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

         🍁🌹🙏🌷🍁


రేపటి చౌపాయిలో హనుమంతుని పేరు చెబితే భూత ప్రేత పిశాచాలు 

ఎందుకు దరిచేరవో తెలుసుకుందాం. 


రేపటి వివరణ కోసం సిద్ధంగా ఉండండి!


         *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

సంపూర్ణ మహాభారతము* సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

      *శుక్రవారం 29 మే 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                         2️⃣4️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


 *సంపూర్ణ మహాభారతము*            

                    *240 వ రోజు*                    

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


           *రెండవ అశ్వాసం*```


ఇలా తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి “సంజయా! ఆపై యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించుము” అని ఉత్సాహంగా అడిగాడు. 


సంజయుడు ఇలా చెప్పసాగాడు.. “ఆరాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖిస్తూ తమ్ములతో సహా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి “కృష్ణా! చూసావు కదా భీష్ముడు కార్చిచ్చు వలె మన సేనలను కాల్చి వేసాడు. మనకు అతడిని చంపు మార్గం కనిపించుట లేదు లోక భీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసింది. భీష్ముని గెలవగలడని మనం అర్జునిని నమ్ముకున్నాము. ఈ రోజు అర్జునుడు తన పరాక్రమం ఏమీ చూప లేదు. భీముడు తన యావచ్ఛక్తి ఉపయోగించి యుద్ధం చేసాడు. నాకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అయినా ఎవరిని అనుకుని లాభం ఏమిటి ? మనకు సాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎర వేయడం కంటే యుద్ధం మానుకుని ఆకులు అలములు తినడం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక మేము క్షేమంగా ఉన్నాము. కనుక నీవు ఎలా చెపితే అలా చేస్తాము. మాకు కర్తవ్యం నీవే నిర్ణయించు” అని వేడుకున్నాడు. 


ధర్మనందనుని భయాన్ని పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు “ధర్మరాజా! ఏమిటి ఈ ఆవేదన ఎందుకు చెప్పు. నీకు ఎదురు నిలువ గల సమర్ధులు ఎవరు. నీ తమ్ములు మూడు లోకాలను గెలువ సమర్ధులు. భీష్ముని చంపడానికి శిఖండి ఉన్నాడు భయ మెందుకు. సాత్యకి పరాక్రమం, ఆశ్చర్యకరమైన అతని యుద్ధ రీతులు నీకు అవగతం కాలేదు. దృపదుడు, విరాటుడు నీకై తమ ప్రాణములు సహితం ఇవ్వ సిద్ధంగా ఉన్నారు. నీవు నిరుత్సాహ పడవద్దు. దృష్టద్యుమ్నుడు పరాక్రమానికి కౌరవ సేన నిలువజాలదు" అన్నాడు. 


ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి.. “నాడు కృష్ణుని ఆదేశం పై నిన్ను సర్వ సైన్యాలకు అధ్యక్షుని చేసాము. శ్రీ కృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్ర రాజులు నీకు సాయం ఉంటాము. నీ సర్వ శక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చు" అన్నాడు. 


ధృష్టద్యుమ్నుడు “ధర్మనందనా! నన్ను ద్రోణుడిని చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించిన విషయం జగమెరిగిన సత్యం. భీష్మునితో చేర్చి కురు సేనలను ఎలా మట్టు పెట్టగలనో చూడు” అన్నాడు. 


ఆ మాటలు విన్న పాడవులు, మిత్రరాజులు సంతసించారు. 


ధర్మరాజు దృష్టద్యుమ్నునితో “పూర్వం దేవదానవ యుద్ధమున దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకర మయిన క్రౌంచ వ్యూహమును రేపటి యుద్ధములో మనసైన్యం కొరకు నీవు పన్నుము" అన్నాడు. 


తేలిక పడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ములతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసములకు వెళ్ళారు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    🍁 *శనివారం*🍁

 *🌹30, మే, 2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : చతుర్దశి* ప 11.57 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : శనివారం* (స్థిరవాసరే)

*నక్షత్రం  : విశాఖ* మ 01.20 వరకు ఉపరి

*యోగం : శివ* రేపు (31) 05.25 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : వణజి* ప 11.57 *భద్ర* రా 01.05 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-*     

 అమృత కాలం  : *రా 04.33 - 06.21 తె*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : సా 05.49 - 07.36*

*దుర్ముహూర్తం :ఉ05.34- 07.18*

*రాహు కాలం  :ఉ08.50- 10.27*

గుళికకాళం     : *ఉ 05.34 - 07.12*

యమగండం    : *మ 01.43 - 03.21*

సూర్యరాశి : *వృషభం*                   

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.41* 

సూర్యాస్తమయం :*సా 06.46*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం      :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం :*10.47- 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి        : అధిక జ్యేష్ట పూర్ణిమ*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం      :*సా 06.36- 08.48*

రాత్రి కాలం        :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం       :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     *🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం* 

*ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


    *🍁హనుమకృత🍁*  

 *🍁సీతారామ స్తోత్రమ్🍁*


    *చందనార్ద్ర భుజా మధ్యం* 

    *కుంకుమార్ద్ర కుచస్థలీం !*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీ హనుమాన్ చాలీసా🍁*

  🍁🍁🍁🍁🙏🍁🍁🍁🍁

     *శనివారం 30 మే 2026*


   *🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం - 26వ రోజు🍁*


మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా భక్తులకు కొండంత ధైర్యాన్నిచ్చే **24వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో ముల్లోకాలను వణికించే హనుమంతుని అనంతమైన తేజస్సు గురించి తెలుసుకున్నాం. ఈరోజు, ఆయన నామస్మరణ చేసే చోట దుష్టశక్తులు ఎందుకు దరిచేరవో తెలుసుకోబోతున్నాం.


 **24వ చౌపాయి**


**భూత పిశాచ నికట నహిం ఆవై |**

**మహాబీర జబ నామ సునావై ||**


              **ప్రతిపదార్థం**


* **భూత పిశాచ**

* భూతములు, పిశాచములు (దుష్ట శక్తులు)

  * **నికట నహిం ఆవై**

* దగ్గరకు కూడా రావు.

* **మహాబీర*  

* మహావీరుడవైన ఓ హనుమా!

* **జబ నామ సునావై**

* ఎప్పుడైతే నీ నామము వినిపిస్తుందో.


స్వామి యొక్క పేరు వింటే చాలు భూత పిశాచాలు దగ్గరకి రావు.ఇవన్నీ ఫలశ్రుతిగా చెప్పినవి అనేక మందికి అనుభవం కూడా.ఆంజనేయస్వామి పేరు అన్నా, ఆయన చిత్రపటం ఉన్నా సరే దుష్టశక్తుల భయం ఉండదు. ఆంజనేయస్వామిని దృష్టిలో ఉంచుకుని మనం ధైర్యంగా పురోగమించాలి.


**విస్తృత ఆధ్యాత్మిక వివరణ*


**1. దుష్టశక్తి నివారణ (భూత పిశాచ)*


బ్రహ్మరాక్షస భేతాళ భూత ప్రేత పిశాచకాః 

ద్రృష్ట్యైవోచ్చాటయేత్ సద్యో నాత్ర కార్యా విచారణా


ఇది మంత్రశాస్త్రంలోని వాక్యం బ్రహ్మరాక్షస, భేతాళ, భూత ప్రేత పిశాచాలు ఆంజనేయస్వామి స్మరణ చేసే వారి దగ్గరకి రావు.


అంతే కాదు! శాస్త్రంలో ఒక అద్భుతమైన కథ చెప్తారు - రామచంద్రమూర్తి అయోధ్య నుండి తిరిగి తన అవతారాన్ని పరిసమాప్తి చేసే ముందు కొన్ని భూత ప్రేతాలు రాముని దగ్గరకి వచ్చి 'స్వామీ! మేము కూడా భూమి మీద ఉంటున్నాం. మా తిండి వాళ్ళనీ వీళ్ళనీ తినడమే. నువ్వు మాకు ఆ మార్గం లేకుండా చేసేశావు. నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతున్నావంటే నిన్ను ఎవరు స్మరిస్తారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. మొత్తానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ హనుమంతుని ఇక్కడే ఉండిపోమన్నావు, అదీ పెద్ద భయం!' అన్నారు.


రామచంద్రమూర్తి ఒక మాట అన్నాడు. “సర్లే! ఒక పని చేస్తాను, హనుమంతుని విగ్రహం ఏ గ్రామంలో ఉండదో, ఆ గ్రామంలో వారిని మీరు పీడించండ"ని చెప్పాడు. సరేనని హనుమంతుని విగ్రహంలేని చోటులో మనం ఉందాం అనుకున్నాయి,


పిశితం అశ్నాతి ఇతి పిశాచః ఒకొక్కరిని ఆవహించి వారికి తెలియకుండా వారి మాంసం తినేస్తుంది కనుక పిశాచం అని పేరు. భూత, ప్రేత, పిశాచ, రాక్షస ఇవన్నీ... రకరకాల జాతులు. అన్నీ ఒకేలా ఉండవు.


రాముడు చెప్పిన ఆజ్ఞ ఇది. కనుకనే హనుమంతుడు లేని చోటుకు మీరు వెళ్ళండని రాముడు వాళ్ళని కట్టడి చేశాడు. ఇప్పుడు మనకు పరిష్కారం దొరికింది, బాధలు లేకుండా ఉండాలంటే, ఊరి పొలిమేరలో హనుమ, ఊరిలో హనుమ, ప్రతి వీధిలో హనుమ, ప్రతి ఇంటిలో హనుమ ఉండాలి.


ఇక్కడ 'భూత పిశాచ' అంటే కేవలం అదృశ్య శక్తులు మాత్రమే కాదు. మనల్ని వేధించే **దుష్ట ఆలోచనలు, భయాలు, వ్యసనాలు, నెగటివ్ ఎనర్జీ** కూడా పిశాచ సమానమే. ఎక్కడైతే "హనుమాన్" అనే నామం వినిపిస్తుందో, అక్కడ ఈ ప్రతికూల శక్తులు నిలవలేవు. ఎందుకంటే హనుమంతుడు 'ప్రకాశ స్వరూపుడు', చీకటి శక్తులు వెలుగు ముందు ఉండలేవు.


**2. నామ స్మరణ యొక్క శక్తి (నామ సునావై)**


మనం చేసే ప్రార్థన శబ్ద రూపంలో బయటకు వచ్చినప్పుడు, అది మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. "మహావీర" హనుమాన్ అనే నామం ఒక శక్తివంతమైన మంత్రం. భయం వేసినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ నామాన్ని స్మరిస్తే, మనలోని ఆత్మబలం పెరిగి భయం మటుమాయం అవుతుంది.


**తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా సామాన్య మానవుడికి ఒక **"రక్షణ మంత్రాన్ని"** అందించారు. జీవితంలో మానసిక ఆందోళనలు, తెలియని భయాలు ఎదురైనప్పుడు హనుమంతుని నామాన్ని తలచుకుంటే చాలు, ఆ మహావీరుడు మనల్ని రక్షిస్తాడని ఆయన హామీ ఇచ్చారు. మనసులో ధైర్యం ఉంటే ఏ శక్తీ మనల్ని ఏమీ చేయలేదని, ఆ ధైర్యానికి మూలం హనుమంతుడని తులసీదాసు గారి సందేశం.


**జై శ్రీరామ్! జై హనుమాన్!**

      🍁🌹🙏🌷🍁


రేపటి చౌపాయిలో హనుమంతుని నిరంతర స్మరణ వల్ల రోగాలు, బాధలు ఎలా నశిస్తాయో తెలుసుకుందాం. 


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

సుందరకాండ-హనుమ* *7వ భాగం*

 🌷🪷🏹🛕🏹🪷🌷🔯

      *శనివారం 30 మే 2026*

            

          *బ్రహ్మశ్రీ చాగంటి*    

       *కోటేశ్వరరావు గారి*

          

   *సుందరకాండ-హనుమ*                               

             *7వ భాగం*


సుందరకాండ పారాయణం 

మీ సర్వ సమస్యల పరిష్కారం..

```      

```

*శ్రీమద్రామాయణం గాయిత్రీ స్వరూపం, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు చరితం ఓ యదార్థగాధ! ఓ చారిత్రక వాస్తవం!*   


తండ్రీ కొడుకులు, భార్యాభర్తలు,స్నేహితులు, సోదరులు, యజమాని, సేవకుడు, గురుశిష్యులు, రాజు ప్రజలు అనుసరించవలసిన తీరుతెన్నులకు అపురూప అద్వితీయ మానవ సంబంధాలకు శ్రీమద్రామాయణం అత్యంత ప్రమాణం.


*సురస నుండి అభయం పొంది వాయువేగంతో హనుమ ఆకాశమార్గాన వెడుతున్నారు. హనుమకు ఆతిథ్యమివ్వాలని సముద్రం నుండి బయటకు వచ్చిన మైనాకుడి ఎదుట ఇంద్రుడు ప్రత్యక్షమై “ఓ మైనాకుడా నాకు తెలుసు నీవు ఈ సముద్రంలో దాగివున్నావని, రామకార్యం చేపట్టిన హనుమకు సహాయం చేయడానికి ముందుకు వచ్చావు కావున నీ రెక్కలను నరకడం లేదు నిశ్చింతగా వుండు”, అని పలికి మాయమైపోయాడు. 


రామాయణం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు మహర్షి, రామకార్యంపై వెడుతున్న హనుమకు సహాయం చేయాలనే ఆలోచనకే దేవేంద్రుడి నుండి క్షమాభిక్ష లభించింది మైనాకుడికి. 


రామకార్యంపై వెడుతున్న వారికి కేవలం మాట సహాయం చేసినందుకు సంపాతికి పోయిన రెక్కలు వచ్చాయి. 


ఇది రామాయణం యొక్క గొప్పదనం.


*సురస అంటే సంసారం, సురసును దాటి వెళ్ళడం అంటే సంసారమును దాటి వెళ్ళడం. సంసారాన్ని దాటడమే సుందరకాండ తత్వం. 

మనిషి సంసారంలోకి వెళ్ళకుండా వుండిపోవడం కుదరదు, అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేస్తే నాశనమైపోవడం తథ్యం. కామమునకు అర్థమును ధర్మమునిచ్చి ధర్మముతో కట్టి సంసారములో కి ప్రవేశించి, పరిశీలించి, నమస్కరించి, సంసారము యొక్క అనుగ్రహం పొంది వైరాగ్యములోకి అడుగుపెట్టాలి, ఇది కేవలం ప్రజ్ఞావంతులకు మాత్రమే సాథ్యం. ఈ సాధనే సురస నోట్లోకి వెళ్ళి బయటకు రావడం. ఆవిధముగా ప్రజ్జావంతుడైన హనుమ సురసను దాటి కొంతదూరం ముందుకు సాగిపోతుండగా అకస్మాత్తుగా ఆయన వేగం కుంటుపడిపోయింది, ఏదో శక్తి తనను ఆవహించి వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది స్వామికి. నలుదిక్కులా పరికించి చూసారు, సముద్రంలోకి చూసారు, సముద్రంలో ఒక అతిపెద్ద శరీరంతో రాక్షస స్త్రీని గమనించారు. ఆ క్షణమున దక్షిణ దిక్కుకు బయలుదేరుతున్నప్పుడు తన రాజు సుగ్రీవుని పలుకులు జ్ఞాపకం వచ్చాయి హనుమకు. ఆ రాక్షసి సింహిక, సింహిక అపారమైన శక్తి కలది. తన ముందు నిలిచిన వారిని హింసించకుండా తాకకుండా వారికి వున్న శక్తిని తాను హరించే వరం కలది సింహిక. కావున సింహికని సంహరించాలని నిర్ణయించుకున్నారు, కాని సురసకు నమస్కరించారు. సురస భక్షించదు కేవలం పరీక్ష చేస్తుంది. ప్రసన్నం చేసుకుంటే అనుగ్రహించి మార్గదర్శకాన్ని యిస్తుంది, సంసారాన్ని చక్కగా వినియోగించగలిగిన వాడు అర్థాన్ని కామాన్ని ధర్మంతో ముడివేసి, వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి చేరువై పిదప ఈశ్వరుని పొందగలుగుతాడు.


*సింహికను సంహరించడానికి హనుమ ఒక్కసారి తన శరీరాన్ని పెంచగా సింహిక కూడా తన శరీరాన్ని పెంచిన వెంటనే స్వామి సూక్ష్మ రూపమున సింహిక యొక్క శరీరములోకి ప్రవేశించి ప్రాణాలకు పట్టు అయినటువంటి గుండెను ఊపిరితిత్తులను తుంచి లిప్త పాటు సమయమున బయటకు వచ్చేసారు, సింహిక మరణించింది. సింహిక మరణాన్ని చూసిన దేవతలు మహర్షులు జయజయధ్వానాలు పలికి పుష్పవృష్టి కురిపించారు.


*ముందుకి సాగిపోతున్నారు స్వామి హనుమ, మరికొంత దూరం పయనించి ఎదురుగా కనిపించిన లంబపర్వతంపై దిగి ఒక్క క్షణం చూట్టూ చూస్తూ సంతోషంగా వున్నారు స్వామి. 


రామానుగ్రహంతో నూరు యోజనముల సముద్రాన్ని దాటిన యోగిపుంగవుడు, వ్యాకరణ పండితుడు, కపిరాజు అల్లంత దూరమున కనిపిస్తున్న లంకా నగరాన్ని చూడసాగారు.


             *(సశేషం)*``

             *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగము

  తేదీ 30-05-2026 


శ్రీ పరాభవ నామ సంవత్సరము-ఉత్తరాయణం-గ్రీష్మఋతువు-అధిక జ్యేష్ఠమాసము


శు. చతుర్ధశి : ఉ॥ 11:58 వరకు


విశాఖ : మ॥ 1:20 వరకు


శివయోగం : తె॥ 5:24 వరకు


వణిజకరణం : ఉ॥ 11:58 వరకు


భద్రకరణం : రా॥ 1:06 వరకు


అమృతకాలం : తె॥ 4:33 లగాయతు


దుర్ముహూర్తం : ఉ॥ 5:45 - 7:29 వరకు

ఈరోజు


1. సాధారణ కార్యక్రమాలకు అనుకూలం.


2. పూర్ణిమ ప్రయుక్త శ్రీదేవి నవావరనార్చణ చేయవలసిన రోజు. కనీసం దేవాలయానికి వెళ్ళి శ్రీచక్ర దర్శనం చేయడం కుంకుమార్చన జరిపించుకోవడం సువాసినికి దక్షిణ తాంబులాలు ఇవ్వడం దేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. (రాత్రికి పూర్ణిమ పూజ చేసే వారు నేడు, ఉదయం పూర్ణిమ పూజ చేసేవారు రేపటి రోజున ఆచరించాలి.)


3. చతుర్దశి తిథి కలిగిన నేడు మహాదేవుని దర్శించి పూజించిన వారు సకల సంపదలతో వర్ధిల్లుతారని భవిష్య పురాణం.


4. విశాఖ నక్షత్రం కలిగిన నేడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి అలానే ఇంద్రాగ్నులను ఎర్రటి పూలతో పూజించడం వలన ధనధాన్యములు, తేజస్సు కలుగుతాయి.


5. నమ్మాళ్వార్ వర్ష తిరు నక్షత్రం: శ్రీవైష్ణవ శ్రీని వ్యాప్తి చేయడానికి శ్రీహరి యొక్క


సేనాధిపతియైన విష్వక్సేనుల వారు నమ్మాళ్వారుగా జన్మించిన వారు. శఠకోపయోగి అనే మరో పేరు కూడ వీరికుంది. తిరువిరుత్తము, తిరువాశిరియం, పెరియతిరువందాది, తిరువాయ్ ముడి అనే ద్రావిడ పాశుర గ్రంథములను అనుగ్రహించిన వారు.

కేవలం పరిశుద్ధమైన భక్తి

 *కేవలం పరిశుద్ధమైన భక్తి చేత మాత్రమే ప్రారబ్ధము, సంచితము మరియు ఆగామి అనే మూడు రకాలైన కర్మల నుండి విముక్తి పొందగలము.


[ఉన్న ఒక్క పరబ్రహ్మ స్వరూపం సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ గాను, స్థితి చేసేటప్పుడు విష్ణువు గాను, లయం చేసేటప్పుడు శివుడిగాను కనపడుతుంది. వారిలోని చైతన్య స్వరూపము, శక్తి స్వరూపమే వారి భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతులుగా ప్రకటనమవుతారు. ‘రెండు లేదు’ అనునది సత్యం. రుద్రాక్షలు ధరించి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసే అద్వైత పీఠాధిపతులు సర్వకాలములయందు నారాయణ నామం జపిస్తూ ఉంటారు. భజగోవిందం భజగోవిందం భజగోవిందం అని గోవింద నామాన్ని వ్యాప్తి చేసినది శంకర భగవత్పాదులే]


*”శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే*

*శివస్య హృదం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివః*

*యథా శివమయో విష్ణు ఏవం విష్ణు మయ శివః”*

.