31, ఆగస్టు 2024, శనివారం

సెప్టెంబర్, 01, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

🌹 *సెప్టెంబర్, 01, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి : చతుర్ధశి* పూర్తిగా రేపు సోమ తె 05.21 వరకు 

*వారం : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : ఆశ్లేష* రా 09.49 వరకు ఉపరి *మఖ*


*యోగం  : పరిఘ* సా 05.50 వరకు ఉపరి *శివ*

*కరణం : భద్ర* సా 04.28 *శకుని* రేపు సోమ తె 05.21 వరకు


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 09.30 మ 02.00 - 04.00*

అమృత కాలం:*రా 08.04 - 09.49*

అభిజిత్ కాలం  : *ఉ 11.42 - 12.32*


*వర్జ్యం : ఉ 09.36 - 11.21*

*దుర్ముహూర్తం:సా 04.41-05.30*

*రాహు కాలం:సా 04.47 - 06.20*

గుళికకాళం : *మ 03.14 - 04.47*

యమగండం : *మ 12.07 - 01.40*

సూర్యరాశి : *సింహం* చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.54* 

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం   :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.22*

అపరాహ్న కాలం : *మ 01.22 - 03.51*

*ఆబ్ధికం తిధి  : శ్రావణ బహుళ చతుర్దశి*

సాయంకాలం  :  *సా 03.51 - 06.20*

ప్రదోష కాలం  :  *సా 06.20 - 08.40*

నిశీధి కాలం      :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

      *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

  🌞 *॥ శ్రీ సూర్య స్తోత్రం ॥*🌞


సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ] క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || ౭ ||


సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |

ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |

సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౮ ||


 🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🍁🌞🌞🍁🌷🌹

*శ్రీ గురు నరసింహ దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 426*






⚜ *కర్నాటక  : సాలిగ్రామ _  ఉడిపి* 


⚜ *శ్రీ గురు నరసింహ దేవాలయం*



💠 సాలిగ్రామంలోని గురునరసింహ దేవాలయం కర్ణాటకలో హొయసల కాలంలో నిర్మించబడిన ఆలయం 


💠 పద్మ పురాణంలోని పుష్కర ఖండ అధ్యాయంలో ఈ ఆలయ వివరాలు ఉన్నాయి.  ముని పుంగవుల అభ్యర్థన మేరకు సూత పౌరాణిక ఈ మహాత్మ్యాన్ని వివరించింది.


💠 ఉత్తరాన ప్రస్తుత గోకర్ణం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు పరశురాముడి కోరికపై సముద్రరాజు ఇచ్చిన భూభాగాన్ని పరశురామ క్షేత్రం అంటారు.


💠 ఈ ప్రదేశంలో చాలా ముఖ్యమైన తీర్థ క్షేత్రాలు మరియు తీర్థ సరోవరాలు ఉన్నాయి.  నారద ముని సీతా నది మరియు కుంభ కాశీ క్షేత్రం మధ్య ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు, అక్కడ అనేక కూట ముని పుంగవులు ధ్యానం చేస్తూ, వివిధ తీర్థ సరోవరాలలో పవిత్ర స్నానం చేసి, తీర్థ క్షేత్రాలలో ధ్యానం చేశారు.


💠 ఈ ప్రదేశo లో నరసింహ భగవానుడు, శంక మరియు చక్రాన్ని రెండు చేతులలో పట్టుకుని, బ్రహ్మ మరియు రుద్రుడు పూజించబడే యోగానంద భంగిమలో కూర్చొని అశ్వత్త (ప్రజల) చెట్టు మధ్యలో శంఖ మరియు చక్ర తీర్థాల మధ్య ఉన్నాడు.  

దీనిని నారద ముని ప్రతిష్టించాడు.


💠 కూట క్షేత్రం మధ్యలో సాలిగ్రామ దేవతలో నరసింహుడు కొలువై ఉన్న ఈ ప్రదేశాన్ని సాలిగ్రామం అంటారు. 

 ఈ సాలిగ్రామ దేవతను పూజించడం ద్వారా భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతాయి.  

చక్ర తీర్థంలో పవిత్ర స్నానం చేయడం వల్ల అన్ని వ్యాధులు మరియు శత్రు భయం తొలగిపోతాయి.  శంఖ తీర్థంలో పుణ్యస్నానం చేస్తే అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది.  రెండు తీర్థాలలో పుణ్యస్నానం చేసి, నరసింహుని పూజించిన వారికి శ్రేయస్సు లభిస్తుంది.


💠 స్కంద పురాణం సహ్యాద్రి కాండ ప్రకారం, భట్టాచార్య నాయకత్వంలో పండిత బ్రాహ్మణ కుటుంబాలు, లోకాదిత్య రాజు కోరికపై గోదావరి నది ఒడ్డున ఉన్న అహిఛత్ర నుండి నేటి సాలిగ్రామానికి వచ్చారు.  

రాజైన లోకాదిత్య రాజ్య శ్రేయస్సు కోసం పండిత బ్రాహ్మణులను తన రాజ్యసభలో తిరిగి చేర్చుకోవాలనుకున్నాడు.  


💠 లోకాదిత్య రాజు అభ్యర్థన మేరకు ఈ బ్రాహ్మణులు "అతిరాత్ర" వంటి మహా యజ్ఞాలను నిర్వహించారు.  

ఈ యజ్ఞాలు ప్రారంభించే ముందు, “అడ్డంకులు రాకుండా ఉండేందుకు” గణపతిని ప్రార్థించి ఆశీస్సులు పొందారు.


💠 ఏనుగులు మరియు సింహాలు కలిసి జీవించడం చూసి భట్టాచార్య సంతోషించాడు, ఈ పరిస్థితిని అతను తన ధ్యానంలో అప్పటికే అనుభవించాడు మరియు ఈ ప్రదేశానికి “నిర్వైర్య స్థల” అని పేరు పెట్టాడు అంటే “శత్రువులు లేని నివాసం”. 


💠 సాలిగ్రామ ఆలయంలో ఈ తేదీ వరకు కూడా గణపతి రూపంలో ఏనుగు మరియు నరసింహస్వామి రూపంలో సింహం యొక్క ప్రతీకాత్మక ప్రాతినిధ్యం ద్వారా ఇది సూచిస్తుంది.  దేవత పశ్చిమ ముఖంగా ఉంది మరియు కుడి చేతిలో చక్రం మరియు ఎడమ చేతిలో శంఖం ఉంటుంది.


💠 లోకాదిత్య రాజు భట్టాచార్యతో పాటు వచ్చిన బ్రాహ్మణులకు 14 గ్రామాలను కేటాయించి, అక్కడ ఉండి యాగాలు మరియు యజ్ఞాలు చేయమని అభ్యర్థించాడు.  అహిచ్ఛత్రకు తిరిగి వస్తున్నప్పుడు, భట్టాచార్య తన శిష్యులను వెనుక ఉండి, నరసింహ స్వామిని గురువుగా మరియు భగవంతునిగా ఆరాధించమని ఆదేశించాడు.

 ఆ రోజుల నుండి కూట బ్రాహ్మణులమైన మనం నరసింహ స్వామిని గురువుగానూ, భగవంతుడిగానూ ఆరాధిస్తారు


💠 దాదాపు 3 అడుగుల ఎత్తు ఉన్న నరసింహుని ఏకశిలా విగ్రహాన్ని కదంబ వంశానికి చెందిన మయూర వర్మ కుమారుడు లోకాదిత్య రాజు ప్రతిష్టించాడని చెబుతారు. దేవత యోగ స్థితిలో కనిపిస్తుంది మరియు ఆలయం చుట్టూ ఉన్న 14 గ్రామాల బ్రాహ్మణులకు ఇంటి దేవుడు మరియు గురువుగా పరిగణించబడుతుంది. 

కాబట్టి దీనిని 'యోగానంద గురు నరసింహ' అని పిలుస్తారు. 


💠 ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు నరసింహ స్వామిని తమ ఏకైక గురువుగా పూజిస్తారు. పశ్చిమాభిముఖంగా ఉన్న దేవత అత్యంత పూజ్యమైనది మరియు ఈ ప్రాంతంలో చట్టాన్ని కాపాడే వ్యక్తిగా పరిగణించబడుతుంది. 

ఇది ఒక చేతిలో శంఖం మరియు మరొక చేతిలో చక్రం ఉంటుంది.


💠 ఈ ఆలయం 1970ల నుండి క్రమం తప్పకుండా పునర్నిర్మించబడింది మరియు ప్రధాన దేవత నరసింహ భగవానుడు అయినప్పటికీ, ఆలయంలో నిర్వహించబడే ఆచారాలు శైవ సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి, అన్ని ఆచారాలలో గణపతి దేవుడు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు.


💠 ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.

Panchaag

 


కోడళ్ళ కోసం

 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!!* *(🕉️Omkar harishankar Patel. marriage bureau🕉️)* 🌷🫡🌷🫡🌷🫡🌷🫡 కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి *పెళ్లి కాని ప్రసాదు* లు తాళి బొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడం తో ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవోగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదులు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెద్దవాడ* అని తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టీ, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కా రణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *పోరన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తలా ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరాళ్ళు ఎక్కువవుతున్నాయి... పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టీ, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్ పేరంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లి దండ్రులు కూడా అటు అల్లున్ని పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటు దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదిరి చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాకా తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ - ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది..

మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!

భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...

అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.

ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు! అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కొల్పోతున్నాననే అభద్రత భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!

  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి! ఇది వివాహా వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది! తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!! అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏

ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..

 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఆనాటి అత్తలు వేరు ఈ నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు! ఇప్పుడు కట్నా కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకొనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసి బారి పోయింది!

కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి, లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్పా అత్తా మామలను ఆదరించాలని అనుకోక పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే ఆలస్యంగా నిద్ర లేచిన కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తె *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కొడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...

పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 

అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  

వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం కోడళ్ళ లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది!!🙏

మహాదర్శనము_మొదటితరంగము_1

 #మహాదర్శనము_మొదటితరంగము_1

కన్నడ మూలము--శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి

తెనుగుసేత--భాస్కర జనార్దన శర్మ




రెండు ఝాములు గడచి రాత్రి మూడో ఝాములోనికి కాలు పెట్టింది . లోకములోని జనులందరూ శాంతులై , నిద్రాదేవి కృపకు పాత్రులై సుఖించు సమయము . చుట్టుపట్ల అంతా ప్రశాంతముగా నిశ్శబ్దములో అద్దినట్లు మౌనముగా ఉంది . చెట్లూ చేమలన్నీ తమను ఆశ్రయించుకొని ఉన్న పక్షులనన్నిటినీ తమలో దాచివేసి , భయపడి మూలకు అణగి కూర్చున్న పిల్లలవలె , కిక్కురుమనకుండా మూగబోయినాయి . అనతి దూరములోనే చిన్న వాగు ఒకటి ఇసుకలో ప్రవహిస్తూ , అత్తింటి కోడలి వలె వీలైనంత తక్కువ శబ్దము చేస్తూ తనదారిన తానుపోతున్నది . 

దేవరాతుడు ఆశ్రమములో దర్భశయ్యపై పరుండినాడు . ఎడమచేయి చెవితో ఏదో ఏకాంతమాడుతున్నట్టు తల కింద ఉంది . నిద్ర చూడగా గాఢముగా ఉన్నట్టుంది . అయినా కారణము లేకుండానే హఠాత్తుగా అతనికి మెలకువ అయ్యింది . మెలకువైనా , అతనిది కళ్ళు మూసుకునే ఉండే వైఖరి . కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని యుండుటకు సాధ్యము కాలేదు . కళ్ళు తెరిచాడు . 

.

ముత్యము వంటి చిన్నదైన నూనె కైదీపపు వెలుగులో ఎదుటి గోడా , దానిపై వ్రేలాడుతున్న కృష్ణాజినమూ కంటబడ్డాయి . మరలా కళ్ళు మూసి నిద్రపోవుటకు ప్రయత్నించాడు . ప్రయత్నము సఫలము కాలేదు . అట్లే కళ్ళు తెరుచుకొనే పైకి తిరిగినాడు . వెల్లకిలా పడుకొని రెండు చేతులనూ ఎదపై నుంచుకున్నాడు . 

.

చుట్టూ చీకటి కమ్మినట్లైంది . ఇదేమిటీ అనుకొనే లోపలే ఏదో ఒక అలౌకిక దృశ్యపు దర్శనమైనట్లయింది . ఏదో గుర్తు తెలీని అడవి ఒకటి . ఆ అడవిలో ఒక మూల. ఏపుగా పెరిగి నిలుచున్న చెట్ల సముదాయము . ఆ చెట్ల మధ్య ఒక ఆశ్రమము . ఆశ్రమము నుండి చేతివేటు దూరంలో ఒక యేరు . యేటిలో నీరు పారుట స్పష్టముగా కనిపిస్తున్నది . ఆ సెలయేరు అంత పెద్దదీ కాదు , చిన్నదీ కాదు . అయినప్పటికీ , ఆశ్రమవాసుల పైన గౌరవముతో జలదేవతలు అక్కడ వెలసి , మౌనముగా చేతులు జోడించి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది .

.

 ఆ ఆశ్రమము నుండి ఎవరో అతివేగిరముగా ఏదో అత్యవసరమైనట్లు కనిపించుతున్ననూ , సంబరము నిండిన ముఖముతో బయలుదేరినారు . ధవళ వర్ణపు గడ్డమీసాలు , తెల్లగా అప్పుడే కురిసిన మంచువలె స్వఛ్చమైన జటామండలము , అతడొక వృద్ధుడనీ , తపస్వియనీ ఘోషిస్తున్నట్లు చెబుతున్నాయి . ముఖములో నిండిన తేజోకాంతులు ఆ ఉద్ఘోషను ఒప్పుకున్నట్లు , దానికి సాక్ష్యము నిస్తున్నట్లున్నాయి . అకారణముగా మెరుస్తున్నదేమో యనిపించే అతని మందహాసము అతని లోపల నిండిన ఆనంద సాగరాన్ని దాస్తున్న తెర వలె ఉంది . అన్నిటికన్నా మిన్నగా , రత్నదీపాలవలె వెలుగుతున్న ఆ కన్నులు , జగములోని చీకటినంతా బాపి వెలుగు నింపునట్లున్నాయి . ఆ కన్నుల మధ్యనుండీ కిందకు దిగిన అతని నాసిక , ఈతడు లోకానుగ్రహము కోసము దివినుండీ దిగివచ్చి యుండవలెను అని సూచిస్తున్నట్లుంది . ప్రశస్తమైన కొండపైని రాతిపానుపు వలె విశాలముగా వ్యాపించిన అతని నుదురు అతని హృదయ వైశాల్యాన్ని చిత్రిస్తున్నట్లుంది . 

.

అతడు ఏదో కాలాతీతమైనట్లు , వేళ మించిపోయినట్లు త్వరత్వరగా బయలుదేరినాడు . ఆశ్రమపు ముఖద్వారమునకు వచ్చి , వెనుతిరుగి , ఆశ్రమానికి ఒకసారి మొక్కి , మరలా బయలు వెడలినాడు . ఆ ఉదయపు మొదటి జాములో నిండిన ప్రకాశములో కూడా ఆశ్రమము , ఏదో చీకటి పట్టినట్లు నిస్తేజమగుతున్నది . 

అతడు వస్తున్నాడు . అతడికి అన్నివైపులా వెలుగు పరచుకొని ఉండి , ఆ వెలుగు అతనికి మాత్రము తన నీడ అనే అంటును సోక కుండా జాగ్రత్త పడినట్లుంది . మంటలేని అగ్నివలె ప్రజ్వలిస్తున్ననూ , శాంతముగా ఉన్న అతడు కొండ ఎక్కి , గుట్టలూ వాలు చరియలూ దిగి , తోపులను కోనలనూ దాటి , మనోవేగముతో వచ్చి , దేవరాతుడికి నమస్కరించి , " నేను మీ కడుపున పుడతాను " అంటున్నాడు . 

.

 దేవరాతుడికి , " నువ్వెవ్వరవు ? మమ్మల్నెందుకు ఎంచుకున్నావు ? " అని అడగవలె ననిపిస్తుంది . అంతలోపలే వచ్చిన అతడు చిన్న తేజోపిండమై , దేవరాతుని సరసన పడుకుని యున్న ఆతని ధర్మపత్ని ఆలంబినీ దేవి గర్భమును ప్రవేశిస్తాడు . అతని ప్రశ్న ఇంకా మాటలు దాల్చి బయటికి వచ్చు ప్రయత్నము జరుగునంతలోనే ఇదంతా జరిగిపోయింది . 

దేవరాతునికి ఆశ్చర్యమైనది . తన భార్య గర్భవతి యైనప్పటి నుండీ అతడు విధి పూర్వకముగా ఏమేమి చేయవలెనో ఆయా సంస్కారముల నన్నిటినీ సకాలములో చేసినాడు . పుంసవనమైనది . చూలింత కోరికలన్నీ తీర్చడమైనది . ఇంకో పదిరోజులకు సీమంతము జరగనున్నది . ఇప్పుడు ఇదొక అలౌకిక ఘటన. అతనికిది అతి విచిత్రముగా అనిపించి , ఆశ్చర్యమై , మనసులోనే ప్రశ్నా పరంపరలు తరంగముల వలె మూగుతున్నాయి . " అట్లైతే , మా ఆశాసౌధాలు వ్యర్థాలు కావు , వేదకర్మలు సార్థకమవుతున్నాయి , మా వంశములో లోకోత్తరుడైన ఒక బ్రహ్మర్షి ఉదయిస్తాడు . ఆత్మోద్ధారము చేసుకున్న అతని వలన వంశము ఉద్ధారమై , లోకము కూడా సద్గతిని పొందగల దారిని కనుక్కుని ఉద్ధారమవుతుంది " అని అతని మనసు ఆనంద నర్తనము చేసింది . 

సంతోషమైనా, దుఃఖమైనా తనవారితో పంచుకోనిదే మనసు ఊరుకోదు . సంతోషమైతే ఇనుమడించి ఆనందం రెట్టింపవుతుంది , దుఃఖమైతే , పంచబడి పలచబడి మనిషిని ఓదారుస్తుంది . అందుకేనేమో , మానవుడు సంఘజీవియై సాంగత్యాన్ని అపేక్షించేది ? 

దేవరాతుడు పక్కనే పరుండిన భార్యను పిలిచాడు . ఆమె మెలకువగానే యున్నది . .అతనికి ఆశ్చర్యమైంది , " నీవు లేచే ఉన్నావా ? అలాగైతే ఏదైనా విచిత్రాన్ని చూసినావా ? " అని అడిగాడు . ఆమె , " అవును , నేను చూసినదాన్ని మీకు చెప్పవలెనని యున్నాను . అంతలో మీరే పిలిచినారు " అని తాను చూసినది చెప్పింది , " ఒక వాగు తీరములోనున్న ఆశ్రమమొకటి , ఆ ఆశ్రమమునుండీ తెల్లటి వస్త్రములు కట్టుకొనియున్న సాధువొక్కరు వచ్చి నా గర్భమును ప్రవేశించినారు . " అంది . 

దేవరాతునికి పట్టరానంత ఆశ్చర్యమైనది . సంభ్రమముతో " అవునా ? " యని కొంత తడవు ఊరికే ఉండి , " చూడు , నాకు కూడా నీకు కనిపించినదంతా కనిపించింది . దాన్నే నీకు చెప్పాలని పిలిచినాను . అప్పటికే నువ్వు మేల్కొని , నేను చూసినదే నువ్వు కూడా చూసినావు " అన్నాడు . 

ఆలంబినీ దేవి స్త్రీ సహజమైన కుతూహలముతో అడిగింది , " అయితే మరి దీని అర్థమేమిటి ? " 

దేవరాతుడు నవ్వి అన్నాడు , " అర్థమేమిటి ? స్పష్టముగానే ఉంది కదా ? నా కన్నా ప్రబలుడైన కొడుకు కావాలని నేను చేసిన తపస్సు ఫలించింది . ఎవరో ఒక తపస్వి నీ గర్భమును చేరినాడు . పుట్టి లోకాన్ని ఉద్ధరించుటకు ఇక్కడికి వచ్చినాడు . " 

" ఏమిటీ ? మీకన్నా ప్రబలుడా ? మేమెలా నమ్ముట ? ఈ చుట్టుపక్కలే కాదు , దేశ దేశాంతరముల నుండీ కూడా యజ్ఞ యాగాదుల విషయములలో ఎట్టి సందేహము వచ్చినా , తీర్చుకొనుటకు మీ దగ్గరికే వస్తారు . ఇక మీ కన్నా ప్రబలుడంటే ఎటువంటి వాడు ? " 

" చూడు కాంతామణీ , నువ్వు చెప్పినది అబద్ధము కాదు, అయితే , నాది కర్మ కాండ. ఏవేవో ఆశలను పెట్టుకొని చేయు కర్మల గుత్తులే ఈ కర్మ కాండలు . అయితే , పెద్దలు ఏమంటారంటే , ఈ ప్రపంచపు వెలుపల ఇంకేదో ఒకటి ఉందట . అది ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉందట. నీలోపల , నాలోపల మాత్రమే కాక , చీమ , దోమ ,వాటికన్నా చిన్నవైన క్రిమి కీటకాలు మొదలుకొని ఏనుగు , ఒంటె వరకూ ఉన్న సమస్త సచేతన ప్రాణులలోనూ ఉన్న చైతన్యము అదేనట . అట్లే , జీవమున్న స్థావర జంగమములన్నీ బ్రతికియున్నది దాని వలననేనట . సూర్య చంద్రులలో ప్రకాశముగా కూర్చున్నదీ అదేనట !. ఇక్కడ ఉన్నదంతా దానికోసమై వదలి , ....వింటూన్నావా ? ఈ ఊరు వదలి ఇంకో ఊరికి పోవువాడివలె , మనము చేస్తున్నదానినంతా , మన ఆశలనన్నిటినీ , దానికోసమై వదలి జీవిస్తే అది దొరుకుతుందట . అది నిజమైతే , ఇక్కడున్న అన్నిటికన్నా అదే ఎక్కువ అయితే , అప్పుడు దానిని తెలిసినవాడు నా కన్నా ప్రబలుడు అవుతాడా కాదా ? " 

" మీరు ఇంతకు ముందెప్పుడూ ఆ విషయమును ప్రస్తావించి ఉండలేదే , కదా ? " 

" అవును , ఆ సంగతే మాట్లాడలేదు . నిజం చెప్పాలంటే , నాకు అది లేదు అన్న అపనమ్మకమైతే లేదు కానీ , దానికోసము సర్వమునూ త్యాగము చేయడమన్నది నాకు మింగుడు పడదు . చూడు ఆలంబీ , యజ్ఞములో అధ్వర్యుడు ఫలానా దేవుడిని పిలవాలని ప్రైష ( ఆహ్వానము ) నిస్తాడు . హోతృడు ఓం అని ఆ దేవతా సంబంధమైన సూక్తమును పారాయణ చేసి , ఆ దేవతను ఆకర్షించును . ఉద్గాతృడు ఆ సూక్తాన్ని సామముగా ఉపబృంహణ చేసి పాడి ఆ దేవత మన సూక్ష్మ ఇంద్రియములకు గోచరమగునట్లు చేస్తాడు . ఏదైనా హెచ్చుతగ్గులైతే బ్రహ్మ స్థానములో ఉన్నవాడు సరిపరచును . అప్పుడు అధ్వర్యుడు ఆ దేవతకు హోమము చేసి యజమానుని ఇష్టమేదో దానిని సాధించును . ఈ వైభవములో మునిగియున్న వానికి అన్నీ వదలి చప్పగా కూర్చొని ఉండుటన్నది ఎట్లు మనస్కరించును ? అదీకాక , ఆ మార్గమును పట్టినవాడు దానికి బ్రహ్మ విద్య అనే పేరు ....."  

" బ్రహ్మ విద్య అంటే ? "  

" బ్రహ్మమనగా గొప్పది . దేనికన్నా మరి గొప్పది ఏదీ లేదో , అదే అన్నిటికన్నా గొప్పది , ఆ ’ అది ’ ఏదో ఏమిటో చెప్పేవాడికీ తెలీదు , వినేవాడికి ఎంతమాత్రము తెలీదు . అదే బ్రహ్మ . దానిని సంపాదించి ఇచ్చే విద్యయే బ్రహ్మ విద్య . దీనిలో ఇంకో అందముంది , తెలుసా ? " 

" చెప్పండి " 

" ఆ బ్రహ్మము కోసము మనము అన్నిటినీ , అంతటినీ వదలి మిడుకుతూ కాచుకొని కూర్చోవాలట . అది తపస్సుకు దొరకదట . దానము వలన పొందుటకు వీలు కాదట . అధ్యయనము , ప్రవచనముల వల్ల అసలే దొరకదట . ఏమి చేసినా పొందుటకు వీలు కానేకాదట . అది తానుగా మనలను అనుగ్రహించువరకూ వేచి ఉండాలట. ఇది నాకెందుకో పట్టలేదు , నచ్చలేదు . అయినా , దానిని శ్రుతి చెప్పుతున్నది కాబట్టి గౌరవించవలెను . గౌరవిద్దాం . ఒప్పుకుందాం . అంతే కానీ , అది మన జీవనానికి ఒక రూపు ఇవ్వడము వద్దనుకుని , నేను దానివైపుకు చూడనే లేదు , పట్టించుకోనే లేదు . " 

" మరి ఇప్పుడు మీ పుత్రుడు మీకన్నా ప్రబలుడవుతాడు అంటిరి కదా , అది యెట్లు ? " 

" బహుశః , వాడి శ్రద్ధ ఈ కర్మ కాండను ఒప్పుకొని , ఇంకా ముందుకు పోవచ్చేమో ! అయితే ఒక మాట . నా పుత్రుడు కర్మ కాండను తిరస్కరించుటకు నేను ఒప్పుకోను , అది వాడి ఇష్టానికి వదలను . వాడు బ్రహ్మ విద్యను నేర్చుకోవాలన్నా , మన కర్మ కాండలో నిపుణుడై , ఎక్కడ ఎవరికి ఏ సంశయము వచ్చినా దానిని పరిహరించగల వాడు కావలెను . ఎక్కడెవరే యాగాన్ని చేయవలెనన్ననూ ’ ఈ దేవరాతుడి కొడుకును పిలవాలి . లేకుంటే యాగము పూర్ణమే కాదు ’ అనవలెను . రాజాధిరాజు కూడా వాడిని పల్లకి ఎక్కించి కూర్చోబెట్టుకొని పిలుచుకొని వెళ్ళి బండినిండా దక్షిణను సమర్పించవలెను . ఇప్పుడు నాకు వీరంతా చేరి యజ్ఞవల్క్యుడు అని కదా బిరుదునిచ్చినారు , ? ఈ నా కుమారుడు ఈ బిరుదు వలన యజ్ఞవల్క్యుని కొడుకు ’ యాజ్ఞవల్క్యుడు ’ అని ప్రసిద్ధుడు కావలెను . ఆ తర్వాత కావలెనన్న , వాడికి బ్రహ్మవిద్య రానీలే . అలాకాక , వాడేమైనా బ్రహ్మ విద్య కోసము మన శ్రౌత విద్యను వదిలేస్తానంటే , నేను వాడినే వదిలేస్తాను . కానీ , వాడు అలాగు చేయడనుకో ! నాకు నమ్మకముంది . మన పుత్రుడు మనకు ఎదురు చెప్పకుండా , మనకి ఎల్లప్పుడూ విధేయుడై ఉండేలా అగ్ని వలన వరము పొందినాను . " 

 " మీరు ఈ బ్రహ్మ విద్య సంగతిని ముందెప్పుడూ ప్రస్తావించియే ఉండలేదే ? " 

" దానికి సందర్భము రాలేదు . అయినా , అవకాశమెక్కడ ? నేను ప్రాజాపత్య వ్రతములో నున్నవాడిని . అది చాలదన్నట్టు తెల్లారిన దగ్గరనుండీ పొద్దుగూకేవరకూ , కాదు , కాదు ... సంవత్సరము మొదలై సంవత్సరము ముగిసే వరకూ అనుదినమూ ఏదో ఒక ఇష్టి , యాగము అని కూర్చొనువాడను . ఆ యాగానికి దర్భలు తేవడము , ఈ ఇష్ఠికి సమిధలు తేవడము , దానితో పాటు ఆ వచ్చినవారికి సమాధానాలిస్తూ వారి సంశయాలను పరిహరిస్తూ ... వీటిలోనే కాలమంతా గడచి పోవుచుండినది . ఈ దినమే కదా , ఈ దృశ్యము చూడటము వలన , ఈ అపరాత్రి మనమిద్దరమూ మాట్లాడుకునే యోగము కలిగింది ? ఒకవేళ నాకు మెలకువైనా , నిద్రిస్తున్న నిన్ను చూసి , పొద్దుటినుంచీ గానుగెద్దు లాగా తిరుగుతూ రోకి రోకి అలసిపోయావని నిన్ను లేపుటకు మనసే ఒప్పేది కాదు . ఈ దినము అన్ని విధులనూ పక్కనబెట్టి నేను చూసిన విచిత్రాన్ని నీకు కూడా చెప్పాలని అనిపించి , నిన్ను పిలిచినాను . అదేవేళకు అదేమి గ్రహచారమో , నువ్వుకూడా లేచినావు . నీకు ఇంకోటి తెలుసా ఆలంబీ ? "

ఈ వేళకి దేవరాతుడికి వాచాలత్వపు ప్రవృత్తి బలమైంది . లేచి కూర్చొని ఉంటే ఆశ్చర్యమేమీ లేదు , కానీ అతడు లేవకుండా , అట్లాగే పక్కకు పొరలి , మోచేతులపైన భారాన్ని వేసి , తలయెత్తి , భార్య వైపుకు తిరిగి అన్నాడు : " విను , నాకు ఇంకొక సహించలేని అంశమేమిటంటే , ఆ బ్రహ్మ విద్యను తెలిసిన వారు కుక్క, నక్క, చండాలుడాదిగా , అన్నిటినీ సమ భావముతో చూడవలెనంట ! అది నాకు నచ్చదు , దానిని నేను ఆమోదించలేను . బ్రాహ్మణుడై , సర్వ శ్రేష్టుడూ , జ్యేష్టుడూ యై , మేము ఆరాధించు దేవతను , మనలను ఆరాధించువారినీ , అన్నిటికన్నా మిన్నగా స్పర్శన , దర్శనములకు అయోగ్యులైన వారిని సమానమని భావించుట యేలాగు ? ఇదొక పెద్ద బహు జటిలమైన సమస్య . దానివల్లనే నేను బ్రహ్మవిద్య జోలికే పోలేదు , పోను కూడా ! నేను ఒప్పుకునే దేమిటంటే , ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ చేయుట ! అనగానేమి ? మనము చేసే కర్మ , జాగరూకతగా , ఎవరికీ , ఏ ప్రాణికి కూడా , చేతనాచేతనమైన దేనికీ , యే రీతిలోనూ హింస కలగకుండా చూసుకోవడము . ’ శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ’ --రెండు కాళ్ళ ప్రాణులకూ , నాలుగు కాళ్ళ ప్రాణులకూ కూడా శుభము జరగనీ అని కర్మ చేయుట " 

" ఔనౌను , ఇప్పుడు మీరు చేసే కర్మ అలాగే ఉన్నది . మీ జీవ కారుణ్యపు విషయములో ఎవరూ సందేహపడుటకు లేదు . ఎవరికైనా ఇబ్బంది కలుగుట ఉంటే , అది మీకే ! అయితే అది మీకు అలవాటైపోయింది . " 

" ఏమి చేయుట ? నీకు ఇబ్బందులు తప్పుటలేదు . నా చేబట్టినందుకు నువ్వూ ఇన్ని కష్టములను సహించవలసి వచ్చింది . "

" నాకేమీ కష్టము లేదు . ఇవన్నీ నాకు కూడా అలవాటే " 

ఆ వేళకు తొలికోడి కూసింది . అది విని ఇద్దరూ " ఇదేమిటి , అప్పుడే కోడికూత వేళ అయింది , సరే , ఇంకేమి , స్నానానికి లేచు సమయమైంది " అనుకున్నారు . దేవరాతుడు , " ఈ పొద్దు మధ్యాహ్నపు భోజనము తర్వాత నువ్వడిగితే , నేనేమి చేయవలెనని ఉన్నానో అదంతా వివరిస్తాను . నీకు ఇష్టమే కదా ? " అని అడిగినాడు . దానికి సమాధానంగా ఆమె " అలాగంటే ఈ దినము వైశ్వదేవము త్వరగా అగునట్లు చూసుకోవలెను . మీ మాటలు నాకు బెల్లం పాకము వంటివి . అదీకాక , ఈ దినము పురాణము కూడా లేదు . సాయంత్రమొక వేళ వరకైనా మాట్లాడుకోవచ్చు " అంది . 

ఇద్దరూ ఇంకొక ఘడియ అలాగే ఉండి , స్వరము * సరిపోవు వరకు పడుకొనియుండి లేచినారు . 

( * స్వరము : నాసిక లోకి వచ్చు శ్వాసకే స్వరము అనిపేరు . నిద్రలేవగానే శ్వాస ముక్కులో ఏ వైపు నుండీ ఆడుతున్నదీ చూసుకోవలెను . కుడి ముక్కు లో ఆడేది సూర్యుడు . ఎడమ ముక్కులో ఆడేది చంద్రుడు . రెంటిలోనూ ఆడేది జీవము -- అని స్వరము మూడు విధములు . ఫలానా తిథులలో , ఫలానా వారములలో , ఈయీ స్వరాలే ఉండవలెను అను నియమము ఉంది . స్వరశాస్త్రములో ఈ విషయము వివరింపబడి ఉండును . )

రాయల వర్ణనా వైభవము!

 


రాయల వర్ణనా వైభవము!


గోవర్ధనగిరిధారి మురారి!

   

ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా

రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా

రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా

నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;

ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.


          యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.

      యాదవులందరు సపరివారముగా

నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.

        అదీ ఇక్కడిదృశ్యము.


కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,

నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!

కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,

         చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.

     అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!

                                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌟🌷🌷🌷🌷🌟🌷🌟🌟🌟🌟🌷🌷🌷🌷🌷

*శ్రీ సిద్ధి వినాయక స్వామి చరిత్ర*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️              

             *అయినివిల్లి*

*శ్రీ సిద్ధి వినాయక స్వామి చరిత్ర*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలసి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం.*


*ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది.*


*ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ... ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు.*


*స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది.*


*14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన ‘శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర’ గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకాకం క్రీ.శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు.*


*ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ.., వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది.*


*దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వంనుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తపుష్పర్చన, పుస్తకపూజ, అన్నప్రాశ్న, అక్షరాభ్యాసాలు, విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేషపూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు.*


*వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.*


*వినాయక చవితి

రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశం లోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో ‘సప్తనదీ జలాభిషేకం’ చేస్తారు.*


*ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం.*


*విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో...అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.*


*అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే..., తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదెసలు వ్యాపించడంతో.. ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Temple_Tourism_AP

 



#Temple_Tourism_AP . శ్రీకాకుళం జిల్లా . ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలు .   రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండయినా రైల్లో అయినా , రోడ్డు మార్గంలో అయినా రెండు మూడు రోజుల్లో ఈ ముఖ్యమైన , ప్రాచీన దేవాలయాలను చూడవచ్చు . శ్రీకాకుళంలో , విజయనగరంలో కూడా మంచి హోటళ్లు ఉన్నాయి . రాష్ట్ర టూరిజం వారు కానీ , APSRTC వారు కానీ ఓ చక్కని సర్క్యూటుని ఏర్పరచవచ్చు . వెనుకబడిన జిల్లా అయిన ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది . ఉత్తరాంధ్ర అభివృద్ధి పౌర సంఘాలు కూడా చొరవ తీసుకోవచ్చు . దేవాలయాల వివరాలు . 


1. అరసువిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం : అందరికీ సుపరిచితమే . శ్రీకాకుళం పట్టణంలోనే ఉంటుంది . దేశంలోనే రెండు , మూడు సూర్య దేవాలయాలలో ప్రముఖ దేవాలయం మన రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం . మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం . మరొకటి తూర్పు గోదావరి జిల్లా లోని గొల్లల  మామిడాడలో ఉంది . ఇక్కడ ఉన్న కొలేజిలో పైన ఉన్న ఇమేజి ఆ దేవాలయానిదే . 


2. శ్రీకూర్మం : దశావతారాలలో రెండవ అవతారంగా మనందరికీ సుపరిచితం కూర్మావతారం . మొత్తం దేశంలోనే కూర్మావతారానికి ఉన్న దేవాలయం ఈ శ్రీకూర్మనాధ స్వామి దేవాలయం . 9-11శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయం . అంత గొప్పగా అభివృద్ధి చెందలేదని నా అభిప్రాయం . శ్రీకాకుళం నుండి 15 కి మీ దూరంలో ఉంటుంది . ఈ కొలేజిలో రెండవ వరుసలో మొదటి ఇమేజి 


3. సంగం : సంగమేశ్వర ఆలయం . ఈ కొలేజిలోని రెండవ వరుసలో రెండవ ఇమేజి . వంగర మండలంలో ఉంటుంది . శ్రీకాకుళం నుండి 56 కి.మీ దూరంలో ఉంటుంది . రాజాం నుండి 20 కి.మీ దూరంలో ఉంటుంది . ఈ సంగం వద్ద నాగావళి , సువర్ణముఖి , వేగవతి నదులు కలుస్తాయి . అందువలనే సంగం అంటారు . మహా శివరాత్రి నాడు వేలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు . బహుశా చాలామందికి ఈ ఆలయం గురించి , ఈ ప్రదేశం గురించీ తెలిసి ఉండకపోవచ్చు . 


4.సాలిహుండ : ఈ కొలేజిలోని రెండవ వరుసలో మూడవ ఇమేజి . ఈ గ్రామం గార మండలంలో ఉంటుంది . వంశధార నదీ తీరాన కళింగ పట్టణానికి అయిదు కి.మీ దూరంలో , శ్రీకాకుళానికి 18 కి.మీ దూరంలో ఉంటుంది . ఇక్కడ చాలా బౌధ్ధ స్థూపాలు , మోనాస్టరీ ఉన్నాయి . 1919 లో మొదటిసారిగా నేడు మనమంతా జయంతి జరుపుకుంటున్న గిడుగు రామమూర్తి పంతులు గారు కనుక్కున్నారు . రెండవ శతాబ్దానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి . తార , మరీచి విగ్రహాలు కనుగొనబడ్డాయి . ఇక్కడ నుండే సుమత్ర , తూర్పు దేశాలకు బౌధ్ధం వ్యాపించిందని చరిత్రకారులు చెపుతున్నారు . 


5 . శ్రీముఖలింగం : చాలామందికి ఈ దేవాలయం పేరు తెలుసు . శివాలయం . వంశధార నదికి వెడమ వైపు ఉంటుంది . ఈ గ్రామానికి దగ్గరలోనే ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది . ఈ ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి . ముఖలింగేశ్వర , భీమేశ్వర , సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి . 8-11శతాబ్దాలలో నిర్మితమని అంచనా . శ్రీకాకుళానికి 48 కి మీ దూరంలో ఉంటుంది . బాధాకరమైన విషయం ఏమిటంటే ఎంతో గొప్ప ప్రాచీన ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవటం . ఈ కొలేజిలో చివర్లో ఉన్న ఆలయం . 


6 . మందస : వరాహ స్వామి ఆలయం . చాలామందికి తెలియదు . సోంపేట నుంచి 26 కి మీ దూరంలో ఉంటుంది . మహేంద్రగిరి కొండ కింద ఉంటుంది . ఇక్కడ ఉన్న కోట దక్షిణ భారతంలోనే ఎత్తయిన ప్రదేశంగా చెపుతారు . 


ఈ ప్రముఖ దేవాలయాలు కాకుండా మరెన్నో ప్రాచీన , ఈమధ్య కాలంలో నిర్మించబడిన ఆలయాలు ఉంటాయి . ప్రస్తుత ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో జిల్లాల వారీ నాకు తెలిసిన , నేను సందర్శించిన ఆలయాల గురించి మిత్రులతో పంచుకుంటున్నాను . 


Nara Chandrababu Naidu #kanduladurgesh #aptourism #SrikakulamDistrict #srikakulam #religioustourism

*శ్రీ గరుత్మంతుడి కధ - 18

 _*శ్రీ గరుత్మంతుడి కధ - 18 వ భాగం*_

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


      *విష్ణు_మహిమ*


ధర్మరాజుకి ఉపదేశిస్తున్న మునులు నారాయణుడు " వినతా పుత్రా ! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు. అఖిలభూతములు నా యందు జన్మించి, నాయందు పెరిగి, నా యందే నశిస్తాయి. అఖిలభూతములు నాయందు ఉంటాయి. నేను అఖిల భూతములందు ఉంటాను. నన్ను తెలుసు కోవాలంటే జీవాత్మను పరమాత్మ వైపు మళ్ళించాలి. కామమును, అహంకారమును, కోపమును, జడత్వమును వదిలి పెట్టాలి. ఇతరుల నుండి ఏదీ గ్రహించకూడదు. అహింసను అవలంబించి మనసును నిర్మలంగా ఉంచుకుని నిత్య తృప్తులై ఉండాలి. అలాంటి వారికి నేను దర్శనం ఇస్తాను. సాంఖ్యయోగము అవలంబించినప్పటికి బాహ్యముతో సంబంధబాంధవ్యాలు తెంచుకోలేని వారికి నిశ్చయబుద్ధి లేని వారికి నేను కనిపించను. అధికమోహములో పడి కొట్టుకుంటూ పూజలు, వ్రతములు, ఉపవాసములు ఆడంబరముగా చేసే వారికి నేను కనిపించను. ఏకాంతమనస్కులు నన్ను దర్శించగలరు. రజ, తమోగుణులకు కాక కేవలం సత్వగుణము కలవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని నాలుగు విధములుగా విభజింపబడి ప్రాణులందు ఆత్మ, బుద్ధి, అహంకారము, మానస్సు అనే నాలుగు విధములుగా ప్రవర్తిస్తుంటాను. ఇది నా స్థూల రూపము. నీవు కూడా నన్ను తెలుసుకుని నాయందు భక్తితో సదా నన్ను ధ్యానిస్తూ నా నిజస్వరూపమును తెలుసుకో " అని నారాయణుడు నాకు తెలియజేసాడు. నారాయణుడు నాకు చెప్పినది నేను మీకు చెప్పాను " అని సుపర్ణుడు మునులకు సిద్ధులకు చెప్పినది విని వారు ఆనంద పరవశులై " మహానుభావా ! నీ వలన మేము విష్ణుతత్వము విని ధన్యులమైయ్యాము. ఈ కథ అత్యంత పుణ్యదాయకమై విన్న వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ కథ విన్న బ్రాహ్మణులకు వేదవిద్య అలవడుతుంది. క్షత్రియులకు జర్వత్రా విజయము లభిస్తుంది. వైశ్యులకు సంపద అభివృద్ధి చెందుతుంది. శూద్రులకు సకల శుభములు చేకూరుతాయి. సర్వజనులు ఇహపరసౌఖ్యాలను పొందుతారు. అని పొగిడారు. ధర్మనందనా ! ఈ కథ పూర్వము బ్రహ్మదేవుడు వసువులకు చెప్పగా వసువులు మా తల్లి గంగాదేవికి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు నీకు చెప్పాను. ధర్మనందనా ! మనసులో చేసే సకలవిధ సంకల్పములను విడిచి పెట్టి ఆత్మను అగ్నియందు ప్రతిష్ఠించి బాహ్యసంబధములు విడిచి ధ్యానమగ్నుడవై విష్ణువును ధ్యానించి మోక్షమును సాధించు. ఇలా చేసిన వారికి మోక్షము సులువుగా లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.


*"తరువాయి భాగం రేపు "*

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄

గోమూత్రంలో

 గోమూత్రంలో రసాయనిక పదార్దాల వలన నివారణ అయ్యే వ్యాధులు -


 * నత్రజని -


      మూత్రము మరియు మూత్రపిండములను ఉత్తేజితపరుచును. రక్తము నందలి విషపదార్ధాలను హరించును .


 * గంధకము -


       రక్తమును శుద్దిపరచును. పెద్దప్రేగులు యొక్క పనితనాన్ని మెరుగుపరచును.


 * అమ్మోనియా -


        ఇది శరీరమునందలి ధాతువులను మరియు రక్తము నందలి పదార్థములను స్థిరంగా ఉంచును.


 * అమ్మోనియా గ్యాస్ -


        ఊపిరితిత్తులు మరియు ఆయా అవయవములను క్రిముల నుండి రక్షించును.


 * తామ్రము -


        క్రిమిహరము . ఆయా గ్రంథులను పెరగనీయదు. వాపులను రానీయదు.


 * లోహము (ఐరన్ ) -


        రక్తము నందలి ఎర్రరక్త కణములను నిర్మాణం చేయును . పనిచేయు శక్తిని కలిగించును.


 * యూరియా -


         మూత్రవిసర్జన పైన ప్రభావం చూపించును. క్రిములను హరించును .


 * యూరిక్ ఆసిడ్ -


         మలమూత్ర సంబంధ దోషాలను మరియు హృదయ సంబంధ దోషాలను హరించును . విషమును బలహీనపరుచును.


 * ఫాస్ఫెట్లు -


         మూత్రవ్యవస్థ నందలి ఏర్పడే సన్నటి రాళ్లను బయటకి పంపించడంలో తోడ్పడును .


 * సోడియం -


         రక్తమును శుద్దిచేయును . ఆమ్లతత్వమును (antacid ) నివారించును.


 * పొటాషియం -


          ఆకలిని పుట్టించును . మాంసకండరాల బలహీనతని నివారించును. బద్ధకమును నివారించును.


 * మాంగనీసు - 


          క్రిమి నిరోధము , క్రిమిహరము , శరీరభాగాలు కుళ్లిపోవుట (Gangrene ) నివారించును.


 * క్యాల్షియం -


        రక్తశోధకం , ఎముకలను బలపరుచును. క్రిములను హరించును . రక్తస్రావాన్ని అరికట్టును.


 * లవణము -


        దుష్టవ్రణములు , నాడివ్రణములు , మధుమేహము , పుట్టుకతో వచ్చు మూర్చ , రక్తములో ఆమ్లతత్వం పెరుగుట నివారించును. క్రిములను హరించును .


 * విటమిన్స్ -


        A , B , C , D , E విటమిన్స్ శరీరముకు ఉత్సాహము కలిగించును. ఎముకలను దృఢపరచును. ప్రత్యుత్పత్తిశక్తిని పెంచును.


 * ఇతర ఖనిజములు -


         రోగనిరోధక శక్తిని పెంచును.


 * ల్యాక్టోజ్ -


       అతి దాహమును తగ్గించును . నోరు ఎండుకుపోవుట , మూత్రము నందు చక్కర పోవుట నివారించును. దప్పిక , గుండెదడ నివారించును. హృదయమునకు హితవు చేయును .


 * ఎంజైములు -


      శక్తివర్ధకములు .


 * జలము - 


         జీవశక్తిని పెంచును. రక్తమును ద్రవస్థితిలో ఉంచును. శరీర ఉష్ణమును స్థిరముగా ఉంచును.


 * హిఫ్యూరిక్ యాసిడ్ -


        మూత్రము ద్వారా విషాలను బహిర్గతం చేయును .


 * క్రియాటినిన్ -


        క్రిమిహరము .


 * స్వర్ణ క్షారము -


       క్రిమిహరము . రోగనిరోధక శక్తిని పెంచును. విషాన్ని హరించును .


      ఎనిమిది మాసముల గర్భిణి అయిన గోవు యొక్క మూత్రము నందు హార్మోనులు ఉండును. ఇవి ఆరోగ్యవర్ధకములు. 


        పైన చెప్పిన ధాతువులు యెక్క ఫలితాలు కేవలం దేశీయ గోజాతి ముత్ర సేవన వలన మాత్రమే లభించును. గోమాతయొక్క గొప్పతనం గురించి మరొక్క అద్భుతవిషయం మీకు చెప్తాను . గోవు ఆహారం తీసుకునేప్పుడు మేతలో ఏదన్న విషపదార్ధం లోపలికి వెళ్ళినను అట్టి విషపదార్ధాన్ని తన మాంసంలోకి గ్రహించును. అంతేగాని మూత్రములోగాని , గోమయములో గాని , లేక పాలలోగాని విసర్జించదు. ఒకవేళ విసర్జించినను అత్యల్పమోతాదులో విసర్జించును. దానివల్ల వాటిని సేవించినవారి ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండదు.


       నేనురాసిన గ్రంథాలలో ఆవునెయ్యి , ఆవుపాలు , ఆవు వెన్న మొదలైన వాటిగురించి మరింత విపులంగా ఇచ్చాను .


        మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దేవాలయాలు - పూజలు 27*

 *దేవాలయాలు - పూజలు 27*


సభ్యులకు నమస్కారములు.


*తాంబూల సేవనం* :- 

*పూగి ఫలం మహాద్దివ్యం నాగవల్లి దలైర్యుతం ఎలాది చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్* 

తాత్పర్యం:- ఓ ప్రభూ దయచేసి ఈ తాంబూలం స్వీకరించండి. తమలపాకులు, యాలకుల చూర్ణం, వీటితో పాటు దివ్యమైన పూగీ ఫలం

 (అరెక కాయ) తో కూడి ఉన్న ఈ తాంబూలాన్ని సిద్ధం చేశాను. ప్రభూ దయచేసి స్వీకరించండి.


హిందూ సంప్రదాయాలలో తాంబూలానికి విశిష్ట స్థానం మున్నది. తాంబూల ప్రదానం శుభకార్యాలకు మరియు పెద్దలను, ఆత్మీయులను గౌరవించడానికి  గూడా ప్రతీక.  ప్రాథమిక ఆచారాలు, అవసరాలలో అనగా అన్న ప్రాసన లగాయతు అక్షరాభ్యాసం, శ్రీమంతం, ఉపనయన వివాహాది శుభకార్యాలలో ఆనవాయితీగా ఉన్నది. తమలపాకులో  శ్రీ పార్వతీ దేవి, శ్రీ లక్ష్మీ దేవి మరియు శ్రీ సరస్వతి నివాసముంటారని పెద్దల విశ్వాసము. తాంబూలం సమర్పించే వారిని దేవి దేవతలు ఆశీర్వదిస్తారు. మరింకా చెప్పాలంటే నాగవల్లి  అను నామధేయం గల తమల పాకులకు ఎనలేని ప్రాధాన్యత కూడా కలదు. కొందరు దేవీ దేవతలకు  తమలపాకుల శత పత్ర పూజాలు కూడా చేస్తారు. 


అనాదిగా భోజనాదుల తదుపరి తాంబూల స్వీకరణ ఉంటున్నది. తాంబూల స్వీకరణ వలన మానసిక ఉత్సాహము మరియు ఆరోగ్య పరంగా జీర్ణ  వ్యవస్థకు మేలు కల్గుతుంది. 


*తాంబూల సమర్పణ సందర్భంగా కొన్ని నియమాలు*. 

1) ఏక తమల పాకు, ఏక ఫలం గాని కల్గిన తాంబూలాలు  కూడదు. 

2) మూడు గాని అంతకంటే ఎక్కువ గాని తమలపాకులతో భగవంతునికి తాంబూలం సమర్పించాలి. 

3) సుగంధభరితమైన *తాంబూలం తొడిమలు భగవంతుని వైపు ఉండకూడదు*. 

4) *దోషాలకు తావివ్వ కూడదు* భగవంతుడు ప్రీతి చెందాలి, మానవాళికి శ్రేయస్సు అందించాలి.

 5) అర్చక స్వాములు గాని గృహస్థులు గాని వారు ఇతరుల వద్ద పుచ్చుకున్న తాంబూల సామాగ్రిని భగవత్ నివేదనకు ఉపయోగించ రాదు.


*తాంబూలాలో రకములు:-*  1) పరగడుపు తాంబూలం,

2) పేరంటాల తాంబూలం, 3) వశీకరణ తాంబూలం, 4) వీడ్కోలు తాంబూలం, 

5) పుష్ప తాంబూలం,

 6) తాంబూల ద్వయం = శాలువా యుక్త సంభావనా తాంబూలం, 

7) పూజలు మరియు వ్రతాల తాంబూలం, 

8) నైవేద్య తాంబూలం. ఇంకా ఉండవచ్చును.


తాంబూలము యొక్క మరొక విశేష పద్ధతి అనాదిగా ఆచరించబడుతున్నది. వీడ్కోలు సమయంలో మాన్యులకు  మరియు ఆత్మీయులకు  తాంబూలం నమస్కార సహితంగా ఇవ్వబడుతున్నది. *బహుశా ఈ సంప్రదాయమే భగవత్ ఆరాధనలో చివరి  అంశంగా చేర్చబడినది*.


అర్చక స్వాముల వారు తాంబూలం సమర్పిస్తూ *ఓం కాలాయ నమః తాంబూలం సమర్పయామి*. అని నివేదిస్తారు. కొంత వ్యవధి తదుపరి అనగా భగవానుని తాంబూల చరణానంతరం, భగవానుని ముఖ (నోటి) శుద్ధికై *శుద్ధ ఆచమనీయం* సమర్పయామి అంటూ ఉద్దరిణితో అర్ఘ్య పాత్రలో నీరు వదులుతారు. తాంబూల స్వీకరణ అనంతరం భవంతుడు విశ్రమిస్తాడు.


ధన్యవాదములు.

*(సశేషం)*

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 27*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

*||శార్దూలము||*


 *అమ్మా! యయ్య!" యటంచు నెవ్వరిని నే నన్నన్శివా! నిన్ను నే*

 *సుమ్మీ నీమదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా*

 *కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్‌ గురుఁడు నీవేకాకసంసారపుం*

 *జిమ్మంజీకటిఁగప్పినన్ గడుపనన్! శ్రీకాళహస్తీశ్వరా!!!!*


           *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 27*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! అమ్మా, అయ్యా అని నేను ఎవ్వరిని పిలిచినా అది వేరే ఎవరినో అని నీ మదిలో చూడబోకు.... ఈ జన్మకు నాకు తల్లీ, తండ్రీ, గురువు, దైవమూ అన్నీ నిన్నుగానే భావించినాను.... అట్టి నీవే ఈ సంసారము అనే పెను చీకటి నన్ను ముంచివెయ్యకుండా కాపాడు.....ప్రభో!*


✍️🌹🌷💐🙏

*శ్రీ వినాయక దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 425*


⚜ *కర్నాటక  : గుడ్డట్టు_  ఉడిపి* 


⚜ *శ్రీ  వినాయక దేవాలయం*



💠 ఈ దేవాలయం ఏ శతాబ్దానికి చెందినదో కచ్చితమైన సమాచారం లేదు.

 అయితే ఇది వేల సంవత్సరాల క్రితమే ఉందనడంలో సందేహం లేదు. 


💠 గణేశుడికి అంకితం చేయబడిన ఈ విశిష్టమైన ఆలయం ఒక రకమైన సహజ అద్భుతం.

ఇక్కడ విగ్రహం స్థాపించబడలేదు లేదా శిల్పం చేయలేదు కానీ శతాబ్దాల క్రితం రాతిలో వ్యక్తీకరించబడిందని నమ్ముతారు.  


💠 కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లో ఉంది.

 'జల్ధివాస్ గణపతి ఆలయం' అని కూడా పిలువబడే గుడ్డట్టు వినాయక దేవాలయం గణేశుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ మరియు పురాతన ఆలయం. 


💠 ఇది భారతదేశంలోని ఏకైక జలధివాస్ గణపతి దేవాలయం. మూడు అడుగుల వినాయకుడి విగ్రహం రాతి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. 

ఈ దేవాలయం గుడ్డట్టు అడిగర్ కుటుంబానికి చెందినదని ప్రతీతి.


💠 ఉడిపిలో మీరు చూసే అనేక పురాతన దేవాలయాలలో ఇది ఒకటి, ఇది కూర్చున్న ఏనుగును పోలి ఉండే భారీ రాతి పాదాల వద్ద ఉంది.  

ఈ రాతి చుట్టూ అడవి మరియు పచ్చని వరి పొలాలు ఉన్నాయి మరియు ప్రజలు అనుభవించడానికి సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని సృష్టిస్తుంది.  

పండుగల సీజన్‌లో మరియు ముఖ్యంగా గణేశ చతుర్థి మరియు సంకష్టహర చతుర్థి సమయంలో ఆలయ అందాన్ని పూర్తిగా ఆరాధించవచ్చు.  

ఈ ప్రత్యేక సందర్భాలలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించడం విశేషం.


🔆 *ఆలయ చరిత్ర:*


💠 పురాణాల ప్రకారం, శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిపై యుద్ధానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తు, శివుడు యుద్ధానికి వెళ్లే ముందు వినాయకుడిని పూజించడం మర్చిపోయాడు. ఈ కారణంగా, శివుడు యుద్ధంలో విజయం సాధించలేదు.


💠 తన కొడుకు గణేశుడి వల్ల విజయం సాధించలేడని తెలుసుకున్న శివుడికి కోపం వచ్చింది. కోపోద్రిక్తుడైన శివుడు గణేశునిపై భీకర బాణాలు ప్రయోగించాడు. 

కానీ ఏ బాణమూ వినాయకుడిని బాధించలేదు. బాణాలు వినాయకుడిని మోసుకెళ్లి తేనె

 /నెయ్యి సముద్రంలో పడవేశాయి.


💠 గణేశుడికి నెయ్యి అంటే చాలా ఇష్టం మరియు సముద్రమంతా తాగి సముద్రాన్ని ఖాళీ చేశాడు.  దీంతో సంతోషించిన గణేశుడు తన తండ్రి శివుడిని అనుగ్రహించాడు.  

ఆ తరువాత, శివుడు యుద్ధంలో గెలిచి రాక్షసుడిని చంపాడు.  


💠 విపరీతంగా తేనె తాగడం వల్ల గణపతికి మంట పుట్టి నొప్పితో మూలుగుతూ వచ్చింది.  పరమశివుడు తన కుమారుని కరుణించి, పవిత్రమైన నరసింహ తీర్థం పక్కనే ఉన్న కొలనులో గణేశుడిని స్థిరనివాసం ఏర్పరుచుకోమని దీవించాడు. 

 అప్పుడు గణేశుడు భారీ రాతిలోని కొలనుని తన నివాసంగా చేసుకున్నాడు.


💠 'ఆయిర కోడ అభిషేకం' లేదా వైదిక ఆచారం ప్రకారం ప్రతిరోజు సమీపంలోని బావి నుండి వెయ్యి కుండల నీటితో విగ్రహానికి అభిషేకం చేయడం ప్రత్యేక పూజ. 

 విస్తృతమైన ప్రార్థనలు మరియు ఆచారాలను అనుసరించి, వినాయకుడిని మెడలోతు నీటిలో ముంచుతారు. 

 ప్రతిరోజూ ఇలా చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, నీటి శీతలీకరణ ప్రభావంతో దేవుని బాధను తగ్గించడం.


💠 గుడ్డట్టు శ్రీ వినాయక దేవాలయం చరిత్ర సుమారు 700 సంవత్సరాల నాటిది.  మూడు అడుగుల వినాయక విగ్రహం ఈ రాతి నుండి స్వయంగా ఉద్భవించిందని నమ్ముతారు.  

మీరు కూర్చున్న భంగిమలో గణపతిని నల్లరాతి శిల్పం చూడవచ్చు.  అతని తొండం ,  కళ్ళు మరియు కాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.  గుహ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది, 

ఇది గణపతిని మెడ స్థాయి వరకు ముంచుతుంది.


💠 ఆలయంలో జరిగే పూజల ద్వారా స్వామికి నిత్య ప్రార్థనలు జరుగుతాయి.  సాధారణ పూజలు కాకుండా, ఈ ఆలయం కొన్ని ప్రత్యేక పూజలకు కూడా ప్రసిద్ధి చెందింది:


🔅  'అయర్ కోడ సేవ', (అయర్ అంటే వెయ్యి మరియు కోడ అంటే కుండ)


 🔅 తైలాభ్యంజన,


 🔅 పంచామృత,


🔅 రుద్రాభిషేకం: 

సాధారణంగా 'రుద్రాభిషేక' సేవ శివాలయంలో నిర్వహిస్తారు కానీ ఇక్కడ గణపతికి నిర్వహిస్తారు.


🔅 'అయర్ కోడ సేవ"లో విగ్రహానికి వెయ్యి కుండల నీటితో స్నానం చేయిస్తారు మరియు ప్రతిరోజూ ఉదయం నిర్వహిస్తారు. 

 ఇది గుడట్టు వినాయకుని ఆలయంలో అత్యంత ప్రసిద్ధమైన సేవల్లో ఒకటి.


🔆 శ్రీ వినాయక టెంపుల్ కొండ వద్ద పూజ ఆచారం - విధానం:


💠 ఇక్కడ వినాయకుడికి పూజలు చేసే ముందు, భక్తులు స్నానం చేసి, వస్త్రం ధరించి పూజా నియమాలను పాటించాలి.  

స్థానిక విశ్వాసం ప్రకారం, వినాయకుడిని పూజించేటప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, వారి ముందు పాము కనిపిస్తుంది.  

ఇక్కడ అభిషేకానికి వినియోగించే నీటిని ఆ తర్వాతి రోజుల్లో రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలకు వినియోగిస్తారు.  తర్వాత పారాయణంతో పాటు వెయ్యికోడల సేవ చేయాలి.


💠 పూజలు చేసే భక్తులు స్నానం చేసి శుభ్రమైన, తడి బట్టలతో పూజా విధానాలను పాటించాలి.  

ఈ పద్దతి సరిగ్గా పాటించకుంటే ఓక పాము వచ్చి ఎదురుగా కనిపిస్తుంది.  

చివరిరోజు అభిషేకానికి వాడిన నీళ్లను మరుసటి రోజు రుద్రాభిషేకం, పంచమృతాభిషేకం నిర్వహించాలి.  

అప్పుడు పారాయణ పఠిస్తూ అయ్యర్ కోడల సేవను అనుసరించాలి.



💠 ఉడిపి నుండి 35 కి.మీ,  మరియు కుందాపూర్ నుండి కేవలం 15 కి.మీ దూరంలో ఉంది. 

*శ్రీ గరుత్మంతుడి కధ -17

 _*శ్రీ గరుత్మంతుడి కధ -17 వ భాగం*_

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


గరుత్మంతుడు_కశ్యపుడు

నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శన మిచ్చాడు. నేనుఆయనను దర్శించ వలెనన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగసమాధిలో ఉండి తపమాచరించాను. ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వ రూపము చూపి " కశ్యపా ! నీలో ఇంకా కోరికలు చావలేదు. మనసులో కోరికలు పెట్టుకుని నన్ను చూడడం జరగని పని. నీ వు నిస్సంగుడవైనప్పుడు నన్ను దర్శించగలవు " అన్నాడు. అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబర ధారి శంఖు చక్ర గధా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.

గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట


#తపస్సుచేసుకొంటున్న_శివుడు

నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు. నేను ఆయనను అనుసరించాను. అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు. నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాంఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించ లేదు. " ఈ దిక్కుకు రా " అన్న శబ్ధము వినిపించింది. నేను దిక్కు తోచక అటువై వెళ్ళాను. క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. అక్కడ సూర్యుడు  పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతము వినవస్తుంది. తామర కొలనులు ఉన్నాయి. అందమైన మగవారు ఆడవారు నారాయణ మూర్తిని పూజిస్తుండగా ఆయన అలా వెళుతుండగా నేను ఆయనను అనుసరించాను. నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామీ అని అరిచాను. ఆయన వాత్సల్యంతో " వినతాకుమారా ! నేను నిన్ను మరచిపోతానా ! నా వెంట రా ! నీవు నన్ను చూడలేదని బాధపడకు. మమతలు, అహంకారం మనసున రానీక నిశ్చల మనసుతో ఏకాగ్రచిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద కలిగిన భక్తిప్రత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరము మాత్రమే చూడగలుగు తున్నావు " అని స్వామి నాతో అన్నాడు. అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది. నేని తిరిగి స్వామిని అనుసరించాను. నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను. అక్కడ స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇటురా ! అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను. అక్కడ తెల్లటి హంసలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది.అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను. ఆయన నాకు కనిపించ లేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేధ ఘోషలు వినవచ్చాయి. అప్పుడు కొన్ని వందల గరుడపక్షులు నన్ను చుట్టుముట్టగా నేను భయ భ్రాంతుడనయ్యాను. నేను అచ్యుతా, శివా, సహస్రాక్షా, వేదమయా, అనాది నిధనా, త్రిభువనైక నాధా, త్రినైనా, గోవిందా, పద్మనాభా, హరా, కృపా విధేయా  అని పెద్దగా స్వామిని స్తోత్రం చేసాను. అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై " వినతా పుత్రా ! భయపడకు " అని నా భుజం తట్టాడు. నేను కళ్ళు తెరిచి చూడగా బదరికాశ్రమంలో ఉన్నాను. అది చూసి ఆశ్చర్య చకితుడనై ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకుని పులకించి పోయాను. అప్పుడు నాముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుడిని చూసి స్వామి ముందు మోకరిల్లి " మహానుభావా ! నేను నీ పాదసేవకుడను అయితే, నేను నీ దయకు పాత్రుడనైతే, నేను వినడానికి అర్హుడనైతే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాను.


*" తరువాయి భాగం రేపటి శుభోదయంలో  "*

🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏

తెలుగు మాస్టారు

 : తెలుగు మాస్టారు

రచన లక్ష్మి మదన్

🪷🪷🪷🪷🪷🪷🪷


      మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుంది...భోజనం చేద్దామని వంటింట్లో పీట వేసుకుని కంచంలో అన్నం కూర పెట్టుకొని చారు ఒక గిన్నెలో పోసుకొని మంచినీళ్లు చెంబు పెట్టుకొని కూర్చుంది సుజాత..


ఇంట్లో అందరూ భోజనాల బల్ల పైనే తింటారు ..కానీ! సుజాతకి కింద కూర్చుని తింటేనే తిన్నట్టు ఉంటుంది' ఎందుకమ్మా కింద కూర్చొని తింటావు టేబుల్ మీద తినొచ్చు కదా!" అని..పిల్లలు అడిగితే..


" నాకు ఇలా తింటేనే తిన్నట్టు ఉంటుంది.. నా తండ్రి చనిపోయే వరకు కూడా నేల మీద కూర్చొని భోజనం చేసేవాడు.. నాకు అదే అలవాటు వచ్చింది. ఇప్పుడైతే కాళ్ల నొప్పులు ఏం లేవు కదా! అవి వచ్చినప్పుడు టేబుల్ మీద తింటాలే" అని సమాధానం చెప్పేది.


కూతురు ప్రతిమ ఇంజనీరింగ్  ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రిపరేషన్ హాలిడేస్ కోసం వచ్చి హాల్లో కూర్చుని చదువుకుంటుంది... కొడుకు అదే ఊర్లో ఇంటర్ చదువుతున్నాడు... భర్త కొడుకు టిఫిన్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు తాను మాత్రం ప్రతిమకు భోజనం పెట్టి తాను కూర్చుంది తినడానికి...


ఇంతలో బయట నుండి 'కొంచెం భోజనం ఉంటే పెట్టండి తల్లీ!" అనే గొంతు వినిపించింది..


అది విన్న సుజాత..


" ప్రతిమా! ఒక్కసారి బయటకు చూడు ఎవరో పిలుస్తున్నారు" అన్నది సుజాత నోట్లో ముద్దని పెట్టుకోబోతూ..


" ఎవరో నమ్మా! భోజనం కావాలని అడుగుతున్నారు  పంపించేయనా"? అని అడిగింది.


" తప్పు ఎవరైనా అన్నం అడిగితే లేదని పంపించవద్దు.. అందులో నేను భోజనం చేసే ముందు వచ్చారు.. నేనే ఇదే కంచం తీసుకెళ్లి అతనికి భోజనం పెట్టేసి వస్తాను" అని తన పళ్లెం తీసుకుని బయటకు వెళ్ళింది సుజాత..


బయటకు వెళ్లిన సుజాత వచ్చిన వ్యక్తిని చూసి నిర్గాంత పోయింది,.. అతని ఎవరో కాదు.. వారి తెలుగు మాస్టారు.. "ఇదేంటి ఇతను భిక్షాటన కోసం వచ్చాడు.. ఎంతో గొప్పగా బ్రతికిన ఇతనికి భిక్షం అడుక్కోవాల్సిన పని ఏమిటి?" అని మనసులో అనుకొని..


" మాస్టారూ! మీరేమిటి ఇలా! ముందు లోపలికి రండి" అని చేయి పట్టుకొని తీసుకెళ్లి లోపల ఉన్న దివాన్ మీద కూర్చోబెట్టింది..


అతను సుజాత వంక అయోమయంగా చూసి గుర్తుపట్టలేదన్నట్టుగా మొహం పెట్టాడు..


"నేను సుజాతను మాస్టారూ! దక్షిణామూర్తి గారి అమ్మాయిని మనం బంధువులం కూడా అవుతాము గుర్తుకొచ్చానా!" అని అడిగింది.


అతని మొహంలో చిన్న వెలుగు కనిపించింది '' అన్నట్లుగా ఒక చూపు చూశాడు.. కానీ అతను చాలా నీరసంగా ఉన్నాడు మాట్లాడే పరిస్థితిలో లేడు..


అది గుర్తించిన సుజాత అతనికి విస్తట్లో అన్నం పెట్టింది దాన్ని తెచ్చి స్టూల్ వేసి అతని కూర్చున్న చోటే అమర్చింది ,"మీరు తినండి మాస్టారు" అని చెప్పింది.


అతను చేతుల వంక చూసుకున్నాడు... ఒక ఖాళీ బకెట్  తెచ్చి పెట్టింది.. దానిలో కడుక్కోమని చెప్పి చేతుల మీద నీళ్లు పోసింది..


అతని చేతులు కడుక్కొని నెమ్మదిగా భోజనం చేయసాగాడు.. అతని వయసు దాదాపు 83 ఏళ్లు ఉంటుంది...


అతని నిదానంగా భోజనం చేస్తుంటే.. గతమంతా కళ్ళ ముందు కదలాడింది సుజాతకి..


వంటింట్లో సుజాత తల్లివర్ధనమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది ..ఆ పొయ్యి మంటలో నాలుగు వంకాయలను పెట్టి కాలుస్తూ కూర్చుంది.. పక్కనే కూర్చున్న సుజాత 'ఆ వంకాయలతో ఏం చేస్తావమ్మా!" అని అడిగింది..


" నాన్నకి వంకాయలను అన్నంలో కలుపుకుని తినడం ఇష్టం అందుకనే కాల్చి పెట్టి దానిలో ఉప్పు నెయ్యి వేసి పెడతాను" అని చెప్పింది.


" అయితే నాకు కూడా కావాలి" అన్నది సుజాత.


" సరే నీకు కూడా ఇస్తా గానీ.. మన ఇంటికి బంధువు వచ్చారు.. అతను నీకు మామ వరస అవుతారు. ఇక్కడ స్కూల్లో టీచర్గా వచ్చారట అదే మీ స్కూల్లోనే ..వెళ్లి అతనికి మంచినీళ్లు ఇచ్చి నమస్కారం చేసి రా" అని చెప్పి తల్లి పంపించింది.


అతనికి మంచినీళ్లు ఇచ్చి నమస్కారం చేసింది సుజాత.


" ఏం చదువుతున్నావు తల్లి" అని అడిగాడు వచ్చిన బంధువు.


"9వ తరగతి చదువుతున్నానండి" అని చెప్పి లోపలికి వచ్చింది.


మామూలుగానే ఇంట్లో అక్కతో చెల్లెళ్లతో కొట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ మాట్లాడింది సుజాత ..అతని ముందు ఏమీ భయపడలేదు కూడా..


అసలు ఆ బంధువు గురించి పట్టించుకోకుండా చాలా అల్లరి చేసేసింది అప్పటికి తల్లి చెప్తూనే ఉంది "కొత్త వాళ్ళ ముందు ఏంటి ఆ అల్లరి?" అని.. అయినా సుజాత పట్టించుకోలేదు..


ఆలస్యంగా ఇంటికి వచ్చిన తండ్రి వచ్చిన బంధువుతో ఆప్యాయంగా మాట్లాడుతూ చాలా రాత్రి వరకు అతనితోనే కూర్చున్నాడు.


ఇద్దరూ ఒకరినొకరు బావ అనుకుంటూ సంబోధించుకున్నారు..


తెల్లవారి సుజాత యధాప్రకారంగా స్కూలుకు వెళ్ళింది..


అంతకు ముందు రోజే హెడ్మాస్టర్ వచ్చి మీకు కొత్త తెలుగు మాస్టర్ వస్తున్నాడు.. ఇప్పుడున్న మాస్టారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు" అని చెప్పాడు..


కొత్త మాస్టారు ఎలా పాఠాలు చెప్తారు.. స్ట్రిక్ట్ గా ఉంటాడా లేక ఫ్రెండ్లీగా ఉంటాడా ఇవన్నీ చర్చించుకుంటున్నారు క్లాస్లో పిల్లలందరూ.. అంతకు ముందు ఉన్న మాస్టారు అసలు ఒక్కరోజు కూడా క్లాస్ తీసుకునేవాడు కాదు. ఎప్పుడు సెలవు పైనే ఊరికి వెళ్ళిపోయేవాడు..


ఇలా అనుకుంటుండగానే ఫస్ట్ పీరియడ్ లో మాస్టారు లోపలికి వచ్చారు...


అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు..


కానీ సుజాతకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది.. ఎందుకంటే వచ్చిన మాస్టారు ఎవరో కాదు నిన్న వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువు..


"ఈవిషయం తెలియక ఇంత అల్లరి చేశాను నేను ఇప్పుడు సార్ ఏమంటారో" అని భయపడ సాగింది సుజాత...


ఒక్కొక్కరిగా వారి పేర్లు చెబుతూ పరిచయం చేసుకో సాగారు..


ఇక పరిచయం చేసుకోవడం సుజాత వంతు వచ్చింది ఒక్కసారిగా సుజాతకు చెమటలు పట్టుసాగాయి..

ఏమి మాట్లాడకుండా నిలబడ్డ సుజాతను చూసి..


" నువ్వు ఎవరో నాకు తెలుసు గాని.. నువ్వు నీ నోటితో నీ పేరు చెప్పు బిడ్డా" అన్నాడు మాస్టారు నవ్వుతూ..


కొంచెం భయం పోయి ధైర్యం వచ్చింది మెల్లిగా లేచి తన పేరు చెప్పింది....


ముగింపు మరో భాగంలో

 తెలుగు మాస్టారు

రచన లక్ష్మి మదన్

🪷🪷🪷🪷🪷🪷🪷


       అలా వచ్చిన తెలుగు మాస్టారు పేరు సూర్య నారాయణ శాస్త్రి గారు... మొదటి రోజే పిల్లలందరినీ ఆకట్టుకున్నారు.


అతను తెలుగు పండితుడే కాకుండా ఒక అవధాని అని, ఒక కవి అని తర్వాత తెలిసింది...


తెల్లని ధోతి అంగీ వేసుకుని నుదుట కని కనిపించని విభూతి రేఖలు పెట్టుకొని..చిన్న కుంకుమబొట్టుతో స్కూల్ కి వచ్చేవారు.. ఆయన ఒక్కొక్కసారి ఏ లోకంలోనో ఉన్నట్టుగా ఉండేవారు.. ఆయన ఆహార్యం మీద కూడా శ్రద్ధ ఉండేది కాదేమో!.. ఇంట్లో వారి సతీమణి ఇచ్చిన బట్టలను కట్టుకొని పెట్టిన భోజనం తిని బయలుదేరేవారు ఒక్కొక్కసారి చెప్పులు కూడా వేసుకునేవారు కాదు.


ఆయన పాఠం చెప్పే విధానం చూస్తే అరటి పండు వలిచినట్లు  అనిపించేది ..అప్పటికప్పుడే ప్రశ్నలకు జవాబు రాయగలిగేంత అర్థం అయ్యేలా వివరించేవారు.


పాఠం చెప్పగానే చివరలో అప్పటికప్పుడు ఎవరు పద్యం ఒప్ప చెప్పితే వారి ముఖంలో ప్రశంస కనపడేది.. ఆ ప్రశంస కోసం విద్యార్థులు ఎంతో తాపత్రయపడేవాళ్లు... కనీ కనిపించని ఒక ఎక్స్ప్రెషన్ ఉండేది ముఖంలో అదే తప్పు చెప్పితే అతని ముఖ కవళికలు మారిపోయేవి.. మాస్టారు తిట్టకుండా కూడా ఆ కవళికలను చూస్తేనే పిల్లలకు బాధ కలిగేది..


పిల్లలందరికీ చక్కని చందస్సును నేర్పించారు.. పద్యాలు ఎలా రాయాలో చూపించారు.. మంచి మార్కులు పొందిన వాళ్లకు తన రచనల్లో నుండి పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.. ఇలా తెలుగు మాస్టారు పిల్లలకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.


అప్పుడప్పుడు చతురోక్తులతో తరగతిని ఎంతో ఉల్లాసంగా ఉంచేవారు... అతని ప్రతిభ తెలుసుకున్న సుజాత అతనంటే  అపారమైన గౌరవం పెంచుకుంది.. వీళ్ళ ఇంటి దగ్గరనే మాస్టారు ఇల్లు ఉండేది వాళ్ల పిల్లలతో తనకి ఎక్కువ సాన్నిహిత్యం కూడా కలిగింది సుజాతకు.. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది కానీ మాస్టారు లేనప్పుడు మాత్రమే వెళ్ళేది మాస్టారును చూడాలంటే స్కూల్లో మాత్రం చూడ్డానికి ఇష్టపడేది... అలా అతను అంటే ఇష్టంతో పాటు గౌరవం పెరిగింది.


ఇదంతా గుర్తుకొచ్చిన సుజాత ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి మాస్టారును చూసింది.. అతను భోజనం చేసి మెల్లిగా లేచి వెళ్లి పెరట్లో చేయి కడుక్కున్నాడు.


"మాస్టారూ! కాసేపు విశ్రాంతి తీసుకుంటారా"  అని అడిగింది సుజాత


" లేదమ్మా నేను వెళ్ళిపోవాలి" అన్నారు శాస్త్రి గారు.


" అసలు ఎక్కడుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు? మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఉంది" అని అన్నది సుజాత.


అతని కళ్ళనుండి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి..


అతని భుజం మీద చేయి వేసిన సుజాత "బాధపడకండి మాస్టారూ! ఏం జరిగిందో చెప్పండి మీ బాధను తగ్గించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను" అని చెప్పింది.


" ఏం చెప్పను తల్లి !ఎంతో వైభోగంగా గడిచిన నా జీవితం ఈరోజు నేల రాలి పడింది.. పిల్లలందరినీ చక్కగా చదివించాను పెళ్లిళ్లు చేశాను ఏ మాత్రం నేను డబ్బులు మిగిల్చుకోకుండా వారి కోసం మాత్రమే ఖర్చు పెట్టాను.. పోయిన సంవత్సరం నాభార్య చనిపోయింది.. అప్పటినుండి నాకు నరకం మొదలైంది... ఆమె ఉన్నంతవరకు నాకు ఏ లోటు తెలియలేదు ఎవరి సూటి పోటీ మాటలు నాకు వినపడలేదు.. నాకు ఆమె వినబడనీయలేదు కూడా ..ఎప్పుడైతే ఆమె పోయిందో అందరి నిజస్వరూపాలు తెలిసిపోయాయి... నాకు కంచంలో పట్టెడన్నం కాకులకు విసిరిన దానికన్నా హీనంగా పెట్టడం మొదలయ్యింది ఇంట్లో నుండి నా పడక వీధి అరుగు మీదికి చేరింది... నా ఉనికి ఇంట్లో అందరికీ భారం అయిపోయింది... ఉద్యోగాల పేరిట అందరూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతారు నేను ఆ పంచలోనే బయట కూర్చుంటున్నాను ఆకలి వేస్తే లోపలికి వెళ్లడానికి లేదు ..ఒకప్పుడు నేను కట్టిన ఇల్లు అది.. ఇప్పుడు ఆ ఇంట్లోకి కాలు పెట్టడానికి నాకు అర్హత లేదు... పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోనే పడతాయి అందులో నుండి పది రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవరికీ మనస్సుఒప్పదు.. ఆకలి దప్పులకు ఓర్చుకుంటాను.. కానీ సూటి పోటీ మాటలను భరించలేకపోయాను.. నేను చేసిన నేరమేంటో నాకు అర్థం కాలేదు.. అవన్నీ భరించలేక ఇలా బయటకి వచ్చాను.. అదే ఊళ్లో అడుక్కుంటే వాళ్లకి ఇంకా భారమైపోతానని ఇలా ఈ ఊరికి వచ్చాను కానీ ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఊహించలేదమ్మా! మీ నాన్నగారు నేను ఇద్దరం ఎంతో ప్రాణంగా మెలిగాము.. ఆయన అదృష్టవంతుడు నేను ఇలా మిగిలిపోయాను" అని చెప్పి వెక్కి వెక్కి ఏడవసాగారు శాస్త్రి గారు.


బాధతో కళ్ళ నీళ్లు వచ్చాయి సుజాతకి.m అక్కడే ఉండి వింటున్న ప్రతిమకి నోట మాట రాలేదు ఇంకా లోకం తెలియని ఆపసిదానికి "ఇలా కూడా చేస్తారా" అనిపించింది..


"మాస్టారు మీరు బాధపడకండి మా వారు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాము.. అంతవరకు ఇక్కడే ఉండండి.. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పి కట్టుకోవడానికి ఒక ధోతి ఒక చొక్కా తెచ్చి ఇచ్చింది సుజాత.


ఆ బట్టలు మార్చుకొని అక్కడే దివాన్ మీద పడుకున్నారు శాస్త్రి గారు.


ఆరోజు సాయంత్రం భర్త శ్రీనివాస్ తో కలిసి శాస్త్రి గారిని ఆనంద నిలయానికి తీసుకెళ్ళింది.


అది వృద్ధాశ్రమం అని తెలుసుకున్న శాస్త్ర గారు మరింత బాధ పడిపోయారు..


" మీరు బాధపడకండి మాస్టారు లోపలికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది" అని చెప్పి శాస్త్రి గారిని లోపలికి తీసుకెళ్లారు సుజాత దంపతులు.


లోపల అంతా సందడిగా ఉంది పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉన్నారు..


కొంతమంది వృద్ధులు మూడు నుండి పదేళ్ల  వయసున్న పిల్లలకి పద్యాలు నేర్పిస్తున్నారు.. మరి కొందరు ఇంగ్లీష్ చదివిస్తున్నారు.. మరికొందరు కథలు చెబుతున్నారు ..మరికొందరు ప్రేమగా తినిపిస్తున్నారు ఇలా పెద్దవాళ్లు పిల్లలు ఆనందంగా కలిసే ఉన్నారు ఆప్రాంగణమంతా..


అదంతా చూస్తున్న శాస్త్రి గారికి ఏమి అర్థం కాలేదు అన్ని కుటుంబాలు ఇక్కడే కలిసి ఉన్నాయి..ఇది అనాథలు ఉన్నట్లుగా లేదు అని ఆశ్చర్యపోయారు..


అప్పుడు చెప్పింది సుజాత..


" మాస్టారూ! మన స్కూల్లో రమణమూర్తి అని ఒక అబ్బాయి ఉండేవాడు గుర్తుందా ?అతను స్కూల్ టాపర్ గా ఉండేవాడు అతను ఈ జిల్లా కలెక్టర్ గా పని చేశారు కొంతమంది ఇలా ఇంటి నుండి గెంటివేయబడిన వారిని చూసి ఆయన మనసు ద్రవించిపోయింది ..అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది అదే ఈ ఆనంద నిలయం ఇది వృద్ధాశ్రమం కాదు.. దీనిలోనే తల్లిదండ్రులు చెత్తకుండీలో వదిలేసిన పిల్లలు లేదా తప్పిపోయిన పిల్లలు మరియు ఇలాంటి వృద్ధులు ఉంటారు.. తల్లిదండ్రులు ప్రేమ కోల్పోయిన పిల్లలకి వీళ్ళు ఆ ప్రేమను పంచుతారు పిల్లలకు ప్రేమ కోల్పోయిన వృద్ధులకు వీళ్ళు అదే ప్రేమను తిరిగి అందిస్తారు.. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం తో వారికి బ్రతుకు భారం అనిపించడం లేదు తెల్లవారి లేచినది మొదలు నా పిల్లలకు ఇది చేయాలి అది చేయాలి అని వృద్ధులు వారి ప్రేమను పొందాలి అని పిల్లలు ఇలా తప్పించి పోతున్నారు కాలం వారికి ఇప్పుడు వారికీ ఆశా జనకంగా కనిపిస్తుంది .నిరాశ నిస్పృహ మాయమై ఆ స్థానంలో కొత్త ఊపిరి పోసుకుంది.. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను...


ఇక్కడ మొక్కుబడి భోజనం ఉండదు కొన్ని కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ఆప్యాయంగా ప్రేమగా వడ్డిస్తారు..అందులో మేముకుడా ఉన్నాము.. ఇక్కడికి వచ్చినవారు ఇంట్లో గడిపిన దానికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు...


చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని సరియైన చోటుకే తీసుకొని వచ్చానా" అని అడిగింది సుజాత.


ఆయనకు ఇదంతా చూసిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది "ఇంకా ఎంతో మంది మహనీయులు  భూమి మీద ఉన్నారు కాబట్టి లోకంలో మానవత్వం మిగిలి ఉంది" అని అనుకునీ సుజాత చేయిని గట్టిగా పట్టుకున్నారు...


అప్పుడే అక్కడికి వచ్చిన ఐదేళ్ల పిల్లవాడు..


" తాతయ్యా! నాకు కథ చెప్పవా అమ్మ నాకు కథలు చెప్పేది కానీ ఇప్పుడు అమ్మ లేదుగా నువ్వు చెప్తావా" అని చేయి పట్టుకుని అడిగాడు.


అక్కడికి వచ్చిన నిర్వాహకురాలు చెప్పింది


" ఈ అబ్బాయి తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో పోయారు.. నెల క్రితం ఆ సంఘటన జరిగింది దాదాపు చనిపోయే స్టేజికి వచ్చిన ఇతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంతమంది ప్రేమను పొంది మామూలు మనిషి అయ్యాడు" అని చెప్పింది.


వెంటనే శాస్త్రి గారు ఆ అబ్బాయి చేయి పట్టుకుని


" నేను నీకు కథలు పద్యాలు అన్నీ నేర్పిస్తాను నీ పేరేంటి రా అబ్బాయ్" అని అడిగాడు చిరునవ్వుతో..


" నా పేరు సూర్య" అని చెప్పాడు.


"ఒరే ఒరే నా పేరు పెట్టుకున్నావట్రా" అంటూ ఆ పిల్లవాడి చేయి పట్టుకుని లోపలికి నడిచారు శాస్త్రి గారు..


సుజాత అతన్ని సంతృప్తిగా చూసి" ఇంక మాస్టారికి ఏ బాధ లేదు తెలుగుని ఇంకా బాగా బతికిస్తారు" అని అనుకుంటూ బయటకు వచ్చేసింది ఆనంద భాష్పాలు రాలుస్తూ!


శుభం

సూక్ష్మంలో మోక్షం

 సూక్ష్మంలో మోక్షం... 


తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని

అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి

వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.

        మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు

అయింది.కొడుకు....కూతురు అమెరికాలో

స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు 

వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు 

ఆయన పోయాక నాకు

ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో

కాలం గడుపుతున్నాను.

     కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!

       చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్

చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.

అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.

    ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని 

గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.

అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు

నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ 

వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.

    మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.

స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు

సంతాపం తెలియ బరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి

వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి

తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు

ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు

తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి 

పోయాము.

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత

నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి

జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ 

లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా   

నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద

 ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది.  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను.తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం

అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల

 పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను

గుర్తు చేస్తూనే ఉంది.

      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో

లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే

బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత

ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది.

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి 

చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని 

శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం

అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు

ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి 

కొత్త అనుభవం.

     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం

పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి 

ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో

బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి

మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.

తన భావం గ్రహించి" సరే" అన్నాను.

         అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న

మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.

నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద

వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.

బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు

కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు

ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.

"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"

అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.

      దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.

పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ 

మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"

అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి 

ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో  గర్వంగా అనిపించింది.

       స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.నేను సోఫాలో  కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.

       స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.

మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.

      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు

కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?

చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.

నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద

ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి

సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.

       వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!! 


Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఊడటం తప్పు కాదు.🍉🍑🍅🍅రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 🙏🙏... 🙏🙏🙏

Panchang