రాయల వర్ణనా వైభవము!
గోవర్ధనగిరిధారి మురారి!
ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా
రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా
రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా
నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;
ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.
యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.
యాదవులందరు సపరివారముగా
నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.
అదీ ఇక్కడిదృశ్యము.
కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,
నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!
కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,
చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.
అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌟🌷🌷🌷🌷🌟🌷🌟🌟🌟🌟🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి