29, జూన్ 2022, బుధవారం

మన దేవబాష

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


♦️ *మనం మర్చిపోయిన మన దేవబాష కి ప్రపంచం పట్టం కట్టింది*♦️



😵😨🚩🚩🚩🚩🚩🚩 #సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది :


▪️సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.


1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే.


2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.


3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.


4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.


5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.


6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.


7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.


8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.


9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.


10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.


11. *జర్మనీ లోని 14 యూనివ ర్సిటీ లలో సంస్కృత బోధన జరుగుతోంది*.


12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్త మవుతున్నాయట. *చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు*. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థ మూ మారదు. *ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి*. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చెప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.


13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృత భాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.


14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. *అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే*.


15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధ నలలో ఋజువు పరచుకుని *ప్రస్తు తం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు*.


16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  *కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా* ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.


▪️వ్యాసభారతం చూస్తుంటే, సంస్కృతం ఎంత సుసంపన్నమైన భాషో తెలుస్తుంది. నాదృష్టిలో వ్యాసుడంతటి కవి ఈ భూమండ లం మీద పుట్టియుండ డని నా ఉద్దేశ్యం.




హరిః ఓమ్. హరిః ఓమ్.హరిః ఓమ్.

చిదానంద రూప

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*చిదానంద రూప శివోహం శివోహం*


వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి. మనసు శూన్యంగా మారాలి. నిర్మలత్వంతో నిండిపోవాలి. అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు. అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది. అతనికి ఆ స్పృహ ఉండదు. అప్పుడు అతనిలో ప్రతీదీ సహజంగా పరివర్తన చెందుతుంది. సూర్యోదయం జరిగినట్లు, చంద్రుడు  ఉదయించినట్లు, పూలు వికసించినట్లు, నది ప్రవహించినట్లు ప్రతీదీ అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది. అక్కడ అన్ని చలనంలో ఉంటాయి. అన్ని సహజంగా జరుగుతాయి. కానీ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాను అన్న అహంకారం అతనికి ఉండదు. 


kఒక ప్రాచీన రోమన్ కథ ఉంది. అది గొప్ప కథ. గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ. ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు. అతనికి ఎలాంటి స్వార్థ చింతన లేదు. ఏ కోరికలూ లేవు. ఏదో సాధించాలి అని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిర్మలంగా , నిశ్చింతగా జీవించాడు. అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది. అతను సాధారణంగా జీవించాడు. కానీ లోక దృష్టిలో అది అసాధారణం . కాంక్షలు లేని మనిషిని లోకం విచిత్రంగా చూస్తుంది. ఆ వ్యక్తి జౌన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలని సంకల్పించారు.


ఒక రోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలను చూస్తూనే అతను భక్తితో, నమ్రతతో వాళ్ళకు ప్రణమిల్లాడు. “ నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావడం నా అదృష్టం . మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి " అన్నాడు. దేవతలు " మేం నీకు ఆజ్ఞలివ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి రాలేదు. నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి! నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి. నిస్వార్థపరుడివి. నిరాడంబరుడివి. అలాంటి నీ కోసం ఏమైనా చేయాలనిపించి మేము వచ్చాం! నీకు ఇష్టమైన కోరికను కోరుకో. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాం" అన్నారు దేవతలు! 


దానికి ఆ సన్యాసి " మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు. నాకు సంబంధించిన కోరికలు అంటూ ఏమి లేవు. దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది. మీరు ఇంతగా అడుగుతున్నారు. కాదంటే బాగుండదు. కానీ నాకు ఏమి అడగాలో తెలియడము  లేదు. నేను ఊహించినవే కాదు. నేను ఊహించనవి కూడా దైవం నాకు ఇచ్చింది" అన్నాడు.


అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు. కారణం అతను కాంక్షా తీరానికి అతీతంగా ఉన్నాడన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చింది. కానీ అతనికి ఏదో చేయాలన్న తపన వాళ్ళలో పెరిగింది. " నువ్వు వద్దు అంటున్నావు. కానీ మాకు ఏదైనా నీ కోసం చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా  కోరుకో. మేం నీకు వరం ఇవ్వనిదే కదలం" అన్నారు.


సన్యాసి సంకటంలో పడ్డాడు. తప్పించుకునే వీలు లేదు. సరే! ఏం కోరాలో నాకయితే తెలియదు. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వరం ఇవ్వండి" అన్నాడు. దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి " నీకు గొప్ప వరం ఇస్తున్నాం. మరణించిన వారిని నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూర్చుంటారు" అన్నారు.! ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు. " మీరు అన్యధా భావించకండి. ఇలా చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాను అన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది. దయచేసి మీరు ఏ వరం ఇచ్చినా ఆ వరం యొక్క స్పృహ నాకు లేకుండా చేయండి" అని ప్రార్థించాడు.


ఆ మాటలు విని దేవతలు మరింతగా ఆనందించి " నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయిన అన్నీ తిరిగి బ్రతుకుతాయి" అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యారు.


వాళ్ళు వరం ఇచ్చారు.! ఆ వరం యొక్క స్పృహ ఆ సన్యాసికి లేదు. ఆయన తన పనుల్లో తాను ఉండేవాడు. ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది. చనిపోయిన ప్రాణులు బ్రతికేవి. కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు. ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు. నీడ పడిన చోట నిత్యవసంతం ఉండేది. ఆ సన్యాసి  స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలు “ మీకిచ్చిన వరం ఎంతవరకూ పని చేసింది? “ అని అడిగారు. అదేమీ తెలియదు - గుర్తించలేదు అన్నాడు తత్వజ్ఞాని. అహంకారం ఉన్నప్పుడు కాంక్షలు ఉంటాయి. అవి ఏమీ లేనప్పుడు సర్వమూ శూన్యంగా ఉంటాడు తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు. 


బంధాలు కలిపేది మాటే....

                     బంధాలు తెంచేది మాటే....

                     గాయాలు చేసేది మాటే..... 

                   గాయాలు మాన్పెది మాటే.... 

                      ప్రాణం పోసేది మాటే.....

                      ప్రాణం తీసేది మాటే.....    

                  మాటే నిన్ను గెలిపిస్తుంది.... 

                  మాటే నిన్ను ఓడిస్తుంది..... 

                  మాట్లాడే ముందు జాగ్రత్త...!!!

త్రికరణ శుద్ధితో జీవించు ! 

త్రిగుణాతీతుడవై జీవించు ! 

త్రిగుణరహితుడవై బయలున బయలై ఉండుము ! 


*కర్మలు భక్తి తో చేయవచ్చు. నిష్కామముగా చేస్తే అది, ఫలాపేక్ష లేని కర్మలు చిత్తము శుద్ధమగుటకు ఉపయుక్తమై నిరాకారమైన  పరమాత్మ స్థితిని పొందుటను అనుభూతి చెందుతారు.*


*నిర్విరామముగా నిర్వికారము - నిరాకారము అయిన పరమాత్మ యందు ఏకాగ్రత - అనన్య భక్తి - చిదానంద రూప శివోహం అనెడి స్వరూప జ్ఞానమే లక్ష్యము - లక్షణము - కోహం - సోహం - కట్ట కడపటికి నాహం - అజం - అచలం.*

నమస్కారం

 *నమస్కారం వలన కలిగే ప్రయోజనం*


*ఒక రోజు, దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు* 


*"నేను రేపు పాండవులను చంపుతాను"*


*అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది - భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు*. 


*అప్పుడు...*

*శ్రీ కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, ఇప్పుడు నాతో రండి*. 

*శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు. శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి* *నమస్కరించినప్పుడు, అతను* 

*"అఖండ సౌభాగ్యవతి భవ"* *అని ఆశీర్వదించిన తర్వాత  ద్రౌపదిని అడిగాడు !!*

*"ఏంటమ్మా?! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు? శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా"?*

*అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది* 


*"అవును తాతయ్యా.!  వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు* *నమస్కరించుకున్నారు.*

 *భీష్ముడు చెప్పాడు-*

 *"నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"*

*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు "మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"*

*"మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు -దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు" -*

*...... అంటే ......*

*ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం -*

*ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడమే.!*

*"తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు"*

*"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."*

*పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు*

*"అభ్యర్థన  ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ఇల్లు స్వర్గం అవుతుంది."*

*ఎందుకంటే:-*

*నమస్కారం ప్రేమ.*

*నమస్కారం క్రమశిక్షణ.*

*నమస్కారం చల్లదనం.*

*నమస్కారం సంస్కారాన్ని,* 

*గౌరవాన్ని నేర్పుతుంది.*

 *నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.*

*నమస్కారం నమస్కరించడం నేర్పుతుంది.*

*నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

*నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*

*నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది*.

*నమస్కారం సకల కార్యసిద్ధికి సులభ మార్గం.*

*నమస్కారం, ప్రతి నమస్కారం మన సంస్కృతి మరియు మన జీవన విధానం.*

*అందరికి నమస్కారం* 


*సేకరణ* 

🕉️🕉️🙏🙏🕉️🕉️

One liner Geeta -

  here the essence of all the 18 chapters of Gita in just 18 sentences. 


One liner Geeta - 

Will you forward and circulate this to all? Each one is requested to forward this to 100 persons in 4 days. Not only within your state but this should be forwarded to the entire India. 


One liner Geeta


*Chapter 1 - Wrong thinking is the only problem in life .*

*Chapter 2 - Right knowledge is the ultimate solution to all our problems .*

*Chapter 3 - Selflessness is the only way to progress and prosperity .*

*Chapter 4 - Every act can be an act of prayer .*

*Chapter 5 - Renounce the ego of individuality and rejoice the bliss of infinity .*

*Chapter 6 - Connect to the higher consciousness daily.*

*Chapter 7 - Live what you learn .*

*Chapter 8 - Never give up on yourself .*

*Chapter 9 - Value your blessings .*

*Chapter 10 - See divinity all around .*

*Chapter 11 - Have enough surrender to see the truth as it is.*

*Chapter 12 - Absorb your mind in the higher.*

*Chapter 13 - Detach from Maya and attach to divine .*

*Chapter 14 - Live a life- style that matches your vision.*

*Chapter 15 - Give priority to Divinity .*

*Chapter 16 - Being good is a reward in itself .*

*Chapter 17 - Choosing the right over the pleasant is a sign of power .*

*Chapter 18 - Let go, let us move to union with God .*

( Introspect on each one of this principle)

                          

                  || ॐ तत्सत् ||

అద్వైత_సత్యం

 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩      

         *అద్వైత_సత్యం*


*ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం.*


*భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం.*


*జ్ఞానం వచ్చేంత వరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది.*


*నిద్రలో కల కంటున్నంతసేపు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది.*


*ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే.*


*కాబట్టి ఏ సిద్దాంతం ఆచరిస్తున్నా చివరికి అద్వైతానికి చేరుకోవాల్సిందే. ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే.*


*కానీ రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యరూపం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా లేదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువు కుడా అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలు అదే విధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.*


*మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడుని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడు, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు*


        *శృంగేరి జగద్గురువులు*

శూన్యమాసం

 పూర్వ/ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ఆషాఢము. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు ఆధ్యాత్మికంగా గొప్పవని శాస్త్రములందు చెప్పబడింది.

ఆషాఢమాసం శూన్యమాసంగా పెళ్ళిళ్ళు మొదలైన వాటికి పనికిరాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైనది. జగమంతా వ్యాపించిన జగన్నాథుడే స్వయంగా పురుషోత్తముడిగా సుభద్రా, బలభద్రా సమేత సుదర్శన స్వాములతో కలసి ప్రజల వద్దకు వచ్చి జాతర చేసుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాస విశేషములలో ప్రధానమైనది.

ఆధ్యాత్మికతావు ఏ మాత్రం పురోగతి ఉండాలన్నా అవసరమైన గురువులను పూజించుకునే గురుపూర్ణిమ, చాతుర్మాస్యవ్రత ప్రారంభం, కర్కాటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకొని ఉన్నది ఈ మాసం.

శరన్నవరాత్రులు, వసంతనవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవి. ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తిరూపమైన వారాహీదేవిని పూజించడం సంప్రదాయం. దానాలలో ఈ నెలలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


ఈమాస ప్రారంభం నుండి రైతులకు ఆశాజనకంగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. కనుకనే ‘ఆషాఢస్య ప్రథమ దివసే” అని కాళిదాసు మేఘసందేశాన్ని ఆషాఢమాసంలో వచ్చే మేఘంతోనే ప్రారంభించారు.