18, మార్చి 2023, శనివారం

ఈ పద్యం చదవగలరేమో

 *మీరు తెలుగు వారేనా అయితే ఈ పద్యం చదవగలరేమో ట్రై చెయ్యండి.*


టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 

త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!


డమరుగజాత డండడమృడండ

మృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడ

డండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతి

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన 

"డ"కారనుత బసవేశ పాహిమాం!


ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం

మృణఢంమృణ ఢంఢణోద్ధణం

ధణనటన త్వదీయడమరూత్థ

మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రుటితాభ్రతార గణరాజ 

దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం!


ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ

ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ

విక్రమ జృంభణ సంచలన్నభో

ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 

ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన 

"ణ"కారనుత బసవేశ పాహిమాం!


*మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు* *"అక్షరాంకపద్యముల" నుండి సేకరణ*.


*రాలేదా అయితే ఈ  వీడియో లో వినండి.*

ప్రజా ప్రయోజనాలపై

 శ్లోకం:☝️

*ప్రజాసుఖే సుఖం రాజ్ఞః*

 *ప్రజానాం చ హితే హితం ।*

*నాత్మప్రియం హితం తస్య*

 *ప్రజానాం తు ప్రియం హితం ।।*

  - అర్థశాస్త్రం


భావం: రాజుకు తన సొంతానికంటూ సుఖము, సంతోషము ఉండవు. ప్రజల సుఖమే రాజుకు సుఖం మరియు ప్రజల సంతోషమే రాజుకు సంతోషం. అతనికి ప్రజా ప్రయోజనాలపై మాత్రమే ఆసక్తి ఉంటుంది (ఉండాలి). అతనికి ఇష్టమైనది గాని ప్రయోజనకరమైనది ఏమీ ఉండదు. ప్రజలకు ఏది హితమో, ఏది ప్రయోజనకరమైనదో అదే అతనికి ఇష్టమైనది, దానియందే అతనికి ఆసక్తి (ఉండాలి - అంటున్నాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో).

అవధూత లీల*

       *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం 8

                 అమృతవాక

                  భాగము 03



ఒకప్పుడు గుత్తా నరసమ్మకు మోకాలు నొప్పి చేసి బాధ పెట్టింది. కాలు ముడవలేక పోయింది. శ్రీస్వామివారి విభూతి పూసినా తగ్గలేదు. 'స్వామీ! మనకు అన్నం వండే సరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉన్నది. అని శ్రీస్వామివారికి చెబితే 'ఇంకెప్పటికీ రాకుండా చీటి వ్రాసి ఇవ్వండయ్యా!! అన్నారు. శ్రీస్వామివారి సేవకులు అలాగే చీటి వ్రాసి ఆమెకు ఇచ్చారు. అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణైంది.


ఒకరోజు శ్రీస్వామివారు తనకు మంత్రించమని గోలచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న శ్రీస్వామివారు అలా ఎందుకు అంటున్నారో భక్తులకర్థం కాలేదు. కొంతసేపటికి తూపిలి పిచ్చెమ్మకు పాము కరచి శ్రీస్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు. సర్వజ్ఞులైన శ్రీస్వామివారు తన భక్తురాలి బాధను తొలగించుటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు. ఏ మందూ లేకుండా శ్రీస్వామివారి విభూతితోనే నయమైంది.


గొలగమూడి కరణం సుబ్బారావు గారి భార్య శకుంతలమ్మ గారు చాలా కాలం ఉబ్బసంతో బాధపడుతుండేది. ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు. వేలకొద్ది డబ్బు ఖర్చు చేశారు. ఈషణ్మాత్రం తగ్గలేదు. ఇక లాభం లేదని ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగమూడి వచ్చి శ్రీ వెంకయ్యస్వామివారికి విన్నవించుకున్నారు.


'20 రోజులలో తగ్గిపోతుంది. మీరు గొలగమూడిలో నివసించే ఇల్లు వదలి పోవద్దు. మీ స్థిరనివాసమైన అనికేపల్లి పదలి గొలమూడిలోని పూరిపాకలోనే స్థిరంగా ఉండండి. నేను చెప్పినదాకా గట్టి ఇల్లు కట్టవద్దు. అని చెప్పారు శ్రీస్వామివారు. అలానే చేస్తే శ్రీస్వామివారు చెప్పిన టైముకు అన్ని సంవత్సరాలు బాధించిన ఉబ్బసం అంతులేకుండా పోయింది.


1981వ సంవత్సరంలో తుఫాను వల్ల గొలగమూడిలోని ఆ పూరిపాక కూలిపోయింది. ఆ స్థలంలోనే ఇల్లు కట్టే ప్రయత్నంలో శ్రీస్వామివారికి చెప్పకుండానే ఇల్లు వేసుకున్నదాకా అనికేపల్లిలోని వారి పాత మిద్దెలో తాత్కాలికంగా ఉండేందుకు వెళ్లారు. మరలా జబ్బు చేసింది. ఈసారి ఆపరేషన్ చేయించవలసివచ్చింది. మరలా శ్రీస్వామివారికి చెప్పుకుంటే 'ఈ పూరింటిలోనే ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది'. అని వ్రాయించి ఇచ్చారు. వారు అలానే చేశారు. శ్రీస్వామివారి కృపవలన మరలా ఆ జబ్బు కనిపించలేదు. కనుకనే కృతజ్ఞతతో ప్రతినిత్యం పూజాద్రవ్యములు తెచ్చి స్వామివారు దేహత్యాగం చేసినచోట శ్రీస్వామివారు ప్రతిష్టించిన పాదుకలను పూజిస్తుంటారు. అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేయాలంటే అది ఒక్క సద్గురునికే తగును కదా!


పెద్ద గోపారం నుండి 1979 ప్రాంతంలో ఒకామె శ్రీస్వామివారి దర్శనార్థం వచ్చింది. ఆమెకు 22 సం||ల కుమారుడుండేవాడు. అతనికి 2 సం॥లకు పూర్వం మనస్సు స్థిమితం తప్పి పిచ్చిపట్టింది. ఆ యువకుని తమ వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు. క్రమేణా పిచ్చి తగ్గి స్వస్థుడయ్యాడు. ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీస్వామివారికి నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది... మిగిలిన భాగము రేపటికి...


*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదుకలను శరణు కోరుతూ 


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   అఖండానందస్వామి నన్ను ఆశీర్వదించక ముందు ఆ క్షేత్రంలో నా ముఖం చూచిన వాడే లేడు. అన్నం తిన్నానో లేదో, నేను ఎక్కడ రాత్రి నిద్రించానో అడిగినవాడే లేడు. ఈ ఆదరణంతా స్వామి ఆశీర్వచనం యొక్క పర్యవసానమే. కాని దానికి కారణం నేను సాయిని స్మరించడమేనా అన్న ప్రశ్న మిగిలిపోయింది. సాయంత్రమయ్యాక గదా దాని సంగతి తేలేది అని సాయికి చెప్పుకున్నాను. రాత్రికి గూడ నాకు భోజనము, వసతి లభించకపోతే ఇప్పుడు ఈ భక్తులు వలకపోసిన ఆప్యాయతంతా కేవలం కాకతాళీయమే అవుతుంది అనుకున్నాను. రోజూలాగే మధ్యాహ్నానికి ప్రవచనం ముగిసింది. ఆకలి దహించుకు పోతుంటే బిస్కెట్లు, టీలతో కడుపు నింపుకోడానికి గేటు బయటకు వచ్చాను. వాటిని తల్చుకుంటే వెగటనిపిస్తున్నది. అలాగే పోయి ఆ స్టాలు ముందు కూర్చొని టీ, బిస్కెట్లు ఇవ్వమని ఆ స్టాల్ వానిని అడిగాను. వెంటనే ఆ ప్రక్కనున్న వ్యక్తి వారించి, 'మీకు భిక్ష మా ఇంటి నుండి వస్తున్నది. ఆలస్యమేమీ లేదు' అని చెప్పాడు.


**********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

మండపం ఖాళీ చెయ్యండి

:


 మండపం ఖాళీ చెయ్యండి


కర్ణాటక రాష్ట్రంలో హంపికి దగ్గర్లోని తుంగభద్రా నది ఒడ్డున గల ఆనెగొందిలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యపు ఆనవాళ్ళు మనకు ఇక్కడ ఇప్పటికి కనిపిస్తాయి. ఇక్కడే శ్రీరాముడు బాణంతో వాలిని సంహరించాడని చెబుతారు. అలాగే మధ్వులకు పరమపవిత్రమైన నవబృందావనం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదీ మధ్యభాగంలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపంపై మధ్వ సంప్రదాయంలోని ఆచారపురుషులవి తొమ్మిది బృందావనాలు ఉన్నాయి. ఇది మధ్వుల కాశి. కనుక ఎక్కువ సంఖ్యలో మధ్వులు ఇక్కడకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. 


హొస్పేట్ పట్టణంలో చింతామణి మఠం ఆధ్వర్యంలో అన్నపూర్ణా ఆలయం ఉంది. పరమాచార్య స్వామివారి ఆదేశం ప్రకారం అన్నపూర్ణకు లడ్డూలతో అలంకారం చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలప్పుడు హఠాత్తుగా మహాస్వామివారు వంట చేస్తున్న మండపాన్ని అత్యవసరంగా ఖాళీ చెయ్యవలసిందని ఆదేశించారు. మొత్తంగా ఖాళీ చేసి, అన్నపూర్ణ దేవాలయం పక్కకు మార్చమని చెప్పారు. “ఆ వంట గదిలో ఒక పిల్లి దాని పిల్లలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బయటకు పంపండి” అని ఆజ్ఞాపించారు. 


మండపం ఖాళీ చేసిన అరగంటలోపే కారణాంతరాల వల్ల మెల్లగా కూలిపోయింది. మహాస్వామివారు పిల్లి, పిల్లి పిల్లలతో సహా అందరినీ రక్షించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- టి.యన్. సుప్పిరమణి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం



: తిరుమల : మాడ వీధి అంటే ఏమిటి


తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.


తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది


ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు


శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.


తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.

వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు


1.తూర్పు మాడ వీధి.


ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి.

శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.


ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న

(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు


ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.


క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.


మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.


2.దక్షిణ మాడ వీధి


ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది


ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.


దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.


3.పడమర మాడ వీధి.


ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి

ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.


4.ఉత్తర మాడ వీధి.


ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా

పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.


ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి

స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది

తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి

తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.


ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.

ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.


ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.


తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా..

మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా..

ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!

హనుమాన్ చాలీసా

 హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁


1. చాలీసా" అంటే ఏమిటి? 

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక 

చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)


2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?

జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు 

అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.* 


3. ఆంజనేయ - అర్థం?

జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక

ఆంజనేయుడు అని పేరు.


4. తులసీదాస్ అసలు పేరు ?

జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం

స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే 

మరి సువర్చల ఎవరు?

జ. దేవుళ్ళ భార్యలను, మానవ

సంబంధాల దృష్ట్యా చూడరాదు.

భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి,         సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల

వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల"

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం

మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?

జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 

హనుమంతుని స్మరించటం వలన

మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ.అంటారు కదా

అసలు సూర్యుడు తిరగడు కదామరి?

జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి

నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని

తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


8. హనుమంతుని పంచముఖములు ఏవి?

జ. హనుమ శివాంశ సంభూతుడు.

శివుని పంచముఖములు,హనుమంతునిలో

ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః

వచ్చినది అది సద్యోజాత శివవదనము.

దక్షిణం వైపు నార సింహం.

అది శివుని వామదేవ ముఖం.

రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం.       వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.

ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 

ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. 

అది శివుని ఈశాన ముఖం .

వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది    


9. "జయ" హనుమాన్ అని

హనుమకి జయం చెప్పడమేంటి?

జ. ఎవరైనా ఏది సాధించడానికి 

( పురుషార్థాలను) పుట్టారో అది

సాధించడమే జయం అంటే. జయం

అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం.

దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.


10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?

జ.126 సం.జీవించాడు.


శ్రీరామదూతం శిరసా నమామిః🙏

సర్వేజనాసుఖినోభవంతు 🙏

పరమాచార్య

 పరమాచార్య వారి ఆహార నియమాలు..

పరమాచార్య వారి ఆహార, విహార నియమాలు గమనిస్తే వారి స్థిత ప్రజ్ఞత మనకు స్పష్టంగా తెలుస్తుంది.

స్వామి వారు సంవత్సరం లో సగం రోజులు ఆహారమే తీసుకొనరు.

నవరాత్రులు తొమ్మిది రోజులు కటిక ఉపవాసం.ప్రతి ఏకాదశి ఉపవాసమే కాక ఆ తరువాత రోజు సాయంకాలం త్రయోదశి అయితే అభిషేకం ఉంటుంది కాబట్టి ఉపవాసం.ఆ తరువాతి రోజు యాదృచ్చికంగా శుక్రవారం వారం వస్తే నవా వరణ పూజ ఉంటుంది కాబట్టి ఆహారం తీసికోరు. ఇవన్నీ అయిన తరువాత పౌర్ణమి వస్తుంది. ఆ రోజు అభిషేకం, నవావరణ పూజ.

ఇవన్నీ కాక నైతిక విషయాలలో కొన్ని ఉపవాసాలు ఉండేవి.1926 లోను 1953లోను కొన్ని మాసాలు ఉపవసిం చేవారు.

పోనీ విశ్రాంతి తీసుకుంటారా అంటే రాత్రి పదకొండు, పన్నిండు గంటల వరకు ఏవో కార్యక్రమాలు ఉండేవి. పడక చూద్దామంటే చాలా రోజులు మేనాలోనే పడుకునే వారు. మేనా ఎలా ఉంటుందంటే కాళ్ళు జాపు కోవడానికి వీలుండదు. దానినిండా పుస్తకాలు ఉండేవి.విశ్రాంతి లో కూడా మత్యాసనం లోనే ఉండేవారు.రెండు, మూడు గంటలకు తిరిగి వారి కార్యక్రమాలు మొదలు.

సరే.. ఇక భిక్ష స్వీకరించే రోజుల్లో సహితం పద్నాలుగు సంవత్సరాలకు ఉప్పు, చింతపండు, మిరపకాయలు వాడడం మానివేశారు. చప్పిడి భోజనం స్వీకరించేవారు.

కొన్ని రోజులు బిల్వ దళాలు, వేపచిగురు తో గడిపేవారు. కొంత కాలం మూడే మూడు గుప్పిళ్ళు అన్నం తీసుకొనేవారు.

ఆంధ్ర పర్యటన కాలంలో (1967-69)స్వామి వారు పెరుగులో నానబెట్టిన పేలాలు తీసుకొనేవారు. ఇలా ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించే ఒక సన్యాసి పేలాలు కూడా జీవహీంసే కదా. (బీజాన్ని వేయిస్తున్నారు కదా ) అని ఆక్షేపించేసరికి పేలాలు కూడా మానేసి అరటిపండ్ల పొడి ఆవు పాలతోనో, పళ్ళ రసం తోనో కలిపి ఇడ్లీ ల వలె ఉడకపెట్టి స్వీకరంచే వారు.

చివరి సంవత్సరాలలో ఇదే స్వామి వారి భిక్ష. ఒక్క అన్న ద్వాదశి నాడు మాత్రమే అన్న భిక్ష స్వీకరించేవారు.

ఎవరైనా "మీరు చాలా దుర్భలం గా ఉన్నారు "అంటే స్వామి నవ్వుతూ "పసివాడు బొద్దుగాను సన్యాసి వడలి పోయి ఉంటేనే అందం."అనేవారు

****ఆధునిక వైజ్ఞాన పరంగా ఆలోచిస్తే వారు చేసే పనికి వారు తీసుకొనే క్యాలోరిలు సరిపోవు.వారి బలం యోగికమైనది. లౌకికమైనది కాదు.

మంచి విషయాలు

 మంచి విషయాలు:-

*పుణ్యములు:* దేవునియందుభక్తిగలుగుట మనస్సు చేసిన పుణ్యము, దేవుని పూజించుట చేతులు చేసిన పుణ్యము దేవాలయమునకు బోవుట కాళ్లుచేసిన పుణ్యము, దేవుని జూచుట కన్నులు చేసిన పుణ్యము దేవుని కథలు వినుట చెవులు చేసిన పుణ్యము దేవునికి వందనము చేయుట శిరస్సు చేసిన పుణ్యము.



*దారిద్ర్యములు:* దరిద్రుని తల్లి తప్పులు చెప్పును భార్యయును లక్ష్యపెట్టదు., నోటవచ్చు మాటలన్నీ విపరీతముగాతోచును, తీరని దుఃఖముననుభవించును. సభలోకిబోవ సంకోశపడును, భాగ్యవంతుని యెదుట నిలువ భయపడును, శౌర్యము సన్నమగును, ఇంటికివచ్చిన చుట్టములు యమదూతల వలెనగుపడుదురు, పెత్తనముదక్కదు, ఎవరితోనేమి చెప్పికొనినను మారుత్తరముబుట్టదు, అందరునపహసింతురు.

 .

               _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లో𝕝𝕝 

*అర్థార్థీ యాని కష్టాని*

 *మూఢోఽయం సహతే జనః।*

*శతాంశేనాపి మోక్షార్థీ*

 *తాని చేన్మోక్షమాప్నుయాత్॥*


తా𝕝𝕝 

*ఈ మూర్ఖుడైన మానవుడు ధనం సంపాదించేందుకు ఎన్ని కష్టాలు సహిస్తున్నాడో, అందులో నూరవభాగం కష్టాలనైనా మోక్షం సంపాదించేందుకై భరిస్తే తప్పక మోక్షం పొందగలడు*....."

            -: