18, మార్చి 2023, శనివారం

అవధూత లీల*

       *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం 8

                 అమృతవాక

                  భాగము 03



ఒకప్పుడు గుత్తా నరసమ్మకు మోకాలు నొప్పి చేసి బాధ పెట్టింది. కాలు ముడవలేక పోయింది. శ్రీస్వామివారి విభూతి పూసినా తగ్గలేదు. 'స్వామీ! మనకు అన్నం వండే సరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉన్నది. అని శ్రీస్వామివారికి చెబితే 'ఇంకెప్పటికీ రాకుండా చీటి వ్రాసి ఇవ్వండయ్యా!! అన్నారు. శ్రీస్వామివారి సేవకులు అలాగే చీటి వ్రాసి ఆమెకు ఇచ్చారు. అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణైంది.


ఒకరోజు శ్రీస్వామివారు తనకు మంత్రించమని గోలచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న శ్రీస్వామివారు అలా ఎందుకు అంటున్నారో భక్తులకర్థం కాలేదు. కొంతసేపటికి తూపిలి పిచ్చెమ్మకు పాము కరచి శ్రీస్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు. సర్వజ్ఞులైన శ్రీస్వామివారు తన భక్తురాలి బాధను తొలగించుటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు. ఏ మందూ లేకుండా శ్రీస్వామివారి విభూతితోనే నయమైంది.


గొలగమూడి కరణం సుబ్బారావు గారి భార్య శకుంతలమ్మ గారు చాలా కాలం ఉబ్బసంతో బాధపడుతుండేది. ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు. వేలకొద్ది డబ్బు ఖర్చు చేశారు. ఈషణ్మాత్రం తగ్గలేదు. ఇక లాభం లేదని ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగమూడి వచ్చి శ్రీ వెంకయ్యస్వామివారికి విన్నవించుకున్నారు.


'20 రోజులలో తగ్గిపోతుంది. మీరు గొలగమూడిలో నివసించే ఇల్లు వదలి పోవద్దు. మీ స్థిరనివాసమైన అనికేపల్లి పదలి గొలమూడిలోని పూరిపాకలోనే స్థిరంగా ఉండండి. నేను చెప్పినదాకా గట్టి ఇల్లు కట్టవద్దు. అని చెప్పారు శ్రీస్వామివారు. అలానే చేస్తే శ్రీస్వామివారు చెప్పిన టైముకు అన్ని సంవత్సరాలు బాధించిన ఉబ్బసం అంతులేకుండా పోయింది.


1981వ సంవత్సరంలో తుఫాను వల్ల గొలగమూడిలోని ఆ పూరిపాక కూలిపోయింది. ఆ స్థలంలోనే ఇల్లు కట్టే ప్రయత్నంలో శ్రీస్వామివారికి చెప్పకుండానే ఇల్లు వేసుకున్నదాకా అనికేపల్లిలోని వారి పాత మిద్దెలో తాత్కాలికంగా ఉండేందుకు వెళ్లారు. మరలా జబ్బు చేసింది. ఈసారి ఆపరేషన్ చేయించవలసివచ్చింది. మరలా శ్రీస్వామివారికి చెప్పుకుంటే 'ఈ పూరింటిలోనే ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది'. అని వ్రాయించి ఇచ్చారు. వారు అలానే చేశారు. శ్రీస్వామివారి కృపవలన మరలా ఆ జబ్బు కనిపించలేదు. కనుకనే కృతజ్ఞతతో ప్రతినిత్యం పూజాద్రవ్యములు తెచ్చి స్వామివారు దేహత్యాగం చేసినచోట శ్రీస్వామివారు ప్రతిష్టించిన పాదుకలను పూజిస్తుంటారు. అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేయాలంటే అది ఒక్క సద్గురునికే తగును కదా!


పెద్ద గోపారం నుండి 1979 ప్రాంతంలో ఒకామె శ్రీస్వామివారి దర్శనార్థం వచ్చింది. ఆమెకు 22 సం||ల కుమారుడుండేవాడు. అతనికి 2 సం॥లకు పూర్వం మనస్సు స్థిమితం తప్పి పిచ్చిపట్టింది. ఆ యువకుని తమ వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు. క్రమేణా పిచ్చి తగ్గి స్వస్థుడయ్యాడు. ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీస్వామివారికి నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది... మిగిలిన భాగము రేపటికి...


*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదుకలను శరణు కోరుతూ 


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   అఖండానందస్వామి నన్ను ఆశీర్వదించక ముందు ఆ క్షేత్రంలో నా ముఖం చూచిన వాడే లేడు. అన్నం తిన్నానో లేదో, నేను ఎక్కడ రాత్రి నిద్రించానో అడిగినవాడే లేడు. ఈ ఆదరణంతా స్వామి ఆశీర్వచనం యొక్క పర్యవసానమే. కాని దానికి కారణం నేను సాయిని స్మరించడమేనా అన్న ప్రశ్న మిగిలిపోయింది. సాయంత్రమయ్యాక గదా దాని సంగతి తేలేది అని సాయికి చెప్పుకున్నాను. రాత్రికి గూడ నాకు భోజనము, వసతి లభించకపోతే ఇప్పుడు ఈ భక్తులు వలకపోసిన ఆప్యాయతంతా కేవలం కాకతాళీయమే అవుతుంది అనుకున్నాను. రోజూలాగే మధ్యాహ్నానికి ప్రవచనం ముగిసింది. ఆకలి దహించుకు పోతుంటే బిస్కెట్లు, టీలతో కడుపు నింపుకోడానికి గేటు బయటకు వచ్చాను. వాటిని తల్చుకుంటే వెగటనిపిస్తున్నది. అలాగే పోయి ఆ స్టాలు ముందు కూర్చొని టీ, బిస్కెట్లు ఇవ్వమని ఆ స్టాల్ వానిని అడిగాను. వెంటనే ఆ ప్రక్కనున్న వ్యక్తి వారించి, 'మీకు భిక్ష మా ఇంటి నుండి వస్తున్నది. ఆలస్యమేమీ లేదు' అని చెప్పాడు.


**********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: