5, సెప్టెంబర్ 2020, శనివారం

సంకష్టహర చతుర్థి

సంకష్టహర చతుర్థి :
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్ట చతుర్థి/ సంకష్టహర చతుర్థి అంటారు.సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడువు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి .మనసులోని కోరికను తలచుకొని మూఁడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జురాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులో నీ కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి .సంకటనాశన గణేశ స్తోత్రం సంకష్ట హర చతుర్థి వ్రత కథను చదవవలెను ఆ మటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి.తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి ౩లేక 5 లేక 11 లేక 21 ప్రదక్షణలు చేయాలి .శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమము కానీ చేయించుకోవచ్చు.సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కడపరాదు.సూర్యుడు అస్తమించాక స్నానం చేసి దీపం వెలిగించాక తిరిగి వినాయకుడికి లఘువు పూజ చెయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.ఈ వ్రతం చేయటం వలన ధన ప్రాప్తి,పుత్రప్రాప్తి,అరోగ్య ప్రాప్తి,విద్య ప్రాప్తి అంతే కాకుండ చాల పుణ్యం పొందు తారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా స్వనంద వెడతారనీ అక్కడ భగవంతుని ఆశీస్సులవల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అంటారు.

గురు పూజ

గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలతో
పోపూరి అరుణశ్రీ

తనువిచ్చి పోషించు తల్లిదండ్రులు నాకు
ప్రధమ గురువులని ప్రణుతి సేతు
పాఠాలు జీవిత పాఠాలు నేర్పిన
బడిలోని వేల్పుల ప్రణుతి సేతు
వేదసారమిడిన బాదరాయణుడన
వ్యాస దేవుని కివే వందనములు
అద్వైత సారమ్మునందజేసిన యట్టి
ఆది శంకరులకేనంజలింతు

అవతరించినంత నాదిదేవుడయిన
కోరి విద్య నేర్చె గురువు వద్ద
అంతరంగమందు నంధకారము పోవ
గుఱియు గతియు మనకు గురువు కాదె

చిన్నప్పుడు

చిన్నప్పుడు , అంటే ఓ పెంకుటిల్లూ, పెరడూ, ముందు వాకిలీ, పెరట్లో ఓ పశువులపాకా, ఓ గడ్డిమేటూ , నీళ్ళకి ఓ నుయ్యీ లాటివి ఉన్నరోజుల్లో అన్నమాట, ఇంటికి ఎవరైనా చుట్టాలో, స్నేహితులో చెప్పాపెట్టకుండా వచ్చినా, సంతోషించే రోజులు. వచ్చీ రాగానే, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళూ , తుడుచుకోడానికి ఓ తువ్వాలూ ఇచ్చి, త్రాగడానికి ఓ మరచెంబులో మంచినీళ్ళూ, ఓ స్థోమతని బట్టి, కంచుగ్లాసో, ఇత్తడి గ్లాసో ఇచ్చేవారు. భోజనాల వేళ అయితే, భోజనానికి లేవమనేవారు. ఇంత తక్కువ టైములో, ఆ వచ్చినవారికి, భోజనంలోకి ఏదో, ఓ కూరా, పచ్చడీ లేకుండా భోజనం ఎలా పెడతారూ? ఆ ఇంటి ఇల్లాలుకి ఏవిధమైన కంగారూ ఉండేది కాదు. ఈరోజుల్లోలాగ , అతిథులు రాగానే, బజారుకి వెళ్ళి కూరా, నారా తెచ్చుకోడం కాదుకదా, హాయిగా పెరట్లో కి వెళ్ళి, సరిపడే వంకాయలో, పొట్లకాయలో, బీరకాయలో కోయడం, పప్పులోకి ఏ నవనవలాడే ఏ బచ్చలాకులో, గోంగూరాకులో, తుంపడం. పోపులోకి మిరపకాయలూ, కొత్తిమీర కి ఆలోచించాల్సిన పనే ఉండేది కాదు.ఊరగాయలైతే చెప్పఖర్లేదు. చిత్రం ఏమిటంటే, పుష్కలంగా అన్నీ దొరుకుతూన్న రోజుల్లో, మనం, వాటిని అనుభవించడానికి , ప్రతీ రోజూ చిరాకు పడేవాళ్ళం. “ అబ్బ ప్రతీ రోజూ ఇవేనా.. “ అని. ఆరోజుల్లో ఉండీ అనుభవించలేదు, ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు. అందుకేనేమో “ చేసికున్నవాడికి చేసుకున్నంతా.. “ అంటారు.
ఈ రోజుల్లోలాగ ఇళ్ళల్లో ఫ్రిజ్జిలూ, డీప్ ఫ్రిజ్జిలూ, మైక్రో వేవ్ లూ ఉండేవి కావు. గ్యాస్ పొయ్యి అంటే ఏమిటో తెలియని రోజులు. అయినా షడ్రసోపేతంగా భోజనం పెట్టేవారు. “ అన్నదాతా సుఖీభవా..” అని నోరారా, మనసారా దీవించే రోజులు. పెరట్లో ఉండే ఆ మొక్కలు పెంచడం కూడా ఓపధ్ధతిలో ఉండేది. స్నానాలు చేసేటప్పుడు వచ్చే నీళ్ళకి, ఓ బుల్లి కాలవలాటిదిచేసి, ఆ మొక్కలకి వెళ్ళేటట్టు చేసేవారు. ఆనపకాయ, గుమ్మడికాయలకైతే, ఏ పశువులపాక మీదకో పాకించేవారు. ఎరువులూ, పురుగుమందులూ అంటే ఏమిటో కూడా తెలియని రోజులు. ఓ దొండపాదో, బీరపాదో ఉందంటే , నాలుగు కర్రలతో, చక్కగా ఓ పందిరిలాటిది వేయడమూ, ఆ పాదుని దానిమీదకు పాకించడమూ. ఉదయానే లేచి, పళ్ళు తోముకోడానికి , బ్రష్షులూ, పేస్టులూ ఎక్కడ చూశామూ? మహా అయితే, నంజన్ గూడు వారి ఎర్ర పళ్ళపొడీ, లేకపోతే హాయిగా “కచిక”. ప్రయాణాల్లో అయితే ఓ వేప్పుల్లా. ఎప్పటికప్పుడు కల్తీలేని పాలూ, తాజా కూరగాయలూ, వీటితోనే రోగాలూ, రొచ్చులూ లేకుండా హాయిగా బతికేవారు. వీటికి సాయం, పచ్చదనంతో ఉండే చెట్ల గాలికూడా, ఆరోజుల్లో ఆరోగ్యానికి దోహదపడేది.. వర్షాలూ, టైముకే వచ్చేవి.
వేసవి కాలం వచ్చిందంటే, ఇంటి ముందర, కొబ్బరాకులతో ఓ పందిరీ, ఇంట్లో , అటక కింద ఓ సరంబీ, కిటికీలకి వట్టివేళ్ళ తడకల ముందు, ఈరోజుల్లో వచ్చే ఏసీ లు ఏ మూలకీ ? అభివృధ్ధి పేరు చెప్పి మనం ఎన్నో, ఎన్నెన్నో పోగొట్టుకున్నాము. అలాగని అభివృధ్ధి లేకుండా, ఎక్కడి గొంగళీ అక్కడే ఉండాలని కాదు. టెక్నాలజీ తోపాటు, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ఉండాలి. ఈరోజుల్లో ప్రతీదానికీ ఓ ఆటోమేటిక్ సదుపాయం ఉంది. మంచిదే, కానీ, రోజులు గడిచేకొద్దీ, జనాలు వాటిమీదే పూర్తిగా ఆధారపడే రోజులొచ్చాయి. వారానికోసారి కూరలు తెచ్చేసికుని, వాటిని ఇంట్లో ఉండే, బుల్లి, చిన్న, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్ ఫ్రిజ్జిల్లో ఉంచేసికుంటే పనైపోతుందనుకుంటారు. కానీ అవి పనిచేయడానికి ఎలెక్ట్రిసిటీ ఉండాలిగా. ఈరోజుల్లో ఎక్కడ చూసినా, లోడ్ షెడ్డింగులూ, అవీనూ. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు. మరి ఇంక, ఆ ఫ్రిజ్జిల్లో పెట్టిన కూరగాయలూ, పాలూ, పెరుగూ పాడైపోకుండా ఉండమంటే, ఎలా ఉంటాయీ ? తీరా ఏ కూరో చేద్దామని చూస్తే, అవి కాస్తా కుళ్ళిపోయో, బూజుపట్టో కనిపిస్తాయి. మన ఇళ్ళల్లో వచ్చే మంచినీళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. దానితో ఇంట్లో ఓ వాటర్ ప్యూరిఫయరు తప్పకుండా ఉండాలే.
ఈ మధ్యన ఓ కొత్తరంధి మొదలయింది. అవేవో “ ఆర్గానిక్ కూరలు “ ట. కొనేవాళ్ళున్నారు కదా అని, ప్రతీదీ—కూరగాయల దగ్గరనుండి, పప్పులూ, ఉప్పులూ, చింతపండూ, బెల్లంతో సహా ప్రతీదానికీ ఓ లేబుల్ పెట్టేసి, అయిదారింతల ఖరీదు పెంచేయడం. వాడు లేబులంటే అంటించాడు కానీ, నిజంగా ఏ ఎరువూ వాడకుండా తయారుచేశాడని గ్యారెంటీ ఏమిటీ ? వాడు చెప్పాడు, అందరూ కార్లలో వచ్చో, ఆన్ లైన్ లోనో కొనుక్కుంటున్నారు, బస్ . పర్యావరణమూ అలాగే తయారయింది. ఊరికే, టీవీ ల్లోనూ, Social Media లోనూ ఊదరగొట్టడం తప్పించి, జరుగుతున్నదేమీ లేదు. అయినా అన్నీ బాగుండి, అందరూ ఆరోగ్యంగా ఉంటే, కోట్లు ఖర్చుపెట్టి తెరిచిన కార్పొరేట్ ఆసుపత్రులు బతకొద్దూ ?

భమిడిపాటి ఫణి గారు నుంచి సేకరణ

అతడు... అగ్రహారం ఆయుధం





‘‘ ఏరా... ఏవూరేటి మనది. గొబ్బరి కాయలు ఎన్నాళ్ల నించి సేతున్నారేటి వీ దొంగతనాలు.. మా తోటలోయేనా... ఇంకెవరి తోటలోయేనైనా అట్టుకుపోతున్నారా’’

‘‘ మీరేనా.. వింకా తొత్తు కొడుకులున్నారా... ’’

‘‘బామ్మర్ల తోట కదా.. ఎవడూ అట్టుకోరనుకున్నారా’’

‘‘ ఇన్ని అడుగుతూంటే మాటాడేరేటి’’

‘‘ఇలా కాదురా... నాలుగు తగిలించాలి. ఆనక పొలీసోళ్లకి వప్పగించాలి. మంచిగా అడిగితే మీరు సెప్పరు’’

అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలైంది. డిగ్రీ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిలు తప్ప మాలాంటి నిక్కరు బ్యాచీ ఇంకా పక్కల మీంచి లేవలేదు. ఐదుగురు జమాజెట్టీల్లాంటి మనుషుల్ని తలో కొబ్బరి చెట్టుకీ కట్టేసి...

చేయి చేసుకోవడం లేదు కాని... నిజం చెప్పించే పనిలో బెదిరిస్తున్నాడు ఆ తోట కాపాలాదారు మరిడయ్య. 

అది ప్లీడరు గిరి చేస్తున్న వాడ్రేవు రాజబాబు ఇల్లు. వాడ్రేవు మహదేవుడి గారి ఆఖరి కుమారుడు రాజబాబు. ఆ ఇల్లు పావు ఎకరంలో ఉండేది. దాని వెనుక ఓ రెండూ, రెండున్నర ఎకరాల కొబ్బరి తోట. అందులోనే అంతర పంటలాగా కొన్ని మామిడి చెట్లు, అరటి తోట ఉండేది. మొక్కజొన్న కూడా ఉండేది కాని అది సీజన్ లోనే. ఆ తోటకి కాపాలాదారు మరిడయ్య. వాడ్రేవు రాజబాబుగారి తండ్రి మహదేవుడు గారు ఉన్నప్పటి నుంచీ అతనే కాపలాదారు. కాదు... కాదు... ఆ ఇంటి మనిషి. నిజానికి మరిడయ్య ఆ ఇంటికే కాదు.... మొత్తం అగ్రహారానికి కాపాలాదారుడు.

మరిడయ్య... దేహమంతా నల్లగా... కళ్లు మాత్రం ఎర్రగా... కాసింత కాలిన బొగ్గు ముక్కలా ఉండేవాడు.

మరిడయ్య... పాదాలకు జోళ్లు కావాలంటే ప్రత్యేకంగా విజయవాడలో తయారయ్యే పాపులర్ షూ మార్టుకో.. ప్రజా షూ కంపెనీకో ఆది (సైజ్) పంపించి పురవాయించాలి. అదంతా చేయడం కష్టం కాబట్టి మరిడయ్య కాళ్లకి జోళ్లు ఎప్పుడూ వేసుకోలేదు.

మరిడయ్య.. పాదాల వేళ్లు వర్షాకాలంలో బయటకు వచ్చిన కొబ్బరి చెట్టు వేర్లలా అక్కడక్కడ వంకర్లు పోతూ ఉండేవి.

ముతక పంచె కట్టుకుని లోపలికి జేబున్న ముతక బనీను వేసుకునే వాడు. తలపాగా ఉండేది కాదు కాని భుజం మీద తువ్వాలు వేసుకునే వాడు. చేతిలో కర్ర కర్ణుడి కవచంలా నిరంతరం మరిడయ్యతోనే ఉండేది. కాసింత పెద్ద ఆనపకాయ మరిడయ్య అరిచేతిలో పెట్టుకుంటే పెద్ద పెద్ద బాహువుల మధ్య బందీ అయిన ఆడపిల్లలా కనిపించేది.

మరిడయ్య... నల్ల మేఘ శ్యాముడు...

* * *

అప్పటికి ఐదారు నెలలుగా కొబ్బరి తోటలో దొంగలు పడుతున్నారు. కొబ్బరి కాయల దింపు సమయంలో ఈ దొంగతనం తేలేది. దింపు తర్వాత పది, పదిహేను రోజులకి చెట్టుకు ఉన్న కాయల్లో వచ్చే నెల ఎన్ని దించాలో లెక్కలు కట్టడంలో మరిడయ్యది కొబ్బరి చెట్టుకు అంటుకట్టినంత సులభంగా తెలుసు. కాని ఆ లెక్క తప్పుతోంది.

తనదే తప్పు అనుకున్నాడు

తన లెక్క తప్పిందనుకున్నాడు

తనకు వయసు వచ్చేస్తోందేమోనని తల్లడిల్లాడు

తన పని అయిపోయిందా అని కూడా బెంగటిల్లాడు

ఒక నెల తప్పుతుంది... పోనీ రెండు నెలలు...

ప్రతీ నెలా ఇలా ఏమిటీ అనుకున్నాడు.

 ఏదో జరుగుతోందని పసి గట్టాడు.

ఇది దొంగల పనా అని సందేహించాడు.

 దింపు తీసే వాళ్లే చేయి చేసుకుంటున్నారా అని అనుమానించాడు.

బామ్మర్ల దొడ్డిలో ఎవరు పడతారు అని కాసింత సమాధాన పడ్డాడు.

కొబ్బరి దింపు లెక్క తప్పుతున్నందుకు కామందు ఏమనడం లేదు కాని మరిడయ్యేకే మనసు మనసులో లేదు.

కాపు కాసాడు.... తోటలో ఓ రోజు రాత్రి తూర్పు దిక్కుగా పడుకుని కాపలా కాశాడు... అబ్బే ఏ జరగలేదు...

మర్నాడు పడమర దిక్కున కూసున్నాడు... ఎవరూ కాన రాలేదు...

తాను కాపలా ఉన్నానని తెలిసిందేమోనని అనుమానించాడు.

పోనీ వోరం రోజులు ఆగుదామనుకున్నాడు. పది రోజులు ఆగాడు.

ఉత్తరం దిక్కున తొంగోకూడదని పెద్దలు సెపితే దక్షిణం దిక్కున కాపు కాశాడు. అలా మూడు రోజులు ఆగాడు. అబ్బే ఎవలూ రాలేదు.

‘‘లంజి కొడుకులకి తెలిసిపోయింది’’ అనుకున్నాడు.

‘‘ ఈల్లన్ని ఎలాగైనా పట్టుకోవాలి’’

‘‘ఈల్లకి సుక్కలు సూయించాలి’’

‘‘ఈల్లకి మరిడయ్యంటే ఏటో తెలియాలి’’ అనుకున్నాడు.

ఆలోచించాడు. వేదన పడ్డాడు. విసుగు, విరామం లేకుండా యోచించాడు.

‘‘ అమ్మ మరిడిగా... తొత్తుకొడకా... నువ్విలా సేత్తే ఆల్లేందుకు వత్తార్రా’’ అనుకున్నాడు.

తాను చేసిన తప్పు తెలుసుకుని జాగ్రత్త పడ్డాడు. తోటలో ఏ మూల కూసున్నా సుట్ట ఎలిగించకూడదకున్నాడు.

తన సుట్ట ఎలుగు ఆ తొత్తు కొడుకులకు తెలిసిపోతాంది అనుకున్నాడు.

అంతే వ్యూహం మార్చేశాడు...

సుట్టగిట్టా జాంతానై...

ఉత్తరం గిత్తరం లేనేలేదు....

నల్లటి మనిషి కదా సీకట్లో సీకటయ్యాడు.

వెలుగు శోధించలేని అంధకారమయ్యాడు

చీకటిని దేదీప్యమానంగా వెలిగించే దివిటీ అయ్యాడు.

* * *

ఉత్తరం వైపు ఉత్తినే కూర్చున్నాడు. ఎరువు తెచ్చుకున్న నల్ల సొక్కా ఏసుకున్నాడు. సేతిలో కర్రని పక్కనే అరటి తోపులో దాచేశాడు.

రాత్రి 12 గంటలయ్యింది. వాళ్లు అడుగులో అడుగేసుకుంటూ వచ్చారు.

నీడలు కదులుతున్నట్లుగా కదులుతున్నారు. వాళ్ల భుజం మీదున్న గొనె సంచులు విక్రమార్కుడి భుజం మీద భేతాళుడిలా కదలడం లేదు. కాలు తీసి మరో కాలు మెల్లగా వేస్తున్నారు. చుట్టూ పరికించి చూస్తున్నారు. అంతటా ఆవరించిన చీకటి.

ఎవరూ లేరనుకున్నారు... ఎవరూ రారనుకున్నారు...

ఒకళ్లకొకళ్లు కళ్లతోనే సైగలు చేసుకున్నారు.

అంతే ఐదుగురు కొబ్బరి చెట్లు ఎక్కేందుకు సన్నద్ధమయ్యారు. ఎక్కారు.

ఉత్తరం వైపు నుంచి ఈ తతంగమంతా గమనిస్తున్న మరిడయ్యకి విషయ అర్ధం అయ్యింది. ‘‘అమ్మా నా కొడకల్లారా. వైదుగురు వచ్చారా’’ అనుకున్నాడు.

వాళ్లు కొబ్బరి సెట్లు సివరి దాకా ఎక్కేదాకా వేచి చూశాడు.

పది నిమిషాలు అయ్యింది. ముందు ఓ చెట్టు నుంచి ఓ కొబ్బరి కాయ నేల మీద పడింది. కాయ పడిన శబ్దం సిన్నప్పుడే సెవుల్లో దాచేసుకున్న మరిడయ్యకి ఆళ్లు పని ప్రారంభించారని తెలిసిపోయింది. మళ్లీ మరో చెట్టు నుంచి... ఇంకో సెట్టు నుంచి.. మరింకో సెట్టు నుంచి... కాయలు పడుతున్నాయి.

అంతే... ఓ భీకర కేక...

‘‘ వురేయ్ ఆళ్లోచ్చార్రా’’ అన్నాడు మరిడయ్య. అక్కడక్కడే సీకట్లో దాక్కున్న మరిడయ్య కొడుకులు ఇద్దరూ, బావమరది, ఇద్దరు చెలికాళ్లు, మరి ఇద్దరు పాలిగాళ్లు అక్కడక్కడా దాక్కున్న వారంతా వచ్చేశారు.

‘‘దిగండి. కొడకల్లాలా... అయిపోయారివాళ’’ అంటూ అరిచాడు.

అంతే కొబ్బరి సెట్టు మీద ఉన్నోళ్ల ప్రాణాలు అక్కడే పోయాయి. దూకలేరు. దూకితే కాళ్లిరుగుతాయి. కిందకి వస్తే అంతే... ఇలా ఓ ఐదు నిమిషాలు.

మరిడయ్యే మళ్లీ ‘‘ వురేయ్. దూకేయకండి. సచ్చిపోతారు. కిందకి రండి. ఏం చేయను. నేనూ పాలేరునే. మర్యాదగా దిగితే ఏం కాదు. లేదనుకో నేనే పైకొత్తా’’ అని అరిచాడు.

కొంతసేపటికి వారంతా ఒక్కొక్కరే కొబ్బరి చెట్లు దిగారు. వారిని ఆ చెట్లకే కట్టేసి ప్లీడరు రాజబాబుని నిద్ర లేపాడు.

వాళ్లకి టీ ఇచ్చాడు. కట్టేసినా బీడీ కాల్చుకునే వెసులుబాటు కల్పించాడు. చెరువు గట్టు మీదున్న పుల్లయ్య వొటేల్ నుంచి మినప రొట్టెలు, బొంబాయి సెట్నీ తెప్పించాడు.

భోరున ఏడుస్తున్న వారిని ‘‘తినకపోతే తంతానొరే’’ అని గదమాయించాడు. అన్నట్లు ఒక్క దెబ్బ కూడా వేయలేదు.

వాడ్రేవు రాజబాబు... మరికొందరు అగ్రహారం పెద్దలూ వచ్చారు. ఏం చేద్దాం అన్నారు. ఏం చేయాలి అని కూడా అనుకున్నారు.

‘‘పోలీసులని పిలుద్దాం. మొన్నామధ్య మా బామ్మర్ది తోటలో కూడా కాయలు పోయాయి. ఈళ్లని వదలకూడదు’’ అని పెద్దాయన సలహా ఇచ్చారు.

‘‘బాబూ వదిలేయండి. పిల్లలున్నోళ్లం. వింకే దొడ్డిలోనూ దొంగతనం సేయలేదు. విక్కడ మూడుసార్లు కాయలెత్తుకుపోయాం. ఇంకెక్కడా ఏం సేయలేదు. ఎవుసాయం (వ్యవసాయం) పనుల్లేక పిల్లల్ని సాకేందుకు ఇలా సేసాం. వదిలేయండి. పెద్దోరు సమించండి’’ అని చెట్టుకి కట్టేసిన వారిలో అందరి కంటే పెద్దవాడు వేడుకున్నాడు.

అంతే కాదు...తనకి మూడు సెట్లు అవతల మరో సెట్టుకి కట్టేసిన ఓ 16 ఏళ్ల కుర్రాడ్ని చూపిస్తూ..

‘‘ అయ్యా.. ఆడు లేతోడు. విప్పుడే నోకం (లోకం) సూత్తున్నాడు. మీరు పోలీసోళ్లకి అప్పగిత్తే అన్నాయం అయిపోతాడు’’ అని కూడా అన్నాడు.

కామందు కలుగజేసుకున్నాడు..

‘‘వురేయ్... మరిడిగా నువ్వే ఏదోవోటి సేయి. నీ ఇష్టం’’ అన్నాడు.

అక్కడ ఐదు నిమిషాలు మౌనం...

అక్కడ ఐదు నిమిషాలు ఉత్కంఠ...

అక్కడ ఐదు నిమిషాలు తుపాను ముందు ప్రశాంతత

అక్కడ ఐదు నిమిషాలు శ్మశాన శూన్యం

చెట్టుకి కట్టేసిన వాళ్ల వైపే చూస్తున్నాడు మరిడయ్య

ఓ మాటు కొబ్బరి సెట్టు మీదకి చూశాడు... మళ్లీ నేల మీదకి చూశాడు...

పక్కనున్న కామందు వైపు చూశాడు. అగ్రహారం పెద్దలని పరికించాడు.

ఐదు నిమిషాల తర్వాత మౌనం బద్దలైంది...

‘‘ఇడిసేద్దామండి తొత్తు కొడుకుల్ని. పోలీసోళ్లకి వప్పగిస్తే ఈళ్ల పాణాలు తినేత్తారు. బక్క నా కొడుకులు. కూలోళ్లు. సెపుతున్నారు కదా... ఎవుసాయం పనుల్లేవని. ఈళ్లకి దొంగతనాలు కొత్త. తెలిసిపోతోంది’’ అన్నాడు.

సెట్లకి కట్టేసిన వాళ్ల వైపు చూస్తూ ‘‘ ఏరా... బుద్ధిగా ఉంటారా. నాలుగు తోటల్లో దింపు పని పురమాయిత్తా. సేసుకుంటారా... సెడ దెం...కుంటారా’’ అన్నాడు

‘‘మీరు సెప్పినట్లే ఇంటాం అయ్యా’’ అన్నారు చెట్టుకి కట్టేసిన వాళ్లలో ఇద్దరు.

కామందు వాడ్రేవు రాజబాబు చిరునవ్వు నవ్వారు. చుట్ట తిప్పుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు. అగ్రహారం పెద్దలు కూడా ఆయన వెనుకే వెళ్లిపోయారు.

చెట్టుకి కట్టేసిన వాళ్ల తాళ్లు తీసేశారు మరిడయ్య కొడుకులు, బావమరిది.

పంజరంలోంచి బయటపడ్డ పక్షుల్లా మరిడయ్యను వలవల చుట్టేశారు వాళ్లంతా.

‘‘ తొత్తుకొడుకుల్లారా... భూపయాగ్రహారంలోను, బుచ్చమ్మ అగ్రహారంలోను బామ్మర్ల దింపులు మాటాడతా. మీరంతా ఓ జట్టులా మారి దింపులు తీసుకోండి. పేరూరులోనూ, బోడసకుర్రులోనూ కూడా దింపులు సెప్తా. సుబ్బరంగా సేసుకోండి. ’’ అని హామీ ఇచ్చాడు.

ఆళ్లు కళ్లంట నీళ్లెట్టుకోలేదు కాని... కాళ్ల మీద పడ్డ పని చేశారు...

మళ్లీ మరిడయ్యే....

‘‘ఈడు కుర్రనాకొడుకు. ఈడ్ని సదివిద్దాం. పెద్దయ్యాక మనలా కాకూడదు. విందీ (హిందీ) మాస్టారు కనకరాజు గారు మంచోరు. దరమాత్ములు. అయ్యగారికి సెప్తా. స్కూల్ కి పంపండి’’ అన్నాడు. వాళ్లు సరే అంటూ కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారు. పదహారేళ్ల కుర్రాడు సంటిబాబు అక్కడే నిలబడిపోయాడు.

‘‘ఏరా.. నువ్వెల్లవా.. మీ అయ్యతో ఎల్లు’’ అన్నాడు.

‘‘ అంటే విందీ మాస్టారింటికి ఎల్దామనీ’’ అన్నాడు.

మరిడయ్య ఓ నవ్వు నవ్వేసి ‘‘ ఈడుంటాడు. మీరెల్లండి’’ అని వాళ్లని పంపేశాడు.

* * *

ఓ ఆదివారం అగ్రహారం ఆందోళనగా ఉంది.

అగ్రహారం ఆవేదనగా ఉంది.

అగ్రహారం ఆలోచనలో ఉంది.

అగ్రహారం ఆవేశంగా ఉంది.

కాలేజీలో గొడవలు. లెక్చరర్లలో సీనియర్, మృదు స్వభావి, ఎప్పుడూ పల్లెత్తు మాట ఎవరినీ అనని మనిషి. ఎస్ ఎస్ గారు... అదే శిష్టా సూర్యనారాయణ గారు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్ కావాలి. కాని కాలేజీ పాలక వర్గం తన అనుంగు లెక్చరర్ ని ప్రిన్సిపాల్ చేసే పనిలో ఉంది. ఆ విషయం ఎస్ ఎస్ గారి చెవిన పడింది. ఆయన ఎవరికీ చెప్పుకోలేదు. మనకి ప్రాప్తం లేదనుకున్నారు. ఏం చేస్తాం అని కూడా అనుకున్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని లోలోపలే చింతించారు. అన్నట్టు ఎస్ ఎస్ గారు అగ్రహారం మనిషి కాదు. ఆయన ఉండేది మొబర్లీపేట. కాని బ్రాహ్మలు. అంతే. సాటి బ్రాహ్మడిగా అన్యాయం జరగనివ్వ కూడదనుకుంది అగ్రహారం పెద్దరికం.

“ఏటి కొడతారా. నాలుగు తిందాం. మూడు ఏద్దాం. మరీ లోకువ అయిపోయింది బ్రాహ్మలంటే“ అని యువతరం ఆవేశంగా రంకె వేసింది.

అంతే వారం రోజులు కాలేజీ బంద్. నిరసనలు, నిరాహార దీక్షలు. అగ్రహారం అంతా కోలాహలం. అగ్రహారం తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కురుక్షేత్రం. అగ్రహారం తొడ కొట్టలేదు కాని కడుపు మీద కొట్టకుండా కాచుకోవాలనుకుంది.

అంతే వైరం పెరిగింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలుస్తోంది. ఏం జరగాలో కూడా నిర్ణయం అయిపోతోంది.

అదిగో అలాంటి వేళలో... ఓ సాయం సంధ్య వేళ... అగ్రహారంలో ఎక్కడికక్కడ అరుగుల మీద కూర్చుని చర్చిస్తున్న వేళ....

రెండు జీపులలో వచ్చారు. చేతిలో కర్రలు.... రాళ్లు... కొందరు కత్తులు కూడా వెంట తెచ్చుకున్నారు. భుజాల మీద సెగ్గెడ్డలు వేసినట్లుగా ఇంతింత లావు శరీరాలు. నవ్వుకి అర్ధం తెలియని ముఖాలు.

రావడమే పెద్ద పెద్ద అరుపులు...” ఎవర్రా.. సంపేత్తాం. సీల్చేస్తాం. ప్రిన్సిపాల్ కావాలా. రండి. బయటకు రండి“ అంటూ వీరంగం.

ఈ హఠాత్ సంఘటనకు అగ్రహారం మ్రాన్పడిపోయింది. అగ్రహారం భీతిల్లింది. అగ్రహారం కంగారు పడింది.

రోడ్డు మీద కనిపించిన వారిని కనిపించినట్లు కొడుతున్నారు. ఉరుకలు.. పరుగులు,... ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేదు. ఏం జరుగుతుందో... ఎవరి మీద దెబ్బలు పడతాయో అని కంగారు.

అగ్రహారం ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ ఆ రెండు జీపులు ఓ రౌండ్ వేశాయి. రెండో రౌండ్ మళ్లీ వచ్చారు.

అదిగో అప్పుడొచ్చాడు మరిడయ్య. చేతిలో కర్రతో. రాధా స్వామి సత్సంగ భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర చేతిలో కర్రని కుడి భుజం కింద పెట్టుకుని కుడి కాలుని ఎడమ కాలు పక్కన పాదం పైకి మడిచి నిలుచున్నాడు.

జీపు వచ్చి మరిడయ్య దగ్గర ఆగింది. పది మంది కుర్రాళ్లు దిగారు. “ఎవడ్రా నువ్వు” అన్నారు. “అందరూ పారిపోతే నువ్వేం సేత్తున్నావ్“ అన్నారు. నాలుగు తగిలించాలా అని కూడా అన్నారు.

మరిడయ్య ఏం మాట్లాడలేదు. విన్నాడు. వాళ్ల సేతుల్లో ఉన్న కర్రలు చూశాడు. జీపులోపలకి తొంగి చూశాడు. కత్తులు కనిపించాయి. 

“సంపేత్తారా...బామ్మర్లని సంపేత్తారా... సంపేయండి. మీరు పదిమందిని సంపేలోపు నేను నలుగుర్ని ఏసేత్తా. ఆ నలుగురిలో ఎవరిని ఏత్తానో తెలీదు. సంపేయండి “ అన్నాడు.

“అదేదో పెద్దోల్ల యవ్వారం. ఈ గొడవలేటి. బామ్మర్లు వెప్పుడైనా గొడవలకి వచ్చారా. సెప్పండి. ఎందుకివ్వన్నీ. నేను ఇక్కడ ఉంటా. నన్ను సంపేసి తర్వాత బామ్మర్లలో ఎవరినైనా సంపేయండి “ అన్నాడు.

అంతే ఆ జట్టు నాయకుడు మరిడయ్యని పైకి కిందకి చూశాడు.

తనకి నాలుగడుగుల ముందు పులి నుంచుందా అని కంగారు పడ్డాడు.

ఈడ్ని ఏదైనా సేత్తే మనొళ్లు ఇద్దరు ముగ్గురు లేచిపోతారు అని నిర్ణయించుకున్నాడు.

“సర్లే ఎల్తున్నాం. నువ్వు పెద్ద మనిషవని ఎల్లిపోతున్నాం. భయపడి కాదు” అన్నాడు.

మరిడయ్య నవ్వాడు. ఆ నవ్వులో నువు భయపడ్డావురా అని సందేశం ఉంది.

ఆ నవ్వులో నువ్వు ఓడిపోయావురా అని వెక్కిరింత ఉంది.

ఆ నవ్వులో అగ్రహారానికి నేనే పెద్ద ఆయుధంరా అనే ధీమా ఉంది.

*** *** ***

కాలం ప్రవాహంలా పయనించింది. అలా చూస్తూండగానే పుష్కరకాలం పరుగులు పెట్టింది.

మరిడయ్యను వృద్ధాప్యం వెంటాడింది. మరిడయ్యను అనారోగ్యం వేధించింది. మరిడయ్యను దీర్షరోగం కమ్ముకుంది.

హైస్కూల్ రోడ్డులో ఉన్న యునైటెడ్ నర్శింగ్ హోంలో చేర్పించారు. వైద్యలు చికిత్స చేస్తున్నారు. అగ్రహారంలో అందరూ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో మరిడయ్య ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.

అగ్రహారం పెద్ద మనుషులొచ్చారు. డాక్టర్ రామచంద్రరావుగారిని కలిసారు. పరిస్థితి తెలుసుకున్నారు.

“ ఆపరేషన్ చేయాలి. 50 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇందులో 20 వేల వరకూ ఆసుపత్రి వారే భరించాలనుకుంటున్నాం. మేం ఉండేది కూడా అగ్రహారంలోనే కదా.. మందులు, మిగిలిన ఖర్చులు ఓ 30 వేలు ఉంటే సరిపోతుంది “ అన్నారు డాక్టర్ రామచంద్రరావు గారు.

“ అలాగే... కానివ్వండి. ఆ 30 వేలు మేం సద్దుతాం. ముందు మీరు ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి “ అని పెద్దలు హామీ ఇచ్చారు. ఆసుపత్రి బయట ఉన్న గోపాల్ బిస్కట్ కంపెనీ దగ్గరు వచ్చి చర్చించుకున్నారు.

“ మరిడయ్య మనోడు. మనం తలా ఓ చేయి వేస్తే సరిపోతుంది. ఆ పని ఇవాళ, రేపట్లో అయిపోవాలి“ అనుకున్నారు.

అగ్రహారంలో అందరూ ఎవరికి తోచింది వాళ్లు ఇచ్చారు. కావాల్సిన దాని కంటే ఓ 18 వేలు ఎక్కువే వచ్చింది.

అవి తీసుకుని యునైటెడ్ నర్శింగ్ హోంకు వెళ్లారు అగ్రహారం పెద్దలు. ఆసుపత్రిలో రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా ఉన్న బెంచీ మీద 29 ఏళ్ల కుర్రాడు, ఓ అమ్మాయి, ఏడేళ్ల చిన్న పిల్లాడు కూర్చున్నారు.

రిసెప్షన్ కౌంటర్ పక్కనే ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గరు వెళ్లారు అగ్రహారం పెద్దలు. తాము తెచ్చిన డబ్బుని బ్యాగ్ లోంచి తీసి “ పేషెంట్ పేరు మరిడయ్య. డబ్బులు కట్టడానికి వచ్చాం“ అని కౌంటర్ లో ఉన్న అమ్మాయికి చెప్పారు.

కౌంటర్ లో ఉన్న అమ్మాయి “ ఇప్పుడే అరగంట క్రితం ఎవరో డబ్బులు కట్టేసారండి. డాక్టర్ గారు ఆపరేషన్ కు ఏర్పాట్లూ చేసేశారు“ అని చెప్పింది.

అగ్రహారం పెద్దలకి అర్ధం కాలేదు. “ ఎవరు కట్టారమ్మా ఆ డబ్బు. ఎక్కడున్నారు వాళ్లు “ అని అడిగారు.

“ అదిగో ఆ బెంచీ మీద కూర్చున్నారు చూడండి. భార్యభర్తలు. వాళ్లే కట్టేసారు “ అని సమాధానం చెప్పింది కౌంటర్ లో అమ్మాయి.

అగ్రహారం పెద్దలు ఆశ్చర్యపోతూ ఆ బెంచీ దగ్గరకొచ్చి “ ఎవరు బాబు నువ్వు. మరిడయ్య ఆపరేషన్ కి డబ్బులు కట్టావంటా“ అని అడిగారు.

పెద్దలని చూసిన ఆ కుర్రాడు, పక్కనున్న అమ్మాయి, చిన్న పిల్లాడు బెంచీ మీంచి లేచారు. 

 “నమస్కారమండి. నా పేరు సంటిబాబండి. ఆయ్. ఈ ఊరేనండి. నేనే కట్టానండి “

“ నువ్వేందుకు కట్టావు. మరిడయ్య నీకు ఎలా తెలుసు “ అని అడిగారు

“ మరిడయ్య గారు నాకు దేవుడండీ. పన్నెండేళ్ల కితం దొంగతనానికొచ్చిన నన్ను పట్టుకుని చదువు చెప్పించారండి. ఆయన దయ వల్ల నేను విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నానండి “ అని చెప్పాడు.

అంతే కాదు... “ మరిడయ్య బాబుకి బాగోలేదని మా మావయ్య కబురెట్టాడండి. ఈవాళ పొద్దున్నే వచ్చానండి. వచ్చి రావడమే ఆసుపత్రికి వచ్చాశానండి. మంచం మీదున్న మరిడయ్య బాబుని చూశావండి. డాక్టర్ గారిని అడిగితే ఇలా డబ్బులు అవీ చెప్పారండి. ఇప్పుడే పది నిమిషాలైందండి. డబ్బులు కట్టేశానండి “ అన్నాడు.

మళ్లీ సంటిబాబే “మీరు కడతానన్నారని డాక్టర్ గారు చెప్పారండి. కాని మా దేవుడికి మేమే ఇవ్వాలని కట్టేశానండి “ అన్నాడు.

అగ్రహారం పెద్దలకి ఆనాడు వాడ్రేవు రాజబాబు తోటలో దొంగతనానికి వచ్చిన వాళ్లు, వాళ్లలో సంటిబాబు అన్నీ కళ్ల ముందు కదలాడాయి.

“ బాగుంది బాబు. వృద్ధిలోకి రావడమే కాకుండా... అలా పైకి తీసుకొచ్చిన వారిని గుర్తు పెట్టుకున్నావు. ఆసుపత్రి నుంచి వచ్చాక మరిడయ్యకి ఈ డబ్బులు ఇచ్చేస్తాం. వాడిష్టం. మందులకో, మాకులకో వాడుకుంటాడు“ అన్నారు పెద్దల్లో ఒకరు.

మళ్లీ వారిలో ఒకరు “ వీళ్లు నీ కుటుంబమా “ అని అడిగారు.

“ నా భార్య సత్యవతి. వీడు నా కొడుకు “ అన్నాడు సంటిబాబు

 పిల్లోడు ముద్దుగా ఉన్నాడు అంటూ ఆ పిల్లాడి కేసి చూస్తూ ఒకరు.. “నీ పేరేంట్రా “ అని అడిగారు

ఆ పిల్లాడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ... “ మరిడయ్య “ అన్నాడు

*** *** ***

సందేహం

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- రామాయణంలో అయోధ్యాకాండ ప్రాధాన్యం ఏమిటి? ఈ కాండలో తెలుసుకోవలసినది ఏమైనా ఉందా?

సమాధానం;- శ్రీరామాయణంలో బాలకాండ యజ్ఞ ప్రధానమైన కాండ. అలాగే అయోధ్యాకాండ ధర్మ ప్రధానమైన కాండ.

వేదంలో చెప్పబడిన సుఖానికి సాధానాన్నే *ధర్మం* అంటారు. అభ్యుదయమని, నిశ్రేయసమని సుఖం రెండు విధాలు.

ఈ లోకంలో ఈ జన్మలో, పై జన్మలలో, పై నుండే స్వర్గాది లోకాలలో అనుభవించే సుఖాన్ని అభ్యుదయం అంటారు.

శరీర పతనంతో ఆత్మ విడివడి, మరల దేహాన్ని పొందకుండా ఆనంద స్వరూపుడు, ఆనంద ప్రదాత అయిన భగవానుని చేరి ఉండి ఆనందం అనుభవించడాన్నే నిశ్రేయసం అంటారు.

సుఖానికి సాధనాలని మనం అనుకుంటున్నవి దుఃఖాన్ని కూడ కలిగించడం మనం చూస్తూనే ఉన్నాం. వేదం పూర్వభాగంలో చెప్పబడిన కర్మలనే ధర్మాలంటారు. ఉత్తర భాగంలో (ఉపనిషత్తుల్లో) చెప్పబడిన జ్ఞానమే భక్తి రూపంగా పరిణమించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఈ లోకంలో ఇప్పుడు సుఖంగా ఉండడానికి ప్రవర్తించే విధానం నీతి, తమ తోడి వారికి సుఖం కలిగేలా ప్రవర్తించడం దాని వల్ల తాను సుఖించడం మానవుడు నేర్చుకోవాలి. వీటినే పితృధర్మం, పుత్ర ధర్మం, సోదర ధర్మం, భర్తృ ధర్మం అనీ వ్యవహరిస్తారు. ఇవన్నీ మనకు నేర్పేదే వేదం. ఆ వేదమే రామాయణమై వచ్చింది. అందులో చెప్పబడిన ధర్మమే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించింది.

వారి ధర్మ ప్రవర్తనమే అయోధ్యాకాండలో కథా వస్తువు.

*జై శ్రీరామ్*

*ఆచార్య సద్భావన*



సర్వదా మనతో ఆనందమనే దివిటీని తీసుకువెళ్ళాలి. నిజమైన ఆధ్యాత్మికత మనలో ఆనందాన్ని జాగృతం చేయగలగాలి. ఆధ్యాత్మికత మనతో అన్ని చోట్లకూ ప్రకాశాన్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది. ప్రపంచంలోని అందరూ ఇలా తమ వంతుగా ఆనందపు దివిటీలను తీసుకు రాగలిగితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమవంతు కర్తవ్యంగా ఆనందపు కిరణాల కాంతిని లోకానికి అందించగలిగితే జీవితం ఎంతటి సుందరభరితం అవుతుంది. ఈ విషయాన్ని విస్మరించి, మనం ఆనందం ఎక్కడో బయట ఉందని వెతుకుతాం, కానీ అది మనలోపలే ఇమిడి ఉన్నది. ఎవరిలో ఈ ఆనందపు కిరణాలు ఉదయిస్తాయో వారు లోకమంతటా తమ కృపాశీస్సులను అందజేస్తూనే ఉంటారు. వారు అన్ని విషయాలనూ సత్యమనే కాంతిలో చూస్తూనే ఉంటారు, అందుచేతనే వారి మహనీయత్వాన్ని గుర్తిస్తూ ప్రజలు సహాయాన్ని అర్థిస్తూ వారి చెంతకు చేరుకుంటూ ఉంటారు.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
నేను చేసే అన్ని కార్యకలాపాలలో మీరు నాకు అండగా ఉందురుగాక, ప్రతీ కార్యములోనూ నా ఆనందాన్నీ, భక్తినీ వెల్లడి చేయగల శక్తిని ప్రసాదించుదురుగాక, సత్యకిరణాలతో నా ఆలోచన, ఆచరణ నిండి ఉండి నా తోటివారి జీవితాలలో ప్రకాశాన్ని కలిగించుదురుగాక.

సర్వేజనా సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*ఆచార్య సద్భావన*


సర్వదా మనతో ఆనందమనే దివిటీని తీసుకువెళ్ళాలి. నిజమైన ఆధ్యాత్మికత మనలో ఆనందాన్ని జాగృతం చేయగలగాలి. ఆధ్యాత్మికత మనతో అన్ని చోట్లకూ ప్రకాశాన్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది. ప్రపంచంలోని అందరూ ఇలా తమ వంతుగా ఆనందపు దివిటీలను తీసుకు రాగలిగితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమవంతు కర్తవ్యంగా ఆనందపు కిరణాల కాంతిని లోకానికి అందించగలిగితే జీవితం ఎంతటి సుందరభరితం అవుతుంది. ఈ విషయాన్ని విస్మరించి, మనం ఆనందం ఎక్కడో బయట ఉందని వెతుకుతాం, కానీ అది మనలోపలే ఇమిడి ఉన్నది. ఎవరిలో ఈ ఆనందపు కిరణాలు ఉదయిస్తాయో వారు లోకమంతటా తమ కృపాశీస్సులను అందజేస్తూనే ఉంటారు. వారు అన్ని విషయాలనూ సత్యమనే కాంతిలో చూస్తూనే ఉంటారు, అందుచేతనే వారి మహనీయత్వాన్ని గుర్తిస్తూ ప్రజలు సహాయాన్ని అర్థిస్తూ వారి చెంతకు చేరుకుంటూ ఉంటారు.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
నేను చేసే అన్ని కార్యకలాపాలలో మీరు నాకు అండగా ఉందురుగాక, ప్రతీ కార్యములోనూ నా ఆనందాన్నీ, భక్తినీ వెల్లడి చేయగల శక్తిని ప్రసాదించుదురుగాక, సత్యకిరణాలతో నా ఆలోచన, ఆచరణ నిండి ఉండి నా తోటివారి జీవితాలలో ప్రకాశాన్ని కలిగించుదురుగాక.

సర్వేజనా సుఖినోభవంతు.

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*********************

కర్మ_ఫలం



ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు... కనుక ఒక చెక్క దుంగని విగ్రహం లా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది.

 ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది.... కుంభవృష్టి లా మారింది..

ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునే వాడు ఒకడు వచ్చాడు.... వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడ లేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది... వెంటనే గుడి లోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది.

వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ... ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు... 

వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది..., అందులో ఉన్న అమ్మ.... వీడికి దేవుడు, దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..

అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసే సరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

 అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా! అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.

అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని.... దేవుడంటే ఏమిటో తెలియదు.... నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చేయబోయావు... . ఏమి తెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా?

 పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా,...

 అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..

బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు.

ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి...బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లి పోయారు.... అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.

మనకు ఏది కావాలో మనకు తెలీదు...
మనల్ని సృష్టించిన పరమాత్మ కు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు... కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది.... ఫలితం రాకుండా మాత్రం ఉండదు.

దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు... చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు... నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి....

బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది..

 అప్పుడు ఎంచక్క ప్రతి క్షణం ఒకే స్థితి.. ఆనందమే ఆనందం.....
ఆ స్వామి పాదాల చెంత చేరే వరకు.

🙏సేకరణ

గురువు






కోడలు పెట్టే దీపానికి ప్రాధాన్యత

♦*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం.... ♦

♦*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*—ఎందుకోతెలుసా...!!!♦

♦చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!♦

♦కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!♦

♦తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!♦

♦తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!♦

♦కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!♦

♦కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!♦

♦ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి..... అందులో మీరు, నేను కూడా ఉండాలి....♦😍😍😍

విహగ విలాసము



సుంకు బట్టిన సజ్జ కంకిపై జేరియు
             పొడిచి గింజల దిను పొట్టి పిట్ట
మాగిన జామలో మాధుర్యమును గ్రోలి
            పలుకుల కులికెడి చిలుక జంట
మిసమిస చివురుల మెసవియు కూర్చుండి
             కూ యని కూసెడి కోకిలమ్మ
గుబురుల మధ్యలో కుదురుగా నుండియు
            గుబులుగా నరచెడి  గోరువంక
బంధనంబులు లేకను ప్రకృతి యందు
పూర్తి స్వేచ్ఛగ దిరిగెడి పులుగులకును
సాటి యేముండు సృష్టిలో సత్యముగను
విహగ రవములె నత్యంత వేడు కరయ
యసలు సిసలైన సంగీత మంద మదియె

      గోపాలుని మధుసూదన రావు

పోత‌న త‌ల‌పులో ...(43)



అజ్ఞానంతో దారిత‌ప్పిన మాన‌వుల‌ను
దారికి తెచ్చి,వారిని త‌రింప‌చేసేందుకే నీవు అవతరిస్తావని అంటారు ప‌రమాత్మా
అని కుంతీ దేవి కృష్ణ‌ప‌ర‌మాత్మ‌ను కీర్తిస్తోంది.

                         ***
మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు
వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ, చింతన, వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
                         ***

కర్తవ్యం విస్మరించి, కామ్యకర్మలలో మునిగి తేలుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి, వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం, పుట్టుకే లేని పురుషోత్తమ! శ్రీకృష్ణా! నీవు అవతరించావని కొందరి అభిప్రాయం.

🏵️పోత‌న పద్యాలు🏵️
🏵️తిమిర సంహ‌ర‌ణాలు🏵️

*విలువ తెలిసి మసలుకోవాలి*



చాలాకాలం క్రితం చాలా పెద్ద ఫల వృక్షం ఉండేది.

ఒక చిన్న పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ తిరు గుతూ రోజూ చాలా ఇష్టంగా, ప్రేమగా ఆడుకునేవాడు.

ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించే వాడు.
 ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడేది. బాలుడిని అమితంగా ప్రేమించేది.

కాలం గడిచింది. చిన్న పిల్ల వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు మళ్లీ అతను చెట్టు వద్దకు వెళ్లాడు. ఎందుకో విచారంగా ఉన్నాడు.
‘రా.. వచ్చి నా ఒడిలో ఆడుకో’ అని చెట్టు అంది.
‘నేను ఇంకా చిన్న పిల్లాడని కాదు. చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది. నాకిప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి’ అన్నాడు అతను విచారంగా.
‘నా దగ్గర డబ్బులు లేవు కానీ, నువ్వు ఒక పని చెయ్యి. నా పండ్లన్నీ కోసుకుని వెళ్లి అమ్ముకో. దాంతో నీకు కావాల్సినన్ని డబ్బులు వస్తాయి’ అని చెట్టు ఉపాయం చెప్పింది.
బాలుడు ఎంతో సంతోషంగా చెట్టెక్కి, దాని పండ్లన్నీ కోసుకున్నాడు. వెళ్లి వాటిని అమ్ముకున్నాడు. కొంత డబ్బులు రాగా, వాటితో బొమ్మలు కొని ఆడుకున్నాడు.

కానీ, మళ్లీ ఆ చెట్టు వైపు రాలేదు. ఆ చెట్టు అతను రాక కోసం దిగులుగా ఎదురు చూడసాగింది.
క్రమంగా బాలుడు పెరిగి మరింత పెద్దవాడయ్యాడు. యువకుడిగా మారాడు. ఒకరోజు అటుగా అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషపడింది.
‘రా. నా వద్దకు వచ్చి ఆడుకో’ అని ఆ యువకుడిని ఆశగా ఆహ్వానించింది.

‘నీతో ఆడుకునే సమయం లేదు నాకు. నా కుటుంబం కోసం పని చేయాలి. మేం ఉండటానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. నువ్వేమైనా సహాయం చేయగలవా?’ అని ఆ యువకుడు చెట్టును అడిగాడు. ‘నా వద్ద ఇల్లు లేదు. అయితే, నా కొమ్మలు అందుకు నీకు ఉపయోగపడతాయి. వాటిని కొట్టుకుని వెళ్లు. ఇల్లు కట్టుకో’ అని ఆ చెట్టు చెప్పింది.
ఆ యువకుడు చెట్లు కొమ్మలు నరికి సంతోషంగా తీసుకెళ్లాడు. అతని సంతోషం చూసి చెట్టు చాలా ఆనందపడింది.

కానీ, మళ్లీ అతను చాలా కాలం వరకు తిరిగి రాలేదు. చెట్టూ మళ్లీ అతని కోసం దిగులుగా, విచారంగా ఎదురు చూస్తూ గడపసాగింది.
బాగా ఎండగా ఉన్న వేసవికాలంలో ఒక రోజు అతను మళ్లీ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టుకు సంతోషమేసింది. ‘రా. వచ్చి నాతో ఆడుకో’ అని సంతోషంగా ఆహ్వానించింది.
‘నేను ముసలివాడిని అయ్యాను. ఈ వయసులో నీతో ఆడుకుంటే అందరూ నవ్వుతారు. కాకపోతే, నీ వద్దకు ఒక పనిపై వచ్చాను. నేను సముద్ర వ్యాపారం చేయాలనుకొంటున్నాను.. నాకు ఒక పడవ కావాలి. ఇందు కోసం నువ్వు నాకేమైనా సహాయ పడగలవా?’ అని ముదుసలి అడిగాడు. ‘నేను నీకు పడవను ఇవ్వలేను. కానీ, నా చెట్టు కాండం అందు కోసం ఉపయోగపడుతుంది. దానిని నరికి తీసుకెళ్లు. దానితో మంచి పడవ తయారు చేయించుకుని హాయిగా సముద్ర ప్రయాణం చెయ్యి’ అని చెట్టు సలహా ఇచ్చింది.
అతను చెట్టు కాండాన్ని తెగ నరికాడు. తీసుకెళ్లి పడవ తయారు చేయించుకుని హాయిగా ప్రయాణం చేస్తూ గడిపాడు. చాలా కాలం వరకు తిరిగి అతను చెట్టుకు తన ముఖం చూపించలేదు.

చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు. ‘నాయనా! నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ మిగలలేదు. పండ్లు కూడా లేవు’ అని చెట్టు విచారంగా పలికింది. ‘నాకు ఏమీ వద్దు. నాకు కూడా తినడానికి పళ్లు లేవులే’ అన్నాడు ఆ వృద్ధుడు. ‘నాపై ఎక్కి ఆడుకోవడానికి నాకు కాండం కూడా లేదు’ అని మరింత విచారంగా అంది చెట్టు. ‘ఎక్కడానికి నాకు బలమూ లేదు. ముసలివాడిని కదా’ అన్నాడు వృద్ధుడు. ‘నిజంగా నీకివ్వడానికి నా వద్ద ఏమీ లేదు. చచ్చిపోతున్న నా వేర్లు తప్ప’ అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. ‘నాక్కూడా ఇప్పుడు ఏదీ అవసరం లేదు. చాలా అలసిపోయాను. విశ్రాంతి తీసుకోవడానికి ఓ మంచి ఆసరా కావాలి’ అన్నాడు వృద్ధుడు. ‘వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి, విశ్రాంతి తీసుకోవడానికి మంచివి. అనుకూలంగా కూడా ఉంటాయి నాయనా! రా. వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో’ అంది చెట్టు.

ఆ వృద్ధుడు ఆ చెట్టుపై కూర్చుని కునుకు తీశాడు. సంతోషంతో కన్నీరు కారుస్తూ ఆ చెట్టు అతనికి సేదదీర్చింది.

మోడువారిన ఆ చెట్టు ఎవరో కాదు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు.వారికి ఇవ్వడం మాత్రమే తెలుసు తీసుకోవడం వారికి చేతకాదు.

ఇక్కడ అతను చెట్టు
విలువ తెలుసుకునే సరికి కాలం ముగిసిపోయింది.

జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ బ్రతికుండగా తెలుసుకో లేకపోతే ప్రయోజనం లేదు ఈ జన్మకు ఒక అర్థం పరమార్థం
రెండు కూడా తల్లిదండ్రులే భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు గానీ ఆయన ప్రతిరూపాలే వారు.

పైన చెప్పిన కథలో పిల్ల వాడి దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఆ చెట్ల నుండి అన్నీ తీసుకున్నాడు కానీ ఆ చెట్టు కు తిరిగి కనీసం మనశ్శాంతిని కూడా ఇవ్వలేకపోయాడు ఆ చెట్టు పోయే సమయంలో వచ్చి కన్నీళ్లు కార్చడం తప్ప మనం కూడా మన తల్లిదండ్రులు బతికి ఉండగా
వారి గొప్పతనాన్ని గుర్తిద్దాం
వృద్ధాప్యంలో వారికి కాస్తంత మనశ్శాంతిని చేకూర్చుదాం.

గురుర్బ్రహ్మా శ్లోకం గురించీ

ప్రసిద్ధమైన గురుర్బ్రహ్మా శ్లోకం గురించీ .. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ఇచ్చిన వివరణ

******

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం

"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

అయితే ఈ శ్లోకం ఎందులోది?

ఏ సందర్భంలోది?
ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ పోస్ట్

ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.

ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.

కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తనని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.

అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు.

మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ పోస్ట్ అంకితం....

గురువు గొప్పదనం

*ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యం, విశిష్టత ఇదే!*
దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఏటా సెప్టెంబర్ 5ను ‘టీచర్స్ డే’ (ఉపాధ్యాయ దినోత్సవం)గా నిర్వహించుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం..
*నేపథ్యం..*
భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

ఎంఎన్‌ రాయ్‌ మాటల్లో చెబితే.. భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్‌ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్‌ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు.

మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో!

*యుగపురుషుడు.. జ్ఞాన మహర్షి ‘సర్వేపల్లి’*
‘యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే, యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు’ అని కొనియాడారు హోవెల్‌. ‘నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’ అని కీర్తించారు సోవియట్‌ అధినేత స్టాలిన్‌. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయింది.

*గురువులకే గురువు*
 సర్వేపల్లి.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం

తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.

*గురువు గొప్పదనం*

మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.

*గురువు (ఉపాధ్యాయుడు) ఎలా ఉండాలి?*
ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.

గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం (డ్రెస్సింగ్) ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, మంత్రతంత్రాల (పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు)పై చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి వాడే.

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.

సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేద్దాం..
మన బాల్య మిత్రులు గురువులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

మహాభారతం శాంతిపర్వంలోని పద్యం

సరిగ్గా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితిని వర్ణించిన మహాభారతం శాంతిపర్వంలోని తిక్కన గారి పద్యం....



చంపకమాల


వల నధికంబుగాఁ గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం
దుల నొడఁగూర్ప నేర్చి తనదోషము లారయ బుద్ధి గల్గి యా
ర్తులకుఁ జికిత్స సేసెదరు; రోగము వాయమి లేదా? వారు రో
గులగుట గానమెట్లు ప్రతికూలవిధిన్ నరునేర్పు ద్రోచునే

 (ఆంధ్ర మహాభారతం శాంతిపర్వం ప్రధమాశ్వాసం 215వ పద్యం )

శ్రీమదాంధ్ర మహాభారతము

ప్రతిపదార్థం : వలను= వీలు, ఆనుకూల్యం: అధికంబు+కాన్= ఎక్కువగా కలుగు= కలిగిన వైద్యులు= భిషక్కులు, శాస్త్రములు= రోగి దానికి సంబంధించిన శాస్త్రాలను; అభ్యసించి= చదివి: మందుల= ఓషధులను; ఒడన్+కూర్పన్= తగిన విధంగా కలపటం; నేర్చి= అభ్యసించి; తన దోషములు= వాత, పిత్త, కఫాది శరీర దోషాలు; ఆరయన్= గుర్తించే; బుద్ధి= తెలివి; కల్గి= ఉండి; ఆర్తులకున్ = బాధపడుతున్న వారికి; చికిత్స= వైద్యం: చేసెదరు= చేస్తారు; రోగము= వ్యాధి; పాయమి= పోకపోవటం; లేదు+ఎ?= లేదా?? వారు=

ఆ వైద్యులు; రోగులు+అగుట%3 వ్యాధి పీడితులవటం; కానము+ఎట్లు?= చూడటం లేదా?: నరునేర్పు= మానవుడి కౌశలం; ప్రతికూల విధి న్ = విధి వైపరీత్యాన్ని; తోచును+ఎ?= నెట్టివేయగలదా? (లేదని భావం)

తాత్పర్యం: అవకాశం అధికంగా కలిగిన వైద్యులు వైద్య శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి, మందులు సరిగా తయారుచేయటం నేర్చుకొని, శరీర దోషాలను గుర్తించే తెలివి కలిగి ఉండి, రోగులకు వైద్యం చేస్తారు. అయినా రోగం తగ్గకపోవటం ఉంటుంది కదా! ఆ వైద్యులే రోగులవటం కూడా చూస్తున్నామే. మానవుడు నేర్పు విధివైపరీత్యాన్ని తొలగించలేదు

విశేషం: అలా: అర్థాంతరన్యాసం. మానవుడి మేధకన్న విధి బలీయమని అందరూ విధికి తల ఒగ్గవలసినవారేనని చెప్పటం

సాంబ్రాణి ధూపం

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో
ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు.

ఆదివారం.:🙏
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు,
ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.

సోమవారం.:🙏
దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

మంగళవారం.:🙏
శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి.
కంటి దృష్టిలోపాలుండవు.
అప్పుల బాధ తొలగిపోతుంది.
కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.

బుధవారం. :🙏
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.

గురువారం.:🙏
గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి.
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం.🙏
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది.
శుభకార్యాలు చేకూరుతాయి.
అన్నింటా విజయాలుంటాయి.

శనివారం.:
 సోమరితనం తొలగిపోతుంది.
ఈతిబాధలుండవు.
శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.
********************

ఉపాద్యాయదినముగా

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
ఆర్యులారా! నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వీరి జన్మదినమును ఉపాద్యాయదినముగా వీరు ఉపాధ్యాయులుగా చేసిన సేవల వలన గుర్తింపబడింది.
వీరికి  అంజలి ఘటిస్తూ
ఉపాద్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.
మన మనసుకు బోధను గొలిపే పెఅరీ వ్యక్తీ మనకు గురువేనని మనము మరువ రాదు. సద్గురువులు నిత్య పూజనీయులు
అట్టి వారికి సంవత్సర కాలములో నొక్కసారయినా మనము స్మరించుకొని వారికి మనము అభినందనలు మనలో వారిపైగల ప్రేమను తెలుపుట మానవధర్మము.

ఏ మహనీయు లిద్ధర గణించు విధంబగు బోధ గొల్పిరో
యా మహనీయులందరికినంచిత భక్తి నమస్కరించెదన్.
భూమిని సత్ప్రవర్తనను పుణ్యముగొల్పెడి సత్యమార్గమున్
క్షేమము గొల్ప చేసిన ప్రసిద్ధులు నీ గురుదేవులందరున్.

గురుదేవులకు ప్రణమిల్లుతూ🙏
జైహింద్.

శ్రీకృష్ణుడు ఉద్ధవునితో

మహాభారత యుద్ధం ముగిసిన తరువాత , శ్రీకృష్ణుని అవతార సమాప్తి ముగియపోవనుండగా, శ్రీకృష్ణుడు, ఆయన చిన్ననాటి స్నేహితుడు అయిన ఉద్ధవుడు ముచ్చటించుకుంటున్నారు.

శ్రీకృష్ణుడు ఉద్ధవునితో అందరూ నా వద్దనుండి ఏవేవో పుచ్చుకున్నారు. ఇంతవరకు నువ్వు ఏమీ కోరుకోలేదు. ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు ఉద్ధవుడు, మోక్షం నా వంటి వారికి ఈ లౌకిక ప్రపంచం లో దొరకడం కష్టం. ఇప్పటివలే నీకు సేవ చేసే భాగ్యం కంటే ఇంకేమీ నాకు అవసరం లేదు అని అన్నాడు.
అయినా కొన్ని సందేహాలున్నాయి, అవితీర్చు కృష్ణా అన్నాడు..

అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సరే అడుగు అన్నాడు...

నీకు భూత, భవిష్య వర్తమానాలు తెలుసు కదా, ఎందుకు జూదాన్ని ఆపి నీ స్నేహితుడైన ధర్మ రాజుని రక్షించలేదు అన్నాడు అని అడిగాడు..

అందుకు శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు వివేకంతుడు. తనకు జూదం తెలియదు అని తెలిసి శకుని ని ముందునుంచి ఆడమన్నాడు. కానీ ధర్మరాజు జూదం ఆడుట శ్రీకృష్ణునికే తెలియకూడదు అనుకున్నాడు. ద్రౌపధియే ఆఖరున ఆపదలో నన్ను తలచుకుంది. వెంటనే నేనొచ్చేసా...
వెంటనే ఉద్ధవుడు, అయితే నువ్వు పిలిస్తే గానీ రావా..?
అవును నేను పిలిస్తేనే వస్తాను. అంతవరకూ ఒక సాక్షి గానే ఉంటాను. మనుషులు చేసే కర్మలలో నేను కలుగచేసుకొను. ధర్మరాజు అజ్ఞానం చేత, అతను జూదం ఆడడం నాకు తెలియదు అనుకున్నాడు. కర్మలను భట్టి ఫలితం ఉంటుంది. జ్ఞానం ఉత్తమ కర్మల చే మానవుడు జీవించాలి. కనీసం నాకు అన్నీ తెలుసు, నా సాక్షి గా మానవుడు కర్మ లను చేస్తున్నాడు అని భావిస్తే అధర్మము చేయుటకు సాహసించరు అని అందరితో చెప్పుము అని శ్రీకృష్ణుడు అన్నాడు.

హిందూత్వం లోని తత్వాలు ఇలానే ఉంటాయి.

అమ్మే మొదటి గురువు

అమ్మే మొదటి గురువు 
ఈ గురుపూజోత్సవం నాడు మనం ముందుగా స్మరించాలిసిన గురువు కన్నా తల్లి. కన్న తల్లి తరువాతే ఈ ప్రపంచంలో ఏ గురువైన. నవ మాసాలు మోసి రక్త మాంసాలతో ఈ భూమిమీదకు తీసుకోవచ్చిన మహానుభావురాలు తల్లి. అంతే కాదు మనిషి పుట్టినప్పుడు ఏమి రాదు, ఏమి తెలియదు కేవలం ఏడవటం, కళ్ళు చేతులు కదిలించటం మాత్రమే తెలుసుకున్న మనిషికి తన చనుమొనను నోటికందించి పాలిచ్చి పాలించే దేవతే తల్లి. 
పశువులకు పుట్టిన వెంటనే కళ్ళతో లేచి నిలబడి తల్లి చనుబాలు తాగగలుగుతాయి కానీ మనిషికి ఆ శక్తి లేదు ఈ విషయాన్నీ కంప్యూటరు భాషలో మీకు అర్ధమియట్లు చెపుతాను. మనం కంప్యూటర్లో రెండు రకాల మెమరీలు చూస్తాం అవి ఒకటి ROM రెండు RAM వీటిని తెలుసుకుందాం. 
ROM means Reed only Memory అంటే కంప్యూటర్ ఆన్ చేయగానే మన ప్రాయం లేకుండా తనంత తానుగా అమలు చేసుకునే ప్రోగ్రాం. అదే . CMOS అది కంప్యూటర్లోని విషయాలను ముందుగా రెకార్డ్ చేసి ఉంచినది. ఇక రెండోవది 
RAM ఇది మనం సాధారణంగా ఉపయోగించే మెమొరీ ఇది సిమ్సలో ఉంటుంది. 
మనుషులకు పుట్టుకతో ROM లేకుండా పుట్టుతారు అందుకే ప్రతిదీ నేర్చుకోవాలి. కానీ పశుపక్షాదులు కొంత ROM కలిగి పుట్టుతాయి అందుకే అవి పుట్టిన వెంటనే వాటి అవసరాలను తీర్చుకోగలుగుతాయి. 
ఇక పక్షుల విషయానికి వస్తే వాటి ROM లో గూడు కట్టే టెక్నోలోజి కలిగి ఉంటాయి అందుకే ఒక జాతికి చెందిన పక్షి ఒకే రకమైన గూటిని కట్ట గలదు. అదే విధంగా సాలె పురుగు తన గుండుని కూడా కట్టుకోగలదు. చీమలు తమ పుట్టలను తామే నిర్మించుకోగలుగుతాయి.  దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనిషి నేర్చుకోకుండా కనీసం పాలుకూడా తాగలేడు. 
ఈ విషయాలు ఏవి మనం గుర్తించం. 
ఇంకా వుంది 

🌼🌿 గరికకు లొంగిపోయే గణేశుడు 🌼🌿



          గణేశుడు భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వాగణపతి అని కూడా పిలవడం కద్దు. దూర్వాయుగ్మమ్‌ అంటే గరిక కదా! వినాయకునికీ గరికకీ మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండే...
తాపాన్ని ఉపశమించేందుకు :-
పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షసప్రవృత్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిదచేసేందుకు బయల్దేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గా లన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తూ గరళాన్ని మింగినట్లుగానే, వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధిలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ.
శివపార్వతుల పాచికలు:-
శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నా రు. వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా... వినాయకచవితినాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శావిమాచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశు ని పూజలో భాగమయ్యిందంటారు.
*🌷ఔషధి తత్వం:*
గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. గరికకు త్రిదోషాలనూ హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటిలేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ, విరేచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తా రు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడ దెబ్బ వరకూ గరికను సర్వరోగాలను ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి, నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశునికి చేరువకావడంలో తప్పేముంది.
(సేకరణ)

గురు వందనం

ఈరోజు (5-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *గురు వందనం*// "మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్య దేవోభవ" అన్నది ఆర్యోక్తి. నవమాసాలు మోసి పెంచిన తల్లి, చెయ్యి పట్టి నడిపించిన తండ్రి తర్వాత, తత్ తుల్యులుగా భావించి, గుండెగుడిలో నిలుపుకొని పూజించవలసిన వ్యక్తులు గురువులు. గురు "దేవుడు" అన్నారు. తల్లి, తండ్రి, గురువు ముగ్గురూ దైవంతో సమానం, వారిని గౌరవించాలి, పూజించాలి, వారి బోధనలు ఆలకించాలి, ఆచరించాలని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట. విద్యతో పాటు బుద్ధులు చెబుతూ, మార్గదర్శనం చేసినవాడే నిజమైన గురువు. అలా సమాజాన్ని తీర్చిదిద్దినవారందరూ గురుస్థానీయులు. పల్లె నుండి ప్రపంచస్థాయికి ఎదిగి, పేదరికం నుండి ప్రాభవానికి ప్రగతి ప్రయాణం చేసిన గురూత్తముడు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ.వారి జయంతిని "జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా" గురుపూజోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కేవలం సభలు చేసి సంబరపడిపోతే సరిపోదు. ఆచరణలో, వ్యవస్థలో గురుస్థానానికి గౌరవం దక్కినప్పుడు, దక్కించుకున్నప్పుడే ఈ ఉత్సవాల ప్రయోజనం. విద్యాభ్యాసం గురుముఖతా జరిగిన కాలం నుండి ఆన్ లైన్ ముఖంగా సాగుతున్న కాలానికి వచ్చేశాం. గురుదేవుడిగా పూజించబడిన దశ నుండి, కీచకగురువు అనిపించుకునే దశకు వచ్చాం. అధ్యాపకుడు వేరు. గురువు వేరు. పాఠం చెప్పిన ప్రతి అధ్యాపకుడు గురువు కాదు. అధ్యాపకులందరూ కీచకులు కారు. ఎక్కడో, ఎవ్వరో కొందరి వల్ల వృత్తికి చెడ్డపేరు వస్తూ ఉంటుంది. కొందరు మహోన్నతులైన ఉపాధ్యాయుల వల్ల ఆ వృత్తికి అపారమైన గౌరవం పెరుగుతుంది. పాఠ్యాంశాలతో పాటు, జీవిత పాఠాలు, విద్యాబుద్ధులు చెప్పిన మార్గదర్శకులందరూ గురుదేవులే. ఈ భరతభూమిపై ఎందరో ఉత్తమ అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు సమాజాన్ని విజ్ఞానం వైపు, వికాసం వైపు నడిపించారు, నడిపిస్తున్నారు. విజ్ఞానంతో పాటు విలువలు పంచుతున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు-విద్యార్థి బంధాలు మారుతున్నాయి. తగ్గుతున్నాయి. ఎంత పాశ్చాత్య పోకడ, ఎంత ఆధునిక నడవడిక వచ్చి చేరినా, గురువును గౌరవించే, పూజించే సంస్కృతి ఈ పుణ్యభూమిపై ఇంకా పచ్చగా ఉంది. ఎందరో పెద్దలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులను అలంకరించారు.ఎందరో మేధావులు, ప్రతిభామూర్తులు మన దేశంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా (వైస్ ఛాన్సలర్లు) గా పనిచేశారు.వీరెవ్వరికీ దక్కని ప్రత్యేక గౌరవం సర్వేపల్లి రాధాకృష్ణకు దక్కింది.ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా, గురుపూజోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించిందంటే, మనం జరుపుకుంటున్నామంటే, అది సర్వేపల్లివారి సర్వోన్నత సంస్కారానికి, సమర్ధతకు ప్రేరణకు,నడవడికకు, మార్గదర్శనానికి గొప్ప ఉదాహరణగా చెప్పాలి. విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్, అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం సర్వేపల్లి రాధాకృష్ణ.ప్రతి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయులను, గురువులను తలచుకొని కొలుస్తున్నాం. దీనికి ప్రేరణగా, ఉపాధ్యాయ పదానికి పర్యాయపదంగా, అధ్యాపక వృత్తికి అమేయమైన గౌరవం నిలిపిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం, జీవనం కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ మానవాళికి మార్గదర్శనం చేసే వెలుగుదివ్వెలు. ఆచార్యుడు, తత్త్వవేత్త, విజ్ఞానఖని, వివేకధుని సర్వేపల్లి. రెండు సార్లు ఉపరాష్ట్రపతి అయ్యారు. అత్యున్నతమైన రాష్ట్రపతి స్థానంలోనూ కూర్చొని, ఆ పదవికి, గురువు అనే పదానికి, భారతదేశానికి అనుపమానమైన ఖ్యాతి తెచ్చిపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ అక్షరాలా తెలుగువాడు. తమిళనాడులోని తిరుత్తణి గ్రామానికి వలస వెళ్లిన తెలుగు దంపతుల గారాలపట్టి. తిరుత్తణి, తిరుపతి, నెల్లూరు, మద్రాస్ లో విద్యాభ్యాసం సాగించారు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలతో ఉత్తమ విద్యార్థిగా మన్ననలు పొందారు.అతిపిన్న వయస్సులో 21సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉపన్యాసకుడి పదవిని పొందారు. తత్త్వశాస్త్రంలో సర్వేపల్లి ప్రతిభకు అచ్చెరువు చెందిన మైసూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ వి నంజుండయ్య మైసూర్ విద్యాలయానికి ఆహ్వానించి ప్రొఫెసర్ గా నియమించి గౌరవించారు. సర్వేపల్లి ప్రతిభా ప్రయాణం అంతటితో ఆగలేదు. అప్రతిహతంగా సాగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అశుతోష్ ముఖర్జీ వంటి మహామహులు సర్వేపల్లిని కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆచార్యునిగా ఆహ్వానించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత వైస్ ఛాన్సలర్ గా పదవిని చేపట్టి, విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను జగద్విదితం చేశారు. సుప్రసిధ్ధ ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు గౌరవ ఆచార్యుడిగా అమెరికా, చైనా మొదలైన దేశాల్లో తత్త్వశాస్త్రంపై అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి, ఆ దేశ విద్యార్థులతో పాటు , ఆచార్యులను కూడా చైతన్య పరిచారు. సర్వేపల్లి కేవలం విజ్ఞానఖని కాదు, అద్భుతమైన ప్రసంగకర్త. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ ఏ భాషలో మాట్లాడినా, ఆ ప్రసంగం పరమ ఆకర్షణీయం. ఏ విషయం స్పృశించినా స్ఫటిక సదృశమైన స్పష్టతతో ఆ ఉపన్యాసం సాగేది. విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పిన సందర్భాల్లో 20నిముషాల సేపు మాత్రమే గంభీరంగా పాఠ్యాంశం చెప్పేవారు. పీరియడ్ లోని మిగిలిన సమయంలో అనేక అంశాలు, విషయాలు విద్యార్థులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో సలలితంగా చెప్పేవారు. దీని వల్ల విద్యార్థులకు పాఠ్యాంశంతో పాటు అనేక లౌకిక, అలౌకిక అంశాలు తెలిసేవి. వ్యక్తిత్వ సంపూర్ణ వికాసానికి సర్వేపల్లి ఉపన్యాసాలు మూల స్థంభాలై, పునాదులై నిలిచేవి. మానవుని మెదడు 20నిముషాలకు మించి సీరియస్ గా ఒక అంశాన్ని విని గ్రహించలేదనే మనస్తత్వశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని, సర్వేపల్లి రాధాకృష్ణ పాఠాలు చెప్పేవారు. తత్త్వశాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రం ఎరిగి, విద్యా పరమైన మనోవిజ్ఞానశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) తెలిసి, బోధనలో ఆచరించిన సర్వోత్తమ ఆచార్యుడు సర్వేపల్లి. ప్రపంచ తత్త్వశాస్త్రాలన్నీ అద్భుతంగా అధ్యయనం చేయడమేకాక, భారతీయ తాత్త్విక చింతనను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు. వివేకం, తర్కం ఇమిడి ఉన్న భారతీయ తాత్త్వికతను అర్ధం చేసుకోవడమంటే, సాంస్కృతిక చికిత్సను పొంది, దివ్య ఔషధాన్ని స్వీకరించి, శరీరాన్ని, మనసును తేజోమయం చేసుకోవడంగా భావించి, అనుభవించి, ఆ అనుభవ సారాన్ని ప్రపంచ మానవులకు పంచిన విశ్వ ఆచార్యుడు సర్వేపల్లి. సర్వేపల్లి జీవితం నుండి ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవచ్చు. ఎంతో పేదరికం అనుభవించారు. అనాసక్తిగానే తత్త్వశాస్త్రం తీసుకున్నప్పటికీ, దాన్ని హృదయంలోకి మలచుకొని, తత్వశాస్త్రానికి మరోరూపంగా అవతరించిన సర్వేపల్లి మానసిక ప్రయాణం చాలా గొప్పది. కాలమాన పరిస్థితులను అర్ధం చేసుకొని, అన్వయం చేసుకొని, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా స్వయం ప్రేరణ పొంది, అనుకూలమైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుని, గెలుపు సాధించిన గొప్ప సాధకుడు సర్వేపల్లి. తండ్రికి చదివించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో, ఒక దశలో చదువు మాన్పించి పూజారిగా చేరిపొమ్మన్నారు. చదువంటే ఉండే అమిత ఇష్టంతో కష్టపడి చదివి, ఉపకారవేతనాలతోనే విద్యాభ్యాసం మొత్తం కొనసాగించిన గొప్ప ప్రేరణామూర్తి సర్వేపల్లి. అరిటాకు కూడా కొనలేని స్థితిలో నేలను శుభ్రం చేసుకొని, భోజనం చేసిన రోజులు కూడా రాధాకృష్ణ జీవితంలో ఉన్నాయి. రాష్ట్రపతిగా వైభవమైన సౌధాల్లో జీవించే కాలం వచ్చినా, నేలను, గతాన్ని మర్చిపోలేదు. వైభవం, వైరాగ్యం సమానంగా తీసుకొని, వాటికి అతీతంగా మనసును ఉన్నత స్థితిలో నిలుపుకొని, నిరాడంబరమైన జీవితం గడిపిన నిజమైన తత్త్వవేత్త సర్వేపల్లి. విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు ప్రేమను పంచిన అనురాగమూర్తి. చైనా, పాకిస్తాన్ తో యుద్ధాలు జరుగుతూ భారతదేశం అత్యంత క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రులకు చక్కని మార్గాలు చూపించిన మార్గదర్శకుడు. నిరంతర జ్ఞానచింతనాపరుడు. గొప్ప చదువరి. సొగసరి కూడా. అధ్యాపకుడుగా విద్యార్థులను, ఉపకులపతిగా విశ్వ విద్యాలయాలను, రాష్ట్రపతిగా దేశ ప్రధానులను, విశ్వవిజ్ఞానఖనిగా తాత్త్విక విశ్వాన్ని మార్గదర్శనం చేసిన మహోన్నతమైన గురువు. సాధారణ ఉపాధ్యాయుడి దశ నుండి రాష్ట్రపతిగా, విశ్వవిద్యా గురుపీఠాధిపతిగా విశిష్ట గురుస్థానాన్ని పొందిన సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని, ప్రేరణగా నిలుపుకొని విద్యార్థులు, గురువులు, పాలకులు, బోధకులు తమ యాత్రనుసాగిస్తూ, తమ పాత్రను పోషించడమే సర్వేపల్లికి మనం సమర్పించే నిజమైన నివాళి. గురువులను తలుచుకోవడం, కొలుచుకోవడం, విద్యావ్యవస్థకు గౌరవాన్ని కాపాడడమే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలో జరిగే ఒరిగే నిజమైన ప్రయోజనం.భారతీయఆత్మ సర్వేపల్లి. ఈ మహనీయుని దివ్యస్మృతికి నీరాజనాలు పలుకుదాం-మాశర్మ🙏

మంత్ర పరిశీలన

వక విశేషమైన మంత్ర పరిశీలనలో ' హ్వయాం అగ్నిం ప్రధాన స్వస్తయే హ్వయామి మిత్రా వరుణా వి హావసే హ్వయామి రాత్రీం జగ తో నివేశనీం హ్వయామి దేవం సవితాః అమూతయే అని మనం రోజూ సూర్యరశ్మిని చంద్ర కాంతిని ఎందుకు దర్శించి వీటి వలన మానవ నిర్మాణానికి ఫలమేదైనను కలదా. పరిశీలించిన అది ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ, అని అదే సాయం సమయంలో ఆకృష్ణేన అని వక చిన్న తేడా మంత్రంలో సత్యము బదులుగా అనగా చూసిన కిరణ శక్తి సత్యమే, అది సాయం సమయంలో కృష్ణేన అని మిగిలిన మంత్రం అంతా వకటే. సూర్యుని కిరణ లక్షణము అనగా చైతన్య మైనది సత్యమని తెలియును. కాని దాని లక్షణము చంద్రకాంతివలననే అనగా స్స్వీకరించినగాని,లేక అనుభవించినగాని అగ్ని లక్షణము చంద్ర దర్శనమువలన మానవ జీవ వుత్పత్తికి మూలమని తెలియును. యిది ఏ రోజుకు ఆరోజే దాని లక్షణం వివిధ రకములుగా యుండును అదే ప్రకృతిని ఆశ్వాదించుట. నిజంగా ప్రకృతిలో లేదు. అది మనలోనే ఉదయమే సూర్యుని నుండి నిల్వ చేయబడి చంద్ర దర్శనం అవగానే దాని లక్షణము మనస్సుకు తెలిసి ప్రేరణ అందుకే కృష్ణేన అనగా చీకటిలోనే తత్వం తెలియుటకై అలాగని చీకటి కాదు కొంత వెన్నెల రూపంలో. అనగా ప్రకృతిని సమ పాళ్ళలో ఆశ్వాదించుట జీవ లక్షణమని తెలియును. సూర్యకిరణాలు వలన మనలో యున్న శక్తి చార్జి చేయబడి చంద్ర కాంతి దానికి ఇగ్నీషియమ్గా పనిచేయును. అప్పుడే మనస్సు అహ్లాదకరమైన ప్రకృతి లక్షణమును ఆశ్వాదించుట. యిది యే పై మంత్రం సారాంశం. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అన్నదానం..ఆశీర్వాదం.

"రాబోయే ఆదివారం నాడు మేము అన్నదానానికి సరుకులు తెస్తాము..మా పేరుతో అన్నదానం చేయండి.."అన్నారా దంపతులు..వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా సార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు..అసలు వాళ్లు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచీ..అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది..

"పదేళ్ల క్రిందట మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము..అప్పటినుండి ప్రతి ఏడూ రెండుసార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్లడం అలవాటుగా మారింది..నాకు పెళ్ళైన ఆరేళ్ల దాకా పిల్లలు పుట్టలేదు..మా ఆయన నేనూ ఇక్కడికి వచ్చాము..ఆ స్వామికి మ్రొక్కుకున్నాము..ఇదిగో ఈ ఇద్దరూ స్వామి దయవల్ల పుట్టారు.." అని తన తొమ్మిదేళ్ల వయసున్న కూతురిని, ఏడేళ్ల కుమారుడిని చూపించింది సుశీలమ్మ..వాళ్ళది కనిగిరి దగ్గర పల్లెటూరు..

"వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకొస్తాము..ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాము కదా..ఈసారికూడా అన్నదానం చేయిస్తాము.." అని మళ్లీ గుర్తు చేస్తున్నట్లు చెప్పింది..సరే అన్నాను..

మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తువున్నాయి..సంతానం కోసం ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు..మందిరం లోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు..అప్పుడు నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఇక్కడ ఒక శనివారం కానీ ఆదివారం నాడు కానీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందీ.." అని అడిగారు..ఒక్కొక్కపూటకు సుమారు మూడు నాలుగు వందల మందికి సరిపడా అన్నదానం చేయాలంటే (ఇది పదేళ్ల క్రిందటి లెక్క..ఇప్పుడు ఒక్క శనివారం రాత్రికే సుమారు వెయ్యిమందికి తయారు చేయాలి) ఎంత అవుతుందో వివరంగా చెప్పాను..సరే నని తలవూపి వెళ్లారు..

ఆ తరువాత ఒక గంట గడిచింది..సుశీలమ్మ భర్త వచ్చి.."వచ్చే వారమే మేము అన్నదానం చేస్తాము..మీరు సరుకుల లెక్క ఇవ్వండి.." అన్నాడు..సహజంగా ఎవరైనా తాము కోరిన కోర్కె తీరిన తరువాత తమ మ్రొక్కు చెల్లించుకుంటారు..ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేస్తామని చెపుతున్నారు..నా మనసులో మాట గ్రహించారో ఏమో.."అయ్యా..నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను..కానీ తాను మాత్రం ఇప్పుడే చేయాలని పట్టు బడుతున్నది.." అన్నాడు..

"ఆదివారం మధ్యాహ్నం కనీసం మూడు నాలుగు వందల మందికి మనం ఆహారం అందిస్తే..ఆకలి తీరిన అంతమందిలో ఎవరో ఒక్కరన్నా మనలను తృప్తిగా దీవిస్తారు కదా..ఆ దీవెనలు..శ్రీ స్వామివారి ఆశీస్సులు.. ఫలించి మా కోరిక త్వరగా తీరుతుందేమోనని ఆశ!..మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితం అని చాలామంది ఇక్కడ అనుకోవడం విన్నాను..అందుకోసం వచ్చే వారం అన్నదానం చేద్దామని అనుకున్నాను.." అన్నది సుశీలమ్మ..

నిజమే అనిపించింది..ఎవరి ఆశీర్వాదం లో ఎంత బలమున్నదో ఎవరికి తెలుసు?..ఈ ఆలోచనకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడు..అనుకున్న విధంగానే ఆ పై వారం ఆ దంపతులు అన్నదానం చేశారు..

మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..ఇంకో రెండేళ్లకు కుమారుడు కలిగాడు..ఆ దంపతులు మాత్రం ప్రతిసారీ అన్నదానం చేయడం మర్చిపోలేదు..ఎప్పుడన్నా తమకు వీలులేకపోతే..ఒకటి రెండు వారాలు ముందుగానే వచ్చి..తాము అనుకున్న రోజుకు అన్నదానం జరపమని మాకు చెప్పుకొని వెళుతుంటారు..ఏనాడూ కూడా తాము అన్నదానం చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు..తాము పేరు కోసం చేయటం లేదనీ..తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామనీ చెప్పుకుంటారు..ఇలాటి ఆలోచన గల వాళ్ళు తక్కువ మంది ఉంటారు..

మందిరం వద్దకు వచ్చే అందరు భక్తులూ ఒక లాగా వుండరు..ఒక్కొక్కరివి ఒక్కక్క విధమైన ఆలోచనలు..అందరి కోర్కెలు తీర్చి..వాళ్ళ వాళ్ళ తాహతును బట్టి..ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్లకు అప్పచెప్పి..మధ్యలో మమ్మల్ని కర్తలుగా నిర్ణయించి..ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపిస్తుంటారు శ్రీ స్వామివారు..

సర్వం..
శ్రీ దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

*** గురువు ***


''''''’''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
అక్షర లక్షణ తత్త్వము తెలిసిన
   జాగృత రూపమె గురువు.
అక్షర మయమౌ జీవన ఉపాధి
  ప్రాప్తికి మూలము గురువు.

  మనిషి మేధస్సు ప్రక్షాళనకు
    అక్షరాయుధుడె గురువు.
మనను సులక్షణ పథమున నడిపే
    విధ్వత్ జ్ఞానమె గురువు.

ఆకలి ఎఱుగని బ్రతుకు తెరువునకు
   రైతు సాధనలు కారణము.
మనసు ధన్యమౌ బ్రతుకు బాటకు
   గురు బోధనలే ప్రేరణము.

   డాక్టరులైనా యాక్టరులైనా
    కండక్టరులు కలెక్టరులైనా
  ఇలలో ఏ మేధావులుయైనా
గురువుల మానస పుత్రులు కాదా !

గురువే బ్రహ్మా, గురువే విష్ణు,
గురువే ఈశ్వరుడనుట ప్రతీతి.
గురువే ఇహమున కనబడు దైవము
    జ్ఞాన ప్రకాశక అతిథి !

భావి జీవితము సుఖమయ మగుటకు
    ప్రభావితము ఈ గురువు.
చివరకు దేవుని ఎఱిగి నడుచుకొను
      ముక్తి కారకుడు గురువు.

 అందుకె గురువును సేవించు !
 చక్కని జ్ఞానము సంపాదించు !
 చక్కని మనుగడ కొనసాగించు !
 చక్కని కీర్తిని ఆస్వాదించు !

       *********************
రచన :--రుద్ర మాణిక్యం .

రామాయణమ్. 52


...
రామా! నీవు నాకు పుట్టకపోయినా బాగుండేదిరా
నాయనా ఈ శోకం తప్పేది! నాకు దుఃఖము కలిగించటానికే పుట్టావు నాయనా నీవు .గొడ్రాలికి ఒకటే శోకం ! పిల్లలులేరే అని ! .
.
మీ తండ్రి గారి ఏలుబడిలో నేను ఏ మంగళముగానీ ,సుఖముగానీ ఎరుగను నీ అధికారములో అవి అనుభవించవచ్చులే అని నా ఆశ!.
.
నా కేం తక్కువ? అయినా సవతులచేత మాటలుపడ్డాను.కైక పెట్టిన అవమానములు భరించాను ,ఆవిడ మాటలు విని నీ తండ్రి నన్ను చిన్న చూపు చూసినా అన్నీ నీవున్నావులే అనే ఆశతో సహించాను ! ఓపిక పట్టాను ! ఇక ముందు నా గతి ఏమి కాను ? భరతుని చూసి భయముతో అందరూ నన్ను కనీసం పలకరించనైనా పలకరించరు!
.
రామా ఈ వార్త విని నా గుండె బ్రద్దలవటం లేదేమిరా,ఇంత రాయి అయినదేమిరా నాయనా ఇది!.నాకు యమలోకములో కూడా చోటులేదు!అని అంటూ కొడుకుకు కలిగిన కష్టాన్ని తలుచుకుంటూ పరిపరి విధాలుగా రోదించి రోదించి కంట కన్నీరు కూడా ఇంకిపోయిందామెకు!.
.
పెత్తల్లి రోదనలు వింటున్న లక్ష్మణుడు దీనంగా ,అన్నా ! ఒక ఆడుదాని మాటకు గౌరవమిచ్చి నీవు అడవులకు వెళ్ళటమెందుకు?.
.
ముసలివాడైన రాజుకు ఇంకా కోరిక చావక కామంతో కళ్ళుమూసుకుపోయి అనాలోచితంగా అనుచితమైన కోరిక కోరాడు.
.
బుద్ధిగలవాడెవెడయినా సద్గుణాలప్రోవు అయిన కుమారుడిని పోగొట్టుకుంటాడా! మతిభ్రమించిన రాజాజ్ఞ ను నీవు పాటించనక్కరలేదు!.
.
అన్నా పద ! ఇప్పుడే ఈ క్షణమే ఈ రాజ్యాన్ని మనము చేజిక్కించుకుందాము!
.
రాజా! బూజా! తరాజా! ఎవడైననేమి? వాడి అంతు చూద్దాము! అవసరమయితేబుద్ధిలేనిరాజునువధించనయినావధిస్తాను.
.
భరతుడి పక్షము వారెవరెవరయినా అడ్డువస్తే చీల్చి చెండాడతాను ! అనుజ్ఞ ఇవ్వన్నా!
.
ఏ బలం చూసుకొని రాజు నీతో వైరం పెట్టుకున్నాడు ఎదిరించి నిలువగలడనేనా?.
.
నా ధనుస్సుమీద,సత్యముమీద, నేను చేసిన దానయజ్ఞాలమీద అవిచ్చిన ఫలాల మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. రాముడు అగ్నిలో దూకాల్సివస్తే ఆయన కన్నా ముందే దూకుతాను.
.
రాముని కష్టాన్ని తొలగించలేని నా పరాక్రమము బూడిదలో పోయటానికా!
.
తీవ్రమైన ఆగ్రహావేశాలతో కన్నుల నుండి విస్ఫులింగాలు రాలుతున్నాయి. ముఖము కందగడ్డలా మారిపోయింది! క్రోధంతో ఊగిపోతున్నాడు లక్ష్మణుడు.
.
 కానీ ఆయన క్రోధ సముద్రము రాముడు అనే చెలియలికట్ట దాటలేకుంది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

శివామృతలహరి శతకంలోని

 .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
సత్యంబెన్నగ తల్లి:తండ్రియగు విజ్ఞానమ్ము: ధర్మాదులౌ
న్నత్యంబున్ ఘటియించు సోదరులు;ప్రాణంబిచ్చు నేస్తంబు సం
స్తుత్యంబై చను సత్కృపాగుణము;చేతోమోదముంగూర్చు స
తృత్యంబయ్యెది నాకు నెచ్చెలి యగున్ శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;
సత్యమే నా తల్లిగా భావిస్తాను, విజ్ఞానాన్ని నా తండ్రిగా, ధర్మ ప్రవర్తనని నా సోదరుడిగా ,దయా గుణాన్ని ఎప్పటికీ నాతో నిలిచి ఉండే మిత్రుడిగా,
నాకు సంతోషాన్ని కలిగించే సత్కృత్యం(మంచి పని) నాతో ఎప్పటికీ ఉండే నిచ్చెలిలా భావిస్తాను.
అంటూ సత్య జ్ఞాన ధర్మ దయా సత్కృతులతో 
భాసిల్లుతూ జీవనం సాగించాలనే ఆయన అభిమతాన్ని నాన్న గారు ఈ పద్యం లో వివరించారు.

*మజ్జిగమీద తేట:*

*వేసవిలో మజ్జిగ పానీయాల
“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమశివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” *యోగరత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. *మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*

వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. *తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు*. అ౦దుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *#ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవుతు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు#. చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.*

*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:*   
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. #వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది#*.

*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*
*#పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
*1.* బాగా కడిగిన ఒక చిన్న కు౦డ లేదా ము౦త తీసుకో౦డి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరల మీద *వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ)* కట్ట౦డి. *ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “ప౦చదార” కలిపి, ఈ మిశ్రమాన్ని “చల్లకవ్వ౦”తో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్ట౦డి*.
*2.* పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్ర౦లో౦చి క్రి౦ది ము౦తలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా అవాడుకో౦ది. ఈ *రసాల* కు దానితో పని లేదు. ము౦తలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని *‘ద్రప్య౦’* అ౦టారు. ఈ *‘ద్రప్య౦’* ని౦డా *లాక్టోబాసిల్లస్* అనే *ఉపకారక సూక్ష్మజీవులు* ఉ౦టాయి. అవి *పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి*. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు
*3.* ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టి౦పు కొలతలో తీసుకొని ము౦తలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వ౦తో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అ౦దులో *”ఏలకుల” పొడి, “లవ౦గాల” పొడి, కొద్దిగా “పచ్చకర్పూర౦”, “మిరియాల” పొడి కలప౦డి*. ఈ కమ్మని పానీయమే *రసాల*! *#దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.#*
*4.* ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమాన౦గా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! *”శొ౦ఠి”, “మిరియాలు”, “ధనియాలు”, “జీలకర్ర”, “లవ౦గాలు”, చాలా స్వల్ప౦గా “పచ్చకర్పూర౦” వీటన్ని౦టిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ “రసాల”లో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మక౦గా ఉ౦టు౦ది*.
*5.* *మజ్జిగ మీద తేటలో కేవల౦ ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉ౦టాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉ౦టాయి*. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట.
ఇది *”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦*. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. *వడ దెబ్బ తగలనీయదు. శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. “కామెర్ల” వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది*. *#పెరుగు మీద తేట, వైద్యపర౦గా, చెవులను బలస౦పన్న౦ చేస్తు౦దని “ఆయుర్వేద శాస్త్ర౦” చెప్తో౦ది. “చెవిలో హోరు(టినిటస్)”, చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు “(వెర్టిగో)” లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦* గా పని చేస్తు౦దన్నమాట.

*వేసవి కోస౦ “తేమన౦” అనే పానీయ౦:*
*తేమన౦* అనేది *శ్రీనాథుడి* కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని “తిపి”గానూ, “కార౦”గానూ రె౦దు రకాలుగా తయారు చేసుకొ౦టారు. *”మజ్జిగ”లో “పాలు”, “బెల్ల౦” తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తెలుగు పానీయ౦ తయారౌతుంది*. *#ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తినిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. దీన్ని “తీపి మజ్జిగ పులుసు” అనవచ్చు#*.

ఇ౦క *“కార౦” మజ్జిగపులుసు* గురి౦చి మనకు తెలిసినదే! *పులవని “చిక్కని మజ్జిగ” తీసుకో౦డి. వెన్న తీసిన మజ్జిగ అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. ఈ మజ్జిగలో “అల్ల౦”, “మిర్చి”, “కొత్తిమీర”, ఇతర స౦బారాలు (ఆహారపదార్థములలో అవసరమునుబట్టి రుచిని, పరిమళమును, ఆహారయోగ్యతను ఎక్కువ చేయుటకు చేర్చబడుచుండు వస్తువులు [Spices and condiments]) వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తు౦ది. మజ్జిగ పులుసు వేసవి కోస౦ తరచూ వ౦డుకొవాల్సిన వ౦టక౦ అని గుర్తి౦చ౦డి!*

*ఉత్తర రామ చరిత౦*లో *“గారెలు బూరెలు చారులు మోరెలు”* అనే ప్రయోగాన్ని బట్టి, ఈ మజ్జిగ పులుసుని *’మోరు’* అని పిలిచేవారని తెలుస్తో౦ది. *”బియ్యప్పి౦డి”, “అల్ల౦” తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వ౦డుతారు. ఈ ఉ౦డల్ని ‘మోరు౦డలు’ అ౦టారు. వీటిని ఆవడ(పెరుగువడ)లాగా తినవచ్చు*. పర్షియన్లు ఇష్ట౦గా వ౦డుకొనే Cacık అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మషాలా బాగా కలిపి, రొట్టెల్లో న౦జుకొ౦టారు కూడా!

*మె౦తి మజ్జిగ:*
* మె౦తులు తేలికగా నూరి చిక్కని పులవని మజ్జిగలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని “మె౦తి మజ్జిగ” అ౦టారు. “మజ్జిగ చారు” అని కూడ పిలుస్తారు*. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! *మామూలు మజ్జిగకన్నా అనునిత్య౦ మజ్జిగచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. #ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది#*.

*తీపి లస్సీ:*
*మజ్జిగలో “ప౦చదార” లేదా “తేనె” కలిపిన పానీయమే లస్సీ*! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. *వేసవికాల౦లో “నిమ్మరస”౦, “జీలకర్ర” పొడి, “ఉప్పు”, “ప౦చదార” కలిపి “పుదీనా ఆకులు” వేసిన లస్సీ #వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది#*. తెలుగులో దీన్ని *‘సిగరి’* అ౦టారు. *శిఖరిణి* అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. *చిక్కని మజ్జిగ అయితే “లస్సీ” అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే “‘చాస్’” అనీ పిలుస్తారు*. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్ Cacık అనేది మన మజ్జిగ పులుసు లా౦టిదే!

*మజ్జిగమీద తేట:*
మజ్జిగమీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. *చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తుల వరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా ఉంచ౦డి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. మజ్జిగ తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి మజ్జిగనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు*. మజ్జిగ వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!

*#ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి:#*
*చక్కగా “చిలికిన మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు*.

ఆధునిక వివేకానందుడు

----/ఆధునిక వివేకానందుడు/--డా. సర్వేపల్లి రాధాకృష్ణ---------అది ఒక చారిత్రాత్మక మైన రోజు.......
ఆ రోజు మైసూర్ యూనివర్సిటీ లో ఒక ఆచార్యుని ఇంటి ముందు ఎంతో మంది విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. వారందరి ముఖాలలో నైరాశ్యం,నిస్పృహ తాండవిస్తున్నాయి.ఇంక కొద్దిసేపటిలో తమందరికి తండ్రితో సమానమైన గురువు,గురువు అన్న పదానికే నిలువెత్తు నిదర్శనం అయిన ఓ మహనీయుడు ఇంక కొద్దిసేపటిలో వాళ్ళదగ్గర నుంచి కలకత్తా నగరానికి వెళ్ళబోతున్నాడు.అదీ వారి నిస్పృహకు కారణం.
ఇంటి వాకిట్లో మైసూర్ మహరాజా పంపిన జోడు గుఱ్ఱాల సార్ట్ బండి సిద్దంగా ఉంది.సన్నగా రివటలా ఉన్న ఆ యువ గురువు బయటకు వచ్చి తన తలపాగా సర్దుకుని సార్ట్ బండిలో కూర్చున్నాడు.
అప్పుడు జరిగింది ఆ అద్భుతం!!!!!
ఒక్కసారిగా ఆ విద్యార్థులు అందరూ ఆ గుఱ్ఱపు బండికి అడ్డంగా నిల్చున్నారు.బండికి కట్టిన గుఱ్ఱాలను విప్పేశారు.బండి కాడిని తమ భుజాలపై వేసుకుని ఆ గురువును అక్కడికి3 కిలోమీటర్ల దూరంలోని మైసూరు రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి రైలు డ్రైవర్లకు తమ గురువుగారిని జాగ్రత్తగా గమ్యం చేర్చవలసిందిగా వేడుకున్నారు.
ఆధునిక భారతంలో మరే గురువుకు ఇంతటి ఆదరణ లభించలేదు.
ఆ గురువు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్.
ఆ రోజు గురువును భుజానికెత్తుకొని తీసుకెళ్ళిన ఆ విద్యార్ధులందరి నాయకుడు ఆ తరువాత రోజుల్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.....
కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి గా నిలిచిపోయాడు.అతని పేరు నిజలింగప్ప......
*****///**********
ఒకసారి కొందరు పెద్దలు రాధాకృష్ణన్ గారితో మాట్లాడుతూ" మీరు ఎంతో గొప్ప మేధావులు. కానీ మీరు ఏ ఆక్స్ ఫర్డ్,కేంబ్రిడ్జి లాంటి యూనివర్సిటీ లలో చదువుకుని ఉండిఉంటే మీ మేధకు మరింత గుర్తింపు వచ్చి ఉండేది"అన్నారు.
దానికి రాధాకృష్ణన్ సమాధానమిస్తూ "నేను ఆ యూనివర్సిటీ లకు ఓ విద్యార్ధిగా కాక ఓ ఆచార్యుని గా మాత్రమే వెడతాను"అన్నారు.
అలాగే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పెర్మనెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ గానే అక్కడ అడుగుపెట్టిన మహనీయుడు ఆయన.
***///************
స్వతంత్ర భారత దేశపు రాయబారి గా రష్యాలో అడుగు పెట్టిన రాధాకృష్ణన్ మర్యాదాపూర్వకంగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ను కలవడానికి వెళ్ళినప్పుడు స్టాలిన్ ఆయనను నిర్లక్ష్యం చేశాడు. రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళి తన విధులను నిర్వర్తించడం మొదలు పెట్టారు.
ఓ రోజు అర్ధరాత్రి స్టాలిన్ దగ్గర నుంచి ఆయనకు పిలుపొచ్చింది.
రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరకు వెళ్ళి భుజాలపై చేతులు వేసి ఆరోగ్యంగా ఉన్నారా అని పలకరించారు.స్టాలిన్ ను అప్పటి వరకూ ఆరకంగా పలకరించిన వారెవరూ లేరు.స్టాలిన్ కరిగి పోయాడు.ఆనాటి నుండి రాధాకృష్ణన్ మహాశయునికి స్టాలిన్ ఎంతో గౌరవమిచ్చాడు.
***///************
రాధాకృష్ణ పండితులు రాష్ట్రపతిగా ఉండగా అప్పటి గ్రీకు దేశాధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చారు.
ఆయనకు స్వాగతం చెబుతూ మీరు మా దేశానికి మా ఆహ్వానం పై వచ్చారు.కానీ శతాబ్దాల క్రితం మీ దేశం నుంచి మా ఆహ్వానం లేకుండానే మీ చక్రవర్తి ఒకరు వచ్చి మమ్ములను అనేక ఇబ్బందులకు గురి చేశాడు.
మీరు వారిలా కాక మంచి మనసుతో విచ్చేశారు. మీకు భారతప్రజానీకం స్నేహ హస్తాన్ని అందిస్తోంది.అంటూ అలగ్జేండర్ పై భారతీయులకున్న దృక్పథాన్ని వెల్లడించారు.
****///***********
స్వతంత్ర భారత దేశానికి తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా లిండన్ జాన్సన్ వచ్చారు.
భారత సంయుక్త పార్లమెంట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుని పరిచయం చేయమని రాధాకృష్ణన్ ను జవహర్ లాల్ నెహ్రూ హఠాత్తుగా కోరారు.
అప్పటికప్పుడు ఆశువుగా అమెరికా అధ్యక్షుని పరిచయం చేశారు రాధాకృష్ణన్.
అమెరికా అధ్యక్షుడు తాను తయారు చేసుకున్న ప్రసంగ పాఠాన్ని తడబడుతూ చదివి కూర్చున్నాడు.
తరువాత అప్పటి అమెరికా లోని భారత రాయబారి ఎమ్.సి.చాగ్లాను తన కారెక్కించుకుని మీ ప్రెసిడెంట్ నిజంగా భారతీయుడేనా లేక ఆంగ్లేయుడా?ఆయన మాట్లాడిన తీరుతో నా ప్రసంగాన్ని తడబడుతూ చదవ వలసి వచ్చింది. అని అన్నారు జాన్సన్.
ఒక అమెరికా అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కన పెట్టి ఒక దేశపు రాయబారిని తన కారులో కూర్చోబెట్టుకోవడం చరిత్రలో ఆ ఒక్కసారి మాత్రమే జరిగింది.
*****///**********
ఇప్పటికీ ఆంధ్రవిశ్వ కళాపరిషత్,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల గోడలను తడిమితే ఆ మహిమాన్వితుని కంఠం వినిపిస్తూనే ఉంటుంది.ఆయన తిరుగాడిన ఆ విద్యాలయాల వరండాలలో ఆయన స్ఫూర్తి నిరంతరంగా అందుతూనే ఉంటుంది. సంద్రం దగ్గరకు కడవ తీసుకుని వెడితే కడివెడు నీళ్ళే...గరిటయితే గరిటెడు నీళ్ళే...!!
------

*భాగవతామృతం*


శానకాదుల ప్రశ్నలు

1-40-క.కంద పద్యము

ఆ తాపసు లిట్లనిరి, వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హరి గుణ సం
ఘాతున్, సూతున్, నితాంత కరుణోపేతున్.
ఆ = ఆ; తాపసులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి; వినీతున్ = విశిష్టమైన నీతిగల వానిని; విజ్ఞాన = విజ్ఞాన మయ; ఫణిత = విధానంలో; నిఖిల = అన్ని; పురాణ = పురాణాల; వ్రాతున్ = సమూహము గలవానిని; నుత = స్త్రోత్రము చేయబడిన; హరి = విష్ణుని; గుణ = గుణముల; సంఘాతున్ = సమూహాలున్న వానిని; సూతున్ = సూతుని; నితాంత = ఎల్లప్పుడు; కరుణ = దయతో; ఉపేతున్ = కూడినవాని.
ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు
1-41-మ.మత్తేభ విక్రీడితము

"సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులున్ ధర్మ శా
స్త్రములుం నీవ యుపన్యసింపుదువు వేదవ్యాసముఖ్యుల్మునుల్
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం దత్ప్రసా
దమునం జేసి యెఱుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!
సమతన్ = సమబుద్ధితో; తొల్లి = ఇంతకు ముందు; పురాణ = పురాణముల; పంక్తులు = సమూహాలు; ఇతిహాస = ఇతిహాసాల; శ్రేణులున్ = సమూహాలను; ధర్మశాస్త్రములున్ = ధర్మశాస్త్రములను; నీవ = నీవు; ఉపన్యసింపుదువు = వివరించి చెప్పుదువు; వేదవ్యాస = వేదవ్యాసుడు; ముఖ్యుల్ = మొదలైన ముఖ్యమైనవారు; మునుల్ = మునులు; సుమతుల్ = మంచి మనసు గలవారు; సూచినవి = చూచినవి; ఎన్ని = ఎన్నున్నాయో; అన్నియును = అన్నీ; తోఁచున్ = స్పురించును; నీ = నీయొక్క; మదిన్ = మనసుకు; తత్ = వారియొక్క; ప్రసాదమునన్ = అనుగ్రహము; చేసి = వలన; ఎఱుంగనేర్తువు = గ్రహించగలవు; సమస్తంబున్ = సమస్తమును; బుధ = జ్ఞాన; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడా.
“సుధీమణులలో ప్రథమగణ్యుడ వైన సూతమునీంద్రా ! నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్ర్తాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల నీ బుద్ధికి అందని దంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు.
1-42-క.కంద పద్యము

గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
గురువులు = గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్టమైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.
గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
1-43-క.కంద పద్యము

మన్నాఁడవు చిరకాలము
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.
మన్నాఁడవు = బ్రతికితివి; చిర = చాలా; కాలము = కాలము; కన్నాఁడవు = దర్శించితివి; పెక్కులైన = అనేకమైన; గ్రంథ = గ్రంథముల; అర్థంబుల్ = సారములను; విన్నాఁడవు = విన్నావు; వినఁదగినవి = వినదగినవి; ఉన్నాఁడవు = ఉన్నావు; పెద్దలొద్దన్ = పెద్దల దగ్గర; ఉత్తమ = మంచి; గోష్ఠిన్ = చర్చలలో.
చక్కటి గోష్ఠులలో, మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు.
1-44-చ.చంపకమాల

అలసులు, మందబుద్ధియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ధి = బుద్ధి; యుతులు = కలిగినవారు; అల్పతర = చాలా తక్కువ {అల్ప - అల్పతర - అల్పతమ}; ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = భయంకరమైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడిన ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = భాగ్యము కలవారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్ = ఏవియును; చేయఁజాలరు = చేయలేరు; ఈ = ఈ; కలియుగము = కలియుగము; అందున్ = లో; మానవులు = మనుషులు; కావునన్ = అందువలన; ఎయ్యది = ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది; ఐ = అయి; అలవడున్ = సిద్ధించునో; ఏమిటన్ = దేనివలన; పొడమున్ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; చెప్పవే = చెప్పుము.
మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.
1-45-సీ.సీస పద్యము

ఎవ్వని యవతార మెల్ల భూతములకు;
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ;
సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ;
భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల;
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;
1-45.1-తే.
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత!
ఎవ్వని = ఎవని; అవతారము = జన్మ, అవతరించుట వలన; ఎల్ల = అన్ని; భూతముల = జీవుల; కున్ = కు; సుఖమును = సుఖమును; వృద్ధియు = అభ్యుదయము; సొరిదిన్ = క్రమముగ; చేయున్ = కలుగునో; ఎవ్వని = ఎవని; శుభ = శుభకరమైన; నామము = పేరు; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడును; నుడువంగ = ఉచ్చరింపగా; సంసార = సంసారము యొక్క; బంధంబు = బంధములు; సమసి = నాశనము; పోవున్ = అగునో; ఎవ్వని = ఎవని; చరితంబున్ = కథలను; హృదయంబున్ = హృదయంలో; చేర్పంగ = పెట్టుకొంటే; భయము = భయము; ఒంది = పొంది; మృత్యువు = మృత్యువు; పరువున్ = పరుగును; పెట్టున్ = పెట్టునో; ఎవ్వని = ఎవని; పద = పాదముల వద్ద పుట్టిన; నదిన్ = నది లోని (గంగానది); ఏపాఱు = అతిశయించిన; జలములన్ = నీటిని; సేవింపన్ = సేవించగా; నైర్మల్య = నిర్మలత్వము; సిద్ధి = సమకూరుట; కలుగున్ = కలుగుతుందో; తపసులు = తాపసులు; ఎవ్వాని = ఎవని;
పాదంబున్ = పాదమును; తగిలి = భక్తితో తగులుకొని; శాంతి = ప్రశాంతతకు; తెరువున్ = మార్గమును; కాంచిరి = దర్శించిరో; వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవిలు; కున్ = కు; ఎవ్వఁడు = ఎవడు; ఉదయించెన్ = జన్మించాడో; తత్ = ఆ; కథలు = కథలు; ఎల్ల = అన్నీ; వినఁగన్ = వినవలెనని; ఇచ్చ = కోరిక; పుట్టెడున్ = పుట్టినది; ఎఱిఁగింపుము = తెలియ చెప్పుము; ఇద్ధ = ప్రశస్తమైన; చరిత = నడవడిక కలవాడా.
ఏ మహానుభావుడు అవతారించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా! సూతా! అవన్నీ మాకు వినిపించు.
1-46-క.కంద పద్యము

భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.
భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఎండగొట్టునవి, పోగొట్టునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.
శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను ఎండగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.

1-47-క.కంద పద్యము

కలిదోషనివారకమై
యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని
ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు
వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా!
కలి = కలికాలములోని; దోష = దోషములను; నివారకము = నివారించునది; ఐ = అయి; అలఘు = తక్కువగాని (ఏవిధంగాను) / గొప్ప; యశుల్ = కీర్తి గలవారు; పొగడునట్టి = స్తోత్రము చేయునట్టి; హరి = హరియొక్క; కథనమున్ = కథలు; నిర్మల = నిర్మలమైన; గతిన్ = మార్గమును; కోరెడు = కోరుకొనే; పురుషుఁడు = మనిషి; వెలయఁగన్ = ప్రసన్నమైతే; ఎవ్వాఁడున్ = ఎవడు మాత్రం; తగిలి = కుతూహలముతో; వినఁడు = వినడు; మహా = గొప్ప; ఆత్మా = ఆత్మకలవాడా / సూతా.
మహాత్మా! సూత! కలికాల దోషాలను పారద్రోలుతు, ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంస లందుకొన్న గోవిందుని కథలను, పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు.
1-48-ఆ.ఆటవెలది

అనఘ! విను రసజ్ఞులై వినువారికి
మాటమాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ
దలఁపు గలదు మాకుఁ దనివి లేదు.
అనఘ = పాపము లేనివాడా; విను = వినుము; రసజ్ఞులు = రస జ్ఞానము కలవారు; ఐ = అయి; విను = వినే; వారి = వారి; కి = కి; మాటమాటకు =ప్రతిమాటలోను; అధిక = మిక్కిలి; మధురము = తీయనిది; ఐన = అయినది; అట్టి = అగు; కృష్ణు = కృష్ణుని గూర్చిన; కథనము = విషయములు; ఆకర్ణనము = వినుట; సేయన్ = చేయాలని; తలఁపు = కోరిక; కలదు = కలదు; మాకున్ = మాకు; తనివి = తృప్తి (ఎంతవిన్నా); లేదు = తీరదు.
పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు.
1-49-మ.మత్తేభ విక్రీడితము

వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి
స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే?
వర = శ్రేష్ఠుడైన; గోవింద = కృష్ణుని {గోవింద - గోవులకు ఒడయుడు}; కథా = కథలు అను; సుధారస = అమృతపు; మహావర్ష = గొప్ప వర్షము యొక్క; ఉరుధారా = పెద్ద ధారాపాతపు; పరంపరలన్ = తెరలు వలన; కాక = కాకుండా; బుధేంద్ర = జ్ఞానశ్రేష్ఠులలో; చంద్ర = చంద్రుని వంటివాడా; ఇతర = ఇతరమైన; ఉపాయ = ఉపాయాల మీది; అనురక్తిన్ = అనురాగం వలన; ప్రవిస్తర = మిక్కిలి విస్తరించిన; దుర్దాంత = అణచుటకురాని; దురంత = అంతము చేయుటకు రాని; దుస్సహ = సహింపరాని; జనుస్ = జన్మముల యందు; సంభావిత = సంభవించుచున్న; అనేక = అనేకమైన; దుస్తర = తరింపరాని; గంభీర = లోతైన; కఠోర = కఠినమైన; కల్మష = పాపములు అను; కనత్ = మండుచున్న; దావానలంబు = కారుచిచ్చు; ఆఱునే = చల్లారుతుందా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావా!
1-51-వ.వచనము
మఱియుఁ గపటమానవుండును గూఢుండు నైన మాధవుండు రామ సహితుం డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నఁట; వాని వివరింపుము; కలియుగంబు రాఁగల దని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున.
మఱియు = ఇంకనూ; కపట = మాయవలన; మానవుండును = మానవ రూపం ధరించినవాడు; గూఢుండును = మాయవలన తెలియరానివాడు; ఐన = అయిన; మాధవుండు = లక్ష్మీదేవి భర్త; రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; అతి = అతీతమైనవి; మానుషంబులు = మానవులు చేయుటకు; ఐన = అయినట్టి; పరాక్రమంబులు = సాహసములు; సేసెన్ = చేసెను; అట = అట; వాని = వాటిని; వివరింపుము = వివరముగా చెప్పుము; కలియుగంబు = కలియుగము; రాఁగలదని = రాబోవుచున్నదని; వైష్ణవ = విష్ణువునకు సంబంధించిన; క్షేత్రంబున = సిద్ధస్థలమున / నైమిశారణ్యమున; దీర్ఘ = పెద్దదైన; సత్ర = సత్రయను పేరుగల యాగము; నిమిత్తంబున = కారణముగా; హరి = విష్ణుని; కథలు = కథలు; వినన్ = వినుట; ఎడ = పట్ల; కలిగి = కలిగినందు వలన; నిలిచితిమి = ఉంటిమి; దైవ = దైవము; యోగంబున = కలిసివచ్చుటచేత.
అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో గూడి మానవాతీతాలైన మహా వీరకృత్యాలు ఎన్నో చేశాడని వింటాము. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిశారణ్యంలోదీర్ఘసత్ర" మనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది.
1-52-క.కంద పద్యము

జలరాశి దాఁటఁ గోరెడి
కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
గలి దోష హరణ వాంఛా
కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!
జలరాశిన్ = సముద్రము; దాఁటన్ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్ = జనము; కర్ణధారున్ = చుక్కాని పట్టి నడిపే వానిని {కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్థుడు}; కాంచిన = చూచిన; భంగిన్ = విదంగా; కలి = కలికాలపు; దోష = పాపాలు; హరణ = నాశనము చేసే; వాంఛా = కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = అయినటువంటి; మేము = మేము; నిన్నున్ = నిన్ను {నిన్ను – కలిదోష నివారక సమర్థుడైన వాని}; కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా.
ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
1-53-క.కంద పద్యము

చారుతర ధర్మరాశికి
భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్
భారకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!
చారుతర = అతి మనోహరమైన {చారు - చారుతర - చారుతమ}; ధర్మ = ధర్మముల; రాశి = సమూహము; కిన్ = నకు; భారకుఁడు = భరించు వాడు; అగు = అయినటువంటి; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆత్మ = తన; పదమునకు = లోకమునకు; ఏఁగన్ = వెళ్ళగా; భారకుఁడు = భర్త; లేక = లేకపోవుటచే; ఎవ్వనిన్ = ఎవనిని; చేరును = చేరును; ధర్మంబు = ధర్మము; బలుపు = పుష్టిని; సెడి = కోల్పోయి; ముని = ముని అయిన; నాథా = ప్రభువా.
ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.”