అమ్మే మొదటి గురువు
ఈ గురుపూజోత్సవం నాడు మనం ముందుగా స్మరించాలిసిన గురువు కన్నా తల్లి. కన్న తల్లి తరువాతే ఈ ప్రపంచంలో ఏ గురువైన. నవ మాసాలు మోసి రక్త మాంసాలతో ఈ భూమిమీదకు తీసుకోవచ్చిన మహానుభావురాలు తల్లి. అంతే కాదు మనిషి పుట్టినప్పుడు ఏమి రాదు, ఏమి తెలియదు కేవలం ఏడవటం, కళ్ళు చేతులు కదిలించటం మాత్రమే తెలుసుకున్న మనిషికి తన చనుమొనను నోటికందించి పాలిచ్చి పాలించే దేవతే తల్లి.
పశువులకు పుట్టిన వెంటనే కళ్ళతో లేచి నిలబడి తల్లి చనుబాలు తాగగలుగుతాయి కానీ మనిషికి ఆ శక్తి లేదు ఈ విషయాన్నీ కంప్యూటరు భాషలో మీకు అర్ధమియట్లు చెపుతాను. మనం కంప్యూటర్లో రెండు రకాల మెమరీలు చూస్తాం అవి ఒకటి ROM రెండు RAM వీటిని తెలుసుకుందాం.
ROM means Reed only Memory అంటే కంప్యూటర్ ఆన్ చేయగానే మన ప్రాయం లేకుండా తనంత తానుగా అమలు చేసుకునే ప్రోగ్రాం. అదే . CMOS అది కంప్యూటర్లోని విషయాలను ముందుగా రెకార్డ్ చేసి ఉంచినది. ఇక రెండోవది
RAM ఇది మనం సాధారణంగా ఉపయోగించే మెమొరీ ఇది సిమ్సలో ఉంటుంది.
మనుషులకు పుట్టుకతో ROM లేకుండా పుట్టుతారు అందుకే ప్రతిదీ నేర్చుకోవాలి. కానీ పశుపక్షాదులు కొంత ROM కలిగి పుట్టుతాయి అందుకే అవి పుట్టిన వెంటనే వాటి అవసరాలను తీర్చుకోగలుగుతాయి.
ఇక పక్షుల విషయానికి వస్తే వాటి ROM లో గూడు కట్టే టెక్నోలోజి కలిగి ఉంటాయి అందుకే ఒక జాతికి చెందిన పక్షి ఒకే రకమైన గూటిని కట్ట గలదు. అదే విధంగా సాలె పురుగు తన గుండుని కూడా కట్టుకోగలదు. చీమలు తమ పుట్టలను తామే నిర్మించుకోగలుగుతాయి. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనిషి నేర్చుకోకుండా కనీసం పాలుకూడా తాగలేడు.
ఈ విషయాలు ఏవి మనం గుర్తించం.
ఇంకా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి