సుంకు బట్టిన సజ్జ కంకిపై జేరియు
పొడిచి గింజల దిను పొట్టి పిట్ట
మాగిన జామలో మాధుర్యమును గ్రోలి
పలుకుల కులికెడి చిలుక జంట
మిసమిస చివురుల మెసవియు కూర్చుండి
కూ యని కూసెడి కోకిలమ్మ
గుబురుల మధ్యలో కుదురుగా నుండియు
గుబులుగా నరచెడి గోరువంక
బంధనంబులు లేకను ప్రకృతి యందు
పూర్తి స్వేచ్ఛగ దిరిగెడి పులుగులకును
సాటి యేముండు సృష్టిలో సత్యముగను
విహగ రవములె నత్యంత వేడు కరయ
యసలు సిసలైన సంగీత మంద మదియె
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి