5, సెప్టెంబర్ 2020, శనివారం

సందేహం

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- రామాయణంలో అయోధ్యాకాండ ప్రాధాన్యం ఏమిటి? ఈ కాండలో తెలుసుకోవలసినది ఏమైనా ఉందా?

సమాధానం;- శ్రీరామాయణంలో బాలకాండ యజ్ఞ ప్రధానమైన కాండ. అలాగే అయోధ్యాకాండ ధర్మ ప్రధానమైన కాండ.

వేదంలో చెప్పబడిన సుఖానికి సాధానాన్నే *ధర్మం* అంటారు. అభ్యుదయమని, నిశ్రేయసమని సుఖం రెండు విధాలు.

ఈ లోకంలో ఈ జన్మలో, పై జన్మలలో, పై నుండే స్వర్గాది లోకాలలో అనుభవించే సుఖాన్ని అభ్యుదయం అంటారు.

శరీర పతనంతో ఆత్మ విడివడి, మరల దేహాన్ని పొందకుండా ఆనంద స్వరూపుడు, ఆనంద ప్రదాత అయిన భగవానుని చేరి ఉండి ఆనందం అనుభవించడాన్నే నిశ్రేయసం అంటారు.

సుఖానికి సాధనాలని మనం అనుకుంటున్నవి దుఃఖాన్ని కూడ కలిగించడం మనం చూస్తూనే ఉన్నాం. వేదం పూర్వభాగంలో చెప్పబడిన కర్మలనే ధర్మాలంటారు. ఉత్తర భాగంలో (ఉపనిషత్తుల్లో) చెప్పబడిన జ్ఞానమే భక్తి రూపంగా పరిణమించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఈ లోకంలో ఇప్పుడు సుఖంగా ఉండడానికి ప్రవర్తించే విధానం నీతి, తమ తోడి వారికి సుఖం కలిగేలా ప్రవర్తించడం దాని వల్ల తాను సుఖించడం మానవుడు నేర్చుకోవాలి. వీటినే పితృధర్మం, పుత్ర ధర్మం, సోదర ధర్మం, భర్తృ ధర్మం అనీ వ్యవహరిస్తారు. ఇవన్నీ మనకు నేర్పేదే వేదం. ఆ వేదమే రామాయణమై వచ్చింది. అందులో చెప్పబడిన ధర్మమే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించింది.

వారి ధర్మ ప్రవర్తనమే అయోధ్యాకాండలో కథా వస్తువు.

*జై శ్రీరామ్*

కామెంట్‌లు లేవు: