సర్వదా మనతో ఆనందమనే దివిటీని తీసుకువెళ్ళాలి. నిజమైన ఆధ్యాత్మికత మనలో ఆనందాన్ని జాగృతం చేయగలగాలి. ఆధ్యాత్మికత మనతో అన్ని చోట్లకూ ప్రకాశాన్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది. ప్రపంచంలోని అందరూ ఇలా తమ వంతుగా ఆనందపు దివిటీలను తీసుకు రాగలిగితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమవంతు కర్తవ్యంగా ఆనందపు కిరణాల కాంతిని లోకానికి అందించగలిగితే జీవితం ఎంతటి సుందరభరితం అవుతుంది. ఈ విషయాన్ని విస్మరించి, మనం ఆనందం ఎక్కడో బయట ఉందని వెతుకుతాం, కానీ అది మనలోపలే ఇమిడి ఉన్నది. ఎవరిలో ఈ ఆనందపు కిరణాలు ఉదయిస్తాయో వారు లోకమంతటా తమ కృపాశీస్సులను అందజేస్తూనే ఉంటారు. వారు అన్ని విషయాలనూ సత్యమనే కాంతిలో చూస్తూనే ఉంటారు, అందుచేతనే వారి మహనీయత్వాన్ని గుర్తిస్తూ ప్రజలు సహాయాన్ని అర్థిస్తూ వారి చెంతకు చేరుకుంటూ ఉంటారు.
అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.
*శ్రీమన్నారాయణా!*
నేను చేసే అన్ని కార్యకలాపాలలో మీరు నాకు అండగా ఉందురుగాక, ప్రతీ కార్యములోనూ నా ఆనందాన్నీ, భక్తినీ వెల్లడి చేయగల శక్తిని ప్రసాదించుదురుగాక, సత్యకిరణాలతో నా ఆలోచన, ఆచరణ నిండి ఉండి నా తోటివారి జీవితాలలో ప్రకాశాన్ని కలిగించుదురుగాక.
సర్వేజనా సుఖినోభవంతు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి