12, జనవరి 2023, గురువారం

భగవంతుడు ఇచ్చినవే

 🌳🍁🌳🍁🌳🍁🌳🍁🌳మనం భోజనం చేసేటప్పుడు ,

మనకు ఇచ్చిన ఈ పదార్ధాలు

అన్ని కూడా భగవంతుడు ఇచ్చినవే.అందుకే ఆయనకు

క్రుతజ్ణతగా, ముందు ఆయనకు నివేదన చేసి ఆ పై మనం భుజించి తే ఆ పదార్ధాలు మనకు బలాన్ని చేకూరుస్తాయి.

ఆ శ్లోకం చదువుతూ చేతిలోకి నీరు తీసుకుని కంచం చుట్టూ ఆ నీరు త్రిప్పుతూ పదార్థాలు ను ఆ పరమేశ్వరుడు కి అర్పించి తినాలి. ఆ శ్లోకం ఈ విధంగా ఉంటుంది.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః

బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్!

బ్రహ్మైవ తేన గంతవ్యం

బ్రహ్మకర్మ సమాధినా!

👋👋👋👋👋👋👋👋👋

వడపప్పు

.      ‌ వడపప్పు దేనికి?


మనం పండుగలలో వడపప్పు చేయడం ఆచారంగా వస్తోంది.ఈ 

వడపప్పు వెనుక గొప్ప శాస్త్రీయత ఉంది.పండుగ రోజుల లో మనం పిండివంటలు చేసుకుంటాం.సాధారణంగా తినేదాని కన్నా పండుగ రోజు కొంచెం ఆహారం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.మనం 

తీసుకునే ఆహారం లో తేలికగా అరగని పదార్థాలు ఎన్నో ఉంటాయి.అందువలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.వీటి నుండి రక్చించగల దివ్య ఔషధమే వడపప్పు.ఆయుర్వేద శాస్త్రరీత్యా

చూసినట్లు అయితే తేలికగా అరగని పదార్థాలు ను అరిగేలా చేసే శక్తి వడపప్పు కు ఉంది.

కనుకనే మన పెద్దలు పండుగ రోజు వడపప్పు తినే ఆచారాన్ని ఏర్పరిచారు.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀