10, అక్టోబర్ 2022, సోమవారం

కళల వలన ప్రయోజనం

కళల వలన  ప్రయోజనం

 విద్య అంటే మనం పాఠశాలల్లోనో లేక కళాశాలల్లోనో చదువుకునే చదువే కాదు మనం తెలుసుకునే ప్రతి జ్ఞ్యానం కూడా విద్యయే.  కొన్ని సందర్భాలలో మనం చిన్నతనంలో సరదాగా నేర్చుకునే కళలు కూడా కొన్ని సందర్భాలలో మన ప్రాణాలను కాపాడవచ్చు.  అటువంటిదే ఒక యదార్ధ సంఘటన నాకు ఇంటర్నెట్లో దొరికింది.  అది మీతో పంచుకుంటున్నాను.

కేరళ నుంచి ఒక మిత్ర బృందం అస్సాం అందాలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల తిరిగారు. ఒక కొత్త ప్రదేశం చూడాలని అక్కడివారి సాయంతో జీప్ లో బయలుదేరి వెళ్ళారు, చూడవలసినవి చూసి వస్తున్నారు ఘాట్ రోడ్ లో. హటాత్తుగా ఏనుగుల గుంపు కనిపించింది, ఏం చేయడానికి తోచక జీప్ ఆపుకుని కూచున్నారు. కొందరు జీపు దిగారు. ఒక పక్క లోయ, మరో పక్క ఎత్తైన కొండ. లోయ పక్క దట్టమైన చెట్లు. ఒక ఏనుగు జీపుని లోయలోకి తోసేసింది. ఎవరికి తోచింది వారు చేశారు, జీప్ నుంచి దూకినవారు, పరుగెట్టి వెనక్కిపారిపోయినవారు, ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు ఐపోయారు. ఒకతను జీప్ లో ఉండిపోయాడు, జీప్ ని తోయడంలో బయటపడి లోయలో పడిపోయాడు, చివరికి జారి లోయ కిందికి చేరిపోయాడు.స్పృహ తప్పిపోయాడు జీపు చెట్లలో చిక్కుకుపోయింది. .

 రాత్రి పడింది, పైవాళ్ళు ఏనుగులు వెళ్ళిన తరవాత ఒక్కొకరూ చేరేరొకచోటికి, అందరూ చేరారు కాని లోయలో పడినవాడు కనపడలేదు, వెతికినా! లోయలో పడిపోయి ఉంటాడనుకున్నారు, కేకలేశారు, కిందవాడికా కేక అందలేదు,స్పృహ తప్పిపోయాడు. ఉదయం చూద్దామని ముందుకెళ్ళిపోయింది మిత్ర బృందం చాలా సేపు వెతికి వేసారి.  మర్నాడు ప్రమాదం జరిగిన చోట వెతికారు,ప్రయోజనం లేకపోయింది, జీప్ ను పైకి లాక్కుని వెళిపోయారు.. పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెనక్కి పోయారు, ఆచూకీ దొరకలేదని.

లోయలో పడినవాడికి కొంతకాలానికి తెలివొచ్చింది. కేకలేశాడు, పైకి ఎక్కడానికి ప్రయత్నమూ చేశాడు, విఫలమయ్యాడు. దారి ఉపయోగించేవారు తక్కువ కావడంతో ప్రయోజనం లేకపోయింది. ఏంచెయ్యాలి? కడుపులో కాలుతోంది, మరికొంత దూరం కాలు సారిస్తే కొన్ని పళ్ళు దొరికాయి,తిన్నాడు, సెలయేరు కనపడితే నీరుతాగాడు. ఆకలి దప్పికలు తీరాయి, తరవాతకీ భయం లేకపోవడంతో పైకి చేరుకునే మార్గం గురించి ఆలోచన మొదలు పెట్టేడు. ఏం చేయాలో తోచలేదు. అలా తిరుగుతుండగా వెదురుపొద కనపడింది. వెదురు కర్రని సాధ్యం చేసి, ఉన్న రాళ్ళ తో ఒక వేణువును తయారు చేశాడు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న వేణువును పలికించడం ప్రారంభించాడు. అదే ఒక తపస్సు అయి వేణువును పలికించడమే పరమావధిగా చేసుకున్నాడు.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక సైనికాధికారి రోడ్ పోతూ వేణుగానాన్ని విన్నాడు, జీప్ ఆపించి పరిశీలించమన్నాడు. ఎవరూ కనపడలేదు, కేకలకి ప్రతి స్పందించలేదు.  అధికారి లాభం లేదనుకుని మరలిపోయాడు. మరునాడు మళ్ళీ వేణుగానం విన్నాడు, ఆచోటిలోనే. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం బయలుదేరి, కొంతమంది సైనికులతో, తాళ్ళు తదితర సామగ్రితో వచ్చి లోయలోకి దిగి వేణుగానం వైపుసాగారు. అక్కడ ఇతను కనపడ్డాడు. లోయలో ఉన్నావాని భాష సైనికులకురాదు, సైనికుల భాష లోయలోనివానికి తెలియదు. మొత్తానికి అతన్ని తీసుకుని పైకొచ్చారు. అధికారిదీ అదే వ్యధ, లోయలో పడినవానికి మరో భాష రాదు. విదేశీయుడా? గూఢచారా? అనేక అనుమానాల మధ్య అతన్ని సైనిక కేంద్రానికి తీసుకొస్తే అతను మాటాడుతున్న భాష మలయాలం అని తెలిసి, సైనికులలో మలయాలం తెలిసినవారితో మాటాడించి అతని చరిత్ర తెలుసుకున్నారు.

లోయలో పడినవాని మురళీ వాయిద్యానికి అధికారి ముగ్ధుడయాడు. ఒక సభ చేసి ఇతనిచే వేణుగానం చేయించి విన్నారు. అందరూ ఆనంద పరవశులయ్యారు. ఎవరిమటుకువారు అతనికి కొంత సొమ్మిచ్చారు, అప్పటికప్పుడు, అక్కడికక్కడ. అధికారి ఇతని క్షేమసమాచారం అతని ఇంటికి చేరేశారు, తొందరలో తిరిగొస్తున్నట్టూ టెలిగ్రాం లిచ్చారు. ఇతని చేత మరికొన్ని కచేరీలు చేయించి ఇతోధికంగా సత్కరించి, రైలెక్కించి, తడికళ్ళతో వీడ్కోలు పలికారు. కథ శుభాంతం అయింది.

చూసారా చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సహాయకారిగా అవుతాయో కదా.  మనం చిన్నప్పుడు నేర్చుకునే చెట్లు ఎక్కటం, ఈతకొట్టటం, వేగంగా పరిగెత్తటం, చేతులు నోటి ముందుపెట్టుకుని పెద్దగాఅరవటం, తదితర విషయాలు మనకు జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు అవసరానికి ఉపయోగపడవచ్చు. చిన్నతనంలో పిల్లలు వారి వారి అభిరుచులను పట్టి ఎన్నో కళలు నేర్చుకుంటారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ప్రస్తుతం బాల్యం నాలుగు గోడలమధ్యన సెల్పోను తోటి గడుస్తుంది.  పిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి కావటంలేదు, మానవసంబందాలు ఏర్పడటంలేదు. ఇది ఇట్లావుండగా పిల్లలకు తలకు మించిన భారంగా పుస్తకాలు, పాఠశాలల, కళాశాలల మధ్య పోటీతో పిల్లలను బలిచేస్తున్నారు.  తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు రావాలనే తాపత్రయంతో వారి సంతోషాలను, ఆనందాలను బాలి తీసుకుంటున్నారు. మన పిల్లలను రోలులో ఒక గంట అయినా బయట తోటి పిల్లలతో ఆడుకునేటందుకు ప్రోత్సహించాలి.  ఆదివారాలు, శలవుదినాలలో పిల్లలతో కలిసి సినిమాలకు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి అనుమతించి వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందటానికి తోడ్పడాలి. కొన్నిసందర్భాలలో అనిపిస్తుంది పిల్లలను అతి ప్రేమగా చూడటం వారి అభివృద్ధికి గొడ్డలి పెట్టు అవుతుందనిపిస్తుంది. 

మీ 

భార్గవ శర్మ

 

గుర్తుంచుకోండి

 జీవితం అంటే చాలా తేలికగా తీసుకుంటున్నారు 

కానీ ఈ క్షణం పోతే కావాలన్నా తిరిగి రాదు. గుర్తుంచుకోండి. 

ఈ రోజు సరదా మత్తులో జీవితాన్ని బలి చేసుకుంటున్నాం. తరువాత దాని పరిణామం మనల్ని తలక్రిందులు చేస్తుందని మర్చిపోతున్నాం .

పుట్టామా, పెరిగామా ఏదో చేశామా, ఏదో అలా బ్రతికమా, చనిపోయామా అనుకొనేదేనా జీవితం.

కాదు. ఇది కాదు జీవితం. 

మన పుట్టుక ఎలా ఉన్నా మన చావు వంద తరాల వారు కథగా చెప్పుకోవాలి .

బ్రతుకంటే వాడిది రా, బ్రతికితే వాడిలా బ్రతకాలి అనాలి. అలా అని నీ దగ్గర లేనిది చేయమని కాదు. నీకు ఉన్నదంట్లో నీకు తోచినంత చేయమని . 🙏Good Night🙏

అరుణాచల

 అరుణాచల మాహాత్మ్యాన్ని తెలిపే చిన్న సంఘటన:


అరుణాచల మాహాత్మ్యం నుంచి ఒక భాగం చదువబడింది. 'పంగున్ని' అనే  సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడింది. ఆపై భగవాన్ దానిని ఇలా కొనసాగించారు (శ్రీరమణ భాషణములు, 05-03-1938: 473).


పంగున్ని అనే పేదవాడు, రెండుకాళ్ళు చచ్చుబడిన కారణంగా 'పనికిరానివాడు' అయ్యాడు. దమ్మిడీ ఆదాయంలేక కన్నవారికే గుదిబండగా తోచాడు. అనుదినం, అనుక్షణం అవమానాలే... అదీ అయినవారి నుంచి!


బ్రతుకు భారమైంది, నిరర్థకమైంది. ఎవరికీ చెప్పకుండా, కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరిప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి, దూరంగా ప్రాణత్యాగం చేద్దామనుకున్నాడు.


ఎటు చూసినా నిరాశా నిస్పృహలు రేపే తలపులే దృశ్యాలై, అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి.


అంతలో అతనికి ఎదురుగా ఓ సాధువు ... సాధువులకెందరికో అరుణాచలం నిలయం కదా ... ఇతనిని సమీపించాడు.


హఠాత్తుగా, “ఇలాంటివాడికి ఈ ఆభరణాలు కూడానా?” అంటూ పంగునికి ఊతమిచ్చే చేతికర్రలను లాగివేసాడు.


పంగున్ని అనుభవించిన అవమాన పరంపరలకు ఇది పరాకాష్ఠ. దానితో అసహనంతో ఊగిపోయి, సాధువుపైకి లంఘించాడు.


కానీ, అందుకొనేలోపే సాధువు మటుమాయం. అరే, ఇదేమిటీ! తాను నడువగలుగుతున్నాడు! చచ్చుబడ్డ తన రెండు కాళ్ళు చక్కబడి ... మరి ఆ సాధువు ఏదీ? కనిపించడే! ఆశ్చర్యోత్సాహాలతో పరుగులు పెట్టాడు.


ఆనందంగా గిరిప్రదక్షిణ పూర్తి గావించాడు.


అయినవారిచే ఆదరింపబడ్డాడు.


అరుణగిరీశ్వరుని అవ్యాజ కరుణకు సాక్ష్యమై, చరిత్రలో స్థిరంగా నిలిచాడు.


రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు.


భగవాన్ గురుమూర్తంలో వుండగా, 'కుప్పు అయ్యర్' అనే వృద్ధుని చూసారు. అతనికంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి, నడవలేక చట్టపై డేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై డేకుతూ, వేత్తావలం వెళుతున్నాడు.


హఠాత్తుగా ఒక ముదుసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, "ఏమిటా చట్టపై జరగటం? లేచి నడవవోయ్!" అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి, సులువుగా నడవసాగాడు. జరిగినదానిని నమ్మలేకపోయాడు. నాలుగడుగులు వేసాక చుట్టూ చూసాడు. ఎక్కడా ముసలివాడు. కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే, ఊరివారందరూ సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి, తాతలు దిగివచ్చినట్లయింది.


ఇది, భగవాన్ తిరువణ్ణామలై రావడానికి రెండు సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పు అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి, ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు.


ఓం అరుణాచల శివ

ఓం అరుణాచల శివ

ఓం అరుణాచల శివ




 


 

Wise man


 

రాముడు శ్రీ రాముడయ్యాడు

 మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||


మా నిషాదః అంటే "మాం" అంటే లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవితో కూడినవాడు. రాముడు శ్రీ రాముడయ్యాడు సీతా కళ్యాణం తరువాత అందుకని శ్రీరాముడు, సీతారాముడు " కాబట్టి బాల కాండ" ప్రతిష్ఠాం త్వం తండ్రి యైనటువంటి దశరథ మహారాజుగారి యొక్క మాటనీ నిలబెట్టడం కోసమనీ, సత్యమునందు నిలబెట్టటం కోసమనీ అరణ్యవాసం చేసినటువంటి మహానుభావా ప్రతిష్ఠా త్వమగమః నీ యొక్క కీర్తి చిరకాలమూ ఉండిపోతుంది. నీ గురించి పిత్రువాక్య పరిపాలకుడని లోకం శ్లాగిస్తుంది. "కాబట్టి అయోధ్య కాండ" శ్శాశ్వతీస్సమాః మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం చేసిటప్పుడు భరతుడే వచ్చి శత్రుజ్ఞుడే వచ్చి, సుమిత్రా, కౌసల్యా, కైకేయీ వచ్చి, వశిష్టుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకొమ్మ వరమడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతున్ని చెప్తున్నాను రామా! రాజ్యం తీసేసుకో!... అన్నా సరే... సత్యమేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠితః ! సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం !! నాకు సత్యం తప్పా ఇంకోటి అక్కర్లేదు ఎవరు వరమడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వరాల్ని వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అనిచెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పై లోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు. అని మాటకు కట్టుబడి పద్నాలుగేళ్ళు ఆరణ్య వాసం చేసి "తృణం" క్రింద రాజ్యాన్ని విడిచి పెట్టినటువంటి మహా పురుషుడిగా రామా నీ కీర్తి పది కాలములు శోభిల్లి రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చెయ్యబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. "కాబట్టి అరణ్య కాండ". క్రౌఞ్చమిథునాదేకం క్రౌఞ్చమిథునాత్ క్రౌఞ్చము, క్రౌఞ్చి ఇవీ... వాలీ తార. వాలీ తార సక్రమం. వాలీ రుమ, సుగ్రీవుని భార్యమైనటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టీ, కామ ప్రధానముగా తిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపమున్నవాడా "కిష్కికింద కాండ". లేదూ... అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌఞ్చౌ అంటే పరివేదనచేత కృషించి పోయిన ప్రాణి. ఎవరు తనకు కనపడాలని తాపత్రయ పడుతోందో వాళ్ళు కనపడక పోవడం వల్ల నీరస పడి బాగా కృషించి పోతే క్రౌఞ్చౌ అని పిలుస్తారు. ఏ రామ చంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకొని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీపక్కనున్న ఆరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో... ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసికెళ్ళి అశోక వనంలో శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టినప్పుడు. మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనుసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని, పరితపించి పరితపించి, శోకించి, ఉపవశించి, కృషించి పోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి "సుందర కాండ". కాబట్టి క్రౌఞ్చమిథునాదేకం ఒక్కడే... రామ నామాన్ని - రామ కథనీ ఒకటికి పదిమాట్లు ఎలా చెప్పాలో... ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో... ఎక్కడ వివరంగా చెప్పాలో... ఎక్కడ నామం చెప్పాలో.., ఎక్కడ భక్తి ప్రకటనం చెయ్యాలో, అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపజేసి ఒక్కడే... ఎవ్వరూ చేయలేని సంకల్పం చేసి, ఒక్కడే నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంత మంది రాక్షసులను వధించి, ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి, ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి, ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకొని, ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి, ఒక్కడే నిర్భయంగా రావాణాసురిడికి సందేశం చెప్పి, ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి "దృష్టా సీతా" నేను దృష్టాసీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్ ʻసీతమ్మ తల్లి చూడబడును సీతమ్మ తల్లీʼ అని క్షేమ వార్త చెప్పాడో... అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాధని ప్రకాశింపజేసిన సుందర కాండ అందులో ఉంది.కాబట్టి, అక్కడా... క్రౌఞ్చమిథునాదేకంమవదీః కామయోహితమ్ కామమోహితులైనటువంటి ఆ రావణాసురుని పడగొట్టినటువంటి సందర్భమైన యుద్ధ కాండ అందులోకొచ్చింది కాబట్టీ, ఆ తరువాత జరిగినటువంటి కథను కూడా చెప్పింది కాబట్టీ, ఎందు చేతనంటే రామ చంద్ర మూర్తి మీద మనసున్నటువంటి సీతమ్మని రాజ ధర్మం కోసం విడిచిపెట్టి బాధపెట్టిన సందర్భంతో కూడినటుంటి ఉత్తర కాండ కలిసింది కాబట్టీ ఒక్క శ్లోకంలోకి రామాయణం మొత్తం ఏడు కాండలూ వచ్చాయి.

-- బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

బాధపెట్టడం

 🕉️🌞🌎🏵️🌼🚩


 *ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా* *ఉందాం* .


 *"#మౌనం" - "మనస్సు"ని శుద్ధి చేస్తుంది.* 

 *"#స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది.* 

 *"#ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది.* 

 *"#ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.* 

 *"#దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది.* *"#ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది.* 

 *"#క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.* 


*ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త.*


*నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.*


*సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.*


*జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.*


*కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...*


*"అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు,*

      *- చేతినిండా పని ...* 

    *- కడుపునిండా తిండి..* 

      *- కంటినిండా నిద్ర...* 

     *- అవసరానికి ఆదుకునే* 

          *ఆప్తులను* 

*కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".*


*మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్ధమే.*


*మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా "గౌరవించాలో" తెలుస్తుంది. "నేనే", "నాకేంటి !" అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. "గౌరవమర్యాదలు" ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే "మంచి జీవితం".*


*నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది.* 


*ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక "విలువ" ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని చూసి లక్ష్యమేర్పరచుకో.*


*నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు.*


 *జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతుడివి అవుతావు. "వయస్సు" పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.*


 *🚩!!హిందూ దర్మం గ్రూప్!!* 🚩


🕉️🌞🌎🏵️🌼🚩

యాపిల్ తినడం వలన

 యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు - 


    యాపిల్ లో మంచి విటమిన్స్ ఉన్నాయి . ఒక యాపిల్ లో ఒక మిల్లీగ్రాము ఇనుము. పద్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ , పది మిల్లీగ్రాముల కాల్షియం మరియు A విటమిన్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. 


 * యాపిల్ రక్తక్షీణతని నివారిస్తుంది. రక్తక్షీణత కలవారు రోజుకి మూడు యాపిల్స్ తీసుకొవడం చాలా మంచిది.


 *  మలబద్దకం నివారణ అవుతుంది. శరీరంకి కావలసినంత బలం ని ఇస్తుంది.


 *  రక్త,బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకొవడం వలన అందులో ఉండే పిండిపదార్ధాలు విరేచనాలు లొని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరేచనాలు తగ్గుతాయి . యాపిల్ ముక్కలని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది. 


 *  చంటిపిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇవ్వడం వలన విరేచనాలు కట్టుకుంటాయి.


 *  యాపిల్ జ్యూస్ లో యాలుకలు , తేనే కూడా కలుపుకుని తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ప్రేగుల్లో పూత , అజీర్తి , గ్యాస్ట్రబుల్ , పుల్లనితేపులు , గుండెల్లో మంట నివారించబడును. 


 *  యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మరియు పొటాషియం ఎక్కువుగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయవ్యాధులు , మూత్రపిండాల వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి . 


 *  తరచుగా యాపిల్ తింటూ ఉంటే తరచుగా వచ్చే జ్వరాలు అరికడతాయి.


 *  పక్షవాతం , నాడీసంబంధ వ్యాధులు కలవారికి మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది . 


 *  రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.


 *  కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది.


 *  యాపిల్ కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు , దగ్గు , ఆయాసం వీటిని నివారిస్తుంది. 


 *  యాపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది . నీరసాన్ని , అలసటని రానివ్వదు.


 *  యాపిల్ ముక్కలుగా కోసి ఉడికించి రోజు తింటూ ఉంటే బొల్లిమచ్చలు నివారణ అవుతాయి. శరీరం కాంతివంతం అవుతుంది. 


 *  యాపిల్ చెట్టు యొక్క వ్రేళ్ళ రసాన్ని తాగితే కడుపులో ఏలికపాములు నివారణ అగును.


 

  గమనిక  - 


       షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మోతాదులో  యాపిల్ తీసుకోరాదు .


  

         


 


 

వెన్నెల పారాయణం

 🌴🌹🌷🙏🛕🙏🌷🌹🌴

*భాగస్వామ్యం చేయడంమైనది*


*రేపు (09.10.2022) పౌర్ణమి* సందర్భంగా రేపు రాత్రికి వెన్నెల పారాయణం చేయండి 🌷


వీలున్న వారందరూ రేపు రాత్రికి ఇలా చేయండి👇


మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఏలకులు , పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ *9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి*

*ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది* 🙏


9 సార్లు అనే సరికి అమ్మో ఇన్ని సార్లా అని ఆనుకుంటారేమో , కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం , ఇలా భక్తిశ్రద్ధలతో , పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.


మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది , ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది.ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.


లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది , అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీ చక్రం చుట్టి ఉంటుంది.


అంత సేపు ఒకే అసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవము కలుగుతుంది , అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్ధమవుతుంది , ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకుని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా.శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది.


ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు🙏🌷


ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్క సారి చదవచ్చు.ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే , అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక.


ఏదైనా తీరని సమస్య , లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి.


ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు , 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు.దయచేసి సద్వినియోగం చేసుకోండి 🙏🙏🙏


(చంద్రోదయం తరువాత చేయవచ్చు , బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు , వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణ చేయవచ్చు)


అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని , కనీసం ఒక్కరైనా చేస్తారనే ఆశతో వ్రాస్తున్నాను , దయచేసి సద్వినియోగం చేసుకోవలసినదిగా మరొక్కసారి మనవి 🙏


ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత🙏


శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

🌹🌷🪷🌝🙏🛕🙏🌝🪷🌷🌹. 

Srimadhandhra Bhagavatham -- 12

 [10/10, 7:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 12 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేసి రథంమీద పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు 'అర్జునా ! నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని గురుపుత్రుడని చూడకు సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. 'ద్రౌపదీ! వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడవేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసి ఆవిడ 'మహానుభావా! అశ్వత్థామా! నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. 'ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురుపుత్రుడవు. నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంతో ధర్మం పాటిస్తున్నది. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు.

'కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్న వారిని చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువని తలంచి, నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అన్నది. 'రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి ఉండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని 'నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? అని అర్జునుని వంక చూసి

‘అర్జునా! నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండుచేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. చచ్చిపోతున్నాడని తెలిసి రక్షించుకోలేనని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా! మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందో! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది’ అని ‘ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండి ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి' అన్నది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. 'ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను' అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే. కృష్ణుడు 'అర్జునా! నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. చంపి అవతల పడేయవచ్చు. ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తున్నది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో నిర్ణచేయవలసింది నువ్వు ' అన్నాడు. అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టుకుని కాంతిహీనుడైపోయాడు. అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉన్నది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉన్నది. ఆ మణికాంతి శరీరము అంతా కొడుతున్నది. అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలడములో ధర్మం ఉన్నది. అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతోమంది నెత్తురు త్రాగింది. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురకవృత్తికి వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోస్తే అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా! వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం.

ఈ ఉపపాండవుల పార్థివ శరీరమును తీసుకువెళ్ళారు. దహనక్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!

కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇస్తుంది. అలా ఇస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపములో జీవులు పుడుతూ, మరణిస్తూ ఉంటారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 13 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పరీక్షిత్తు జననము


ఇది జరిగిన పిమ్మట కృష్ణపరమాత్మ బలవత్తరమయిన కాల స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు. 'ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరతాను’ అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడ ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు. ఆ సమయములో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరుగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చి కృష్ణపరమాత్మ పాదములమీద పడిపోయింది. అప్పటికి ఉత్తర గర్భంతో ఉన్నది. అభిమన్యుడు మరణించాడు.


ఉత్తర కృష్ణుని చూసి – 'కృష్ణా! నాకు ఏమీ తెలియడము లేదు. కానీ ఏదో దివ్యమయిన తేజస్సు, ఒక ఇనుపబాణం ఏదో వచ్చేస్తోంది. చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనపడడము లేదు. నా కడుపులోకి ప్రవేశిస్తున్నది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తున్నది. లోపల ఉన్న పిండము మీద పగబట్టి ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళుతున్నది. నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడము నేను ఇష్టపడడము లేదు. పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు. కృష్ణా! నువ్వు రక్షించు’ అని ప్రార్థించింది.

బయటకు వచ్చిన ఉపపాండవులకోసం ద్రౌపది ఏడ్చింది. లోపల వున్న పిండము పోతున్నదని ఉత్తర ఏడుస్తోంది.


ఉత్తర అలా అనగానే పాండవులు గబగబా ధనుస్సు పట్టుకున్నారు. ఎవరిమీద వేస్తారు? శత్రువు బయట ఎక్కడ ఉన్నాడు? ఉత్తర గర్భంలో పిండమును నరకడానికని బాణరూపములో వెళుతున్నది. ఉత్తర ఏమని ప్రార్థించింది? ‘కృష్ణా! నేను నీ చెల్లెలయిన సుభద్రకి కోడలిని. అభిమన్యుని భార్య ఉత్తరను. నా కడుపులో వున్న పిల్లవాడు నీకు మేనల్లుడి కొడుకు' అన్నది. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు. ఎవరో బాణం వేస్తే అది లోపలికి వెళ్ళిపోతున్నది. తామరపువ్వులవంటి నేత్రములు ఉన్నవాడా! నీవు కన్నువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రములా ఉన్నది. ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తున్నది. బయట ఉన్నవాళ్ళకు ఏమి తెలుస్తుంది? కడుపులో వున్న పిండమును రక్షించవా! అని శరణాగతి చేసింది.

గాండీవమును ధరించిన అర్జునుడు, చేతి గద తిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు, నకుల సహదేవులు, అజాతశత్రువయిన ధర్మరాజు ఉన్నాడు. ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. (నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీరక్షణ నీఇంటి ఈశాన్య దిక్కున ఉన్నది.


అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయకు. వాళ్ళని భగవంతునిగా చూసుకో. లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయడం నేర్చుకో. ఆయన నీకు రక్షకుడు.) ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు. కృష్ణుడిని ప్రార్థన చేసింది.

కడుపులో ఉన్న పిండము ‘అగ్నిహోత్రము వచ్చేసింది. నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవాడు ఎవరు? నేను గర్భంలో వున్నాను. నేను మొరపెడితే ఎవరికీ వినపడుతుంది’ అని ఏడుస్తున్నది. ఈయన ఆ పిండమునకు ఎదురువచ్చి ఉత్తర గర్భములోని పిండము కూడా సంహరింపబడాలని అశ్వత్థామ ఉపయోగించిన బ్రహ్మాస్త్రము లోపల ఉన్న పిండం దగ్గరకి వస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భములో ఉన్న పిండము ముందు భాగమునందు అంగుష్ఠమాత్రుడై నిలబడ్డాడు. గదను త్రిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు. ఉత్తరగర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవరికీ కనపడడము లేదు. ఉత్తరకి గాని, పాండవులకి గాని, లోకమునకు గాని కనబడడము లేదు. స్వామి ఈ లీలను ఉత్తర కడుపులో ప్రదర్శిస్తున్నాడు. తాను బయట నిలబడి ఉన్నాడు. పాండవుల వంశము నిలబడడం కోసం పిండమునకు ఎదురువెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రమునుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకొని చాలా ఉల్లాసంగా, సంతోషంగా పిల్లాడి వంక చూస్తే, వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ‘ఎంత అందగాడు – బొటన వ్రేలు అంత ఉన్నాడు – పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను రక్షించాడు’ అని స్తోత్రము చెయ్యడము కూడా చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానము అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకివచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడని సూతుడు చెప్పి – ‘ ఈమాట చిత్రంగా ఉన్నదా? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను. స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు. ఇవి అన్ని శాశ్వత స్వరూపుడయిన నారాయణునిలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలములోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని, ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్పకాదు. ఆవిధంగా తేజస్సును పుచ్చుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానము చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడయిన ఆశ్వత్థామను రథం మీదనుంచి దింపగానే వానిని చంపి వేయవలసినదని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామని చంపివేసి ఉండి ఉంటే ‘వీనికి నేను పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పినా ధర్మము అంటే ఏమిటో అర్థం కాలేదు. నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు’ అని అనుకుని ఉండేవాడు. తను చెప్పినా అర్జునుడు అశ్వత్థామని చంపలేదు. ఈ ధర్మమును కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’ – ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కృష్ణుడు మాత్రమే చేయగలడు. కృష్ణపరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అనుమానం పెట్టుకున్న వానిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు.


ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషముతో ‘నా కడుపులో అగ్నిహోత్రము చల్లారి పోయింది. నా పిండము రక్షింపబడింది. పాండవవంశము రక్షింప బడింది’ అని పొంగిపోయింది.

శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరుపెట్టారు. ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలువరు పరీక్షిత్తు అని పిలుస్తారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:35 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 14 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


తదనంతరం కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆవిడ ఆదినారాయణా అని ప్రారంభించింది. కృష్ణా నాభక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఏ మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. ‘పాండురాజు కుమారులయిన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసింది.

స్వామీ నీయందు నా నమస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు. నేను ఏపని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణము నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు? కృష్ణా! నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా! నాకు మోహమును తెంపి అవతల పారవేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి గండ్ర గొడ్డలితో తెంపి అవతల పారేయి’ అని అడిగింది.


కృష్ణ పరమాత్మ ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి ‘అప్పుడే ఎలా కుదురుతుంది ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి’ అనే భావం వచ్చేట్లుగా హేలగా చూసి, ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంతే ! మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరచిపోయేటట్లు చేసేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది. ‘స్వామీ! నిరంతరము నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది’ అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన తరువాత పదినెలలకు ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు.


భీష్ముని చరిత్ర:


కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయములో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్న మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంతబ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథములలో చెప్పబడింది. భీష్ముని జీవితము అర్థము చేసుకోవడము అంత తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు, ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడము ఎలాగ? భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగ? అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. వీళ్ళందరికీ ఏవిధముగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.


సభ జరుగుతున్న సమయములో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.


గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరముగా గంగమ్మకూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మాత్రము అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు అర్థం అయ్యేవి కావు.

బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యము వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి! రాజర్షి అలా ప్రవర్తించడమేమిటి! అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనము కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరము ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనము చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భరతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు? అని అడిగింది. వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమము మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠమహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉన్నది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉన్నది. దానిని ‘ద్యు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషముగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వసిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వసిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమములో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్త తెలిసి అష్ట వసువులు పరుగున వచ్చి వసిష్ఠమహర్షి పాదములమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేటట్లు చేయండి’ అని ప్రార్థించారు. ఆయన – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరము వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధానపాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచనమును కటాక్షించారు.


ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా! నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అన్నది. వాళ్ళు –‘ అమ్మా! మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకములో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరము విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భరతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది. సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుని ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా! అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన – అమ్మా! నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు? అని అడిగాడు. ఆవిడ – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అన్నది. ఆయన ‘నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణనాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చి ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి, కోడలికి మాత్రమే ఉన్నది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమతొడమీద కూర్చోవాలి. ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. నాతో సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని అలా నీకు వరం ఇస్తున్నాను’ అన్నాడు.


ఆ పైనుంచి వస్తున్న గోభిషుడనే రాజర్షి చూశాడు. నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[10/10, 7:35 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 15 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకము చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకున్నది. నిన్ను నా కోడలిని చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాను. గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.


శంతనమహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటకి వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరములో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడను వివాహము చేసుకోవాలని ఆవిడతో మాట కలిపాడు. వసువులు బిడ్డలుగా పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరము వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ మాట ఇచ్చి ఉన్నది. భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడము కుదరదు. ఆవిడ – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అన్నది. శంతనుడు ‘ఏమిటి నీ షరతు’ అని అడిగాడు.

‘నేను ఏపని చేసినా అది శుభం అయినా అశుభం అయినా నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు నాకు ఎదురు చెపితే ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అన్నది.

శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహము చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహుఅందగాడు. మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడు. తనకి కొడుకు పుట్టాడు పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండుచేతులతో పట్టుకుని గంగ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల సహజస్థితిని కల్పించాలి. పుట్టిన బిడ్డను నీటిలో విడిచి పెట్టింది. శంతనుడు గంగకి మాట ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేక ఊరుకున్నాడు.


ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళుతుంటే ఆయన – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నువ్వు ఏమిటి పుట్టిన కొడుకులను గంగలో పారేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.


గంగమ్మ నవ్వి – ‘నువ్వు నేను చేసినపనికి అడ్డుపెడితే అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అన్నది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. ఆవిడ – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. మహారాజా! నేను ఏదో చేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్థితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బ్రతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెపుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగ వెళ్ళిపోయింది.


శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యపరిపాలన చేస్తున్నాడు. వేటకి వెడుతున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. గంగ చెప్పిన మాట మరచిపోయాడు.


ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనములో వున్న వ్యక్తి అద్భుతముగా బాణప్రయోగము చేయడము చూసాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉండేవాడు’ అని నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. గంగ వచ్చి ఈయనకు దేవవ్రతుడని పేరు పెట్టాను. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్నివిధములుగా రాశీభూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మము తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పచెపుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.

శంతనుడు వార్ధక్యములోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషముతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందముగా రోజులు గడిచిపోతున్నాయి.


ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ సత్యవతీదేవి కనపడింది. ఆమెకు యోజనగంధని కూడా ఒకపేరు. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశరమహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజనదూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరములో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.


శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహము చేసుకోమని అడిగాడు. ఆవిడ – ‘ నేను స్వేచ్ఛావిహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే నన్ను రాక్షస వివాహములో పాణిగ్రహణము చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.

శంతనమహారాజు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘ మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. శంతనుడు ‘నీ కన్యకారత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?’ అని అడిగితే శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు అయిన కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనములో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును చూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగితే ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహము మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహము చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమము పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.


దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘ మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. దాశరాజు – ‘తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతనమహారాజుగారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. దేవవ్రతుడు ‘ తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం చేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడము కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజముగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదము రాదని ఏమిటి హామీ?’ అని అడిగాడు.


దేవవ్రతుడు ‘నీకు ఆ అనుమానము ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను పెళ్లి చేసుకోనని బ్రహ్మచారిగా జీవితము గడుపుతానని భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.


ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఎంతో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. మరణము నీవు కోరుకుంటే వస్తుంది లేకపోతే రాదు’ అని స్వచ్ఛందమరణమును నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

అవతారములు

 Srimadhandhra Bhagavatham -- 11 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భగవంతుని అన్ని అవతారములు గొప్పవే. 'కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు 'జయ’ అని వింతయైన పేరు ఉన్నది. భాగవతం చెబితే –

’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్!

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!’ అంటూ ఉంటారు.

నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు. అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. ’కృష్ణం వందే జగద్గురుమ్’ జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. కృష్ణుడిని నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవడము, అజ్ఞానం అంతరించక పోవడము అన్నది ఉండదు. గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై కష్టమును పోగొడతాడు. తండ్రియై కాపాడతాడు. తల్లియై ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి పరిపూర్ణమయిన కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అని సూతుడు శౌనకాది మహర్షులతో అన్నాడు.

అశ్వత్థామ-పరాభవము

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరూ పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతున్నది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయములో దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసిఅశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన వారు అయిదుగురు. ఆ అయిదుగురు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ బాగా అలిసిపోయి నిద్రపోతున్న సమయములో అశ్వత్థామ వారి శిబిరములో ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. చంపి నిశ్శబ్దముగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి 'నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశము లేదు. ఉపపాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక’ అని చెప్పాడు.

తెల్లవారి మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో అర్జునుడు గుర్తుపట్టి – 'ద్రౌపదీ నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో’ అన్నాడు.

పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది. తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ’ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు’ అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు – తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.

అర్జునుడు  కృష్ణుడివంక చూశాడు. 'మహానుభావా! ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడము చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నిటిని నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది’ అని

అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు – 'ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు’ అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీకూడ ఉత్కంఠను పొందాయి. అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావంము ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన – ’ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చెయ్యి’ అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy