12, జులై 2021, సోమవారం

ప్రముఖ నటులు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

 ప్రముఖ నటులు

సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 

11-7-1907 ◆ 8-10-1863


నాటకరంగంతోపాటు రెండున్నర దశాబ్దాలు సినిమారంగంలో కూడా వివిధ పాత్రలను ఎంతో ఉదాత్తంగా పోషించి, ప్రసిద్ధ రంగస్థల గాయకుడుగా అత్యుత్తమ కారెక్టర్ ఆక్టర్ గా పురోగమించారు ఆంజనేయులు.


1963 అక్టోబర్ 8న 56 ఏళ్ళ కళాజీవితాన్ని చాలించి తెలుగు సినిమారంగం నుండి ధృవతారగా రాలిపోయిన సి.ఎస్.ఆర్. ఆంజనేయులు అసలు పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు.


పూర్వీకుల నివాసస్థలం కృష్ణాజిల్లా బందరవద్ద ఉన్న చిలకలపూడి.  ఆ తరువాత గుంటూరు జిల్లాలోని పొన్నూరులో స్థిరనివాసం.


బాల్యమంతా పొన్నూరులోనే గడిపారు. స్కూల్ ఫైనలవరకూ చదివి కొంత కాలం కో ఆపరేటివ్ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేశారు.


తండ్రి  నటుడవడం వలన ఆ ఛాయలు

సి.ఎస్. ఆర్. మీద కూడా పడ్డాయి. స్నేహితులందరూ హైస్కూల్ విద్య పూర్తిచేసి కాలేజికి వెడుతున్న సమయంలో సి.యస్.ఆర్. నాటకరంగలో ప్రవేశించారు.


ఆంధ్ర నాటకరంగలో ఆనాడు స్థానం,

డి. వి. సుబ్బారావు, పారుపల్లి, జొన్నవిత్తుల, అద్దంకి, కపిలవాయి. తుంగల మొదలైన హేమాహేమీలంతా అగ్రస్థానం వహించి వెలిగిపోతున్న సమయంలో అనతికాలంలోనే వారి కోవలోచేరిపోయిన సి.ఎస్.ఆర్.ఎంతటి ప్రతిభావంతుడో మనం అర్థం చేసుకోవచ్చు.


ముఖ్యంగా ఆయన అంతటిస్థానాన్ని ఆక్రమించడానికి కారణం శ్రీకృష్ణ తులాభారం. రాధాకృష్ణ నాటకాలలోని శ్రీకృష్ణ పాత్ర, ఆ పాత్రను ధరించడంలో ఆయనకన్నా అర్హులు ఆ రోజుల్లో ఎవరూ లేకపోవడంవల్లనే

సి.ఎస్.ఆర్. అంతటి ఖ్యాతిని ఆర్జించారు.


భక్తరామదాసులోని రామదాసు పాత్ర, భక్తతుకారాంలోని తుకారాం పాత్ర ఆయనకు అఖండకీర్తిని సంపాదించి పెట్టాయి.

పైన ఉదహరించిన పాత్రలన్నీ ఆయన అభిమాన పాత్రలు. ఆ పాత్రల్లో ఆయన జీవించారనే చెప్పవచ్చు.


సి.ఎస్.ఆర్. ధరించిన పాత్రలలో ఒక పాత్రకూ. మరో పాత్రకూ నటనలో సారూప్యముండేది కాదు. ఏ పాత్రకు ఆ పాత్రే. ఒక ప్రత్యేకతను నిలబెట్టుకునేది.


ఆయన అత్యుత్తమ గాయకుడు. ఏనాడూ,

ఏ నటునీ, ఏ పాటనూ, ఏ అభినయాన్ని అనుకరించలేదు. స్వయంకృషితో, స్వీయప్రతిభతో, సృజనాత్మక శక్తితో వివిధ కోణాలలోనూ ప్రతిభావంతంగా పాత్రలను మలుచుకుని ప్రతి పాత్రనూ ఉన్నత శిఖరాని కెక్కించారు.


ఆయన పద్యపఠనం ఒక ప్రత్యేకత. పద్యాన్ని పద విభాగం చేసి, విరిచి పాడడంలో ఆయనకు ఆయనే సాటి. పద్యం పాడుతూనే మధ్య మధ్య వచనం కల్పించి, తిరిగి పద్యాన్ని ఎత్తుకోవడంతో ప్రేక్షకులను అచ్చెరువొందించేవారు. ఈ విషయంలో ఈయనకు సరితోడు ఉజ్జీ మరొకరు లేరు. ఆ విధంగా సి. ఎస్. ఆర్. బాణి అని

ఒక విశిష్టతను నాటి నాటకరంగంలో

సార్థకం చేసుకున్నారు.


కేవలం పాటలతో, పద్యాలతో నాటకాలలోని పాత్రలను రక్తికట్టించే సమ యంలో సి. ఎస్. ఆర్. పాటనూ, పాటకు తగిన నటననూ, నటనకు తగిన అభిన యాన్నీ, పాత్రోచిత వాచికాన్నీ సమస్థాయిలో నడవడంవల్లనే చిరకాలం అన్ని స్థాయిలలోనూ కాలంతోపాటు ఉత్తమ నటుడుగా మనగలిగారు.


కృష్ణపాత్రలలో పేరుతెచ్చుకున్న సి.ఎస్. ఆర్. ప్రప్రధమంగా ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో శ్రీకృష్ణపాత్రను, సెంట్రల్ స్టూడియోస్ -  కోయంబత్తూరు వారు నిర్మించిన భక్తతుకారాంలో తుకారాం పాత్రను హేమాహేమీలతో కలిసి నటించారు.


ఆ తరువాత తల్లి ప్రేమ, సుమతి, చూడామణి, వేంకటేశ్వరమహాత్మ్యం, భీష్మ, మాయలోకం, పాదుకాపట్టాభిషేకం, భక్త తులసీదాస్, గృహప్రవేశం, పరమానందయ్య శిష్యులు, సాయిబాబా, వాలిసుగ్రీవ, మాయాబజారు, పాతాళభై రవి, దేవదాసు, చక్రపాణి, సక్కుబాయి, రోజులు మారాయి, సువర్ణసుందరి, జగదేక వీరుని కథ, అప్పుచేసి పప్పుకూడు మొదలైన 150 చిత్రాలలో ఎన్నో పాత్రలను ధరించారు.


ఆయన నటించిన చిత్రాలు కొన్ని దెబ్బతిన్నా

ఆ చిత్రంలో సి. ఎస్. ఆర్. పాత్రగాని, నటనగాని బాగుండలేదని ఏనాడూ అనిపించుకోలేదు. ధరించిన ప్రతిపాత్రా మణిపూస. ఆయన అకుంఠిత దీక్ష ప్రతి పాత్రను తీర్చిదిద్దేది. ప్రతిపాత్రకూ ఒక వ్యక్తిత్వాన్ని కల్పించుకునేవారు. ఒకసారికి పదిసార్లు సంభాషణ ఎలా చెబితే బాగుంటుందోనని మధనపడేవారు. ఆయనకు తృప్తి కలిగేవరకూ దానిని సాధన చేసేవారు. తుదివరకూ తెలుగు సినీరంగంలో శక్తివంతుడైన నటుడుగా రాణించారు. అన్ని పాత్రలతోపాటు ఆయన హాస్య పాత్రలు కూడా గణనీయమైన స్థానంలో నిలబడినాయి.


ముఖ్యంగా ఆయన ధరించిన పాత్రలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు గృహప్రవేశం, అంతా మనవాళ్ళే, మేలుకొలుపు, జీవితం, నిత్యకళ్యాణం పచ్చతోరణం, మాయా బజారులలో శకుని మొదలైన పాత్రలు. శకుని అంటే సి. ఎస్. ఆర్. ఎప్పటికీ గుర్తుండకపోరు.


ఆయన దేశభక్తుడు. జాతీయవాది.

అస్పృస్యతానివారణ కోసం పతిత పావన నాటకం వ్రాయించి, ఆంధ్రదేశమంతటా ప్రదర్శించి దేశభక్తుల మన్నన లందుకున్నారు.


సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉద్యమానికి 'తుకారాం' నాటకం ద్వారా పదివేల రూపాయలు సంపాదించి ధన సహాయం చేశారు.


పి. ఎస్. ఆర్. విరాడంబరుడు. నిగర్వి. స్నేహపాఠుడ్రు. ధనిక వేద తారతమ్యాలు లేని నిష్కల్మష హృదయుడు.


వెండితెర వెలుగుల్లో మరువలేని మధుర హృదయుడుగా, కళామూ రిగా జీవించిన

సి.ఎస్. ఆర్. మరణించిన రోజున నట లోకమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. శిలాక్షరాలుగా సి. ఎస్. ఆర్, అనే మూడు అక్షరాలు చరిత్రలో నిలిచిపోయాయి.

                  ●●●●●


డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి 'నటరత్నాలు' 

     గ్రంథం నుండి సేకరణ

తెలుగు మాస్టర్ గారి పాఠం

 డు,ము,వు,లు ప్రధమా విభక్తి,

నిన్,నున్,లన్,కూర్చి, గురించి......ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం.కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం.దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 

 

నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.....

నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది....... 

దివికి దివికి దిమాడి.....గుబుకు గుబుకు గుమాడి.....దివికి దివికి దిమాడి ....గుబుకు గుబుకు గుమాడి.......

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ,ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు. 


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడిపై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


ఒరేయ్..ఇలా రారా!మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని. 


అంతలోనే ధామ్...ధామ్  అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


వెధవా......నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే,  నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు  తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ 

రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక,పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. అతనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో,ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేరు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


అబ్బే.....కుదరదండి.రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్  ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా  చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి.......అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు,మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న ఆ కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


సర్....ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు..కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట..ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.....అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


రండి....కూచోండి. మీ వివరాలన్నీ చూసాను. అంటూ  మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు, అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. 

మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది. అంటూ  కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


అయ్యో.....మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు  తెలుగు మాస్టారు. 


చేతన్, చెన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!


కొఱకున్, కై ......

ప్రజల కొరకు,ప్రజల కోసం పోరాడటం.....

చతుర్ధీ విభక్తి ...!


వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను,వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!


కిన్, కున్, యొక్క,లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే.....

షష్టీ విభక్తి...!


అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.....

సప్తమీ విభక్తి...!


ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన  పాఠం.....అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


అవును మాస్టారు.....నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి......అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు. 


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు.....అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నే మార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా ఇపుడిలా


మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి .....ఇది నా విన్నపం. కాదనకండి.... అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య  ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేక పోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


సార్ .....మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట. మరేమి ఫరవాలేదు ....హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట .....అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ .....వచ్చి చెప్పాడు సెక్రటరీ.


మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించ మను.మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ......తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా, పకా ఎందుకు నవ్వు తున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.......


సేకరణ:యర్రాప్రగడ ప్రసాద్

*హిందూ ఋషులు జాబితా*

                        *హిందూ ఋషులు జాబితా*


అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు


*అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ -* *అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ -* *త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ* *- శ - ష - స - హ - ళ - క్ష*


*దేవర్షి*    దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.


*బ్రహ్మర్షి*  ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.


*మహర్షి*  సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.


*రాజర్షి*   రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


*అ*

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు


*ఇ*

ఇరింబిఠి‎


*ఉ*

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు


*ఊ*

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి


*ఋ*

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


*ఔ*

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి


*క*

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు


*గ*

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు


*చ*

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎


*జ*

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎


*త*

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి


*ద*

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎


*న*

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు


*ప*

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు


*బ*

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు


*మ*

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

మైత్రేయ


*య*

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎


*ర*

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు


*వ*

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు


*శ*

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు


*స*

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి


*హ*

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి.                          *శుభమస్తు*

..........................................

యుగములు

 *🔸 యుగములు - మానవ కాలములో 🔸*

*🔹 కృత యుగము : 17,28,000 సంవత్సరాలు.*

*🔹 త్రేతా యుగము : 12,96,000 సంవత్సరాలు.* 

*🔹 ద్వాపర యుగము : 8,64,000 సంవత్సరాలు.* 

*🔹 కలి యుగము : 4,32,000 సంవత్సరాలు.*

*🔸యుగముల మధ్య కాలాన్ని యుగ సంధి కాలము అంటారు. 🔸*

*🔹యుగ సంధి కాలము: 🔹*

*🔹కృత యుగమున 400 దేవ సంవత్సరాలు,*

*🔹త్రేతా యుగమున 300 దేవ సంవత్సరాలు,* 

*🔹ద్వాపర యుగమున 200 దేవ సంవత్సరాలు,* 

*🔹 కలి యుగమున 100 దేవ సంవత్సరాల కాము ఉంటాయి.*

*🔸 యుగ సంధి మానవ కాలములో 🔸*

*🔹 కృత యుగము : 1,44,000 సంవత్సరాలు.*

*🔹 త్రేతా యుగము : 1,08,000 సంవత్సరాలు.* 

*🔹ద్వాపర యుగము : 72,000 సంవత్సరాలు.*

*🔹 కలి యుగము : 36,000 సంవత్సరాలు.*

*🔸 త్రేతా యుగము నుంచి మానవులలో ధర్మము, న్యాయము, ఆయువు, శరీర బలము, ధారుఢ్యము క్రమ క్రమంగా తగ్గుతూ ఉంటాయి.*

*🔹 ఈ నాలుగు యుగములు ఒక మహా యుగము ఔతుంది. అటువంటి మహ యుగములు వెయ్యి బ్రహ్మ దేవుడికి ఒక పగలు. అలాగే ఒక వెయ్యి మహా యుగములు ఒక రాత్రి ఔతాయి. బ్రహ్మ నిద్రించే సమయంలో జగత్తుకు ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మ దేవుడు నిద్ర లేవగానే బ్రహ్మ దేవుడు సృష్టికి పూనుకుంటాడు. ఇలా సృష్టి క్రమం నడుస్తూ ఉంటుంది.*

నీదే భారం సామీ...

 నీదే భారం సామీ...🙏


🔹🔸🔹🔸🔹🔸🔹



చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ..


 

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.....


అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...! 

భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?. 

ఏమి జరగబోతోంది ? 

లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా? 

సింహం లేడిని తినేస్తుందా ?


 

వేటగాడు లేడిని చంపెస్తాడా ? 

నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా? 


ఒక వైపు నిప్పు , 

రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. 

అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... 


అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి......


.పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......


ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.


t.me/narayanamantram


జై శ్రీమన్నారాయణ🙏


🔸🔹🔸🔹🔸🔹🔸🔹

ఆత్మ రెండు విధాలుగా పరయాణిస్తుంది.

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మానవుని మరణానంతరం ఆత్మ రెండు విధాలుగా పరయాణిస్తుంది. ఒకటి దేవయానం లేదా ఉత్తరాయణ మార్గం. రెండవది పిత్రుయాణం లేదా దక్షిణాయన మార్గం.

         శ్రేయోమార్గంలో జీవితం గడుపుతూ తనువు చాలించే వారు వరుసగా తేజోమార్గాన పగటిని దాటుకుని తర్వాత శుక్ల పక్షాన్ని, ఉత్తరాయణాన్ని, చంద్రుడిని, సంవత్సరాన్ని, సూర్యుడిని దాటుకుని విద్యుత్ లోకి ప్రవేశిస్తారు. అక్కడ మానవుడు కాని పురుషుడు ఉంటాడు. అతను ఆత్మను బ్రహ్మ లోకి తీసుకుని పోతాడు. అక్కడ నుండి ఇక తిరిగి రావడం అనేది ఉండదు. ఇక జన్మ అంటూ ఉండదు. అదే ముక్తి, మోక్షం. ఆత్మ ఈవిధంగా ప్రయాణం చేసేది దేవయానం. 

          ప్రేయో మార్గంలో జీవితం గడుపుతూ తనువు చాలించేవారు ధూమంలో ప్రవేశించి క్రుష్ణ పక్షంలోకి, దాని నుండి దక్షిణాయనం లోకి ప్రవేశిస్తారు. కానీ సంవత్సరాన్ని చేరుకోలేరు. అక్కడ నుండి వారు పితృ లోకం లో ప్రవేశిస్తారు. దాని నుండి ఆకాశంలోకి, అక్కడ నుండి చంద్రునిలో ప్రవేశిస్తారు. 

         చంద్రలోకంలో తమ పుణ్య కర్మల ఫలం హరించిపోయే వరకు ప్రేతలు నివసిస్తాయి. పిదప తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మొదట ఆకాశంలోనికి, ఆ తర్వాత వాయుమండలంలోకి చేరి మేఘం గా, వర్షము గా మారి భూమిపైకి దిగుతాయి. ఆ తర్వాత వరి ధాన్యం గానో, యవధాన్యంగానో ఓషధీలతలగానో, వ్రుక్చాలుగానో, తిలలుగానో, చిక్కుడు అంకురాలుగానో జన్మిస్తారు. ఆ ధాన్యాధులను భుజించిన ప్రాణులలో రేతస్సు గా మారి తిరిగి జన్మిస్తారు. 

       ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి కావాలనుకుంటే ఏమి చేయాలి? కర్మ ఫలం వలననే జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాడు. కావున కర్మ ఫలం ను విడిచి పెట్టాలి. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత లో ఎలా చెప్పాడో చూద్దాం. 

ఎవడైతే కర్మ పలాల పట్ల ఆసక్తిని త్యజించి, నిరంతరం త్రుప్తుడుగా, దేన్ని ఆశ్రయించకుండా ఉంటాడో అతడు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మ చేయనివాడే అవుతాడు. 

      దేహి అయిన వాడికి కర్మలను విడిచిపెట్టడం అనేది సాధ్యం కాని పని. అందుచేత విడిచిపెట్టవలసినది కర్మలను కాదు. వాటి ఫలాలను, కర్మఫలాన్ని విడిచిపెట్టిన వాడే త్యాగి అనబడతాడు. 

        నీకు కర్మ చేయడానికి అధికారం ఉంది తప్ప కర్మ ఫలం ఆశించడానికి అధికారం లేదు. అలాగని కర్మలు చేయకపోవడం పట్ల కూడా నీకు ఆసక్తి కలుగరాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదేశించారు. సేకరణ 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

లక్ష్మీదేవీ ప్రీతికరమని

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355.

 

 ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది.  ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. ఉదయాన్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి.  

లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ ఉంచితే .. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. 9494550355 

గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

* గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రాగి నాణేలు పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. 

ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది. 

దేవుడి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన మత్స్య యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును.


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.  

 *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న,వాస్తు విశారద,C V రామన్  అవార్డు గ్రహీత ..శ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

_plz forward the message_🌹

ఎంత సేపు పూజ?

 *ఎంత సేపు పూజ?*


*పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -* 

    *i) శ్రీహరి గుర్తుకు రావాలి*

   *ii) భూమికి నమస్కరించాలి*

   *iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*


*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*


*9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*


*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*


*11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*


*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*


*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*


*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*🙏


🔸🔸🕉️ 🕉️🔸🔸

 ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావన లేకుండా, కేవలం స్వలాభాపేక్షతో, యాంత్రికంగా చేసే యజ్ఞములు కానీ, యాగములు కానీ, దానములు కానీ, వ్రతాలు, పూజలు కానీ, అవన్నీ అసత్ అంటే అసత్యములు అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసీ చేయనట్టే. ఆ కర్మలు ఎందుకూ పనికిరాకపోగా బంధనములు కలుగచేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో గానీ ఎటువంటి మంచిఫలితములను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసినా ఒకటే, చెయ్యకా పోయిన ఒకటే. 


కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యము అనీ మరొక సారి ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు, కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరుప్రతిష్టల కొరకు చేసే పనులు, అసత్తులు కాబట్టి ఎందుకూ పనికి రావు, అవి ఇహలోక సుఖాలను కానీ, పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృథా అంటూ ఈ అధ్యాయమును ముగించాడు కృష్ణ పరమాత్మ.


అశ్రద్ధతో చేయబడే హెూమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ, సత్ పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకములో కానీ, పరలోకములోకానీ ఎటువంటి ఫలితములను, సుఖములను ఇవ్వలేవు.


ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము నేటితో సంపూర్ణము.


చదివిన మీ అందరి కుటుంబాలకు ఆ పరమాత్మ కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ..


మీకందరికీ ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస భాండాగరమైన భగవద్గీతను అందించే భాగ్యం మాకు కల్పించిన మీ అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..🙏

                      - అడ్మిన్


    ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


   *🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩*

భగవత్ శక్తి సూక్ష్మమా?అనంతమా

 భగవత్ శక్తి సూక్ష్మమా?అనంతమా?.రెండునూ తెలియుటకు వ్యాప్తము చెందుట కారణము. అనగా విషు విష్ణువులో యున్న అణు శక్తి యే మూలం వ్యాప్త మునకు.నక్షత్ర సూక్తం రాహు నక్షత్ర మైన ఆరుద్ర రుద్ర శక్తియని దాని గురించి నాలుగు మంత్రములలో వివరించుట జరిగినది. దాని వివరణయే పునర్వసు విష్ణు తత్వమైన గురు గ్రహం బృహస్పతి లక్షణమని స్పష్టంగా తెలియుచున్నది. రెండింటికి కొంత డిగ్రీలలో బేధము కనిపించుటయనగా శివ తత్వ నిరూపణ విష్ణువుగానే తెలియుటకు యీ సూత్రము కారణము. లెస్ దేన్ గ్రేటర్ దేన్ యిది వక పదార్ధ నిరూపణయే ఙ్ఞానము.పదార్ధ నిరూపణ రూపముగా యున్న గాని దాని పరిణామ సూత్రము>< తెలియదు. యిది శక్తి యెుక్క వ్యాప్త తత్వము, (><).ఉదాహరణకు బిందువు (.) గాని ౦ కాని పరిమాణము తెలియదు.అటులనే శక్తి పరిమాణం కూడా అనంతము. దానికి రూపం, రంగు,రుచి లేదు. దీని మార్పును గమనించుట యను లక్షణము  సాధన వలననే జీవుని రూపం తెలియును. వేదము శక్తిని అనంతమై ఖం ఖండన విభజించుటవలననే, విభజించుటకు కూడా సూత్ర ప్రకారమే మార్పు వలననే  దాని లక్షణము తెలియునని విష్ణుసహస్రం ఖం దిశో , భూః,మహో దధిః యని తెలియుచున్నది.ఏది ఖం మార్పు చెంది, దశ దిశలూ భూమి సముద్రములలో కూడా వ్యాపించియున్నదో అది పరమాత్మ శక్తి తత్వముగాతెలుపు చున్నది. అది ద్వి రెండుగా మారుటకు పూర్ణము ౦ రెండుగా మారుటకు వ్యాసార్ధము D. వ్యాసార్ధము అనగా డి యనే ఆంగ్ల అక్షరము సింబల్ మాత్రమే గాని శక్తిని డి గా చూపించిన. విభజనను డివిజన్ గా మాత్రమే చెప్పుచున్నది. పదార్ధ రూపంగా తెలియదు. అది విసర్గ యని హ కారమని ర కారశక్తి రుద్ర శక్తి రెండుగా మారుట. రెండుగా మారినది ద్వైతమని అది పూర్ణముగా ర, మ, శబ్ద కలయిక వలన రమ అగుట, 

రమ శబ్దము యెుక్కశక్తిని పదార్ధ రూపముగా తెలియుటయే రామ శబ్దము.రెండుగా మారినది మూడవతత్వము  పరిమాణము రామ తత్వం. మెుదటి  రెండు శివ, కేశవ తత్వముల సమూహము మూడవది యైన రామ తత్వము. రామ జననం తరువాతనే ఆ శక్తిని దర్శించుటకే  తెలియుటకు. పంచభూతాత్మకమైన జీవుని లక్షణమును ప్రత్యక్షంగా పూర్ణమని తెలియుటకు రామ జనన ఆవిర్భావం, సూత్ర పరంగా శివ తత్త్వం విష్ణు తత్వం వ్యాప్తంగా యున్నది. కాని దానిని ప్రత్యక్షంగా చూచుట లేదు. దానిని అనగా వస్తు లక్షణరూపములో అనుభవించుట చూచినగానీ అది యిది తత్ సత్ యని స్థిరమైన తత్వం, కలగదు. సథిరమైన తత్వమును తెలియుట ఓహోయని అహోయనిఆశ్చర్యమైన విషయం ఆశ్చర్యమైన విషయమే భగవంతుని తత్త్వం. యిదియే శక్తి యెుక్క వ్యాప్త లక్షణమని తెలియును. దీనికి శబ్దమే ప్రమాణము. మరియొకనికి గణిత శాస్త్ర ప్రకారము శక్తి దాని వ్యాప్తము L ఆంగ్ల అక్షర రూపంలో పూర్తిగా తెలియదు. దాని ప్రయాణమునకు ఎక్కడో దాని ప్రతిబింబము ఆబ్జెక్టు కావలెను.అది మానవ శరీరము. తండ్రిలో గల శక్తి రూపమే దేహము, జీవుడు, యనే ఆబ్జెక్టు కాంతికి దాని లక్షణమునకు ప్రతి

రూపము. కాంతి ఎల్ ఆకార ప్రయాణము వలన విషయం తెలియదు. దానికి ఆబ్జెక్ట్ లేదు. అది వ్యతిరేక దిశలో ప్రయాణించిన గాని అనగా < యీ గుర్తు వలననే కాంతి 🔦 లక్షణము దాగి యున్నది ,కానీ దానిని తెలియవలెనన్న ప్రతిబింబము > వలననేతెలియును.దీనిని జ్యోతిష శాస్త్రము గ్రహ, నక్షత్ర శక్తిని భూమిపై వ్యాప్త మును తెలుపు చున్నది. మనం టార్చ్లైట్ 🔦అనే సూత్రము ద్వారానే ప్రత్యక్షంగా చూచి అనుభవించుచున్నాము. ప్రకృతి ద్వారా వీటి యన్నింటికి కర్త సూర్య రూపంలో యున్న  భగవత్శక్తియే. సూర్య శక్తిని అనంతమైనదానిని సూక్ష్మంగా  కాంతి రూపంలో అనుభవించుట. యిది సూక్ష్మమా లేక అనంతమా . సూక్ష్మ మైనది అనంతమై తిరిగి సూక్ష్మంగా మారుటయను లక్షణమును అనుభవించుటయే జీవ తత్వం. శివ కేశవ తత్వం జీవునిలో దేహములో గల శక్తికి మూలం.అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

సౌందర్య లహరి – సాధన*

 *శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*

*శ్రీ సద్గురు పరమాత్మనే నమః*

*సర్వమహర్షిభ్యోనమః*

*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*

*9063939567*

*ఓం శ్రీ లలితాంబికాయై నమః*

*సౌందర్య లహరి – సాధన*

*ప్రథమ భాగః – ఆనంద లహరి*


*శ్లోకం 7*


*క్వణత్కాఞ్చీదామా కరికలభకుంభస్తననతా*

*పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా |*

*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*

*పురస్తాదాస్తాం నః పురమథితు రాహోపురుషికా || 7 ||*


*ప్రతిపదార్థము :*


*అహో పురుషికా* = అహంకారం ఆకారంగా కలిగిన జగన్మాత;

*క్వణత్కాంచిదామా* = సవ్వడిచేస్తూన్న మొలనూలు కలిగినది;

*కరికలభ కుంభస్తనభరా* = గున్నటేనుగుల కుంభ స్థలాలతో పోటీ పడగల చన్నులు గలది ౼ అనగా పెద్ద స్తనాలున్నది, (పాఠాంతరం ప్రకారం - ఆ భారం వల్ల కొంచెం ముందుకు వంగినది అని అర్థం);

*పరిణత శరత్ చంద్రవదనా* = శరదృతువులో వెన్నెల వికాసాన్ని తలదన్నేలా ఉన్న ముఖం కలది;

*కరతలైః* = 4 చేతులలో;

*ధనుర్భాణాన్పాశం సృణిమపిదధానాం* = పాశం - అంకుశం - విల్లు - బాణం ధరించినది;

*పురమధితుః* = త్రిపుర సంహారకుడైన శివుని యొక్క;

*నఃపురస్తాత్* = మా హృదయాల్లో;

*అస్తాం* = కొలువుండుగాక!


*తాత్పర్యము / భావం :*


*మ్రోగుతున్న బంగారు మొలత్రాడు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాల వంటి కుచాలతో వంగియున్నదీ, సన్నని నడుము కలదీ, శరత్ పూర్ణిమా చంద్రుని వంటి వదనారవిందం కలదీ, హస్తాలలో పాశాంకుశాలను ధరించినదీ, త్రిపురహరుని అహంకార స్వరూపిణి అయిన పరదేవత మా సమక్షంలో (అంటే ధ్యానంలో) ఉండును గాక!*


*ఈ శ్లోకంలో దేవీ స్వరూపం దర్శింపచేస్తున్నారు. (దీని తరువాత శ్లోకం "సుధాసింధోర్మధ్యే") ముందుగానే తదుపరి శ్లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ౼ అందుకు భూమికగా ఉపయుక్తంగా సమయాచారులకు చతుర్విధైక్యాను సంధాన మహిమ (సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యా)లచే, మణిపూర చక్రమందు భగవతి రూపమెటువంటిది గోచరిస్తూందో అట్టి రూపమును ప్రస్తుతించుచున్నారు.*


*త్రిపుర సంహారియగు పరమశివుడు తన పౌరుష రూపమయిన అహంకారమును స్త్రీ రూపమందునట్లు గావించెను. అదియే యీ రూపం.*


*విశేష వ్యాఖ్య:*


*1. ఇది వీర రస ప్రధానమగు సగుణరూపము.*


*2. "ఆహోపురుషికా దర్పాద్యాస్యాత్సంభావనాత్మని” అని అమర నిఘంటువు.*


*3) త్రిపుర సంహారానంతరము శివునిలో తనంతటి వీరుడు లేడను భావము కలిగెను. అదియే ఆహోపురిషిక, అదియే స్త్రీ రూపము దాల్చెనని భావము.*


*4) “ఆహో శబ్దః ఆశ్చర్యవాచీ ౼  పురుష శబ్దస్య ప్రత్యగాత్మ వాచిన్యః అహంశబ్దవాచ్యత్వం లక్ష్యతే ౼ అతః ఆహోపురుషికా అహంకార ఇతి యావత్" అని లక్ష్మీధరుల వ్యాఖ్య.*


*పరమాత్మ నిర్వికారము, నిరాకారమైనను భక్తుల అనుగ్రహార్థము స్త్రీ పుంరూపముల ధరించునని పురాణములు చెప్తున్నాయి.*


*దేవానాం కార్యసిధ్యర్థమావిర్భవతి సా యదా౹*

*ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే౹౹*


*అని మార్కండేయ పురాణ వచనము. దేవతల కార్యసిద్ధికై ఆ పరమాత్మ స్త్రీ రూపమును ధరించి నపుడు దేవియే పుట్టినదని లోకములో వ్యవహరింపబడునని  భావము. ఆమెనే 'నిత్యా' అన్నారు.*


*"త్వం స్త్రీ త్వం కుమార ఉతవా కుమారీ" అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు స్త్రీ రూపమునను పరమాత్మ అగపడునని బోధించుచున్నది. ఆ స్త్రీ స్వరూపము అనుపమ సౌందర్యవతిగా భక్తులందరకు భక్తి భావమును గల్గించునని అర్ధం.*


*తొలి వనిత ఆ ఆదిశక్తియే. ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపము శివునికి చాల ఇష్టం! ఇష్టమే కాదు. గర్వకారణము కూడా ! ఈ గర్వము అహంకారము సూచించును కాబట్టి ౼ ఈ అమ్మవారి రూపము శివుని "అహంకార స్వరూపము" అని శంకరులు అంటున్నారు. శివుడు ౼ ఒక ఆకారము, రూపము మొదలైన గుణములు లేని నిర్గుణుడు. అమ్మవారితో కూడినప్పుడే అవి ఏర్పడి సగుణుడవుతున్నాడు. అనగా ౼అమ్మవారిది (౼'నేను ' అనే స్థితిని) సూచించే శివునికి ఏర్పడిన 'మేను' స్వరూపము అన్నమాట! ఈ 'అహం' కు ఏర్పడిన ఆకారము కాబట్టి శివుని యొక్క 'ఆహోపురుషిక' లేదా 'అహంకార స్వరూపం' అయినది. తొలి అచ్చు అయిన 'అ' మొదలు తుది హల్లు అయిన 'హ' వరకు ఉన్న (అక్షరముల) వర్ణ స్వరూపిణి కాబట్టి - 'అ-హం కార స్వరూపము'.*


*లలితా సహస్ర నామములోని ౼  'రణత్ కింకిణీ మేఖలా', 'క్రోధాకారాంకుశోజ్వలా',  'మనోరూపేక్షుకోదండా', 'లక్ష్యరోమలతా ధారతాసమున్నేయ మధ్యమా' 'శివమూర్తిః', 'మాతృకావర్ణరూపిణీ', 'శాతో దరీ', 'వర్ణరూపిణీ', 'తలోదరీ', 'శరచ్చంద్ర నిభాననా ౼ మొదలైన నామములతో ఈ శ్లోకమునకు సమన్వయమున్నది.*


*పైన చెప్పబడిన స్వరూప విశేషము గల అమ్మవారు మాకు ఎదురుగా సాక్షాత్కరించు గాక ౼ అని శంకరులు కోరుకొంటున్నారు. అనగా, అమ్మవారిని ప్రత్యక్షము చేసుకోడానికి ఈ రూపమును ధ్యానము చెయ్యాలని అర్థము.*


*ఉపాసన :*


*పైన ఇచ్చిన "శత్రుంజయం" అనే పేరుతో అత్యంత ప్రసిద్ధి చెందిన యీ యంత్రాన్ని బంగారపు రేకుపై మాత్రమే వ్రాయించాలి.*


*ఉత్తరదిక్కున ప్రతిష్టించి, తూర్పు ముఖంగా కూర్చుని - ఆరాధించాలి.*


*నెలలు రోజులు దీక్షతో చేసే యీ ఉపాసనలో - పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకు వెయ్యి (1000) సార్లు చొప్పున జపించాలి.*


*ప్రతిరోజూ పాలూ పంచదారతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా వుంచాలి. క్షుద్రభావరహితంగా పూజిస్తే శత్రువులందరి పైనా విజయం తధ్యం!*


*మరో పద్ధతి :*


*అంతా పై విధంగానే జరపాలి. కాని దీనిరీత్యా ౼ యంత్రాన్ని తూర్పుదిశలో ప్రతిష్టించి ఉపాసకులు ఉత్తరదిక్కునకు అభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. దీక్ష 12 రోజులే! రోజుకు వేయి ( 1000) సార్లు జపం, పాలూ-పంచదారతో చేసిన పాయసమే దీనిలోనూ నైవేద్యం. ఫలితం ౼ పైన చెప్పబడినదే!*


💐💐💐*శ్రీమాత్రే నమః*💐💐💐

*మీ సందేహాలు / పరిష్కారాలు / సలహాల కోసం ఈ క్రింది లింకు ప్రెస్ చేసి మాకు పంపవచ్చును.*

*https://wa.me/919494970459?text=సౌందర్యలహరి.సాధన*

💐💐💐💐💐💐💐💐💐

.*

*

*క్వణత్కాఞ్చీదామా కరికలభకుంభస్తననతా*

*పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్ర-వదనా |*

*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*

*పురస్తాదాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||*

💐💐💐💐💐💐💐💐💐

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ముంగిట్లో మృత్యువు..స్వామివారి అభయం!..*


1989 వ సంవత్సరం లో నేను హైదరాబాద్ లో వున్నాను..అమ్మా నాన్నగార్లు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి) శ్రీ స్వామివారి మందిర బాధ్యతలు చూసుకుంటూ వుండేవారు..శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉత్సవాల సమయంలో మాత్రం  మమ్మల్ని తమకు సహాయకరంగా వుండటానికి రమ్మనమని చెప్పేవారు..నేనూ నా భార్యా ఇద్దరమూ ఆ నాలుగు రోజులూ మొగలిచెర్ల లో వుండి.. కార్యక్రమాలు పూర్తికాగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయే వాళ్ళం..ప్రతి శివరాత్రికి..అలానే శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి.. ఇలా జరగడం పరిపాటిగా మారిపోయింది..సహజంగా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చేది..


కానీ..ఆ సంవత్సరం అక్టోబర్ మాసంలో దీపావళి పండుగ ముందు నాన్న గారి వద్దనుంచి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని..పరిస్థితి ఇబ్బందిగా వున్నదని.. మా అన్నయ్య కు ట్రంక్ కాల్ ద్వారా తెలిపారు..హుటాహుటిన అన్నయ్య వదిన..నేనూ మా ఆవిడ మొగలిచెర్ల చేరుకున్నాము..మేము ఇంటికి చేరే సరికి..అమ్మ స్పృహ లో లేదు..ఆమె కాళ్ళ వద్ద ఒక మనిషి కూర్చుని..అరికాళ్లకు మర్దన లాగా చేస్తున్నది..నాన్నగారు పూర్తిగా ఆశలు వదులుకొని ఓ ప్రక్కగా నిలబడి వున్నారు..ఆ పరిస్థితుల్లో కేవలం దైవం మీద భారం వేయడం తప్ప..ఎవ్వరమూ ఏమీ చేయగలిగింది లేదు..


మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఆ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆశ్రయం కల్పించి..ఆశ్రమం నిర్మాణానికి స్థలం ధారపోసి..ఆయన సాధనకు అన్ని విధాలా సహాయపడిన మా తల్లిదండ్రులలో ఇప్పుడు అమ్మ  ఇలా స్పృహ కూడా  లేకుండా..మృత్యువు కు దగ్గరగా వున్నదనే భావన నాకు జీర్ణం కావడం లేదు..ఏ ఇబ్బందీ లేకుండా సునాయాసంగా చనిపోతే చాలు అని ఆవిడ చాలాసార్లు చెప్పేది..ఈలోపల ప్రక్క ఊరి నుంచి మాకు బాగా తెలిసిన డాక్టర్ గారు కూడా వచ్చి..పరీక్ష చేసి..పెదవి విరిచారు.."ఈ పరిస్థితుల్లో చేయగలిగిందేమీ లేదు..ధైర్యంగా వుండండి.." అని చెప్పారు..ఆయన మాటలు విన్న తరువాత..మాకు ఉన్న కొద్దిపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక మిగిలింది ఆ దత్తాత్రేయుడే..ఆయనకే మా దంపతులము మొరపెట్టుకున్నాము..


శ్రీ స్వామివారు మొట్ట మొదట సారి మొగలిచెర్ల వచ్చినప్పుడు..వారు బస చేయడానికి ఉపయోగించిన గది లోనే అమ్మ ప్రస్తుతం ఉన్నది..మేము మనస్ఫూర్తిగా నమ్మిన ఆ స్వామివారు మాకు అన్యాయం చేయరు అని ఒక మూల అనిపిస్తోంది..


అరగంట గడిచింది..అమ్మ మెల్లిగా కదిలి..కళ్ళు తెరచి చూసింది..మమ్మల్నందరినీ తేరిపారా చూసి..పలకరింపుగా నవ్వింది..ఆ తరువాత ఐదు నిమిషాల కల్లా ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది..భ్రమ కాదు..భ్రాంతి అంతకన్నా కాదు..చావుకు దగ్గరగా వెళ్లిన ఆవిడ..ఆ ఛాయలే లేనట్లు..మామూలుగా లేచి కూర్చుంది..మమ్మల్ని పేరు పేరునా పలకరించుకున్నది..


"ఏమాత్రం అవకాశం లేదు..బ్రతకడం కష్టం.." అని చెప్పిన డాక్టర్ గారు కూడా..ఆశ్చర్యంగా చూడ సాగారు..సాయంత్రానికి అమ్మకు ఉన్న కొద్దిపాటి నీరసం కూడా తగ్గింది..


ఆ సంవత్సరం దీపావళి పండుగ ఉత్సాహంగా జరగడానికి ఆ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి చల్లని చూపులే కారణం..


మరో అనుభవం రేపటి భాగంలో చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).