12, జులై 2021, సోమవారం

ఎంత సేపు పూజ?

 *ఎంత సేపు పూజ?*


*పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -* 

    *i) శ్రీహరి గుర్తుకు రావాలి*

   *ii) భూమికి నమస్కరించాలి*

   *iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*


*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*


*9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*


*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*


*11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*


*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*


*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*


*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*🙏


🔸🔸🕉️ 🕉️🔸🔸

 ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావన లేకుండా, కేవలం స్వలాభాపేక్షతో, యాంత్రికంగా చేసే యజ్ఞములు కానీ, యాగములు కానీ, దానములు కానీ, వ్రతాలు, పూజలు కానీ, అవన్నీ అసత్ అంటే అసత్యములు అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసీ చేయనట్టే. ఆ కర్మలు ఎందుకూ పనికిరాకపోగా బంధనములు కలుగచేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో గానీ ఎటువంటి మంచిఫలితములను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసినా ఒకటే, చెయ్యకా పోయిన ఒకటే. 


కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యము అనీ మరొక సారి ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు, కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరుప్రతిష్టల కొరకు చేసే పనులు, అసత్తులు కాబట్టి ఎందుకూ పనికి రావు, అవి ఇహలోక సుఖాలను కానీ, పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృథా అంటూ ఈ అధ్యాయమును ముగించాడు కృష్ణ పరమాత్మ.


అశ్రద్ధతో చేయబడే హెూమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ, సత్ పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకములో కానీ, పరలోకములోకానీ ఎటువంటి ఫలితములను, సుఖములను ఇవ్వలేవు.


ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము నేటితో సంపూర్ణము.


చదివిన మీ అందరి కుటుంబాలకు ఆ పరమాత్మ కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ..


మీకందరికీ ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస భాండాగరమైన భగవద్గీతను అందించే భాగ్యం మాకు కల్పించిన మీ అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..🙏

                      - అడ్మిన్


    ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


   *🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩*

కామెంట్‌లు లేవు: