31, మార్చి 2021, బుధవారం

ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం  - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు.  వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను.  అవి 


 1 -  పశుపతి అనుచరులు .


 2 -  కుబేర అనుచరులు .


 3 -  కుమార అనుచరులు .


 *  పశుపతి అనుచరులు  -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి  భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 *  కుబేర అనుచరులు  - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 *  కుమార అనుచరులు  -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ  గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద  ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని  అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ  మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


                           సమాప్తం 


    మరింత విలువైన సమాచారం నేను రాసిన గ్రంథముల యందు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. 


     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

వడ్లు గురించి

 వడ్లు గురించి సంపూర్ణ వివరణ - 4 . 


 15 - దినసరులు - 


       ఇవి ఒక రకమయిన వడ్లు . మూడున్నర నెలలకు ఒకసారి ఇవి పండును. వీటి అన్నం స్నిగ్దముగా రుచిగా ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . మలమూత్రబద్ధాన్ని తొలగించును. కొన్ని జబ్బులకు ఇది వాడరాదు. 


 16 -  దుగ్గ నసరులు - 


       వీటి అన్నం బలవీర్య పుష్టికరము . వాతాన్ని పుట్టించును . 


 17 -  నివ్వరులు  - 


      రక్తపిత్త రోగమును నయం చేయును . అగ్నిదీప్తిని పెంచును. జీర్ణశక్తికి మంచిది . 


 18 -  పాంసుగులు లేక ప్రాసంగులు  - 


       ఇవి ఒకరకమయిన వడ్లు . ఇవి మిక్కిలి బలకరమైనవి. మంచి రుచిని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . చలువ చేయును . శ్లేష్మకరములు.


 19 -  పెద్ద వడ్లు  - 


       వీటి అన్నం మంచి రుచి కలిగి ఉండును. కాని అగ్నిమాంద్యం కలిగించును. శరీరానికి మంచి బలాన్ని ఇచ్చును. 


 20 -  బడిపిళ్లు  - 


       ఈ అన్నం అగ్నిమాంద్యం , వాతాన్ని పుట్టించును . అతిగా తినటం మంచిది కాదు. 


       తరవాతి పోస్టు నందు మిగిలిన అతిముఖ్య రకాల గురించి వివరిస్తాను.  మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

వడ్లు గురించి సంపూర్ణ వివరణ - 5 . 


 21 - బైలవడ్లు - 


         ఇవి మెట్ట భూముల్లో పండును. వెగటుగా ఉండును. కఫమును , వాతమును హరించును . అగ్నిదీపనమును కలిగించి ఆకలిని , రుచిని పుట్టించి శరీరానికి మంచి చేయును . 


 22 - మద్దిగడ్డలు - 


        వీటి అన్నము శ్వాసకాసలు , ఉదరవ్యాధులు , మలమూత్ర బంధనం , గుల్మములు మున్నగువానిని పోగొట్టి అగ్నిదీపనం కలిగించును. ఇవి కొంచం చేదుతో కూడి తియ్యదనం కలిగి ఈ అన్నం ఉండును. 


 23 - రాజనాలు - 


         ఇవి శ్రేష్టమైన జాతికి చెందిన వడ్లు . వీని అన్నం స్నిగ్దముగా , రుచికరంగా , బలవీర్య కాంతిప్రదమై ఉండును. పిత్తమును హరించును . నేత్రవ్యాధులకు హితకరము . ఆకలి పుట్టించి , దాహమును అణిచి మలమూత్రబద్ధకము తొలగించి , బుద్దికి మంచి చురుకుదనం ఇచ్చును. 


 24 - ఱెక్క పాంసుగులు - 


        ఱెక్క పాంసుగులు అనేవి ఒక జాతి వడ్లు . వీటి అన్నం వీర్యమునకు పుష్టిని ఇచ్చి నేత్రవ్యాధులు , అతిసారములు , నిస్సత్తువ పోగొట్టును . ఇవి లఘుత్వము , రుచి , అన్నహితువు కలిగించును . 


 25 - వంక సన్నాలు లేక వంకలు - 


       వీటి అన్నం వాతమును పుట్టించును . అజీర్ణ విరేచనాలు కలిగించును. కాని పైత్యాన్ని పోగొట్టును అని అందురు. వీర్యపుష్టిని ఇచ్చును. 


          వడ్లలో చాలా రకాలు ఉన్నాయి . వాటన్నినీ వివరింపసాధ్యం కాదు కనక కొన్ని అతి ముఖ్యమైన వాటి గురించి మీకు వివరించటం జరిగింది. 


      మరింత సంపూర్ణ మరియు విలువయిన సమాచారం నేను రచించిన గ్రంథాల యందు మీకు లభ్యం అగును . 


                             సంపూర్ణం 

   


   గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే

 సుబ్రహ్మణ్యుని పాదములను స్మరిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది 🙏🌼🌿*


ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.

అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి
వారి దర్శనము అయ్యింది.
వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.
ఈ భుజంగ స్తోత్రము ద్వారా..ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు.
మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి,
అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి .
దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు,
ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది,
దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.

ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం,
కుష్ఠ రోగం మొదలైనవి.
అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు.

ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.చివరిలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉన్నది, వీలుంటే ఒకసారి భక్తితో పటించండి

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి
మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు.

అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో.

అంతటి శక్తి ఈ *'తిరుచెందూర్'* క్షేత్రమునకు ఉన్నది.

*అలానే శరవణభవ అనే నామానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం*

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…
ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు

షడాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.

*శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం*

సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా।
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి:॥

నజానామి శబ్దం నజానామిచార్థం
నజానామి పద్యం నజానామి గద్యం।
చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్॥

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం।
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం॥

యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ।
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం॥

యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే।
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం॥

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః।
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు॥

మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే।
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం॥

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే।
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్॥

రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే।
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే॥

సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్।
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్॥

పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్।
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్॥

విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్।
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్॥

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్।
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్॥

స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని।
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి॥

విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు।
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః॥

సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్।
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః॥

స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః।
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః॥

ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్।
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్॥

కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ।
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్॥

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే।
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్॥

కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు।
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం॥

ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం।
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా॥

సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః।
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి॥

అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే।
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్॥

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః।
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే॥

దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్।
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః॥

మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః।
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే॥

కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః।
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార॥

మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే।
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల॥

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ।
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ॥

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః।
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు॥

జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే।
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో॥

భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య।
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః॥

ఇతి జగద్గురు శ్రీ ఆదిశంకారాచార్య విరచిత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణం

*ఓం శరవణభవ*

సమయ ప్రయాణికులు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹నాకు నచ్చిన ఓ వాట్సాప్ సందేశం 

   *సమయ ప్రయాణికులు* 

       (Time travellers)


మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...


ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

*ఒకే గోత్రీకుల మధ్య

 *ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు ఎందుకు చేయరాదు?*



శ్లో ll సప్తమాతృచం మాద్థీమాన్ య:కన్యాముద్వహేన్నరః !

గురుతల్పీన విజ్ఞేయః సగోత్రాన్ చైవ ముద్వహన్!! - ధర్మసింధు 


తండ్రి తరుపున ఏడులతరాలలోగాని, తల్లితరపున ఐదు తరాలలోగాని సగోత్రీకులైన వారిని వివాహం చేసికొనరాదు. అట్లుచేసికొన్నచో తల్లిని (గురుపత్నిని) వివాహం చేసికొన్నంత పాపం సంభవిస్తుంది.


సనాతన సంప్రదాయంలో యజ్ఞయాగాలు మొదలైన వైదిక కర్మలకు, వివాహాది శుభకార్యాలకు, శ్రాద్దాది పితృకర్మలకు తప్పనిసరిగా గోత్రం, ప్రవర తప్పనిసరిగా తెలియపర్చవల్సి వుంటుంది. మనందరి గోత్రాలకు ఎనిమిది మంది మహర్షులు మూలపురుషులుగా వున్నారు. అగస్త్యమహర్షి- భరద్వాజ మహర్షి - గౌతమ మహర్షి - వశిష్టమహర్షి - కాశ్యపమహర్షి - భరద్వాజ మహర్షి - అత్రిమహర్షి - జమదగ్నిమహర్షి ఈ ఎనిమిది మంది మహర్షులు మనకు గోత్రపురుషులు.


ఏ గోత్రం వారు ఆ గోత్రం వారికి రక్తసంబంధీకులు అవుతారు.


 ఈ ఎనిమిది మంది గోత్రపురుషులకు కలిపి నలభైతొమ్మిది మంది ప్రవర పురుషులున్నారు. సంతానోత్పత్తి క్రియకు (దాంపత్యానికి) ఒకే గోత్రీకులు అయి వుండ రాదు. ఒకే ప్రవర వున్నవారు కూడా పనికిరారు దాంపత్య బంధానికి పనికిరారు (వివాహం కుదరదు). 


వధూవరులు ఒకే గోత్రం కలవారైనా, ఒకే ప్రవర' వారైనా అన్నాచెల్లెళ్ళవుతారు.


ఒకే గోత్రీకులకు బిడ్డలు పుడితే పరమదుర్మార్గులవుతారు.


సగోత్రీకుల వివాహబంధం కంటే వర్ణాంతర వివాహమే మేలైనది.


సగోత్రీకులు, సప్రవరీకుల మధ్య మాత్రమే కాకుండా మేనత్త కూతురిని అన్నగారి మరదలిని (వదిన చెల్లెలిని) మేనమామ కూతుర్ని కూడా వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తండ్రితరపు రక్తసంబంధీకులు ఏడుతరాలవారు, తల్లితరపున రక్తబంధువులు ఐదుతరాలవారు కాకుండా వున్న కన్యను పెండ్లిచేసుకోవాలని అన్నిశాస్త్రాలు చెబుతున్నాయి. అక్క కూతురిని పెండ్లి చేసుకోవటం కూడా ధర్మాచారం కాదు. అనగా తండ్రిగారి చెల్లెలి బిడ్డను (మేనత్త కూతురు) తల్లిగారి చెల్లెలిబిడ్డను (పినతల్లి కూతురు) వివాహ మాడరాదు.


కుండ మార్పిడి వివాహాలు కాని, ఒకే పందిరిలో రెండు పెళ్ళిళ్ళుగాని నిషిద్ధం.


*దూర సంబంధీకులైన భార్యాభర్తలకు పుట్టే పిల్లలు

ఆరోగ్యంగానూ తెలివిగలవారుగానూ, సౌందర్యవంతులుగానూ వుంటారనేది మాత్రం నిజం. సగోత్ర సంబంధాలను 

పురాణాలు, స్మృతులు, అన్ని వ్యతిరేకిస్తున్నాయి*

🙏🏻

నకర్మలిప్యతేనరే

   చదవండి..


“నకర్మలిప్యతేనరే”


ఒక గృహిణి ఇంటిని శుభ్రం చేసే సమయంలో భిక్షాటనకై వచ్చిన సాధువును చూసి క్రుద్ధురాలై ఆ సాధువును దూషించి, ఇంటిని శుభ్రం చేస్తున్న తడిబట్టను విసిరి కొట్టి అవమానం చేసింది...


 మురికి బట్టను గైకొన్న సాధువు భగవంతుడు తనకిచ్చిన ప్రసాదమని భావించి వెళ్ళిపోయాడు. సాయంసంధ్యాకాలం కర్తీకమాసం ఆ గృహిణి శివాలయానికి వెళ్ళింది.

శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి...


ఈ సహస్ర దీపాలను ఎవరో సాధవు వెలిగించారట! అని అందరూ చెప్పుకోవడం ఈవిడ చెవిన పడింది. ఎవరా సాధువని వెతికింది. ఉదయం ఈవిడ అవమానపరచిన సాధువేనని గ్రహించింది...


 ఖిన్నురాలైన ఈవిడ ఆ సాధువు వద్దకు వెళ్ళి మీరేనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది. అంతట ఆ సాధువు వినయంగా ‘అమ్మా  నీ చలవతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను. ‘నేనెంతటివాడ్ని నిమిత్తమాత్రుడ్ని’  అన్నాడట...


ఈమె వెంటనే పశ్చాత్తా భావనతో స్వామి! నా చలవతో అన్నారు, 

నేనే సహాయం చేయలేదు కదా!  

పైగా మీపైకి మురికిబట్టను విసిరికొట్టి మిమ్మల్ని అవమానించాను’ అని చెప్పింది. అంతట సాధువు అమ్మా!  నీవు విసిరిన బట్ట మురికిదైనా దానిని నేను ఈశ్వరప్రసాదంగానే భావించాను...


శివాలయం ప్రక్కనే వున్న కొలనులో ఆ బట్టను శుభ్రపరిచాను. 

దానితోనే వత్తులు పేనాను.

ఆలయానికి వచ్చే భక్కులను యాచించాను...


 తైలానికి సరిపడ డబ్బును కూడా ఈశ్వరుడు సమకూర్చాడు. వీటితోనే దేదీప్యమానంగా ఈ సహస్రదీపాలు వెలుగుతున్నాయి. నిజానికి మీరు ఆ బట్ట విసరకుండా ఓ ముద్ద అన్నం పెట్టి వుంటే, మిగతా ముద్దల కొరకు యింటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడ్ని. అలాకాక ఈ సహస్ర దీపాలు వెలిగించాలనే సంకల్పాన్ని ఆ ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాను, నేను నిమిత్తమాత్రుణ్ణే అన్నాడు సాధువు...


అవివేకులాచరించే కర్మలకి, వివేకులైనవారాచరించే కర్మలకి ఎంత తేడా వుంది? 

“స్వకర్మణా తమభ్యర్చసిద్ధింవిందతి మానవ:”

మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం...


నేను, నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం. 

కనుక కర్తృత్వ భావనను తొలగించి 

నా ద్వారా జరిగే ఈ కర్మలను కర్త, ప్రేరకుడు ఆ ఈశ్వరుడేయని గ్రహించాలి. 

అల్పమైన ఫలాలకు పరిమితము చెందక అంత:కరణ శుద్ధికై కర్మలను విధిగా ఆచరించాలి. 🙏

30, మార్చి 2021, మంగళవారం

అహోబిలం

 జై శ్రీ లక్ష్మీ నరసింహ.. శుభ శుభోదయం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


హిరణ్య కసిపుడిని సంహరించడానికి నరసింహుడు ఉద్భవించిన ప్రదేశమే అహోబిలం. దీనిని అహోబలంఅని కూడా అంటారు


నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనిచెబుతారు


ఈ క్షేత్రాన్నిభక్తులు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనే పేరుతో పిలుస్తారు.


గుహాంతర్భాగంలో

ఎగువ అహోబిలంలో నారసింహుడు గుహలో స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడే స్వామి వారికి ప్రధానంగా పూజాధిక

కార్యాలు నిర్వహించబడుతాయి.


అహోబిలంలో నరసింహుడు తొమ్మిది విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని నవ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు


ఆ తొమ్మది రూపాలు వరుసగా జ్వాలా నరసింహ, బిల నరసింహ, మాలోల నరసింహ,


క్రోద నరసింహ, కారంజ నరసింహ, బార్గవ నరసింహ, యోగ నరసింహ, ఛత్రవట నరసింహ, పావన నరసింహ


ఈ తొమ్మిది రూపాల్లో జ్వాల నరసింహ రూపం అతి ముఖ్యమైనది.

సేకరణ...

సౌభాగ్యం

 సౌభాగ్యం అన్న పదం వేద పరమైన పరిశీలన. సౌలు శక్తి అనగా ఔ జీవ పరంగా పూర్ణ లక్షణము నకు మూల ప్రకృతి. యిది బాలమంత్రంలో గల సౌ అనే అక్షరమునకు ఓం సౌః. దీని మూర్తి మంతమే దుర్గా స్వరూపం. కాత్యాయనాయ... గాయత్రి అయినది. బీజాక్షర పూర్వక గాయత్రిని సాధనలో కనబడుచున్నది. దురిత ఆత్మ నివారిణి దుర్గగా మనకు తెలియుచున్నది. విజయ దుర్గా స్వరూపమే మెూక్షమని. సౌ అనగా సమస్త కళలతో ప్రకృతి సోభిల్లే లక్షణము. యత్ పూర్ణ రూపేణ శక్తిః తత్ భాసయతి ప్రకాశవాశాత్ వస్తు తత్వః సౌభాగ్యం నామ వివరణ. ప్రకృతి రూప స్త్రీ అమ్మ యని అదే సౌభాగ్య తత్వమని తెలియుచున్నది. సౌ అనగా నూరు యని వక వివరణ. శతంఅనగా పూర్ణమని  పూర్ణ కళలు యని యిది శక్తి గణనకు వక సూత్రము కూడా.

ప్రేమ మార్గాన్ని వ్యాప్తి చేసే సూత్రం

 .....


శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ రుద్రుడిని, ఇంద్రుడిని, సనక సనందనాదులను, దేవర్షులను, ప్రజాపతులను, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధరులను, చతుర్వర్ణాల మనుషులను, జంతువులను, చెట్లను ఇతర స్థావరాలను. సృష్టించాడు. విత్తనాలనుంచి చెట్లు పుడతాయి. వీటిని ఉద్బీజాలు అంటారు. చెమటనుంచి పుట్టిన సూక్ష్మ క్రిములు స్వేదజాలు. ఇవి గాక- అండజాలు, పిండజాలు లక్షల రకాలు. సృష్టిలో కనిపిస్తాయి.


భారతదేశంలో పుట్టిన ప్రతి ఆధ్యాత్మిక మార్గమూ ‘అహింసే పరమ ధర్మం’ అని చెబుతుంది. భగవంతుడి ప్రేమ మార్గాన్ని వ్యాప్తి చేసే సూత్రం ఇది. శంకరాచార్యుల అద్వైతం, బుద్ధుడి కరుణా దృష్టి.. ఈ మార్గంలోనే పయనిస్తున్నాయి. ప్రకృతి ప్రియులకు సృష్టిలోని ప్రతి చెట్టు, పుట్ట, పిట్టా సౌందర్య నిలయాలే.. ఏ ప్రాణీ తనను తాను అసహ్యించుకోదు.. ఒక్క మనిషితప్ప.. నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో వేదన చెందేవారు ఎందరో ఉన్నారు. భగవానుడే నల్లటివాడిగా, పొట్టివాడిగా అవతారాలెత్తాడు. ఆయన చేసిన పనుల వలన లోకాలు సుఖించాయి. అందువల్ల నల్లనయ్యను భక్తితో పూజిస్తాం. ఆయన బోధించిన భగవద్గీత మనకు మోక్షమార్గం. చరిత్రలో ఎందరో అందవిహీనంగా ఉండే మహాత్ములు కనిపిస్తారు. కానీ వారి ఔన్నత్యం భౌతికసౌందర్యాన్ని మించి పోయి ఉంటుంది. వారి రూపురేఖలు మన హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక వారి అందాన్ని గురించి పట్టించుకోం. ఎవరైనా ఆ మహాత్ముల చక్కదనాన్ని గురించి తక్కువచేసి వ్యాఖ్యానిస్తే సహించం.


సామాన్యంగా కథారచయితలు, కవులు కల్పనను ఇష్టపడతారు. అందువల్లనే వారి రచనల్లో సత్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా వారిని అసత్యవాదులు అనలేం. మనకు అర్థంకాని జీవిత సత్యాలనెన్నింటినో రచయితలు సులభంగానూ రసరమ్యంగానూ తెలియజేస్తారు. పురాణ ఇతిహాసాల్లోనూ ఇదే రీతి. కల్పనల సహాయంతో క్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారాలను సూచించారు మన రుషులు. వారిది పవిత్ర దృష్టి. వాళ్ల సృష్టి కూడా పవిత్రమైనదే. వారి కల్పనలు లోకానికి శుభం చేకూరుస్తాయి. లోకశ్రేయస్సు కోసం చేసే కర్మలు, చెప్పే మాటలు, రాసే రాతలు... అన్నీ సత్యంగానే భావించాలి. మానసిక వైద్యులు రోగికి ఉపశమనం కలిగించడానికి చెప్పే మాటలను సత్యాలుగా భావిస్తేనే మేలు కలుగుతుంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను గ్రహించాలంటే వాళ్లకు శ్రద్ధాభక్తులు అవసరం. గురువును దైవం అనే దృష్టితో చూస్తేనే అది సాధ్యం...


|| ఓం నమః శివాయ ||


Spiritual Seekers 🙏

https://t.me/Spiritual_Seekers

మొగలిచెర్ల

 *వర్షం లో మ్రొక్కుబడి..*


"అసలే వర్షం పడుతోంది..ఈ మంటపం లో పడుకునే వీలు లేకుండా ఉంది..నా మాట విను..ఈ రాత్రికి మనం కందుకూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూము తీసుకొని పడుకుందాము..రేప్పొద్దున లేచి..తయారయ్యి ఇక్కడకు వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళదాము..అంతేగానీ..ఇక్కడే వుందాము..ఇక్కడే పడుకుందాము అని మొండిగా వాదించవద్దు..నా మాట విను.." అని ఆ భర్త తన భార్యతో చెపుతున్నాడు..ఆమె మాత్రం "ఎక్కడికీ వెళ్లొద్దు..ఇక్కడే వుందాము..ఈ ఒక్కరాత్రికి సర్దుకుందాము..నేను స్వామివారి మందిరం లో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను..మొక్కుబడి చెల్లించుకోవాలి.." అని చెపుతున్నది.."సరే నీ ఇష్టం..ఈ మంటపం లోనే ఒక మూల ఏర్పాటు చేసుకుందాము.." అని అత్యంత అసహనంగా చెప్పాడు..


ఆరోజు వర్షం కారణంగా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణం అంతా తడి గా ఉన్నది..ఆ సమయం లో ఆ భార్యా భర్త స్వామివారి మందిరానికి వచ్చారు..ఉదయం హైదరాబాద్ లో బయలుదేరి సాయంత్రానికి స్వామివారి మందిరానికి చేరారు..వాళ్ళు స్వామివారి మందిరానికి రావడం కూడా అదే మొదటిసారి..మందిరం లోకి రాగానే..ముందుగా స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..ఆ తరువాత..ఆ దంపతుల మధ్య ఈ సంభాషణ జరిగింది.."ఏమండీ ఇక్కడ మేము ఉండటానికి ఏదైనా ఒక రూము ఉన్నదా?.." అని ఆ భర్త నన్ను అడిగాడు.."ఉన్నది..మీరు కంగారు పడొద్దు..రాత్రికి ఆ రూము మీకు కేటాయిస్తాము..ఆవిడ తన మొక్కుబడి కోసం మంటపం లోనే పడుకోమని చెప్పండి..మీరు రూములో ఉండొచ్చు.." అన్నాను.."ఆ ఏర్పాటు చేయండి..మీకు కృతజ్ఞతలు.." అన్నాడు.."మీరెవరు?..ఈ స్వామివారికి మొక్కుబడి అన్నారు కదా?..ఎందుగురించి మొక్కుకున్నారు..? మీకు అభ్యంతరం లేకపోతే వివరిస్తారా?.." అని అడిగాను..


"మాది కృష్ణాజిల్లా అండీ..ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నాము..మాకొక ఫార్మా కంపెనీ ఉన్నదండీ..బాగానే ఉన్నాము..మాకు ఇద్దరు పిల్లలు..చదువుకుంటున్నారు..పోయిన సంవత్సరం ఈవిడకు కడుపులో నొప్పి వచ్చింది..డాక్టర్ కు చూపించాము..పరీక్షలు చేసి..లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది..ఆపరేషన్ చేయాలని చెప్పారు..రెండు మూడు హాస్పిటల్స్ లో చూపించినా..దాదాపుగా అందరూ ఇదే మాట చెప్పారు..ఈవిడకు ఆపరేషన్ అంటే భయం పట్టుకుంది..నేను ఎంత నచ్చచెప్పినా వినలేదు..ఆ సమయం లో ఈవిడ స్నేహితురాలు ఈ క్షేత్రం గురించి చెప్పి..ఒకసారి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కుకో..నీకు ధైర్యం వస్తుంది..వ్యాధి కూడా తగ్గిపోవొచ్చు.." అని చెప్పింది..స్వామివారి చరిత్ర పుస్తకాన్ని కూడా ఇచ్చింది..ఆవిడ ఏ ముహూర్తం లో స్వామివారి గురించి ఈవిడతో చెప్పిందో తెలీదు కానీ..ఆరోజే ఆ పుస్తకాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టిందండీ..మూడు రోజుల్లో పూర్తి చేసింది..ఆ తరువాత మీకు ఫోన్ చేసి మా అడ్రెస్ ఇచ్చాము..మీరు స్వామివారి విభూతి గంధం పోస్టు లో పంపించారు..ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి..స్వామివారి కి నమస్కారం చేసుకొని..ఆ విభూతి గంధం నుదుటిన పెట్టుకోవడం చేసింది..పదిరోజులు చేసిందండీ..చిత్రంగా తన కడుపులో నొప్పి తగ్గినట్టు అనిపించింది..మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకున్నాము..డాక్టరు గారు ఇన్ఫెక్షన్ అంతగా లేదు..మందులు వాడి చూద్దాము..అన్నారు..నెల రోజుల తరువాత ఈవిడకు పూర్తి స్వస్థత చేకూరింది..తన ఆరోగ్యం బాగు పడితే..ఈ క్షేత్రానికి వచ్చి నిద్ర చేస్తానని మొక్కుకుంది..అందుకోసం వచ్చామండీ.." అన్నాడు..భర్త తన గురించి చెపుతున్నంత సేపూ ఆవిడ స్వామివారి పటానికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..


ఆరోజు రాత్రి ఆ భార్యాభర్తలు మందిరం లోనే నిద్ర చేశారు..తెల్లవారి స్నానాదికాలు ముగించుకొని..స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ..రాత్రి వర్షం వచ్చిన కారణంగా మంటపం లోకి వర్షపు నీరు వచ్చి..అంతా నీళ్ల మయం అయింది..మా మొక్కుబడికి ఏమీ ఇబ్బంది కలుగలేదు..కానీ..ఈ మంటపానికి పడమర వైపు రేకులతో షెడ్ వేయగలిగితే..మావంటి ఇతర భక్తులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది..మా వంతుగా ఆ పని చేస్తాము.." అన్నారు.."మంచి ఆలోచన..అలానే చేద్దాము.." అన్నాను..


ఆ దంపతుల ఆరోగ్య సమస్యనూ..వాళ్ళద్వారా భక్తుల ఇబ్బందినీ..రెండింటినీ స్వామివారు సమాధిలో కూర్చునే తీర్చారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రతి పేరెంట్‌ గుర్తించాలి.

 “స్లేట్‌ ది స్కూల్స్‌”కి ఛైర్మన్‌గా ఉన్న విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తలిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి.మీడియా ఇలాంటి వాటిని విడిచి అక్కర్లేని విషయాలను రుద్దుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సంఘటనలను ప్రమాద ఘంటికలుగా ప్రతి పేరెంట్‌ గుర్తించాలి. కాలనీ, అపార్ట్‌మెంట్, టీచర్స్ అసోషియేషన్లలో కూడా తమ పిల్లలు ఇలా అవకుండా తామేం చేయగలమో మాట్లాడుకోవాలి. ఇంతకీ అమర్‌నాథ్‌ గారు ఆందోళన వ్యక్తం చేసిన సీరియస్‌ పరిణామాలు ఇవే.


వాసిరెడ్డి అమర్‌నాథ్‌ గారి పోస్టు యథాతథంగా:


ఒక్కసారి ఆలోచించండి !

రెండు నెలల క్రితం ఢిల్లీ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 2వ తరగతి పిల్లాడిని అదే స్కూల్ కు చెందిన 11 తరగతి అబ్బాయి స్కూల్ టాయిలెట్‌లో చంపేశాడు. కారణం? స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు పోస్ట్‌ పోన్ అవుతాయి అని.


ఏమండీ 16 ఏళ్ళ పిల్లాడికి 7 ఏళ్ళ పిల్లాడిని చంపాలని ఆలోచన రావడమేంటి ?

అందులో ఏదో ఆవేశంతో తోస్తే కింద పడి చనిపోయిన బాపతు కాదు కదా?

మీరు భయ పడకండి. ఎగ్జామ్స్ పోస్ట్‌ పోన్‌ అవుతాయి.


నేనే ఏదోకటి చేస్తాను అని ఆ బాల రాక్షసుడు రెండు రోజల ముందు నుంచి క్లాస్ మేట్స్ కు చెప్పాడు .

స్కూల్ కు కత్తి తెచ్చి ప్లాన్ చేసి చంపేశాడు. టెర్రరిస్ట్‌లు కూడా ఇంత చిన్న కారణానికి అందునా పసి పిల్లని చంపడానికి వెనకాడుతారు.


కానీ ఒక స్కూల్ పిల్లాడు ఇలా చేసాడు అంటే కారణం ఏంటి అని ఎవరు పెద్దగా ఆలోచించలేదు. ఒకే ఒక్క రోజు అది బ్రేకింగ్ వార్త అయ్యింది.


అమ్మా! ఢిల్లీలో పిల్లలు ఇలా వుంటారా అని అని కాసేపు క్రైమ్ సీరియల్ చూసినట్టు అందరూ ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడితో వదిలేసారు.


సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు లక్నోలోని బ్రైట్ ల్యాండ్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఒకటో క్లాస్ అబ్బాయి ని అదే స్కూల్ కు చెందిన ఆరవ క్లాస్ అమ్మాయి పొడిచింది.

అవునండీ..ఆరవ క్లాస్, పొడిచింది కూడా అమ్మాయే. మీరు సరిగ్గానే చదివారు. ఇదేదో ఎక్కడో జరిగిన ఒకటి అరా సంఘటనలు కావు.


ఇందాకే ఒక టీవీ డిస్కషన్ బ్రేక్ లో ఒక వ్యక్తి చెప్పారు.

రంగారెడ్డి జిల్లా లో ఒక ప్రభుత్వ స్కూల్ కు చెందిన ఆరవ తరగతి అబ్బాయి తన స్కూల్ మేట్స్ ను మోసం చేసి రూ.35 వేలు పోగేశాడట. అమ్మ నాన్నకు తెలియకుండా మిమ్మల్ని టూర్ కు తీస్కొని వెళతాను అని చెప్పాడట.


చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడట!  పిల్లలలో ఇంత క్రిమినల్ మనస్తత్వం ఎందుకు పెరుగుతోంది.


గత కొన్ని నెలలుగా నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నా…అయ్యా పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసారు.

వారు అందులో అతి భయానక దృశ్యాలు ఉన్నా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. గత కాలం పిల్లలు కబాడీ, ఖోఖో లాంటి గేమ్స్ ఆడితే ఇప్పటి పిల్లలు చంపడం ఒక ఆటగా తయారు అయ్యింది.


అమ్మలకేమో టీవీలో సీరియళ్ళు పిచ్చి.


నాన్నలకు చెత్త రాజకీయాల పిచ్చి.


టీవీలకు సంచలన వార్తలు కావాలి.


పిల్లలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా?


బాలల లోకాన్ని ఎప్పుడో కల్మషం చేసేసారు.


ఇప్పుడు ఇప్పుడు వారిని మనం టెర్రరిస్ట్‌లుగా తయారు చేస్తున్నాం.


ఇంటి ఇంటిలో ఒక టెర్రరిస్ట్ తయారు అవుతున్నాడు.


మీడియా పట్టించుకోదు.


ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు.


మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి.


నీలి చిత్రాలు, హింసాత్మక వీడియో గేమ్స్, మద్యపానం, ధూమపానం, ఇవన్నీ ఆధునిక రోగాలు.


వీటిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేసే దోమ స్మార్ట్ ఫోన్.


స్మార్ట్ ఫోన్‌ను మీ పిల్లలకు దూరంగా ఉంచండి.


ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేయించండి.


దానిపై చైల్డ్ లాక్ లాంటి ఫీచర్స్ ఇన్‌స్టాల్‌ చెయ్యండి.


పిల్లని ఒక కంట కనిపెట్టండి.


పిల్లలతో సమయం గడపండి.


వారితో మాట్లాడండి.


వారు చెప్పేది వినండి.


కేవలం ధనాపేక్షే ద్యేయంగా కాక పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పే స్కూల్స్‌లో వారిని చేర్పించండి.


మన పిల్లని రక్షించుకొందాం. లేక పొతే మనం సర్వనాశనం అయిపోతాం.

నా బాధను నలుగురితో పంచుకోండి.


ఈ విషయాన్నీ తల్లి తండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

మీ పిల్లల భవిషత్ కు బంగారు బాటలు వేయండి


ఎక్కడకు వెళ్తున్నారు ఆంటీ..?


మా బాబును చూడటానికి Hostel వెళ్తున్న.


బాబు ఏం చదువుతున్నాడు.?

1 వ తరగతి


మీ వారు ఏం చేస్తుంటారు.?

Contractor (Govt) job చేస్తున్నారు.


మరి మీరేం job చేస్తున్నారు..?

Job ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.


మరీ పిల్లాడిని hostel ల్లో…?

అంటే ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైందిలే.


ఓహో…

ఆరేళ్ళ పిల్లాడు కాకుండా ముప్పై ఏళ్ల నీ మొగుడు చేస్తాడా అల్లరి (మనసులో) మీకు తెలియని విషయం ఏంటంటే..


పిల్లాడు hostelల్లో ఉన్నంత కాలం


వాడికి

అమ్మంటే ఓ ఆయా..

నాన్నంటే డబ్బులిచ్చే Atm.. అంతే


అలా పెంచిన మీరు

రేపొద్దున్న వాడికి ముపై

మీకో అరవై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది.

అప్పుడు

మా కొడుకు మమ్మల్ని

old age home లో పడేశాడు అని ఏడవడానికి సిగ్గుపడాలి.


పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి

15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి

25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి


మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.

అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే…? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.

అసలేం జరుగుతుంది మన దేశంలో..?


 విద్యాసంస్ధలేమో లాబాల కోసం

ఉపాధ్యాయులేమో జీతాల కోసం

తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు

తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి

పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా

ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.


బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..

అది కాస్తా తలుపులు వేసుకొని

బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.


మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.


గుర్తుంచుకోండి..


”మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు...సమాజాన్ని తీర్చిదిద్దే రేపటి తరాన్ని...అది మర్చి పోవద్దు…

వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు...ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు..

మొగలిచెర్ల

 *సిద్దాంతి గారి సలహా..*


"నమస్కారమండీ..నా పేరు మంగళగౌరీ..మేము రాబోయే శని ఆదివారాల్లో మొగిలిచెర్ల వచ్చి..అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..శనివారం ఉదయానికి అక్కడికి వస్తామండీ..మంగళవారం ఉదయం తిరిగి వెళ్లిపోతాము..ఆ క్షేత్రం లో మొత్తం మూడు రోజులు నిద్ర చేయాలని అనుకున్నాము..మాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు..వాళ్ళకొఱకు ఏదైనా బస ఏర్పాటు చేయగలరా?..నేనూ మావారూ మా పిల్లలిద్దరూ అందరమూ స్వామివారి సన్నిధిలో పడుకుంటాము.." అని ఆవిడ నన్ను అడిగారు..మా సిబ్బందిని విచారిస్తే..ఒక గది ఖాళీ ఉందని చెప్పారు..ఆ మాటే ఆవిడతో చెప్పి..గదిని వారి కొఱకు అట్టి పెట్టాము..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక కారు లో మంగళగౌరి గారి తన సంసారం తో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..తనను తాను పరిచయం చేసుకొని..తమ కొఱకు కేటాయించిన గది వద్దకు వెళ్లిపోయారు..మరో గంట తరువాత..మంగళగౌరి గారు తన భర్త, పిల్లలు తో కలిసి మందిరం లోపల నేను కూర్చున్న చోటుకి వచ్చి.."ప్రసాద్ గారూ..స్వామివారి పల్లకీసేవ సాయంత్రం అని చెప్పారు..ఈలోపల మేము మాలకొండకు వెళ్లి..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వస్తాము..మధ్యాహ్నం మీతో మాట్లాడాలి..మీకు వీలవుతుందా?.." అని అడిగారు.."మీరు ముందు మాలకొండకు వెళ్ళిరండి..ఇక్కడికి వచ్చిన భక్తుల తో మాట్లాడటానికి కూడా తీరిక లేనంతగా నేను లేను..నేను ఇక్కడ ఉన్నదే మీలాంటి వారి సందేహాలు తీర్చడానికి.." అన్నాను..మంగళగౌరి గారు మాలకొండకు వెళ్లి, మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు తిరిగి వచ్చారు..


ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..తన భర్త, పిల్లలతో కలిసి నావద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..మా వారు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారండీ..ఉద్యోగరీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి..నెలలో కనీసం ఇరవై రోజులు అలా తిరుగుతూనే వుంటారు..ఇంటిని, పిల్లలనూ నేనే చూసుకోవాలి..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు..ఇప్పుడు సమస్య ఏమిటంటే..మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..నెలలో పది పదిహేను రోజులు నీరసంగా ఉంటున్నాడు..డాక్టర్ల కు చూపించాము..ఏవేవో పరీక్షలు చేశారు..లోపల జబ్బేమీ లేదు..బలానికి మందులు వాడండి..అని చెప్పారు..వీడేమో మనిషి తగ్గిపోతున్నాడు..నాకు బెంగ పట్టుకున్నది..మా వారితో చర్చించాను..మా సిద్దాంతి గారిని సలహా ఆడిగాము..ఆయన వీడి జాతక చక్రం చూసి..గ్రహదోషం ఉన్నది..నివారణ కొఱకు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు..ఆయనే మమ్మల్ని ఈ క్షేత్రం లో  మూడు రాత్రులు నిద్రలు చేయమని చెప్పారు..వారు మాతో చెప్పేదాకా ఇక్కడ ఇలాంటి అవధూత మందిరం వున్నదని మాకు తెలీదు..ఆ తరువాత మీతో ఫోన్ లో మాట్లాడాము.." అన్నారు.."సరేనమ్మా..మీ సిద్దాంతి గారు చెప్పిన విధంగా నే ఇక్కడ వుండండి.." అన్నాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా ఆ దంపతులు తమ పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..సోమవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ అనంతరం అర్చకస్వాములు భక్తులకు తీర్ధం ఇవ్వసాగారు..ఈ కుటుంబం కూడా స్వామివారి తీర్ధాన్ని స్వీకరించారు..ఆ తరువాత పది పదిహేను నిమిషాల కు ఆ పిల్లవాడు స్వామివారి మంటపం లోనే ఒక ప్రక్కగా పడుకున్నాడు..కొద్దిసేపటి తరువాత..ఉన్నట్టుండిఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతూ..ఆ మంటపం అంతా పొర్లాసాగాడు..ఇదంతా చూస్తున్న మంగళ గౌరి గారు బాగా భయపడి పోయారు..ఆ అబ్బాయి తండ్రి మాత్రం ..పిల్లవాడిని పట్టుకొని వున్నారు..దాదాపుగా రెండు గంటల సేపు అలా జరిగిన తరువాత..ఆ పిల్లవాడు సొమ్మసిల్లి పడుకొని నిద్ర పోయాడు..


"అమ్మా ఇక మీరు భయపడకండి..అబ్బాయి తెప్పరిల్లుతాడు..కోలుకుంటాడు.."అని మా అర్చకస్వామి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి..స్వామివారి తీర్ధాన్ని అబ్బాయి నోట్లో పోశారు..మరో అరగంట తరువాత..ఆ అబ్బాయి కళ్ళు తెరచి చూసాడు..ఆరోజు మధ్యాహ్నం నాటికి ఆ పిల్లవాడి ముఖం లో నైరాశ్యం పోయింది..ఉషారుగా వున్నాడు..మంగళగౌరి గారి భర్తగారు తమ సిద్దాంతి గారితో ఫోన్ లో ఇక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు..మరో రెండు రోజుల పాటు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి సన్నిధిలోనే వుండమని ఆయన సలహా ఇచ్చారు..బుధవారం వరకూ మంగళగౌరి గారి కుటుంబం స్వామివారి మందిరం వద్దే వున్నారు..రోజూ రెండుపూటలా స్వామివారి సమాధి దర్శించుకున్నారు..గురువారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్లారు..


మరో నెలరోజుల తరువాత మంగళగౌరి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..మా వాడు పూర్తిగా కోలుకున్నాదండీ..కాలేజీకి వెళుతున్నాడు..చక్కగా చదువుకుంటూ వున్నాడు..త్వరలో మళ్లీ వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళతాము..మా సిద్దాంతి గారు కూడా మాతో వస్తామంటున్నారు..వారినీ తీసుకొని వస్తాము.." అన్నారు..


గత నెలలో మంగళగౌరి గారి కుమారుడు ఒక్కడే మొగిలిచెర్ల కు శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చాడు.."నాకు జీవితాన్ని ఈ స్వామివారే ప్రసాదించారు అంకుల్..ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ..నా కాళ్ళమీద నేను నిలబడటానికి ఈ స్వామివారే కారణం..వీలున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతుంటాను..మా సిద్దాంతి గారి సలహా..స్వామివారి తీర్ధం..ఈరెండూ నేను మర్చిపోలేను.." అని భక్తి గా చెప్పాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ముక్కు తిమ్మనగారి

 ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !



.

రాయలనాట విజయ నగరంలో పెద్దన తరువాత స్థానం తిమ్మనదే! ఆయన అరణపుకవి. చిన్నాదేవివెంట విజయనగరానికి వచ్చాడట. తెనాలి వారు భువన విజయంలో వారిని పరిచయం చేసికొన్న సందర్భంలో చెప్పిన పద్యం తిమ్మన గారి ప్రసిధ్ధికి నిదర్శనం!

.

కం: మాకొలది జానపదులకు

నీకవితా ఠీవి యబ్బునే? కూపనట ద్భే

కములకు నాకధునీ

శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!

.

తిమ్మనగారి కవిత్వం చల్లని కవిత్వమట!యెంతచల్లనిది? ఆకాశగంగాప్రవాహమందలి నీటితుంపురలను బోలిన చల్లదనమది. సురగంగ చల్లదనం కిందికురికి తిమ్మనగారి కవితలో ప్రవేసించినదట! ఆహా! పొగడ్తకు ఆకాశమే హద్దుగదా!

తిమ్మనగారు పారిజాతాపహరణ మనే ప్రబంధం వ్రాశారు. రాయలవారికి- చిన్నాదేవికి నడుమ నేర్పడిన వియోగమును తప్పించుటకే ఈప్ర్బంధమును తిమ్మన రచించెనని ప్రవాదము. యేదియేమైనను యిది రసవత్తరమైన ప్రబంధమే!

.

శ్రీకృష్ణుని యంతవాని శిరమును సత్యచే తన్నించి , ప్రణంలో యిది తప్పుకాదు పొమ్మన్నాడు.తిమ్మన.

పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చినది విని యలిగిన సత్యాదేవి మానసిక, శారీరక ,పరిస్థితులను వర్ణించుచు తిమ్మన గారు ఒకపద్యం చెప్పారు. కవితా కళకు కాణాచియైన ఆపద్యం మన మిప్పుడు తెలిసికొందాం!

.

చ: తుడువదు కన్నులన్వెడలు తోయకణంబులు, కొప్పుఁజక్కగా

ముడువదు, నెచ్చెలింగదిసి ముచ్చటకుంజన, దన్నమేనియున్

గుడువదు , నీరముంగొనదు, కూరిమిఁ గీరముఁ జేరి పద్యమున్

నుడువదు, వల్లకీగుణవినోదము సేయదు, డాయదన్యులన్;

.

సవతిమీద మత్సరం కోపానికి కారణమైనది. మనస్సు ఉద్వేలమైపోయింది. దుఃఖం పొంగిపొరలుతోంది. కన్నులవెంటనీరు కారిపోతోంది. అయినా కన్నీరు తుడవటంలేదట. జుట్టుముడి ఊడింది. కేశపాశము విశీర్ణమైనది. దానిని కూడా సవరించటం లేదట. ప్రియ సఖులఁజేరి మాటా మంతీ యాడటంలేదట. భోజనంమాటసరేసరి, మెతుకుగూడా ముట్టుటలేదట. చివరకు నీరుగూడా త్రాగటంలేదట. పంజరంలో చిలుకలను గూడా పలకరించటం లేదట. వీణియ తీగెలను మీటుట లేదట. యితరులెవ్వరు వచ్చినా వారిని సమీపించటం లేదట.


ఇదీ పాపం సత్య మానసిక స్థితి.

మనస్సు బాగోక పోతే రోజూ చేసేపనులుగూడా చెయ్యం . నైరాస్యంగా ఉంటాంకదా! అదిగో ఆనైరాస్యం ఆమెచేతలలో కనిపించేలా చేశాడుకవిగారు. నైరాస్యం యెందుకంటారా? కాదామరి. అసలే కృష్ణుని కాపురం "సవతుల కుంపటి". యెప్పుడెవరివల్ల యేబాధకల్గుతుందో? చెప్పరానిది. యెవరాతనిని తమ చెంగుకు ముడివేసుకుంటారో యెరుగలేము. అనుకోని యాపద వచ్చిపడింది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం రుక్మిణి తలకెక్కింది. యెంతప్రమాదం! కృష్ణుడింక తన చేజారిపోతాడేమో నని బాధ.అలాగే జరిగితే యిక మిగిలే దేమిటి? నలుగురి నవ్వులు తలవంపులు. అయిపోయింది సత్యావైభవం: అందుకే యీనైరాస్యం. ఆస్థితిని తిమ్మన యీపద్యంలో అద్భుతంగా చిత్రించాడు.

తుడువదు, ముడువదు, కుడువదు, నుడువదు, అను నాల్గు క్రియాపదాలను, ఛేకానుప్రాసంగా ప్రయోగించి , తనయసమానమైన పాత్ర చిత్రణా పటిమను వ్యక్త పరచాడు. కావ్యకళాపరిశీలనా దృష్టితో పరిశీలిస్తే యీపద్యం యెంత అద్భుత మైనదో బోధపడుతుంది. ఇది మనః పరిశీలనకు చక్కనిపరీక్ష!


స్వస్తి!

16, మార్చి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *సేవకు ప్రతిఫలం..*


"అంకుల్ నన్ను గుర్తుపట్టారా?.." అంటూ ఆ అమ్మాయి అడిగింది..తలయెత్తి చూసాను..గుర్తుపట్టినట్లుగా తలవూపి.."అమ్మా..ఇప్పుడేనా రావడం?.." అని అడిగాను.."మధ్యాహ్నం వచ్చాము..మా ఆయన కూడా వచ్చాడు.." అన్నది.."మంచిదమ్మా..మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది..?" అని అడిగాను.."ఇప్పుడు బాగుంది అంకుల్..తనపని తాను చేసుకుంటున్నది.." అని చెప్పింది..ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నలభైరోజులు ఉన్నది..వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం..అప్పుడప్పుడూ విపరీతంగా కేకలు వేస్తూ పరుగెత్తడం..లాంటి సమస్యల తో బాధపడుతూ ఉంటే..తల్లిని తీసుకొని స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..స్వామివారి సన్నిధి లోనే నలభైరోజులు ఆ తల్లీకూతుళ్ళు వున్నారు..ఆ నలభైరోజుల్లో ఈ అమ్మాయి ప్రవర్తన మందిరం వద్ద ఉన్న మా సిబ్బందికి..అర్చకులకూ  బాగా నచ్చింది..అదే సమయం లో ఆ తల్లికి కూడా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టాయి..తల్లీకూతుళ్ళు ఇద్దరూ స్వామివారి సేవ చేసుకునేవారు..మా సిబ్బంది తోపాటు మందిరాన్ని శుభ్రం గా ఊడ్చేవారు..స్వామివారి కి వాడే వస్తువులను కడిగిపెట్టేవారు..శనివారం నాడు మందిరానికి వచ్చే పూలను మాలలుగా కట్టి పెట్టేవారు..వారికి చేతనైన పని చేస్తూనే ఉండేవారు..అలా ఈ అమ్మాయి స్వామివారి మందిరం లో  ఒక మనిషిగా కలిసిపోయింది..తన తల్లి ఆరోగ్యం బాగుపడగానే ఒక ఆదివారం నాడు స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టుకొని ..తల్లిని తీసుకొని తన ఊరుకు వెళ్ళిపోయింది..


"నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు..మా అమ్మే కూలిపని చేసుకుంటూ నన్ను పెంచింది..మాకు పెద్దదిక్కు ఎవ్వరూ లేరు..అమ్మకు ఆరోగ్యం సరి లేకపోతే..వైద్యం చేయించడానికి స్తోమత లేదు..ఏ దిక్కూ తోచక అల్లాడుతుంటే..స్వామివారి గురించి విని ఇక్కడికి తీసుకొచ్చాను..స్వామివారి దయవల్ల అమ్మ బాగుపడింది..ఇక్కడినుంచి వెళ్లిన తరువాత..ఒక స్కూల్లో టీచర్ గా చేరాను..అమ్మచేత కూలీపని మానిపించి న నా వద్దే ఉంచుకున్నాను..పోయిన సంవత్సరం నాకు వివాహం అయింది..ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం..ఆయనకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు..మా పెళ్లి తరువాత కూడా మా అమ్మ మా వద్దే ఉంటున్నది..పెళ్లికి ముందుగానే అమ్మ గురించి ఆయనతో చెప్పాను..ఒప్పుకున్నారు..ఈ స్వామివారి గురించి..మా అమ్మ ఆరోగ్యం బాగుపడటం గురించి ఆయనకు పదే పదే చెప్పడం వల్ల..ఈరోజు నాతోబాటు ఇక్కడకు వచ్చారు..ఈరాత్రికి ఇక్కడ నిద్రచేసి..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అని చెప్పి..తన భర్తను పరిచయం చేసింది.."సరే తల్లీ..స్వామివారు మీ తల్లికి ఆరోగ్యం బాగు చేశారు..నీ కళ్లారా చూశావు..మీ ఆయన లో కూడా దేవుడంటే భక్తి కలిగిస్తారేమో చూద్దాం.." అన్నాను..స్వామివారి చిత్రపటం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నది..


ఆ దంపతులు ఆరోజు స్వామివారి మందిరం లోనే నిద్ర చేసారు..మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ స్వామివారి సమాధి దర్శించుకొని వాళ్ళ ఊరెళ్లిపోయారు..మరో పదిహేనురోజుల తరువాత..ఒక శనివారం నాటి సాయంత్రం..ఆ అమ్మాయి తన భర్త తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా నేను ఉన్న చోటుకి వచ్చి.."అంకుల్..స్వామివారు తన మహిమ చూపారు..ఈరోజు మా ఆయన పట్టుబట్టి నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు..స్వామివారి మందిరానికి వెళదాము..అక్కడ నిద్ర చేద్దాము..అని ఆయనే నాకు చెప్పి తీసుకొచ్చారు.." అన్నది..అతని వైపు చూసాను.."అవునండీ..పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నప్పుడు..మనసులో అనుకున్నాను..నాకు నిదర్శనం చూపిస్తే నేను నమ్ముతాను అని అనుకున్నాను..చాలారోజుల నుంచీ నా ఉద్యోగం తాలూకు సమస్య కోర్టు లో ఉన్నది..ఇక్కడ నుంచి వెళ్లిన మూడోరోజే అది నా కనుకూలంగా తీర్పు వచ్చింది..స్వామివారి వల్లే అని నాకు నమ్మకం ఏర్పడింది..ఆ తీర్పు వల్ల నాకు ప్రమోషన్ కు కూడా అడ్డంకులు తొలగిపోయాయి..పైవాళ్ళు ఆ ఫైలు కూడా సిద్ధం చేశారు..అందువల్ల స్వామివారి వద్దకు రావాలని అనుకోని..తనకు చెప్పి తీసుకొచ్చాను.." అన్నాడు..


"అమ్మా..నువ్వు నీ వివాహానికి ముందు ఇక్కడ కొన్నాళ్లపాటు వుండి స్వామిసేవ చేసుకున్నావు..అదే నీకు అదృష్టం..ఆ సేవ ఫలితమే నీ భర్తకు కూడా స్వామివారి మీద భక్తి ఏర్పడింది..ఇకనుంచీ ఇద్దరూ స్వామివారి వద్దకు సంకోచం లేకుండా రావొచ్చు.." అన్నాను..


స్వామివారు కరుణామయులు..ఆ విషయం మాకు పదే పదే ఋజువు చేస్తూనే వున్నారు..చూస్తూనే ఉన్నాము..కానీ అదేమి చిత్రమో..మాకు ప్రతిసారీ కొత్తగా వుంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

గొప్ప జీవితం🙏🌷

 🌷🙏చిన్న మార్పులతో గొప్ప జీవితం🙏🌷


సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఇంట్లో అయినా 7 రంగులు కలిసిన వాల్మెట్ తెచ్చి గోడకు తగిలించండి అలాగే గోడ గడియారం తూర్పు వైపున ఉండేలా చూడండి ఆగిపోయిన గోడ  గడియారాలు అలా ఉంచకూడదు వెంటనే సెల్స్ వేయాలి.


 చినిగిన వస్త్రాలు మూట కట్టి ఆటక పైన దాచి పెడతారు ఆ ఇంట్లో ధనం నిలవడం కష్టం వచ్చే ధనానికి తగిన ఖర్చులు ముందే వచ్చి కూర్చింటుంది ఇవన్నీ చాదస్తం గా అనుకున్న అవి శుభ్రంగా ఉంచడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలా ఆలోచించి అయినా జాగర్త పడాలి.


 డబ్బు నగలు ఉంచే బీరువాకి అద్దం. ఉండకూడదు అందులో చూసుకుని తల దువ్వ కూడదు , ఒక్కసారి పది అరగంట కట్టిన చీరె కదా అని అవి మళ్ళీ విడిచిన తర్వాత ఉతకకుండా మడిచి బీరువాలో పెడుతుంటారు ధనము దాచే బీరువాలో ఉంచకుండా విడిగా పెట్టుకుంటే మంచిది అలా విడిచిన బట్టలు ఉతకకుండా ధనము ,నగలు పెట్టె బీరువాలో ఖరీదైన వే అయిన విడిచినవి ఉతకాకుండా పెడితే ఆస్తులు అమ్ముకుని తింటారు అంతా మంచులా కరిగిపోతుంది..


వారానికి ఒక్క సారి అయిన శుక్రవారం రోజు గడపకు పసుపుకుంకుమ రాసి పూలు పెట్టాలి ఎంత పేద కుటుంబం అయినా నిత్య అవసరాలకు లోటు ఉండదు.


 భర్త భోజనం చేసి టప్పుడు తిట్టకూడదు అరవకూడదు అసహ్యించుకుంటూ కరుసుతు వడ్డించ కూడదు తిన్నాక మాట్లాడాలి అర్ధాకలితో భర్త కంచం నుండి లెవకూడదు. 


అలాగే వంట రుచిగా లేకపోయినా తింటున్న సమయంలో విమర్శించకూడదు వడ్డించే టప్పుడు భార్యని నిందిస్తూ తిట్టకూడదు. 


మీకు సంబంధం లేని వ్యక్తులు వ్యక్తిగత విషయాలు చెడు విషయాలు చర్చించకూడదు నిందలు వేయకూడదు, మనము గొప్ప అనిపించుకోవడానికి తప్పుగా ఎవరి పైన చాడీలు చెప్పకూడదు. 


పరుషమైన మాటలతో ఎవరిని వేదించకూడదు. భార్య అందం పరాయి వారి ముందు పొగడ కూడదు భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు, అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించ రాదు ఇంట్లో భార్య మాటలు వినాలి బయట భర్తమాట నెగ్గాలి ఇతరుల ముందు భార్యాభర్తల ఒక్కమాట గా ఉండాలి ఇతరులు మీ మధ్య కలగచేసుకుని పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు భార్య భర్తలు రెండు దేహాలుగా ఉంటే ఒకటే ప్రాణం అని నమ్మాలి ఎవరో ఒకరికి అవమానం జరిగితే ఇంకొకరికి జరిగినట్టే 


ఇంటి గుట్టు బయటకు రాకూడదు భర్త యొక్క గౌరవం భార్య ప్రవర్తన లో ఉంటుంది, ఇది వరకు కాలంలో పిల్లలు ముందు పెద్దలు మాట్లాడుకునే వారు కాదు ఇప్పుడు అన్ని విషయాలు వారి ముందే చర్చించడం వల్ల పిల్లలకు చులకన అయిపోతున్నారు.. వారి ముందు ఎప్పుడూ పెద్దమనుషులు లాగానే ఉండాలి.. 


బయట వారితో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోకూడదు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. భార్య తెలివి లేనిది అనుకోకూడదు తెలివి లేనిది అయినా మీ మంచి కోరే వ్యక్తి మీకు మంచే చెపుతుంది. 


భార్య సంపాదిస్తున్నా భార్తకు తెలియకుండా నిర్ణయం తీసుకోకూడదు సమస్య వస్తే అండగా నిలబడేది కుటుంబమే .ఆర్ధిక స్వేచ్ఛ సమాజంలో ఉన్నత స్థితికి చేర్చాలి కానీ కుటుంబం విడిపోయే పరిస్థితి రాకూడదు..


 తల్లిదండ్రులను నీకు ఏమి తెలియదు అని అనకూడదు వారు చూడని ప్రపంచం కాదు ఇది ఏదైనా చెప్పినా అది వినడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఆ మాటలు మనకు ఉపయోగ పడుతుంది నిజమే అనిపిస్తుంది.


 మంచి ఎవరు చెప్పినా వినాలి మనకు మంచిది అనిపించినదే చేయాలి. వాదనలు వల్ల బంధాలు బలహీనంగా మారుతుంది మూర్కుల తో వాదన తల గోడకు కొట్టుకోవడం ఒక్కటే.


 చిన్న చిన్న జాగర్తలు వల్ల కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మంచి భవిష్యత్తు మంచి ఆలోచన మీ పిల్లలకు ఇవ్వడం ముఖ్యం .తల్లిదండ్రులు విలువ తెలిసేలా పిల్లలను పెంచాలి.


 గొప్పకోసం అప్పులు చేయాకుడదు స్తోమతకు మించి ఖర్చు చేయాకుడదు..


 అహంకారం ఇగో మనిషికి మొదటి శత్రువులు.. ఇటువంటి చిన్న చిన్న జగర్తలు తీసుకోలేని వారు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఫలితం ఉండదు... 


మీ వారికి దేవుడి పైన నమ్మకం ఉండదు మీ పిల్లలకు దేవుడు పైన నమ్మకం ఉండదు మేము చేయవచ్చా అని అడిగే వారు నాకు మెసేజ్ చేయకండి మీరు తింటే వారికి ఆకలి తీరుతుంది అంటే అప్పుడు అడగండి మీరు చేస్తే వారికి ఫలితం ఉంటుంది అని. 


వారి నొప్పిని మీరు ఎలా తీసుకోలేరో అలాగే వారి దోషాన్ని మీరు తీసుకోలేరు..


 ధానం ధర్మ గుణం వల్ల కర్మని వదిలించుకునే అవకాశం వస్తుంది, పశ్చాత్తాపం వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం లభిస్తుంది కానీ కర్మని తప్పించుకోలేరు ఎవరు, కర్మ భూమిలో జన్మిస్తే దేవుడైన కర్మానుసారం బతకాలి కర్మను ఆచరించాలి.. 


ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో తల కిందులుగా వేలాడుతూ వైతరిని నదియొక్క దుర్వాసన భరించ లేక గతజన్మ పాప కర్మలను గుర్తు చేసుకుంటూ కలగబోయే జన్మలో పుణ్యకార్యలు చేయాలి అని దైవాన్ని ప్రార్థిస్తూ మళ్ళీ జన్మవద్దు ఈ బాధ వద్దు అని 9 నెలలు ప్రార్థనచేస్తూ మాతృ స్తానం నుండి లోకానికి వచ్చిన జన్మతః సూద్రులమే తల్లి ప్రసవ వేదనతో పుట్టుని వారమే తల్లి కక్కితే నోటి నుండి పుట్టిన వారు ఎవరూ లేరు మల మూత్రాలతో 9 నెలలు మైలు రుదిరంతో వచ్చిన వారమే , సాధనతో జన్మ తరించాలి కానీ పుట్టుకతో   బ్రహ్మ ఎవరూ కారు ఎవరూ లేరు. 


ఎలా వచ్చాము కర్మను వెంట బెట్టుకుని వచ్చాము ఎలా వెళ్ళాలి కర్మను తీర్చుకుని వెళ్ళాలి అనుభవిస్తున్న ప్రతిదీ కర్మను తీర్చుకుంటున్నాము అని ఆమోదించాలి ధూరమైన ప్రతిదీ ఋణం తీరిపోయింది అనుకోవాలి అందరూ ఒకరోజుకి దూరం కావాల్సిన వారే అందరికి ఒకరోజు మనమూ దూరం కావాల్సిన వారమే .


జరిగిపోయే ప్రతి రోజు కాలం విలువను గుర్తు చేస్తూ ఉండాలి జీవితంలో కొన్ని గంటలు ఎలా గడుపుతున్నాము గుర్తు చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవచ్చు కానీ గడిచిపోయినా కాలం ఎప్పటికీ తిరిగి రాదు అంటే అన్నింటికన్నా కాలం విలువైనది..


 నీదగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసిన ఒక్క నిముషం ఆయువుని కొనలేవు అంటే ధనము కోసం పడిన పాట్లు అంతా నీ ప్రాణము కన్నా విలువైనది కాదు అన్నిటి కన్నా విలువైనది నీ జీవితం జీవిత కాలం.


 శాశ్వత మైన ది ఆధ్యాత్మిక సంపద ఒక్కటే.. ఒక్క యోగులు సిద్ధులు అవధూతలు మటుకే కొన్ని యుగాలు బతికారు ఋషులు యొక్క మరణం ఇంత వరకు జరగలేదు దేవుడి అవతారం కూడా ముగించిన సమయం తెలుసు ఋషులు మరణించి నట్టు ఎక్కడైనా ఆధారం ఉందా.. 


నవరంద్రాలు మూసి చర్మ చక్చువులతో గాలిని భుజిస్తూ కొన్ని యుగాలుగా జీవిస్తున్న మునులు ఇంకా ఉన్నారు.. ధనం కొనలేని ఆయువుని ఎవరు వీరికి ఇచ్చారు మరణాన్ని ఎలా జెయించారు హఠయోగం, అష్టంగయోగం ధ్యానం , మంత్రం దేవతయొక్క సూక్ష్మ దేహం అది మానవ దేహంలో లయం ఐపోయే విధంగా ధ్యానం చేయాలి ఏ మంత్రాధిష్ఠదేవతను ద్యానిస్తున్నామో ఆ రూపంలోకి సాధన ద్వారా మారిపోవాలి ఇది ఒక్క సమాధి స్థితిని ధ్యానంలో పొందేలా సాధన చేస్తే నే సాధ్యం అవుతుంది. 


బ్రహ్మచర్య దీక్ష అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది గృస్థులు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ సాధన చేస్తే బ్రహ్మచర్యం పాటించిన వారు అవుతారు..


 మీకు అష్టంగా యోగం గురించి చెప్పి నప్పుడు గృహస్థు ధర్మాలు కూడా వివరిస్తే కొన్ని నియమాలతో ఆ శక్తిని ఎలా పొందాలో అర్తం అవుతుంది.


 చిన్న చిన్న విషయాలకు ఆలోచనలతో మొదలు ఐయ్యే అలజడి కుటుంబ వ్యవస్థని చిన్నా బిన్నం చేస్తుంది ఇలా బతకడం కాదు జీవితం మీరు భగవంతుడు సృష్టిలో ఒక అద్భుతం మీ జీవితం అద్భుతం మీరు అత్యంత సమర్థులు మీ యొక్క విలువ మీరు తెలుసుకోవాలి జీవితంలో ప్రతి నిముషం మీకు విలువైనది దాన్ని సద్వినియోగం చెలుకోవాలి. గొడవలతో అనవసరమైన మాటలతో మీ విలువైన సమయం వృధా చేసుకోకండి.. ఇవన్నీ చెప్పడం సులబమే ఆచరించడం సాధ్యమా అనుకోవచ్చు ,ప్రతి తప్పని క్షమించండి అలవాటు చేసుకోండి ఇది అలవాటు అయితే రాజయోగ సాధన సిద్ది పొందడం చాలా సులభం..


                           ఇట్లు 

                             మీ

          అవధానుల శ్రీనివాస శాస్త్రి

15, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 50 నారద మహర్షి

 మన మహర్షులు- 50


నారద మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.


ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -


రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.


మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. 


తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.


ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు


మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.


నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. 


 మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక గొప్ప సంగీతకారుడు.


రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది.


 వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో “ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?”  అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. 


అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.


ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్, యజుర్, సామ, అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. 


ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలి యుగంలో ప్రజలకు దైవభక్తి, సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.


ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంధస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.


అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. 

ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు.పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.


 ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు.


నారదుడు రచించిన స్మృతిని  నారద స్మృతి’ అంటారు.  నారదుని “నారద శిక్ష” అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి.

నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  


ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.


నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

దేవుడు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

 *దేవుడు ఉన్నాడా,లేడా?* 

               🌷🌷🌷

ఒక గృహస్తుకు ఒకరోజు ఒక కోరిక కలిగింది, నిజానికి దేవుడున్నాడా లేడా తెలుసుకోవాలి అని, వెంటనే ఒక గురువును కలిసి తన కోరికను తెలియచెప్పి తన సందేహాన్ని తీర్చుమని అడిగాడు.


దానికి గురువు ఇప్పుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, నీవు సిద్దమేనా?" అని అడిగాడు.


దానికా వ్యక్తి " ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను.  ఇక మీరు ప్రారంభిచండి" అని వినయంగా చెప్పాడు.


వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు.  ఇపుడు గురువు, వచ్చిన వ్యక్తికి మధ్య  సంభాషణ ఇలా జరిగింది. 


*గు: ఈ గ్లాసులో ఏముంది?* 

*శి: మంచి నీరు.* 


గు: సరిగా చూసి చెప్పు కేవలం మంచి నీరేనా?


శి : అవును గురువు గారు కేవలం మంచి నీరే.


గు: అయితే ఒకసారి త్రాగి చెప్పు.


శిష్యుడు నీటిని త్రాగాక,

గు: ఇప్పుడు చెప్పు అది ఏ నీరు?


శి : గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు.


గు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?


శి : ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను.  కానీ ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి  అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.


గు: అంటే అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపొేయావ్ అంతేనా?


శి: అవును.


గు : సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు.  అయితే ఆ నీటీలొ పంచదార చూపించు.


శి : అసాధ్యం గురువు గారూ.


గు : ఏం ఎందుకని?


శి: పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది.  దానిని వేరు చేసి చూపించలేం.


గు: అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో.


శిష్యుడు సరైన సమాధానాలే ఇచ్చాడు, కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు.  గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాధానాలు చెప్తూపోయాడు.

విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు.  అపుడు గురువు "చూడు నాయనా, నీవు నీటిని చూసి రుచి చూడకయే  ఏవిధంగానైతే కేవలం మంచినీరే అని పొర పాటు పడ్డావో, అదేవిధంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు.  కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు.


అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది.


 పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.   దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది.


 అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది.  మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు.


ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే , నీవు ఏ విధంగానైతే నీరంతా కరిగి పోయి, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను  నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధంగా ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపించలేం.

సృష్టిలోఉండే ప్రతీదీ భగవత్సరూపమే. 


జీవుని రూపంలో ఉండేది, ఆ భగవంతుడే.  రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు.  నీవు, నేను ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే.  కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు.  వాడే నిన్ను ఉద్దరిస్తాడు." అని చెప్పగా శిష్యుడి ఆనందం అంబరాన్ని తాకింది.  తన సందేహం పటాపంచలై పోయింది. 


గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విధంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు. 


ఇది కథలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.


సైన్స్  అనేది కూడా ఒక విధమైన దైవిక సిద్ధాంతమే. శక్తిని సృష్టించలేం, నశింప జేయలేం అని సైన్స్ చెప్తుంది.


మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది?  ఇంకా మీరు సందేహిస్తే మీ ఇష్టం.

సేకరణ: వాట్సాప్.

రుణాల బాధ తొలగిపో వడానికి

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355 


*రుణాల బాధ తొలగిపో వడానికి ఒక చిన్న సాధన*.

 

స్వగృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం. 


అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగ గలదు,  అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది .జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది . పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుంది.


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.  

 *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

_plz forward the message_🌹

కన్నతల్లి

 కన్నతల్లి కడుపులోంచి బయటపడి, 

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, 

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు 

ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం పేరే 'నేను'

ఈ' నేను' ప్రాణశక్తి అయిన 

"ఊపిరి"కి మారుపేరు. 

ఊపిరి ఉన్నంతదాకా 'నేను' అనే భావన 

కొనసాగుతూనే ఉంటుంది. 

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో 

ఈ 'నేను'ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ 'నేను'లోంచే 'నాది'అనే భావన పుడుతుంది! 

ఈ 'నాది'లోంచి  

నావాళ్ళు, 

నాభార్య, 

నాపిల్లలు, 

నాకుటుంబం, 

నాఆస్తి, 

నాప్రతిభ, 

నాప్రజ్ఞ, 

నాగొప్ప... 

అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ 'నేను'అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, 

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, 

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి 'అహం'గా ప్రజ్వరిల్లుతుంది.

'అహం'అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో 

ఈ 'నేను' నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. 

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

పంతాలతో, పట్టింపులతో, 

పగలతో, ప్రతీకారాలతో 

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

బాల్య,కౌమార,యౌవన, వార్ధక్య దశలదాకా 

విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన 'నేను'అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం 

కట్టెలా మిగులుతుంది.

మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా 

పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన 'నేను' చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, 

మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

'నేనే 'శాసన కర్తను, 

'నేనే 'ఈ భూమండలానికి అధిపతిని, 

'నేనే'జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన 'నేను' లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.🙏

ఫ్రెండ్స్ ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన 'నేను' కథ 

అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే 

'నేను'గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది 'శ్మశానవైరాగ్యం' మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.  

'నేను' గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

'వైరాగ్యం 'అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.🙏

స్వర్గనరకాలు ఎక్కడో లేవు. 

మనలోనే ఉన్నాయి.

మనిషికి, ఆత్మదృష్టి నశించి 

బాహ్యదృష్టితో జీవించడమే నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం. 

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

నిజాయతీగా, నిస్వార్థంగా, 

సద్వర్తనతో, సచ్ఛీలతతో 

భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి

అంటే 'అన్నీ నేనే 'అనే స్థితి నుంచి 

'త్వమేవాహమ్‌'అంటే, 'నువ్వేనేను' అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత మరియు ఆ తండ్రి పరమాత్మ పాదాలచెంత కాసింత చోటికి మార్గం