చదవండి..
“నకర్మలిప్యతేనరే”
ఒక గృహిణి ఇంటిని శుభ్రం చేసే సమయంలో భిక్షాటనకై వచ్చిన సాధువును చూసి క్రుద్ధురాలై ఆ సాధువును దూషించి, ఇంటిని శుభ్రం చేస్తున్న తడిబట్టను విసిరి కొట్టి అవమానం చేసింది...
మురికి బట్టను గైకొన్న సాధువు భగవంతుడు తనకిచ్చిన ప్రసాదమని భావించి వెళ్ళిపోయాడు. సాయంసంధ్యాకాలం కర్తీకమాసం ఆ గృహిణి శివాలయానికి వెళ్ళింది.
శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి...
ఈ సహస్ర దీపాలను ఎవరో సాధవు వెలిగించారట! అని అందరూ చెప్పుకోవడం ఈవిడ చెవిన పడింది. ఎవరా సాధువని వెతికింది. ఉదయం ఈవిడ అవమానపరచిన సాధువేనని గ్రహించింది...
ఖిన్నురాలైన ఈవిడ ఆ సాధువు వద్దకు వెళ్ళి మీరేనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది. అంతట ఆ సాధువు వినయంగా ‘అమ్మా నీ చలవతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను. ‘నేనెంతటివాడ్ని నిమిత్తమాత్రుడ్ని’ అన్నాడట...
ఈమె వెంటనే పశ్చాత్తా భావనతో స్వామి! నా చలవతో అన్నారు,
నేనే సహాయం చేయలేదు కదా!
పైగా మీపైకి మురికిబట్టను విసిరికొట్టి మిమ్మల్ని అవమానించాను’ అని చెప్పింది. అంతట సాధువు అమ్మా! నీవు విసిరిన బట్ట మురికిదైనా దానిని నేను ఈశ్వరప్రసాదంగానే భావించాను...
శివాలయం ప్రక్కనే వున్న కొలనులో ఆ బట్టను శుభ్రపరిచాను.
దానితోనే వత్తులు పేనాను.
ఆలయానికి వచ్చే భక్కులను యాచించాను...
తైలానికి సరిపడ డబ్బును కూడా ఈశ్వరుడు సమకూర్చాడు. వీటితోనే దేదీప్యమానంగా ఈ సహస్రదీపాలు వెలుగుతున్నాయి. నిజానికి మీరు ఆ బట్ట విసరకుండా ఓ ముద్ద అన్నం పెట్టి వుంటే, మిగతా ముద్దల కొరకు యింటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడ్ని. అలాకాక ఈ సహస్ర దీపాలు వెలిగించాలనే సంకల్పాన్ని ఆ ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాను, నేను నిమిత్తమాత్రుణ్ణే అన్నాడు సాధువు...
అవివేకులాచరించే కర్మలకి, వివేకులైనవారాచరించే కర్మలకి ఎంత తేడా వుంది?
“స్వకర్మణా తమభ్యర్చసిద్ధింవిందతి మానవ:”
మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం...
నేను, నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం.
కనుక కర్తృత్వ భావనను తొలగించి
నా ద్వారా జరిగే ఈ కర్మలను కర్త, ప్రేరకుడు ఆ ఈశ్వరుడేయని గ్రహించాలి.
అల్పమైన ఫలాలకు పరిమితము చెందక అంత:కరణ శుద్ధికై కర్మలను విధిగా ఆచరించాలి. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి