6, ఆగస్టు 2022, శనివారం

గాయత్రి మాత

 గాయత్రి మాత అనగా ఎవరు.



ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు.


నా నుండి అగ్ని.

అగ్ని నుం…డి వాయువు,

వాయువు నుండి ఓంకారం,

ఓంకారంతో హృతి,

హ్రుతితో వ్యాహృతి,

వ్యాహృతితో గాయత్రి,

గాయత్రితో సావిత్రి,

సావిత్రితో వేదాలు,

వేదాలలో సమస్త క్రియలు

ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.


గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు.

వారి చైతన్య శక్తులు:.


1. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.


2. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.


3. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.


4. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.


5. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.


6. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.


7. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.


8. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.


9. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు


10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.


11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.


12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.


13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.


14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.


15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.


16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.


17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.


18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.


19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.


20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.


21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.


22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.


23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.


24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


శ్రీ గాయత్రీ మాత మహాత్యం..

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.


ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.


త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం.


హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.


ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు.


గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది


బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం.


ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.


గాయత్రి మంత్రాక్షరాలు.


సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’


గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘


గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.


పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి.


వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.



సాధన సాధ్య తే సర్వం..

బర్బరీకుడి కథ...

 *🎻🌹🙏 మహాభారతం లోని బర్బరీకుడి కథ...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*🌿మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి  యుద్ధం మొత్తం*


*🌸ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ.....!!*


*🌿ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి.*


*🌸కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన పాత్ర ఒకటి ఉంది.*


*🌿తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి.*


*🌸నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు.*


*🌿 ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు.* 


*🌸వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు.*


*🌿నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని.*


*🌸అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది.*


*🌿ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు.*


*🌸వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని.*


*🌿 తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న.*


*🌸 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు.* 


*🌿దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు.*


*🌸నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు.*


*🌿 నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది.* 


*🌸 రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి,*


*🌿మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు.*


*🌸నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు.*


*🌿 చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు.*


*🌸 ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది.*


*🌿అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు.*


*🌸మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు.* 


*🌿ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు.*


*🌸బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు.* 


*🌿ఒకవేళ భీముడిు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా  సంభాషణ ఆరంభిస్తాడు.*


*🌸 ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను.* 


*🌿పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా.*


*🌸అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు.*


*🌿కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా.* 


*🌸మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది.*


*🌿తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ.*


*🌸విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా.*


*🌿ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు.*


*🌸అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు.*


*🌿 సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా.*


*🌸 ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు.* 


*🌿అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి?*


*🌸 ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు.* 


*🌿అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది*


*🌸నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు.*


*🌿దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు*


*🌸ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు.*


*🌿దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు.*


*🌸 అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు.*


*🌿ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు.*


*🌸 శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు.*


*🌿యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు.*


*🌸వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు.*


*🌿వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో?*


*🌸స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను.*


*🌿ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే*


*🌸అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ....🚩🌞🙏🌹🎻*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿https://chat.whatsapp.com/GKrn3Hn3E7KIe2nULT6Fa2


(సేకరణ)

పంచాంగాలు

శ్రీ శర్మదాగారు చక్కని వివరణ ఇచ్చారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొంచం అధికంగా విస్తర్ణగా పేర్కొన ప్రయత్నిస్తాను. 

మూడు రకాల పంచాంగాలు వున్నాయి అది నిజం కానీ ఈ మూడు రకాల పంచాంగాలలో కూడా అన్ని గ్రహగతులను గణిస్తారు, పరిగణలో తీసుకుంటారు.  కాకపొతే మన చాంద్రమానంలో చంద్రుని ఆధారంగా తిదులను, వారలను, నేలలను గణిస్తారు.అమావాస్యతో నెల అయిపోతుంది.  పాడ్యమినుండి కొత్త నెల మొదలవుతుంది.  అందుకే మన సంవత్సరం చేత్రశుద్ధ పాడ్యమి నుండి మొదలొవుతుంది. ఫాల్గుణ అమావాస్యతో ముగుస్తుంది. 

ఒక చాంద్రమానం నెలలో 14 తిధులు తరువాత అమావాస్య లేక పౌర్ణమి ఉంటుంది. అవి 1)పాడ్యమి, 2) విదియ 3) తదియ, 4) చవితి, 5)పంచమి, 6) శ్రష్టి 7) సప్తమి, 8) అష్టమి, 9) నవమి, 10) దశమి, 11) ఏకాదశి, 12) ద్వాదశి, 13) త్ర్యయోదశి 14) చతుర్దశి 15) అమావాస్య లేక పౌర్ణమి. 

ఇందులో సాధారణంగా 4,6,8,9,13.14 తిధులను శుభ తిధులుగా పరిగణించారు. 

నిజానికి చాంద్రమానం పంచాంగం చెంద్రుని గతిని ఆధారంగా చేసుకొని నిర్మించినది కాబట్టి నెలకు 30 రోజులు వుండవు.  కేవలం 27.32 రోజులు మాత్రమే ఉంటాయి.  అందుకే మనకు కండతిధులు, తిదిద్వయాలు వస్తూవుంటాయి.  అంటే ఒక సూర్యోదయానినుంచి మరొక రోజు సూర్యోదయసమయంలో పూర్తిగా ఒకే తిధి వుండదనుమాట. కాబట్టి మనం జరుపుకునే శుభాశుభ కార్యాలను ఒక్కొక్కరు ఒక్కొకరీతినో ఆయా తిథిని అవలంబించి జరుపుకుంటారు. 

కొన్ని పండగలను స్మార్తులు ఒకరోజు, శ్రీవైష్ణవులు ఒకరోజు జరుపుకోవటం మనకు నిత్యానుభవమే. వీరిరువులు చాంద్రమానం పంచాంగం ను అనుసరించినా కూడా స్మార్తులు తిధి ఆరంభంను శ్రీవైష్ణవులు తిధి అంతాన్ని పరిగణలో తీసుకుంటారని నాకు ఉన్న  పరిజ్ఞనం. జ్యోతిష్య పండితులు దీనిని సవరించ గలరు.  కాగా కొన్ని సందర్భాలలో సూర్యోదయ కాలంలో ఉన్నతిధిని పరిగణలో తీసుకోవటం కద్దు. 

మనం సమత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ కాలంగా పరిగణిస్తాము అంటే అది 365.26రోజులు కానీ మన చంద్రమానంలోని 12 నేలలను గణిస్తే వచ్చేది 327/32 రోజులు.  అనగా 37.42 రోజులు ఒక సారి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కన్నా తక్కువ మరి ఈ కాలాన్ని ఎలా సర్దాలి అని మన మహర్షులు యోచించి మనకు అధిక మాసాలను ఏర్పాటు చేశారు.  అధిక మాసం అంటే ఒక ఏడులో ఒక నెల రెండు పర్యాయాలు వస్తుంది అనిఅర్ధం. ఈ అధిక మాసాగూర్చి మనందరికీ విదితమే. 

మనం జరుపుకునే అన్ని పండగలను చాంద్రమానం ప్రకారం జరుపుకున్నాకూడా ఒక్క మకర సంక్రాంతిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం అన్నమాట అందుకే సంక్రాతి పండగ ప్రతి ఏడు జనవరి 14 వ తారీకు నాడే వస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక కారణాలవల్ల జనవరి 15న కూడా రావచ్చు (స్థలాభావం వలన ఇక్కడ వివరణ ఇవ్వటంలేదు) 


ప్రశ్నకు

 ప్ర. దేవి జగన్మాత, కరుణామయి - అంటారు కదా! జగములన్నిటికీ తల్లి అయిన దయామయి అయితే, జగతిలో భాగమైన రాక్షసులకు కూడా తల్లే కదా! మరి వారిని సంహరించడం న్యాయమా?

జ. ఈ ప్రశ్నకు కూడా మన శాస్త్రాల్లో స్పష్టమైన సమాధానముంది. జగతికి కారణమైన ఈశ్వర భక్తి కనుక 'జగన్మాత ' అన్నారు. అయితే పాపపుణ్యాలకు, మంచిచెడులకు  ఆ శక్తి కారణం కాదు. ఆయా జీవుల సంస్కారాలు. అయితే దుష్టులైన రాక్షసులు మొదలైన లోకకంటకులను సంహరించి, వారి పాపాలను  తొలగించి సద్గతులనే  ప్రసాదిస్తుంది. ఇది శిక్షారూపంగా కారుణ్యం, శిష్టులైన వారి పట్ల రక్షణ రూపంగా దయ - రెండూ జగన్మాత కృపారూపాలే.

అంతే కాదు- ఆ తల్లి జగజ్జనని మాత్రమే కాదు- జగదీశ్వరి కూడా. జగతిని పాలించేటప్పుడు దుష్టత్వాన్ని నిగ్రహించి, శిష్టత్వాన్ని రక్షిస్తుంది. రెండూ మాతృకృపలే.

ధర్మాకృతి : పూర్వీకులు

 ధర్మాకృతి : పూర్వీకులు 


తంజావూరు మహారాష్ట్ర ప్రభువుల పాలనలోనికి రాకముందు కర్ణాటక నాయక రాజుల పరిపాలనలో ఉండేది. నాయక రాజులలో ప్రసిద్ధులైన సేవప్ప నాయకుని కాలంలో శ్రీ గోవింద దీక్షితుల వారు నాయకరాజుల కుల గురువుగా ఉండేవారు. వారు బహుశాస్త్ర కోవిదులు. యజ్ఞదీక్షితులు, అనుష్ఠానపరులు. రాజుగారి కోరికపై ప్రధాని మంత్రిపదవిని స్వీకరించారు. అనతికాలంలో మంచి పరిపాలనాదక్షులుగా విఖ్యాతి సాధించారు. వీరి కాలంలో తంజావూరు సీమ అన్ని రంగాలలోనూ ముందంజ వేసింది. అనేక ప్రజోపకరములైన కార్యములు చేపట్టబడినవి. అయ్యన్ అనేది దీక్షితుల వారి గౌరవ నామము. వీరి కాలంలోనే వీరి పేరుతో తంజావూరి సీమకంతటికీ సేద్యపునీటినందించు అయ్యన్ కాలువ, అయ్యన్ కోనేరు త్రవ్వబడినాయి. వీరు కుంభకోణములో రాజా వేదపాఠశాలను ఆరంభించారు. ఈనాటికి కూడా ఆ పాఠశాలలో నూరుకు పైగా విద్యార్థులు వేదశాస్త్రములు అధ్యయనం చేస్తున్నారు. చతుర్దండి ప్రకాశిక అనే పుస్తకాన్ని రచించిన ప్రసిద్ధ స్వరమేళకర్త శ్రీ వేంకటమఖి వీరి పుత్రులు.


దీక్షితుల వారు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వీరిని ఆశ్రయించుకొని అనేక కర్ణాటక బ్రాహ్మణ కుటుంబాలు తంజావూరి సీమకు తరలివచ్చాయి. నాయకరాజులు కూడా కన్నడిగులే కదా! ఇలా స్థిరపడిన కుటుంబాల వారందరూ వేదశాస్త్రములలో మహత్తరమైన కృషి చేశారు. తంజావూరి సీమకే గర్వకారణమయినారు. పేష్వాల చేత అపరిమితమైన గౌరవాన్ని పొందిన పొందిన మణికుట్టి ఈ వంశములోని వారే. మణికుట్టి చివరి పేష్వాకు అత్యంత అంతరంగీకులయ్యారు. చివరికి ఆ పేష్వాను తెల్లవారు బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా దారిలో బిచ్చమెత్తుకుని జీవిస్తూ బహుకాలం వారికి శాస్త్ర విజ్ఞానపు విందు చేశారు. తరువాత మైసూరు మహారాజు చేత విశేష సత్కారాలను పొందారు.


కంచి కామకోటి పీఠపరంపరలో 59వ ఆచార్యుల వారయిన శ్రీ భగవన్నామ భోదేంద్ర సరస్వతీ స్వామివారు రామేశ్వర యాత్ర ముగించుకొని కంచి తిరిగి వస్తూ పవిత్ర కావేరీ తీరంలో ప్రకృతి రమణీయమైన గోవిందపురంలో బహుకాలం ఉండి అక్కడే సిద్ధి పొందారు. వారి శిష్యులయిన శ్రీ ఆధ్యాత్మిక ప్రకాశేంద్రులు కూడా చాలా కాలం గురువుగారి అధిష్ఠానం వద్దనే ఉండిపోయారు. వారు తమ వారసుని మహాపండితులయిన ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబం నుంచే ఎన్నుకొన్నారు. అప్పటి నుంచి మన మహాస్వామి వారి వరకు వచ్చిన పీఠాధిపతులందరూ ఈ కుటుంబాల నుంచి వచ్చిన వారే. 


17వ శతాబ్దంలో కర్ణాటక యుద్ధం కారణంగా కాంచీపురంలో అశాంతి నెలకొన్నది. అప్పటి కామకోటపీఠ ఆచార్యులయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు బంగారు కామాక్షీ విగ్రహాన్ని తీసుకొని ఒడయార్ పాళెం చేరారు. ఒడయార్ పాళెం జమీందారులు శ్రీచరణుల యెడ అపరిమితమైన భక్తిప్రపత్తులున్నవారు. అప్పటి తంజావూరు పాలకులైన శ్రీ ప్రతాప సింహ రాజా స్వామి వారిని తంజావూరు విచ్చేసి ఉండవలసినదిగానూ, బంగారు కామాక్షిని తంజావూరులో ప్రతిష్ఠించవలసినదిగానూ కూరారు. రాజాగారి వినతిని అనుసరించి స్వామివారు తంజావూరు విచ్చేసి, కామాక్షీ విగ్రహ ప్రతిష్ఠ చేయించి, శంకర మఠంలో కొంతకాలం బసచేశారు. స్వామివారు ముఖ్యపట్టణానికి కొంచెం దూరంగా నదీ తీరంలో ఉండడానికి సంకల్పించడంతో అప్పటి తంజావూరు ప్రధాని శ్రీదాబిర్ పంత్ శ్రీ మఠానికి కుంభకోణం కావేరీ తీరంలో ఆదికుంభేశ్వర మంగళాంబాదేవి సమక్షంలో మఠనిర్మాణం చేసి ఇచ్చారు. శ్రీమఠ ప్రధాన కార్యాలయం కుంభకోణానికి మార్చబడింది. కంచిలో నామమాత్రంగా శాఖా కార్యాలయం నిర్వహించబడుతూ వచ్చింది. 


శ్రీమఠం కుంభకోణానికి వచ్చినది ఆదిగా అపప్తికే ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గాంచిన హోయసల కర్ణాటక బ్రాహ్మణులు పీఠమునకు యధోచితమైన సేవ చేస్తూ స్వామి వారలను ఆశ్రయించి ఉన్నారు. మన మహాస్వామి వారి మాతామహా స్థానము గోవింద దీక్షితుల వారి పరంపరలోని వారు. వారి ప్రపితామహులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తిరువిడైమరుదూరు మహాలింగస్వామి ఆలయ వీధిలో ఉన్న శంకరమఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు శ్రీ శేషాద్రి శాస్త్రి, శ్రీ గణపతి శాస్త్రి. శేషాద్రి శాస్త్రి గారు ఋగ్వేదాధ్యయనం పూర్తిచేసి తండ్రిగారి ముద్రాధికారిత్వం చేపట్టి శంకరమఠంలో పూజ చేస్తూ తిరువిడై మరుదూరులో స్థిరపడ్డారు. శ్రీ గణపతి శాస్త్రి ఋగ్వేదము సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. మంచి శాస్త్ర పండితులు. మాతృభాష కన్నడం, తెలుగు, తమిళం, మరాఠీ భాషలలో మంచి ప్రవేశం ఉన్నది.  50సంవత్సరములు శ్రీమఠంసర్వాధికారిగా తమ యావచ్ఛక్తి యుక్తులు ధారపోశారు. ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబములలో తిరువిసైనల్లూరులో స్థిరబడిన కుట్టకవి మనుమడు మహా పండితుడు అయిన “మణికుట్టి” గురించి, శ్రీ గణపతి శాస్త్రిగారి గురించి మహాస్వామి వారు ఇష్టాగోష్ఠిలో చెప్పిన రసస్ఫోరకమైన విషయాలు శ్రీ రా. గణపతి గారిచే తమిళ భాషలో కల్కిలో ప్రచురించబడినవి. ఇందు చెప్పబడిన విషయములు శ్రీమఠ ఆచార్యుల చరిత్రతోనూ, శ్రీవారి పూర్వీకులతోనూ ముడిపడి ఉన్నందున, వీని స్వేచ్ఛానువాదములు ఇక్కడ పొందుపరచబడినవి. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం