శ్రీ శర్మదాగారు చక్కని వివరణ ఇచ్చారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొంచం అధికంగా విస్తర్ణగా పేర్కొన ప్రయత్నిస్తాను.
మూడు రకాల పంచాంగాలు వున్నాయి అది నిజం కానీ ఈ మూడు రకాల పంచాంగాలలో కూడా అన్ని గ్రహగతులను గణిస్తారు, పరిగణలో తీసుకుంటారు. కాకపొతే మన చాంద్రమానంలో చంద్రుని ఆధారంగా తిదులను, వారలను, నేలలను గణిస్తారు.అమావాస్యతో నెల అయిపోతుంది. పాడ్యమినుండి కొత్త నెల మొదలవుతుంది. అందుకే మన సంవత్సరం చేత్రశుద్ధ పాడ్యమి నుండి మొదలొవుతుంది. ఫాల్గుణ అమావాస్యతో ముగుస్తుంది.
ఒక చాంద్రమానం నెలలో 14 తిధులు తరువాత అమావాస్య లేక పౌర్ణమి ఉంటుంది. అవి 1)పాడ్యమి, 2) విదియ 3) తదియ, 4) చవితి, 5)పంచమి, 6) శ్రష్టి 7) సప్తమి, 8) అష్టమి, 9) నవమి, 10) దశమి, 11) ఏకాదశి, 12) ద్వాదశి, 13) త్ర్యయోదశి 14) చతుర్దశి 15) అమావాస్య లేక పౌర్ణమి.
ఇందులో సాధారణంగా 4,6,8,9,13.14 తిధులను శుభ తిధులుగా పరిగణించారు.
నిజానికి చాంద్రమానం పంచాంగం చెంద్రుని గతిని ఆధారంగా చేసుకొని నిర్మించినది కాబట్టి నెలకు 30 రోజులు వుండవు. కేవలం 27.32 రోజులు మాత్రమే ఉంటాయి. అందుకే మనకు కండతిధులు, తిదిద్వయాలు వస్తూవుంటాయి. అంటే ఒక సూర్యోదయానినుంచి మరొక రోజు సూర్యోదయసమయంలో పూర్తిగా ఒకే తిధి వుండదనుమాట. కాబట్టి మనం జరుపుకునే శుభాశుభ కార్యాలను ఒక్కొక్కరు ఒక్కొకరీతినో ఆయా తిథిని అవలంబించి జరుపుకుంటారు.
కొన్ని పండగలను స్మార్తులు ఒకరోజు, శ్రీవైష్ణవులు ఒకరోజు జరుపుకోవటం మనకు నిత్యానుభవమే. వీరిరువులు చాంద్రమానం పంచాంగం ను అనుసరించినా కూడా స్మార్తులు తిధి ఆరంభంను శ్రీవైష్ణవులు తిధి అంతాన్ని పరిగణలో తీసుకుంటారని నాకు ఉన్న పరిజ్ఞనం. జ్యోతిష్య పండితులు దీనిని సవరించ గలరు. కాగా కొన్ని సందర్భాలలో సూర్యోదయ కాలంలో ఉన్నతిధిని పరిగణలో తీసుకోవటం కద్దు.
మనం సమత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ కాలంగా పరిగణిస్తాము అంటే అది 365.26రోజులు కానీ మన చంద్రమానంలోని 12 నేలలను గణిస్తే వచ్చేది 327/32 రోజులు. అనగా 37.42 రోజులు ఒక సారి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కన్నా తక్కువ మరి ఈ కాలాన్ని ఎలా సర్దాలి అని మన మహర్షులు యోచించి మనకు అధిక మాసాలను ఏర్పాటు చేశారు. అధిక మాసం అంటే ఒక ఏడులో ఒక నెల రెండు పర్యాయాలు వస్తుంది అనిఅర్ధం. ఈ అధిక మాసాగూర్చి మనందరికీ విదితమే.
మనం జరుపుకునే అన్ని పండగలను చాంద్రమానం ప్రకారం జరుపుకున్నాకూడా ఒక్క మకర సంక్రాంతిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం అన్నమాట అందుకే సంక్రాతి పండగ ప్రతి ఏడు జనవరి 14 వ తారీకు నాడే వస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక కారణాలవల్ల జనవరి 15న కూడా రావచ్చు (స్థలాభావం వలన ఇక్కడ వివరణ ఇవ్వటంలేదు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి