27, ఏప్రిల్ 2024, శనివారం

సరస్వతీదేవి స్తుతి

 *🌸సరస్వతీదేవి స్తుతి🙏*

        ***************

                   

              హైదరాబాదు.

 సీ౹౹వాణీ!లలితకళావాహిని! భారతీ!

                నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్రి! 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

     నన్ను నిరతము కాపాడు నలువ రాణి!


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

పాప ప్రక్షాళన

 🕉పాప ప్రక్షాళన🕉


🕉ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం* *ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.*


*ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.*


🕉దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి..


🕉ఓమ్ నమశ్శివాయ🕉

Joke












 

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*27-04-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు.

---------------------------------------

వృషభం


కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

---------------------------------------

మిధునం


ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.

---------------------------------------

కర్కాటకం


సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 

---------------------------------------

తుల


ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.

---------------------------------------

వృశ్చికం


సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

---------------------------------------

ధనస్సు


ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.

---------------------------------------

మకరం


సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి. 

---------------------------------------

కుంభం


ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ తృతీయ - జేష్ఠ -‌‌ స్థిర వాసరే* *27.04.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.



🙏🙏