17, ఫిబ్రవరి 2024, శనివారం

Purity of thirtha


 

Tharmal switch


 

Iron tape only


 

ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ

 ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు......

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.....

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు..... 

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న..... 

అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం...... 

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే..... ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది...... 

ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.... దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.....

అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.....


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది..... 

సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది..... 

అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకుడగును,, కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే..

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

 శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 


      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 


              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 


 గమనిక - 


    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 

ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .


  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మాఘ పురాణం - 5 వ అధ్యాయము🌹*

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*🌺మాఘ పురాణం - 5 వ అధ్యాయము🌹*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


 *కుక్కకు విముక్తి కా విలుగుట*


*దిలీప మహారాజా!*

సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -


"నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.


తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి


శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |

     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||


అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 


ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.


"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను.


అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.


ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.


ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.


నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 

కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట.


ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము  యేమి?' అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 23*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*నైనం ఛిందంతి శస్త్రాణి* *నైనం దహతి పావకః ।*

*న చైనం క్లేదయంత్యాపో న* *శోషయతి మారుతః ।।*



*భావము:* 

ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు.

 

*వివరణ:* 

ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, గాలి ఆత్మను ఎండబెట్టలేదు, నీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవుల;గన డెవ్వడట వానికంటె ప్రియుడు*

*నీకు లేడు, అయినను నిఖిలవిశ్వోద్భవ ; స్థితి విలయంబులకతన నైన*

*సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశి ; ష్టాత్మీయ మాయచే నజభవాది*

*వివిధభేదము లొందుదువు, స్వస్వరూంపంబు; నందుండుదువు, వినిహతవిమోహి*


స్వామీ! నారాయణా! విశ్వమంతా నీవే! నీకంటె వేరుగా జీవులు ఉన్నారు అనుకోవటం అజ్ఞానం. ఆ అజ్ఞానం లేనివారికంటె నీకు ప్రియమైనవాడు లేడు. అంటే నీకు జ్ఞానులంటే చాలా ఇష్టం. అయినా ఈ విశ్వమంతా ఏర్పడటానికీ, నిలిచి ఉండటానికీ, మళ్ళీ నీలో కలసిపోవటానికీ నీవే వేరువేరుగా రజస్సు, సత్త్వము తమస్సు అనే గుణాలతో కూడిన నీదే అయిన మాయతో బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ఇంకా పెక్కుదేవతలుగా రూపా లను పొందుతూ ఉంటావు. అయినా నీకు నీదయినజ్ఞానం ఏమాత్రమూ జారిపోదు. కనుక నిలువెల్లా కృపయే అయిన దేవా! లక్ష్మీపతీ! పద్మములవంటి కన్నులున్న ప్రభూ! అంతటా వ్యాపించి ఉండు సర్వాత్మకా! లోకాలనన్నింటినీ కాపాడే ఆదిదేవా! నిన్ను మాత్రమే భక్తితో,మిక్కిలి ప్రీతితో సేవకులమై కొలిచే మమ్ములను కాపాడు తండ్రీ!


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*హారకిరీట కేయూర కంకణ ఘన ; భూషణుం డాశ్రితపోషణుండు*

*లాలిత కాంచీకలాపశోభిత కటి; మండలుం డంచిత కుండలుండు మహనీయ* *కౌస్తుభమణియుక్తమైన గ్రై ; వేయకుండానందదాయకుండు*

*సలలిత ఘనశంఖచక్రగదా పద్మ ; హస్తుండు భువన ప్రశస్తు డజుడు*



నాయనా! ధ్రువా! నారాయణుడు హారాలు, కిరీటమూ, బాహుపురులూ, వలయాలూ మొదలైన గొప్ప నగలతో అలంకరింపబడినవాడు. తనను ఆశ్రయించినవారిని పోషిస్తూ ఉంటాడు. చక్కని మొలత్రాడు పేటలతో శోభలను వెలువరిస్తున్న నుడుము కలవాడు. కాంతులతో అలరారుతున్న కుండలాలు కలవాడు. వెలకట్టరాని కౌస్తుభమణితో కూడియున్న కంఠంలో వ్రేలాడుతున్న సువర్ణహారం కలవాడు. అందరికీ ఆనందం అందిస్తున్నవాడు. అందచందాలతో ప్రకాశిస్తున్న శంఖము, చక్రము, గద, పద్మము చేతులందు ఉంచుకొన్నవాడు. అందువలననే ఆతనిని లోకులందరూ కొనియాడుతూ ఉంటారు. కమ్మని సువాసనలతో గుబాళిస్తున్న వనమాలను ధరించి ఉంటాడు. ఇన్ని మహావస్తువులు ఉన్నా దేనియందూ వ్యామోహంలేని మహాత్ముడు. ఎప్పటికప్పుడు క్రొత్త పట్టువస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చీలమండ దగ్గర మనోహరమైన అందియలు సొంపును పెంపు చేస్తున్నాయి. అతని సద్గుణాలను మించేవి సృష్టిలో మరెక్కడా ఉండవు. ప్రాణులందరికీ చూడముచ్చట అయినవాడు.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్ 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

హనుమాన్ చాలీసా

 🍀🌺🍀🌺🍀


             హనుమాన్ చాలీసా 

                 ➖➖➖✍️

            (తులసీదాస కృతం)


దోహా:

శ్రీ గురు చరణ సరోజ రజ

నిజమన ముకుర సుధారి

వరణౌ రఘువర విమల యశ

జో దాయక ఫలచారి ||


అర్థం:

శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి 

నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర(రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.


బుద్ధిహీన తను జానికే

సుమిరౌ పవనకుమార

బల బుద్ధి విద్యా దేహు మోహి

హరహు కలేశ వికార ||


అర్థం:

బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.


చౌపాఈ:

జయ హనుమాన జ్ఞానగుణసాగర |

జయ కపీశ తిహు లోక ఉజాగర|| ౧ ||


అర్థం:

ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.


రామదూత అతులిత బలధామా |

అంజనిపుత్ర పవనసుత నామా||౨||


అర్థం:

నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.


మహావీర విక్రమ బజరంగీ |

కుమతి నివార సుమతి కే సంగీ|| ౩ ||


అర్థం:

నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు.


కంచన వరణ విరాజ సువేశా |

కానన కుండల కుంచిత కేశా|| ౪ ||


అర్థం:

బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.


హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |

కాంధే మూంజ జనేవూ సాజై ||౫||


అర్థం – ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.


శంకర సువన కేసరీనందన |

తేజ ప్రతాప మహా జగవందన || ౬||


అర్థం:

శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.


విద్యావాన గుణీ అతిచాతుర |

రామ కాజ కరివే కో ఆతుర || ౭ ||


అర్థం:

విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.


ప్రభు చరిత్ర సునివే కో రసియా |

రామ లఖన సీతా మన బసియా||౮||


అర్థం:

శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా,రామ,లక్ష్మణులను 

నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.


సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |

వికటరూప ధరి లంక జరావా || ౯ ||


అర్థం:

సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.


భీమరూప ధరి అసుర సంహారే |

రామచంద్ర కే కాజ సంవారే || ౧౦||


అర్థం:

మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.


లాయ సంజీవన లఖన జియాయే |

శ్రీరఘువీర హరషి వుర లాయే || ౧౧ ||


అర్థం:

సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.


రఘుపతి కీన్హీ బహుత బడాయీ |

తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||

[పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి ]


అర్థం:

అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.


సహస వదన తుమ్హరో యశ గావై |

అస కహి శ్రీపతి కంఠ లగావై || ౧౩ ||


అర్థం:

వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.


సనకాదిక బ్రహ్మాది మునీశా |

నారద శారద సహిత అహీశా ||౧౪ ||


యమ కుబేర దిగపాల జహాఁ తే |

కవి కోవిద కహి సకే కహాఁ తే ||౧౫ ||


అర్థం:

సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?


తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |

రామ మిలాయ రాజ పద దీన్హా||౧౬||


అర్థం:

నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.


తుమ్హరో మంత్ర విభీషణ మానా |

లంకేశ్వర భయె సబ జగ జానా ||౧౭||


అర్థం:

నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.


యుగ సహస్ర యోజన పర భానూ |

లీల్యో తాహి మధురఫల జానూ||౧౮||


అర్థం:

యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.


ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |

జలధి లాంఘి గయే అచరజ నాహీ॥౧౯॥


అర్థం:

అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?


దుర్గమ కాజ జగత కే జేతే |

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే||౨౦||


అర్థం:

జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.


రామ దువారే తుమ రఖవారే |

హోత న ఆజ్ఞా బిను పైఠారే || ౨౧ ||


అర్థం:

శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.


సబ సుఖ లహై తుమ్హారీ శరణా |

తుమ రక్షక కాహూ కో డరనా ||౨౨ ||


అర్థం:

నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?


ఆపన తేజ సంహారో ఆపై |

తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||

అర్థం:

నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.


భూత పిశాచ నికట నహిఁ ఆవై |

మహావీర జబ నామ సునావై || ౨౪ ||


అర్థం:

భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.


నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా ||౨౫ ||


అర్థం:

రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.


సంకటసే హనుమాన ఛుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై ||౨౬|| 


అర్థం:

మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.


సబ పర రామ తపస్వీ రాజా |

తిన కే కాజ సకల తుమ సాజా ||౨౭||


అర్థం:

అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.


ఔర మనోరథ జో కోయీ లావై |

సోయి అమిత జీవన ఫల పావై||౨౮||


అర్థం:

ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.


చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |

హై పరసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||


అర్థం:

నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.


సాధుసంతకే తుమ రఖవారే |

అసుర నికందన రామ దులారే||౩౦ ||


అర్థం:

సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.


అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |

అసవర దీన్హ జానకీ మాతా|| ౩౧ ||

అర్థం:

ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.


రామ రసాయన తుమ్హరే పాసా |

సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||


అర్థం:

నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.



తుమ్హరే భజన రామ కో పావై |

జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||


అర్థం:

నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.



అంతకాల రఘుపతి పుర జాయీ | [రఘువర]

జహాఁ జన్మ హరిభక్త కహాయీ || ౩౪ ||


అర్థం:

అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.



ఔర దేవతా చిత్త న ధరయీ |

హనుమత సేయి సర్వసుఖకరయీ॥౩౫॥


అర్థం:

వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.



సంకట హటై మిటై సబ పీరా |

జో సుమిరై హనుమత బలవీరా ||౩౬||


అర్థం:

కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.



జై జై జై హనుమాన గోసాయీ |

కృపా కరహు గురు దేవ కీ నాయీ || ౩౭ ||


అర్థం:

జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.



యహ శతవార పాఠ కర కోయీ |

ఛూటహి బంది మహాసుఖ హోయీ || ౩౮ ||


అర్థం:

ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.



జో యహ పఢై హనుమాన చాలీసా |

హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||


అర్థం:

ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.



తులసీదాస సదా హరి చేరా |

కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||


అర్థం:

తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).



దోహా-

పవనతనయ సంకట హరణ

మంగళ మూరతి రూప ||

రామ లఖన సీతా సహిత

హృదయ బసహు సుర భూప ||


అర్థం:

పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

 🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

BHAGAVAD-GITA

 Free *BHAGAVAD-GITA* Online Classes in Telugu. New batch starting on 19th February 2024 9PM (India Time). Everyday 9PM Click one of the following links to join Bhagavad-Gita online class.


YouTube live link https://www.youtube.com/channel/UCEoSoavasAM_jVocbSOCrZA/live 


Zoom link https://us06web.zoom.us/j/7675813632?pwd=NlhjYVBQNmQ1akNnRDd4QmpESExPUT09


Website link https://learnbhagavadgitaonline.org


Kindly please Forward this message.

భీష్మాష్టమి

 ఈ రోజు భీష్మాష్టమి సందర్భం గా...


సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి

            గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ

    నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

            జగముల వ్రేఁగున జగతి గదలఁ

    జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ

            బైనున్న పచ్చని పటము జాఱ

    నమ్మితి నాలావు నగుఁబాటు సేయక

            మన్నింపు మనిక్రీడి మఱల దిగువఁ


తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

    నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

    విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ

    దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.


చాలా ప్రసిద్ధమైన ఈ పద్యం భాగవతం లోనిది. కవి బమ్మెర పోతన. భీష్ముడు పలికిన పలుకులివి.


భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయన పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం.

 

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. 


భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ, తన చాలిమిని ఎత్తిచూపినందువల్ల కలిగిన అవమానంతోనూ, నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ’ – ముందుకొస్తున్న ఆ మహానుభావుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కగు గాక! అని స్తుతించిన సందర్భంలోనిది ఈ పద్యం. 


ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన, తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ, ఆ చేలాంచలం జారడంలోని సొగసూ, ఆ చక్రమూ, కాలుక్కరచుకున్న అర్జునుడూ, అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు, ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో, పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు – ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది, ఎవరికి నచ్చదు!


 

సజ్జనుల సాంగత్యం

 *👌సుభాషితము👌*


 

*శ్లో.*


*చన్దనం శీతలం లోకే*

*చందనాదపి చంద్రమా|* 

*చంద్రచన్దనయోర్మధ్యే*

*శీతలా సాధుసంగతః||*


లోకంలో మంచిగంథం చల్లదనాన్ని కల్గజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగ జేస్తాడు. చందనము చంద్రుడు రెంటికి కంటే సజ్జనుల సాంగత్యం మరి ఎక్కువ చల్లదనాన్ని కలుగ జేస్తుంది.

(అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని, ప్రశాంతతని చేకూరుస్తుంది).

ఐఏఎస్‌ ఫ్యాక్టరీ

 వామ్మో ఇది ఊరు కాదు..! ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..!! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..


ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు..?! 

అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు.. ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర ప్రదేశ్‌ లోని జౌన్‌పూర్ జిల్లా లోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటివరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ లను అందించింది. 

దీంతో, భారత దేశంలో సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది.

ఈ గ్రామం ‘IAS ఫ్యాక్టరీ’ గా పేరు పొందింది. ప్రతి యేటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్‌పూర్ జిల్లా లోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్‌లు లేవు. కాబట్టి, ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది..! 

ఇక, స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు,నీలం లైట్లు వచ్చే కార్లతో

శనివారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*17-02-2024 / శనివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి.

---------------------------------------

వృషభం


వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలించవు వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.

---------------------------------------

మిధునం


సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఋణ భారం అధికమౌతుంది.

---------------------------------------

సింహం


వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాల తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


 వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. 

---------------------------------------

వృశ్చికం


ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు


వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది.

---------------------------------------

మకరం


వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

---------------------------------------

మీనం


బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

*కౌపీన పంచకం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


3.  *స్వానన్ధ భావే పరితుష్ఠమన్తః*

      *సుశాన్త సర్వేన్ధ్రియ  వృత్తిమన్తః*

      *అహర్నిశం బ్రహ్మసుఖే రమన్తః*

     *కౌపీనవంతః ఖలు భాగ్యవంతః*


👉 *కౌపీన పంచకం ( శ్రీ శంకరాచార్య )*


భావము: *ఆత్మానందం పొందిన పరితృప్తులు, జితేంద్రియులు, అహర్నిశము బ్రహ్మానందమున క్రీడించే కౌపీనధారులు చాల భాగ్యవంతులు.!!*