సుమతి శతకము

శతకాలు ఆనే మాటలోనే వంద అని వున్నది అంటే నూరు పద్యాలతో కూడిన పుస్తకము అని అర్ధము.  పూర్వము మనకు నీతి శతకాలు ఆవిర్భవించాయి అందులో ముఖ్యంగా పేర్కొన దగినవి సుమతి శతకము, వేమన శతకము, భాస్కర శతకము ఇత్యాదులు.  వీటిలో సమాజంలో వున్న పరిస్థితులు వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో తెలిపారు.  ఇప్పటికి నిత్య నూతనమైనవి యి సంతకాలు అంటే అతిశయక్తి లేదు. తల్లిదండ్రులు పిల్లలకి వీటిని బోధించటం వలన తమ పిల్లలని మంచి నడవడికగల వారిగా తీర్చిదిద్దగలరు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. 
ఏ కావ్యమైన శ్రీ కారంతో మొదలు పెట్టటం ఆనవాయితి మన సుమతి శతకకారుడు కూడా శ్రీకారంతో క్రింది పద్యం ప్రారంభంగా వ్రాసాడు. 

శ్రీరాముని దయచేతను

నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా

ధారాళమైన నీతులు

నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

 

అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా

నెక్కినఁ బారని గుర్రము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

 

అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

 

అడియాస కొలువుఁ గొలువకు

గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్

విడువక కూరిమి సేయకు

మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

 

అప్పుగొని సేయు విభవము

ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్

దప్పురయని నృపురాజ్యము

దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!

 

అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

 

 

ఆఁకొన్న కూడె యమృతము

తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్

సోఁకోర్చువాఁడె మనుజుఁడు

తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

స్త్రీల ఎడ వాదులాడక

బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ

మేలైన గుణము విడువకు

ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

సిరి దా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి దాఁ బోయిన బోవును

కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

 

ధనము తనంతట తానుగా వస్తుందని అది ఎలా వస్తుందో కూడా తెలియదని ఎలాగైతే తీయని కొబ్బరినీళ్లు కొబ్బరికాయలోకి  వస్తాయో. అదే విధంగా ధనము పోవటం కూడా తెలియదని యేరీతిగా వెలగపండు గుజ్జు లేకుండా ఎనుగు విసర్జిస్తుందో ఆలా అని చక్కటి ఉపమానాలతో తెలుపబడ్డాయి.

 

 

మేలెంచని మాలిన్యుని

మాలను నగసాలివాని మంగలి హితుగా

నేలిన నరపతి రాజ్యము

నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

సరసము విరసము కొరకే

పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే

పెరుగుట విరుగుట కొరకే

ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

శుభముల నొందని చదువును

అభినయమున రాగరసము నందని పాటల్

గుభగుభలు లేని కూటమి

సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

వేసరవు జాతి కానీ

వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ

దాసి కొడుకైన గాని

కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!

 

వెలయాలు సేయు బాసలు

వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్

గలలోఁన గన్న కలిమియు,

విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

 

 

వెలయాలివలనఁ గూరిమి

గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా

పలువురు నడిచెడి తెరుపునఁ

బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

 

వీడెము సేయని నోరును

జేడెల యధరామృతంబుఁ జేయని నోరును

బాడంగరాని నోరును

బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

 

వినదగు నెవ్వరుచెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

కనికల్ల నిజము దెలిసిన

మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

 

అందరు చెప్పింది వినండి కానీ విన్నదానిలో నిజాన్ని గమనించి మసలుకోండి అంటున్నాడు కవి. .

వరి పంటలేని యూరును

దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్

ధరను బతిలేని గృహమును

అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

వరదైన చేను దున్నకు

కరవైనను బంధుజనుల కడకేగకుమీ

పరులకు మర్మము సెప్పకు

పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

లావుగలవానికంటెను

భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ

గ్రావంబంత గజంబును

మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

 

రూపించి పలికి బొంకకు

ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ

గోపించురాజుఁ గొల్వకు

పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

 

రా పొమ్మని పిలువని యా

భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే

దీపంబు లేని ఇంటను

చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!

నాది నొకని వలచియుండగ

మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్

బొది జిలుక పిల్లి పట్టిన

జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

మానఘనుఁ డాత్మధృతిఁ జెడి

హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్

మానెడు జలములలోపల

నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!.

మాటకు బ్రాణము సత్యము

కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్

బోటికిఁ బ్రాణము మానము

చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

 

 

ఇక్కడ ప్రాణం అన్న పదానికి ముఖ్యము అనే అర్ధంచెప్పిన మాట నిలపెట్టుకోవాలి అదే సత్యం. కోటకు మంచి కాపలాదారులు ఉండాలి. స్త్రీకి మానము ముఖ్యముచీటికీ అంటే ప్రామిసరీ నోట్ అని అర్ధం తీసుకోవచ్చు. నోటుకి సంతకము (వ్రాలు) లేకపోతె చెల్లదు అనే భావంలో కవి చెపుతున్నాడు

మంత్రిగలవాని రాజ్యము

తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో

మంత్రి విహీనుని రాజ్యము

జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

 

 

రాజుకు మంత్రి చాల అవసరము అంటున్నాడుమంత్రి తన తెలివి తేటలతో రాజ్యపు యంత్రాంగాన్ని నడిపించాలిమంత్రి లేని రాజ్యము ఎంత్రపు కీలు ఊడినట్లు అంటున్నాడు.  ( wheel without axial)

మండలపతి సముఖంబున

మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్

గొండంత మదపుటేనుగు

తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!

బలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

బంగారు కుదువబెట్టకు

సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో

నంగడి వెచ్చములాడకు

వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

పొరుగున పగవాడుండిన

నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్

ధరఁగాఁపు కొండెమాడినఁ

గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

 

పెట్టిన దినములలోపల

నట్టడవులకైనవచ్చు నానార్థములున్

బెట్టని దినములఁ గనకపు

గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

 

 

పులిపాలు దెచ్చిఇచ్చిన

నలవడఁగ గుండెగోసి యరచే నిడినం

దలపొడుగు ధనము బోసిన

వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పురికిని బ్రాణము కోమటి

వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం

గరికిని బ్రాణము తొండము

సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

పిలువని పనులకు బోవుట

కలయని సతి రతియు రాజు గానని కొలువు

బిలువని పేరంటంబును

వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

పాలసునకైన యాపద

జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ

దే లగ్నిబడగఁ బట్టిన

మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

పాలను గలిసిన జలమును

బాలవిధంబుననే యుండుఁ బరికింపగ

బాల చవిఁజెరచు గావున

బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

పాటెరుగని పతికొలువును

గూటంబున కెరుకపడని కోమలిరతియు

జేటెత్తజేయు చెలిమియు

నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

పలుదోమి సేయు విడియము

తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం

బొలయలుక నాటి కూటమి

వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

పర్వముల సతులఁ గవయకు

ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో

గర్వింపనాలి బెంపకు

నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

పరుల కనిష్టము సెప్పకు

పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్

బరుఁగదిసిన సతి గవయకు

ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!

 

పరసతుల గోష్టినుండి

పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్

బరుసతి సుశీయైనను

బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

 

పరసతి కూటమి గోరకు

పరధనముల కాసపడకు పరునెంచకుమీ

సరిగాని గోష్టి సేయకు

సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

పరనారీ సోదరుఁడై

పరధనముల కాసపడక పరులకు హితుడైఁ

పరుల దనుఁబొగడ నెగడక

పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

 

పనిచేయునెడల దాసియు

ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్

దనభుక్తి యెడలఁ దల్లియు

ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!

పతికడకుఁ దన్నుగూర్చిన

సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్

సుతుకడకు రిత్తచేతుల

మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

పగవల దెవ్వరితోడను

వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్

దెగనాడవలదు సభలను

మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

 

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్

నవ్వకుమీ పరసతితో

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

నవరస భావాలంకృత

కవితాగోష్ఠియును మధుర గానంబును

నవివేకి కెంతఁజెప్పినఁ

జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

నరపతుల మేరదప్పిన

దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్

గరణము వైదికుఁడయినను

మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!

నవమున బాలుంద్రావరు

భయమునను విషమ్మునైన భక్షింతురుగా

నయమెంత దోసకారియె

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!.

నమ్మకు సుంకరి జూదరి

నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్

నమ్మకు మంగలివానిని

నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నడువకుమీ తెరువొక్కటఁ

గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్

ముడువకుమీ పరధనముల

నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

సారంబగు నారికేళ సలిలము భంగిన్

గారవమును మరిమీదట

భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

ధనపతి సఖుఁడై యుండియు

నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్

దనవారి కెంతకల గిన

దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

చేతులకు దొడవు దానము

భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో

నీతియ తొడ వెవ్వారికి

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

దగ్గర కొండెము సెప్పెడు

ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా

నెగ్గుఁబ్రజ కాచరించుట

బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!

తాను భుజింపని యర్థము

మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ

గానల నీఁగల గూర్చిన

దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

తలమాసిన నొలుమాసిన

వలువలు మాసినను బ్రాన వల్లభునైనం

గులకాంతలైన రోఁతురు

తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలతోఁక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తములము వేయని నోరును

విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్

గమలములు లేని కొలకుఁను

హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తనవారు లేనిచోటను

జనవించుక లేనిచోట జగడముచోటన్

అనుమానమైన చోటను

మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తన కలిమి ఇంద్రభోగము

తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్

తన చావు జతద్ప్రళయము

తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తనయూరి తపసితనమును

దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్

దన పెరటిచెట్టు మందును

మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తన కోపమె తన శతృవు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తడ వోర్వక యొడలోర్వక

కడువేగం బడచిపడినఁ గార్యంబగునే

తడవోర్చిన నొడలోర్చినఁ

జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

చేతులకు దొడవు దానము

భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో

నీతియ తొడ వెవ్వారికి

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

చుట్టములు గానివారలు

చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్

నెట్టుకొని యాశ్రయింతురు

గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

కోమలి విశ్వాసంబును

బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్

వేముల తియ్యఁదనంబును

భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

గడనగల మననిఁజూచిన

నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో

గడ నుడుగు మగనిఁ జూచిన

నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ

గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ

కలకంఠి కంట కన్నీ

రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

కూరిమిగల దినములలో

నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

కొంచెపు నరుసంగతిచే

నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్

గించిత్తు నల్లి కుట్టిన

మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

కారణములేని నగవును

బేరణమును లేని లేమ పృథివీస్థలిలో

బూరణము లేని బూరెయు

వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!

కాముకుడు దనిసి విడిచిన

కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్

బ్రేమమున జెరకు పిప్పికి

జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

కాదు సుమీ దుస్సంగతి

పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్

వాదుసుమీ యప్పిచ్చుట

లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

కవిగానివాని వ్రాఁతయు

నవరసభావములు లేని నాతుల వలపుం

దవిలి చను పందినేయని

వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

కసుగాయఁ గరచి చూచిన

మసలక తన యోగరుగాక మధురంబగునా?

పసగలుగు యువతులుండఁగఁ

బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!.

కరణము సాధై యున్నను

గరి మద ముడిగినను బాము కరవకయున్నన్

ధరదేలు మీటకున్నను

గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!

కరణము గరణము నమ్మిన

మరణాంతకమౌను గాని మనలేడు సుమీ

కరణము తన సరి కరణము

మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

కమలములు నీడఁ బాసినఁ

గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్

దమ దమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

కప్పకు నొరగాలైనను

సప్పమునకు రోగమైన సతి తులువైనన్

ముప్పున దరిద్రుడైనను

దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కనకపు సింహాసనము

శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ

దొనరఁగ బట్టముగట్టిన

వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

కడు బలవంతుడైనను

బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం

దడవుండనిచ్చె నేనియు

బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!.

 

ఓడల బండ్లును వచ్చును

ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును

ఓడలు బండ్లును వలెనే

వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

ఒల్లనిసతి నొల్లనిపతి

నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే

గొల్లండు గాక ధరలో

గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

ఒకయూరికి నొక కరణము

నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం

గకవికలు గాక యుండునె

సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

ఏరకుమీ కసుగాయలు

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

 

ఇది నిత్యం మనము చూస్తున్న విషయముసంపదలు కలిగినప్పుడు ప్రతివారు ఏదో ఒక చుట్టరికం చెప్పుకొని ఊరక ఇంటికి వచ్చి రోజులకొద్దీ తింటుంటారు. ఎలాగంటే చెరువులోకి కొత్తనీరు చేరి చెరువు నిండినప్పుడు విపరీతంగా కప్పలు వచ్చినట్లుగా అని కవి భావము.

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్

సర్పంబు పడగనీడను

గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

అపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!.

ఉదకము ద్రావెడు హయమును

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్

మొదవుకడ నున్న వృషభము

జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

 

 

విద్య యెక్క ప్రాధాన్యత తెలుపుతున్నాడుచదువురాని వాడు నీచుడు వాడి వద్దకు వెళ్లవద్దనుచున్నాడు వక్క దానికి మూడు ఉపమానాలు చెపుతున్నాడు. అవి 1) నీరు త్రాగుచున్న గుఱ్ఱము. 2) మదంతో వున్నా ఏనుగు. 3) ఆవు వద్ద వున్న ఎద్దువీటి దగ్గరకు వెళ్ళటం యెంత ప్రేమాదమోఅంత ప్రమాదం చదువు రానివాడి వద్దకు వెళ్ళటం.  .

ఉత్తమ గుణములు నీచు

కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా

నెత్తిచ్చి కరగిపోసిన

నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!

ఉడుముండదె నూరేండ్లును

బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్

మడుపునఁ గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

ఇమ్ముగఁ జదువని నోరును

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!స్త్రీల ఎడ వాదులాడక

 

మానవుని నోరు ఎలా ఉండాలో చెపుతున్నాడు. చక్కగా చదవాలి అమ్మను పిలిచి అన్నము పెట్టమనాలి, తమ్ములను అంటే అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను ప్రేమగా పిలవాలి అని అర్ధముఆలా పలుకని నోరు కుమ్మరి కుండలమట్టి కోసం తీసిన గుంట వంటిది

బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ

మేలైన గుణము విడువకు

ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

 

మేలెంచని మాలిన్యుని

మాలను నగసాలివాని మంగలి హితుగా

నేలిన నరపతి రాజ్యము

నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

సరసము విరసము కొరకే

పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే

పెరుగుట విరుగుట కొరకే

ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

 

 

 

సరసాలాడుతూ చక్కగా ఆనందంగా ఉంటే అది మితిమీరితే చివరకు వివాదానికి దారితీస్తుంది. పరిపూర్ణమైన సుఖము చివరకు దుఃఖాన్ని తెస్తుంది. పెరగటం తగ్గటం కొరకే. అంటూ ధరలు తగ్గటం పెరగటం కోసమే అని అంటున్నాడుమనము ఇప్పుడు చూస్తున్నాము పది పైసలు పెట్రోలు ధర తగ్గి వెంటనే రూపాయి ధర పెంచటం.

శుభముల నొందని చదువును

అభినయమున రాగరసము నందని పాటల్

గుభగుభలు లేని కూటమి

సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

వేసరవు జాతి కానీ

వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ

దాసి కొడుకైన గాని

కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!

 

వెలయాలు సేయు బాసలు

వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్

గలలోఁన గన్న కలిమియు,

విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

వెలయాలివలనఁ గూరిమి

గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా

పలువురు నడిచెడి తెరుపునఁ

బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

వీడెము సేయని నోరును

జేడెల యధరామృతంబుఁ జేయని నోరును

బాడంగరాని నోరును

బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

 

 

వరదైన చేను దున్నకు

కరవైనను బంధుజనుల కడకేగకుమీ

పరులకు మర్మము సెప్పకు

పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

రూపించి పలికి బొంకకు

ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ

గోపించురాజుఁ గొల్వకు

పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

 

రా పొమ్మని పిలువని యా

భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే

దీపంబు లేని ఇంటను

చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!

 

నాది నొకని వలచియుండగ

మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్

బొది జిలుక పిల్లి పట్టిన

జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

 

మానఘనుఁ డాత్మధృతిఁ జెడి

హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్

మానెడు జలములలోపల

నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!.

మాటకు బ్రాణము సత్యము

కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్

బోటికిఁ బ్రాణము మానము

చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

మంత్రిగలవాని రాజ్యము

తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో

మంత్రి విహీనుని రాజ్యము

జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

మండలపతి సముఖంబున

మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్

గొండంత మదపుటేనుగు

తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!

బలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

బంగారు కుదువబెట్టకు

సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో

నంగడి వెచ్చములాడకు

వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

పొరుగున పగవాడుండిన

నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్

ధరఁగాఁపు కొండెమాడినఁ

గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

 

పెట్టిన దినములలోపల

నట్టడవులకైనవచ్చు నానార్థములున్

బెట్టని దినములఁ గనకపు

గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

పులిపాలు దెచ్చిఇచ్చిన

నలవడఁగ గుండెగోసి యరచే నిడినం

దలపొడుగు ధనము బోసిన

వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

 

 

కుమారుడు పుట్టిన నాడు కాదు తండ్రి ఆనందపడవలసింది అతడు ప్రయోజకుడు ఆయననాడు ఆనంద పడాలి.

పురికిని బ్రాణము కోమటి

వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం

గరికిని బ్రాణము తొండము

సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

పిలువని పనులకు బోవుట

కలయని సతి రతియు రాజు గానని కొలువు

బిలువని పేరంటంబును

వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

 

పాలసునకైన యాపద

జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ

దే లగ్నిబడగఁ బట్టిన

మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

పాలను గలిసిన జలమును

బాలవిధంబుననే యుండుఁ బరికింపగ

బాల చవిఁజెరచు గావున

బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

పాటెరుగని పతికొలువును

గూటంబున కెరుకపడని కోమలిరతియు

జేటెత్తజేయు చెలిమియు

నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

పలుదోమి సేయు విడియము

తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం

బొలయలుక నాటి కూటమి

వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

 

 

పర్వముల సతులఁ గవయకు

ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో

గర్వింపనాలి బెంపకు

నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

పరుల కనిష్టము సెప్పకు

పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్

బరుఁగదిసిన సతి గవయకు

ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!

పరసతుల గోష్టినుండి

పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్

బరుసతి సుశీయైనను

బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

పరసతి కూటమి గోరకు

పరధనముల కాసపడకు పరునెంచకుమీ

సరిగాని గోష్టి సేయకు

సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

 

 

పరనారీ సోదరుఁడై

పరధనముల కాసపడక పరులకు హితుడైఁ

పరుల దనుఁబొగడ నెగడక

పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

పనిచేయునెడల దాసియు

ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్

దనభుక్తి యెడలఁ దల్లియు

ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!

 

కార్యేషు దాసీ కరణేషు మంత్రి శయనేషు రంభ భోజ్యేషు మాతా అనే శ్లోకాన్ని ఇక్కడ తేట తెలుగులో చెప్పాడు.

 

పతికడకుఁ దన్నుగూర్చిన

సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్

సుతుకడకు రిత్తచేతుల

మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

 

పగవల దెవ్వరితోడను

వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్

దెగనాడవలదు సభలను

మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్

నవ్వకుమీ పరసతితో

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

నవరస భావాలంకృత

కవితాగోష్ఠియును మధుర గానంబును

నవివేకి కెంతఁజెప్పినఁ

జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

నరపతుల మేరదప్పిన

దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్

గరణము వైదికుఁడయినను

మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!

నవమున బాలుంద్రావరు

భయమునను విషమ్మునైన భక్షింతురుగా

నయమెంత దోసకారియె

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!.

 

నమ్మకు సుంకరి జూదరి

నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్

నమ్మకు మంగలివానిని

నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నడువకుమీ తెరువొక్కటఁ

గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్

ముడువకుమీ పరధనముల

నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

సారంబగు నారికేళ సలిలము భంగిన్

గారవమును మరిమీదట

భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

ధనపతి సఖుఁడై యుండియు

నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్

దనవారి కెంతకల గిన

దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

చేతులకు దొడవు దానము

భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో

నీతియ తొడ వెవ్వారికి

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

దగ్గర కొండెము సెప్పెడు

ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా

నెగ్గుఁబ్రజ కాచరించుట

బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!

తాను భుజింపని యర్థము

మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ

గానల నీఁగల గూర్చిన

దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

తలమాసిన నొలుమాసిన

వలువలు మాసినను బ్రాన వల్లభునైనం

గులకాంతలైన రోఁతురు

తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

 

మనుషులు పారిశుభ్రత పాటించాలని పద్యం చెపుతున్నది. తలమాసినను శరీరము అపరిశుభ్రంగా వున్నా, బట్టలు శుభ్రంగా లేకున్నా కట్టుకున్న భార్య కుడా అసహ్యించుకుంటుంది. ఇక ఇతరుల సంగతి చెప్పపనిలేదు.

తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలతోఁక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

 

ఇక్కడ విషము అన్న పదానికి కీడు చేయునది అనే భావము. పాముకు తలలోను, తెలుకు తోకలోను విషము ఉంటుంది కానీ దుర్మార్గుడైన మనిషికి శరీరము మొత్తము విషం ఉంటుంది.

తములము వేయని నోరును

విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్

గమలములు లేని కొలకుఁను

హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తనవారు లేనిచోటను

జనవించుక లేనిచోట జగడముచోటన్

అనుమానమైన చోటను

మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తన కలిమి ఇంద్రభోగము

తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్

తన చావు జతద్ప్రళయము

తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తనయూరి తపసితనమును

దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్

దన పెరటిచెట్టు మందును

మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తన కోపమె తన శతృవు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తడ వోర్వక యొడలోర్వక

కడువేగం బడచిపడినఁ గార్యంబగునే

తడవోర్చిన నొడలోర్చినఁ

జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

చేతులకు దొడవు దానము

భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో

నీతియ తొడ వెవ్వారికి

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

చుట్టములు గానివారలు

చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్

నెట్టుకొని యాశ్రయింతురు

గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

కోమలి విశ్వాసంబును

బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్

వేముల తియ్యఁదనంబును

భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

గడనగల మననిఁజూచిన

నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో

గడ నుడుగు మగనిఁ జూచిన

నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ

గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ

కలకంఠి కంట కన్నీ

రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

భార్యను ప్రేమగా చూసుకోవాలని ఎప్పుడు కూడా కట్టుకున్న భార్యతో అనవసరంగా గొడవపడవద్దు ఇంటి ఇల్లాలు కళ్ళలో నీరు వస్తే లక్ష్మి ఇంట్లో ఉండదని అర్ధం పద్యం రోజుల్లో చాలామంది ఆచరించాల్సిన విషయంచాలామంది మగవారు తమ భార్యలని చులకనగా చూస్తూ చీటికీ మాటికీ వారితో గొడవపడి తన ఆధిపత్యం చుపెట్టుకోవటం కోసం ప్రయత్నిస్తారు. వాళ్ళని దృష్టిలోపెట్టుకుని వ్రాసిన పద్యం ఆచరణీయం

కూరిమిగల దినములలో

నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

 

 

స్నేహము వున్ననాడు తన స్నేహితుడు చేసిన పనులు ఏవి కూడా తప్పుగా తోచదుకానీ స్నేహము విరోధంగా మారితే ప్రతి చిన్న విషయం దోషంగానే తోస్తుంది రోజుల్లోని రాజకీయనాయకులకు ఇది చక్కగా వర్తిస్తుందిఒక పార్టీలో ఉండి పార్టీవారిని పొగిడిన వారే వేరే పార్టీకి వెళ్లి ఇష్టమొచ్చినట్లు దుర్భషలాడటం మనం నిత్యం చూస్తున్నాము.

కొంచెపు నరుసంగతిచే

నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్

గించిత్తు నల్లి కుట్టిన

మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

కారణములేని నగవును

బేరణమును లేని లేమ పృథివీస్థలిలో

బూరణము లేని బూరెయు

వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!

కాముకుడు దనిసి విడిచిన

కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్

బ్రేమమున జెరకు పిప్పికి

జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

కాదు సుమీ దుస్సంగతి

పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్

వాదుసుమీ యప్పిచ్చుట

లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

కవిగానివాని వ్రాఁతయు

నవరసభావములు లేని నాతుల వలపుం

దవిలి చను పందినేయని

వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

కసుగాయఁ గరచి చూచిన

మసలక తన యోగరుగాక మధురంబగునా?

పసగలుగు యువతులుండఁగఁ

బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!.

కరణము సాధై యున్నను

గరి మద ముడిగినను బాము కరవకయున్నన్

ధరదేలు మీటకున్నను

గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!

కరణము గరణము నమ్మిన

మరణాంతకమౌను గాని మనలేడు సుమీ

కరణము తన సరి కరణము

మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

కమలములు నీడఁ బాసినఁ

గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్

దమ దమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

 

కొలనులోని కమలపు పూలు సూర్యుని కిరణాలతో వికసిస్తాయిఅందుకే సురుడిని కమలాప్తుడు అన్నారుఅదే కమలాపు పూలు నీటి బైటికి వస్తే అంటే కోలోనులోంచి తెంపి తెస్తే అదే సూర్యుని వాడి కిరణాలతో వడలి పోతాయికాబాట్టి ఎవరు ఎక్కడ ఉంటే వారి స్థానాన్ని బట్టి మిత్రులు, శత్రువులు అవుతారు..  నేటి రాజకీయ నాయకులకు ఇది చక్కగా వర్తిస్తుందినిన్నటి దాక ఎదుటి పార్టీవాళ్లని ఇష్టమొచ్చినట్లు విమర్శించి నేడు అదే పార్టీలోకి ఫిరాయంచి వల్లనే పొగడటం నిత్యం మనం చూస్తున్నాము

కప్పకు నొరగాలైనను

సప్పమునకు రోగమైన సతి తులువైనన్

ముప్పున దరిద్రుడైనను

దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కనకపు సింహాసనము

శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ

దొనరఁగ బట్టముగట్టిన

వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

కడు బలవంతుడైనను

బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం

దడవుండనిచ్చె నేనియు

బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!.

 

ఓడల బండ్లును వచ్చును

ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును

ఓడలు బండ్లును వలెనే

వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

ఒల్లనిసతి నొల్లనిపతి

నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే

గొల్లండు గాక ధరలో

గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

ఒకయూరికి నొక కరణము

నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం

గకవికలు గాక యుండునె

సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

ఏరకుమీ కసుగాయలు

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్

సర్పంబు పడగనీడను

గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

అపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!.

ఉదకము ద్రావెడు హయమును

మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్

మొదవుకడ నున్న వృషభము

జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

ఉత్తమ గుణములు నీచు

కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా

నెత్తిచ్చి కరగిపోసిన

నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!

ఉడుముండదె నూరేండ్లును

బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్

మడుపునఁ గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

ఇమ్ముగఁ జదువని నోరును

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

 

కామెంట్‌లు లేవు: