2, జులై 2021, శుక్రవారం

ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

అవధాన ప్రక్రియ మన తెలుగు భాషలోని అత్యంత గొప్ప విషయం.  మన తెలుగు కవులు అనేకులు అవధానాలు చేసి వారి పాండితీ గరిమను చాటుకున్నారు. అవధానాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అష్టావధానం.  అంటే ఎనిమిది మంది పృచ్ఛకుల మధ్యన ఒక అవధాని కూర్చొని వారు సంధించే ప్రశ్నల పరంపరకు ధీటుగా సమాధానం చెప్పి సభను మెప్పించటం సాధారణమైన విషయం కాదు.  అక్కడ కూర్చున్న అవధాని అత్యంత ప్రతిభాశాలి కావాలని వేరే చెప్పనవసరం లేదు.  

అష్టావధానంలో వున్న ఎనిమిది అంశాలలో సమస్య పురాణం ప్రముఖమైనది ఎందుకంటే పూర్తీ వ్యతిరేకంగా అసాధ్యంగా కనపడే సమస్యను భావ యుక్తంగా పృచ్ఛకుడు ఇచ్చిన ఛందస్సులోనే పూరించటం నిజంగా కత్తిమీద సాము లాంటిదే. మనం రోజు ఒక సమస్య దాని పురాణాన్ని తెలుసుకుందాము. 

ఈ పరంపరలో మొట్ట మొదటిగా కంద పద్యంతో వున్న సమస్య దాని పురాణ తెలుసు కుందాము. 

ముందుగా కంద పద్యాన్ని గూర్చి కొంత తెలుసుకుందాము. ఇది దేశీయ ఛందస్సుకు చెందిన పద్య ప్రక్రియ.  పూర్వం కందం వ్రాసిన వాడూ కావేనా అని అనేవారు.  అంటే కంద పద్యం స్వల్ప కృషితో వ్రాయగల ఛందస్సు.  ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.  వృత్త చెందస్సు, దేశీయ ఛందస్సు వివరాలు ఇంకొక సారి తెలుసుకుందాము. 

ఈ నాటి సమస్య ఇది: 

 ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

దీని భావముఎలుకలు తమ కలుగు అంటే కన్నంలోకి ఏనుగును తీసుకొని వెళ్లాయి.  మనం సాధారణ దృష్టితో చుస్తే ఏనుగు చాలా పెద్ద జంతువు ఎలుకలు చాలా చిన్న జంతువులూ మరి ఎలుకలు ఏనుగును యెట్లా తీసుకొని పోగలుగుతాయి అది ఒక ప్రశ్న అయితే అదికూడా ఎలుక కన్నంలోకి అంటే ఎట్టి పరిస్థితిలోను ఎలుకల కన్నంలో ఏనుగు పట్టదు. మరి కవి ప్రతిభ చుడండి. 


క. ఇలలో నిద్దఱురాజులు

మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
బలమెత్తి కట్ట మఱచిన
ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

దీని భావం. ఒకచోట ఇద్దరు రాజులు రాత్రిపూట చదరంగం (చెస్ బోర్డు) ఆడి ఆ పావులను దాచి పెట్టటం మరచినారట అప్పుడు చదరంగంలోని ఏనుగును ఎలుకలు వాటి కన్నంలోకి తీసుకొని పోయాయట . ఇక్కడ పూర్తిగా ఔచిత్యం కనపడుతున్నది. ఎందుకంటె చదరంగంలోని ఏనుగు సాదారణ ఎలుకల కన్నా చాలా చిన్నది కాబట్టి దానిని అవి వాటి కన్నంలోకి తీసుకొని పోగలవు. 
ఇంకా మరిన్ని పురాణాలలో మళ్ళీ కలుదాము. 
మీ బుధ జన విధేయుడు 
సి. భార్గవ శర్మ 

నాడి జ్ఞానం - మనిషి దేహమునంధలి

 నాడి జ్ఞానం - మనిషి దేహమునంధలి నాడులు .


 ఈ ప్రపంచం నందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అంతకు మించి మనిషి దేహం నందు కలవు. భగవంతుడు తన శక్తి నంతటిని మనిషి శరీరం నందు వెన్నముక క్రింద బాగం లొ వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతం గా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు కరెంటు హై టెన్షన్ వైరల దగ్గర వినిపిస్తుంది . అదే సుషుమ్న నాడి. అందలి రక్త ప్రసరణ , శక్తి ఆ శబ్దం చేయును . ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రొజులలొ శక్తివంతుడు కావొచ్చు. 


     ఈ పొస్ట్ లొ మనిషి యెక్క దేహం లొని నాడులు గురించి వివరించుతున్నాను....


  శరీరం నందలి మూలాధారం నకు మీదగా నాభి స్థానమునకు మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియోకటి కలదు. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి.మనుషుల దేహంబున సుక్ష్మ,, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలు ఉన్నవి.ఈ నాడులు ములాదారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధొ (క్రిన్ధ ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగము గా వ్యాపించి ఉన్నాయి . మరియు పై నాడులను ఆశ్రయించి 3 కొట్ల 50 లక్షల రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములు గా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సుక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాధి వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండెను. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యొగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విదంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది. అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గందాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాదారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రదాన నాడులు సుక్ష్మ చిద్రములతో కూడి  యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిద అన్నపానదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును . 


         పైన చెప్పిన నాడులలో ఇళా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్త జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలుమ్బస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి. ఈ పదనాలుగు నాడులలో ఇళా నాడి మొదలు చారాణా నాడి వరకు గల పది నాడులు ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. అందువలన ఇవి ప్రదాన నాడులుగా గుర్తిన్చబడుతున్నవి . ఇళా , పింగళ , సుషుమ్న  అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును . గాంధారి, హస్తజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షినాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామబాగంబున వ్యాపించి ఉండును. మద్య బాగం నందు ఉండే పుషు అను ప్రసుతికా నాడి సమస్త కార్యంబులను చేయును .


         వామ నాసిక యందు ఇళా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంద్రంబు యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తజిహ్వ, దక్షిణ కర్ణంబు పుషాయు , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుసం , శిశ్న ములంబున కుహువు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులు ను ఆశ్రయించి ఉండును.


          ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేహ దత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును. కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారనముకు ఉపయుక్తమై ఉండును. పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్ర కలుగును.


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భార్గవ

తన పని కావలెనన్న 

ఆఫీసరు చేయి తడుపక తప్పదు ఎవరికైనా 

ఇరుసునఁ గ్రీసు పెట్టక 

ప్రెసిడెంటు కారు కూడా కదలదు భార్గవ


ఇల్లాలి మదినేప్పుడు నొప్పింపకు 

తన తప్పు ఏదియు లేనపుడు 

ఉరక తన సతి  కన్నీరొలికిన  

ధన లక్ష్మి ఇంట నుండదు భార్గవ



ప్రేమను సతి సుతులతో వర్తింపుము 

అనవసరపు వాదుల ప్రోత్సహించకు 

ప్రశాంతముగా ఇల్లు వున్న 

సంపదలు కలుగు భార్గవ


ఈడు వచ్చిన పుత్రుని జోడుగా తలువుము 

వాని బుధ్దికెపుడు తోడుగా ఉండుము 

సుతుని ప్రజ్ఞతోటె నీకు శుభము కలుగు 

ప్రేమ లేని ఇల్లు కష్టముల నెలవురా  భార్గవ


భార్య నీకు బానిస కాదు 

ప్రతి విషయంలో సగ భాగము అగు 

సంపద వచ్చిన తరి పరసతి గూడుట 

ఏరుదాటి తెప్ప కాల్చిన విధము భార్గవ 


తల్లి తండ్రుల యెడ ప్రేమయు 

గురువుల ఫై గౌరవము 

భగవంతుని యందు భక్తియు 

పిల్లలకునేర్పింప వలెను భార్గవ 






దుర్గా సప్త శ్లోకీ

  దుర్గా సప్త శ్లోకీ చదువుకోమని పూజ్యగురుదేవులు వాగ్దేవీ వరపుత్ర డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గత ఏడాది  "అభయ వాక్యాలు"  శీర్షికలో చెప్పేరు . అవసరమైన వారికోసం ఆ శ్లోకాలు క్రింద ఇవ్వబడుతున్నాయ్  .ఎన్నిమార్లు అయినా చదువుకోవచ్చును


శివ ఉవాచ :-

దేవి త్వం భక్తసులభే సర్వకార్యవిధాయినీ !

కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః !!


దేవ్యువాచ:-

శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ !

మయా తవైవ స్నేహేనాప్యమ్బాస్తుతిః ప్రకాశ్యతే !!

అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషిః

అనుష్టుప్ ఛందః


శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసర్వస్వత్యో దేవతాః !

శ్రీ దుర్గాప్రీత్యర్థం సప్తశ్లోకీదుర్గా పాఠే వినియోగః !!

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా !

బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి !!


దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః !

స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !

దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా !

సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా !!


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే !

శరణ్యేత్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే !!

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే !

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!


సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తిసమన్వితే !

భయోభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!

రోగానశేషానపహంసి తుష్టా !

రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్ !!


త్వామాశ్రితానాం న విపన్నరాణాం !

త్వమాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి !!

సర్వాబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి !

ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివానాశనమ్ !!


ఇతి శ్రీ సప్తశ్లోకీ దుర్గా సంపూర్ణమ్.


ఈరోజు అభయవాక్యాలుగా దుర్గా సప్తశ్లోకీతో పాటుగా స్మరించుకోమని చెప్పిన మరొక ఐదు శ్లోకాలు:

౧. శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే,

ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ.

౨. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే,

భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి.

౩. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే,

యాని చాత్యంతఘోరాణి తైరక్షాస్మాంస్తథా భువమ్.

౪. ఖడ్గశూల గదాదీని యాని చాస్త్రాణి తే2ంబికే, 

కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః.

౫. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి,

ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరివినాశనమ్.

మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...??

 *_నేటిమాట_*


*మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???*


భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!


-- ఆదిశంకరుల వారు --


*విశేషం_ పుణ్యాహవాచనం :*


ఇది యొక శుద్ధి కర్మ , ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి

కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై ఉంచి మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని పొందుతారు...


*తాత్పర్యము :*

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 

నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను చుట్టి , సంతోషము అనే నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 

జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ

రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.

*( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం )*


*వివరణ:*

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,

అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 

పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా చల్లాలి... ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు...

 అలాగే భక్తుల,హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య

క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి

చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు...


శంకరులు ఇలా అన్నారు...

ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప, దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదించాలి...

దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి, పుణ్యాహవాచన

కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. 

ముందుగా కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  

నామనస్సనే కలశం ప్రసన్నంగా 

స్వచ్ఛంగా వుంది... 

కలశానికి దారాలు ఛుట్టాలి, నేను నాభక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. 

నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను...

కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 

దొరికిన ఆ చిగుళ్ళు...

అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 

నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను, ఇంక కలశంపై ఒక ఫలం ఉంచాలి...

నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. 

తరువాత మంత్రాలు చదవాలి.  

నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని చదువుతాను. 

ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ, వాక్కూ పవిత్రమవుతాయి. 

ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 

చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని,  

ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.


                           *_🌷శుభమస్తు🌷_*

                   🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

తృప్తి

 తృప్తి (ఓ మంచి కాఫీ లాంటి కథ)

 (వాట్ అప్ సేకరణ....అసలు రచయిత ఎవరో తెలియదు.)


కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది. 

నేను, మా ఆవిడ క్యాబ్ దిగి లోపలకు వెళ్ళగానే

 "అక్కా! బాగున్నావా? అంటూ ఒకావిడ ఆప్యాయంగా పలుకరిస్తూ, దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువుల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇక చూడాలి ఆ ఆత్మీయ పలుకరింపుల జడివాన.

 "ఏం వదినా! బాగున్నావా?" ,

" ఏం పిన్నీ! ఇంత ఆలస్యంగా వచ్చావేం? " 

"అవునే అమ్మాయి! ఇల్లా చిక్కిపోయావేమిటే?"

"అత్తా! నువ్వు వస్తే గానీ సందడి రాలేదు " 

అలా రక రకాల పలుకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి

" నేను బాగానే వున్నాను. మీరందరూ బావున్నారా?" అని అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది.

 నేను మా ఆవిడ వున్న వైపు అడుగులు వేసాను. అడపా దడపా, నేను కూడా నా శ్రీమతి తో  ఫంక్షన్లకు వెళ్ళడం వల్ల నేను అక్కడ వున్న చాలా మందికి పరిచయస్తుడనే.

అక్కడ ఒక కుర్చీలో సెటిల్ అయిపోయి తెలిసిన వాళ్ళను పలుకరించడం మొదలుపెట్టాను. 

మా ఆవిడ చలాకీగా తిరుగుతూ, సంతోషంగా నవ్వుతూ, అందరినీ పలుకరిస్తూ,  వారి వారి కష్ట సుఖాలు అడిగి మరీ తెలుసుకోసాగింది. 

"అత్తా! ఏమిటి చాలా పాడైపోయావు? కిందటి సారి నిన్ను చూసినప్పుడు బాగానే వున్నావు" అని మా ఆవిడ పలుకరింపు విని అటు వైపు నా దృష్టి సారించాను. ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి వుంది.

ఆ ముసలావిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ " వయసు అయిపోయింది కదే " అని నెమ్మదిగా అంది.

"ఎప్పుడూ చలాకీగా వుండే నీ లాంటి వారిపై వయసు ప్రభావం వుంటుందంటే నేను నమ్మను" అని నా శ్రీమతి నవ్వింది. 

ఇంతలో పెళ్లి బాజాలు మ్రోగటంతో అందరూ అక్షింతలు పట్టుకుని స్టేజ్ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు.

"అక్కా! క్రిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావొ, ఏమిటో, అంతవరకూ పెళ్లి అంటే విముఖత చూపిన అది ఇప్పుడు పెళ్లికి సుముఖంగా వుంది.  అంతే కాదు దాని ప్రవర్తనలో కూడా  చాలా మార్పు కనిపించింది.  కోపం, తొందరపాటు తనం బాగా తగ్గించుకుంది. ఇప్పుడు దానికి సంబంధం కుదిరింది" అని ఆనందంగా చెప్పింది పెళ్ళిలో మొదట పలుకరించిన ఆవిడ.

"చాలా మంచి కబురు చెప్పావ్!" అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి.

"పిన్నీ! మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో?" బాధ వెళ్ళగక్కుకుంది మరొకావిడ.

"ఏం భయపడకు.  నీకు ఏ మాత్రం అనుమానం వున్నా, పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయ్.  బాబాయ్ గారు కూడా తీరికగానే వున్నారు" అని భరోసా ఇచ్చింది నా శ్రీమతి.

దాంతో ఆవిడ ముఖం వికసించి, "థాంక్స్" చెప్పింది.

అందుకే అందరూ  నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు. తన దగ్గర ఏముంది, ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది. 

పెళ్లి అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి, తన అత్తయ్య  కష్టాలలో వున్నట్లు తెలుసుకుంది. వున్న ఒక్క కొడుకూ ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ సరిగ్గా చూడటం లేదని బంధువులు  చెప్పగా వింది.

భోజనాలు అయ్యాక నా శ్రీమతి  "రండి. ఒకసారి మా అత్తయ్య ను పలుకరిద్దాం" అని పిలిచింది.

"సరే, పదా" అని తనను అనుసరించాను.

"బాగున్నారా పిన్నీ గారూ?" అని ఆవిడను పలుకరించేను.

"దేవుడి దయ వల్ల బాగానే వున్నాను బాబూ" అని సమాధానమిచ్చింది.

నా శ్రీమతి, వాళ్ళ అత్త దగ్గరకు వెళ్ళి, ఆమె చేతులను ఆప్యాయంగా అందుకుని

"అత్తా! నాకు ఒక సాయం చేయగలవా? రిటైర్ అయిన తర్వాత  మీ అబ్బాయి గారికి జిహ్వ చాపల్యం పెరిగి రోజుకొక రకం వంట చేయమని నన్ను తినేస్తున్నారు. ఇంత కాలం ఈయన గారికీ, పిల్లలకూ కారేజ్ లు కట్టీ కట్టి అలసిపోయాను.  ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట వుండడం వల్ల, ఈయనగారు రిటైర్ అవడం వల్ల కొంత వూపిరి తీసుకో గలుగుతున్నాను. ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక ఏవేవో పిండివంటలు చేయమని కోరుతున్నారు.  నాకేమో నడుము నొప్పి కూడా వచ్చింది. పనిమనిషి వున్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు ఎవరైనా 'నా వారు' అనే వారు పక్కన సాయంగా వుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది.  ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండకూడదూ" అని అర్థించింది.

నా మీద అంత అభాండం వేసేసరికి నేను ఖంగుతిన్నాను.

"నేనెప్పుడు నిన్ను అది చెయ్యమని, ఇది చెయ్యమని వేధించాను?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించాను.

 "చూసావా అత్తయ్యా! ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయనగారికి నచ్చదు." అని టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి.

మా ఆవిడ సమయస్ఫూర్తి కి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.

"పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా?" ప్రశ్నించింది ఆవిడ.

"ఆ ముచ్చటా తీరిపోయింది. వంట మనిషిని పెట్టుకున్నాము.  ఆవిడ ఏ రోజూ సమయానికి రాలేదు కదా, రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేయదు. ఏ రోజు వస్తుందో, రాదో తెలియక ఆవిడ కోసం చూసి, చూసి, సమయం వృధా చేసుకుని, తర్వాత వంట పని చేసుకోవాలంటే చిరాకు వచ్చేది. పైగా మన లాగ పద్ధతిగా పని చేయరు.  ఎన్ని సార్లు వాళ్లకు పని చేసే పద్దతి నేర్పినా కూడా వాళ్ళ పద్దతి లోనే వాళ్ళు పనిచేస్తారు.  స్టౌ మంట ఎక్కువ పెట్టీ, గిన్నెలు మాడ్చేసి, స్టౌ చుట్టూ పథార్థాలు జల్లేసి, వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకుని తినేసేది అనుకో" అని తన గోడును వెలిబుచ్చింది.

"మా ఇంటిలో ఇన్ని సీన్లుఊఋ జరిగాయా!" అని ఆశ్చర్య పోవటం నా వంతైంది. అబద్ధాలంటే అసహ్యించుకునే మా ఆవిడ అతి సులభంగా ఇన్ని అబద్ధాలు ఆడిందంటే దానికి తిరుగులేని కారణమేదొ తప్పకుండా వుండే వుంటుంది అని అనుకున్నాను..

"అయ్యో! అలా జరిగిందా? నేను వచ్చినా నీకు సుఖం వుండదే. నా బరువు కూడా నువ్వే మొయ్యాలి. ఆరోగ్యం బాగుంటే నెల రోజులు ఏమిటే? ఒక సంవత్సరం పాటు వచ్చి వుండేదాన్ని" అని బలహీనంగా చెప్పింది ఆవిడ.

" నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు.  మీ అబ్బాయి, కోడలితో మేము మాట్లాడతాం. నువ్వు మాతో వచ్చేసేయి" అని బలవంతంగా ఆవిడను వొప్పించింది నా శ్రీమతి.

తర్వాత, ఎవరూ పక్కన లేని సమయం చూసి నా శ్రీమతి "అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ప్రస్తుతం ఆవిడ కొన్ని కష్టాలకు  గురై అనారోగ్యం పాలైంది. ఆవిడను ఒక నెల రోజులు పాటు మనింట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను.  మనమేమాత్రం జాలితో ఆవిడను పిలిచామని అనిపించినా ఆవిడ రాదు.  అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది" అని గుట్టు విప్పింది.

మొత్తం మీద ముగ్గురము మా ఇంటికి వెళ్లిపోయాము.

"ఏంటీ! ఇవ్వాళ, పులిహోర, పాయసం కావాలా? రేపు దద్దోజనం, చక్ర పొంగలి చేయాలా? చాలా బాగుంది మీ కోరికల లిస్ట్" అని వంట గదిలోనుండి మా ఆవిడ అరుపులు విని నవ్వుకున్నాను. ప్రతి రోజూ నా పేరు చెప్పి "అత్తా! ఇవ్వాళ మీ అబ్బాయి గారు ఇది చేయమంటున్నారు, రేపు అది చేయాలంటున్నారు" అని రోజుకొక  రకం  పిండివంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి. మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే, నా శ్రీమతి  బలవంతంగా ఆవిడతో తినిపించింది.

"అత్తా! నువ్వు పక్కన నిలబడితే చాలు. నాకు చాలా ధైర్యంగా వుంటుంది.  ఏ పనైనా చేసెయ్యగలను"  అని అంటే ఆవిడ "ఇప్పుడు నేను నిలబడటం తప్పితే ఏం చేస్తున్నానే" అంటూ సిగ్గు పడింది.

 "మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్ర పట్టటం లేదు బాబూ" అని ప్రతి రాత్రి ఆవిడతో నే పక్క గదిలో పడుకుని పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేసేది.

వేళకు తిన్న తిండి కంటే,

ఈ నెల రోజులలో నా శ్రీమతి చూపెట్టిన ఆప్యాయతకు, అనురాగానికి, ఆ ముసలావిడ ఆరోగ్యం చాలా, చాలా మెరుగైంది. ఆవిడే స్వయంగా నా శ్రీమతి తో 

" మా అబ్బాయిని ఇక రమ్మనవే. ఇంటికి వెళతాను" అని చెప్పింది.

నా శ్రీమతి  వొప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం వుండాలని బలవంతం చేసింది.

అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్లతో  " ఒసేయ్! దేవుడు నీకు ఎంత మంచి మనసును ఇచ్ఛాడే. ఇక్కడకు వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నువ్వు నాకు సాయం చేయడానికే తీసుకొచ్చావు అని. నడుం నొప్పి వంకతో నన్ను తీసుకువచ్చి, మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు.  మీ ఆయన పేరు చెప్పి రక రకాల రుచికరమైన వంటలు చేసి నాతో తినిపించావు. మీ ఆయన గురక పెడతాడు అని అబద్దం చెప్పి రాత్రిళ్ళు నా పక్కనే పడుకుని, తియ్యటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో తిరిగి వుత్సహాన్ని నింపావు.

కొన వూపిరితో వున్న నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేవు. వచ్చే జన్మలో నైనా నీ ఋణం తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను" అని చేతులు రెండూ జోడించింది.

"తప్పు అత్తా! నీ లాంటి వారు నాకు దణ్ణం పెట్టకూడదు.  ఆశీర్వదిస్తే చాలు" అని ఆప్యాయంగా కౌగలించుకుంది నా శ్రీమతి. 

"పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా వుండాలి.  మీరు చల్లగా వుంటే పది కుటుంబాలని మీరు చల్లగా వుండేటట్లు చేయగలరు" అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది.

ఈ  దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి.

మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని పిలిపించింది.  తల్లి లోని వుత్సాహం, ఆనందం చూసి అతను ఆశ్చర్య పోయాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, వాళ్ళఫ అత్తయ్యను వంట గదిలోకి పని మీద పంపి,   నా శ్రీమతి ఆ అబ్బాయితో  " నిన్ను ఎంత ముద్దు, మురిపెంగా మీ అమ్మ పెంచిందో నాకు తెలుసు.  ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ కూడా వస్తుంది. అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి? మనిషి బ్రతికి వున్నప్పుడే చేయగలిగింది చేయాలి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడి కట్టినా ప్రయోజనం లేదు. నీ చదువు నీకు సంస్కారం నేర్పలేదా? ఇంకోసారి మీ అమ్మని బాధ పెట్టేవని నాకు తెలిస్తే నేను వూరుకోను. ఈ వయసు వాళ్లకు ప్రేమ, అభిమానాలు పుష్కలంగా కావాలి. ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో" అని మెత్తగా చివాట్లు వేసింది.

"అమ్మకూ, నా భార్యకు, తేడాలు వచ్చి ఇలా జరిగింది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనీయను" అని సిగ్గుతో తల దించుకున్నాడు అతను. 

మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది.

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

what is the reason for this tradition?

 Question~ After darshan in the temple, sit down on the stairs/platform outside for a while.  But why sit for a while?


     Answer ~ Tradition is that after visiting any temple, we come out and sit for a while on the foot of the temple. Do you know what is the reason for this tradition?

     

I This ancient tradition is made for a specific purpose. In fact, quietly sitting on the foot of the temple, one should recite a shloka. People of today have forgotten this verse. Contemplate this shloka and share it with the next generation also.

 The shloka is like this~


              *अनायासेन मरणम् ,*

            *बिना देन्येन जीवनम्।*

            *देहान्त तव सानिध्यम् ,*

            *देहि मे परमेश्वरम्॥*


            * Anayasen Maranam

            * Bina denyen jeevanam.*

            *Dehanth tav saanidhyam,*

            *Dehi mey Parmeshwaram*


      The meaning:

  *Anayasen Maranam* means that we should die with ease, without any trouble and never fall sick and be confined  to the bed, don't die by suffering but let our lives go as we go about daily life.

  *Bina denyen jeevanam* means there should be no life of dependency. Never have to be with anyone for support. Just as a person becomes dependent on others when he is paralyzed, do not be paralyzed or helpless. By the grace of Thakur ji,  (Krishna ji) life can be lived without being dependent and begging.

  *Dehante tav sanidhyam* means that whenever death comes, let it be in God’s presence. As at the time of death of Bhishma Pitamah, Thakur (Krishna ji) himself stood in front of him. Let life be released while having this darshan. 

  *Dehi mey Parmeshwaram* O God, grant us such a boon.


 Recite the above verse while praying to God. Do not ask for job, car, bungalow, boy, girl, husband, wife, house, money etc. (ie worldly things), this God himself gives you according to your eligibility. . That is why one must sit and pray this prayer after having darshan. This is a prayer, not a solicitation or begging. Prayer is not for worldly things like for home, business, job, son, daughter, worldly pleasures, wealth or other things, whatever is requested like this is begging.


     The word 'prarthana' means -  'pra' means 'special’, ‘best’, ‘highest’ and 'arthna' means request. Prayer thus means ‘special and highest request’.


     The darshan of God in the temple should always be done with open eyes. Some people stand there with their eyes closed. Why close our eyes, when we have come to see?  Open your eyes and look at the form of God, nija-swarupa, of the divine feet, of the lotus face, of the shringar, take full enjoyment, fill your eyes with the beautiful nija-swarupa.

      When you then sit outside after darshan, then meditate on the form you have seen with your eyes closed. Meditate on your own soul within, closing your eyes and if God does not appear in meditation, then go back to the temple and have darshan again.

జానపద జాదూ... కదిరి వెంకటరెడ్డి

 🤔🤔జానపద జాదూ... కదిరి వెంకటరెడ్డి🤔🤔


        🙏జులై1కె వి రెడ్డి గారి 109వ జయంతి🙏


తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును, మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. ‘భక్తపోతన’, ‘పాతాళభైరవి’, ‘పెద్దమనుషులు’, ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా మరచిపోలేరు. ఆ రోజుల్లోనే ఆధునిక వివాహ వ్యవస్థ మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం నిర్మించి ప్రశంసలు అందుకున్న మహానీయుడాయన. ఆయన సినిమాలు రంగుల కాలంలో రాలేదు... 



కానీ ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు చూస్తుంటే వానవెల్లి రంగులన్నీ అంతర్లీనంగా కనపడుతూనే వుంటాయి. ఆయన సినిమాలు సినిమా కళకే పాఠ్య పుస్తకాలుగా పరిగణించవచ్చు. ఖద్దరు పంచె కట్టు, ఫ్రెంచి మీసకట్టు, పొట్టిచేతుల చొక్కా, మెడచుట్టూ తెల్ల తువాలుతో అచ్చం పల్లెటూరి రైతులా కనపడే కె.వి.రెడ్డి బి.ఎస్‌.సి (ఆనర్స్‌) పట్టభద్రులంటే వెంటనే నమ్మలేం. డిసెంబరు శీతాకాలంలో ‘‘జలకాలాటలలో’’ పాటను ‘జగదేకవీరుని కథ’ కోసం చిత్రీకరించవలసి వచ్చినప్పుడు ప్రొడక్షన్‌ మేనేజర్‌కు ‘ఫుట్‌ నోట్‌’లో ‘‘కొలనులో వేడి నీళ్లను సిద్ధం చేయాలి’’ అని రాసిపెట్టి రెండ్రోజుల్లో చిత్రీకరించాల్సిన పాటను ఒక పూటలోనే పూర్తిచేసి ఆ నాయికలకు ఉల్లాసం కలిగించిన దర్శకడు మరొకరు వుండరు. కె.వి.రెడ్డి (జూలై 1, 1912) 109 వ జయంతి. ఆ సందర్భంగా ఆ మహనీయుని గుర్తించి కొన్ని విశేషాలు...


* బాల టామ్‌ సాయర్‌గా...


కె.వి.రెడ్డి అనే కదిరే వెంకటరెడ్డి సొంతవూరు అనంతపురం జిల్లా, తాడిపత్రికి దగ్గరలోవున్న తేళ్ళమిట్టపల్లి గ్రామం. కె.వి. రెడ్డి తండ్రి కొండారెడ్డి ఆ వూరి మునసబు... నూట యాభై ఎకరాల భూస్వామి. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ గ్రామంలో చదవను, రాయను నేర్చింది కొండారెడ్డి ఒక్కరే. కె.వి.రెడ్డి ఆయనకు ఏకైక సంతానం. కె.వి.రెడ్డి తల్లిది తాడిపత్రి. వారిది కూడా సంపన్న కుటుంబమే. అందరూ విద్యావంతులే. కె.వి.రెడ్డి మాతామహుయుడు తాసిల్దారు వుద్యోగం చేశారు. కె.వి.రెడ్డి పుట్టింది తాడిపత్రిలో మాతామహుల ఇంటనే. ఆయనకు రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి కొండారెడ్డి కాలం చేశారు. దాంతో కె.వి.రెడ్డి, తల్లితో సహా తాడిపత్రిలోని మాతామహుల ఇంటికి వచ్చేశారు. ఆయన చదువు సంధ్యలు మేనమామ పర్యవేక్షణలో తాడిపత్రిలోనే జరిగాయి. భర్త మరణించడంతో తట్టుకోలేని కె.వి.రెడ్డి తల్లి వైరాగ్యం చెంది కుమారుని పెంపకం గురించి పట్టించుకోలేదు. 


కె.వి.రెడ్డి బాల్యం ఆహ్లాదకరంగా సాగింది. మార్క్‌ ట్వేన్‌ పాత్ర టామ్‌ సాయర్‌లాగే ఈతకొట్టటం, చేపలు పట్టటం, కొండలెక్కటం, పోలాలమీదకు వెళ్లి అజమాయిషీ చెయ్యటం వంటి పనులు ఎంతో ఆసక్తికరంగా చేసేవారు. స్మశానానికి వెళ్లి ఎముకలు ఏరుకొనివచ్చి వాటిని పరిశోధించేవారు. స్కూలు ఫైనల్‌ వరకు కె.వి.రెడ్డి తాడిపత్రిలోనే చదివారు. నాలుగవ తరగతి మొదలు స్కూలు ఫైనల్‌ వరకు కె.వి.రెడ్డికి ఒక జిగరీ దోస్త్‌ ఉండేవాడు. ఇద్దరూ ఒకే బెంచిలో కూర్చోనేవారు. అతని పేరు మూలా నారాయణ స్వామి. ఇద్దరికీ చాలా పెద్ద పెద్ద పనులు చేయాలనే ఊహలు ఉండేవి. చిన్నతనం నుంచే అందుకోసం ప్రణాళికలు వేసుకుంటూ వుండేవారు. వారు చదువుకునే రోజుల్లో ఆ వూరికి బయస్కోప్‌ వచ్చింది. మిత్రులిద్దరూ సినిమాలు చూసేవారు. ఆ సినిమాల తీరు వారికి వింతగా తోచేది. ఎప్పటికైనా సినిమాలు నిర్మించాలని ధృడంగా ఆశించారు. పదిహేనేళ్ల వయసులోనే సినిమా నిర్మాణం కోసం లొకేషన్‌ కూడా నిర్ణయించేశారు. వారి వూరికి ఐదు మైళ్ల దూరంలో ఒక చిన్న కొండ, దాని ప్రక్కనే ఒక లోయ, ఆ లోయ మధ్యలో చిన్న నీటి ప్రవాహం ఉండేది. తమ స్నేహితులతో వీరిద్దరూ తరచూ అక్కడకు వెళ్లి వారి ఊహలకు రూపమిస్తూ, వాటిని స్నేహితులతో చర్చిస్తూ ఆనందిస్తూ వుండేవారు. ఎప్పటికైనా ఆ లొకేషన్‌లో సినిమా నిర్మించాలనేది వారి అభిలాష.



కె.వి.రెడ్డికి ప్రతి సబ్జెక్ట్‌లోనూ మొదటి మార్కులు వచ్చేవి. ఆ రోజుల్లోనే వీరిద్దరూ ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడల్లోనూ, పరుగు పందెం వంటి జిమ్నాస్టిక్స్‌లోను ముందుండేవారు. 1930లో కె.వి.రెడ్డి స్కూలు ఫైనల్‌ పరీక్షలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (ప్రెసిడెన్సీ) మొత్తం మీద రెండవ స్థానంలో నిలిచారు. అయితే స్నేహితుడు నారాయణ స్వామి మాత్రం స్కూలు ఫైనల్‌ తప్పారు.


* మద్రాసుకు మకాం..


అనంతపురంలో కాలేజి ఉన్నా తను మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదవాలని కోరడంతో వారి కుటుంబ సభ్యులు కె.వి.రెడ్డిని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చారు. అప్పట్లో విక్టోరియా హాస్టల్‌లో కె.వి.రెడ్డి వుండేవారు. మద్రాసులో అడుగు పెట్టాక తరచూ సినిమాలు... ముఖ్యంగా ఇంగ్లీషు సినిమాలు చూడడం అలవాటయింది. అయితే ఆ సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే చూసేవారు కాదు. భాషా జ్ఞానం పెంచుకోవడం కోసం, ఆ సినిమాల్లో మంచి విషయాలను గుర్తుపెట్టుకొని విశ్లేషించుకోవడం కోసం చూసేవారు. సినిమా వాల్‌ పోస్టర్లను కూడా నిశితంగా పరీక్షించి వాటి ప్రయోజనాన్ని ఆకళింపు చేసుకోనేవారు. అందువలన సినిమాల్లోకి రాకపూర్వమే కె.వి.రెడ్డికి చిత్రనిర్మాణం గుర్తించి, ప్రచార సాధనాల గురించి మంచి అవగాహన వుండేది. కె.వి.రెడ్డి 1935లో బి.ఎస్సీ (ఆనర్స్‌ ...అంటే ఎం.ఎస్సీకి సమానం) పూర్తి చేశారు. 


ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేబట్టిన పట్టాభి రామారావు, ‘ఆంధ్ర మహిళా’ సంపాదకులు ఎ.వి.వి.కృష్ణారావు, ఎం.కె.వి.రెడ్డి వీరికి సహాధ్యాయులు. ప్రముఖ దర్శక నిర్మాత పి.పుల్లయ్య కాలేజిలో కె.వి.రెడ్డికి ఒక సంవత్సరం సీనియర్‌. కె.వి.రెడ్డి ఆనర్స్‌ డిగ్రీ పూర్తీ చేసేనాటికే పి.పుల్లయ్య సినిమా రంగంలో ప్రవేశించి స్టార్‌ కంబైన్స్‌ వారు నిర్మించిన ‘హరిశ్చంద్ర’ చిత్రానికి దర్శకుడు టి.ఎ.రామన్‌కు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కె.వి.రెడ్డి రాత్రిపూట పుల్లయ్యతో కలిసి స్టార్‌ కంబైన్స్‌ లాడ్జిలో కూర్చొని సినిమాలకు పనికి వచ్చే కథల గురించి చర్చించుకునేవారు. వారు చర్చించుకున్న కథలన్నీ కాలక్రమంలో సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి! ఆనర్స్‌ డిగ్రీ ప్రధమ శ్రేణిలో పాసైనా కె.వి.రెడ్డికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరకు టీచర్‌ ఉద్యోగానికి దరఖాస్తు పెడితే బోధనానుభవం లేదని నిరాకరించారు. దాంతో కె.వి.రెడ్డి తన సహాధ్యాయి ఎ.వి.వి.రెడ్డితో కలిసి ‘ది స్టాండర్డ్‌ సైంటిఫిక్‌ ఇన్స్ట్రుమెంట్స్‌ కంపెనీ’ని ప్రారంభించారు. స్కూళ్లకు, కాలేజీలకు కావలసిన శాస్త్రోపకరణాలను ప్రామాణికంగా తయారుచేసి సరఫరా చేసేవారు. ఈ వ్యాపారం లాభసాటిగా మారింది.


* రోహిణీ ఫిలిమ్స్‌ నుంచి వాహిని సంస్థకు...


1937లో మూలా నారాయణ స్వామి కె.వి.రెడ్డికి తాడిపత్రి నుంచి కబురంపారు. తను రోహిణీ ఫిలిమ్స్‌ అనే సినిమా కంపెనీలో భాగస్తుడుగా చేరినట్లు, కె.వి.రెడ్డికి సినిమాల మీద ఆసక్తి వుంటే తనుకూడా అందులో చేరవచ్చని ఆ కబురు సారాంశం. కె.వి.రెడ్డి మిత్రుడు ఎ.వి.వి.రెడ్డితో ఈ విషయం మీద చర్చిస్తే ‘ఆరునెలలు వెళ్లి చూసి లాభాదాయకమనిపిస్తే సినిమా రంగంలో స్థిరపడు. లేకుంటే మన కంపెనీ ఉండనే వుంది కదా’ అని మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహామీద కె.వి.రెడ్డి రోహిణీ ఫిలిమ్స్‌ సంస్థలో చేరారు. ఈ రోహిణీ సంస్థను హెచ్‌.ఎం.రెడ్డి స్థాపించగా అందులో నారాయణస్వామి తోబాటు బి.ఎన్‌.రెడ్డి, ఛాయాగ్రాహకుడు రామనాథ్, కళాదర్శకుడు శేఖర్, బ్రిజ్‌ మోహన్‌ దాస్, నాగిరెడ్డి, సముద్రాల రాఘవాచార్య భాగస్వాములు. ఈ బ్యానర్‌ మీద నాగయ్య హీరోగా ‘గృహలక్ష్మి’ సినిమా నిర్మించారు. అందులో కె.వి.రెడ్డి తొలుత క్యాషియర్‌. సైన్స్‌ విద్యార్థి కనుక సౌండ్‌ రికార్డింగ్‌ నేర్చుకోవాలనిపించినా, షూటింగులన్నిటికీ హాజరవుతూ నిర్మాణ కార్యకలాపాలని, ఎడిటింగ్, రీ-రికార్డింగ్‌తో సహా అన్ని ‘క్రాఫ్టు’లలోని విభాగాలను క్షుణ్ణంగా గమనిస్తూ అధ్యయనం చేయసాగారు. ఆ సినిమా విడుదలవుతుండగానే మూలా నారాయణ స్వామి రోహిణీ సంస్థ నుండి విడిపోయి బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, బ్రిజ్‌ మోహన్‌ దాసు, కె.వి.రెడ్డి, నాగయ్యలను కలుపుకొని వాహినీ సంస్థను స్థాపించారు. వాహినీ సంస్థ కె.వి.రెడ్డి పెరుగుదలకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని కల్పించింది. సంస్థలో అందరూ విద్యావంతులే కావడం, బి.ఎన్‌. రెడ్డి అందరికన్నా పెద్దవాడు కావడంతో ఆయన నేతృత్వంలో పనిచేయడంతో వాహినీ సంస్థకు మంచి బీజం పడింది. వాహిని పిక్చర్స్‌ బ్యానర్‌ మీద బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం ‘వందేమాతరం’. ఇందులో కె.వి.రెడ్డి నాగయ్య సహాధ్యాయిగా నటించారు. తరువాత బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’, ‘దేవత’ చిత్రాలకు కె.వి.రెడ్డి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశారు. అయినా ప్రొడక్షన్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ కె.వి.రెడ్డి ఇమిడిపోయేవారు.. అంతే కాదు ఆ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు కూడా.


* దర్శకుడుగా ‘భక్తపోతన’...


1941లో ‘దేవత’ చిత్ర నిర్మాణం పూర్తి, విడుదలయ్యాక మూలా నారాయణస్వామి ప్రోత్సాహంతో కె.వి. రెడ్డికి దర్శకత్వం నిర్వహించే అవకాశం దొరికింది. అందుకు తను ఎన్నుకున్న కథ ‘భక్తపోతన’. దర్శకత్వంలో ఏమాత్రం అనుభవం లేని కె.వి.రెడ్డిని దర్శకుడిగా నియమించడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నారాయణస్వామి కల్పించుకొని ‘ఈ సినిమా ద్వారా లాభం వస్తే కంపెనీది. నష్టం వస్తే నాది’ అని గట్టిగా చెప్పి కె.వి.రెడ్డికి భరోసా కల్పించారు. ‘దేవత’ చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడే కె.వి.రెడ్డి రాత్రిపూట సముద్రాలతో కూర్చొని పోతన గురించి చర్చలు జరిపేవారు. అలా ‘భక్త పోతన’ స్క్రిప్టు పనులు పూర్తిచేసిపెట్టుకున్నారు. అనుభవజ్ఞుడైన రామనాథ్‌ చేత స్కీన్ర్‌ ప్లే రాయించారు. కొందరు భాగస్వాములు పోతన పాత్రకు దైతా గోపాలం పేరును ప్రతిపాదించినా కె.వి.రెడ్డి మాత్రం నాగయ్యనే తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జపాన్‌ వాళ్లు కోస్తా పట్టణాల మీద బాంబులు కురిపించారు. మద్రాసు మీద కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దాంతో యూనిట్‌ మొత్తం మద్రాసు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. ‘భక్తపోతన’ సినిమా అప్పటికి మూడువంతులు పూర్తయింది. సినిమా నెగటివ్‌ను భద్రపరచడానికి తాడిపత్రికి పంపించారు. అసలు ఈ సినిమా పూర్తవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. పరిస్థితులు కుదుటపడ్డాక మద్రాసు తిరిగివచ్చి మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ, ప్యాచ్‌ వర్కులు, ట్రిక్‌ షాట్లు పూర్తిచేసి సినిమా విడుదలకు సిద్ధం చేశారు. సినిమా 1943 జనవరి 7న విడుదలై డంకాబజాయించింది. కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది. పిఠాపురం రాజావారు ఈ చిత్రాన్ని చూసి ముగ్ధులై లక్షరూపాయల చెక్‌ను కె.వి.రెడ్డికి అందజేశారు. ఈ సినిమా ప్రభావం ఎలాంటిదంటే, ఒక కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా హటాత్తుగా జడ్జిగారు లేచి ‘ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే నేను ‘భక్తపోతన’ చిత్రాన్ని చూడడానికి వెళ్ళాలి’ అన్నారట. ఈ సినిమా చూసిన వాళ్ళెవరూ ఇది కె.వి.రెడ్డి తొలిచిత్రమంటే నమ్మరు. అపారమైన కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనబడుతుంది. ఈ సినిమా రాబడిలో పది శాతం వాటాగా మూలా నారాయణస్వామి కె.వి.రెడ్డికి ఇచ్చారు.


* తదుపతి చిత్రం ‘యోగి వేమన’ ...


‘భక్తపోతన’ విజయం మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. ఆ చిత్రం ‘యోగి వేమన’ (1947). కె.వి. రెడ్డికి వేమనయోగి అంటే ఎంతో అభిమానం. ఈ చిత్రానికి చేసినంత కృషి కె.వి.రెడ్డి మరే చిత్రానికీ చేయలేదంటే నమ్మితీరాల్సిందే. అదే కె.వి.రెడ్డి మాటల్లో చెప్పాలంటే ‘ఈ కృషిలో నాకు సముద్రాల వలన కలిగిన సహాయం అంతులేనిది. నా లోపాలన్నిటినీ ఆయన కమ్మేశారు’. వేమన తత్త్వం గురించి, వేదాంతం గురించి సముద్రాలకు బాగా తెలుసు. అదీ కాకుండా సముద్రాల ఈ చిత్ర కథ కోసం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి నిష్ణాతుల అభిప్రాయాలు సేకరించి వాటిని కథలో పొందుపరచారు. ‘కామికానివాడు కవి కాడు. కామిగాక మోక్షగామి కాడు. కామి అయినవాడు కవియగు, రవియగు’ అనే సూత్రాన్ని ‘యోగి వేమన’ చిత్రంలో చక్కగా పొందుపరచారు కె.వి.రెడ్డి. అనుభవాల బలం తప్ప సెంటిమెంట్ల బలహీనతలేని నాస్తికుడుగా వేమన పాత్రను రూపుదిద్దారు కె.వి.రెడ్డి. పసిపాప ‘జ్యోతి’ చనిపోతే, కాంత, కనకాల మధ్య కొట్టుమిట్టాట మానేసి విరాగిగా మారిన అంశాన్ని అద్భుతంగా చిత్రీకరించి సినిమాను సూపర్‌ హిట్‌ చేశారు. వేమనకు అతి గుప్తమైన ఆత్మవిద్యను భగవానుడు బోధించే సన్నివేశాన్ని, ఆ బోధన ఆధారంగా వేమారెడ్డి, యోగి వేమనగా పరిణామం చెంది చివరికి గుహలోనికి వెళ్ళిపోయే దృశ్యాన్ని కె.వి.రెడ్డి చిత్రీకరించిన విధానం నభూతో న భవిష్యతి అని చెప్పాలి. ఈ సన్నివేశ చిత్రీకరణలో యూనిట్‌ సభ్యులంతా కన్నీరుపెట్టుకున్నారు. దర్శకుడు ‘కట్‌’ చెప్పడం మర్చిపోయి నిశ్చేష్టులై నిలిచిపోయారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. దర్శక నిర్మాత వి.శాంతారాం ఈ చిత్రాన్ని చూసి కె.వి.రెడ్డి పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు. ‘యోగి వేమన’ చిత్రం న్యూటోన్‌ స్టూడియోలో నిర్మించారు. మేలురకం సినిమాలు తయారవ్వాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన స్వంత స్టూడియో వుండాలనిపించి మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియో నిర్మాణానికి నడుం బిగించారు. స్టూడియో నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. అప్పటికీ ఇండియాలో ఎక్కడాలేని ‘వెస్టెక్స్ర్‌ సౌండ్‌’ ఎక్విప్మెంట్‌ ఈ స్టూడియోలో అమర్చారు.


* వాహిని స్టూడియోలో ‘గుణసుందరి కథ’...


ఆ రోజుల్లో ‘బాలనాగమ్మ’, ‘గొల్లభామ’ వంటి జానపద చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో కె.వి.రెడ్డికి అటువంటి జానపద చిత్రాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అప్పటికి వాహినీ సంస్థ ఆరు సినిమాలు నిర్మించింది. ఆ సంస్థకు బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి ఒకరి తరువాత ఒకరు సినిమాలు చేయాలనేది ప్రత్యేక ఒడంబడిక. అయితే స్టూడియో నిర్మాణ పనుల్లో బి.ఎన్‌.రెడ్డి తలమునకలై ఉండడంతో కె.వి.రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ చిత్రమే బాక్సాఫీస్‌ హిట్‌ అయిన ‘గుణసుందరి కథ’. వాహినీ సంస్థకు ఆస్థాన రచయిత వున్న సముద్రాల ఇతర చిత్రాల రచనలో బిజీగా ఉండడంతో కె.వి.రెడ్డి కమలాకర కామేశ్వరరావు సూచనతో పింగళి నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. ‘కింగ్‌ లియర్‌’ నాటకం ఆధారంగా ‘గుణసుందరి కథ’కు రూపకల్పన జరిగింది. మూడు నెలల్లో స్క్రిప్టుతో సహా పాటలు కూడా తయారయ్యాయి. కె.వి.రెడ్డి, కమలాకర కలిసి స్కీన్ర్‌ ప్లే సిద్ధం చేశారు. కె.వి.రెడ్డి నిర్మాణ శైలే వేరు. స్క్రిప్టు సిద్ధం కాగానే ‘షాట్‌ డివిజన్‌’ చేసేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్లతో సీన్లు చదివించుకుంటూ స్టాప్‌ వాచీ పెట్టుకొని ఫుటేజ్‌ నోట్‌ తయారు చేసుకునేవారు. ఒక్కో సన్నివేశానికి ఎంత టైం పట్టేదో స్పష్టంగా నోట్‌ అయ్యేది. నటీనటుల వాచాకాన్ని బట్టి రెండు నిమిషాలు అటోయిటో జరిగేది. దాంతో ముడి ఫిలిం ఎంత అవసరమో తేలిపోయేది. కె.వి.రెడ్డి తీసిన సినిమాలు అన్నీ తన అంచనాకు మించి ముడిఫిలిం ఖర్చయిన దాఖలాలు లేవు. అందుకే కె.వి.రెడ్డిని ‘మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌’ అని ప్రశంసించేవారు. సినిమా షూటింగ్‌ వాహినీ స్టూడియో రెండు ఫ్లోర్లలో 1948 ఆగస్టు 13న ప్రారంభమైతే 1949 డిసెంబరు 29న సినిమాను విడుదల చేశారు. వినోదంతోబాటు సెంటిమెంటు కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. క్లాసు, మాసు తేడా లేకుండా జనం విరగబడి చూశారు. జనం కోరికమీద రోజుకి నాలుగు ఆటలు వేశారు.


* జై...‘పాతాళ భైరవి’....


1949 ప్రాంతంలో వాహిని స్టూడియో యాజమాన్యంతోబాటు, ఆబ్కారీ వ్యాపారం మరికొన్ని ఇతర సంస్థలు వున్న మూలా నారాయణస్వామి మీద ఆదాయపు పన్నుశాఖ రెయిడ్‌ చేసి ముప్పై లక్షల అపరాధ పన్ను వసూలు చేసేందుకు ఆస్తులు జప్తుచేసింది. వాహిని స్టూడియోను కాపాడాలని నారాయణస్వామి అప్పటికప్పుడు స్టూడియోని విజయా ప్రొడక్షన్స్‌ పేరిట లీజుకు ఇచ్చినట్లు రాశారు. తరువాత నారాయణస్వామి ఆర్ధిక పరిస్థితి క్షీణించి కాలంచేశారు. ఈ పరిస్థితుల మధ్య విజయా ప్రొడక్షన్స్‌ సంస్థను నాగిరెడ్డి, చక్రపాణి నిలబెట్టి ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విజయం సాధించకపోవడంతో కె.వి.రెడ్డిని ఒక జానపద చిత్రాన్ని నిర్మించవలసిందిగా కోరారు. అరేబియన్‌ నైట్స్‌ కథలను దృష్టిలో వుంచుకొని కె.వి.రెడ్డి పింగళితో ‘పాతాళ భైరవి’ కథను తయారు చేయించారు. కమలాకర, పింగళితో కలిసి స్క్రిప్టు, స్కీన్ర్‌ ప్లే సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. ఇందులో పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు చదివే మంత్రాల కోసం మంత్రపుష్పంలోని వేదమంత్రాలను తిరగరాయించి విచిత్రమైన భాషగా రంగారావు చేత పలికించారు. అలాగే పద్మనాభం చేత పలికించిన ‘మోసం గురూ’ అనే మాట తరువాతి కాలంలో ‘గురూ’ అనే మాటతో వూతపదమై కూర్చుంది. మాంత్రికుడు పలికే ‘సాహశం శాయరా....రాజకుమారి లభిస్తుందిరా’, ‘నరుడా ఏమి నీ కోరిక’, ‘ఏ డింబకా... ఏ బుల్‌ బుల్, ఏ డింగరీ’ వంటి మాటలు అందరి నోళ్లలో నానాయి. కేవలం 13 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం 10 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. బెంగుళూరు మినర్వాలో 30 వారాలు, గోల్డన్‌ గ్లోరీ థియేటర్‌లో 50 వారాలు ఆది రికార్డు సృష్టించింది. తరువాత 11 వారాలకు అరవై ప్రింట్లు వేసి ఆంధ్రదేశమంతా సినిమాను పంపిణీ చేశారు. ఈ సినిమాకు వచ్చిన లాభాలతో వాహినీలో ఇంకొక ఫ్లోరు నిర్మాణం చేశారు. సినిమా అఖండ విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం భారతీయ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. వాహినీ సంస్థ అధిపతి బి.ఎన్‌.రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుండగా తదుపరి వాహినీ వారి చిత్రాన్ని నిర్మించే బాధ్యత కె.వి.రెడ్డి మీద పడింది. ‘పాతాళభైరవి’ తరువాత మరలా మరో జానపదం తీయకుండా ఈసారి కె.వి.రెడ్డి సాంఘిక చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఆ చిత్రమే ‘పెద్దమనుషులు’(1954). ఈ చిత్రానికి కూడా పింగళి రచన చేయాల్సివుండగా, నాగిరెడ్డి సహకరించకపోవడంతో డి.వి. నరసరాజును రచయితగా తీసుకున్నారు. స్క్రిప్టు తయారయ్యాక నరసరాజు, కె.వి.రెడ్డిలతోబాటు డి.జి.బి.తిలక్‌ (డి.వి. సుబ్బారావు కుమారుడు) కలిసి స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. నరసరాజు సంభాషణలు సహజంగాను, పాత్రోచితంగాను ఉండడంతో ప్రేక్షకులకు చిత్రం బాగా నచ్చింది. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన మునిసిపల్‌ చైర్మన్‌ పాత్రకు జంధ్యాల గౌరీనాథ శాస్త్రిని తీసుకున్నారు. కీలకమైన తిక్క శంకరయ్య పాత్రలో రేలంగి లీనమై నటించారు. కొంత సినిమా రేవతి స్టూడియోలో చిత్రీకరించారు. గ్రూప్‌ విలనిజానికి ఈ సినిమా బీజం నాటింది. ‘శివశివమూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా’, ‘నందామయా గురుడ నందామయా’ పాటలు తెలియనివారెవరూ వుండరు. ఈ పాటలతో కొసరాజు రాఘవయ్య చౌదరి మంచి పేరుతెచ్చుకున్నారు. సమాజంలోని సమస్యల నేపథ్యంలో, వ్యంగ్య ధోరణిలో కె.వి.రెడ్డి రూపొందించిన ‘పెద్దమనుషులు’ సాంఘిక చిత్రాల విభాగంలో అజరామరంగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందిన తొలి తెలుగుచిత్రమిదే. కె.వి.రెడ్డికి ఇబ్సెన్‌ రాసిన నాటకాలంటే ఇష్టమే కాదు, ఇబ్సెన్‌ కె.వి.రెడ్డికి ఆరాధ్య దైవం. ఇబ్సెన్‌ నాటక పోకడలు ‘పెద్దమనుషులు’ చిత్రంలో అక్కడక్కడా కనిపిస్తాయి.


* అన్నపూర్ణలో కె.వి.రాముడు...


తెలుగు సినిమాకు స్వర్ణయుగం తీసుకువచ్చిన సంస్థల్లో అన్నపూర్ణా సంస్థ పెరెన్నికగలది. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.ఎ.వి.సూర్యారావు భాగస్వాములుగా ఏర్పడి దుక్కిపాటి సవతి తల్లి పేరిట ‘అన్నపూర్ణా పిక్చర్స్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. తొలి చిత్రానికి భరణీ రామకృష్ణరావును దర్శకుడిగా నియమిస్తే వ్యక్తిగత ఇబ్బందులవలన ఆయన తప్పుకున్నారు. తరువాత బి.ఎన్‌.రెడ్డిని సంప్రదిస్తే లక్షరూపాయల పారితోషికం అడిగారు. పుల్లయ్య ‘అర్ధాంగి’ సినిమాతో బిజీగా వుండడం వలన చేతులెత్తేశారు. తలవని తలంపుగా వాహినీ సంస్థతో తలెత్తిన మనస్పర్థల వలన దర్శకుడు కె.వి.రెడ్డి బయటకు వచ్చేశారు. అప్పుడు అక్కినేని, దుక్కిపాటి ఇద్దరూ వెళ్లి కె.వి.రెడ్డిని కలిశారు. ఆ సమయంలోనే కె.వి.రెడ్డి నిర్మాత, దర్శకుడుగా వాహినీ బ్యానర్‌ మీద ‘పెద్దమనుషులు’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుండడంతో ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యాకే అన్నపూర్ణావారి సినిమా చేస్తానని అన్నారు. అంతటి గొప్ప దర్శకునితో సినిమాతీస్తే అన్నపూర్ణా బ్యానర్‌కు మంచి గుర్తింపు వస్తుందని భావించి కొంతకాలం ఆగేందుకు వారు సమ్మతించారు. ఆ నిరీక్షణ చివరికి ‘పెద్దమనుషులు’ (1954) విడుదలయ్యేదాకా, రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఆ శ్రమ వృధా పోలేదు. అన్నపూర్ణా పతాకం నలభై యేళ్లదాకా అప్రతిహతంగా కొనసాగింది. ‘పెద్దమనుషులు’ సినిమాకు తొలి రచన చేసిన డి.వి.నరసరాజు కె.వి.రెడ్డి సలహాపై ‘దొంగరాముడు’ సినిమాకు మలిరచన చేశారు. షూటింగు ప్రారంభించే ముందు నరసరాజు స్క్రిప్టు చదువుతూవుంటే కె.వి.రెడ్డి టైం నోట్‌ చేయించి, ప్రతి షాట్‌కు ముడిఫిలిం ఎంత ఖర్చవుతుందో లెక్క వేసి, మొత్తం ఫిలిం నిడివి 17 వేలుగా తేల్చారు. సినిమా పూర్తయ్యేసరికి నిడివి మొత్తం 17,250 అడుగులు వచ్చింది. 70 కాల్షీట్లలో సినిమా పూర్తయింది. కాల్షీట్‌ అనుకున్న సమయానికన్నా పావుగంట ముందుగానే పూర్తయ్యేది. అంత ఖచ్చితమైన ప్రణాళికతో కె.వి.రెడ్డి ఈ సినిమా తీశారు. అందుకే పుణే ఫిలిం కళాశాలలో ‘దొంగరాముడు’ సినిమా ఇప్పటికీ ఫిలిం మేకింగ్‌ సిలబస్‌గా కొనసాగుతోంది. ‘సినిమాలో నవరసాలు వున్నాయి. మంచి హిట్‌ అవుతుంది. నా అంచనా తప్పితే నేను చిత్రరంగం నుండి విరమిస్తాను’ అని కె.వి.రెడ్డి అన్నపూర్ణా భాగస్వాములకు భరోసా ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం. భానుమతిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దుక్కిపాటి భావించినా కె.వి.రెడ్డి సావిత్రి వైపే మొగ్గుచూపారు. ‘దొంగరాముడు’ సినిమాకు కె.వి.రెడ్డి తీసుకున్న పారితోషికం యాభై వేలు. 1955 అక్టోబరు 2 గాంధి జయంతినాడు సినిమా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. నాటకీయత లేకుండా సహజసిద్ధమైన సన్నివేశాలు ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తూనే వున్నాయి.


* హై... హై... కె.వి. రెడ్డి...


‘పాతాళభైరవి’ తరువాత కె.వి.రెడ్డి విజయా వారి తదుపరి చిత్రానికి సినిమా చేయాల్సివున్నా, అన్నపూర్ణావారి ‘దొంగరాముడు’ సినిమాకు పనిచేయాల్సి రావడంతో వీలుపడ లేదు. 1955లో ‘దొంగరాముడు’ సినిమా విడుదలయ్యాక కె.వి.రెడ్డి ‘మాయాబజార్‌’ (1957) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పాటు శ్రమించి స్క్రిప్టు పని పూర్తిచేశారు. ఈ సినిమా మీద నమ్మకం లేక పోవడం, అంతకుముందు భారీ ఎత్తున కమలాకర దర్శకత్వంలో నిర్మించిన ‘చంద్రహారం’ సినిమా పరాజయం పాలవడంతో నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి చిత్ర నిర్మాణాన్ని వాయిదావేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎ.వి.ఎం అధిపతి మెయ్యప్పచెట్టి మాయాబజార్‌ సినిమా తీసేందుకు ముందుకు వచ్చి కె.వి.రెడ్డి ఎంత పారితోషికం అడిగితే అంత ఇస్తానని కబురంపారు. అంతేకాదు సుందర్లాల్‌ నహతాతోబాటు మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా కె.వి.రెడ్డికి ఇదే ప్రతిపాదనను చేరవేశారు. కె.వి.రెడ్డి మాత్రం విజయా వారికి తప్ప వేరేవారికి తీయనని చెప్పడంతో, నాగిరెడ్డి-చక్రపాణి పునరాలోచనలో పడ్డారు. సినిమా బడ్జట్‌ను కె.వి.కి అప్పగించి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. తెలుగుతోబాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించాలనే నిర్ణయం జరిగింది. సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే ఏయే పాత్రలకు ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే విషయాన్ని ముందుగానే కె.వి.రెడ్డి నిర్ణయించేశారు. ఆ రోజుల్లో కృష్ణుడు అంటే కల్యాణం రఘురామయ్యే అనుకునేవారు. అయితే కృష్ణుడి పాత్రకు ఎన్‌.టి.రామారావును తీసుకొని, కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్‌లతో రకరకాల స్కెచ్‌లు గీయించి నిండుకిరీటం పెట్టించి, మేకప్‌ మెన్‌ పీతాంబరం, భక్తవత్సలం చేత ఆహార్యం మెరుగు పరచి, నడక, వాచకంలో మార్పులుచేసి ‘కృష్ణుడంటే ఇలా వుండేవాడా’ అనేలా తీర్చిదిద్దారు. ఇక హీరో ఘటోత్కచుడి పాత్రకు ఎస్‌.వి.రంగారావును తీసుకున్నారు. ఘటోత్కచుడుగా తదాత్మ్యంతో రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పింగళి అనేక కొత్త మాటల్ని ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారతీయ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా 2013లో సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వంద ఆల్‌ టైం గ్రేట్‌ భారతీయ సినిమాలలో మాయాబజార్‌ సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మాయాబజార్‌ 27 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది.


* ముగింపు...


‘మాయా బజార్‌’ తరువాత ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. సొంత బ్యానర్‌ ‘జయంతి పిక్చర్స్‌’ బ్యానర్‌ మీద ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1961) నిర్మించారు. అక్కినేని, నందమూరి నటించిన ఈ చిత్రం ‘జగదేకవీరుని కథ’ సినిమాతో సమానంగా విజయం సాధించింది. అయితే తరువాత కె.వి.రెడ్డి విజయా సంస్థకు దర్శకత్వం వహించిన ‘సత్య హరిశ్చంద్ర’, ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ విజయవంతం కాలేదు. ఎన్‌.టి.రామారావు సంస్థ కోసం దర్శకత్వం వహించిన ‘శ్రీకృష్ణ సత్య’ సుమారుగా ఆడింది. సొంత బ్యానర్‌ మీద నిర్మించిన ‘భాగ్యచక్రం’ కూడా సరిగా ఆడలేదు. కె.వి.రెడ్డి మూడు దశాబ్దాల కాలంలో దర్శకత్వం వహించిన చిత్రాలు కేవలం 14 మాత్రమే. అయినా అవి వేటికవే అజరామరాలు. కె.వి.రెడ్డి భార్య శేషమ్మ. వారిది అన్యోన్యమైన దాంపత్యం. భార్య తల దువ్వనిదే కె.వి.రెడ్డి అడుగు బయటకు పెట్టేవారు కాదు. వారికి తొమ్మండుగురు సంతానం. వారిలో ఎవరినీ సినిమా నిర్మాణపు గడప తొక్కనీయలేదు. పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ప్రయోజకులయ్యారు. కె.వి.రెడ్డి అంటే తెలుగు చలచిత్ర చరిత్రలో చెరిగిపోని మచ్చలేని సుగంధ కుసుమం.

💐💐💐

పురాకృతం...* *( మూడవ భాగం.)*

 *పురాకృతం...*   *( మూడవ భాగం.)*


 *జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి*

 *భస్మ సాత్కురుతే తధా.*   (గీతా 4.37). 


ఈ మాట భగవద్గీతలోది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన జ్ఞాని యొక్క పాపాలన్నీ బూడిద అయిపోతాయి అని శ్రీకృష్ణుని వాక్యం. ఇది జ్ఞాన యోగం ద్వారా పాప విముక్తి పొందడం గురించిన మాట.  


అలాగే..


 *సర్వధర్మాన్ పరిత్యజ్య*

 *మామేకం శరణం వ్రజ*

 *అహం త్వా సర్వ పాపేభ్యో*

 *మోక్ష యిష్యామి మాశుచః.*  (గీతా 18.66)


 ఈ మాట భక్తి యోగానికి సంబంధించినది. సంపూర్ణ శరణాగతిని చేసి భగవంతుని పూర్తిగా నమ్మిన భక్తుడి పాపాలన్నింటినీ పరిహరించి ముక్తిని ఇస్తాను అని శ్రీకృష్ణుని మాట.


ఇక


 *కర్మజం బుద్ధి యుక్తా హి (గీతా 2.51)*


అనే శ్లోకం లోనూ అదే అధ్యాయంలోని మిగతా శ్లోకాల లోను ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణం గా చేసే కర్మలు జన్మ బంధానికి కారణం కావు పైగా అటువంటి కర్మలు చేసేవాడు పాపాల నుంచి విముక్తుడు అవుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పారు.


దీని వల్ల తేలిందేమిటంటే..... *జ్ఞాన మార్గంలో కానీ భక్తి మార్గం లో కానీ వైరాగ్యం తో కూడిన కర్మ మార్గం ద్వారా కానీ భవ బంధాల నుంచి ముక్తిని పొందవచ్చు...*


మరి ఈ శ్లోకాల్లో ఎక్కడా కూడా ప్రారబ్దం అనుభవించాలి మిగిలిన సంచితమూ అనారబ్దమూ మాత్రమే తొలగుతాయి అని చెప్పలేదు కదా అంటారేమో. ఆ మాట అక్కడ లేదు. కానీ లోక వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తున్నది.


రమణ మహర్షి మహా జ్ఞాని సర్వసంగ పరిత్యాగి. ఆయనకు సర్కోమా వచ్చింది. జీవితాంతం ఉన్నది. అలాగే ఆది శంకరాచార్యుల కు భగంధరం వచ్చి మరణ పర్యంతం అది ఉన్నది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం అన్నారు కదా ఇది ఏమిటి అని అడిగితే ప్రారబ్దం అని చెబుతారు. సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు కూడా బాధలు పడ్డ ఉదాహరణలు పురాణాల నిండా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించే పెద్దలు భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా ప్రారబ్దం తప్ప మిగిలిన అన్ని పాపాలు నశిస్తాయి అని చెప్పారు.


భాగవతంలో వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తిని అనుగ్రహించే టప్పుడు మహావిష్ణువు ఇలా అంటారు. " ఎవ్వని గరుణింప నిచ్చయించితి వాని అఖిల విత్తంబు నే నపహారింతు. " భక్తుడు అయిన వాడిని రకరకాలుగా కష్టపెట్టి పరీక్షించి గానీ వాడిని అనుగ్రహించను అని దాని భావము. ఈ పరీక్ష ఇంచుమించు ప్రారబ్దానికి సరిపోతుంది.  ఒక్కొక్కసారి లోకం లో మరీ మంచి వాళ్ళు నిష్కారణంగా తీవ్ర భాధలను అనుభవిస్తుంటారు. వాళ్లను బహుశా భగవంతుడు అనుగ్రహించ దలుచు కున్నాడేమో. వాళ్లకది ఆఖరి జన్మ ఏమో. వాళ్లు జ్ఞానులు భక్తులు అయితే అలాగే అనుకుని బాధలకు చెలించరు.


ప్రారబ్దాన్ని అనుభవించడం లో కూడా భక్తులకు జ్ఞానులకు ఒక వెసులు బాటు ఉంది. రమణ మహర్షి ఆదిశంకరా చార్యులవారు ఇద్దరూ బ్రహ్మ జ్ఞానులు  కనుక శరీరం పడే బాధను తమ బాధగా ఎప్పుడూ భావించలేదు. అందువల్ల వారికి ప్రారబ్ద బాధ నిజానికి అనుభవం లోకి రాలేదు. లోకం దృష్టికి మాత్రమే వాళ్లు ఆ బాధను అనుభవించినట్లు ఉంటుంది. భక్తులు కూడా తమ బాధలను భగవంతుడు పెట్టే పరీక్షలు గా భావిస్తారు. అందువల్ల వాళ్లను కూడా ఈ బాధ బాధించదు.


భక్తుడైనా మామూలు వాడైనా సమానంగా నెత్తి మీద మొట్టికాయ పడితే సమానంగా బాధ ఉంటుంది కదా. ఎవరైనా అనుకోవడం అనుకోక పోవడం అనే దానిమీద బాధ ఆధారపడి ఉంటుందా అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఈ సందేహానికి సమాధానం మనకు కాశీ కి సంబంధించిన స్థల పురాణ కథలలో దొరుకుతుంది.


*పవని నాగ ప్రదీప్.*


...... (ఇంకావుంది).

విష్ణు శక్తి వ్యాప్తము

 విష్ణు సహస్ర నామం రూపంలో విష్ణు శక్తి వ్యాప్తమును యిదివరకు చెప్పినది యింకా సులువుగా తెలియుటకే. కలియుగంలో మానవులకు ప్రతీ విషయంలో నిరూపణ కావాలి. మిగిలిన యుగాలలో అనుమానం లేదు భగవత్శ్శక్తి గురించి.దానిని జయించాలనే అహంకారము తప్ప. ప్రత్యక్ష ప్రమాణము గా ప్రకృతి రూపంలో స్పష్టంగా కనిపించింది, అదీ మానవ రూపంలోనే.శంకరుల  నాలుగు మహా వాక్యములు నాలుగు వేదముల రూపంలో వివరించిరి. ఏది ఎవరు వివరించినా మానవ దేహము మాత్రమే మూల ప్రకృతిని  అవగాహనకు యని తెలియవలెను.అఙ్ఞానం వలన పదార్ధము, దానిని ఆశ్రయించిన శక్తని తెలియ లేకపోవుట కాల ధర్మము యని సరిపెట్టుకొనుట. సరిపెట్టుకొనుట అన్ని విషయాలలో అవసరం. కొన్ని మాత్రము అధికంగా కావాలి, కొన్ని అసలు అవసరం లేదు. *యా వేదాదిషు గాయత్రీ సర్వ వ్యాపి మహేశ్వరీ, ఋగ్యజు సామాథర్వైశ్చ తన్మేమనః శివసంకల్పమస్తు. వేదములు యెుక్క లక్ష్యం  శక్తిని ప్రకృతి పరంగా మార్పు చేయు సూత్రమును తెలియుట. దీని నిర్వచనము, మానవ జీవ లక్షణము. ఈ షు E =S  యని వేదము యెక్క అంతిమ లక్ష సాధన ఈ ఉష వ్యాప్తమైనది కిరణ శక్తని తెలియుట.అది గత్రి శక్తి.గుణ రూపములో మానవ రూపమైన పదార్ధ ఙ్ఞానమేయని  తెలియుచున్నది. ఎస్ అనగా సత్ అను పదార్ధ ఙ్ఞానాన్ని వుంది అని వప్పుకొనుట. అది ఇ శక్తి రూపములో కలదని అంగీకరించుట.వేదము వకటే తెలుపు చున్నది అది శక్తని ౭ుపించి లేని తత్వము ఉన్నదిగాని యని నిరూపణ యే. కంటికి కనిపించని శక్తిని దృశ్యముగా మానవునికి,జీవంగల  బొమ్మగా తెలియుట. కాని దానిని తెలుసుకునే విధాన సూత్రములే మిగిలినవివేద పరంపర.ఋక్కు యనగా కాంతి వ్యాప్తిని పరావర్తన మును అనగా శబ్ద చైతన్య వ్యాప్తి ద్వారా యజుర్వేదం క్రియా రూపంలో తెలిసి అధర్వ ఫలితరూపంగా  అనుభవించుటయే.యిది గాయత్రీ రూపముగా  మహేశ్వరీ రూప తత్వము. మహేశ్వర యని యంటే తెలియదు నిర్గుణం కావున. మహేశ్వరీ యనగా పదార్ధ రూపము కలిగి ప్రకృతిగా తెలియుటయే పదార్ధ ఙ్ఞానం. ప్రకృతి యనగా వకరికి పరిమితమైనది కాదు. సర్వ వ్యాప్తమైనది

అలాగని సమస్త ప్రకృతిని వరకే ఆక్రమించుట అహంకారము.నియమిత పద్దతిలో కాలానుగుణంగా వ్యాప్త మైనదానిని వశపరచుకొనుటయే ఙ్ఞానము.  అనంతమైన ప్రకృతిని  మార్పును గమనించుచూ పరిమితి లోనే ప్రకృతి తత్వమును గ్రహించుట ఙ్ఞానము.ఙ్ఞానము యనగా మనిషికి కావలసిన శక్తిని వెలుగు ప్రకాశము  ద్వారా ప్రకృతి ద్వారా తెలియుట. చీకటి అజ్ఞానము ఙ్ఞానము వెలుగు. యిదే తమసోమా జ్యోతిః గమయ.తమస్సు చీకటి నుండి నన్ను జ్యోతి వెలుగులోనికి తీసుకొని వెళ్లుట. ఆతరువాత మృత్యోః  మా అమృతం గమయ. యివి రెండు సూత్రములు. జ్యోతి లక్షణము తెలిసిన తరువాత అమృత తత్వం ఙ్ఞానము. మృతము యనే ఙ్ఞానము సవివరంగా తెలియుట. యిది వకరి వలన కాదు,అనగా వక్క జన్మ లో తెలియదు. అదియును మానవులకు తప్ప యితర జీవులకు తెలియుట జరుగదు.యిది వకరి పరంపర జీవం పుట్టినప్పటినుండి ప్రయత్నం జరుగుచునే యున్నది. దానికి దేహము ధారణయే మూల సూత్రము.దేహము  ధరించిన తరవాత అజ్ఞానము.దేహం ధరించకముందు ఙ్ఞానంతో దేహ ధారణకు తపన జీవునికి. గాయత్రీ శక్తి సర్వ వ్యాప్తమైనది, జీవ శక్తి యని తెలియుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. అనంతమైన ఙ్ఞానమును. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఇచ్చా మరణం..కపాలమోక్షం..*


1976 మే నెల ఆరవ తేదీనాడు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య, మొగలిచెర్ల గ్రామస్థుడు ఎఱుకలయ్య మామూలుగానే తన గొఱ్ఱెలను మేపుకోవడానికి శ్రీ స్వామివారి ఆశ్రమం వున్న ఫకీరు మాన్యానికి వచ్చాడు..కుతూహలం ఆపుకోలేక శ్రీ స్వామివారి ఆశ్రమ ప్రహరీ గోడ మీద నుంచి..ఆశ్రమం లోపలికి చూసాడు..శ్రీ స్వామివారు ఆశ్రమం ముందున్న పందిరి క్రింద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..ధ్యానం లో ఉన్నారేమోనని అనుకొని.. ప్రహరీ దిగి వెళ్ళిపోయాడు..అప్పటి నుంచీ రెండు మూడు సార్లు తొంగిచూసాడు..శ్రీ స్వామివారు ఒకే భంగిమలో కూర్చుని వున్నారు..మధ్యాహ్నం ఒంటి గంట వేళ ఎఱుకలయ్య మళ్ళీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి వున్నది..చలనం లేదు..అతనికి భయం వేసింది..ఆలస్యం చేయకుండా పరుగు పరుగున మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చాడు..నాన్నగారితో తాను చూసిన విషయాన్ని చెప్పాడు..శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగిపోయి ఉన్నదనీ..తనకేదో అనుమానంగా ఉన్నదనీ..చెప్పాడు..ఈలోపల అమ్మకూడా వచ్చి, ఈ విషయం విన్నది..ఒక్కసారిగా అమ్మా నాన్న మాన్ప్రడి పోయారు..క్షణాల్లో ఈ వార్త నలుగురికీ తెలిసిపోయింది..నాన్నగారు నన్ను పిలచి.."నువ్వు ముందుగా కొంతమందిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళు.. నేనూ అమ్మా వెనుక బండిలో వస్తాము.." అన్నారు..


నేను వెంటనే ఓ ఇరవై మందిని సమాయత్తం చేసుకొని ఆశ్రమానికి పరుగులాంటి నడకతో వెళ్లాను..ప్రహరీ తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి..అక్కడ పందిరి క్రింద శ్రీ స్వామివారి దేహం పద్మాసనం వేసుకున్న స్థితిలోనే ఎడమ ప్రక్కకు ఒరిగి వున్నది..కుడివైపున దండము, కమండలమూ వున్నాయి..కమండలం క్రింద  ఓ కాగితం ఉన్నది..అందులో తన సాధన పూర్తి అయిందనీ.. తనను దత్తాత్రేయ స్వామి గా పిలువమనీ.. తన సమాధి దర్శనం ఒక్క శనివారం నాడు తప్ప మిగిలిన రోజుల్లో చేయమనీ.. వ్రాసిపెట్టి వున్నారు..


వచ్చిన మేమందరమూ శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి సందేహిస్తూ వున్నాము..మాతోబాటు వచ్చిన శ్రీ గోపీశెట్టి బలరామయ్య మాత్రం.."ప్రాణం పోయిన తరువాత అంతా ఒకటే కదయ్యా.. కట్టే కదా మిగిలుండేది.." అంటూ..శ్రీ స్వామివారి దేహాన్ని రెండుచేతులతో ఎత్తుకొని..జాగ్రత్తగా శ్రీ స్వామివారు ధ్యానం చేసుకునే ప్రధాన గది గోడకు ఆనించి..అదే పద్మాసనం స్థితి లో కూర్చోబెట్టాడు..శ్రీ స్వామివారి ముఖంలో ఏమాత్రం కళ తగ్గలేదు..కేవలం కళ్ళుమూసుకొని ధ్యానం లో వున్నట్టే వున్నారు..శరీర అవయవాలు కూడా బిగుసుకుపోలేదు..మామూలుగానే వున్నాయి..


మరో పది నిమిషాల కల్లా నాన్న అమ్మ వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన వెంటనే అమ్మ దుఃఖం ఆపుకోలేక భోరున ఏడ్చేసింది..నాన్నగారు మనసులోనే తన మనసులోనే బాధను దిగమింగారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు  అక్కడికి చేరారు..శ్రీ స్వామివారు హఠయోగం ద్వారా ప్రాణ త్యాగం చేశారని ఒక అభిప్రాయానికి అమ్మా నాన్న వచ్చేసారు..ఆరోజుల్లో మొగలిచెర్ల గ్రామానికి కానీ ఆశ్రమానికి కానీ కరెంట్ సౌకర్యం లేదు..నాన్నగారు ఊరి నుంచి పెట్రో మాక్స్ లైట్లు తెప్పించారు..రాత్రి తొమ్మిది గంటలకు గానీ శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులు ఆశ్రమానికి చేరుకోలేక పోయారు..కాలినడకనే రావాలి కదా..వాళ్ళు వచ్చీ బాధపడ్డారు..ఆ తరువాత ఒక గంట గంటన్నర గడిచింది..అప్పుడొక సంఘటన జరిగింది..


ఆశ్రమం లో వున్న మాకు, బైట వున్న గ్రామస్థులకు ఎక్కడి నుంచో ఒక మోటార్ సైకిల్ వస్తున్న చప్పుడు వినబడింది..తీరా శ్రద్ధగా వింటే..ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం లోంచి వస్తోంది..నాభి ప్రాంతం నుంచి వస్తున్న ఆ శబ్దం..క్రమంగా పెరగసాగింది..కొద్ది సేపటి దాకా ఆ శబ్దం అలా పెరుగుతూ పోయి..ఒక్కసారిగా ఆగిపోయింది..ఆ వెంటనే శ్రీ స్వామివారి నడి నెత్తి మీద చీలిక లాగా ఏర్పడి..అందులోంచి రక్తం ధారగా కారసాగింది..అంతవరకూ శ్రీ స్వామివారు తన ప్రాణాన్ని లోపలే బంధించి ఉంచారని అమ్మకూ నాన్నగారికి అర్ధం అయింది..తీవ్ర సాధన చేసిన ఆ సిద్ధపురుషుడు తన మరణాన్ని తానే కపాలమోక్షం ద్వారా ఇచ్చా పూర్వకంగా కోరుకున్నారు..అదే సమయంలో ఆశ్రమం బైట వున్న వ్యక్తులకు ఒక నీలిరంగు కాంతి పుంజం ఆశ్రమం పైనుంచి ఆకాశం లోకి దూసుకు వెళ్లినట్లు కనబడింది..


ఒక అవధూత తనకు తాను కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే క్షణాలను ప్రత్యక్షంగా చూడగలిగే భాగ్యం మా అమ్మానాన్న లతో పాటు నాకూ కలిగింది..నేను చేసుకున్న అతి కొద్ది పుణ్యం ఈ రకంగా ఫలించింది.. 


శ్రీ స్వామివారి పార్ధివ దేహాన్ని..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల సమక్షం లోనే..ఆ మరుసటిరోజు ఉదయాన్నే..శ్రీ స్వామివారు త్రవ్వించుకున్న నేలమాళిగ లోనే.. పద్మాసనం వేసుకున్న భంగిమలోనే... ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేసేసారు..


శ్రీ స్వామివారితో నాకు పరిచయం ఏర్పడిన నాటినుంచీ..శ్రీ స్వామివారు సిద్ధిపొందే దాకా నేను పొందిన అనుభవాలను ఇంతవరకూ పొందుపరచాను..శ్రీ స్వామివారు సమాధి చెందిన తరువాత..2004 వ సంవత్సరం దాకా మా తల్లిదండ్రులే శ్రీ స్వామివారి మందిరం నిర్వహించారు..2004 వ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుల్లో మా తండ్రిగారు అనారోగ్యం పాలయ్యారు..ఆ సమయం లో తప్పనిసరి పరిస్థితులలో నేను శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది..నేను బాధ్యతలు చేపట్టిన తరువాత..నేను వ్యక్తిగతంగా కానీ..మా దంపతులం కానీ పొందిన అనుభవాలను రేపటి నుంచీ ధారావాహికంగా తెలియచేస్తాను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

అన్నం' గురించి చెప్పిన నాలుగు మాటలు.

 హరిఓం ,

*'అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*

1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !  ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !  - జంధ్యాలగారు


2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !   -  విశ్వనాధ సత్యనారాయణ గారు 


3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !  - రేలంగి వెంకట్రామయ్య గారు


4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !  -  ముళ్ళపూడి వెంకటరమణ గారు


5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు.  అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ  అర్ధం కాలేదు !  - ఆత్రేయ గారు


6. అమ్మ చేతి  అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !   - చాగంటి కోటే శ్వర రావుగారు


7.  ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! - గౌతమ బుద్దుడు 


8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! - మాతా అమృతానందమయి


9. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు  మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.   "అన్ని దానము లలో  అన్నదానము మిన్న ".........                               🙏....        

 *సేకరణ.....* 

*బాబ్జీ న్యాయపతి*