15, నవంబర్ 2022, మంగళవారం

త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.🙏

 శ్లోకం:☝️



*హస్తాభ్యాం కలశద్వయామృత-*

  *రసైరాప్లావయంతం శిరః*

*ద్వాభ్యాం తౌ దధతం మృగాక్ష-*

  *వలయే ద్వాభ్యాం వహన్తం పరం l*

*అంకన్యస్త కరద్వయామృత-*

  *ఘటం కైలాసకాంతం శివం*

*స్వచ్చాంభోజనిభం నవేందు-*

*మకుటం దేవం త్రినేత్రం భజే ll*

   - మృత్యుంజయ స్తుతి


భావం: రెండు చేతులచే అమృత కలశాలను ఎత్తి పట్టుకొన్న వాడు, మరో రెండు చేతులతో ఆ కలశామృతమును శిరస్సుపై పోసుకుంటున్న వాడు, మరో రెండు చేతులలో అక్షమాలను, మృగ ముద్రనూ కలిగియున్నవాడు, మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలను ఒడిలో పెట్టుకున్నవాడు, కైలాస ప్రభువు, స్వచ్చమైన కమలముపై కూర్చొని ఉండి, బాలచంద్రుని శిరస్సున భూషణముగా కలిగి ఉన్నవాడైన త్రినేత్రునికి నమస్కరిస్తున్నాను.🙏

ఆత్మగౌరవం

 *ఆత్మగౌరవం  !!!*


బాగా బలిసిన ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నోప్పి వచ్చింది, ఆపరేషన్ కోసం అమెరికా కు తీసుకెళ్లారు

ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రి గారికి విజయవంతం గా శస్త్రచికిత్స చేసారు,

మంత్రి గారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రి గారిని పలకరించారు..

ఎలా ఉన్నారు మంత్రి గారు? ఇప్పుడేం ఛాతీ లో నోప్పి లాంటిది ఏం లేదుకదా?

అందుకు మంత్రి గారు భలే వారే డాక్టర్ గారు, అమెరికా లో అందులో తమంతటి వారు స్వయానా ఆపరేషన్ చేసాక ఇంకెందుకు వస్తుందండి ఆ నోప్పి.. అదే మా ఇండియా లో ఐతే ఈపాటికి టపా కట్టేసే వాన్ని, ఎంతైనా అమెరికా, అమెరికానేనండి. మా ఇండియా లో గుండెకు ఆపరేషన్ అంటే లివర్ కు చేచేస్తారు, అమెరికా కాబట్టి బతికి బట్ట కట్టగలిగాను, మా ఇండియా డాక్టర్ లు శుద్ధ వేస్ట్ అండీ.. అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు

ఇక చాలు ఆపండి మీ సోది, అంటూ డాక్టర్ గారు విసురు గా లేచారు, ఆయన కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రబడ్డాయి.

ఆపరేషన్ అయ్యింది కదా, దయచేసి ఇక వెళ్ళి పోండి, ఇంకోక్క మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి గారి మెుహం కూడా చూడకుండా వెళ్ళి పోయారు..

బిక్కచచ్చిన మెుహంతో మంత్రి గారు ప్రక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో ఎవరు ఈయన ?ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు? అని అడిగారు

అందుకు ఆ అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే.. ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియా లోనే చేసారు అని చెప్పాడు..

మంత్రి గారికి డాక్టర్ గారు ఎందుకలా మండిపడ్డాడో అర్ధమైంది..

డిస్చార్జ్ అవబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు, ఏదో మాట తూలాను, మనసులో పెట్టుకోబాకండి అన్నారు,

అందుకు డాక్టర్ విల్సన్ గారు ఛ. ఛ. అలాంటిదేమి లేదండి.. ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియనే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, నేను ఇండియా లోనే డాక్టర్ కోర్సు పూర్తి చేసాను, నాకంటే మేధావులు మీ ఇండియా లో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మరుగున పడుతున్నారు, మీ రాజకీయాలు,కుల వివక్ష, రిజర్వేషన్ లతో కోంతమంది మేధావులు అక్కడ ఇమడ లేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు, వారి మేధాశక్తి కి ఇక్కడి వారు నెత్తిన పెట్టుకున్నారు, అంత ఎందుకండీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా?

ప్రజల సొమ్ము తో ఆపరేషన్ చేయుంచుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేక పోయాను, ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ ను మీ ఇండియా లో డాక్టర్ కోర్స్ చదివే ఓ పీ జీ స్టూడెంట్ చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు, కానీ మీరు చేయించుకోరు, ఎందుకంటే వారు డాక్టర్ కోర్స్ చదివారో, లేదో? లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కోన్నవాడేమో అని మీ డౌట్?!

అందుకే రిజర్వేషన్ లేని,ప్రతిభకే పట్టం కట్టే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు మీ భారతీయులు,

కష్టం మీ వాళ్ళది, పేరు మాత్రం మా దేశాలది,

నేడుఅభివృద్ధి చెందిన పెద్ద, పెద్ద దేశాలు కానీయండి, కంపెనీలు కానీయండి వారి అభివృద్ధి వెనక ఖచ్చితంగా మీ భారతీయుల క్రుషి ఉందనేది ముమ్మాటికీ నిజం.. మీరు వాడుకోలేరు, మేము వాడుకుంటున్నాం..టాప్ అంతా మాదగ్గర ఉంది, స్క్రాప్ మాత్రం మీ దగ్గర ఉంది.

తన దేశాన్ని తప్పు పట్టిన వాడు రేపు తన కన్న తల్లిని కూడ తప్పు పడతాడు..

మీకు ఇంతకంటే నేను చెప్పలేను..

సెలవ్.. గెట్ వెల్ సూన్..

మంత్రి గారికి నోరు పెగల్లేదు..

డాక్టర్ గారు అన్న చివరి మాటలు

"గెట్ వెల్ సూన్" అన్నది

తన శరీరానికా? తన మనసు కా?

.

.

.

.

షేర్ చెయ్ భారతీయుడా ! నీ దేశం బాగు కోసం....!!

🇮🇳🤝🇮🇳🤝🇮🇳🤝🇮🇳🤝🇮🇳

SSC బోర్డ్ పూర్తిగా రద్దు

 *ఇక నుండీ SSC బోర్డ్ పూర్తిగా రద్దు అవుతుంది.*


*కారణమూ SSC విద్యా ఇక నుండి పూర్తిగా కొలమానము కాదు.*


*ఇంటర్మీడియట్ బోర్డు మాత్రము యధావిదిగా ఉంటుంది.*


*ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమై కొలమానముగా తీసుకొంటున్నారు.*


ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది.ఇక నుండీ విద్యా విదానము ఇలాగ ఉండబోతుంది.


1)ప్రాథమిక విద్యా:- 


i) నర్సరీ (ప్రారంభ వయస్సు మూడు లేదా వయస్సు 4 సంవత్సరాలు)

LKG, UKG, ప్రథమ తరగతి, రెండవ తరగతి  వరకు ఉంటుంది( మొత్తం ఐదు సంవత్సరాలు విద్య) 


2) హైస్కూల్ విద్యా:-         


i) మూడవ తరగతి నుండీ ఎనిమిదో తరగతి వరకు (మొత్తం ఆరు సంవత్సరాలు ఉంటుంది) 


3)ఇంటర్మీడియట్ బోర్డ్.


i) కాలేజీ స్థాయి:-  తొమ్మిదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉంటుంది(మొత్తం నాలుగు సంవత్సరాలు ఉంటుంది) పైన పేర్కొన్నవి తరగతులు ఇకనుండి  నిర్బంధ విద్య కింద పరిగనిస్తారు.


*పై కోర్సులు పూర్తి అయేతే.*


4) విశ్వవిద్యాలయ విద్య/డిప్లొమా విద్యలు ఈ క్రింద  విదముగా ఉంటాయి.


i)రెండు సంత్సరాలు పూర్తి అయితే డిప్లమా 

విద్య అవుతుంది.


ii)మూడు సంత్సరాలు  పూర్తి అయితే సాధారణ డిగ్రీ పూర్తి  ఆవుతుంది.  


iii)నాలుగు సంత్సరాలు పూర్తి అయితే ఇంజనీరింగ్ విద్య అవుతుంది.


*పై కోర్సులు పూర్తి అయేతే.*


5) PG కోర్స్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. 


6) P.hd ప్రోగ్రామ్ మాత్రమే కోర్సు ను బట్టి ఉంటుంది.


ఒక ప్రత్యేక గమనిక:- 


ఇందులో ఇప్పటి వరకులేని ఒక కొత్త విదానము వస్తుంది.     


అదే ఇంతకు మునుపు పూర్తిగా కోర్సు పూర్తి అయితేనే డిగ్రీ /డిప్లామా సర్టిఫికేట్ ఇస్తారు.ఇప్పుడు విద్య ఇలా కాదు.


ప్రతి సంవత్సరం అన్నీ సబ్జెక్టులలో పాస్ అయిన ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేట్ ఇస్తారు.


వచ్చే సంవత్సరం చదవాలా లేదా అనేది విద్యార్థి మీద ఆధారపడి  ఉంటుంది.


ఒకవేల ఆ విద్యార్థి వేరే వేరే కారణాలవలన చదువు మాని వేస్తే,డిగ్రీ సర్టిఫికేట్ ఆ సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది.


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

పెళ్ళి గురించి మాట్లాడాలి

 x : సార్ ఇది y గారి ఇల్లేనా

y: అవును మీరు

x: మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలి 

y: ముందు మా కండిషన్స్ విన్నాక మాట్లాడండి

x: అది కాదు సార్ మీ అమ్మాయి పెళ్ళి

y: ఏదైనా సరే ముందు మా కండిషన్స్ విన్నాకే పెళ్ళి గురించి మాట్లాడండి


x: ఏం కండిషన్స్ సార్

y: మా అమ్మాయికి 654321 ఉన్నవాడినే పెళ్ళి చేయాలి

x: అంటే ఏంటి సార్

y: 6 అంకెల జీతం అంటే లక్ష జీతం అయినా ఉండాలి

    5 లక్షల కారు అయిన ఉండాలి అది కూడా అబ్బాయి పేరు మీదే ఉండాలి

    4 లక్షలు విలువ చేసే బంగారం అమ్మాయికి వెయ్యాలి

3 బెడ్ రూములు కలిగిన ఇల్లు ఉండాలి అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి

2 ట్రిప్ప్లు అయినా నెలకు తిప్పాలి బయట 

1 ఒక్కడే కొడుకు అయ్యుండాలి



x: 🤔🤔🤔🤔🤔

y: ఇంతే కాదు

అబ్బాయి తల్లితండ్రులు పెళ్ళి అవగానే విడిపోవాలి

అమ్మాయికి వంట రాదూ అయినా మీరు అడగకూడదు

అమ్మాయి ఆలస్యంగా నిద్రలేస్తుంది 

ఆదివారాలైతే ఇంకా ఆలస్యంగా లేస్తుంది 

అవి పట్టించుకోకూడదు

ఇక ఇల్లు కారు డాక్యుమెంట్స్ మాకు చూపెట్టాలి

ఆఫీస్ నుండి సాలరీ సర్టిఫికెట్ తీసుకురావాలి

 

మా అమ్మాయిని మేము చాలా గారాభంగా పెంచాము

తను ఇబ్బంది పడకూడదు కదా అందుకే ఇన్ని జాగ్రత్తలు

ఇవన్నీ మీకు నచ్చాక అప్పుడు మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడుదాం 

ఏమంటారు మీరు 

x : నేను ఏమనాలి సార్

y: నువ్వే కదయ్యా మా అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అన్నావు

x: నేను పోలీసుస్టేషన్ నుండి మాట్లాడుతున్నాను సార్

మీ అమ్మాయి మీ వీధిలో స్కూటర్ గారేజ్ లోని అబ్బాయిని ప్రేమించి 

ఈరోజు ఉదయం ఆ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్ళి చేసుకుందట

మీరు ఒప్పుకోరని 

వారిని విడదీస్తారని

ఆమె ఇప్పుడు మేజర్ అని మిమ్మల్ని ఒప్పించమని మా స్టేషన్లో ఉంది 

అందుకె మీ అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలి అని అన్నాను 

వచ్చి మాట్లాడండి అని ఫోన్ పెట్టేసాడు



y:😭😭😭😭😭