`అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో…`
`భగవద్గీత … ధారావాహిక-12.`
41d3;55e3;69ఫ3;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀1️⃣2️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️
`(సరళమైన తెలుగులో)`
————————————————
#మొదటి అధ్యాయము:
**అర్జున విషాదయోగము.
అర్జున ఉవాచ:
*41. వ శ్లోకం:*
*అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః।*
*స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః॥41॥*
“ఓ కృష్ణా కాస్త నామాట వినవయ్యా! ఈ యుద్ధంలో మగాళ్లంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చరిల్లితే, విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా! వారు చేయకూడని పనులు చేసి దూషితలు అవుతారు. అప్పుడుఏం జరుగుతుందో తెలుసా!
ఓ వృష్టివంశంలో పుట్టిన మహానుభావా! వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో, ఏ కులమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణా!```
ఈ శ్లోకంలో అ ధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసులవారు. అంటే అధర్మము వృద్ధి చెందినపుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి. పురుషార్థాలు నాలుగు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడు మనసా, వాచా, కర్మణా, తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం. ఇతరులకు ఉపకారం చేయడం. ఇదీ సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం, ధర్మబద్ధమయిన కామములు అంటే కోరికలు కోరుకోవడం, ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటి అన్నిటి ఫలితములను వదిలిపెట్టడం. అదే మోక్షము.
ఇంక అధర్మము అంటే ధర్మము అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనము, సంపదలు సంపాదించడం, అడ్డమైన కోరికలు అన్నీ కోరుకోవడం వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము, సంతోషము ఉందసుకోవడం. ఇదే అధర్మము.
ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది. అంటే భర్తలు లేని భార్యలు అంటే కుల స్త్రీలు కామమునకు, కోరికలకు లోనై దూషితలు అవుతారు. దాని వలన వర్ణ సంకరం ఏర్పడుతుంది.```
*42. వ శ్లోకం:*
*సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ।*
*పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః॥42॥*
“కృష్ణా! ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణ సంకరం జరిగితే, కులవ్యవస్థ నాశనం అయితే, దీనికి కారణం అయిన వాళ్లంతా కులఘాతకులు అవుతారు. అటువంటి వాళ్లు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జల తర్పణాలు ఎవరు విడుస్తారు. పిండప్రదానం ఎవరు చేస్తారు. వారిని ఉత్తమలోకాలకు ఎవరు పంపిస్తారు. ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, జలతర్పణాలు, పిండప్రదానాలు లేకపోతే, వారంతా అధోగతి పాలు అవుతారు కదా! తలచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీని కంతా ఈ యుద్ధమే కారణం కాదా! ఆలోచించు.
*43. వ శ్లోకం:*
*దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః।*
*ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥43॥*
*44. వ శ్లోకం:*
*ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన।*
*నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ॥44॥*
అంతేకాదు కృష్ణా! అక్షౌహిణీలకొద్ది సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణసంకరానికి, కులక్షయానికి, కులధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణము. అందులో సందేహము లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికీ, వారి భార్యలకు, సంతానానికి, యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణసంకరాలు, జాతిధర్మాలు నాశనం కావడానికి కారణం అయిన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా! ఇన్ని అనర్థాలకు మూలం అయిన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా!
*45. వ శ్లోకం:*
*అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్।*
*యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః॥45॥*
“కృష్ణా! మరలా చెబుతున్నాను. దుర్యోధనాదులు సరే వెధవలు, ఆతతాయిలు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడంలేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. మనం బుద్ధిమంతులం కదా! ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో, అర్థంకాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం. అంతే కదా! ఈ తుచ్ఛమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి, బంధువులను, మిత్రులను చంపి, ఘోరమైన పాపం చేసి, చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్పణాలు, పిండప్రదానాలు లేకుండా చేసి, అధర్మానికి ఒడిగట్టి, శాశ్వత నరకలోక వాసం కొని తెచ్చుకోమంటావా! ఇది ఎంత ఘోరమో, దారుణమో నీకు తెలుసా! దీని గురించి ఎపుడైనా ఆలోచించావా!
*46. వ శ్లోకం:*
*యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః।*
*ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్॥46॥*
“కృష్ణా! ఇన్ని మహాపాపాలు చేసి, నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోడం కంటే, గాండీవం వదిలిపెట్టి, అస్త్రసన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేదు. వీరస్వర్గానికిపోతాను. అంతే కానీ నరకానికి పోను. అదే నాకు క్షేమం అని తలుస్తాను. ఈ యుద్ధంచేసి, అందరినీ చంపి, వాళ్ల భార్యలను దూషితులుగా చేసి, వర్ణసంకరం, కులక్షయం చేసి, వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి, ఘోరపాపాలు మూటగట్టుకొని శాశ్వతంలో నరకంలో పడేకంటే, నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా! ఏమంటావు కృష్ణా!”
```
అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ, ఊహాలోకాల్లో తేలిపోతూ, తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కుంగి పోయాడు.
ఇదీ అర్జునుడి మానసిక స్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెబుతున్నాడు…```
*సంజయ ఉవాచ:
*47. వ శ్లోకం:*
*ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్।*
*విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః॥47॥*
ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. "మహారాజా! ఆ ప్రకారంగా అర్జునుడు, మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలిలో, కరుణతో నిండిన వాడై, తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందనీ, యుద్ధం చేసి పాపం మూటకట్టుకోడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి, తన గాండీవమును, అస్త్ర, శస్త్రములను కిందపెట్టి, రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు.```
ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మము అయిన క్షాత్రధర్మమును వదిలిపెట్టాడు అని అర్థం. ఇంక కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే ఒకటి రథం వెనక్కు తిప్పుకొని వెళ్లిపోవడం. రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధము చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాము..
#ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, అర్జున విషాద యోగము అను మొదటి అధ్యాయము సంపూర్ణము. ✍️```(సశేషం)
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
. `🙏యోగక్షేమం వహామ్యహం🙏` `రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం`
`(రిటైర్డ్ రిజిస్ట్రార్,ఏ.పి.హైకోర్టు.)`
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖