8, సెప్టెంబర్ 2026, మంగళవారం

సమస్యాపూరణం

  సమస్యాపూరణం.


సమస్య. "పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని    

పాపంబౌను వీనిన్ వినన్."


సద్యఃస్ఫూర్తిని భావనాపటిమతో, శబ్దార్థ సంశోభతో,

విద్యాదక్షతతో, స్వయంప్రతిభతో, పెంపారు సాహిత్యముల్

హృద్యంబెట్లగు, దోషభాషణలతో, హేయంపు విన్యాసముల్?

"పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్."

సురభి శంకరశర్మ.

కామెంట్‌లు లేవు: