22, ఆగస్టు 2026, శనివారం

నాహంకర్తా



నాహంకర్తా...


2003 జూన్‌ మాసంలో ఒకరోజు...


హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన డా॥ మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పి.వి.ఆర్‌.కె ప్రసాద్‌తో సమావేశమయ్యాను. అప్పటివరకు ఒక వారపత్రికలో ‘సర్వసంభవామ్‌’ శీర్షికన ప్రచురితమవుతున్న ప్రసాద్‌గారి వ్యాసాల్ని ఒక పుస్తకంగా (నాహంకర్తా... హరిః కర్తా) ప్రచురించే విషయమై మాట్లాడుతున్నాం. అదే సంస్థలో జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ప్రముఖ రచయిత, ఐపిఎస్‌ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు, ప్రసాద్‌గారికి రచనాసహకారం అందించిన శ్రీ జి.వల్లీశ్వర్‌ కూడా ఉన్నారు. 


ఆ వారపత్రికలో సీరియల్‌ ఆఖరి భాగం ఆ రోజు పోస్టుకు వెళ్లాలి. వల్లీశ్వర్‌ ఆ భాగం చదివి వినిపిస్తున్నారు. అందులో - ఇండియన్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లోకి వచ్చిన కొత్త రోజుల్లో పివిఆర్‌కె ప్రసాద్‌ ‘సకల కళా వల్లభుడు’గా ఎలా పేరు పడ్డాడో వర్ణించే పేరాలు వచ్చినప్పుడు సీతారామారావు అభ్యంతర పెట్టారు. 

“సర్‌, ఇంతకుముందు అధ్యాయాలన్నిట్లోనూ మీరొక శ్రీనివాసుడి సేవలో తరించి పునీతుడైన వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో ఇలా ‘ఒకప్పుడు నేను సకలకళా వల్లభుణ్ణి’ అని రాస్తే, పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయేమో! ఇది రాయటం అవసరమా?’’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను వింటున్నాను. అలా రాయటం, రాయకపోవటంలో ఉండే ప్రభావాన్ని గురించి ఒక ప్రచురణకర్తగా ఆలోచిస్తున్నాను. 


ప్రసాద్‌గారు తక్షణం స్పందించారు, “సీతారామారావ్‌, ‘నేను ఏమిటి’ అని తీర్పు ఇచ్చేది పైవాడు (భగవంతుడు). పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయన్న కారణంగా ఆ పైవాణ్ణి నేను మోసం చేయగలనా? నో... ఆ పేరాలు అలానే ఉండాలి.’’

ప్రసాద్‌గారిలో నాకొక నిజాయితీ మూర్తీభవించిన రచయిత కనిపించాడు. ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటి అనేక సంఘటనలు ఆయన్ని ఎప్పటికప్పుడు ఒక విశిష్ట వ్యక్తిగా ఆవిష్కరిస్తూ వచ్చాయి. 

సానుకూలతా దృక్పథం: విలువలు

ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనుండి చూడటం జరిగింది.


చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్లే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్లు కొంతమంది. నాకు తెలిసి ప్రసాద్‌గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్లకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు.

తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే తిప్పించుకోవడంగాని ప్రసాద్‌గారి తత్త్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తనదగ్గరికి ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగనివాళ్లు కూడా ఆయనను ప్రేమిస్తారు.

నాకు తెలిసి ప్రసాద్‌గారి మాట సాయం కోసం వెళ్లిన అనేకమందికి ప్రసాద్‌గారే తిరిగి ఫోన్‌ చేసి, పని అయిందీ, లేనిదీ, వచ్చిన వాళ్లు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి వగైరా... వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్‌గారి తత్త్వం. 


నా గత పదిహేనేళ్ల సాన్నిహిత్యంలో ఆయన ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తూలనాడటం నేనెరగను. అనేక లోపాలు ఉన్న వ్యక్తిని గురించి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లోనూ, తనని వ్యతిరేకించినవాళ్లను గురించి ఎవరన్నా మాట్లాడిన సందర్భాల్లోనూ కూడా చతురోక్తులతో ఆ సంభాషణని మరోవైపు మళ్లించేవారు.

ఏదన్నా ఒక బృహత్కార్యానికి చేయూతనివ్వాలని ఏవన్నా సంస్థలు వచ్చి అడిగితే, అది చేయదగిన మంచికార్యం అని భావిస్తే, తనకి శక్తి లేకపోయినా ఏదో రకంగా పనిజరిగే మార్గాన్ని ఎంచుకుని పని జరిపించేవారు. 


“ఎందుకు సార్‌ అంత కష్టపడతారు’’ అని నేనెప్పుడన్నా అడిగితే, ఆయన చెప్పే మాట - “నో.. అని చెప్పడం ఎంతో సులభం విజయకుమార్‌. కాని కార్యం మంచిదైతే చేయడానికి మార్గాన్నీ, శక్తినీ, యుక్తినీ ఆయనే (శ్రీనివాసుడు) కల్పిస్తాడయ్యా.’’ 

ప్రభుత్వంలో ఆయన ఉద్యోగం చేసినా అలానే చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ఆయన తనకి తానుగా తలకెత్తుకున్న - ‘ప్రభుత్వంలో అన్ని శాఖలలో అన్ని స్థాయిల ఉద్యోగాలకు మాన్యువల్స్‌ తయారుచేసే బృహత్కార్యం’, ‘సుపరిపాలన సంస్కరణలు’ ఇందుకు ఉదాహరణలు.

ఇవ్వాళ విలువలు గురించి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అర్థం వేరేగా ఉంటుంది అని అర్థం చేసుకోవలసిన రోజులివి. 


1987 లో పివిఆర్‌కె ప్రసాద్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రసాద్‌ గారింటికి వచ్చి, మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఒక స్వీట్‌ పాకెట్‌ ఇచ్చి వెళ్లిపోయారు. కొంతసేపటికి స్కూలు నుంచి వచ్చిన పిల్లలు స్వీట్స్‌ తిందామని పేకెట్‌ ఓపెన్‌ చేస్తే, అందులో కరెన్సీ ఉంది. వెంటనే పిల్లల్ని ప్రసాద్‌గారు ఆ కరెన్సీ ముట్టుకోనీకుండా ఆపేసి, అవినీతి నిరోధక శాఖకి ఫోన్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో సుబ్బరామిరెడ్డిగారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పేకెట్‌లో ఉన్న కరెన్సీ విలువ లక్ష రూపాయలు! 


1990 లో... తిరుపతిలో పోర్టు ఛైర్మన్‌ ప్రసాద్‌గారి కుమార్తె వివాహం జరిగినప్పుడు పెళ్లికి కార్లు సరఫరా చేసిన సంస్థకి 24 వేల రూపాయల బిల్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి చెల్లించాడు. ఆ బిల్లు చెల్లించింది ఒక పోర్టులో ఒక కాంట్రాక్టరు అని తెలుసుకొని, ప్రసాద్‌గారు ఆ కాంట్రాక్టరు ‘ఎందుకు ఇలా చేశానా’ అని పశ్చాత్తాపపడేలా చేసేదాకా వదలిపెట్టలేదు.


...ఇలాంటి విలువలున్న అధికారుల్ని ఇప్పుడు వెతికి వెతికి చూడాల్సి వస్తోంది. ఉన్నతమైన విలువలు, సేవాభావం, సానుకూలతా దృక్పథాలతో వ్యవహరించే గత తరం అధికారులకి ప్రతీక శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌.


మానవ సంబంధాలు


ప్రసాద్‌గారు భువనగిరి సబ్‌కలెక్టరుగా పనిచేసింది 1960వ దశకం చివర్లో. కాని భువనగిరి ప్రాంతం నుంచి లేదా ఆయన కలెక్టరుగా పనిచేసిన ఖమ్మం జిల్లానుంచి... అవేకాదు, ఆయన గతంలో పనిచేసిన తి.తి.దేవస్థానాలు, పంచాయతీ రాజ్‌, ఎక్సైజ్‌, వైజాగ్‌ పోర్టు, వంటి సంస్థలు లేదా ప్రభుత్వశాఖలనుంచి ఎవరెవరో సిబ్బంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, ఆయన్ని కలుస్తూనే ఉన్నారు. 

నాకు ఆశ్చర్యం వేసేది. పదేళ్లు పక్కింట్లో ఉన్నవాళ్లే బయటికెళ్తే మనల్ని పలకరించరే! ఈయనకేమిటి ఇంత అభిమాన సందోహం!! 

ఆ వచ్చినవాళ్లు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, “మీరున్నప్పుడు ఎంత బావుండేదండీ! ఇప్పుడు అలా లేదండీ’’ అని అర్థం వచ్చేలాగా ఏవో కొన్ని ప్రశంసావాక్యాలు వేస్తుంటారు. వెంటనే ప్రసాద్‌గారు మాట మార్చేసి, “మీ పిల్లలెరా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నీ వ్యాపారం/ఉద్యోగం ఎలా ఉంది?’’ అంటూ ఆ కుటుంబం పట్ల తన కుతూహలాన్ని చూపించేవారు. 


మానవసంబంధాల నిర్వహణలో ప్రసాద్‌గారిది అందె వేసిన చేయి. పనిచేసిన ప్రతిచోటా తనదంటూ ఒక ముద్రవేయటం, ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ తనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ తన సానుకూలతాదృక్పథంతో ప్రభావితం చేయటం, ఎన్ని సంవత్సరాల తరువాతయినా ఆ ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని పేరుతో సంబోధించడం, వాళ్లు బావుండాలన్న తన తపన వ్యక్తం చేయటం... ఇలాంటి అసాధారణమైన మానవతావిలువలు ప్రసాద్‌గారి ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. 


ఆయనతో కలసి పనిచేసిన ఏ స్థాయి ఉద్యోగిని ఇవాళ కదిలించినా, “ప్రసాద్‌గారితో పనిచేశాక వేరే వాళ్లతో పనిచేయటం కష్టమండి’’ అంటారు.


మానవసంబంధాల నిర్వహణకి ఆయన ఒక నిలువెత్తు దర్పణం అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద దృష్టాంతాలున్నాయి. ఆయన 1978-82 లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అప్పుడు దేశంలో కొంతమంది పీఠాధిపతులతో పరిచయాలేర్పడ్డాయి. 1993-94 లో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, అయోధ్య రామాలయాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని పి.వి. నరసింహారావుగారు కోరుకుని ఆ బాధ్యతను తన మీడియా సలహాదారు ప్రసాద్‌కి అప్పగించారు.


 ఆయన దేశంలోని అన్ని పీఠాలు, మఠాలు, అఖాడాలు, గడీలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ తిరిగి కీలకమైన హిందూ ధర్మాచార్యులందరితో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును రిజిస్టరు చేయించారు. (ఈ విషయం ప్రసాద్‌గారు 2010 లో తన ‘అసలేం జరిగిందంటే..’ వ్యాసాల్లో రాసేదాకా ఎవరికీ తెలియదు).

2006 - 17 మధ్య కాలంలో హిందూధర్మ పరిరక్షణ ఉద్యమం కోసం సుమారు 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో తిరుమలలో నాలుగుసార్లు ధార్మిక సదస్సులను విజయవంతంగా నిర్వహించగలిగిన ఏకైకవ్యక్తి పివిఆర్‌కె ప్రసాద్‌. ఆయన ద్వైత శాఖకు చెందిన వ్యక్తి అయినా అన్ని శాఖల ధర్మాచార్యులు ఆయనని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అనుసరిస్తారు.


“ఎలా సాధ్యం?’’ అని అడిగితే, “ఆ మధ్య (1978-82) టి.టి.డి ఈవోగా చేశాను కదా. అప్పటి పరిచయాలే!’’ అని చులాగ్గా అనేస్తారు. ఎంత దుస్సాధ్యం - ఇంతలా మానవసంబంధాల్ని నిర్వహించడం! 

ముఖ్యమంత్రులుగా పనిచేసిన పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీ రామారావు, ఎన్‌. జనార్దన రెడ్డి, చంద్రబాబు నాయుడు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లతో సహా తనకు సంబంధించిన ప్రతి మంత్రితో కూడా సత్సంబంధాలు నెరుపుతూనే, తన విశ్వాసం, విలువల విషయంలో రాజీ పడకుండా “అత్యంత సమర్థుడైన అధికారిగా పనిచేశాడు’’ అనిపించుకున్న ఏకైకవ్యక్తి కూడా పివిఆర్‌కె ప్రసాద్‌ గారే. 


ఆగస్టు 21 2017 ఉదయం శ్రీ ప్రసాద్‌గారి భౌతికకాయానికి నమస్కారం పెట్టుకోవటానికి నేను వెళ్లినప్పుడు ప్రసాద్‌ గారి భార్య శ్రీమతి గోపిక గారు గద్గద స్వరంతో ‘నాహంకర్తా హరిః కర్తా... ఇక లేరు’ అన్నారు.


 నాహంకర్తా హరిః కర్తా ఆయన రాసిన పుస్తకం పేరు మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని నడిపించిన వాక్యం. 


అందుకే శ్రీప్రసాద్ గారు ఈ తరానికి ఒక స్ఫూర్తి. 


ఆయనతో నాకు కొన్ని అనుభవాలున్నట్లే ఈ సమాజంలో అనేకమందికి గొప్ప అనుభవాలున్నాయి. ఆయనతో గల అనుబంధాన్ని అక్షరరూపంలో పంచుకోవాలనే నా మిత్రులు కొందరి ఆకాంక్ష ఈ పుస్తకానికి నాంది పలికింది. సోదరులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఈ పుస్తక రూపకల్పన మాకు సులభతరం అయింది. కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేం కదా! కాని కొండంత ప్రేమతో, భక్తితో పూజ చేయవచ్చు. అందుకే ఆకాశమంత మిత్రుడికి ఈ నివాళి!


ఎమెస్కో విజయకుమార్

[22/08, 2:15 pm] Deekshitulu Chavali: ⬆️ పై వ్యాసం చదవండి కొంచెం పెద్దదైనా. ఎందుకంటే, ఒక మంచి అధికారి వుంటే సొసైటీ ఎంత బాగుపడుతుందన్న విషయం మనకు విశధం అవుతుంది. శ్రీ ప్రసాద్ గారు మధ్వ బ్రాహ్మణులు.

మేనమామ

 *మేనమామ :*


మన బంధుత్వాలలో మేనమామ కు ఎందుకంత ప్రాముఖ్యత కల్పించారు మన పెద్దవాళ్ళు?

ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక మనిషి గురించి చెప్పకూడదు, ఒక వ్యవస్థ గురించి చెప్పాలి. మన పెద్దలు మేనమామ అనే వ్యవస్థను ఒక సెక్యూరిటీ లాకర్ లాగా తయారు చేసి పెట్టారు. ఆ లాకర్ తాళం చెవి ఆడబిడ్డ జీవితం మొదటి నుంచి చివరి వరకు పనిచేస్తుంది.


దానికి నాలుగు పదునైన కారణాలున్నాయి.


1. తల్లి బతికి ఉన్నంత వరకు తల్లి, తల్లి లేకపోతే మేనమామ.


మనం తండ్రి గోత్రం తీసుకుంటాం, కానీ తల్లి రక్తం తీసుకుంటాం. తండ్రి వంశం మనకు పేరు ఇస్తే, తల్లి వంశం మనకు రక్ష ఇస్తుంది.


పాత రోజుల్లో మరణాలు ఎక్కువ. చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోతే పిల్లలు అనాథలు కాకూడదని, "తల్లిదండ్రులు చనిపోయినా మేనమామ బతికి ఉండాలి" అని దీవించేవారు. ఎందుకంటే అత్త, మామ, పిన్ని, బాబాయి అందరూ ఆస్తి వైపు వాళ్లు, మేనమామ ఒక్కడే అమ్మ వైపు వాడు. వాడు ఆస్తి అడగడు, ప్రేమనే పంచుతాడు. అమ్మ తర్వాత అంత ప్రేమగా "ఒరేయ్" అని పిలిచే హక్కు వాడికే ఉంటుంది.


అందుకే మన సామెత - తల్లి తర్వాత తల్లి లాంటిది మేనమామ ప్రేమ.


2. ప్రతి ముడికీ మొదటి ముడి మేనమామే.


ఆడపిల్ల కానీ, మగపిల్లాడు కానీ - వాళ్ల జీవితంలో మొదటి బట్ట వేసేది మేనమామే.


పుట్టు వెంట్రుకలకు మేనమామ రావాలి.


బారసాలకు ఒళ్లో కూర్చోబెట్టేది మేనమామే.


అక్షరాభ్యాసానికి బలపం పట్టించేది మేనమామే.


పెళ్లిలో పెళ్లికొడుకును భుజం మీద మోసేది, గండం తీసేది, కాళ్లకు చెప్పుల జోడి తెచ్చేది మేనమామే.


నువ్వు అన్నట్టు "అన్నింటికీ ముందు మేనమామ రావాలి" అనే క్లారిటీ మన ఇంట్లో ఉండటానికి కారణం - ఏ శుభకార్యం అయినా తల్లి పుట్టిన ఇంటి సాక్షి లేకుండా మొదలు పెట్టకూడదు అనే నియమం. ఆ సాక్షి సంతకమే మేనమామ.


పెళ్లిలో పప్పు దగ్గర నుంచి తలంబ్రాల వరకు ఆయన పాత్ర లేకపోతే ఆ పెళ్లి అసంపూర్ణమే.


3. సారె, పసుపు కుంకుమ - ఆడబిడ్డకు పుట్టిల్లు ఇచ్చే ధైర్యం


మేనమామ ప్రాముఖ్యతకు అసలైన పరీక్ష ఇక్కడే ఉంటుంది.


సారె: అత్తగారింట్లో ఎన్ని చీరెలు ఉన్నా, పుట్టింటి నుంచి వచ్చిన ఒక్క చీరె ఆడబిడ్డకు పట్టు చీరె కంటే ఎక్కువ. అది చీరె కాదు, ఒక సందేశం - "నువ్వు అక్కడ ఉన్నా, నీకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది" అని. ఆ సందేశాన్ని మోసుకొచ్చే పోస్ట్ మాన్ మేనమామ.


పసుపు కుంకుమ : అత్తగారి ఇంటి పసుపు అలంకారం, పుట్టింటి పసుపు దీవెన. "నా పసుపు వెలిసిపోలేదు, నా బొట్టు చెదరలేదు" అని ఆడబిడ్డ తన పుట్టింటికి చెప్పుకునే భాష ఇది. ఆ దీవెన తెచ్చే పూజారి మేనమామ.


4. ఆఖరి చీరె - జీవిత వృత్తాన్ని పూర్తి చేసే మనిషి


ఇదే అత్యంత హృద్యమైన, పదునైన నిజం.


మన ఆచారంలో ఒక ముత్తైదువు చనిపోతే, ఆమెకు కట్టే ఆఖరి చీరె పుట్టింటి నుంచి రావాలి. దాన్ని కడసారి చీరె / పుట్టింటి సారె అంటారు. ఆ చీరె రాకపోతే కర్మ కదలదు, శవాన్ని కూడా కదపరు.


బతికినన్నాళ్లు అత్తగారి పట్టు చీరెలు కట్టినా, ఆఖరి రోజున పుట్టింటి చీరె కట్టి పంపుతారు. ఎందుకంటే ఆమె మొదట ఒక కూతురు, ఆ తర్వాతే కోడలు, భార్య, తల్లి.


లోకం అంతా "అయ్యో వెళ్లిపోయింది" అని ఏడుస్తుంటే, ఆ చీరె మాత్రం "రా తల్లీ, ఇంటికి రా" అని పిలుస్తుంది.


పుట్టినప్పుడు పంచెతో మొదలైన మేనమామ బంధం, పోయినప్పుడు చీరెతో ముగుస్తుంది.


ఆఖరి చీరె తెచ్చే బాధ్యత కోసమే మేనమామ బతికి ఉండాలని పెద్దలు దీవించారు.


మొత్తంగా సంధానం ఏమిటంటే -


మేనమామ అనేది ఒక బంధం పేరు కాదు, అది ఒక బాధ్యత పేరు.


పుట్టినప్పుడు ఒడిలోకి తీసుకునే బాధ్యత,


పెళ్లిలో భుజం మీద మోసే బాధ్యత,


పండక్కి సారె మోసుకొచ్చే బాధ్యత,


చివరకు కడసారి చీరె తెచ్చి తన ఆడబిడ్డను తానే సాగనంపే బాధ్యత.


ఈ నాలుగు బాధ్యతలను మోసే మనిషికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎలా ఉంటారు? అందుకే మన ఇంట్లో ప్రతి పనికి ముందు - ముందు మేనమామకు చెప్పండి అంటారు.

పంచాంగం 22.08.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 22.08.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష దశమి తిథి స్థిర వాసర జ్యేష్ఠ నక్షత్రం నిష్కంభ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: దశమి.



 

నమస్కా🕉️


పంచాంగము 🌓 22.08.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: శుక్ల - శుద్ధ 


తిథి: దశమి రా.01:50 వరకు

తదుపరి ఏకాదశి

 

వారం: శనివారం - మందవాసరే

 

నక్షత్రం: జ్యేష్ఠ సా.04:06 వరకు

తదుపరి మూల


యోగం: విష్కుంభ రా.తె.05:44 వరకు 

తదుపరి ప్రీతి

 

కరణం: తైతుల ప‌.12:47 వరకు

తదుపరి గరజ రా.01:50 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: లేదు 


దుర్ముహూర్తం: ఉ‌.06:00 - 07:36


రాహు కాలం: ఉ‌.09:09 - 10:44


గుళిక కాలం: ఉ‌.06:00 - 07:35


యమ గండం: ప‌.01:53 - 03:28

 

అభిజిత్: 11:53 - 12:43


సూర్యోదయం: 06:00


సూర్యాస్తమయం: 06:37


చంద్రోదయం: ప‌.02:25


చంద్రాస్తమయం: రా.12:39


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


దిశ శూల: తూర్పు


నక్షత్ర శూల: తూర్పు


🌱 అశాదశమి‌ 🌱


🎋 దశవ్రతం‌ 🎋


💧 ఏకభుక్తము‌ 💧


🥛 ధదివ్రత‌ సంకల్పము 🥛


🏳️ శ్రీ ప్రతాప వేంకటేశ్వర

అవధాని జయన్తి 🏳️


🚩 కాఞ్చీజగద్గురు శ్రీపరమశివేన్ద్ర 

సరస్వతీ స్వామి పుణ్యతిథి🚩


🏳️ శ్రీ పద్మనాభతీర్థ పుణ్యతిథి 🏳️

 (గురు మఠం, కార్వార్)


🪄 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి

పవిత్రోత్సవ అంకురార్పణ 🪄


🌴 అశ్వత్థ మారుతి పూజ 🌴


🎉 శ్రీ వేంకటేశ్వర వ్రతము 🎉


🎊 మదురై శ్రీ సోమసుందరర్రః

అవని‌ ఉత్సవం 🎊

 

🎊 శ్రీ వైకుంఠం వైకుంఠపతి 

పెరుమాళ్ అభిషేక ఉత్సవం 🎊


🔯 , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।



ప్రతిపదార్థ:



కచ్చిత్ — ఒకవేళ; న — కాదు; ఉభయ — రెండు; విభ్రష్టః — భ్రష్టుడై; ఛిన్న — చెదిరిపోయిన/విడిపోయిన; అభ్రమ్ — మేఘము; ఇవ — లాగా; నశ్యతి — నిశించిన; అప్రతిష్ఠః — ఎటువంటి ఆధారం లేకుండా; మహా-బాహో — గొప్ప బాహువులు కల, కృష్ణా; విమూఢః — దిగ్భ్రమచెందిన; బ్రహ్మణః — భగవత్ ప్రాప్తి యొక్క; పథి — మార్గములో ఉన్న వ్యక్తి.



తాత్పర్యము: 


యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?




వివరణ:


విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం; భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము/కార్యసిధ్ధి రెండు రంగాలలో ఉంటుంది - భౌతిక మైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికప్రపంచం లో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడుతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ, వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.


ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.

చతుర్వేదాల వైభవం — వేదపురుషుల ధ్యానరూపాలు.*"_

 _"*చతుర్వేదాల వైభవం — వేదపురుషుల ధ్యానరూపాలు.*"_


 *వేదం అంటే జ్ఞానం* . 


*భారతీయ వైదిక సంప్రదాయానికి మూలాధారం అయిన చతుర్వేదాలు — "ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం."*


*వేదసాహిత్యంలో సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వంటి విభాగాలు ఉన్నాయి.*


వేదాలను కేవలం గ్రంథాలుగా మాత్రమే కాకుండా వేదపురుషులుగా, సాకార ధ్యానమూర్తులుగా భావించే సంప్రదాయం కూడా ఉంది. 


శ్రీలక్ష్మీనారాయణ సంహితలో ఈ నాలుగు వేదాల ధ్యానరూపాలు ప్రత్యేకంగా వివరించబడ్డాయి.


━━━━━━━━━━━━━━━━━━

🌿 ౧. *ఋగ్వేదం — వేదజ్ఞానానికి ఆది స్వరూపం* 🌿

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం* :


 *ఋగ్వేదః శ్వేతవర్ణశ్చ* 

 *ద్విభుజో రాసభాననః* ।

 *అక్షమాలాంబుపాత్రం చ* 

 *బిభ్రన్ స్వాధ్యయనే రతః* ॥


 *భావం* :


ఋగ్వేద పురుషుడు శ్వేతవర్ణంతో, రెండు చేతులతో, రాసభం (గాడిద) ముఖంతో ధ్యానించబడతాడు. ఆయన చేతుల్లో అక్షమాల, జలపాత్ర ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ స్వాధ్యాయంలో నిమగ్నుడై ఉంటాడు.


*ఋగ్వేదం యొక్క గొప్పతనం.* ~


ఋగ్వేదం నాలుగు వేదాలలో ప్రాచీనమైనదిగా, విస్తృతమైనదిగా ప్రసిద్ధి చెందింది. దేవతాస్తుతులు, ప్రకృతి, యజ్ఞం, విశ్వతత్త్వం, మానవజీవితం, ఆధ్యాత్మిక చింతన వంటి అనేక అంశాలు ఇందులో కనిపిస్తాయి. భారతీయ మత, తత్త్వ, సాహిత్య వికాసానికి ఋగ్వేదం మూలాధారంగా నిలిచింది.


━━━━━━━━━━━━━━━━━━

🔥 ౨. *యజుర్వేదం — యజ్ఞకర్మకు మార్గదర్శి* 🔥

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *అజాస్యః పీతవర్ణశ్చ* 

 *యజుర్వేదోఽక్షసూత్రవాన్* ।

 *వామే చాంకుశపాణిస్తు* 

 *భూతిదో మంగళావహః* ॥


 *భావం* :


యజుర్వేద పురుషుడు పీతవర్ణంతో, అజముఖంతో (మేక ముఖంతో) ధ్యానించబడతాడు. ఆయన అక్షసూత్రాన్ని ధరించి, చేతిలో అంకుశాన్ని కలిగి, భూతి అంటే ఐశ్వర్యాన్ని, మంగళాన్ని ప్రసాదించేవాడిగా వర్ణించబడ్డాడు.


*యజుర్వేదం యొక్క గొప్పతనం.* ~


యజుర్వేదం ప్రధానంగా యజ్ఞకర్మకు మార్గదర్శకమైన వేదం. యజ్ఞంలో ఏ కర్మను ఎలా నిర్వహించాలి, ఏ మంత్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలి వంటి విషయాలకు ఇది ముఖ్యమైన ఆధారం. అధ్వర్యువు అనే యజ్ఞ ఋత్విక్కు యజుర్వేదం ప్రధాన ఆధారం. దర్శపూర్ణమాస, అగ్నిహోత్ర, సోమయాగ, వాజపేయ, అశ్వమేధ వంటి అనేక యజ్ఞవిధానాలకు సంబంధించిన మంత్రాలు ఇందులో ఉన్నాయి.


━━━━━━━━━━━━━━━━━━

🎶 ౩. *సామవేదం — మంత్రానికి సంగీత స్వరూపం* 🎶

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *నీలోత్పలదలాభాసః* 

 *సామవేదో హయాననః* ।

 *అక్షమాలాధరః సవ్యే* 

 *వామే కంబుధరః స వై* ॥


 *భావం:* 


సామవేద పురుషుడు నీలకమల దళంలాంటి కాంతితో, గుర్రముఖంతో ధ్యానించబడతాడు. ఆయన అక్షమాలను ధరించి, మరొక చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నవాడిగా వర్ణించబడతాడు.


*సామవేదం యొక్క గొప్పతనం.* ~


సామవేదం నాలుగు వేదాలలో అత్యంత సంక్షిప్తమైనది. ఇందులోని అధిక భాగం మంత్రాలు ఋగ్వేదం నుంచే వచ్చినప్పటికీ, వాటిని ప్రత్యేకమైన సామగాన స్వరపద్ధతిలో ఆలపించడం దీని ప్రత్యేకత. యజ్ఞంలో ఉద్గాతృ ఋత్విక్కు సామవేదం ప్రధాన ఆధారం. భారతీయ సంగీత సంప్రదాయ వికాసంతో సామవేదానికి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది.


━━━━━━━━━━━━━━━━━━

🌿 ౪. *అథర్వవేదం — లోకక్షేమం, ఆరోగ్యం, శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం* 🌿

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *అథర్వణాభిధో వేదో* 

 *ధవలో మర్కటాననః* ।

 *అక్షసూత్రం చ ఖట్వాంగం* 

 *బిభ్రన్ వై విజయప్రదః* ॥


 *భావం:* 


అథర్వవేద పురుషుడు ధవళవర్ణంతో, మర్కటముఖంతో (కోతి ముఖంతో) ధ్యానించబడతాడు. ఆయన అక్షసూత్రం, ఖట్వాంగాన్ని ధరించి, విజయాన్ని ప్రసాదించేవాడిగా వర్ణించబడ్డాడు.


*అథర్వవేదం యొక్క గొప్పతనం.* ~


అథర్వవేదంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విభిన్న విషయాలు కనిపిస్తాయి. ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, శాంతి, ఐశ్వర్యం, స్నేహం, దీర్ఘాయుష్షు వంటి విషయాలతో పాటు పరమసత్యం, కాలం, మరణం, అమరత్వం వంటి తాత్త్విక అంశాలు కూడా ఉన్నాయి.


భూమి సూక్తం, బ్రహ్మచర్య సూక్తం, కాల సూక్తాలు, వివాహ సూక్తం, సామనస్య సూక్తం వంటి ముఖ్యమైన సూక్తాలు అథర్వవేదంలో ఉన్నాయి. అందువల్ల అథర్వవేదం మానవ జీవనంలోని భౌతిక, సామాజిక, వైద్య, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించే విశిష్ట వేదంగా నిలుస్తుంది.


━━━━━━━━━━━━━━━━━━

🌺 *చతుర్వేదాల సమగ్ర వైభవం* 🌺

━━━━━━━━━━━━━━━━━━


 *ఋగ్వేదం* — జ్ఞానం, స్తుతి, విశ్వచింతనకు ప్రధాన ఆధారం.


 *యజుర్వేదం* — యజ్ఞకర్మ, ఆచరణ, కర్మవిధానానికి ప్రధాన ఆధారం.


 *సామవేదం* — మంత్రాన్ని స్వరంతో, గానంతో యజ్ఞంలో ప్రతిష్ఠించే వైదిక సంప్రదాయం.


 *అథర్వవేదం* — ఆరోగ్యం, శాంతి, రక్షణ, లోకక్షేమం, తాత్త్విక జ్ఞానం వంటి విస్తృత జీవనాంశాలను ప్రతిబింబిస్తుంది.


ఈ నాలుగు వేదాలు పరస్పరం వేర్వేరు అంశాలను ప్రధానంగా ప్రతిపాదించినప్పటికీ, మొత్తం వైదిక సంప్రదాయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అవన్నీ కలిసి ఒక మహత్తర జ్ఞానపారంపర్యాన్ని నిర్మిస్తాయి.


*వేదం కేవలం పఠించవలసిన గ్రంథం మాత్రమే కాదు* —

*జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించే జ్ఞానసంపద.*


 *వేదోఽఖిలో ~ ధర్మమూలమ్*


 🙏*ఓం శ్రీం ఓం* 🙏