30, జనవరి 2025, గురువారం

సవాళ్లపై గెలవడమే.

 డిఫీట్(defeat)అన్న పదమే ఒక ఫీట్!*

```

అప్పటి దాకా విజయంతో విర్రవీగే శాల్తీని ఒక్కసారి పల్టీ కొట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే ఆపజయం.


విజయకాంక్షకు మంచిచెడుల విచక్షణ ఉండదు. అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి. తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణవుతుంది. 


జపనీయులకు తాజా చేపలంటే ఇష్టం. కానీ జపాన్ సమీప సముద్రజలాల్లో చాలినన్ని చేపలు దొరికేవి కావు. అందుకని మత్స్యకారులు పెద్ద నావల్లో బాగా దూరాలు వెళ్లి చేపలు పట్టేవారు. కానీ, తిరుగు ప్రయాణానికి చాలా సమయం పట్టడంతో వాటిలోని తాజాదనం తగ్గిపోయేది. 


ఈ ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఫ్రీజర్ లు ఉనికిలోకి వచ్చాయి. పట్టుకొన్న చేపల్ని అక్కడికక్కడే నావల్లో అమర్చిన ప్రీజర్లలో భద్రం చేసేవాళ్ళు దాంతో మరింత దూరం వెళ్లి ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారు. 


ఎంతైనా తాజా చేపలే రుచి అనుకున్న ప్రజలు వాటికే ప్రాధాన్యం ఇవ్వటంతో, ఫ్రీజ్డ్ ఫిష్ మార్కెటింగ్ చేసే కంపెనీలు దివాలా బాటపట్టాయి. 


ఈ సమస్యకూ ఆ కంపెనీలు విరుగుడు కనిపెట్టాయి. నేరుగా నావల్లోనే నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకొన్నాయి. వ్యాపార సంస్థలకు లాభాలు ప్రధానం కాబట్టి తక్కువ సైజు తొట్టెలలో సాధ్యమైనంత ఎక్కువ సరుకు కుక్కుతుండేవి. నీటిలో కదిలేందుకు చాలినంత చోటు లేక నీరసపడిపోయేవి చేపలు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 


అయినా మత్స్య పరిశ్రమ మొత్తం తలలు పట్టుకు కూర్చోలేదు. జపనీయులు సహజంగానే కార్యసాధకులు. ఆ పట్టుదల కారణంగానే నేటికీ రుచికరమైన తాజా మత్స్యాహార పదార్ధాలకు జపాన్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది. 


చివరికి వారేంచేశారంటే... నీటి ట్యాంకులో చేపలతో పాటు ఒక చిన్న షార్క్ ను కూడా వేసేవారు. ప్రాణభయంతో చేపలు అనుక్షణం కదులుతూ అప్రమత్తంగా ఉండేవి. ఆ కదలికల్లోని చురుకుదనం వాటిని జీవకళతో తాజాగా ఉంచేది.


జగజ్జేతగా ఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ జీవితమంతా విజయగాథలతో నిండిలేదు. పెషావర్ యుద్ధంలో 'అశ్వకుల' అనే బలమైన శత్రుజాతిని వీరోచితంగా ఎదుర్కొనే శక్తి చాల్లేదతనికి! దాంతో రాత్రి చీకట్లో కోటలోకి జొరబడి మూకుమ్మడి ఉచకోతలకు తెగబడ్డ ఉదంతాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు సుధాకర్ చటోపాధ్యాయ'ద అకమీనీడ్స్ అండ్ ఇండియా'లో గ్రంథస్థం చేశారు.


సవాళ్లు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి.వాటిమీద పైచేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది. 


గెలుపు కేవలం సంతృప్తినే కాదు.. సంతోషాన్ని అందిస్తుంది. 


సంతోషంగా జీవించడమంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లపై గెలవడమే.

Panchaag


 

వారాలను మొదట తయారు చేసిందెవరో

 *వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?*



*"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "*  అంటే అర్ధం తెలుసా? 


*సూర్యహోర*


*చంద్రహోర*


*కుజహోర*


*బుధహోర*


*గురుహోర*


*శుక్రహోర*


*శనిహోర - అంటే*


ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి.


ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.


1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!


కాస్త విపులంగా....


భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.


మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః


అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 


ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 


ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?


ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 


ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.


ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 


ఆ భాగాలను వారు "హోర" అన్నారు.


"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.


దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 


ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.


హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.


ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 


ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 


కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.


మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,


ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.


ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.


అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 


వస్తున్నా... అక్కడికే వస్తున్నా...


ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 


దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.


అదే మొదటిరోజు. 


అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.


ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 


అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.


ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం!

ఇరవై ఏడు నక్షత్రాల

 _*భజే శ్రీనివాసమ్*_

*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

*రచన.*

*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


 *అశ్వని. --1*


నక్షత్రాలన్నింటిలో మొదటిది అశ్వని. ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు అధి దేవతలు. ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశికి చెందుతాయి.అశ్వని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవతల వైద్యుడైన ధన్వంతరి శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుని అశ్వనీ నక్షత్రం రోజున ఎవరు ఆరాధిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యం నుంచైనా వెంటనే ఉపశమనం కలుగుతుంది. పూర్వకాలంలో కోసల దేశంలో రేవంతుడనే రాజు ఉండేవాడు.

రేవంతునికి పూర్వ జన్మ కర్మ ఫలితంగా ఒక విచిత్ర రోగం పట్టుకున్నది. పగలు ఎంతో చలాకీగా ఉండే రేవంతునికి సూర్యాస్తమయం కాగానే

కంటిచూపు మందగించేది. చెవులకు ఏమీ వినిపించేది కాదు. తల తిరుగుతున్నట్లుగా ఉండేది. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి తానుఎవరో కూడా మరిచి పోయేవాడు. రాత్రంతా నిద్ర లేక అంత:పురం అంతా పిచ్చి వాడిలా తిరిగేవాడు. తెల్లవారగానే తిరిగి మామూలు మనిషి అయ్యేవాడు. ఈ వ్యాధి ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. రాజవైద్యులు

చెయ్యని చికిత్స లేదు. ఈ వ్యాధి అంతు పట్టక రాణి ఎంతో దు:ఖించి ఎన్నో దేవతలకు మొక్కుకున్నది. అయినా ఫలితం లేకపోయినది. రాజు తన ఈ వింత వ్యాధి పోగొట్టినవారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. దేశం నలుమూలల నుండి ఎందరో గొప్ప వైద్యులు వచ్చి ఎన్నో రకాల వైద్యం చేసినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. ఆ రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. పగలంతా శిష్యులతో సంచారం చేసి రాత్రికి ఒక పెద్ద చెట్టుకింద

విశ్రమించాడు.అటుగా పోతున్న బాటసారులు కొంతమంది ఆ రాత్రికి ' చెట్టుకిందనే గడుపు దామని వచ్చారు.ఆ బాట సారుల మాటలు కొన్ని సాధువు చెవిన పడ్డాయి. ఆ దేశపు రాజైన రేవంతుడు ఎంతకీ అంతుచిక్కని విచిత్ర వ్యాధితో బాధ పడు తున్నట్లుగా గ్రహించాడు. ఆ రాజు వ్యాధి తగ్గే మార్గం తన దగ్గర ఉన్నదని గ్రహించిన సాధువు మరుసటి రోజు రాజాస్థానానికి చేరుకున్నాడు. తను వచ్చిన సంగతి వివరించాడు.తాను రాజుయొక్క వ్యాధి తప్పక నయం చేయగలనని మంత్రితో చెప్పాడు. అయితే అతని మాటలను ఎవరూ నమ్మలేదు. ఎందరో గొప్ప వైద్యులకు సాధ్యం కానిది ఈ సామాన్య సాధువు వలన అవుతుందా అని తలచారు.కానీ రాణి మాత్రం ఏ పుట్టలో ఏ పాముందోనని తలచి సాధువుతో" స్వామీ!  తమరి రాక మాకెంతో సంతోషం, దయచేసి నా నాథుడి వ్యాధి నయమయ్యే దారి చెప్ప వలసింది" అని వేడుకుంది. అంతట ఆ సాధువు ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానించి 'అమ్మా! నేను చెప్పినట్లుగా చేస్తే ఈవ్యాధి తప్పక నయ మవుతుంది. ఈ వ్యాధే కాదు, ఎంతటివ్యాధైనా సరే తప్పక నయమవుతుంది. నీవు చేయవలసిందల్లా ఒక్కటే! రాజును నీవెంట పెట్టుకుని వేంకటాద్రి చేరి అశ్వనీ నక్షత్రం నాడు పుష్కరిణిలో స్నాన మాచరించి, వరాహ స్వామిని దర్శించి అటు తర్వాత ఆనందనిలయంలోని శ్రీనివాసుని దర్శించవలసింది. ఆ మరుదినమే రాజు పూర్తిఆరోగ్యవంతుడౌతాడు. నేటికి ఏడవరోజునే అశ్వనీ నక్షత్రం. ఇక ఆలస్యంచేయక రేపే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని తిరుమల యాత్ర చేయవలసింది

అని చెప్పాడు.ఇదంతా సావధానంగా విన్న రాణి ఆ సాధువునికి నమస్కరించి

తగు రీతిన సత్కరించి పంపింది. సాధువు చెప్పినట్లు గానే వెంటనే ప్రయాణపు ఏర్పాట్లు ప్రారంభించి అశ్వనీ నక్షత్రానికి ఒకరోజు ముందుగానే తిరుమలకు చేరుకున్నారు. మరునాడు సూర్యోదయం కాగానే రాజు,రాణి ఇద్దరూ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, వరాహ స్వామిని దర్శించి తరువాత ఆనంద నిలయంలో శ్రీ స్వామి వారిని దర్శించారు. స్వామిని తమను అనుగ్రహించ వలసిందిగా అనేక విధాల ప్రార్థించారు.ఆ రోజు రాత్రి కొండమీదనే విశ్రమించ దలచారు. సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్ది రాణి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ రాత్రి

తన నాథుడు ఎలా వుంటాడో అని ఎంతో బాధపడింది. ఇంతలోనే సాయంత్రం అయ్యింది. రాజు నవ్వుతూ కులాసాగా వున్నాడు. రాత్రి చీకటి కాసాగింది. రాజులో వ్యాధి లక్షణాలు ఎక్కడా లేవు.

రాజు పూర్తి ఆరోగ్యవంతుడిలా వున్నాడు. రాజు వ్యాధి పూర్తిగా నయమైందని గ్రహించిన దంపతుల ఆనందానికి అవధులు లేవు.తెల్లవార గానే ఆ రాజ దంపతులిద్దరూ ఆలయానికి వెళ్ళారు. వారు ఆనంద నిలయం చేరేటప్పటికి అక్కడ వున్న అర్చకులు ఎంతో కమనీయ స్వరంతో స్వామికి సుప్రభాతసేవ చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీనివాసుని ఆ అద్భుత దివ్య మంగళ స్వరూపం చూసిన రాజ దంపతులు ఆనందానికి

అవధులు లేవు. ఈ సృష్టిలోని అందం అంతా ఆ స్వామిదే. ఈ విశ్వంలోని తేజస్సంతా ఆ పరబ్రహ్మమూర్తిదే. ఈ జగత్తులోని ఆనందమంతా స్వామిలోనే వున్నది. ఇలా స్వామి గుణ గణాలను తలుస్తూ రాజ దంపతులిద్దరూ చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ నిల్చున్నారు. సుప్రభాతసేవ పూర్తికాగానే


అక్కడ వున్న అర్చకులతో రాజుయొక్క అనారోగ్యము, తిరుమల యాత్రతో స్వామి అనుగ్రహంతో రాజు అనారోగ్యం పూర్తిగా నయమవటం తెలిపారు.

అప్పుడు అర్చకులు ఆ రాజుతో మహారాజా! ఈ శ్రీనివాసుడు భక్త వత్సలుడు.తనను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి. ఆ స్వామిని జీవితాంతం కొలచి మీ జన్మను సార్థకం చేసుకొనవలసింది అని అన్నారు. అప్పుడు రాజ దంపతులిద్దరూ “ఓ శ్రీమన్నారాయణా! శ్రీనివాసా!

నీవు భక్త సులభుడవు. నిన్ను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే

అమృతమూర్తివి. ఈ సృష్టిలో నిన్ను మించిన దైవం లేదు. నీకివే మానమస్కారాలు”. అని పరిపరివిధాల ప్రార్థించి తిరిగి రాజ్యానికి పయనమై

కలకాలం సుఖంగా జీవించారు.

అశ్వనీ నక్షత్రం నాడు స్వామిని దర్శించినవారికి సంపూర్ణ

ఆరోగ్యంతోపాటు, ఐశ్వర్యమూ కలుగుతుంది. ఎటువంటి అనారోగ్యమైనాక్షణంలో మాయమౌతుంది. ఎంతటి దీర్ఘవ్యాధులైనా అశ్వనీ నక్షత్రంనాడు శ్రీ స్వామిని దర్శించటం వలన వెంటనే నయమవుతాయి.ఓ శ్రీనివాసా! నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణా! నీకివే ప్రణామములు. ఓ జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.

" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐

మాఘ పురాణం - 1 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం - 1 వ అధ్యాయము*_

🌹🍃🌸🍃🌻🍃🌺🍃🌷


*మాఘ మాస మహిమ*


*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*


 ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారత దేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెంది నాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయక ములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ పావనమూ  సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరి నాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచు కొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతం లోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించు కునేవారు అంటే నైమిశారణ్యం లోని ఆ ఆశ్రమంలో జపహోమా దులూ లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణ ప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామ ధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరము లైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ వుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరు నవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింప జేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్న వారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢ మైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాల స్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయే టట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల నున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా ,తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైననుసూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మల నొందుదురు సుమా,దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింప జేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానము గాని చేసిన స్నానఫలమునొంది పుణ్య వంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యము కల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘ మాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వత ముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసి పోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సుల నందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండ పోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్య కార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలముల నిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగ భాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమును పోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘ మాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘ స్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును  తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

🌹🍃🌸🍃🌻🍃🌺🍃🌷

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*అమ్మ చెప్పిన మాట!*


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఓ ఐదారు అడుగుల వెడల్పుతో కాలిబాట లాగా ఉండేది..మిగిలిన స్థలమంతా గడ్డి మొలచి..అందులో పల్లేరు కాయల ముళ్ళతో నిండిపోయి ఉండేది..ఈ పరిస్థితి 2004 సంవత్సరం నాటిది..అప్పటికి నేను ధర్మకర్త గా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు కూడా కాలేదు..ఆ ప్రక్క ఆదివారం రోజున..గాలిచేష్ట లతో బాధపడుతున్న భక్తులు..ఆ ముళ్ల మీదే కేకలు వేసుకుంటూ పరిగెడుతున్నారు..వారున్న మానసిక స్థితిలో..వారికి ముళ్ళు గ్రుచ్చుకున్నా పెద్దగా బాధ పడటం లేదు కానీ..చూస్తున్న మా కందరికీ చాలా కష్టంగా అనిపించింది..


ఆ ప్రక్కరోజే మనుషుల ను మాట్లాడి..ఆ స్థలమంతా శుభ్రంగా చేయించాను..మొత్తం ప్రాంగణం మంతా నాపరాయి పరిపించాలని సంకల్పించాను..సుమారు యాభైవేల రూపాయలు అవుతుందని ఒక అంచనాకు వచ్చాము..ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకు రావాలి?..భక్తుల నుంచి చందాల రూపంలో తీసుకుందామని మా సిబ్బంది సలహా ఇచ్చారు..సలహా బాగుంది కానీ..నాకున్న ఇబ్బంది ఏమిటంటే..నేను గబుక్కున ఎవ్వరినీ ఏదీ అడగలేను..


మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చి..మా అమ్మగారైన ప్రభావతి గారితో సమస్య చెప్పాను.."అమ్మా..భక్తుల బాధ చూడలేకుండా వున్నాను..దెయ్యం పట్టిన వాళ్ళు..గాలి చేష్ట తో బాధపడేవాళ్లు..ఇతర మానసిక జబ్బులున్న వాళ్లు..అందరూ ఆ ముళ్ల లోనే పొర్లాడుతున్నారు..చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది..అందుకనే ఈరోజు మొత్తం శుభ్రం చేయించాను..ఇక నాపరాయి పరిపిస్తే..బాగుంటుందని ఆలోచిస్తున్నాను..దేవస్థానం వద్ద అంత డబ్బు లేదు..నేనేమో ఎవ్వరినీ చందాలు కావాలని అడగలేను..నా మొహమాటం నాది..ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మా.." అన్నాను..


అమ్మ నన్ను తన దగ్గరగా కూర్చోమని చెప్పి.."నువ్వు ఒక మంచి పని చేద్దామని సంకల్పించావు..అది అందరు భక్తులకూ ఉపయోగకరంగా ఉంటుంది..నువ్వు ఎవ్వరినీ ఏమీ అడగవద్దు..ఒక ముఖ్య సూత్రం చెపుతున్నా విను..నేరుగా ఆ స్వామి సమాధి వద్దకు వెళ్ళు.. నిన్ను నువ్వు ఆయనకు శరణాగతి చేసుకో..ఇప్పుడే కాదు..ఎప్పుడు నీకు సమస్య వచ్చినా..ఆ సమాధి ముందు మోకరిల్లు.. అంతా స్వామివారు చూసుకుంటారు..కాకుంటే ఇందులో ఇంకొక అభ్యంతరం ఉంది..ఏ కోరికా నీ స్వార్ధానికి కోరుకోకు!!.. అలా కోరుకున్నావో..అది జరగదు..నువ్వు మరికాస్త బాధపడటం తప్ప మరేమీ రాదు..రేపుదయాన్నే శుచిగా..నువ్వూ..నీ భార్యా..ఇద్దరూ మందిరానికి వెళ్ళండి..ఆ సమాధి వద్ద మనస్ఫూర్తిగా మీలోని వేదనను చెప్పుకోండి..ఆ తరువాత అంతా ఆ స్వామివారే చూసుకుంటారు.." అన్నది..


ఆ మాటలు తారకమంత్రం లా నా మీద పనిచేసాయి..ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేనూ మా ఆవిడా ఇద్దరం శ్రీ స్వామివారి మందిరానికి వెళ్ళాము..ఆరోజు మంగళవారం..మందిరం లోని బావి వద్దకు వెళ్లి..ఆ బావిలోని నీళ్లను కొద్దిగా నెత్తిమీద చల్లుకుని..ప్రధాన మంటపం లోకి వచ్చాము..ఇంతలో..

"అయ్యా!..మీకోసం ఉదయం ఆరు గంటల నుంచీ ఒకాయన ఎదురు చూస్తున్నాడు..ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి వెళ్ళండి.." అని మా సిబ్బందిలో ఒకరు చెప్పారు..


సరే అన్నాను..ముందు మంటపంలో అతను కూర్చుని ఉన్నాడు..రమ్మని పిలవగానే గబ గబా వచ్చాడు..ఒక ఐదు నిమిషాల పాటు పరిచయాలయ్యాక.."అయ్యా..ఈ మొత్తం ప్రాంగణం అంతా రాళ్లు పరిపించాలని అనుకున్నాను..మా వాళ్ళు ఒంగోలు లో వున్నారు..భూములు కొని..అమ్మే వ్యాపారం చేస్తున్నారు..ఇళ్ల స్థలాల వ్యాపారమూ చేస్తున్నారు..మీరొప్పుకుంటే..వాళ్ళతో మాట్లాడి పని మొదలు పెట్టిస్తాను.."అన్నాడు..


ఒక్కక్షణం నోట మాట రాలేదు..మేము ఇంకా శ్రీ స్వామివారి సమాధి వద్దకు కూడా పోలేదు..మా మనసులోని కోరిక అక్కడ చెప్పుకోనూ లేదు..మా అమ్మగారు చెప్పినట్టు శరణాగతి చెందనూ లేదు..కానీ..మా ఆలోచన ఆ స్వామివారు పసిగట్టేశారు..పిలువకముందే స్వామివారు పలుకుతున్నారనిపించింది..


అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమై కూర్చుంది.."ఏ కోరికా స్వార్ధానికి కోరుకోకు!!" అని ఆమె హెచ్చరించింది..ఇప్పటి కోరిక భక్తులకు సంబంధించింది..


వచ్చినతను నా అనుమతి కోసం చూస్తున్నట్టు వున్నాడు..నిజానికి మధ్యలో నేను ఎవరిని?..నిమిత్తమాత్రం గా వున్నాను..అంతే!..మా దంపతులము శ్రీ స్వామివారి సమాధికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము..


"సరే !.. మీరు అనుకున్న విధంగా చేయండి!.." అన్నాను..ఆమాట చెప్పిన వెంటనే..ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు..ఆరోజు జరిగిన విషయమంతా అమ్మకు చెప్పాను..ఆవిడ నవ్వింది..మరో మూడు నెలలకు..ప్రాంగణం అంతా నాలుగు లక్షలు ఖర్చుపెట్టి పాలరాయి పరిపించారు..ఎక్కడి యాభై వేలు?..ఎక్కడి నాలుగు లక్షలు?..పల్లేరు కాయల ముళ్ళతో ఉన్న మందిరప్రాంగణం.. పాలరాయి తో నిండిపోయింది..


ఆరోజు నుంచీ ఈనాటిదాకా అమ్మ చెప్పిన ఆ మాటలు మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114.. సెల్..94402 66380 & 99089 73699).

గురువారం 30 జనవరి 2025

 🌹🌷🪔🛕🪔🌷🌹

*🪷గురువారం 30 జనవరి 2025🪷*

          *_రేపటి నుండి*

   *మాఘమాసం ప్రారంభం* 

*మాఘమాసం విశిష్టత ఏమిటి ?*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*'మఘం'* అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.


మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. *మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.*


కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.


మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత , పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని , వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.


*ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు.* స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.


*మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని , తటాక స్నానం ద్విగుణం , నదీస్నానం చాతుర్గుణం , మహానదీ స్నానం శతగుణం , గంగాస్నానం సహస్ర గుణం , త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.*  మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో *'ప్రయాగ'* ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.


మాఘ పూర్ణిమను *'మహామాఘం'* అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.


*🌹మాఘమాసం మహిమ🌹*


అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.


శివుడైనా , విష్ణువైనా , ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి , సూర్య తదితర దేవతల పూజలు , వ్రతాలు కూడా జరుగుతుంటాయి.


మాఘ విశిష్టతను గురించి , ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది , చెరువు , మడుగు , కొలను , బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే *ప్రయాగలో స్నానం* చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.


               *తిథులు:-*


1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన , నువ్వులతో హోమం , నువ్వుల దానం , నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం , ఉప్పు దానం చేయటం మంచిది. 

2. శుద్ధ విదియ 

3. శుద్ధ చవితి 

4. శుద్ధ పంచమి 

5. శుద్ధ షష్టి 

6. శుద్ధ సప్తమి 

7. అష్టమి 

8. నవమి 

9. ఏకాదశి 

10. ద్వాదశి 

11. త్రయోదశి 

12. మాఘ పూర్ణిమ 

13. కృష్ణపాడ్యమి 

14. కృష్ణ సప్తమి 

15. కృష్ణ ఏకాదశి 

16. కృష్ణద్వాదశి 

17. కృష్ణ చతుర్దశి 

18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు , పర్వదినాలు , వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.


ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *"శుక్ల పక్ష చవితి"* దీనిని *"తిల చతుర్థి"* అంటారు. దీన్నే *"కుంద చతుర్థి"* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున *"డుంఢిరాజును"* ఉద్దేశించి , నక్త వ్రతము పూజ చేస్తారు ! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. *"కుంద చతుర్థి"* నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.


మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన , జప , తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు *"దుఃఖ దారిద్ర్య నాశాయ , శ్రీ విష్ణోతోషణాయచ ! ప్రాతఃస్నానం కరోమ్య , మాఘ పాప వినాశనం!"* అని చేసిన తరువాత *"సవిత్రేప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం , పాపం యాతు సస్రదా !"* అని చదవాలి. సూర్య భగవానునికి అర్గ్యమివ్వాలి.


ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను , పంచదారను కలిపి  తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. *"మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.*


ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని , సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.


ఇక మాఘశుద్ద సప్తమి ఇదే *"సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సూర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.* ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.


సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే *"శమంతకమణి"* ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. *ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్* అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. *రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా ! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.*


భీష్మాష్టమి *"మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ !ప్రాజాపత్యేచ నక్షత్రే మద్యఃప్రాప్తే దివాకరే !"* శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్ఛంద మరణం ఆయనకి వరం.


ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందిన శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా *"శివరాత్రి"* వరకూ అన్ని పర్వదినాలే.


                    *సేకరించి*

*🌷భాగస్వామ్యం చేయడమైనది🌷*

     *న్యాయపతి నరసింహారావు🙏*