.
షోడచోపచార పూజ:
భగవంతుడిని ఒక అతిధిగా భావించి పదహారు రకాలుగా సేవలు చేయటాన్ని షోడశోపచార పూజ అంటారు. ఎప్పుడైతే భగవంతుని నిశ్చల భక్తితో ఆరాధిస్తాడో అప్పుడు భక్తుడు భగవద్ కైంకర్యంలో నిమగ్నుడైతాడు. కండ్లతో విగ్రహాన్ని చూస్తాడు. అక్కడ వెలిగించి సుగంధ పరిమళ ఊదుబత్తుల సుగంధాన్ని ఆస్వాదిస్తాడు, స్వామికి అర్పించిన రంగు రంగుల పుష్పాల అలంకరణతో తాదాప్యం చెందుతాడు. మనస్సు తాను చేస్తున్న అర్చన మీద ఉంచుతాడు, చెవులు మంత్రాలపై, దృష్టి స్వామిపై, చేతులు అర్చనపై వుంచు పూర్తిగా తాన పంచేంద్రియాలతో భగవంతుడికి స్వాధీనుడు అవుతాడు. తన్ములంగా మనస్సుని భగవంతునిపై ఏకాగ్రత చేయగలుగుతాడు. కానీ నిజానికి విగ్రహారాధనే అంతిమ గమ్యం కాదు. నిర్గుణోపాసనే కైవల్య ప్రధం అని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన ఎందుకు చేయాలో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. బాల్యంలో గురువుగారు విద్యార్థికి గణితం బోధించటానికి చేతి వేళ్ళని గణించమని చెపుతారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. వ్రేళ్ళని గణించటంతో చిన్న పిల్లవాడు కూడికలు, తీసివేతలు నేర్చుకుంటాడు. మరి వాడు పెద్దయిన తరువాత వాడికి చేతి వేళ్ళు లెక్కించటం అవసరమా కాదు. కానీ బాల్యంలో చేతిమీద లెక్కలు నేర్చుకోటంతోనే నేడు గణితం అర్ధం చేసుకో గలుగుతున్నారు. అదే విధంగా విగ్రహారాధన కుడా. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం వున్నది.
ఇంతమంది దేముళ్ళు ఎందుకు. విగ్రహారాధన ఎందుకో తెలుసుకున్నాము. మరి ఇంతమంది దేముళ్ళు అవసరమా అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మొదలవుతుంది. మన ఋషులు వారి మేధా శక్తితో మనకు అందించిన సంప్రదాయమే నేడు మనం ఆచరించే ఆచారాలు, ఆరాధనలు, పండుగలు మొదలైనవి. ఇంత మంది దేముళ్ళు ఎందుకు అవసరమో ఒక చిన్న ఉదాహరణతో గమనిద్దాము. నీకు ఒక కలెక్టర్ ఆఫీసులో పని వుంది అనుకుందాము. మనకు తెలిసి కలెక్టర్ గారే ఆ ఆఫీసుకి ముక్క్యులు. నీకు కావలసిన పని కేవలము ఒక చిన్న సమాచారం అనుకుందాము. అది ఫలనా రికార్డులో ఫలానా పేరు వున్నదో లేదో తెలుసు కోవాలి. నీవు ఏమి చేస్తావు. నేరుగా ఆ శాఖకు సంబందించిన గుమస్తా దగ్గరకి వెళ్లి సదరు విషయం తెలుసుకుంటావు. కానీ నీకు కలెక్టర్ గారితో ఎలాంటి పని లేదు. నీవు కలెక్టర్ గారిని కాలవ వలసిన అవసరంకూడా లేదు. నీ పని అయిపోతుంది. అదే మాదిరిగా నీకు ఏ శాఖకు చెందిన పని ఉంటే ఆ శాఖకు చెందిన గుమస్తా లేక శాఖా అధికారిని కలుసుకొని నీ పని చేసుకొంటావు. అదే విధంగా కేవలం కలెక్టర్ గారితోనే అయ్యే పని అయితే అప్పుడు కానీ కలెక్టర్ గారిని కలవవు. అదే మాదిరిగా మనకు దేముడికి సంబందించిన శాఖలు ఏర్పాటు చేసారు. అవి ధనానికోసం లక్ష్మి దేవి, చదువుకి సరస్వతి దీవి. ధుర్యానికి దుర్గా దేవి. అలానే విజ్ఞలను తొలగించటానికి గణపతిని. ఈ విధంగా మనకు వేరు వేరు కోరికలను తీర్చటానికి వేరువేరు దేవతలు వున్నారు. అదే నీకు కైవల్యం కావాలంటే ఆ పరబ్రహ్మయే శరణ్యం.
పూజించేటప్పుడు శుచిగా ఉండటం ఎందుకు. : పూజ అనేది మానసిక ప్రక్రియ అంటే మనస్సుతో మాత్రమే మనం దేవి దేవతలను ఆరాధిస్తాము. ఆలా ఆరాధించాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు మనస్సుకూడ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి పూజించే వారు విధిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలని ధరించి పూజకు కూర్చోవాలి. హిండవ సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన అనేది 16 ఉపచారాలతో ఉంటుంది. అందుకే షోడచోపచార పూజ అంటారు. 16 రకాలుగా దేవతారాధన చేయటం అని అర్ధం. పూజ చేసేటప్పుడు చేతులు పుష్పాలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో వినియోగించి అర్చిస్తుంటే, కళ్ళు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని (రూపాన్ని) చూస్తూవుంటే చెవులు మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనస్సు అన్ని విధాల ఆ దివ్య మంగళ మూర్తిని స్మరిస్తూ ఉంటుంది. అంటే పూజ చేసే భక్తుడు తన పంచేంద్రియాలను దేముడి మీదనే లగ్నాత చేసి అర్చిస్తాడు. తద్వార త్రికరణ శుద్ధి సాధిస్తాడు. ఈ రకమైన ఆరాధన ఏ ఇతర మతాలలో మనం చూడలేం.
హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది, ప్రశస్తమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి మోక్షమార్గాన్నిచూపెట్టిన ఏకైక దర్మం హిందూ ధర్మం. దేముడిని సహేతువుగా చెప్పింది హిదూత్వం. దేముడు ఒక నమ్మకం కాదు ఒక నిజం.
ఓం శాంతి శాంతి శాంతిః