15, జులై 2023, శనివారం

కుజుడు భూమి

 కుజుడు అంటే భూమి యొక్క కుమారుడు అని అర్థం. సూర్యునికీ, భూమికీ కలిపి ఈ కుజుడు పుట్టినట్లుగా ఒక పురాణకథ ఉంది. (ఇక్కడ సూర్యుణ్ణి విష్ణువుగా వర్ణించారు.


బుధజననం కథలో స్త్రీరూపంలో వర్ణించబడిన సూర్యుణ్ణి ఇక్కడ పురుషునిగా వర్ణించారు. కుజుడు కూడా సౌరకుటుంబంలో వాడే కనుక సూర్యపుత్రుడని వర్ణించారు.


కుజుడు కూడా మన భూగోళం లాగానే కొంచెం ప్రక్కకు ఒరిగిఉండి తిరుగుతుంటాడు. అందుకే కుజుడిపైన కూడా ఋతువులేర్పడతాయి. ఆ విషయాన్ని మన ఋషులు గుర్తించారు. అంతేకాదు, ఇంకా మరిన్ని కుజగ్రహలక్షణాలను కూడా వారు కనుగొన్నారు. ఆ లక్షణాలన్నీ భూగోళ లక్షణాలకు దగ్గరగా వున్నాయని, అయితే భూగోళం కంటే కుజుడు. చిన్నగోళం కనుక, భూమికి కుజుడు కుమారుడని చమత్కరించారు.


మహర్షులు చెప్పిన భూమి, కుజగ్రహల పోలికలు... నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్న చూద్దాం. పోలికలతో సరిగ్గా సరిపోతున్నాయి. అవి ఏమిటో


1. భూమి తనచుట్టూ తాను తిరగటానికి 23 గం॥ 56 ని॥ కాగా, కుజుడి ఆత్మభ్రమణానికి కూడా సుమారుగా అంతే సమయం పడుతుంది. (కుజుడి భ్రమణసమయం 24 గం. 37ని॥. అనగా కేవలం 41 నిముషాలే తేడా.)


2. భూగోళం 23 1/2° ప్రక్కకు ఒరిగి తిరుగుతుంది. అలాగే కుజుడు సుమారు 24° ఒరిగి తిరుగుతున్నాడు.


3. సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలో కేవలం ఈ రెండు గ్రహాలపైనే ఋతువులు ఏర్పడుతున్నాయి.


4. భూమిపై ప్రాణవాయువు వుంది. కుజుడిపై కూడా నేడు కొద్దిగా ప్రాణవాయువు వుంది. (ఒకానొకప్పుడు భూమిపై వున్నంత హెచ్చు ఆక్సిజను వుండేదని శాస్త్రజ్ఞులంటారు.)


5. భూమిపై వాతావరణం వుంది. కుజుడిపై ప్రస్తుతం వాతావరణం


77


"ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత"


164


పురాణాల్లో సైవ్స్


ప్రాణికోటి ముందుగా కుజగ్రహంపై ఉండేదనీ, ఆ తర్వాత భూమి మీదకు మారిందనీ, అనంతరం శుక్రునిమీదకు బదిలీ చెందుతుందనీ మనం చెప్పుకున్నాం. నేటి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయాలు, ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. వాటిని గూర్చి తెలుసుకుందాం.


కుజ, శుక్ర గ్రహాల పరిశీలన వివిధ అంతరిక్ష నౌకల ద్వారా అమెరికా, రష్యా దేశాలకు చెందిన ఖగోళశాస్త్ర వేత్తలు ఇటు శుక్రుడి మీదా, అటు కుజుడిమీదా అనేక పరిశోధనలు జరిపారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి.


కుజ గ్రహంపై ఇప్పటికీ స్వల్ప వాతావరణం ఉందట. ఆ గ్రహంపై కొంత నీటి ఆవిరి, మంచు, నాచుజాతి మొక్కలు ఉన్నట్లు కనుగొనబడింది. కుజగ్రహ వాతావరణంలో మెథేన్, అమ్మోనియా వాయువులున్నాయని అమెరికా అంతరిక్షనౌక 'మారినర్ - 7' తెలిపింది. ఈ రెండు వాయువులూ జీవోత్పత్తికి ముఖ్యమైన మూలపదార్థాలట. ఒకనాడు వాతావరణం, ప్రకృతి, జీవి రాశీ విలసిల్లి - తిరిగి అంతమౌతున్న దశలో కుజుని పరిస్థితి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు.


ఇక శుక్రుని పరిస్థితిని తెలుసుకుందాం. వ్యాసం, ద్రవ్యరాశీ, పరిమాణం, గురుత్వాకర్షణశక్తీ, పలాయన వేగం - వీటన్నింటిలో శుక్రుడు, సుమారుగా భూమిని పోలి ఉన్నాడు. శుక్రుని పై దట్టమైన వాతావరణం ఉంది. అయితే ప్రకృతి, జీవరాశీ ఏర్పడగల పరిస్థితులు మాత్రం ఇంకా కలగలేదట. ప్రకృతి ఏర్పడక ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఎలా ఉండేదో, ప్రస్తుత శుక్రగ్రహం ఆ దశలో ఉందట. అంటే మరిన్ని కోట్ల సంవత్సరాలకు... ప్రకృతి, జీవరాశులు భూమిపై నశించే సమయానికి, శుక్రగ్రహం ప్రకృతికి అనుకూలంగా మారుతుందన్నమాట.


మన పురాణాలు చెప్తున్న కల్పకాల సిద్ధాంతాన్ని, “ఆధునిక సైన్సు” పై విధంగా సమర్థిస్తోంది.

కామెంట్‌లు లేవు: