21, జూన్ 2022, మంగళవారం

*తన్మేమనశ్శివ - సంకల్పమస్తు

 *తన్మేమనశ్శివ -  సంకల్పమస్తు...!!*


*ఓం నమః శివాయ...!!*


సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు, అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు, మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...


నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...

య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్...అనే మంత్రాన్ని ఉపదేశించారు... 

ఇది శివపురాణంలో కూడా  వస్తుంది, ఇది చాలా గొప్ప మంత్రం... 

*నమ: శ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే...*

నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది...


1) నమశ్శివాయ...


(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం, శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి...

అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన  ఓంకారం సూక్ష్మప్రణవం.. 

న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.  

పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం...


2) సాంబాయ...


అమ్మతో ఉన్నవాడు, ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు, అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు, అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును...


3) శాంతాయ...


ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం, జీవితానికి కావలసింది కూడా శాంతమే...

 "ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది, అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది...


4) పరమాత్మనే నమః...


చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే, అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.


ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు మహర్షే స్వయంగా చెప్పారు...


         🙏 ఓం నమః శివాయ🙏 


               *_☘️శుభమస్తు☘️_*

 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

నాడీ పరీక్ష

 నాడీ పరీక్ష -


  పూర్వ కాలం లొ వైద్యులు రోగ లక్షణాలను కేవలం నాడీ పరీక్ష ద్వారానే కనుగొనే వారు . కానీ వారు చేసే పరీక్ష నూటుకి నూరు శాతం చాలా ఖచ్చితత్వం తో కూడుకొని ఉండేది . ఇప్పుడు కుడా కొంతమంది వైద్యులు చేతిని పట్టుకొని పరీక్షిస్తారు. కానీ వారికి నాడీ బేధాలు తెలియవు. ఎందుకంటే శరీరం నందు జనించే రోగములకు ఒక్కొరకం గా నాడి స్పందిస్తుంది. ఆ లక్షణాలను చాలా అనుభవం కల వైద్యుడు మాత్రమే పసిగట్ట గలడు . 


 నాడి పరీక్షకు సంభందించి కొన్ని విషయాలను మీకు తెలియచేస్తున్నాను.


స్త్రీ , పురుష నాడి బేధం - 


 నాభీ కూర్మం అనగా నాడి తాబేలు వలె సంచరించును అందుకే నాభీ కుర్మం అన్నారు . నాభి స్త్రీలకు ఊర్ధ్వ ముఖం, పురుషులకు అదో ముఖం గా ఉండును . ఇలా స్త్రీలకు, పురుషులకు నాడులలో భేదం ఉండును. స్త్రీలకు ఎడమ హస్తం, పురుషులకు వామ హస్తం లలొ నాడీ పరిక్ష చేయాలి . 


 త్రికాల నాడి లక్షణం.- 


 నాడి ప్రాత కాలం నందు శ్లేష్మ గతి కలిగి, మధ్యాహ్నం పిత్త గతి కలిగి , సాయంత్రం వాత గతి కలిగి మరలా అర్థరాత్రికి పిత్త గతి కలిగి ఉండును.


 నాడి లక్షణాలు - పరీక్ష .


 హస్త గ ళ నాడి పరీక్ష - నాడి హస్తం నందు కాని , గళం నందు కాని ప్రస్తానం విడిచిన జీవుడు శరీరం విదిచినట్టే.


 హస్త నాడి పరీక్ష - అజీర్ణం , ఆమ దొషం , జ్వరాగమనం, ఆకలి, దుష్టమైన వాత, పిత్త ,శ్లేష్మములు హస్త నాడి వలన తెలియును.


 కంట నాడి పరీక్ష - ఆగంతక జ్వరం , దప్పిక , ఆయాసం , మైధునం , బడలిక, భయం, శోకం, కొపం వీటిని కంట నాడి పరీక్ష వలన తెలుసుకోవచ్చు.


 నాసా నాడి పరీక్ష - మరణం, జీవితం, కామము, నేత్రరోగము, తలనొప్పి, చెవినొప్పి, ముఖ రోగము, ఇవి నాసా నాడి వలన తెలియును.


 శుభ నాడి పరీక్ష - సర్వ నాడులు, నిర్మలంగా, స్వస్థానం గా స్తిరంగా , చంచల రహితంగా, మంద విహీనం గా ఉన్నచో శుభానాడి గా తెలియును .


 వాతది నాడి - వాత నాడి వక్రం గా , పిత్త నాడి చంచలం గా , శ్లేష్మ నాడి స్థిరముగా నడుచుచు నాడి సంకరమున మిశ్రమం గా నడుచును.


 మృత్యు నాడి లక్షణం - ఏ నాడి వ్యాకులం గా, శిధిలం గా , మందం గా నిలిచి క్రమం గా స్థానం విడిచి నడుచుచుండునో ఆ నాడి మరణ సూచిక అని తెలియును .

                

                ఎవడి నాశిక కడు శీతలం గా , నేత్రములు నిశ్ఛలముగా ఉండి నాడికి స్వస్థాన చలనం కలిగి యుండునో వారు తక్షినం మృత్యువాత పడును . 


        ఎవని నాడి స్వస్థానం వీడి యదార్ధ ప్రయాణం అయి చలించు చుండునో వాడు 3 దినములలో మరణం చెందును. ఇది తథ్యం .


         మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034