10, ఏప్రిల్ 2025, గురువారం

మాతృ పంచకం

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*మనస్సును  కదిలించే  ఆదిశంకరుల మాతృ పంచకం చదివి ఈ రోజు పఠనం ముగిద్దాం.*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.*


*శ్లోకం (1)*


*ముక్తామణిస్త్వం నయనం మమేతి*

*రాజేతి జీవేతి చిరం సుతత్వం*

*ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః*

*దదామ్యహం తండులమేవ శుష్కం.॥*


*తాత్పర్యం:~*


*అమ్మా! నీవు నా ముత్యానివిరా, నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.*


*శ్లోకం (2)*


*అంబేతి తాతేతి శివేతి తస్మిన్*

*ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :*

*కృష్ణేతి గోవింద హరే  ముకుందే*

*త్యహో జననై రచితోయమంజలి.॥*


*తాత్పర్యం:~*


*పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా!అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.*


*శ్లోకం (3)*


*అస్తాం తావదియం ప్రసూతి సమయే*

*దుర్వార శూలవ్యథా నైరుచ్యం*

*తను శోషణం మలమయీ శయ్యాచ*

*సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య*

*యస్యాక్షమః దాతుం నిష్కృతి*

*మున్నతోసి తనయ:తస్యై జననై నమః॥*


*తాత్పర్యం:~*


*అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను.*


*శ్లోకం (4)*


*గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా*

*యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:*

*గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం*

*సపది  చరణ యోస్తే మాతరస్తు ప్రణామః॥*


*తాత్పర్యం:~*


*కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.*


*శ్లోకం (5)*


*న దత్తం మాతస్తే మరణ సమయే*

*తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే*

*శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే*

*తారకనామ మనురాకాలే సంప్రాప్తే*

*మయి కురు దయాం మాతురు తులామ్ ॥*


*తాత్పర్యం:~*


*అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి "స్వధా ను" యివ్వలేదు. ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించుము తల్లీ!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మాతృమూర్తులందరికీ వందనములు*

*మాతృ దేవోభవా॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(102వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

*రాక్షసుల అంతు చూసిన రణధీరుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*గోకులాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు కంసుడు. బలరామకృష్ణుల సాహసగాథలను వేగుల ద్వారా వింటూనే ఉన్నాడతను. వారి అద్భుతకృత్యాలు, మహిమల గురించి ఆరాలు తీస్తూ, తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలుసుకున్నాడు. బలరామకృష్ణులను మట్టుపెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేయసాగాడు. అనుచరులయిన రాక్షసులను బలరామకృష్ణులను పరిమార్చి రమ్మని పంపసాగాడు. అయితే వెళ్ళిన రాక్షసులు వెళ్ళినట్టే హతమయి తిరిగిరాకపోవడంతోనూ, బలరామకృష్ణులు క్షేమంగా ఉన్నారని తెలియడంతోనూ కంసుని ఆందోళనకు అంతులేకుండాపోయింది. మరింతగా జాగ్రతపడసాగాడతను.*


*ఆ జాగ్రతలో భాగంగా వృషభాసుర, కేశి, వ్యోమాసురులను బలరామకృష్ణుల మీదకు పంపాడు. ఎలాగయినా వారిద్దరినీ సంహరించి తీరాలన్నాడు. ముందుగా అరిష్టుణ్ణి పంపించాడు కంసుడు*. 


*వృషభరూపం ధరించి గోకులానికి చేరుకున్నాడు అరిష్టుడు. ఎద్దురూపంలో పెద్దకొండలా నడచి వస్తున్న అరిష్టుణ్ణి చూశారు గోపకులు. ఆశ్చర్యపోయారు. గోపికలు చూశారు. భయపడ్డారు. గోవులు చూశాయి. బెదరి నలుదిశలా పరుగులుదీశాయి. వృషభాసురుడు రంకె వేశాడు. మేఘం గర్జించినట్టుగా ఉందది. గిట్టలతో బలంగా భూమిని తాకాడు. ఆ తాకిడికి భూమి అదరిపోయింది. కొండకొమ్ముల్లాంటి శృంగాలతో నేలను పెళ్ళగించసాగాడు. యాదవులూ, పశుగణాలూ భీతిల్లాయి. పరుగు పరుగున శ్రీకృష్ణుని సమీపించారంతా. చూసింది చెప్పారు. శరణుకోరారు. అభయం ఇచ్చాడు కృష్ణుడు.*


*‘‘ఎక్కడ ఉన్నది ఆ వృషభం?’’ అడిగాడు. తీసుకుని వెళ్ళి చూపించారు కృష్ణునికి. వృషభాన్ని చూస్తూనే రాక్షసుడని గమనించాడు కృష్ణుడు. ధైర్యంగా వాడి ముందు నిలిచాడు. కృష్ణుని కొమ్ములతో కుమ్మబోయాడు వృషభాసురుడు. అదను చూసి కొమ్ములను అందుకున్నాడు కృష్ణుడు. గట్టిగా నిలిపి, వెనక్కి నె ట్టేశాడు. పద్దెనిమిది అడుగుల దూరం వెనక్కి పోయి, తూలిపడ్డాడు వృషభాసురుడు. అంతలోనే లేచి నిల్చున్నాడు. పరుగున వచ్చాడు. కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. వృషభాసుర కృష్ణుల యుద్ధం ముల్లోకాలనూ ఆశ్చర్యపరచింది. ఇద్దరూఇద్దరే అన్నట్టుగా పోట్లాడారు. మళ్ళీ వృషభాసురుని కొమ్ములు అందుకున్నాడు కృష్ణుడు. వాటిని ముందుకు వంచాడు. వెనుక భాగాన లేచి నిల్చున్నాడు వృషభాసురుడు. లేచి నిల్చిన వృషభాసురుణ్ణి లేచినట్టుగా నిలిపి, గిరగిరా తిప్పాడు కృష్ణుడు. బలంగా భూమి మీదకు విసిరేశాడు. కిందపడిన వృషభాసురుడు లేవకుండా వాడి మీద పడి, చేతుల్తోనూ, కాళ్ళతోనూ మర్దించాడు. కృష్ణుని మర్దనకి నోటి నుంచి రక్తాన్ని కక్కుతూ, గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు వృషభాసురుడు. ఎప్పుడయితే వృషభాసురుడు మరణించాడో అప్పుడు కృష్ణుని సమీపించి వ్రేపల్లె వాసులంతా అభినందించారతన్ని. అనేక విధాల కీర్తించారు.*


*వృషభాసురుడు మరణించాడని తెలిసి, కంసుడు కంగారుపడ్డాడు. మరో రాక్షసుణ్ణి పిలిచాడప్పుడు. వాడి పేరు కేశి. కృష్ణుని అంతుచూడమని ఆ రాక్షసునికి ఆజ్ఞాపించాడు.*


*కంసుని ఆజ్ఞప్రకారం కేశి భయంకరమయిన గుర్రం రూపం ధరించాడు. గోకులంలో ప్రవేశించాడు. సకిలించాడు. ఆ సకిలింపుకి సమస్తలోకాలూ భీతిల్లాయి. వ్రేపల్లెవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వద్దు వద్దన్నా వినకుండా కేశిని సమీపించాడు కృష్ణుడు. గుర్రం రూపంలో ఉన్న రాక్షసుణ్ణి కవ్వించాడు. యుద్ధానికి రమ్మన్నాడు. కోరుకున్నదదే! కృష్ణునితో యుద్ధమే కావాలి వాడికి. కొండగుహలాంటి నోరు తెరిచి కృష్ణుని మీదకి దాడి చేశాడు కేశి. ఆకాశంలోకి ఎగిరి, ముందరి కాళ్ళెత్తి కృష్ణుని గుండెల మీద తన్నాడు. తూలిపడబోయాడు కృష్ణుడు. నిలదొక్కుకున్నాడు. గుండెల మీద నిలిచిన గుర్రం ముందరి కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. పైకెత్తాడు. ఎత్తి అటుగా విసిరివేశాడు. చక్రంలా గిరగిరా తిరుగుతూ వెళ్ళి అల్లంతదూరంలో పడ్డాడు కేశి. మూర్ఛపోయాడు. లేవడనుకున్నారు, కాని లేచాడు కేశి. తెప్పరిల్లాడు. మరింతగా కోపించి, ఉరుకుతూ వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించాడు మళ్ళీ. పెద్దగా నోరుచాచి కృష్ణుణ్ణి మింగేయాలనుకున్నాడు. అదే అదనుగా కృష్ణుడు వాడి నోటిలోకి తన ఎడమచేతిని జొనిపాడు. నిప్పుల్లోంచి తీసిన ఇనుపదూలాన్ని జొనిపినట్టుగా కృష్ణుడు చేయి ఎప్పుడయితే కేశి నోటిలోకి వెళ్ళిందో అప్పుడు వాడి నోటిపళ్ళన్నీ రాళ్ళలా రాలిపోయాయి. వాడి కడుపులోనికి చొచ్చుకుంది కృష్ణుని వామహస్తం. చొచ్చుకుని క్షణక్షణానికీ పెద్దది కాసాగింది. కృష్ణుని చేయి కేశి కడుపునిండా, నోటినిండా నిండిపోయింది. ఊపిరి ఆడలేదు వాడికి. గిజగిజా తన్నుకున్నాడు. గ్రుడ్లు గిరగిరా తిప్పుతూ పెద్దగా అరచి ప్రాణాలు వదిలాడు కేశి. కొండలా నేల మీద పడ్డాడు. అప్పుడు చేతిని వెనక్కి గుంజాడు కృష్ణుడు. ఆ వేగానికి కేశి నోరు దోసపండులా చీలిపోయింది. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన వ్రేపల్లెవాసులే కాదు, దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణునిపై పుష్పవర్షం కురిపించారు. కేశిని సంహరించిన కారణంగానే కృష్ణుడికి ‘కేశవుడు’ అని పేరొచ్చింది.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 2 .

 కర్పూరం గురించి సంపూర్ణ వివరణ  - 2 . 


    ఇంతకు ముందు పోస్టు నందు మీకు కర్పూరం మరియు దానిలోని రకాల గురించి వివరించాను . ఇప్పుడు మీకు పచ్చకర్పూరం గురించి వివరిస్తాను . 


 పచ్చకర్పూరం  - 


     ఇది రుచికి చేదుగా , వెగటుగా ఉండును. ఇది శరీరము నందలి అత్యుష్ణమును , రక్తపిత్త రోగమును , క్రిమి రోగము , కఫ , దాహ , తాప , పిత్తవికారము , వాతపిత్త రోగము , వాతశ్లేష్మము , నేత్రవ్యాధులు , అన్నిరకాల మూత్రవ్యాధులు పోగొట్టి విరేచనము కలిగించి , బుద్ది కుశలత , మాటనేర్పు , శరీరబలము వచ్చును . నోటి దుర్గన్ధము తీసివేయును . ఈ పచ్చకర్పూరమును పిల్లలకు మరియు పెద్దలకు తగిన మోతాదులో మాత్రలు కట్టి వాడించుచున్న ఎన్నో పెద్దరోగాలను పోగుట్టును . దోషముతో ఉన్నప్పుడు , ఆకలిదప్పికలతో ఉన్నప్పుడు , కడుపుబ్బు , శృంగార సమయము నందు , గుర్రపుస్వారీ వంటి సమయముల యందు ఈ పచ్చకర్పూరం సేవించిన శ్రమను పోగొట్టి శరీరముకు ఉల్లసము కలిగించును .  


      తరవాతి పోస్టు నందు మరికొన్ని ముఖ్యమైన కర్పూరాల గురించి వివరిస్తాను. 


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

వాల్మీకి రామాయణం:* *2 వ భాగం*

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

         *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


   *వాల్మీకి రామాయణం:*

         *2 వ భాగం*

                         

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు... 

“సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి “మీదగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను” అన్నాడు. 


ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి “నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు” అని అగ్నిశర్మని అడిగారు. 


“నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి” అని చెప్పాడు శర్మ. 


“అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా!” అని అత్రి మహర్షి అన్నారు.


“మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి” అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. 


చాలా బాధ కలిగి, మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి, “నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమ”న్నాడు. 


“ధ్యానం చెయ్యి” అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 


13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. 

తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. 

ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. 


వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

```

*“తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం।*

*నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం॥”*```


వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం.


దీని అర్ధం ఏంటంటే, ‘తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు’ అని. 


వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే...

```

*“కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।*

*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః॥*

*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః।*

*విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః॥*

*ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః ।*

*కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ॥*”

```

“ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి” అని అడిగాడు.


“నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను” అని నారద మహర్షి ఇలా అన్నారు...

“ఇక్ష్వాకు వంశములో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి” అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.


చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. 


విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చెయ్యడానికి తమసా నదీ తీరానికి భారద్వాజుడు అనే శిష్యుడితో వెళ్లారు.    


అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. 


అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. 


కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతోంది. 


అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...

```

*“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః।*

*యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||”*

```

“ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక!” అని శపించాడు.


ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. 


ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. 


ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కు కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. 


ఆ శ్లోకానికి అర్ధం చూడండి...


“నిషాద” అంటే బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. “మా” అంటే లక్ష్మీదేవి.```

*“మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః”,* ```అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక.``` *“యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్",* ```కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం జరుగుగాక!” అని ఆ శ్లోక అర్ధం మారింది.


బ్రహ్మగారు అన్నారు, “నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు 

ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను ‘నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. 


వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా బ్రహ్మ గారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.


*రేపు...3వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


*న్యాయపతి నరసింహారావు*🙏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹


రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


      *వాల్మీకి రామాయణం*           

            *( 1వ భాగం )*

```

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి... 

బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు. 

6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. 

రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. 

అదేంటంటే,``` 

*“దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ”,*``` 

‘నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను’ అని. 

రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి.```


*యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ బాష్పవారి పరిపూర్ణలోచనమ్, మారుతిం నమత రాక్షసాంతకమ్.*```


‘ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.

‘రామ’ అంటే లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్కా అన్నాడు. 

రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.```


*కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్ ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్*```


‘రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి``` *సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ* అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.


*రేపు...2వ భాగం*



*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


*న్యాయపతి నరసింహారావు*🙏

.

ఎలా చెప్పాలి-మీరే చెప్పాలి

 ‌ ఎలా చెప్పాలి!!!?

      డా ప్రతాప్ కౌటిళ్యా 👏 


అతను 

ప్రపంచం నుంచి తప్పించుకుని 

దూరంగా పరిగెత్తుతున్నాడు 

ప్రపంచం తో పాటు పరిగెత్త లేక!!?


ఎంత వేగంగా పరిగెత్తుతున్నాడు అంటే 

ప్రపంచ వేగం కన్నా 

వేగంగా పరిగెత్తుతున్నాడు!!?


ఏదో ఒక రోజు 

తిరిగి వస్తాడు 

ప్రపంచాన్ని అతడు జయిస్తాడు!!!?


బావిలో కప్ప 

చెరువులో చేప 

సముద్రంలో తిమింగలం 


మూడు సమానమే కానీ 

తేడా ఎలా చెప్పాలి.!?


కప్ప -చేప- తిమింగలమా!!

కాదు 

బావి- చెరువు- సముద్రమా!!

కాదు 

మరి ఎలా చెప్పాలి-మీరే చెప్పాలి!!?


డా ప్రతాప్ కౌటిళ్యా 👏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷గురువారం 10 ఏప్రిల్ 2025🪷*


           *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన  

మన సమస్త పాపాలని తీసేస్తుంది.


      *వాల్మీకి రామాయణం*

             *4 వ భాగం*

                    

అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.... “అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతో చేయించాలి” అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. 


అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు... “యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.


చైత్ర మాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను,విద్వాంసులను ఆహ్వానించాడు. 


“వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి” అని వశిష్ఠుడు చెప్పాడు.


*సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః ।*

*న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి॥*```


“పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిధి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు” అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. 


అలాగే జనక మహారాజు, కాశీ రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, “అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి” అని ఆదేశించాడు. 


అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు...```


*వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ ।*

*అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ॥*```


అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు,స్త్రీలు,చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, “ఆహా! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి” అని అంటున్నారు. “ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో” అని అనుకుంటున్నారు. 


దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, “ఇంకా తినండి, ఇంకా తినండి” అంటున్నాడు. 


వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. 


వచ్చినవాళ్ళందరూ “ఆహా! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.


ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, ఛండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతోంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.

మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులో బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినే అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు.

దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, 


అప్పుడు వాళ్ళు “మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి” అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. 


దక్షిణలేని యాగం జరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. 


అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. 


ఋష్యశృంగ మహర్షి లేచి.... “ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే 

 *పుత్రకామేష్టి యాగం* అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.``` 


*తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః ।*

*భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ॥*```


ఆ యిష్టి జరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్లి, “పితామహా! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు...```


*నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః ।*

*చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ॥*```


రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. 


అప్పుడు బ్రహ్మగారు “నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. 


అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.


ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు...```


*ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః ।*

*శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ॥*```


ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో, అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖు చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు.

```

*హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం।*

*దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ॥*```


*వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం।*```

*ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్॥*```

“మీరెవరూ కంగారు పడొద్దు, రావణుడు చేసే అకృత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను” అని భగవానుడు అన్నాడు.```


*తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం ।*

*పితరం రోచయామాస తదా దశరథం నృపం ॥*```


“నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను” అని ప్రతిజ్ఞ చేశారు.


అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి “నేను మీకు ఏమిచెయ్యగలను?” అన్నాడు. 


అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు… “నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.


వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.


యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.


కొంత కాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.


*రేపు...5వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏ub*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


   *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గురువారం🪷* *🌹10, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

     *🪷గురువారం🪷*

  *🌹10, ఏప్రిల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి     : త్రయోదశి* రా 01.00 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : పుబ్బ* మ 12.24 ఉపరి ఉత్తర *ఫల్గుణి (ఉత్తర )*


*యోగం  : వృద్ధి* సా 06.59 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం   : కౌలువ* ఉ 11.55 *తైతుల* రా 01.00 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.30 - 10.00  సా 06.00 - 07.00*

అమృత కాలం  : *శేషం ఉ 07.07 వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*


*వర్జ్యం          : రా 08.26 - 10.13*

*దుర్ముహూర్తం  : ఉ 10.04 - 10.54 మ 03.03 - 03.53*

*రాహు కాలం   : మ 01.42 - 03.15*

గుళికకాళం       : *ఉ 09.02 - 10.35*

యమగండం     : *ఉ 05.56 - 07.29*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.56* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.25*

సంగవ కాలం         :      *08.25 - 10.54*

మధ్యాహ్న కాలం    :      *10.54 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.22*

ప్రదోష కాలం         :  *సా 06.22 - 08.40*

రాత్రి కాలం          :  *రా 08.40 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.09*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం*


*హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే*

*అనాహతాంతే వృషభారూఢం శివరూపం |*

*సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం*

*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||*


    *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పల్లె సీమలో

 *పల్లె సీమలో అలా బయటికి వెళ్తే....!!*


ఆకాశాన్ని తాకినట్టుగా 

అస్తమించే సూర్యుడిని ఒడిసి పట్టినట్లుగా

ఇంద్రధనుస్సు అంచుల్లో వాలినట్లుగా 

వర్ణాలను తాకినట్లు అనుభూతిని పొందాలి...


చిరు గాలులులో సరిగమలు పలికినట్లు

ఎదలో వీణలు మోగినట్లు

వీనులకు సంగీతపు విందు దొరికినట్లు

ప్రకృతిలో మమేకమై సాగాలి..


కమ్మటి వాసనలతో తొలకరి చినుకులు 

మనసు నిండా మత్తెక్కి నట్లు

ఎండిన మట్టి అన్నమై ఉడికినట్లు 

నేలంతా బంగారు పండినట్లు ఉండాలి..


తుమ్మెద రంగులు వయ్యారి సొంపు

శరీరముకు పులుముకున్నట్లు

లేత చిగుళ్ళ మృదుత్వపు ఒంపులు

చిరుగాలిని గౌరవించినట్లు నడవాలి..


చెవులకు మధుర స్వరములు విన్నట్లు

తనువును పన్నీరులో ముంచినట్లు

కాలి అందెల సవ్వడులు మ్రోగినట్లు

పసిపాపల నవ్వులు విరబూసినట్లుండాలి..


తనువు తనువు తడిసి తరించినట్లు

తన్మయత్వంతో ప్రకృతి పలుకరించినట్లు

పరవశించి మనస్సు నాట్యం ఆడినట్లు

తనలో తనే ఆనందముతో పొంగి పోవాలి..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

బయోక్లాక్

 🔆🔆🔆♻️♻️♻️♻️🔆🔆🔆


*ఆచరిస్తే అద్భుతాలు తధ్యం*


               *బయోక్లాక్!*


🔆🔆🔆♻️♻️♻️♻️🔆🔆🔆

                  

         *BIO-CLOCK*


*మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే,  4.00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము.*


*కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైం కి లేస్తాము. ఇదే ‘బయో-గడియారం!*


*చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు.* 


*50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌ను తప్పుగా సెటప్ చేస్తాము.*


*చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు.*

 *వారి బయోక్లాక్ అలా ఏర్పాటు చేయబడింది.*



*కాబట్టి మిత్రులారా ఈ "8" సూత్రాలు తప్పకుండా పాటించాలి! అందులో…* 


*1). మనము బయో-గడియారాన్ని సర్దుబాటు చేసి, రోజూ క్రమం తప్పకుండా ‘ధ్యానం’ చేస్తే…. తద్వారా మనం కనీసం120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు!*


*2.) 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.*


*3.)సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు.*


*4.) మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం, అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి! జరిగి తీరుతుంది.*


*5.) చురుకుగా ఉండండి. నడవండి. వీలైతే జాగింగ్ కూడా తప్పకుండా చేయండి. *


*6.) వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి! (ఇది నిజం కూడ).*


*7.) ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి!*

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి! మనసులో కాకుండా పైకి నవ్వండి)*

(అదేదో సినిమాలో మనసులోనే నవ్వుకుంటుంది, మనసులోనే డాన్స్ కూడా చేస్తుందట! - అలాకాదు!)


*8). ప్రతిదానికీ కారణం మన మనస్సు. మన ఆలోచన. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ old age అనే మాటను అనకండి. ధర్మరాజుకు యువరాజా పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో!*    


**బయో క్లాక్ ని మీ  తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు...!*


    ALL THE BEST..

                 

  *ద్వి శతమానం భవతి!*


🔆🔆🔆♻️♻️♻️♻️🔆🔆🔆జై శ్రీ రామ్ 🙏

రిటైర్డ్ అధికారి

 *ఆ రిటైర్డ్ అధికారి కళ్లెలా తెరుచుకున్నాయి?*


పదవీ విరమణ జరిగిపోయింది. తరువాత నేను జరుపుకుంటున్న మొదటి దీపావళి ఇది. తలుచుకుంటుంటే నా గతం ఎంతో గర్వంగా ఉంది. 


నా సర్వీస్, ప్రత్యేకించి సీనియర్ పొజిషన్లలో నా కొలువు వైభవం పదే పదే గుర్తొస్తున్నది. దీపావళికి వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది. 


రకరకాల కానుకలు మా ఇంటిని ముంచెత్తేవి. స్వీట్లు, బాణాసంచా కూడా! వచ్చిన ప్రతి కానుకను మొదట ఓ గదిలో పెట్టేవాళ్లం. తీరా దీపావళి పండుగ నాటికి ఆ గది ఓ గిఫ్ట్ షాపులా అయిపోయేది. అంతగా కానుకలు వచ్చిపడేవి. కొన్ని నాకు అస్సలు నచ్చకపోయేవి. అయినా శుభాకాంక్షలు తీసుకుని వస్తున్నాయి కాబట్టి వాటిని స్వీకరించకతప్పదు, వాటిని నాకు నచ్చని బంధువులకు ఇవ్వడానికి ఓ పక్కన పెట్టేవాడిని. 


డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువగా వచ్చేవి. మార్కెట్‌లో దొరికే ఖరీదైన డ్రై ఫ్రూట్స్ అన్నిరకాలవీ బంధువులకు, స్నేహితులకు, పిల్లలకు ఇవ్వగా ఇంకా మిగిలిపోయేవి. మరి ఇప్పుడు? పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. ఆల్రెడీ మధ్యాహ్నం రెండు దాటిపోతోంది. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఒక్కరూ రాలేదు. ఆశ్చర్యంగా ఉంది నాకు!


ఒక్కసారిగా నా వైభోగంహఠాత్తుగా రివర్స్ అయిపోయిన తీరు నాకు నచ్చడం లేదు. చిరాకెత్తుతోంది. సోఫాలో కూర్చుని ఆరోజు డెయిలీ పేపర్ తీసుకున్నాను. స్పిరిట్యుయల్ కాలమ్ దగ్గర నా చూపు ఆగిపోయింది. అందులో ఒక కథ చదవడం స్టార్ట్ చేశాను. అంతకుముందు ఆ కథ నేనెప్పుడూ చదవలేదు. అసలు డెయిలీ పేపరే సరిగ్గా చదవకపోయేవాడిని, అంత టైమ్ దొరికేది కాదు. ఆ కథ ఓ గాడిదకు సంబంధించింది. అదేమిటంటే,


ఓ గాడిద ఓసారి దానిపై ఓ దేవుడి విగ్రహాన్ని ఏదో ప్రార్థనల సమావేశం కోసమో, పూజ కోసమో తీసుకుపోతున్నారు. అది గ్రామంలో వెళ్తుంటే ప్రజలు ఆ విగ్రహానికి దండాలు పెట్టసాగారు, వంగి నమస్కరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే తీరు. మందలుమందలుగా జనం దండాలు, గాడిదలో ఆనందం. 


ప్రజలంతా తనకే దండాలు పెడుతున్నారని అనుకోసాగింది ఆ గాడిద. ఆ మర్యాదను సంతోషంగా స్వీకరించసాగింది. ఆ పూజాస్థలం వచ్చింది, విగ్రహాన్ని దింపేశారు. తిరుగు ప్రయాణంలో దాని యజమాని ఓ కూరగాయల బస్తాను దాని మోపున పెట్టాడు. కానీ ఈసారి ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. చూసీచూడనట్టు ఉన్నారు. గాడిదలో అసహనం. అరె, నన్నెవరూ పట్టించుకోవడం లేదేమిటి? ఇంత హఠాత్తుగా ఈ పరాభవం ఏమిటి అనుకుంది. 


జనం దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి గట్టిగా అరవసాగింది. ఆ శబ్దంతో చిరాకెత్తిన పలువురు గ్రామస్థులు దాన్ని తిడుతూ కొట్టారు. అది ఆ బాధతో మరింత అరుస్తోంది. అసలు నన్నెందుకు తిడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో దానికి అర్థం కావడం లేదు. ఇదీ కథ. 


అకస్మాత్తుగా నా జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి. నేనూ అలాంటి గాడిదనే, దానికీ నాకూ తేడా ఏముంది? నాకు దక్కిన గౌరవాలు, వైభోగం నిజానికి నాకు కాదు, నావి కావు. నేను వెలగబెట్టిన ఆ సీనియర్ పోస్టులకు సంబంధించినవి. వ్యక్తిగా అవన్నీ నాకు లభించిన గౌరవమర్యాదలే అని ఇన్నాళ్లూ భ్రమపడ్డాను. నా భార్యను పిలిచాను. 


*‘చూశావుటోయ్, నిజంగా నేను ఓ గాడిదను. నిజమేమిటో ఇప్పుడు తెలిసొచ్చింది. ఎవరో విజిటర్స్ వస్తారని ఇక వెయిట్ చేయడం వేస్ట్, పద, నీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాను.'* ప్చ్, ఆమె నా మాటల్ని పెద్దగా లెక్కచేయలేదు. 


*‘నేను ఎన్నాళ్లుగానో ఇదే చెబుతున్నాను, మీరు వింటే కదా, నేను చెప్పేది తప్పు అనుకున్నారు. ఈరోజు ఎవరూ రాక, ఆ పత్రికలో ఆ కథ చదివాక గానీ మీ కళ్లు తెరుచుకోలేదు’* అనేసింది. 


*నాకు మౌనమే దిక్కయింది!*

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

 

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=16 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యుధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=పన్నెండు


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నలుడు


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని ముత్యాలహారం.


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

పోతన భాగవత పద్యం

 🙏పోతన భాగవత పద్యం🙏

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే

సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

ఈ పద్యం గురించి కొంత వివాదం ఉన్నమాట నిజమే. ఎందుకంటే బమ్మెర పోతరాజొకఁడు అని ప్రథమ పురుషలో ఉన్నది. పోతన గారు ఈ విధంగా ప్రథమ పురుషలో వ్రాసిన పద్యం అసలు లేదు. పోతన గారు నిజంగా ఈ పద్యం వ్రాస్తే ఉత్తమ పురుషలో చెప్పుకుంటాడు గాని ప్రథమ పురుషలో చెప్పడు అలా చెప్పడం పోతన స్వభావం కాదు పద్యలో అహంకారం కనబడుతోంది పోతన గారు వినయ సంపన్నుడు ఆయనే ఈ పద్యం వ్రాసి ఉంటే బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్ అని అనడు. తరువాత కవులు ఎవరో వ్రాసి ఆయన భాగవతలో చేర్చి ఉంటారు అని కొంతమంది విమర్శల అభిప్రాయం.

టీక:- ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = మేలు సమకూరునట్లుగా.

భావము:- విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆనందో బ్రహ్మేతి

 🙏ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’🙏

భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో, దేని వలన పుట్టినవి జీవిస్తున్నాయో, దేని యందు లీనమవుతున్నాయో అది బ్రహ్మము’’ అని చెప్పి, ‘దానిని నీవే తెలుసుకో’ అని చెబుతాడు. అప్పుడు భృగువు బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఆయనకు.. అన్నమే బ్రహ్మమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణుల శరీరాలన్ని అన్నము వలననే పుడుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నము చేతనే పోషింపబడుతున్నాయి. చివరకు అన్నము (మట్టి) యందే కలిసి పోతున్నాయి. కాబట్టి అన్నమునే బ్రహ్మముగా తెలుసుకున్నానని తండ్రిని సమీపించి చెబుతాడు. అప్పుడు వరుణుడు ఆయనను ఇంకా తపస్సు చేయమంటాడు. 

మళ్లీ తపస్సు చేసిన భృగువు.. ఈసారి ప్రాణమును బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్రాణము వలనే ప్రాణుల శరీరాలు పుడుతున్నాయి. ప్రాణము చేతనే పుట్టినవి జీవిస్తున్నాయి. ప్రాణములందే లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మముగా ఎరిగినానని చెప్పగా.. ‘‘ఇంకా తపస్సు చెయ్యి. బ్రహ్మము నెరుగుటకు తపస్సే సాధనం’’ అని వరుణుడు చెబుతాడు. ఈసారి తపస్సులో.. ‘మనసే బ్రహ్మము’ అని భృగువుకు తెలుస్తుంది. ఎందుకంటే మనసులోనే సంకల్పాలు కలుగుతాయి. ఇంద్రియాలన్నింటికీ మనసే ఆధారం. సంకల్పాల కారణంగానే జీవులకు శరీరాలు లభిస్తాయి. కర్మఫలాలను అనుభవించడానికి శరీరస్థితి ఏర్పడుతుంది. శరీరం నశించినప్పుడు జీవుడు వాయురూపంలో వెళ్లిపోతాడు. కాబట్టి శరీరోత్పత్తి, స్థితి, లయములకు మనసు కూడా కారణమవుతున్నది. కావున అది బ్రహ్మమని తలచి తండ్రికి ఆ విషయమే చెబుతాడు. అప్పుడు తండ్రి.. ఇంకా తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు. ఈసారి విజ్ఞానం బ్రహ్మమని భృగువు తలుస్తాడు. విజ్ఞానమంటే నిశ్చయాత్మక జ్ఞానం. అదే బుద్ధి. ఆ విషయం చెప్తే.. ఇంకా తపస్సు చేయమంటాడు వరుణుడు. తపస్సులో మరలయత్నించిన భృగువు ఆనందమే బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’ ఆనంద రూపమగు బ్రహ్మమే కారణమని, బ్రహ్మమే కర్త అని రూఢి చేసుకుంటాడు. 

భృగువును వరుణుడు అన్నిసార్లు తపస్సు చేయాల్సిందిగా ఎందుకు ఆదేశించాడంటే.. అసలైన బ్రహ్మము గురించి ఆయన తెలుసుకోవడానికే. భృగువు మొదట అన్నము బ్రహ్మమని ఎరిగినప్పటికీ.. అన్నానికి కారణం ఉంది. బ్రహ్మమంటే కారణం లేనిది. కాబట్టి మరోసారి తపస్సు చేయాలంటాడు. అదే విధంగా ప్రాణం, మనసు, విజ్ఞానం అన్నింటికీ కారణం ఉన్నది. ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం జనిస్తున్నాయి. మనసు, విజ్ఞానం ఆత్మాశ్రితాలు. కాబట్టి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమని, బ్రహ్మమునకు ఇంకొక కారణం లేదు అని చివరకు తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దానిననుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు. మనం పొందే ఆనందం ఏదో కారణంచేత కాబట్టి ఆ దొరికిన దానిని బట్టి అది క్షణికమైనది లేదా కొద్దికాలం ఉండేది అవుతుంది. కాబట్టి కారణం లేకుండా ఆనందంగా ఉండడమే మోక్షం అనబడుతుంది. 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సమస్యలకు కారణం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺



       *మన సమస్యలకు కారణం*

                    *మనమే..!*

                    ➖➖➖✍️

```

కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒక రోజు పగిలిపోతాయో... అలాగే పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు.


ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకొనే మార్గం ఏదీ లేదు.


జీవులకు వృద్ధాప్యం, మరణం తప్పవు. ఎందుకంటే అది జీవుల స్వభావం. పండిన పండ్లు చెట్టు నుంచి రాలిపోవడం ఎంత అనివార్యమో, పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం.


అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మృత్యువు అన్ని జీవరాసులకూ చివరిదశ.


మరణం నుంచి జీవులను ఎవరూ కాపాడలేరు. ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా... బంధువులు వారిని రక్షించలేరు.


జంతువులను చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన ఆధీనంలోకి తీసుకున్నట్టు... మృత్యువు జీవులను తన నియంత్రణలోకి తీసుకుంటుంది.


నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష... దురాశే!


సత్యమేమిటంటే... మనిషి నూరేళ్ళు బతికినా, ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలీదు. తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ అదృశ్యమైపోతాయి.


జీవులకు సంబంధించిన ఈ సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని కలత చెందకూడదు. తమ వారి నిష్క్రమణల గురించి రోదించడం కూడా వ్యర్థం. ఇలాంటి నిరర్థకమైన రోదనల వల్ల శాంతి లభించదు సరి కదా... మరింత దుఃఖం పుడుతుంది. దానివల్ల శరీరం బలహీనపడుతుంది.


మరణించినవారు తిరిగిరారు. కానీ ఇలా విలపించడం ద్వారా జీవుడు తననుతాను బాధించుకుంటాడు. వారి విలాపం మరణించినవారికి కూడా సహాయపడదు.


తెలివైన వాడు వృద్ధాప్యం, మరణాల భయం నుంచి తప్పించుకొనే ఉపాయాన్ని అన్వేషిస్తాడు.


ఆనందాన్ని కోరుకొనే వ్యక్తి శోక, విలాపాలకు దూరంగా ఉండాలి. మనస్సు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి. మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి.


విషయాసక్తికి దాసుడైనవాడు దుఃఖాన్ని అధిగమించలేడు. పైగా శాంతిలేని జీవితాన్ని గడుపుతాడు.


లేనిది ఉన్నదని భ్రమపడే మిధ్యా జ్ఞానమే మృత్యువు. సమ్యక్‌ జ్ఞానమే అమృతం. ప్రపంచంలోని పరిణామశీలత మృత్యువును సూచిస్తున్నది. మృత్యువు అంటే ప్రమాదం, అజ్ఞానం.


చాలామంది మృత్యువును చూసి భయపడతారు. కానీ సత్య సాక్షాత్కారం కలగకపోవడం వల్లే 

ఆ భయం కలుగుతుంది.


అజ్ఞానులు ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు ప్రయాణిస్తూ ఉంటారు.


జ్ఞాని మృత్యువుకు అతీతుడు. అజ్ఞానికి క్షణక్షణం మృత్యువే.


చంచలమైన మనస్సే మృత్యువు.


సమ్యక్‌ జ్ఞానం వల్ల మృత్యు భయం పోతుంది. సత్స్వరూపమైన అమృతత్వం సిద్ధిస్తుంది. 

ఆ అమృతత్వమే శాశ్వత సత్యం.


ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం... తమ సమస్యలు గట్టెక్కడానికే.


ఉదయాన్నే లేచి, ముందుగా దేవుణ్ణి తలచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు. ఇంట్లో ఏదైనా వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే… “ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు, ఇంకా ఆ పనులు మిగిలే ఉన్నాయ్‌” అనుకుంటారు. 


ప్రపంచంలో పెద్ద పెద్దవాళ్ళు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటారు.


ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది? అనేది సమస్య.


ఈ సమస్యలన్నీ మన సమయం మొత్తాన్ని తినేస్తున్నాయి. ఇంతకీ 

ఈ సమస్యలు ఎక్కణ్ణించి వచ్చాయి? భగవంతుడే ఈ సమస్యలను సృష్టించాడని అనుకొనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతను సృష్టించుకున్నవే.


ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించి ఉంటే... వాటి నుంచి బయటపడడం చాలా కష్టమయ్యేది.


ఎవరైనా వందేళ్ళు బతికితే ఎన్ని రోజులవుతుంది? కేవలం 36,500 రోజులు మాత్రమే. 


ఈ జీవితమనే రైలు బండి తనదైన శైలిలో పోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ రైలు నుంచి మనం దిగిపోవలసిందే.


కానీ ఇప్పటివరకూ మీరు జీవించిన కాలంలో మీరేం నేర్చుకున్నారు? ఏం గుర్తించారు? మిమ్మల్ని మీరు గుర్తించారా? మీరెవరు? మీరు ఎవరనే సంగతి పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మీ జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది?


చాలామంది ‘శాంతి’ అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు. తన సమస్యలన్నీ తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తాడు. 


పిల్లాడు తప్పిపోయి, దుఃఖంతో విలవిలలాడుతున్న తల్లిని.. “మీకు శాంతి ఎలా లభిస్తుంది?”  అని అడిగితే… “నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది” అంటుంది.


అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుందంటాడు.


కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి... ఏదైతే మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారో... అదే రేపు మీ దుఃఖానికి కారణం అవుతుంది.


ఈ విషయంలో నాలాంటివారు చేసేది ఒకటే... మిమ్మల్ని మీకు పరిచయం చెయ్యడం. తద్వారా మీకు లభించిన ‘జీవితం’ అనే ఈ అవకాశం గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకోగలరు. మీలోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది. 


అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా? అంటే వస్తాయి. కానీ సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుంచి బయటపడే మార్గాన్ని మీరు కనుక్కోగలరు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                 🙏➖▪️➖🙏

రెండు గొప్ప శత్రువులు

 *రెండు గొప్ప శత్రువులు* 


మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' *అహంకారం'* మరి యొకటి ' *మమకారం'.* 


అహంకారం ' *నేను, నేను* ' అంటే మమకారం ' *నాది, నాది'* అంటూ ఉంటుంది.


ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ' *ఇది నాది* ' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు ' *ఇది నేను చేసినాను* ' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.


దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన.

జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు. జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రఘర్భాలు పలికినాడు. అదివింటూ జగద్గురువుల వారు మోనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు. *జగద్గురువులు* "మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..? *అధికారి* అవును చూస్తున్నాను.  

 *జగద్గురువులు* : దీని ఎత్తు ఎంత..?

 *అధికారి* : చాలా ఎక్కువ.

 *జగద్గురువులు* :దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?

 *అధికారి*          :చాలా తక్కువ స్థాయిలో

 *జగద్గురువులు* :ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా. ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితి లో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతొ పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. అందువల్ల "నేను దీన్ని చేసాను" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం.


*హరనమః పార్వతీ పతయే హర హర మహా దేవ* 


 *--- జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ*