14, ఏప్రిల్ 2025, సోమవారం

జంటపదములు

 *" జంటపదములు "*


ఏతావాతా, దానాదీనా, తాడోపేడో, వాడివేడి, రాతకోతలు, గిల్లికజ్జాలు, గంపగుత్తగా, ఒళ్ళూపై, తిమ్మిని బమ్మిని, తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ, ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర, యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి. అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం. కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి!


రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు, రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు. రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు, నొక్కి చెప్పడానికి వాడతారు. 


1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. 'ఇంతవరకు చెప్పి' - అని అర్థం. ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది. ఇంతకూ - అని అర్థం, ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే. 


2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole, దానా దీనా పదిలక్షలు ఖర్చు అయింది. 


3. తాడోపేడో తేల్చు = అటో యిటో పరిష్కరించు, either this or that "ఈ వ్యవహారం ఈ రోజు తాడోపేడో తేల్చుకొని కాని ఇక్కడినుండి కదలను."


4. రాతకోతలు, వ్రాఁతకోతలు – Writing the sale deed (రాత) after the final hard bargain and the final cut (కోత) in the price. 


5. తిమ్మినిబమ్మినిచేయు = క్రిందిది మీదికి - మీదిది క్రిందికి చేయు వ్యవహారములో దక్షత చూపు. ఇక్కడ తిమ్మి అంటే తిమ్మడు (కోతి) బమ్మి అంటే బ్రహ్మ లేదా బమ్మి (బ్రాహ్మడు). "మొత్తానికి తిమ్మిని బమ్మిచేసి మా వాడికి ఉద్యోగం ఇప్పించాను."


6. వావీ వరుసా = వావి అంటే బంధుత్వము relation, వరుస అంటే "ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు ఔతుంది" distant but equivalent relationship. సుందరకాండలో మైనాకుడు హనుమను నీకు పినతండ్రిని అంటాడు. అది వరుస కలపడం. 


7. అమీతుమీ = నేనా నువ్వా, బెంగాలీ పదాలు, ఈ రోజు అమీతుమీ తేల్చుకుందాం.


8. తత్తర బిత్తర = కంగారు; తత్తర పడడం = అంటే తొట్రు పడడం, కంగారు పడడం, బిత్తర పోవడం = అంటే ఆశ్చర్య పడడం, తెల్లబోవడం, మానసిక స్థితిని వర్ణించడానికి రెండూ కలిపి వాడతాం.


9. కన్నీరు, మున్నీరు = సముద్రం, కన్నీరు మున్నీరుగా విలపించడం అంటే దుఃఖ సముద్రంలో పడుటకు చిహ్నం.


10. ఆదరాబాదరా = తగినంత ఆలోచన, వ్యవధి లేకుండా; హడావుడిగా hurry burry, ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము. ఆదరా బాదరాగా = కంగారుగా, ఉన్న పళంగా,అద్ధంతరంగా, బాదర బందీలు ఉండగానే.


జంట పదాలను లెక్కించడం సాధ్యం కాదు.  

కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. వీటి వివరణలకు ఒక సిద్ధాంత వ్యాసం కావాలి.


ఒక్క కూలీ నాలీ చూదాం:  

"కూలి" తెలిసిన పదమే. విశేషణం (కూలిపని), నామవాచకము (నీకెంత కూలి కావాలి?) మన సాఫ్టువేరు ఇంజనీర్లను - techno కూలీలుగా వర్ణించాడు ఒక IAS గారు. South Africa గాంధీ గారిని కూలీ బారిస్టరు అనేవారు. నాలి విశేషణమే కుత్సితము, కుచ్చితము, (ఉదా - నాలి ముచ్చు) hypocrite, hook or crook కూలో నాలో చేసుకు బ్రతుకు అంటే live - by hook or crook


మచ్చుకు మరికొన్ని:-


అన్నెం పున్నెం, అండ దండ, అందం చందం, అడపా తడపా, అలుపూ సొలుపూ, అభం శుభం, అదురు బెదురు (నదురు బెదురు), అవాకులు చెవాకులు, అణా కానీ, అప్పో సొప్పో, అల్లా టప్పా, అతుకు బొతుకు, ఇరుగు పొరుగు, ఊరూ వాడా, ఎండా కొండా, ఒళ్ళూ పై, కలొ గంజో, కల్ల బొల్లి, కరాఖండీ, కఱ్ఱా బుఱ్ఱా, కన్నూ మిన్నూ, కాసర బీసర, కిందా మీదా, కూలీ నాలీ, కూరా నారా, చదువూ చట్టుబండా, చిన్నా చితకా, పిల్లా జెల్లా, చెట్టూ చేమా, చెత్తా చెదారం, చెదురు మదురు, చిన్నా చితకా, చిన్నం చిదరా, చిందర వందర, గంపగుత్తం, గొడ్డూ గోదా, బీదా బిక్కీ, తలాతోకా, వంపు సొంపు, తట్టా బుట్టా, తీరూ తెన్నూ, మొక్కా మోడూ, నెత్తీ నోరూ, నోరూ వాయీ, వంటా వార్పూ, వెనకా ముందూ, వింతా విడ్డూరం, వింత విశేషం, గందర గోళం, గిన్నీ గిట్రా, డబ్బు దస్కం, నగా నట్రా, పొలం పుట్రా, పెట్టీ బేడా, పిల్లా పీచూ, పెట్టూపోతా, పెళ్ళీ పెటాకులు, పుట్టు పూర్వోత్తరాలు, రసాభాస, రాయీ రప్పా, గిల్లి కజ్జా, సింగినాదం జీలకఱ్ఱ, వంకర టింకర, పుణ్యం పురుషార్థం, లెక్కా పత్రం, ముద్దూ ముచ్చట, మాటామంతీ, రానూపోనూ, అదీయిదీ ..... 


ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో!!! మరో భాషలోనికి యథా తథంగా అనువదించలేనివి ఇవి.  

తెలుగు సోయగం ఇది.


(డాక్టర్ చెల్లూరి కృష్ణమూర్తి గారి సౌజన్యంతో....) 

       - ఎలక్ట్రాన్


రచన లోగిలి నుండి

నేనొక నిరంతర ప్రవాహిని...!

 నేనొక నిరంతర ప్రవాహిని...!!


నేనొక నిరంతర ప్రవాహిని 

నీటి ఊటలా జన్మించి తరించా 

ఈ నేలపై దిమ్మరిలా తిరుగుతూ 

సజీవ గీతాన్ని ఆలపిస్తున్నాను...


వాగుల్ని వంకల్ని కలుపుకుంటూ 

నా ఆకారం పెద్దదిగా చేసుకుంటూ 

నా బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ 

నేలపై నా నడకలు కొనసాగిస్తున్నాను..


ఆకుపచ్చ అందాలను సృష్టించి 

పంటచేల మధ్య పరవశిస్తూ 

రైతన్న బ్రతుకులకు రాగాన్ని 

అనంత రాశులకు వర్తమాన గీతాన్ని...


గత చరిత్రకు ఆనవాళ్లుగా 

భవిష్యత్ తరాలకు సంస్కృతిగా 

నన్ను నేను రూపాంతరం చెందుతూ 

విరామ మెరుగక ప్రవహిస్తున్నాను..


నా స్వేచ్ఛ నాకే సొంతం 

నన్ను బంధిస్తేనే ప్రళయం 

పూజిస్తే పుణ్యఫల ప్రదాయినినీ 

మీ ఇంట సిరులు సమకూర్చే సంపదను..


కొండల గట్టులతో చెలిమి చేస్తూ 

జలపాతపు సొంపుల సోయగంతో కదులుతూ 

మృదంగ నాదంలా దూకుతూ 

సరిగమలై సరసరా కదలి పోతాను..


నా ఊపిరిని మీ ఎదపై వీణలా వినిపిస్తూ 

పచ్చని అనురాగాల గాలులను స్పర్శిస్తూ 

అనుభూతుల మాధుర్యాన్ని పంచుతూ 

ప్రకృతిలో మమేకమై కొనసాగుతాను..


మట్టి భాషలో మాట్లాడుతూ 

అమ్మలా అనురాగాలు పంచుతూ 

పల్లెల్లో కబుర్లు చెప్పుకుంటూ 

అనంత ఆనందాన్ని సమకూర్చుకుంటా...


నా దారి సముద్ర గమ్యం వరకు 

విముక్తి గీతాన్ని ఆలపిస్తూ 

ముక్తికై వడివడిగా అడుగులు వేస్తూ 

అమృత ధారలను పంచి నేలను విడుస్తాను..


కానీ నా పుట్టుకకు దారులు మళ్లిస్తూ

అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తూ 

నన్ను నన్నుగా తిరగనీయకుండా

కబంధ హస్తాల్లో బంధిస్తున్నారు...


నా ప్రవాహం నేడొక ప్రశ్నార్థకం? 

నాలో విషాన్ని చేర్చి క్షీణింప చేస్తూ 

నా కడుపు నిండా కాలుష్యాన్ని నింపుతూ 

నా ప్రాణాలను చిన్నగా హరిస్తున్నాడు ఈ మనిషి...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

పంచాయతన మూర్తయేనమః

 *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తయేనమః*

         కనీసం *11₹* పంపి దేవాలయాభివృధ్ధిలో పాలుపంచుకోండి.11₹ అంటే మరీ తక్కువ అనే ఆలోచన తో ఎక్కువ పంపాలని వాయిదా వేయడం కన్నా 11₹ పంపడం ఉత్తమం,కావాలంటే తరువాత పరిస్థితి బాగున్నప్పుడు మరింత విరాళం ఇవ్వవచ్చు అని కూడా ఒకసారి ఆలోచించండి.

 రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో ప్రతిష్ఠించబడిన మన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పూర్వపు అభీష్ట గణపతి ఆలయంతో స్లాబ్ కలపకపోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం క్రుంగుతోంది. ఆర్థిక వనరులు సరిపడకపోవడంతో పునాది మాత్రమే కలిపి నిర్మాణం పూర్తిచేసి ప్రతిష్ఠా మహోత్సవం పూర్తి గావించాము. కానీ ఇప్పుడు స్లాబ్ భాగం కూడా సాధ్యమైనంత త్వరలోనే కలిపి రెండు ఆలయాలకు శిఖర నిర్మాణాలు చేయడానికి సంకల్పం చేసాము. తద్వారా దేవాలయం పటిష్ఠమై వర్ధిల్లగలదు. దయచేసి భక్తులు యధాశక్తి ఆర్థిక సహాయం చేయగలరని ఆకాంక్షించడమైనది.

*ఈ నిర్మాణం కొరకై ప్రతీ భక్తుడు కనీసం 11₹ పంపి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పిలుపునిచ్చుచున్నాము.*

ఈ దేవాలయంలో నిత్యాభిషేకాద్యర్చనలతో బాటుగా *ప్రతీ పున్నమికి గోమయపు ప్రమిదలలో "సంధ్యాదీపోత్సవం",ప్రతీ సంకష్టహర చతుర్థి నాడు "పల్లకి సేవ" ,ప్రతీ మాస శివరాత్రికి "మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం" నిర్వహించబడుచున్నాయి.* ఇవియేకాక నిత్య వేదపారాయణం మరియు అనేక వైదిక క్రతువులు కూడా నిర్వహించబడుతున్నాయి. 

ప్రతి ఒక్కరూ కూడా ఒక్క *11₹* చొప్పున పంపి ఈ మహాకార్యంలో భాగస్వామ్యం తీసుకుని మన దేవాలయ అభివృద్ధి కి సహకరించగలరని ఆకాంక్షిస్తున్నాము.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

*ABHEESTA GANAPATHI ALAYA TRUST*

మా గూగుల్ పే/ఫోన్ పే/UPI and WhatsApp number 9492050200 on the name of K.Srinivasa Sarma, FPCA of the trust.


*A/C No: 011712010001038*

*IFSC : UBIN0801178* 

*Devi Chowk Branch, Rajamahendravaram*.

దయచేసి విరాళాలు పంపిన వారు UPIరసీదు సాఫ్ట్ కాపీని మాకు వాట్సాప్ చేయగలరు.

Panchaag


 

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః 

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః (17)


కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః 

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ (18)


కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేధించిన వికర్మ అంటే ఏమిటో, ఏపనీ చేయకపోవడమనే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూసేవాడు మానవులలో బుద్ధిమంతుడు; యోగి; సమస్తకర్మలూ ఆచరించేవాడు

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

                      𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


       *య: ప్రీణయే త్సు చరితై: పితరం స పుత్రో*

       *య ద్భర్తురేవ హిత మిచ్ఛతి త త్కళత్రమ్ |*

       *త న్మిత్ర మాపది సుఖే చ సమక్రియం య* 

       *దేత త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥*


𝕝𝕝 *తా* 𝕝𝕝  *ఎవడైతే తన సత్ప్రవర్తనతో తండ్రిని సంతోషపెడతాడో అతడే పుత్రుడు. తన భర్త హితాన్ని సదా కాంక్షించేదే భార్య. ఆపదలయందు, సుఖముల యందు సమానంగా వ్యవహరించేవాడే మిత్రుడు. ఈ మూడూను లోకంలో పుణ్యాత్ములకే లభిస్తాయి.*


 ✍️💐🌺🌹🙏

16-10-గీతా మకరందము

 16-10-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః |  

వెూహాద్గృహీత్వాఽసద్గ్రాహాన్ ప్రవర్తన్తేఽశుచివ్రతాః ||


తాత్పర్యము:- (ఆసురీసంపదగల)వారు తనివితీరని కామమునాశ్రయించి, డంబము, అభిమానము, మదము గలవారలై, అవివేకము వలన చెడుపట్టుదలల నాశ్రయించి, అపవిత్రములగు వ్రతములు (నీచవృత్తులు) గలవారై ప్రవర్తించుచున్నారు.


వ్యాఖ్య:- “దుష్పూరమ్” - ఎంత అనుభవించినను తనివితీరనిదియగుటచే కామము దుష్పూరమని చెప్పబడినది. అనగా నింపశక్యముకానిది. "దుష్పూరేణ అనలేన చ" అని ఇదివఱలో 3వ అధ్యాయమున దీనిని గుఱించి  ప్రస్తావించబడెను. ఇట్టి  దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫలమనోరథులై తత్ఫలితముగ అశాంతికిలోనై యుందురు.


“దమ్భమానమదాన్వితాః” - దంభ, అభిమాన, మదములలో ఏ ఒక్కటి యున్నను జీవునకు వినాశమేకలుగుచుండ ఇక మూడును కలిగియున్నవారి విషయము వేఱుగచెప్ప వలయునా? వారేల ఈ ప్రకారముగ దుష్టాచరణశీలురై యుందురు? "మోహాత్” - అవివేకమువలన, అజ్ఞానమను ‘కైపు'లో వారు చేయరాని పనులన్నిటిని చేయుదురనియు, గ్రహించదగనివానినన్నిటిని గ్రహించుదురనియు భావము.


"అశుచివ్రతాః” - వారు నింద్యములై, అపవిత్రములైనట్టి మద్యసేవన, మాంసభక్షణాదివ్రతములను గలిగియుందురు. అనగా ప్రతిరోజు ఆ యా కార్యములను చేయవలెనను పట్టుదలగలిగియుందురు. వ్రతము, పట్టుదల యనునవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు, పవిత్రకార్యములకు సంబంధించినవియగునపుడే సత్ఫలముల నొసంగ గల్గును. కావున వానిమార్గమును త్రిప్పవలెను.

శుచివ్రతములనే ఆచరించవలెనుగాని అశుచివ్రతములను గాదు. సద్గ్రహణమే గల్గియుండవలెనుగాని అసద్గ్రహణముకాదు.


ప్రశ్న:- కామ మెట్టిది?

ఉత్తరము:- పూరింప శక్యముకానిది (దుష్పూరమ్).

ప్రశ్న:- ఆసురీసంపదగలవారి మఱికొన్ని లక్షణములను జెప్పుము?

ఉత్తరము:- వారు (1) అంతులేని కామమును ఆశ్రయించుదురు (2) డంబము, అభిమానము, మదము గల్గియుందురు (3) అవివేకము గల్గియుందురు (4) చెడ్డపట్టుదలలు (నీచప్రవృత్తులు), అపవిత్రవ్రతములు శీలించుదురు.

తిరుమల సర్వస్వం -208*

 *తిరుమల సర్వస్వం -208*

 *మాధవుడు చేసే మానవ సేవ -5*

 *వేద విద్యాబోధన* 


 వేదాలంటే పుక్కిటి పురాణాలు కాదు. విజ్ఞాన నిక్షేపాలు. వేలసంవత్సరాల క్రితం హైందవజాతి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన కరదీపికలు. నేడు మానవజాతిని పట్టిపీడిస్తున్న అనేక సామాజిక, శారీరక, మానసిక ఋగ్మతలకు తరచి చూస్తే మన వేదాలలో సత్వరమైన, ఖచ్చితమైన, సులభసాధ్యమైన పరిష్కారమార్గాలు కానవస్తాయనేది కాదనలేని సత్యం. కానీ, పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్న చందంగా, వేదాలను ఉపేక్షించి, పాశ్చాత్య పోకడలను అనుసరించడం వల్ల ఇప్పటికే మనమెంతగానో కోల్పోయాం.


 ఈ నేపథ్యంలో మహత్తరమైన వేదసంస్కృతి వ్యాప్తికి తి.తి.దే. అవిరళ కృషి సలుపుతోంది. దానిని వివరించే ముందు, ఏ వేదంలో ఏం చెప్పబడిందో క్లుప్తంగా తెలుసుకుంటే, వేదాల పట్ల ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి.


 *ఋగ్వేదం* ఐదు శాఖల సమాహార మైనప్పటికీ, ప్రస్తుతం 'శాకల' అనబడే ఒక శాఖ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దీనిలో.... *మానవుని సామాజిక నడవడి (సోషల్ బిహేవియర్), రోగ చికిత్సా పద్ధతులు, కృత్రిమ అవయవాల అమరిక (ఆర్టిఫిషియల్ లింబ్స్), సూక్ష్మ శస్త్రచికిత్స (మైక్రో సర్జరీ), వర్షాలకోసం చేపట్టవలసిన పద్ధతులు, మొదలైనవి చెప్పబడ్డాయి.* 


 *యజుర్వేదం* లో ప్రాణహింస కూడదని, బలులు నిషిద్దమని చెప్పబడింది. యాగాలు చేసే పద్ధతులు కూడా పేర్కొనబడ్డాయి.


 *సామవేదం* లో కళలు, సంగీతం, వాద్యపరికరాలు, సాహిత్యం మొదలగు వాటిని వివరించడంతో పాటుగా; సృష్టి సమస్తం శూన్యం నుండి ఉద్భవించి, శూన్యం లోనే ఐక్యమై పోతుందని ప్రతిపాదించబడింది. ఈనాటి బ్లాక్ హోల్ సిద్ధాంతానికి సామవేదం లోని సూత్రీకరణలే ప్రాతిపదికలని కొందరు అభిప్రాయ పడతారు.


 *ఆథర్వణ వేదం* లో ఆత్మలు, ప్రేతాత్మలు, యుద్ధవిద్యలు, విషశాస్త్రం, శతృసైనికులను క్రిమికీటకాలతో హతమార్చటం (బయో వార్) వంటి విషయాలపై విస్తృతమైన సమాచారం ఉంది. ఇంతే కాకుండా, జ్వరం, అతిసారం, అతిమూత్రం, వాతం, పిత్తం, శ్లేష్మం, విషజ్వరం, క్షయ, బొల్లి, కుష్టు వ్యాధులకు; తేలుకాటు, పాముకాటుకు; సుఖప్రసవానికి, సంతానలేమికి; శిరస్సు, ముక్కు, చెవి, కంఠానికి (నేటి ఇ.ఎన్.టి) వచ్చే వ్యాధులకు ఔషధాలు, ఉపశమనాలు చెప్పబడ్డాయి.


 *వేదపాఠశాల* 


 తిరుమల ప్రధానాలయం నుండి దాదాపు ఐదారు మైళ్ళ దూరాన ఉన్న *'ధర్మగిరి'* అనే ప్రదేశంలో, తి.తి.దే. వారి ఆధ్వర్యంలో, తిరుపతి లోని వేదవిశ్వవిద్యాలయానికి అనుబంధంగా, ఓ సువిశాలమైన ప్రాంగణంలో *'వేదపాఠశాల'* నడుపబడుతోంది. 


 1884వ సంవత్సరంలో ఒక చిన్న కుటీరంలో ప్రారంభింపబడ్డ ఈ పాఠశాల, దినదిన ప్రవర్థమానమవుతూ, నేడున్న ప్రాంగణంలోకి మారింది. వాహనమార్గం ద్వారా ప్రయాణించి, శిలాతోరణం ఉద్యానవన సముదాయాన్ని దాటిన తరువాత, ప్రకృతిశోభతో ఉట్టిపడుతున్న ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఈ పాఠశాలను చేరుకోవచ్చు. పచ్చని పరిసరాలతో మమేకమై సాంప్రదాయ వేషభాషలతోనున్న చిన్నారులు వేదాలను వీనులవిందుగా వల్లె వేస్తున్న దృశ్యం నయనానందకరంగా, కర్ణపేయంగా గోచరిస్తుంది. వీరందరూ పంచెకట్టుతో, నుదుటిపై నామాలతో, శిరస్సుపై శిఖతో అభినవ బృహస్పతుల వలె తేజరిల్లు తుంటారు.


 సనాతన కాలం నుంచి, ప్రపంచం నలుమూలల లోని కోట్లాది ప్రజలు అవలంబిస్తున్న హైందవమత మనుగడకు మూలం 'వేదం'.


 చతుర్వేదాలు శేషాచల సానువుల్లో బండశిలలుగా అవతరించాయని అన్నమాచార్యుల వారు తన కీర్తనలో పేర్కొన్నట్లుగా ఇంతకుముందే చెప్పుకున్నాం. 


 నాలుగు వేదాలే ఆనందనిలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులుగా అవతరించాయని కూడా పురాణాలలో చెప్పబడింది. ఎందరెందరో కవులు, గాయకులు, మహాభక్తులు శ్రీవేంకటేశ్వరుణ్ణి వేదపురుషునిగా అభివర్ణించారు. అంతటి మహత్తరమైన, ఘనచరిత్ర గల వేదాలను పరిరక్షించడంలో తి.తి.దే. తనవంతు పాత్రను అద్వితీయంగా పోషిస్తోంది. అందులో భాగంగా ఆసక్తి, అర్హత గల బాలురకు అతి చిన్నవయసు నుండే వేద విద్యాభ్యాసం గావించడం ఈ పాఠశాల ప్రధానోద్దేశ్యం.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*346 వ రోజు*


*కర్ణ సహదేవుల పోరు*


కర్ణుడు సహదేవునితో తలపడ్డాడు. సహదేవుడు కర్ణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. కర్ణుడు సహదేవుని నూరు బాణములతో మర్మస్థానములలో కొట్టి సహదేవుని ధనస్సును ముక్కలు చేసాడు. సహదేవుడు మరొక విల్లందుకున్నాడు. కర్ణుడు సహదేవుని సారథిని, రథాశ్వములను చంపాడు. సహదేవుడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. సహదేవుడు కర్ణుని మీద గదాయుధాన్ని విసిరాడు. కర్ణుడు ఆ గదను మధ్యలోనే తుంచాడు. సహదేవుడు కర్ణుని మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఇక చేసేది లేక సహదేవుడు రథచక్రాన్ని కర్ణుని మీద వేసాడు. కర్ణుడు దానిని కూడా తన బాణ్ములతో ముక్కలు చేసాడు. కర్ణునితో యుద్ధం చేయలేక సహదేవుడు అక్కడ నుండి తప్పుకుంటున తరుణంలో కర్ణుడు అతడిని వెంబడించి పట్టుకుని చంపబోయి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి చంపకుండా వదిలి హేళనగా " సహదేవా! నీ బలం ఎదుటి వాని బలం తెలుసుకుని యుద్ధం చెయ్యి. నీ కన్నా బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకమని తెరులుసుకో పో " అని పంపాడు. సహదేవుడు అవమానభారంతో కుమిలి పోతూ అక్కడ నుండి వేరొక రథము ఎక్కి వెళ్ళాడు.


*శల్యవిరాటుల యుద్ధం*


శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తూ విరాటుని అశ్వములను చంపాడు. శల్యుని మీద విరాటుడు శరములు గుప్పించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు సాయంగా వచ్చి విరాటుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు వాడి అయిన బాణమును ప్రయోగించి శతానీకుని సంహరించాడు. తమ్ముని మరణం విరాటునిలో భయం కలిగించినా పైకి ధైర్యంగా ఉండి శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యుడు పదునైన బాణమును ప్రయోగించి విరాటుని మూర్చిల్లేలా కొట్టాడు. విరాటుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. విరాటుని సేనలు శల్యుని ధాటికి ఆగ లేక పక్కకు తొలిగాయి. అది చూసి అర్జునుడు ఆ సైన్యములను ఆపి శల్యునితో తలపడ్డాడు. అలంబసుడిని ఎదుర్కొన్న అర్జునుడు అతడి విల్లు కేతనమును విరిచి, హయములను చంపాడు. అలంబసుడు ఒక కత్తి తీసుకుని అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు ఆ కత్తిని విరిచి నాలుగు భయంకరమైన బాణములతో ఆ రాక్షసుని కొట్టాడు. అర్జునుడి ధాటికి ఆగ లేక అలంబసుడు పారి పోయాడు. నకులుడి కుమారుడు శతానీకుడు సుయోధనుడి తమ్ముడైన చిత్రసేనుడిని ఎదుర్కొని చిత్రసేనుడి కవచమును చీల్చి, కేతనము విరిచి, విల్లు విరిచాడు. చిత్రసేనుడు వేరొక విల్లందుకుని శతానీకుని మీద బాణ ప్రయోగం చేసాడు. శతానీకుడు చిత్రసేనుడి రథాశ్వములను, సారథిని చంపాడు. చిత్రసేనుడు శతానీకుని ఇరవై అయిదు బాణములతో శరీరం తూట్లు పడేలా కొట్టాడు. శతానీకుడు ఒకే బాణంతో చిత్రసేనుడి విల్లు విరిచి రథమును విరిచాడు. చిత్రసేనుడు రథము నుండి దూకి పక్కనే ఉన్న హార్దిక్యుడి రథము ఎక్కి పారిపోయాడు. ద్రుపదుడు కర్ణుని కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని మీద వృషసేనుడు పైచేయిగా ఉన్నాడు. ద్రుపదుని నిస్సహాయత చూసి పాంచాల సేనలు వృషసేనుడితో తలపడ్డాయి. కాని వృషసేనుడితో తలపడ లేక పారి పోయారు. దుశ్శాసనుడు ధర్మజుని కుమారుడైన ప్రతి వింధ్యుని ఎదుర్కొని అతడి ధ్వజమును, విల్లును విరిచి, సారథిని, హయములను చంపాడు. ప్రతివింధ్యుని సోదరులు అతడికి సాయంగా వచ్చి పోరుతున్నారు. భీముని కుమారుడైన శ్రుతసేనుడు ప్రతి వింధ్యుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. ప్రతివింధ్యుడు మరొక విల్లందుకుని దుశ్శాసనుడితో తలపడ్డాడు.  

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కీర్తనలు/భజనలు/పాటలు సంబంధ 55 పుస్తకాలు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*కీర్తనలు/భజనలు/పాటలు  సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

సంకీర్తన లక్షణము-1 www.freegurukul.org/g/Keerthanalu-1


సంకీర్తన మీమాంస www.freegurukul.org/g/Keerthanalu-2


ఆంధ్రుల కీర్తన వాంగ్మయ కళాసేవ www.freegurukul.org/g/Keerthanalu-3


నాచన సోమన అన్నమయ్య www.freegurukul.org/g/Keerthanalu-4


సంకీర్తనల్లో తిరుమల శ్రీనివాసుని ప్రశంస-ఒక పరిశీలన www.freegurukul.org/g/Keerthanalu-5


అమృతసారము www.freegurukul.org/g/Keerthanalu-6


అన్నమయ్య విన్నపాలు www.freegurukul.org/g/Keerthanalu-7


నిత్యపారాయణ పాశురాలు www.freegurukul.org/g/Keerthanalu-8


మంగళాశాసన పాశురములు www.freegurukul.org/g/Keerthanalu-9


చిత్రముల తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-10


తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-11


విడిచిన విరిదండ -తెలుగు తిరుప్పావు www.freegurukul.org/g/Keerthanalu-12


గోదా గీత మాలిక www.freegurukul.org/g/Keerthanalu-13


అన్నమాచార్య సంకీర్తనామృతము-1,2 www.freegurukul.org/g/Keerthanalu-14


అన్నమయ్య కీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-15


భావయామి వేంకటేశం - 1,2,3,4,5,6 www.freegurukul.org/g/Keerthanalu-16


హరి నీమయమే అంతాను - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-17


హరి సేవకే వేంకటేశ మకుటం - 1,2 www.freegurukul.org/g/Keerthanalu-18


హరి యేమనెనో అలిగెనో - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-19


ముకుందమాల www.freegurukul.org/g/Keerthanalu-20


అమృత రామాయణం www.freegurukul.org/g/Keerthanalu-21


అన్నమాచార్యులు అమృతవర్షిణి www.freegurukul.org/g/Keerthanalu-22


కృష్ణ దాసి -మధుర భక్తి గేయములు www.freegurukul.org/g/Keerthanalu-23


తెలుగు తమిళ లాలిపాటలు www.freegurukul.org/g/Keerthanalu-24


స్త్రీల నవీన మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-25


మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-26


పల్నాటి సీమలో కోలాటం www.freegurukul.org/g/Keerthanalu-27


కోలాటము పాటలు ఇతర భజనలు www.freegurukul.org/g/Keerthanalu-28


పిల్లన గ్రోవి పిలుపులు www.freegurukul.org/g/Keerthanalu-29


హంసధ్వని -లలిత గీతాలు www.freegurukul.org/g/Keerthanalu-30


పెళ్లి పాటలు-1 www.freegurukul.org/g/Keerthanalu-31


శ్రవణానంద మంగళహారతులు www.freegurukul.org/g/Keerthanalu-32


స్త్రీ ల వేడుక పాటలు www.freegurukul.org/g/Keerthanalu-33


సర్వదేవతా భజనలు www.freegurukul.org/g/Keerthanalu-34


108 దివ్య దేశప్పాసుర క్కుటిప్పు www.freegurukul.org/g/Keerthanalu-35


అన్నమయ్య సంకీర్తనా స్రవంతి www.freegurukul.org/g/Keerthanalu-36


అన్నమాచార్య సంకీర్తనములు-1000 www.freegurukul.org/g/Keerthanalu-37


అన్నమాచార్యులవారి అధ్యాత్మ శృంగార సంకీర్తనలు-1,2,3 www.freegurukul.org/g/Keerthanalu-38


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు-10 www.freegurukul.org/g/Keerthanalu-39


అధ్యాత్మ సంకీర్తనలు-1,2,3,4,5,7,9,10 www.freegurukul.org/g/Keerthanalu-40


అభినవ శ్రీ కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-41


ఆనంద మంగళం - మధుర భక్తి గీతములు www.freegurukul.org/g/Keerthanalu-42


ఎంకి పాటలు www.freegurukul.org/g/Keerthanalu-43


కాలజ్ఞాన తత్వములు www.freegurukul.org/g/Keerthanalu-44


కృష్ణ తాండవము గోపికా లాస్యము www.freegurukul.org/g/Keerthanalu-45


కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-46


కృష్ణ లీలా తరంగిణి www.freegurukul.org/g/Keerthanalu-47


గీత గోవిందము-ఆంధ్రష్టపది www.freegurukul.org/g/Keerthanalu-48


చూతపురీ విలాసము www.freegurukul.org/g/Keerthanalu-49


తాళ్ళపాక అన్నమయ్య పాటలు www.freegurukul.org/g/Keerthanalu-50


తెలుగు మీరా www.freegurukul.org/g/Keerthanalu-51


త్యాగరాజ కీర్తన హారము www.freegurukul.org/g/Keerthanalu-52


త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-53


త్యాగరాజ హృదయము www.freegurukul.org/g/Keerthanalu-54


త్యాగరాజ కీర్తనలు-3 www.freegurukul.org/g/Keerthanalu-55



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సాక్షి’ వ్యాసాలలోని

 🙏పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలలోని ‘స్వభాష’లో కొన్ని మెరుపులు🙏


పరభాషా పదముల కర్థము తెలిసినంత మాత్రమునఁ బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుఁడు.భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపెట్టవలయును. అది మీ కసాధ్యము. తుద కిన్ని యీనాములనమ్మి – యమ్మమెడలోని పుస్తెపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్యపడి- వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయ భాషలోని పాండిత్యపుఁబన యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది. స్వభాష యిదివరకు మీ చేతఁ జావనే చచ్చినది. మీ గతి యెంత యుభయ భ్రష్టమైనదో చూచు కొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాఱవ వంతైన నక్కఱ లేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుట కేమంత శ్రమమున్నది? అక్షరాభ్యాస దినమునుండియె మీరు స్వభాష నభ్యసించు చున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు. ఆమె భుజించిన పదార్థముల రసమును నాభీనాళ ద్వారమున మీలోఁ బ్రవేశపెట్టుచున్నప్పుడే యాంధ్ర భాషా జ్ఞానమును గూడ దానితో జోడించినది. తరతరముల నుండి వంశాను క్రమముగా మీ రక్తమలో జీర్ణమై, మీ మాంసమునకు మాంసమై, శల్యమునకు శల్యమై, మెదడుకి మెదడై, మీ తత్త్వముతో నైక్యమొందిన యాంధ్రభాషను, మీరిప్పుడు క్రొత్తగ నేర్చుకొను టయేమి? ఉపాధ్యాయుఁడైన నక్కఱ లేకుండ గ్రంథము లూరక చదువుకొనుచుఁబోయిన యెడల భాషా జ్ఞానసంపాదన మీ కెంతసేపు? నాకాంధ్రభాష రాదని మన యధ్యక్షుఁడు కంఠోక్తిగాఁ బలికినాఁడు. మా భాష మాకు రాదను ననర్హవాక్య మాంధ్రుని నోట నుండి వెడలఁదగదు. ఏ జాతి వారి నోటి నుండియు నంతే-ఆంధ్రదేశమున పుట్టి యెంత కాలమైనదో, ఇట్టి యనుచిత వాక్యము నేఁడు బయలువెడలినది. అనుచిత మనుమాట నిస్సందేహము. పోనిండు దీనికేమి? అనుచితకు – నసందర్భతకు -నవకతవకకు ననేక సంవత్సర ముల నుండి యలవాటుపడియే యున్నాము. భాష మీకు రాదేమి? అబ్బా! మీరే ప్రయత్నము చేసినా రని రాదనుచున్నారు? భాష తనంత తాను మీకు వచ్చుననియే యనుకొనుచున్నారా? మహమ్మదుగారి యెద్దకుఁ గొండ రాకపోయినప్పుడు మహమ్మదు గారు కొండ యెద్దకు వెళ్లినారా లేదా? మీకు భాష రాకపోవుట భాష లోపమా? మీ లోపమా? భాషను గొంచెము దీక్షతోఁ బఠించిన యెడల నది రానివాఁ డుండునా? పఠింపకుండ భాష రావలయునన్న నది పైపైన నున్నదా? భాష యందు మీకు నిర్లక్ష్యత యైనప్పుడు భాషకు మీ యందభిమానముండునా? భాషా గ్రంథము మీకుఁ దలక్రింద నెత్తునకైనఁ బనికిరానప్పుడు భాషా జ్ఞానము మీ తలలో నెట్లు దూరును? చదివినను భాష రానివాఁడెవ్వండు? ఎవ్వఁడో, వ్రేలు మడఁచి యొక్కని పేరెత్తి చెప్పుఁడు. భాషలోఁ బుట్టి భాష నేర్చుకొని భాషరాక భ్రష్టుఁడైన ప్రపంచాతీతపురుషుఁ డెవ్వఁడో చూతము. చూచి యథార్థముగ స్వభాషా జ్ఞానమున కర్హుఁడు కాని యద్భుతాజ్ఞానతత్త్వమే యగునెడ- నన్నయ భట్టుకాలము నుండి యిప్పటి వఱకున్న భాషా గ్రంథములన్నియుఁ గట్టకట్టి బంగాళా ఖాతములోఁ బాఱవే యుదము. మనకు రానిభాషతో మనకేమి పని? అయ్యయ్యో? రవంత కష్టమైనఁ బడనక్కఱ లేదా? నోరు మెదపనైన నక్కఱలేదా? ‘క్రిమినల్‌ ‌ప్రాసీజర్కోడ్‌’ ‌చేతఁ బట్టకుండనే మన యధ్యక్ష శిరోమణికి శిక్షాశాస్త్ర సిద్ధి యయినదా? ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ‌ప్రాపర్టీ’ ఆక్టు తలఁగొట్టుకొని వల్లెవేసిన వారే – తారాశశాంక విజయము రవంత చదువలేరా? సరదా తీరును. శబ్దజ్ఞానము వచ్చునే – ఊరకే రమ్మన్న నేదైన వచ్చునా? అట్లెవ్వనికైన వచ్చినదా? కడుపు నిండుటకు నోటిలోఁ బడినదానిని మ్రింగనైన వలదా? అమాత్రపు శ్రమమైనఁ బడనక్కఱ లేదా? ‘మెయిన్సు పీనల్కోడ్‌’ ‌మడత వేయుటలో మెదడు చింపుకొన్న వాఁడవే- మనుచరిత్రమున నొక్క యాశ్వాసమును విలాసము కొఱకైనను జదువుటకు నీ కోపిక లేకపోయెనా? తీరిక లేకపోయెనా? శక్తి లేకపోయెనా? బుద్ధిలేకపోయెనా? చంద్రబుల్లి నామూలాగ్రముగ నెఱుఁగుదువుకాని చంద్రమతి పేరైన నెఱుఁగవే! ‘కన్హింగ్హామ్సు ఎవిడెన్సు’ ఆక్టు వలన నీకడుపే నిండునుగాని కంకంటి వారి రామాయణము వలన నీ మనస్సు నిండునే! ‘జస్టిసు హాలోనే’గారి జడ్జిమెంటు నొప్పఁజెప్పఁగలవు కాని జనకచక్రవర్తి ప్రపంచమునకు బోధించిన నీతి నెఱుఁగవే? ‘సివిల్‌ ‌ప్రాసీజర్కోడు లేటెస్టు ఎడిషన్‌’ ‌కుఁ గర్త యెవ్వఁడో యెఱుఁగుదువుకాని సీతా రామాంజనేయ కవి యెవఁడో యెఱుఁగవే? భారత భాగవతములను బఠింపని నీవు బారిష్టరు వైననేమి – ప్రభూత్తముఁడ వైననేమి? ఆంధ్రుడవై యేల పుట్టితివోయి నాయనా! నీవాంధ్ర దేశయన కెందులకోయి నాయనా. నాకు బోధపడక యడుగు చున్నాను. క్షమింపుము. నీవే పుస్తకములను జదువనక్కఱలేదు. దినమున కొక్కసారి పావుగంట తెఱపిచేసికొని రాత్రి భోజనమైన తరువాత నిల్లాలిని బిల్లలను నీ చుట్టు కూరుచుండఁబెట్టుకొని తాంబూల చర్వణ మాచరించుచు నడుమ నడుమ నాన్కో ఆపరేషను ముచ్చటలఁజెప్పుకొనుచు నాంధ్రపత్రికను జదుపరాదా? నాలుగు మాసములట్లు చదువుము. నాకాంధ్ర భాషా జ్ఞానమెంత వృద్ధియగునో తెలుఁగుబాసలో నేదైనపస యున్నదని నీ కప్పటికిఁ దెలిసినయెడల భాషా గ్రంథములను జదువవచ్చును. అందఱు తెలుఁగు మాటలాడవలసిన యిందఱలో నీ వొక్కఁడ నింగ్లీషుతో మాటలాడితివి! కావుకావు మని యనవలసిన కాకులన్నిటిలో నొక్క కాకి కొక్కొరకో యని యఱచినయెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతోఁ బొడిచివేయక మానునా? మేము నీవంటి యనేక ప్రకృతుల కలవాటు పడినవారము కావున సరిపోయినది. కాని లేకున్న నేమి కాఁదగినది? ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను. ఇంతకన్న నధిక జ్ఞానమును గూడ నీ వాభాషలో సంపాదింపుము. నాకు మరింత యిష్టము కాని నీయాంగ్లేయభాషా జ్ఞాన మెందులకో నీ వెఱుఁగుదువా? ఆంగ్లేయభాషయే కాదు, ఇంక ననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషాజ్ఞానమంతయు నీ భాష నభివృద్ధి పఱచుటకే. నీ భాషను భాగ్యవత్తరమును జేయుటకే- నీ భాషను బరభాషాగ్రంథ ప్రశస్తాభి ప్రాయములతో వన్నెపెట్టుటకే – అంతకంటే వేరు కాదే. ఆంధ్రభాషలో అ ఆ లకంటే నవతలి యక్కఱము లెరుఁగని వాఁడవు కదా! ఆంధ్రుఁడవై యుండియు నాంధ్రభాషలో ‘ఆ’ యని నోరు మెదలుపలేనివాఁడవు కదా! నీ యాంగ్లేయ భాషా జ్ఞానమును దేశమున కెట్లు పచరింపఁ దలఁచితివో చెప్పుము. నాయనా! నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుచున్నా ననుకొంటివేమో? నీవు వ్రాయునదేమి? పార్టీలనెత్తిన పేఁడ- ఏ గ్రంథము నీవు వ్రాయవలదు. ఏ గ్రంథమును జదువవలదు. రేపటి నుండియే యాంధ్రపత్రిక నామూలగ్రముగఁ జదువుచుండుము. తెఱపిలేదని సందేహించుచుంటివా? క్లబ్బులో గంటన్నర చీట్లాటకుఁ దెఱపియుండుఁగా, టెన్నిసు కోర్టులో రెండు గంటలు లోకాభిరామాయణమునకుఁ దెఱపియుండుఁగా, దేశభాషా పత్రికా రాజమును జూచుట కొక్క యరగంట తెఱపిలేకుండునా? తెఱపి లేకపోయినయెడలఁ జేసికో.


నాయనలారా! మన కింగ్లీషు మాటలతోఁ జెప్పినఁగాని యే యంశము కూడ మనస్సున కెక్కదు. అట్టి యభ్యాసము చిరకాలము నుండి యస్థిగత రోగమైయున్నది. ఆయుర్వేదవైద్యుఁడు వచ్చి ‘‘అయ్యా కరివేపాకు పొడుముతోఁబథ్యము పుచ్చుకొనుమని నీతోఁజెప్పఁగ నీ కామాట నచ్చదు. నానెన్సున్సు, కరివేపాకుపాడు మెందులకయ్యా యని నీ వా యాయుర్వేదవైద్యు నధిక్షేపింతువు. ధనియాలు ‘డైజేషన్‌కు’ మంచివి. మిరియాలు ‘లివర్‌’ ‌మీద ‘ఆక్టు’ చేయును. కరివేపాకు ‘గాల్‌ ‌బ్లాడర్‌’‌కు సత్తువ నిచ్చునని యెనఁడో ఎల్‌.ఎం.‌పి. మనవాఁడే చెప్పిన యెడల నీ కది శ్రుతిప్రమా ణము. నాయనలారా! మనమెంత లక్షాధి పతులమైనను గోటీశ్వరులమైనను మన బ్రదుకులు ముష్టి బ్రదుకులు కాని మఱియెకటి కాదు. ఈ ముష్టిదేవులాటలో నింగ్లీషు మాటలు కూడా నెందులకు? ఆ యేడుపేదో మాతృభాషతోడనే యేడ్చిన మంచిది కాదా? మన యేడుపు సహజముగాను సాపుగాను స్వతంత్రముగా నుండునే. ఏడుపులోఁ గూడ మన కస్వతంత్రత యేమి కర్మము? అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా? ముష్టి బ్రాహ్మణుఁడు నీ యింటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుఁడి నయ్యాయని యఱవక ‘‘బాయ్‌ ‌రూములోనున్న పాట్‌లో రైస్‌ ‌యేమైన నున్నదేమో, కైన్‌ ‌డ్లీగెటిట్‌ ‌హియర్‌; ‌థాంకు యూ ఇన్‌ ఆం‌టిసిపేషన్‌’’ అని నీతో సంభాషింపఁగ, వాతనికి ముష్టి వేయుదువా? మూఁతిమీఁద నీడ్చి యొక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని యీ ఇంగ్లీషు మాటలు కూడనంత గౌరవప్రదములే యని నిశ్చయముగా నమ్ముఁడు – నమ్ముఁడు.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి.. నీళ్లలో ఈదే వాడి ఆలోచనలు మరోలా

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🔥ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి.. నీళ్లలో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి.. ఒకరిది అనుభవం.. మరొకరిది పోరాటం.. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం.. లేదంటే పోతాం.. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా ఎన్నో ఎన్నో రకరకాల విద్యలు తెలిసిండాలి🔥తృప్తికి మరియు ఆశకి హద్దు ఉండదు.. ఇంకా ఏదో కావాలి,, ఇంకా ఇంకా కావాలి.. ఏదో తెలియని ఆవేదన.. మొత్తం నాకే కావాలి.. ఇదే మనిషి ఆలోచన..ఉన్నదే ఒక్క జీవితం.. ఆ జీవితం చాలా చిన్నది.. రేపు ఉంటామో లేదో తెలియని సందిగ్ధం.. అందుకే ఉన్న కాలాన్ని బతికి ఉన్నన్నాళ్ళు ఎక్కువ ఆలోచనలు లేకుండా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ గడపడానికి  ప్రయత్నిద్దాం🔥బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కుండదు.. నిన్ను సానబెట్టడానికి సంఘర్శణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం..తట్టుకుంటే రత్నమై వెలుగుతావు..తప్పుకుంటే రాయిలా మిగిలిపోతావు.. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు.. నిత్యం చదవాల్సిన పుస్తకం🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 .గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

అపూర్వ శాస్తా

 అపూర్వ శాస్తా 


తన తల్లి భార్య అగు శ్రీ లక్ష్మీదేవిని శాస్త వారు ఏమని పిలవాలి ???


చాలాకాలము క్రిందట కేరళ దేశములోని ఒకానొక ఆలయములో స్వామి అయ్యప్ప విగ్రహం చిన్ముద్ర దారివలే గాక తన కుడిచేతి చూపుడు వ్రేలును ముక్కుపై పెట్టుకొని ఏదో దీర్ఘాలోచనలో మునిగి యున్నటువంటి భంగిమలో ఉండేదట.


ఆ ఆలయములోనే యొక శిలాఫలకములో శ్రీ స్వామివారి ఈ అపూర్వ భంగిమను , ఆ భంగిమలో దాగియున్న ఆలోచనకు కారణమేమనియు తెలిపెడి మహనీయులొకరు ఈ దేవాలయానికి వస్తారు. అట్టి మహనీయుని వలన ఈ దేశానికి మేలు కలుగుననియు , ఆ మహానుభావుడెవరో తెలుసుకొనేందుకు ఈ దేవాలయములో శ్రీస్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే ప్రతివారు శ్రీస్వామివార్ని ఈ విచిత్ర భంగిమలో దర్శించుకొనువేళ వారెందుకిలా ఆలోచనా రూపంలో అమరియున్నారు. కారణమేమిటి ? అని మనస్సులో ప్రశ్నించి వారివారికి లభించిన సమాధానాన్ని ఈ సన్నిధి ముంగిట గట్టిగా చెప్పాలి. ఎవరి మాటలను విని శ్రీస్వామివారు అదియే నా ఆలోచనకు సరియైన కారణం అనురీత్యా దీర్ఘాలోచన భంగిమను వీడి చిన్ముద్రను అనగా బొటనవ్రేలు , చూపుడు వ్రేలును కలపి గుండ్రముచేసి , తక్కిన మూడు వ్రేళ్ళను పైకి నిలిపే చిన్ముద్రతో దర్శనమిచ్చునో అతడే ఆ మహనీయుడని గుర్తించవలయుననియు ఆ శిలాఫలకంలో లిఖించబడి యుండెను. ఆకాలమున దేశములో ఇన్ని మతాలు పుట్టలేదు. ఐనను కలికాలంలో జనులు కలహించుకోవడానికి ఏదైనా కారణాలు కావాలి కదా ? శివుని కొలిచే వారు , విష్ణుమూర్తిని కొలిచేవారు అని ఇరువర్గీయులై శైవమే గొప్పది. శివుడే గొప్ప వాడనియు , లేదు లేదు విష్ణువే గొప్పవాడు. అతనికి మించిన దైవమే లేదు. వైష్ణవమతమే చాలా విశేషమైనది. అంటూ జనులు ఇరువర్గీయులై కలహించి కొట్టుకొని , చంపుకొనే దాకా వెళ్ళేవారు. అప్పటి మతాచార్యులు గూడా తన మతస్థాపనాభివృద్ధి కొరకై ప్రజలలోను , రాజులలోను శైవం , వైష్ణవం అను భేదాలను హెచ్చు తగ్గులను సృష్టించి , వారి వారికి తోచిన రీతిగా ప్రచారం చేసేటివారు. అది శ్రీభుక్క భూపతుల వారు రాజ్యమేలు చుండినకాలము. విజయనగర సామ్రాజ్య పాలకుల గురువైయుండే వైష్ణవ మత ఆచార్య పీఠము నందుండిన శ్రీ తాతాచార్యుల వారే శ్రీభుక్క భూపతుల వారి ఆస్థాన గురువు. ఆ కాలమునందే అప్పయ్య దీక్షితులు అను మహనీయులొకరుండేటివారు. వారు అద్వైతి అయినను శివ ఉపాసనను చాలావరకు అభివృద్ధిపరచిన వారు. తీవ్ర విష్ణు ఉపాసకులై యుంటూ , శివపూజను , అరాధనలను ఖండిస్తూ శివాచారియార్లను కించపరుస్తూ, విష్ణుప్రచారం చేసేవారిని ఖండిస్తూ అనేక గ్రంథాలు వ్రాసి , వాద ప్రతివాదములు చేస్తూ శివోత్కర్షమును నెలకొలువుట కొరకు అతీత ప్రచారం చేయవలసివచ్చేది. వారి సమకాలికులైన తాతాచార్యుల వారు , విజయనగర రాజ్యపాలకులకే గాక దేశంలో అనేక రాజ్యాధిపతులకు కుల గురువై , ప్రధాన సలహాదారులై వుంటూ అతీత పలుకుబడులను పొంది అటు రాజులలోను , ఇటు ప్రజలలోను శివద్వేషాన్ని పెంచి విష్ణుప్రచారంచేసి , అనేక ప్రజల మత మార్పిడికి కారకులై వ్యవహరించి నందువలననే అప్పయ్య దీక్షితులవారు శివప్రచారం చేసి , శివమతాన్ని నెలకొల్ప వలసిన స్థితిని కల్పించినది. అంతేగాని మిగిలిన విష్ణుభక్తుల మనస్సులో కరుడు కట్టుకుపోయిన శివద్వేషం వున్నట్లు అద్వైతియైన అప్పయ్య దీక్షితుల మనస్సులో విష్ణుద్వేషము అణుమాటకే తావులేదు. ఈశ్వరుడు - ఈశ్వరి వీరితో విష్ణుమూర్తిని గూడా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగానే భావించి మ్రొక్కేటివారు. వైష్ణవ మతాచారులైన శ్రీ తాతాచార్యులవారు రాజనీతిజ్ఞులై వ్యవహరించి , రాజ్యపాలనా విధానములో శ్రీ భూపతులవారికి సలహాలిచ్చుచూ వారిని సన్మార్గమున నడిపించుచుండేవారు.


శైవమతావలంబులైన శ్రీ అయ్యప్ప దీక్షితుల వారేమో యజ్ఞయాగాది క్రతువులను ప్రభువుల వారిచే చేయించుచూ దేశమును , దేశప్రజలను , రాజ్యాంగమును దైవానుగ్రహపాత్రులు గావించుచుండేటి వారు. ఒక సారి శ్రీ భూపతులవారు పైన చెప్పబడిన అపూర్వ శాస్తా వారి ఆలయములోని శిలాఫలకము గురించి విని ఆశ్చర్యము చెంది. ఆ స్థలాన్ని దర్శించుకోవాలని నిర్ణయించి తన గురువర్యులిరువురితో సహా బయలుదేరెను. మార్గమధ్యములో శైవ , వైష్ణవ బేధములేక అనేక దేవాలయములను దర్శనము చేసుకొనుచూ కరుణాసముద్రుడు , కలియుగ ప్రత్యక్షదైవం , శైవ , వైష్ణవ సంగమ స్వరూపి అయిన శ్రీ అపూర్వ శాస్తావారి ఆలయము చేరుకొనిరి. ఆలయమున ప్రతిష్ఠించబడిన మూలవిగ్రహమగు శ్రీ శాస్తావారి బింబము ఒక వింత విగ్రహములా ముక్కుమీద వేలుపెట్టుకొని మిక్కిలి విచారముతో ఏదో దీర్ఘముగా ఆలోచించు ధోరణిలో యుండినది గాంచిన భూపతులవారు ఆలయ నిర్వాహకులతో ఇచ్చటి స్థలపురాణమేమని అడిగెను.


అందులకు ఆలయ నిర్వాహకులు "ప్రభో ! ఈ ఆలయము మిక్కిలి పురాతనమైనది. ఈ విగ్రహము చాలాకాలం క్రితం చెక్కించబడినది. ఒక పెద్ద దేవాలయం నిర్మించే పనులలో యుండగా ఈ విగ్రహం చెక్కించిన స్థపతికి అయ్యప్ప శాస్తా ఇలా ఏదో యొక విషయమై దీర్ఘాలోచనలో యుండే భంగిమలో దర్శనమిచ్చినారట. ఆ ఆలోచనకు కారణమేమని శిల్పి అడగలేదో యేమోకాని తనకు దర్శనమిచ్చిన భంగిమతోనే ఈ మూర్తిని చెక్కించి ప్రతిష్ఠింపజేసి నారట. ప్రతిష్టానంతరం స్థాపితమైన ఆ మూర్తిని దర్శించుకొనిన శిల్పికి నేనెందుకిలా ఆలోచిస్తూ కూర్చున్నాననే సంగతిని లోకులకు తెలిపే సర్వజ్ఞులొకరు భవిష్యత్తులో ఇచ్చటికి వస్తారు. వారు నా విచారమునకు కారణమేమను రహస్యమును తెలుపుతారు. అపుడు నాముక్కుమీద నుంచి వేలుతీసి , సర్వ ఆలయములలో యున్నట్లు చిన్ముద్ర వహిస్తాను. అతని మాటలే వాస్తవము. అతడే సర్వజ్ఞుడు అని లోకులు గుర్తించాలి" అని అనిపించినదట. అది ఇచ్చట శిలాఫలకంగా చెక్కించబడి యున్నది. అందువలననే ఈ స్థలములోని శాస్తావారిని దర్శించుకొనేవారు వారివారి మనస్సులో కలిగే అభిప్రాయమును తెలపాలియనియు చెక్కించి వెడలినారు.


తదుపరి ఎందరో మహనీయులు ఈ స్థలమునకు వచ్చి శ్రీస్వామి అయ్యప్పను దర్శించుకొని శ్రీస్వామివారి చింతనకు ఏవేవో కారణాలను చెప్పిరి. కాని అవన్నియు సరియైన కారణాలు కాకపోవడముతో ఈ శాస్తావారు ముక్కు మీదనుండి చేతులు తీయకనేయున్నారు. ఆ మహనీయులెవరో ఎపుడు వస్తారో అని అనిరి. తదుపరి ఆలయములోనికి వెళ్ళి పూజాదులు ముగించి.. శ్రీస్వామివారిని దీపారాధనలో దర్శించుకొనువేళ భూపతి వారి మనస్సులో నా ఈస్థితికి కారణమేమని నీ గురువర్యులను అడిగి తెలుసుకో అని అనిపించెను. వెంటనే శ్రీభూపతులవారు తాతాచార్యులను చూపెను. భూపతిగారి మనోగతాన్ని గ్రహించిన తాతాచార్యుల వారు మరోమారు ఆ అపూర్వ విగ్రహాన్ని చూసి యొక కారణాన్ని కల్పించి క్రింది శ్లోకరూపంలో చెప్పెను.


విష్ణోః సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సురసేవితో హం ॥* *తథాభి భూతేశ సుతోహ మేతైర్ భూతైర్ వృతశ్చింత యతీహ శాస్తా ||


శ్రీశాస్తా వారి విచారమునకు కారణమేమనగా ఇదియేనని శ్రీతాతాచార్యుల వారు శ్రీశాస్తావారు చెప్పినట్లుగానే శ్లోకమును చేసియున్నారు. శాస్తావారు ఏమి చెబుతున్నారంటే.... "నేను శ్రీమహావిష్ణుసుతుడను కావున బ్రహ్మకు సమమైన వాడను. అందువలన నేను ధన్యత చెందుచున్నాను. దేవతలందరి చేతను మ్రొక్కబడుచున్నాను. కాని...... “తథాభియని శ్లోకములో వచ్చేపదానికి “ఐనను” “కాని” అని అర్థం చెప్పుకోవలెను. తనగొప్పతనాలన్నిటిని చెప్పుకొంటూ వచ్చిన శాస్తావారు కాని అని ఆపేసారంటే తరువాత తన విచారమునకు అసలు కారణం చెప్పబోతున్నారనియే గదా అర్థం. అందులోనే శ్రీ తాతాచార్యుల వారికి శివ సంబంధిత విషయములో సదభిప్రాయము లేదనునది స్పష్టమగుచున్నది. కాని.... నిలిపిన శాస్తా ఏమంటున్నారో తాతాచార్యుల ముఖదా విందాము. "కాని... నేను స్మశానవాసి , కరిచర్మాంబరదారి యగు శివుని కుమారుడు" అనిగూడా చెప్పుకొనవలసి యున్నదే "తథాభి భూతేశ సుతోహం" శివుడు , పరమేశ్వరుడు , శంభు , ఉమాపతి , పశుపతి , సాంబశివుడు , నటరాజుడు , దక్షిణామూర్తి యని కైలాసవాసునికి ఎన్నెన్నో అందమైన నాముబులుండగా భూతేశుడనియో శ్లోకములో చెప్పబడియున్నది. స్మశానవాసి , భూత బంధముల నాయకుడు అనియే ఈశ్వరుని సంబోధించి యున్నారు. అలాంటివాని పుత్రునిగాను నేను వున్నానే అని శ్రీశాస్తావారు , తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు శ్లోకవాక్యములు చెబుతున్నది.


భూతగణములను అణచిపెట్టి అందులకు నాయకులై ఒకరున్నారంటే నిజానికి అదియు వారియొక్క గొప్ప ప్రభుత్వశక్తిని , అధికార సంపదను ఎలుగెత్తి చెప్పేటిదియే అగును. శ్రీపరమేశ్వరులు , భూతగణములు జనులను హింసించక కాపాడే వారేగాని వాటిని విచ్చలవిడిగా విడిచిపెట్టేవారు కాదు మనలను దుష్టశక్తులు ఆవహించి దెబ్బతీయక వాటిని అరికట్టి పాలించి నందువలననే వారిని భూతపతి యని పిలిచి మ్రొక్కుచున్నాము. భూతేశుడైన పరమేశ్వరునికే మహాదేవుడని పేరు గలదు. దేవతలందరికి పెద్దవారాయన తన ముగ్గురు తనయులలో పెద్దవానికే దేవగణాధిపత్యమిచ్చి గణనాథుడు గావించియున్నారు. రెండవవాడైన సుబ్రహ్మణ్య స్వామికి దేవ సేనాధిపత్యమిచ్చి దేవనాథుడుగా గావించియున్నారు. భూత గణములో యొక విభాగమును మూడవ తనయుడగు శ్రీశాస్తాకు ఆధిపత్యమిచ్చి భూతనాథుడుగా గావించియున్నారు.


సులభముగా లొంగని భూత సంఘమును అణచి పాలించుటయన్నది శ్రీ శాస్తావారికి కీర్తి కల్గించేపనియే. క్షుద్రగుణగణములు గల్గిన దుర్దేవతలు జనావాసములో ప్రవేశించి , హింస చేయక వాటిని తన అదుపులో పెట్టి గ్రామ రక్షణ దేవతయై గ్రామ పొలిమేరులో యుంటూ శ్రీశాస్తావారు లోకపావనం చేయుచున్నారు. కాని శివ సంబంధమైన సద్విషయాలలో తాతాచార్యుల వారికి సదభిప్రాయము లేదు గనుక ఇదియే ముక్కుమీద వేలు పెట్టుకొనియున్న శాస్తావారి చింతకు కారణమని శ్లోకముద్వార చెప్పెనురాచర్ల రమేష్


గొప్పఖ్యాతి సంపన్నుడైన విష్ణుపుత్రుడై బ్రహ్మ సమానుడై సర్వదేవతా నమస్కార స్వీకృతుడై యుండినను ఈ భూతపతిసుతుడై యున్నందువలన సదా దుష్టభూతగణ బృందము మధ్య యుండవలసివచ్చినదే. “ఏతైర్ భూతైర్ వృత్తః" యనిశ్లోకములో వచ్చుటకు అట్టి భూతగణములు చుట్టుముట్టియుండగా మధ్య నేనుండవలసివచ్చినదే యనియే శ్రీ శాస్తావారు ముక్కుమీద వేలుపెట్టి చింతించే భంగిమలో అమరియున్నారు. "చింతయతీహశాస్తా" యని తాతాచార్యులవారు ముగించిరి. కాని ఆ మాటలకు (శ్లోకానికి) శ్రీశాస్తావారి బింబము తనముక్కుమీద నుండి వేలుతీసి వేయలేదు. ఏలనగా...... వారి ఆలోచన ప్రకారం అర్థంచేసుకొన్నట్లు , భూతసంఘ పరివారముతో యుంటూ గ్రామ రక్షణ భారం వహించుట యనునది శ్రీ శాస్తావారికి కీర్తిని తెచ్చిపెట్టేదేగాని విచారాస్పదం కాదు. కావుననే శాస్తా విగ్రహం తాతాచార్యులవారు చెప్పిన కారణం సరియైనది కాదు - అన్నట్లు వ్రేలు మార్చక అలాగే యుండిపోయినది. తదుపరి శ్రీభుక్క భూపతులవారు శ్రీ అయ్యప్ప దీక్షితుల వారితో మీ అభిప్రాయాన్ని గూడా తెలుపండి అని ప్రార్థించెను. మరోమారు క్షుణ్ణంగా శ్రీశాస్తావారి విగ్రహాన్ని భక్తితో దర్శించుకొన్న దీక్షితులవారికి శాస్తావారి చింతనకైన అసలుకారణం స్పూర్తించెను. వెంటనే శ్లోకరూపముగా దాన్ని తెలిపిరి. శ్రీతాతా చార్యులవారు చెప్పినట్టే శ్రీ శాస్తావారి వచనములుగానే ప్రారంభించి చెప్పసాగెను.


 

అంబేతి గౌరీ మహ మాహ్వయామి పత్యైః పితుర్మాతర ఏవసర్వాః |* 

*కథన్ను లక్ష్మీమితి చింత యంత శాస్తార మీధే సఖలార్ధ సిద్యై ||


పై శ్లోకము అప్పయ్య దీక్షితులు వారి నోటనుండి వెలువడిన క్షణమే "అవును ! ఇదియే సుమా నావిచారము. నా ఈ ఆలోచన అందులకే. ఈయన చెప్పిందే సత్యము" అన్నట్లు ఆ అపూర్వ శాస్తా భంగిమలో అమరియున్న శ్రీ అయ్యప్పస్వామివారు ముక్కుమీద నుండి వేలుతీసి చిన్ముద్ర ధరించెను. లోకులకు ధర్మాన్ని శాసించి నేర్పించే శ్రీశాస్తావారే విచారపడుతూ "ఇదేమిటి దీనికి సరైన సమాధానం లభించదా ? యని ముక్కుమీద వేలుపెట్టుకొని దేనిని గూర్చి ఆలోచించుతూ యున్నట్లు దీక్షితులవారు తన శ్లోకములో వివరించారంటేగౌరీదేవిని నేను "అమ్మా" అని పిలువగలను.


అంభేతి అంబయితి -- అమ్మా అని , అహ్వయామి - పిలువ గలను. వాస్తవానికి విష్ణుమాయలోని మోహినియే నాకు జన్మనిచ్చిన తల్లి. అయినను తండ్రికి ఎంతమంది పత్నిలున్ననూ అందరూ అమ్మవరుసే అగుతారు. ఎలా శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవినే గాక , కైకేయి , సుమిత్రలను గూడా కన్నతల్లిగానే ఎంచి “అమ్మా” యని పిలువలేదా ? విఘ్నేశ్వరుడు గంగను తల్లిగా ఎంచలేదా ? అలాగే నా తండ్రియగు పరమేశ్వరుని పత్నియగు గౌరీదేవిని నేను "అమ్మా" అని పిలువగలను. ఈశ్వరుని తండ్రిగాను , మహావిష్ణువును తల్లిగాను పొందిన నాకు పరాశక్తి ఏమి వరస అవుతుందిని ఆలోచిస్తూ కూర్చోపనిలేదు. పత్న్యః పితుర్మాతుర ఏవసర్వాః తండ్రియొక్క భార్యలందరూ తల్లులే అవుతారు. కావున గౌరీదేవిని అమ్మా అను వరుసతో పిలిచి ఆనందము చెందగలను. "అంబేతి గౌరీమహమహ్వా యామి."


ఐతే ఇదీ వరుస అని దలచి పిలువలేని , ఎంత ఆలోచించిన బోధపడని బంధమొకటి యున్నది. ఆ బంధమేమిటి ? శాస్తావారు ఎవరిని వరుసపెట్టి పిలువలేకపోవుచున్నారు. లక్ష్మిం ! "లక్ష్మీదేవిని నేను ఏ వరుసపెట్టి పిలవాలి ? కథన్నులక్ష్మీం" ఇదియే శాస్తావారి విచారము ముక్కుమీద వేలుపెట్టుకొని దీనికి సమాధానమెలా కనిపెట్టేది ? యని దీర్ఘాలోచనలో పడ్డది. ఎందుకంటే -- నేను లక్ష్మీదేవిని ఏవరుసపెట్టి పిలవాలన్నది అర్థంగాకనే. మనకు గూడా అర్థంకాలేదు కదూ ? ( లక్ష్మీదేవి ఎవరు ? విష్ణుపత్ని , మహావిష్ణువుకు , శాస్తావారికి గల బంధమేమిటి ? తల్లిబిడ్డలు సాక్షాత్ మహావిష్ణువే మోహిని అవతారమెత్తినపుడు శ్రీ పరమేశ్వరునితో కలిసి శాస్తావారిని కలుగజేసిరి.


కావుననే వీరికి హరిహరసుతుడు అను కారణనామము ఏర్పడినది. అటులైనచో లక్ష్మీదేవి శాస్తావారికి ఏమౌతుంది ? తల్లియొక్క పత్ని అగుతూంది. ఇందు ఆశ్చర్యమేమనగా తండ్రిగారి భార్య , పినతండ్రిగారి భార్య , మేనమామ భార్య , అన్నయ్య భార్య , తమ్ముని భార్య , బావమరిది భార్య , స్నేహితుని భార్య యని చెప్పగా వినియున్నాం. వీళ్లను అమ్మ , పిన్నమ్మ , మేనత్త , వదిన , మరదలు , సోదరియని వరుసపెట్టి పిలుస్తుంటాము. అమ్మ యొక్క భార్య అని చెప్పగా , పిలువగా వినియున్నామా ? ఈ శాస్తావారికి మాత్రమే ప్రపంచములో ఇంకెవరికీ లేని విచిత్రముగా అమ్మగారి భార్య అనబడు లక్ష్మీదేవియున్నారు. ఆమెను శ్రీశాస్తావారు ఏవరుసపెట్టి పిలువగలరు ? కథన్ను లక్ష్మీ - లక్ష్మీ దేవిని ఏవరుస పెట్టి పిలువగలను ? ఇదియే శాస్తావారి విచారము. ఇదియే వారి దీర్ఘాలోచనకు అసలు కారణం అన్నారు. అంతటితో ఆపినారా అంటే లేదు.


'ఇతి చింత యంతం శాస్తారం ఈదే ఈ విశ్వమంతయూ పరిపాలించి పోషించువారు. వామనమూర్తియై వచ్చి తన ఒక్క పాదముతో ఈ విశ్వమంతయూ కొలిచినట్టివారు , యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్యతదాత్మానం సృజామ్యహం అని మురాసురుడు , బాణాసురుడు , రావణాసురుడు మొదలగు రాక్షసుల వలన లోకానికి ధర్మగ్లాని కలిగినపుడు సాకార అవతారము గైకొని వార్లను సంహరించి లోకానికి మేలుగూర్చినవారు. ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటివారు. సమస్త సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి యొక్క భర్త అయినట్టివారు. అలంకార ప్రియులు , శంఖుచక్ర గదాదారి , నీలమేఘ శ్యాములు , సౌందర్యం స్వరూపులు అయిన మోహిని సుతుని ఈడే సకలార్ధ సిద్యై అని ముగించారు. అనగా సకల విధములైన పురుషార్థ సిద్దులు పొందదలచినవారు. శ్రీ శాస్తావారిని ఆశ్రయిస్తే అర్థంకాని తత్వములు గూడా అర్థమగును. కావున శాస్తావారిని ఆశ్రయించి మ్రొక్కుచున్నాను. అని ముగించారు. దీక్షితులవారి శ్లోకములో "శివకేశవ భేదముగాని , హెచ్చుతగ్గులైన భావ బేధము గానీ లేదు. పరమేశ్వరిని లక్ష్మీదేవిని ఒకేలాగ వర్ణించి యున్నారు.


దానితో దీక్షితుల వారు తన శ్లోకములో బుద్ధి చాతుర్యమును మాత్రమేగాక భక్తి పారవశ్యాన్ని గూడా కలిపి సకలార్థసిద్ధి కొరకు శ్రీశాస్తావారిని ఆరాధించుచున్నాను" అని చెప్పియున్నారు. "ఎందుకొరకు వారిలా ముక్కుమీద వ్రేలెట్టుకొని కూర్చున్నారన్నది. అర్థంకానపుడు , సకల అర్థములు సిద్ధించుటకు వారివద్దనే వేడుకొనునట్లు వినయముగా చెప్పడములోని పరమార్ధము ఏమనగా వారి కృపయుంటే తప్ప వారిని గూర్చిన రహస్యములను మన బుద్ధిచాతుర్యము వలన మాత్రము కనిపెట్టలేము" అనునదియే.


అన్నిటికన్నా మిన్నగా దీక్షితులు చెప్పిన కారణమును ఇంతవరకు

ఏ మేధావియూ కనిపెట్టలేదుగదా ! ఇంకనూ ఎవరైనా కనిపెట్టగలరా ? అమ్మ యొక్క భార్యను ఏవరుసపెట్టి పిలవాలి అని ఎంత ఆలోచించినా సమాధానము లభించునా ? నిజానికి సమాధానము లేని ఈ ప్రశ్న శాస్తావారి మదిలో కలిగి , దీర్ఘాలోచనలో మునిగి ముక్కుమీద వేలుపెట్టుకొనియుండు స్థితిలో స్థపతికి దర్శనమివ్వగా ఆస్థపతి దానినలాగే శిలావిగ్రహముగా చెక్కించియుంటాడు. కావుననే దీక్షితులవారు స్వామి విచారమునకు అసలు కారణాన్ని కనిపెట్టి చెప్పగానే అదియే నిజమన్నట్లు బింబము తనముక్కుమీద నున్న వ్రేలును చటుక్కున తీసి అన్ని దేవాలయాలలో వున్నట్లు చిన్ముద్ర దాల్చేను..


ఒకరాతి విగ్రహము శ్లోకము విని ముక్కుమీద నుండి వ్రేలుతీసి వేయగానే అచ్చట గుమిగూడి యున్నవారందరూ మహదాశ్చర్యము చెందిరి. శ్రీభుక్క భూపతులవారు ఆమహాద్భుతాన్ని తిలకించి , ఆనందోత్సాహము చెంది , శిలాఫలకములో వ్రాయబడిన మహనీయులు శ్రీ అప్పయ్య దీక్షితుల వారైనందులకు ఎంతో ఆశ్చర్యపడి అందరూ ముక్కుమీద వ్రేలుపెట్టుకొనిరి. అప్పటినుండి శ్రీ అప్పయ్య దీక్షితులవారి నామము లోక ప్రసిద్ధమైనది. శ్రీ తాతా చార్యులు గూడా శివకేశవులు అబేధమును గ్రహించి , శివనింద చేసినందులకు పశ్చాత్తాపపడి , పరమేశ్వరుని పలురీత్యా ప్రార్ధించి తరించిరి. సేకరణ రాచర్ల రమేష్

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - చిత్ర -‌‌ భాను వాసరే* (13.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు...

 ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు... 


 వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. 

చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం.... 


 ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్.... అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది....కానీ??పుట్టడం మన చేతిలో లేదు కదా!


 అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”.... వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు... మరణం కూడా మన చేతుల్లో ఉండదు....


అందువల్ల *_“స్మరణాత్ అరుణాచలే”_* అన్నాడు.... అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు...


 అరుణాచల క్షేత్రం అంత గొప్పది....



ఒక్కసారి " అరుణాచల శివ " అంటే 3 కోట్ల సార్లు 

" ఓం నమః శివాయ " 

అని స్మరించిన ఫలితం ఇస్తాడు అరుణాచలేశ్వరుడు... 


ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే మన జీవితాన్ని తనే కర్తయై నడిపిస్తాడు... 


అరుణాచల శివ అని స్మరించండి , స్మరిస్తూనే ఉండండి ...


అరుణాచల శివ 

అరుణాచల శివ 

అరుణాచల శివ

అరుణాచల శివ ..

అరుణాచల శివ ...

అరుణశివా..... 



మనందరికీ ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం 

కలగాలాని ఆశిస్తూ.....