5, డిసెంబర్ 2021, ఆదివారం

స్పాండిలైటిస్ మరియు సయాటిక

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

సంపూర్ణ సూర్యగ్రహణం

 Oneindia Telugu

Surya Grahanam 2021: శనివారం..అమావాస్య..సంపూర్ణ సూర్యగ్రహణం: కనిపించే దేశాలివే

By Chandrasekhar Rao

Updated: Fri, Dec 3, 2021, 11:16 [IST]

  Google Oneindia New

కొద్దిరోజుల కిందటే చంద్రగ్రహణాన్ని చూశాం. కిందటి నెల నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో ఇది కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కొంతభాగం మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి నాటి చంద్రగ్రహణం కనిపించింది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కనువిందు చేయనుంది. కొన్ని దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. భారత్‌లో ఇది కనిపించదు.ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చంద్రడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ భూమిపై పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీన్నే అంబ్రా అని పిలుస్తాము. సూర్యుడి బాహ్య ప్రాంతంను మాత్రమే అడ్డుకుంటే పెనంబ్రా అని ఇంగ్లీషులో పిలుస్తాము. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున చంద్రుడు మొత్తం సూర్యుడికి అడ్డుగా ఉంటుంది. అదే పాక్షిక సూర్యగ్రహణం రోజున సూర్యుడిలో ఒక భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుటుంది.



శనివారం అమావాస్య నాడు..

ఈ సంవత్సరపు చివరి సూర్య గ్రహణం ఇది. ఈ నెల 4వ తేదీన..శనివారం అమావాస్య నాడు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.




కనిపించే దేశాలివే..

దక్షిణార్ద్ర గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రం దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెయింట్‌ హెలెనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, శాండ్‌విచ్‌ ఐలండ్స్, క్రోజెట్‌ ఐలండ్, లెసొతొ, ఫాక్‌లాండ్‌ ఐలండ్స్, చిలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది.


.


.



ఐఎస్టీ ప్రకారం..

భారత్‌లో ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. 4వ తేదీన ఉదయం 10 గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:33 నిమిషాలకు గ్రహణం గరిష్ఠ స్థితికి చేరుకుంటుంది. క్రమంగా తగ్గుతుంది. 3:07 నిమిషాలకు గ్రహణ ఛాయ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సంవత్సరం మూడు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ నెల 4వ తేదీన ఏర్పడేది నాలుగో గ్రహణం.



ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు..

ఇంతకుముందు మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్‌ 10వ తేదీన వార్షిక సూర్యగ్రహణం, నవంబర్‌ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్‌ nasa.gov/live లో ఇది ప్రత్యక్ష ప్రసారమౌతుంది. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది

సంతోషము - సుఖము - ఆనందము*

 *ॐ సంతోషము - సుఖము - ఆనందము*


    సంతోషము, సుఖము, ఆనందము అనేవి వేరువేరైనా, 

    ఓకే విధమైన అర్థంలో వాడుతూ ఉంటాం. 

    వాటి నిర్వచనాలూ, ఆనందమనేదాని వివరణలు తెలుసుకొందాం. 


*సంతోషము:*


    సోమరిగా నుండకుండా, శక్తికొలది పురుషార్థములు (ధర్మముతో కూడిన అర్థ సంపద, తద్వారా ధర్మముతో కూడిన కోరిక, దానివలన వచ్చే మోక్షము అనేవి "ధర్మ అర్థ కామ మోక్షమనే పురుషార్థములు") చేయుచు, 

    హాని జరిగినప్పుడు శోకించకుండా, 

    లాభము కలిగినప్పుడు హర్షము లేకుండా ఉండడం "సంతోషము". 


*సుఖము:* 


    దేనిని పొందుట వలన మిగిలిన యే సంపదయైనను దానికన్న తక్కువదే అనిపించునో, 

    ఏ యితర లాభమును మనస్సును ఆకర్షింపని స్థితిలో, 

    మనస్సును ఆకర్షింపగల అనుభూతి ఒక్కటే సుఖము. 

    ఏ స్థితిని పొందినవాడు పెద్ద దుఃఖముల వలన కూడా చలింపడో అదే నిజమైన సుఖము. 


ఉదా॥ 

1. ఒకచోట కూర్చొని తృప్తి పొందినప్పుడు, మరింత సౌకర్యమైన అవకాశము వచ్చినా, 

    దానిని తిరస్కరించి, ఉన్నదానితో తృప్తిపొందుతూ ఉండడం "సుఖం". 

2. రేడియో ఉపయోగంతో తృప్తిపడుతూ, టేప్ రికార్డరుగానీ ఇతర సౌకర్యవంతమైన పరికరాలువచ్చినా, 

     రేడియో ఉపయోగానికే స్థిరపడితే, అది "సుఖం". 

3. పదోన్నతి (Promotion) అవుసరం లేక, ఉన్నదానితోనే తృప్తి పడితే, అది "సుఖం". 


*ఆనందము:* 


    వివిధ పదవులూ స్థానాలలో ఉన్నప్పుడు, 

    ఆ అధికారాన్ని పొందుతూ ఉండే దైహిక సౌకర్యమూ మానసిక ఉల్లాస స్థితీ ఆనందం. 

    ఇది పదవీ స్థాయిలను బట్టీ మారుతూంటుంది. 


ఉదా॥ 

    రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి, కలెక్టరు, న్యాయమూర్తి మొదలగు పదవులలో వారు పొందే మానసిక స్థితులు - వారివారి ఆనందములు. 


*ఆనందానికి శాస్త్ర ప్రమాణం*  


    వివిధ ఆనందాలను తైత్తిరీయోపనిషత్తు ఈ విధంగా తెలుపుతోంది.

1. మనుష్య ఆనందము 

     శారీరక మానసిక దృఢత్వంగల ఒక ఉత్తమవ్యక్తికి సర్వ సంపదలతోనూ ఈ భూమండలమంతా చెందితే ఎంత ఆనందం వస్తుందో అది మనుష్య ఆనందానికి ప్రమాణము(unit). 

" ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః I 

  త స్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ I 

   స ఏకో మానుష ఆనన్దః"  

2. దీనికి వంద రెట్ల ఆనందం మనుష్య గంధర్వానందం, 

3. ఆ మనుష్య గంధర్వానందానికి వందరెట్లు దేవగంధర్వానందం, 

4. దానికి వందరెట్లు పితృదేవతల ఆనందం, 

5. ఆ పితృదేవతల ఆనందానికి వందరెట్లు అజానజుల ఆనందం, 

6. వారి ఆనందానికి వందరెట్లు కర్మదేవతల ఆనందం, 

7. ఆ కర్మదేవతల ఆనందానికి వందరెట్లు దేవతల ఆనందం, 

8. వారి ఆనందానికి వందరెట్లు ఇంద్రుని ఆనందం, 

9. ఇంద్రుని ఆనందానికి వందరెట్లు బృహస్పతి ఆనందం, 

10. బృహస్పతి ఆనందానికి వందరెట్లు ప్రజాపతి ఆనందం, 

11. ప్రజాపతి ఆనందానికి వందరెట్లు బ్రహ్మానందం.


                    =x=x=x= 

  

    — రామాయణం శర్మ 

            భద్రాచలం