Oneindia Telugu
Surya Grahanam 2021: శనివారం..అమావాస్య..సంపూర్ణ సూర్యగ్రహణం: కనిపించే దేశాలివే
By Chandrasekhar Rao
Updated: Fri, Dec 3, 2021, 11:16 [IST]
Google Oneindia New
కొద్దిరోజుల కిందటే చంద్రగ్రహణాన్ని చూశాం. కిందటి నెల నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో ఇది కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కొంతభాగం మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి నాటి చంద్రగ్రహణం కనిపించింది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కనువిందు చేయనుంది. కొన్ని దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. భారత్‌లో ఇది కనిపించదు.ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చంద్రడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ భూమిపై పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీన్నే అంబ్రా అని పిలుస్తాము. సూర్యుడి బాహ్య ప్రాంతంను మాత్రమే అడ్డుకుంటే పెనంబ్రా అని ఇంగ్లీషులో పిలుస్తాము. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున చంద్రుడు మొత్తం సూర్యుడికి అడ్డుగా ఉంటుంది. అదే పాక్షిక సూర్యగ్రహణం రోజున సూర్యుడిలో ఒక భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుటుంది.
శనివారం అమావాస్య నాడు..
ఈ సంవత్సరపు చివరి సూర్య గ్రహణం ఇది. ఈ నెల 4వ తేదీన..శనివారం అమావాస్య నాడు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.
కనిపించే దేశాలివే..
దక్షిణార్ద్ర గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రం దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెయింట్ హెలెనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, శాండ్‌విచ్ ఐలండ్స్, క్రోజెట్ ఐలండ్, లెసొతొ, ఫాక్‌లాండ్ ఐలండ్స్, చిలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది.
.
.
ఐఎస్టీ ప్రకారం..
భారత్‌లో ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. 4వ తేదీన ఉదయం 10 గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:33 నిమిషాలకు గ్రహణం గరిష్ఠ స్థితికి చేరుకుంటుంది. క్రమంగా తగ్గుతుంది. 3:07 నిమిషాలకు గ్రహణ ఛాయ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సంవత్సరం మూడు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ నెల 4వ తేదీన ఏర్పడేది నాలుగో గ్రహణం.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు..
ఇంతకుముందు మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్ 10వ తేదీన వార్షిక సూర్యగ్రహణం, నవంబర్ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్ nasa.gov/live లో ఇది ప్రత్యక్ష ప్రసారమౌతుంది. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి